Sri Jayendravani    Chapters    Last Page

9. హిందూమతం యొక్క ప్రాచీనత

úxmsxmsLi¿RÁLiÍÜ[ ËݵôðR…ª«sV»R½Li, \ÛÇÁƒ«sª«sV»R½Li, BrýyLiª«sV»R½Li, \ZNPQQûxqsòª«sª«sV»R½Li, ÇÜLSzqísû¸R…Vƒ±s ª«sV»R½Li ®ªsVVµR…ÌÁVgS gRiÌÁ Fsƒ¯[õ ª«sV»yÌÁVƒyõLiVV. ªyÉÓÁÍÜ[ ¿yÍØ ª«sV»yÌÁV ª«sV¥¦¦¦xmsoLRiVxtsvÌÁ ¿Á[»R½ƒ¯[, xmsoßáùxmsoLRiVxtsvÌÁ ¿Á[»R½ƒ¯[, g]xmsöªyLji¿Á[»R½ƒ¯[ ¿RÁLjiú»R½ÍÜ[ Gµ][ INRP xqsª«sV¸R…VLiÍÜ[ róyzmsLixms‡Á²ïR…\®ªs ª«soLiÉØLiVV. Dµyx¤¦¦¦LRißáNRPV 1973ª«s xqsLiª«s»R½=LRiLi \ZNPQQûxqsòª«sª«sV»R½Li róyzmsLiÀÁ ƒ«sxmsöÉÓÁ ƒ«sVLi²T… 1973 xqsLiª«s»R½=LSÌÁV gRi²T…¿y¸R…V¬s xqsWÀÁxqsVòLiµj…. @LiÛÉÁ[ \ZNPQQûxqsòª«s ª«sV»R½Li @¬sõ xqsLiª«s»R½=LSÌÁNRPV xmspLRi*Li róyzmsLixms‡Á²T… NSÌÁgRiª«sVƒ«sLiÍÜ[ xms¸R…V¬sLiÀÁ ª«sVƒ«s NRPLiµk…¸R…V ‡Á²T…ƒ«sµR…¬s @LóRiLi. @®µ…[ „sµ³R…LigS B»R½LRi ª«sV»yÌÁ „sxtsQ¸R…VLiÍÜ[ gRiW²R… G ª«sV»R½Li FsxmsöV²R…V ALRiLiÕ³ÁLixms‡Á²T…Liµk…, µy¬sõ úFyLRiLiÕ³ÁLiÀÁƒ«s róyxmsNRPV¬s }msLRiW, @LiµR…LjiNTP ¾»½ÖÁzqsƒ«s „sxtsQ¸R…V\®ªsV ¸R…VVLiÈÁVLiµj…. µy¬s¬s‡ÁÉíÓÁ @¬sõ ª«sV»yÌÁV @„s xmsoÉíÓÁ FsLi»R½NSÌÁª«sVLiVVLiµ][ ¿Áxmsöª«s¿RÁV胫sV. A ª«sV»R½ ª«s*ª«sróyxmsNRPVÌÁV ‡Áx¤¦¦¦§úxmsÇجdsNS¬sõ ªyLji ªyLji AÍÜ[¿RÁƒ«sÌÁ\®ªsxmso ANRPL<jiLi¿RÁVN]¬s FsNRPV䪫sª«sVLiµj… @ƒ«sV¸R…W¸R…VVÌÁƒ«sV F~LiµR…gRiÍæØLRiV.

కాని హిందూమతం విషయంలో ఎవరూ దాని పుట్టుకను గాని దాని వయస్సును గాని నిర్ణయించలేరు. కనుక దానిని అతి ప్రాచీనమైందని, సనాతనమైందని అంటారు. దీనికి వ్యవస్థాపకులే లేరు గనుక ఈ మతం ముందు ఏవ్యవస్థాపకుని పేరు ఉండదు. సృష్టి ఆరంభం నుండి అమలులోనున్నది హిందూ మతం ఒక్కటే గనుక, దానికి భిన్నంగా మరొక మతమంటూ ఏదీలేని కారణంగా ఈ మతాన్ని ప్రత్యేకమైన మరొక పేరుతో ప్రచారం చేయవలసిన అవసరంలేదు. మిగతా మతాలట్లుగాక చరిత్రలో ఒక నిర్దిష్టమైన సమయంలో స్థాపింపబడి ప్రచారంలోకి వచ్చాయి గనుక వాటిని గుర్తించటానికి వీలుగా వివిధములైన పేర్లను కల్గివున్నాయి.

