Sanathana Dharmamu    Chapters    Last Page

ముందుమాట

NRPLiÀÁ ª«sV¥¦¦¦ry*„sV ªyLRiV ƒ«sWLRiª«s ª«sxqsLi»R½ª«sVVƒ«s @²R…Vgji²T…ƒyLRiV. C ry*„sV »R½ª«sV xmsµR…ª«sVW®²…[Li²ýR… ÀÁàáV»R½úFy¸R…Vª«sVVƒ«s®ƒs[ xqsƒ«sùzqsLiÀÁ, ª«sVx¤¦¦¦¨ƒ«sõ»R½ª«sVLiVVƒ«s NSLiÀdÁ aRPLiNRPLRi{mshRiª«sVVƒ«sµ³j…ztísQLiÀÁ, »R½µyµj…gS Aµj…aRPLiNRPLRiVÌÁ @ƒ«sVaSxqsƒyƒ«sVryLRiª«sVV ú¼½xmsoLRixqsVLiµR…Lji ¿RÁLiúµR…ª«s°×dÁaRP*LRiVÌÁ @LRièƒyµj…NRPª«sVVÌÁV, @\®µ…Q*»R½ úxms¿yLRiª«sVVƒ«sW ª«sVx¤¦¦¦¨ƒ«sõ»R½ª«sVVgS gS„sLiÀÁ¸R…VW, ®ªs[µR…„sz¤¦¦¦»R½ª«sVVÌÁLiVVƒ«s xqsª«sVxqsò µ³R…LRiøª«sVVÌÁƒ«sW ¬s¸R…Vª«sVª«sVV»][ƒ«sW, µ³R…X¼½»][ƒ«sW FyÖÁLiÀÁ¸R…VW, úxmsxqsVò»R½ª«sVV ¬sLRiLi»R½LRi ú‡Áx¤¦¦¦øƒ«sV ˳ÏÁª«sª«sVgRiVõÌÁVgS ˳ØLRi»R½ Aµ³yù¼½øNRP LRiLigRiª«sVVƒ«s ¼½LRiVgRiVÛÍÁ[¬s ryLRi*˳ݪ«sVVÌÁVgS ®ªsÌÁVg]LiµR…V¿RÁVƒyõLRiV. ry*„sV, »R½ª«sV @¼½ ¬sLS²R…Li‡ÁLRiÒÁª«sƒ«sLi‡ÁV, NRPh][LRi¬s¸R…Vª«sVª«sVVÌÁV, ª«sVx¤¦¦¦¨»R½äQXxtísQ\®ªsVƒ«s »R½xmsaRPèLRiùÌÁ»][ »yª«sVV ËÜ[µ³j…LiÀÁƒ«s aSxqsòQûLRiz¤¦¦¦»R½ ÒÁª«sƒ«s\ZaPÖÁNTP AµR…LRi+úFy¸R…VV\ÛÍÁƒyLRiV. xqsV¬sbP»R½ xmsLjibdPÌÁƒy µR…XztísQ, @ZaP[xtsQZaP[ª«sVV{tsQ \®ªs˳ÏÁª«sª«sVVÌÁV ry*„sV r~»R½Vò.

గత రెండేండ్లుగా స్వామి మౌన వ్యాఖ్యానరూపముగ తమను దర్శించవచ్చు. భక్తజనుల ఆధిభౌతిక, ఆధ్యాత్మికసంశయములను పటాపంచలొనరించుచున్నారు. అతఃపూర్వము దాదాపు డెబ్బది ఏండ్ల తమ క్రియాశీలక పీఠాధిపత్య కాలమున తమను దర్శించవచ్చు. భక్తుల ప్రయోజనార్థము స్వామి అనేక ధార్మిక, ఆధ్యాత్మిక విషయములపైననూ, తత్సంబంధమయిన సాంఘిక, రాజకీయ సాంస్కృతిక విషయముల పైననూ ఉపదేశ చేసియున్నారు. తామొనరించిన విస్తృత పర్యటనలో ఈ విషయములపై అనేక సభలనుద్దేశించి ఉద్బోధించినారు.