హిందూ మతానికి ఆరంభం లేదు గనుక వయోనిర్ణయం కూడ లేదు. కాని చరిత్రకారులు ఏవో గుణకారాలు వేసి దాని వయఃప్రమాణం 6000 లని కొందరూ, 10,000 లని, కొందరూ 20,000 లని మరికొందరూ ప్రకటిస్తారు.

ఆవాదాన్ని అంగీకరించిన పాశ్చాత్య విజ్ఞానులు మన మతం చాల ప్రాచీనమైందని ఆమోదించారనే విషయం రూఢి ఔతుంది. మన మతం కొన్ని వేల సంవత్సరాలకు పూర్వం పుట్టిందనే వాదాన్ని పరిగణనలోకి తీసుకున్నా, దీనిని ఎవరు స్థాపించారూ, ఏ సంవత్సరంలో స్థాపించారూ అనే విషయాల్ని ఎవరూ నిర్ధారించ లేకపోవటం యథార్థం. ప్రపంచం సృష్టి జరిగినప్పటి నుండి మన మతం వుంది. భగవంతుడు ఫలానప్పుడు జన్మించాడని ఎవరైనా చెప్పగలరా? అలాగే హిందూమతం కూడ. అతి ప్రాచీనమైనమతం హిందూమతం ఒక్కటే. భగవానుని పుట్టుకకు ఎవరూ కారణంగానట్లే హిందూమతానికి కూడా. హిందూ మతం ఆ విధంగా పరమాత్మునితో సామ్యం కలది. ఇది అనాది ఐంది, ఆరంభంలేనిది.

ఏ విషయంలో మనం కాలనిర్ణయం చేయలేమో, దేనికైతే ఆరంభం సూచింపబడదో దానినే అనాది అంటాం. హిందూ మతం లాగానే మన ఆరాధనా విధానం కూడ అనాది యైందే. అనాది అనే అర్థంలో ఈ మతం ఎవరిచేత స్థాపింప బడలేదని, దీని ప్రారంభానికి చరిత్రలో కాలనిర్థారణ ఏమీలేదని సూచింప బడుతుంది. ప్రాచీన యుగాల్నుంచి మనకు ఈ మతం సంక్రమించింది. దీనికి జాతకం లేదు. దేనికి జాతకముండదో దాన్నే అనాది అంటారు. దేనికి జాతకం వుంటే దానికి పుట్టుక కాలం నిర్ణయమైనట్లే. పుట్టుకవుంటే మరణం దానివెంట వున్నట్లే. శ్రీకృష్ణుడు గీతలో చెప్పినట్లు : ''జాతస్య హి ధృవో మృత్యుః''

హిందూమతానికి జాతకంలేదు, కనుక కాలపరిమితి లేదు, మృత్యువు అసలే లేదు. పుట్టిన బిడ్డకు చావుతప్పనిసరి. పుట్టని బిడ్డకు మృత్యువు ఎలా వుండదో హిందూమతానికి కూడ పుట్టుక లేదూ, అంతమూ లేదు.