సాధారణముగా ఉసన్యాసాత్పూర్వమొక రెండు నిమిషములు స్వామి మౌనియై, అంతర్ముఖులై ఉంటారు. నిదానముగా చినుకు చినుకుగా మొదలయిన వారి నాగమృతవర్షిణి, జడివానవలె మారి, ఝరిగా ప్రవహించి, ఉత్తుంగ తరంగయైన గంగానదివోలె రూపాంతరమొంది, ఆ పవిత్ర ఆనంద ప్రవాహమునందు మనలను మునకలెత్తించి పరవశులను చేస్తుంది. ధర్మశాస్త్రము, వేదాంతము, ఇతిహాసము, పురాణము, చరిత్ర, శిల్పము, సంగీతము, సాహిత్యము, భూగోళము, ఆధునిక వైజ్ఞానిక శాస్త్రము - ఒకటేమిటి, ఏ విషయముననైననూ వారు చెప్పెడి విషయము పరమావధిగా ఉంటుంది. వారి బుధ్ధి తీక్షణత, సునిసిత పరిశీలనా దృష్ఠి మనలను ఆశ్చర్యచకితులను చేస్తుంది. ఆ ఉపన్యాసముల మధ్యమధ్యలో కథలు, ఉపకథలు, పిట్టకథలు, అతి సులభముగా విడమరచి చెప్పబడిన అత్యంతికమయిన ధర్మ, వేదాంత విషయములు - అలా మనము ఆ ఆనంద ప్రవాహములో తేలిపోతాము.

స్వామి బహుకాలము తమిళనాడులో అందునా తంజావూరు జిల్లాలో పర్యటన చేసియున్నారు. వారి ఉపన్యాసముల టేపులు, వివిధ పత్రికలలో ముద్రించబడిన ఉపన్యాసపాఠములు తమిళమునందే ఉన్నవి. వీటినన్నిటినీ ఎంతో భక్తిశ్రద్ధలతో సేకరించి విషయములవారీగా విభజించి, శీర్షికలనుంచి శ్రీ రా|| గణపతిగారునూ, ఇప్పటివరకూ ''దైవత్తిన్‌ కురల్‌'' అను పేర ఆరు పెద్ద సంపుటములను వెలువరించుటద్వారా శ్రీ తిరువానక్కరసు (వనతి ప్రతిపాక్కం) గారునూ ఆస్తికలోకమునకు, మీదు మిక్కిలి తమిళ##దేశముకునూ మహూపకారము చేసియున్నారు.

శ్రీ యం.వి.బి.యస్‌.శర్మగారు విశాఖ వస్తుతః చిత్తూరు జిల్లాకు చెందిన ఆంధ్రులు. బహుకాలము తమిళ##దేశమందుండుట వలన తమిళభాషా ప్రవేశమున్నది. 1961లో మహాస్వామి వారిని ఇలయాత్తంగుడి మకాములో వీరు దర్శనము చేసినప్పుడు, అప్పటికే తమిళమున MLJ Press వారు ప్రచురించిన స్వామివారి ఉపన్యాసములను చదివి, అట్టి విజ్ఞానపు గని తెనుగులకు అందుబాటులో లేకున్నదే యని విచారించి, ''ఈ పుస్తకమును తెనుగున కనువదింపచేసిన ఆంధ్రులకు మహూపకారము కాగల''దని విన్నవించినారట. స్వామి ''ఆకార్యము నీవే నిర్వర్తింపమని'' ఆదేశించినారు. విశాఖగారు సాహితీవేత్తకాదు. రైల్వేలో కాస్ట్‌ అక్కౌంటెంట్‌గా ఉండెడివారు. అయిననూ, స్వామి అనుగ్రహమున్న అసాధ్యమేమున్నది? స్వామివారి ఆదేశ ప్రకారము ఆ తమిళ ఉపన్యాసముల తెనుగు అనుకృతులు ఆంధ్ర పర్యటనలో, స్వామి తెనుగున చేసిన కొన్ని ప్రసంగములతో చేర్చి, జగద్గురు బోధలను పేరిట ఆంధ్రప్రభ దినపత్రిక ఆదివారపు అనుబంధములో ప్రచురించబడియూ, సాధన గ్రంధ మండలి, తెనాలి వారిచే నతి సంపుటములుగా వెలువరించబడియూ బహు విఖ్యాతి నొందినవి. అక్కడితో ఆ ప్రయత్నమాగి పోయినది.

గత సెప్టెంబరులో కృష్ణాపుష్కరసందర్భమున విజయవాడ విజయముచేసిన కంచి కామకోటిపీఠాధిపతులు శ్రీ శంకర విజయేంద్రసరస్వతీ స్వామివారి ఆదేశానుసారము మహాస్వామివారి శతజయంతి సందర్భమున ఈ ప్రయత్నము పునరారంభించబడినది. స్వామి వారి అభిమతము జాబుద్వారా తెలియబరచినంతనే, విశాఖగారు తామే ఫోన్‌ ద్వారా తమ సంసిద్ధతను వ్యక్తము చెసినారు. అంతేకాదు అతి తక్కువ కాలములో ఈ సంపుటమును అందమయిన తెనుగులోనికి అనువదించి ఇచ్చినారు. (శ్రీ విశాఖ ప్రస్తుతము 'మెజనాన్‌ డాగ్స్‌ కంపెనీ' నుండి పదవీ విరమణ చేసి, బొంబాయిలో స్థిరపడి ''తత్వాలోక'' పత్రిక ఎడిటోరియల్‌ బోర్డు అడ్వయిజరీ కమిటీలో యున్నారు) శ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ స్వామివారు ఈ పుస్తక పరంపరకు ఆచార్యవాణి యన్న నామ మొసంగిరి. ఇది ప్రథమ సంపుటము. ఇంకొక నాల్గయిదు సంపుటములీమాదిరి వెలువరించవలసి యున్నది. విశాఖగారు ప్రస్తుతము ఇంకొక సంపుటమునకు వ్యాసావళి సేకరించుచున్నారు.

సరే! వ్రాతప్రతి నావద్దకు వచ్చినది. అచ్చొత్తించుటకు తిరిగి స్వామివారిని ఆశ్రయించునదా? ప్రాసంగికమున ఈ విషయమంతయూ శ్రీ చావలి శ్రీరాంగారి చెవిన వేసితిని.

శ్రీరాంగారు మద్రాస్‌లో బహుప్రసిద్ధులయిన కీ||శే|| శ్రీ చావలి సుబ్రహ్మణ్యశాస్త్రిగారి తృతీయ పుత్రులు. శాస్త్రిగారికి కంచి మహాస్వామి వారి యెడ అత్యంత భక్తిప్రపత్తులు, అమిత ఐశ్వర్యవంతులయిన వీరు స్వామివారి ఆజ్ఞయైనచో వెనుక ముందులు చూడక ధర్మకార్యములాచరించెడివారు. మద్రాస్‌లో కామాక్షీ దేవాలయ నిర్మాణము, తిరువామియూరు మరుందీశ్వరస్వామి తూర్పు, పశ్చిమ గాలిగోపురముల వంటివి వీరొనరించిన మహూన్నత కార్యములలో కొన్ని.

శ్రీరాంగారు వారి పుణ్యలక్షణములు పుణికి పుచ్చుకొనినారు. మహాస్వామివారి ఆదేశానుసారము తిరువామియూరు మరుందీశ్వరస్వామి వారి దేవాలయ జీర్ణోద్ధరణము, కుంభాభిషేకము, గోపుర నిర్మాణము, వారి తండ్రిగారిచే మద్రాస్‌లో ఆరంభించబడిన కామాక్షీదేవాలయపు నిర్మాణము పూర్తిచేయుట, కామాక్షీ దేవాలయ కుంభాభిషేకము వంటి మహత్కార్యములతోబాటు మద్రాసు కామాక్షీ దేవాలయపు నిత్యపూజలు తమ అన్నదమ్ముల సంపూర్ణ సహకారములతో నిర్వహింపజేయుచున్నారు.