అంతేగాక ఇతర మతాల పవిత్ర గ్రంథాలు ఒక నిర్ణీత నామంతో వుంటాయి. ఉదాహరణకు బైబిలు క్రైస్తవులకు, ఖురాన్‌ ఇస్లామ్‌ మతస్థులకు మూలమైన మతగ్రంథాలుగా నిర్దేశింప బడ్డాయి. కాని హిందూమతానికి పవిత్ర రూపాలైన వేదాలు ఎప్పుడు పుట్టాయో మనం నిర్ణయించలేము. మానవ స్థాపితాలైన మతాల విషయంలో మతప్రవక్తల యొక్క ప్రవచనాల నుండి అధికారికమైన సూక్తులను తీసికొని క్రోడికరించి పవిత్ర గ్రంథాలుగా వెలువరించటం జరిగింది. హిందూమతానికి మాత్రం అలాగాక అది, ఆరంభంలేని వేదాలే ప్రామాణిక గ్రంథాలుగ రూపొందాయి. భగవానుని యొక్కఉచ్ఛ్వాసనిశ్వాసాలే వేదాలుగ భావింపబడుతున్నాయి. సృష్టికర్తే మనకు స్వయంగా వీటిని ప్రసాదించాడు. భగవంతునిచే ప్రసారం చేయబడిన ధ్వనులే వేదాలుగ ఏర్పడి యుగయుగాల్నుంచి ఆనోటా ఆనోటా మనకు లభించాయి. ఆ విధంగా మన మతం గ్రంథపఠనం ద్వారాగాని, గ్రంథస్థ విషయాల ఆధారంగాకాని కాక కేవలం అనుభవం ద్వారా పరిణమించిందే. బైబిలు గాని, ఖురాన్‌గాని అనుసరించేవారు వారికేమైన సందేహాలు వస్తే ఇతర గ్రంథాలు చూడాల్సి రావచ్చు. కాని హిందూ మతానుయాయులకు అలాంటి ఆవశ్యకత జనించదు. వేదాలు, పాఠ్యపుస్తకాలుగాదు. అవి భగవంతునిచేత ఉచ్చరించబడిన శబ్దాలు మాత్రమే. వేదాలు అర్థసహితమైన శబ్దాల్ని ప్రతిబింబించే మంత్రాల్ని కలిగి వుంటాయి. వేదపఠనం వల్ల మన మనస్సులు అచంచలత్వాన్ని పొందుతాయి. ఇతర మతాల్లో శంకలకు అవకాశం వుండవచ్చు కాని మనమతంలో అలాంటి అవకాశం లేదు. ఇతర మతాల్లోకి పోయేవారి శాతం చూస్తే అది 1/2 శాతం వుండవచ్చు. ఈ 1/2 శాతం కూడ ఆర్థిక ప్రయోజనం లేక వృత్తిపరమైన అవకాశాలు లాంటి ప్రత్యేక కారణాల వల్ల మాత్రమే. వేదాల్లో మన సంశయ నివృత్తి చేయుటకు, మనకు సుఖశాంతులను కల్గచేయుటకు కావల్సిన సాధనాలున్నాయి.

హిందూమతానికి ఇతరమతాలకి గల తేడాను ఈ చిన్ని ఉదాహరణతో వివరించవచ్చు. పట్టణాల్లో ప్రధానమైన తారురోడ్డు వుంటుంది. కాలిబాట వుంటుంది. ప్రధానమైన రోడ్డు దూరపు త్రోవను, కాలిబాట దగ్గర మార్గాన్ని సమకూరుస్తాయి. ప్రధాన రోడ్డుకు సాధారణంగా ఒక ముఖ్యమైన వ్యక్తి పేరు పెడతారు. దానిని అమిత వ్యయంతో నిర్మిస్తారు. అట్టహాసంగా ప్రారంభోత్సవంచేసి గాని ఆరోడ్డును ప్రజల వుపయోగానికి అంకితంచెయ్యరు. ఆ రోడ్డును సంధిస్తూ పట్టణంలోని పలుప్రాంతాల నుండి రోడ్లు నిర్మింప బడతాయి. అన్ని రకాల వాహనాలు ఉపయోగించటానికి వీలుగా ఈ రోడ్డు విశాలంగాను, అన్ని హంగులతోను తయారు చేయబడుతుంది. నేను లక్ష్మీబాయి నగర్‌నుండి ఉత్తరస్వామిమలై దేవాలయం చేరటానికి ప్రయాణిస్తుండగా దేవాలయం చాల దగ్గరలో అనగా ఒక ఫర్లాంగు దూరంలో వున్నట్లు కనిపించింది. కాని రోడ్డు మీద ఎక్కువ దూరం ప్రయాణం చేస్తేనే గాని దేవాలయాన్ని చేరలేకపోయాం. అదే కాలిబాటను ప్రయాణంచేస్తే తక్కువ దూరం నడచి తక్కువ కాలంలో గమ్యస్థానం చేరగలం.

కాలిబాట ఎవరు ఎప్పుడు ప్రారంభించారో ఎవరికి తెలీదు. దానికి ప్రారంభోత్సవం అంటూలేదు. మరమ్మత్తులు లేవు. ఎవరో, ఎప్పుడో దాన్ని ప్రారంభించివుంటారు. దాన్ని ప్రారంభించిన వారి పేరుకాని, మొట్టమొదట దానిపై నడచిన వారిపేరుగాని మనకు కనిపించవు.