శాస్త్రిగారు మహాస్వామివారి ఆదేశానుసారము తమ తెనాలి గృహమును మండలీక వేంకటశాస్త్రిగారి పేరనారంభించబడిన వేదశాస్త్ర పాఠశాల నడుపుటకు నిర్థేశించినారు. కారణాంతముల వలన పాఠశాల ప్రస్తుతము నడుచుటలేదు. స్వామివారు అచ్చట ప్రాతఃసాయంకాలములయందు ఆధ్యాత్మిక కార్యక్రమములు జరిపించవలయుననియూ, ప్రతిప్రదోషమునకు శ్రీరాంగారో, వారి పెత్తల్లి కుమారుడు కాశీగారో స్వయముగా తెనాలిచేరి విశేష కార్యక్రముములు జరిపించవలయుననియూ ఆదేశించినారు. శ్రీరాంగారు ఆ ఆదేశము తు.చ. తప్పక పాటించుచున్నారు. ఆ గృహమునకు స్వామివారు మాండలీకా శ్రమమని నామకరణము చేపిరి.

సరి! ప్రసంగవశమున ఈ సంపుటమును గురించి శ్రీరాంగారి చెవిని వేసితినని చెప్పితిని కదా! వారు ముద్రణకు వలయు ద్రవ్యమంతయూ తమ మండలీకాశ్రమమీయగలదని మహూదారముగా హామీ ఇచ్చిరి. నేనాశ్చర్యమగ్నుడనయినాను. విషయమెరింగించితినే కానీ, వారిని నేను ద్రవ్యమడుగలేదు. మహాస్వామివారి సంకల్ప మిది యనిపించినది. ప్రతిఫలాపేక్షలేక స్వామికైంకర్యమే పరమ ఫలముగా ఎంతో ప్రయాసకోర్చి అత్యల్పకాలములో పుస్తకము ఆంధ్రీకరించి ఇచ్చిన విశాఖగారికి అడుగకనే తమ ఉదార గుణముతో ముద్రణకుతగు ద్రవ్యమొసంగిన శ్రీరాంగారికి అశేష ఆంధ్ర అస్తిక వర్గము కృతజ్ఞతతో నుండగలదు.

శ్రీ కందుకూరి శివానందమూర్తిగారు ''గురువుగారు''గా పరమ ప్రసిద్ధులు. భీమునిపట్టణపు ప్రశాంత వాతావరణములో ఆనంద వనమను ఆశ్రమమున ఆత్మనిష్ఠులుగా యుండి తమను ఆశ్రయించు వందలాది శిష్యులకు ఆధ్యాత్మికోన్నతి ప్రసాదించుచున్నారు. ఆ ''గురువుగారు'' ఈ ''జగద్గురువుల'' ప్రసంగమునకు పీఠికను మేము కోరినంతనే వ్రాసి ఇచ్చినారు. వారికి కృతజ్ఞతా పూర్వక నమస్కృతులు.

గ్రంధముద్రణ విషయము ప్రెస్సు నిశ్చయించుట, ప్రూఫులు చూచుట వంటి ఎన్నో విధములయిన సహాయమొనరించిన వారు శ్రీ విశ్వనాథపావనిశాస్త్రి, శ్రీ ధూళిపాళ సుబ్రహ్మణ్యశాస్త్రి, మా సోదరుడు చి|| చల్లా సురేష్‌లు. అనుకొన్న దానికన్న ఆలశ్యము చేసిననూ అందముగా DTP చేసి ఇచ్చినవారు PRINTIKA విజయవాడవారు. వీరినందరినీ సర్వైశ్వర్యసంపన్నులుగా ఆశీర్వదించవలయునని ఆ అవతారమూర్తిని ప్రార్థించుచున్నాను.

ఈ ప్రయత్నమంతయూ కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ జయేంద్ర సరస్వతీ స్వామివారు, శ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ స్వాములవారల ఆదేశ ఆశీరనుగ్రహ విశేషము చేత జరిగినది. తెనుగు ఆస్తిక మహాజనులు ఈ ప్రయత్నఫలము ననుభవించగలరు గాక యని ఆ కరుణామూర్తి మహాస్వామి వారి యొక్కయూ, నవ్యశ్రీ చరణుల యొక్కయూ, బాలస్వామివారి యొక్కయూ పాదపద్మములకు మ్రొక్కి ప్రార్థించుచున్నాను.

'గురుకృప' చల్లా విశ్వనాథ శాస్త్రి

అజీజ్‌ నగర్‌ రెండవవీధి 16.11.93

కోడంబాక్కం, (శ్రీముఖ కార్తీక శుద్ధ విదియ)

మదరాసు 600 024.

Sanathana Dharmamu    Chapters    Last Page