ప్రజలు దానిపై సంచరిస్తున్నంత వరకు ఆబాట స్పష్టంగా కనిపిస్తుంది. ప్రజలు నడవటం ఆపివేస్తే గడ్డి, ఇతర మొక్కలు దానిపై వ్యాపిస్తాయి. దానిపై ప్రమాదాలకు అవకాశంలేదు. మరమ్మత్తులకొరకై మూసివేయబడటం, ఫలితంగా మరొక మార్గాన్ని ఎన్నుకోవటమనేది సంభవించదు. అదే ప్రధాన మార్గాలైతే ప్రమాదాలు జరగటంవల్ల, మరమ్మత్తుల నెపంతో వాటిని కొంత కాలం మూసివేయటం జరుగుతుంది. కాలిబాట విషయంలో అలాంటి వాటికి అవకాశంలేదు. ప్రజలు ఎల్లప్పుడు దానిని ఉపయోగించవచ్చు, గమ్యస్థానాన్ని శీఘ్రగతిని నిశ్చయంగా జేరవచ్చు.

హిందూమతాన్ని కాలిబాటతో పోల్చవచ్చు. కాలిబాటకు వలెనే ఈ మతానికి కూడ ప్రారంభకులు లేరు. మన ప్రాచీనులు కాలిబాటను ఉపయోగించి మనకు అందచేశారు. దాన్ని ఉపయోగించటం మానితే గడ్డి మొదలైనవి వ్యాపించి త్రోవను మరుగు పరుస్తాయి. నిజానికి బాటను ఎంత ఎక్కువ మంది ఉపయోగిస్తే అది అంత మంచి స్థితిలోను పరిశుభ్రతతోను రాణిస్తుంది. కాని మనుష్యులు అతి కష్టంతో, మిక్కిలి వ్యయంతో నిర్మించి, నిర్వహిస్తున్న ప్రధాన మార్గాల విషయంలో ఇవేవీ వర్తించవు. ప్రధానమార్గాలు మరమ్మతులకు గాని, మరొక కారణంగా గాని అప్పుడప్పుడు మూసివేయటం జరుగుతుంది. కాని కాలిబాట మూసివేయబడటంగాని, నశించటంగాని ఎన్నడూ జరుగదు. కాలిబాటవలెనే హిందూమతానికి కూడ ఆరంభంలేదు, అంతమూలేదు. నిత్యత్వంతో భాసిస్తుంది.

ఇంకా చెప్పాలంటే కాలిబాటకు నిర్దేశిత గమ్యంవుంది కాని ప్రధాన మార్గాలకి గమ్యమే లేదు. అంతేగాక రహదారి కూడలికి చేరినప్పుడు దారితోచని స్థితి ఏర్పడుతుంది. అక్కడ మార్గాల్ని, ప్రదేశాల్ని నిర్దేశించే సూచికలుంటే తప్ప బాటసారికి తాననుసరించవలసిన త్రోవ అగమ్యమౌతుంది.

కాని కాలిబాటననుసరించి మనం ప్రయాణం సాగిస్తే గమ్యాన్ని సులభంగా, నిశ్చయంగా చేరుతాం. హిందూమతం కాలిబాట వంటిది. దాన్ని అనుసరిస్తే మార్గం సూచికల సహాయం లేకుండానే లక్ష్యస్థానాన్ని అతిశీఘ్రంగా చేరుతాము. చాలామంది ఈ మార్గాన్ని ఎన్నుకొని గమ్యస్థానాన్ని చేరుకున్నారు. గనుక ఈ సందర్భంలో మనం సంకోచించాల్సిన పని లేదు. ఇతర మతాలన్నీ మానవ నిర్మితాలైన తారురోడ్లలాంటివి.

మన మతాన్ని ఒక రక్షకభటునితో పోల్చవచ్చు. మన మతం ఏక ధృవాభిముఖత కల్గిన మతం కాదు. రక్షకభటుడు తన విధి నిర్వహణ కాలంలో ఒక రకమైన దుస్తులు ధరిస్తాడు. అతడే ఇంటికివచ్చి వేరొక రకమైన వస్త్రధారణచేసి గృహోపయోగమైన విధులను నిర్వర్తిస్తాడు.

అట్లే మనకు మనం అనుసరించవలసినవి రెండు రకాలైన ధర్మాలున్నాయి. ఒకే ధర్మాన్ని ఎల్లవేళలా అనుసరించకూడదు. మనం ఆఫీసులలో విధులను నిర్వహించేటప్పుడు పాటించ వలసిన ధర్మంవేరు. ఇంటివద్ద జరుగు కార్యకలాపాల్లో పాల్గొనే సమయంలో మనం అనుసరించాల్సిన ధర్మం మరొక విధమైంది. ఆ విధంగా మన ధర్మం ద్వంద్వ ప్రమాణాల్ని కల్గివుంటుంది. ఏ సమయంలో ఏ విధమైన ధర్మం పాటించాలో అలా అనుసరిస్తే మనకు దైవకటాక్షం సిద్ధిస్తుంది. అలాగాక ఆఫీసులోను, ఇంటివద్ద కూడ ఒకే ధర్మాన్ని అనుసరిస్తే అది క్రమశిక్షణా రాహిత్యానికి, సంఘర్షణకు, అస్థిమితతకు, మానసిక అశాంతికి దారితీస్తుంది.

సారాంశ##మేమంటే హిందూమతం ప్రాచీనమైన కాలిబాటవలె ఆదిలేనిది, అపౌరుషేయమైనది. కాలిబాట ఉపయోగిస్తున్నంత వరకు దృశ్యమానమై ప్రకాశిస్తుంది. అలా కానిచో గడ్డి, ఇతర మొక్కలు పెరుగుదల వలన మరుగునపడే అవకాశముంది. మామూలుగ ప్రధాన మార్గాలు అనేక కారణాల వల్ల నిరూపయోగమౌతాయి. అప్పుడు కాలిబాటలే శరణ్య మౌతాయి. ఇవి గమ్యాన్ని అనతికాలంలో చేరటానికి దోహదమిస్తాయి. కాలి బాటలు తాత్కాలికంగా అగమ్యంగా మారినా, అవి పూర్తిగా నిరుపయోగ దశకు పరిణమించవు. భగవానుడు ఆ బాటలను పునరుద్ధరించటానికి అవతరిస్తాడు. శ్రీకృష్ణుడు గీతలో ఇదే విషయాన్ని ఇలా చెప్తాడు.

శ్లో|| ''యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత |

అభ్యుర్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం||''

C xqsLiµR…LRi÷éLiÍÜ[ A¸R…Vƒ«s "gýS¬s' @®ƒs[ ª«sWÈÁƒ«sV ªy²R…»y²R…V. "ƒyaRPƒ«sLi' @®ƒs[ ª«sWÈÁƒ«sV ªy²R…²R…V. A µR…aRPƒ«sV "OUPQßáµR…aRP' @¬s @LiÉزR…V gS¬s "ƒ«sbPLixmso' @¬s ƒ«sV²R…ª«s²R…V. ª«sVƒ«s z¤¦¦¦LiµR…W ª«sV»y¬sNTP xmsoÈíÁVNRPÛÍÁ[µR…V gRiƒ«sVNRP ƒyaRPƒ«sLi NRPW²R…ÛÍÁ[µR…V. @LiµR…V¿Á[»R½ ª«sVµ³R…ùNSÌÁLiÍÜ[ @µj…N]Li»R½ OUPQßáµR…aRPƒ«sV F~LiµR…ª«s¿RÁVè. AµR…aRPƒ«sVLi²T… µy¬s¬s xqsx¤¦¦¦ÇÁzqós¼½NTP ¾»½¿RÁVèÈÁNRPV ˳ÏÁgRiªyƒ«sV²R…V ª«sV¥¦¦¦xmsoLRiVxtsvÌÁ LRiWxmsLiÍÜ[ƒ¯[ ÛÍÁ[NRP Çì؃«sVÌÁ LRiWxmsLiÍÜ[ƒ¯[ @ª«s»R½Ljiryò²R…V.

ఇతర దేశాల్లో భగవానుడు దూతల రూపంలో భూలోకానికి వస్తాడు. కాని మనదేశంలో భగవానుడు స్వయంగా రాముడు, కృష్ణుని అవతారాలెత్తి లోకాన్ని ఉద్ధరించాడు.

కలియుగంలో మనమింకా ప్రథమపాదంలో ఉన్నాం గనుక పరమాత్ముడు కల్కిగా అవతరించటానికి చాలాకాలం పడుతుంది. 'భక్తవిజయం' లో మనదేశాన్ని ఉద్ధరించిన మహాత్ముల, మహర్షుల యొక్క జీవిత చరిత్రలు వర్ణింపబడ్డాయి.

మనమతాన్ని పునరుజ్జీవింప చేయడానికి సంత్‌జ్ఞానేశ్వర్‌ లాంటి వేలకువేల జ్ఞానులు వివిధకాలాల్లో ఉదయించారు. మతం పూర్తి క్షీణదశకు చేరితేతప్ప భగవానుడు తనకై తానే అవతరించడు. మిగతా సందర్భాల్లో తన అంశలున్న తన ప్రతినిధులను మాత్రమే పంపుతాడు. కనుక ఏ సందర్భంలోను మనమతం నశింపుకు గురికాదు.

కొన్ని పరిసరాల ప్రభావంవల్ల మనమతం క్షీణదశకు చేరుతున్నట్లు, ప్రజలు కష్టాలకు గురి¸°తున్నట్లు తోచవచ్చు. యధార్థంగా ప్రస్తుతం దేశంఅంతా బాధల వలయంలో చిక్కుకుంది. ఈ పరిస్థితుల్లో మనం చేయాల్సిందల్లా అనాదియైన మనమతాన్ని ఆశ్రయించి దాని అడుగుజాడల్లో నడచుకోవటమే. దురదృష్టమేమంటే 'అనాది' యైన మన మతం ప్రస్తుతం 'అనాధ'గా మారింది. ఐనా నిస్పృహ చెందనవసరం లేదు. మహాపురుషులు వెనుక జన్మించారు. ఇప్పుడూ పుడతారు. ప్రతివాడు తన విధులను క్రమంగా నిర్వర్తిస్తూ మతం అడుగు జాడలను అనుగమిస్తే లక్ష్యసిద్ధిని సురక్షితంగా పొందుతాం. ప్రతివాడు తన అనుష్ఠానాన్ని, ఆచరణలను, కార్యాల్ని, విధులను విశ్వాసంతో శ్రద్ధతో నిర్వహిస్తే చాలు.

క్షీణదశ చిహ్నాలు కనిపించినపుడు పునరుజ్జీవనోత్సుకత ప్రదర్శించాలి. కాలిబాట గడ్డితో మరుగుబడుటను నివారించటం మనవిధి. దానిని సురక్షితంగా నిర్వహించాలంటే ఆ బాటపై మన గమనం నిత్యం సాగించటమే. సిద్ధాంతాల్ని వల్లెవేస్తే చాలదు.

వాటిని అమలులో పెట్టడం ఆరంభించాలి. విజ్ఞానదాయకమైన విషయాల్ని విన్నప్పుడు వాటిని ఆచరణలో పెట్టటానికి ఉపక్రమించాలి. అర్జునుడు కృష్ణుని ఉపదేశాల్ని విని ఊరుకోలేదు. వాటని ఆచరించటం ప్రారంభించాడు. హిందూమతం సిద్ధాంతాల ఆచరణకే ఎక్కువ ప్రాధాన్యత నిస్తుంది. మత ప్రవచనాలు విని ఆ ప్రబోధాల్ని ఆచరణలో పెట్టినప్పుడే మనకు పూర్తి ప్రయోజనం సిద్ధిస్తుంది. మనకు నిర్ణయింపబడిన విధులను, ధర్మాలను శ్రద్ధతో నిర్వర్తించాలి. తండ్రి తండ్రిగా తన ధర్మాల్ని, తల్లి తల్లిగా తన ధర్మాన్ని, అలాగే కూతురు, ఉపాధ్యాయుడు మొదలైన వారందరూ, ఎవరి ధర్మాల్ని వారు సక్రమంగా విశ్వాసంతో నిర్వర్తిస్తే తిరిగి మనమతం పూర్వంవలె ఉజ్జ్వలంగా ప్రకాశిస్తుంది.

కనుక మనమందరం సమిష్టి బాధ్యతతో, మన హిందూమతం యొక్క ప్రధానాంశాల అవగాహనతో మన మతానికి సంభవించిన క్షీణతను అన్ని విధాలా అరికట్టి దాని పునరుజ్జీవనానికై కృషి చేయాలి.

ప్రతివాడు తన విధిని సక్రమంగా నిర్వర్తిస్తే ఆదర్శవంతమైన వాతావరణం ఎల్లెడల ప్రవర్తిస్తుంది. ప్రపంచం మనం చిత్రించు కున్నట్లుగా అంత చెడుదశలో లేదు. కనుక మన కర్తవ్యాన్ని మనం చిత్తశుద్ధితో నిర్వహించ గల్గితే హిందూమతం యొక్క పునరుజ్జీవనం ఉజ్వలంగా సమకూరేటట్లు చేయవచ్చు.

Sri Jayendravani    Chapters    Last Page