Sri Jayendravani    Chapters    Last Page

45. సాత్వికాహారము

ª«sVƒ«s LiVVLi²ýR…ÍÜ[ ®µ…[ª«s»R½ÌÁNRPV xmspÇÁ ¿Á[}qsÈÁxmsöV²R…V, ÍÜ[gRi²R… „sª«sLjiLiÀÁƒ«sÈýÁV ª«sVƒ«sLi xmspÇÁNRPV xqsLi‡ÁLiµ³j…LiÀÁƒ«s HµR…V @LiaSÌÁƒ«sV FyÉÓÁryòLi. @„s @Õ³Á}tsQNRPLi, ¿RÁLiµR…ƒ«sLi, NRPVLiNRPVª«sV, @LRi胫s, ¥¦¦¦LRi¼½. „dsÉÓÁ®ƒs[ xmsLi¿RÁ @LigRiª«sVVÌÁLiÉØLRiV. C Hµj…LiÉÓÁÍÜ[ƒ«sV @„sV»R½ ª«sVVÅÁùQ\®ªsVƒ«sµj… \®ƒs®ªs[µR…ùª«sVV. \®ƒs®ªs[µR…ù xqsª«sVLRiöß᪫sVV»][ xmspÇÁ NSLRiùúNRPª«sVLi ª«sVVgjizqsƒ«sÛÉýÁ[. »R½LS*»R½ ZNP[ª«sÌÁLi Dxms¿yLRi }qsª«sÌÁV ª«sWú»R½Li ª«soLiÉØLiVV. \®ƒs®ªs[µR…ùLi @¼½ ª«sVVÅÁùQ\®ªsVƒ«sµj… gRiƒ«sVNRP µy¬s „sxtsQ¸R…VLiÍÜ[ úaRPµôðR… ª«sz¤¦¦¦Li¿yÖÁ.

మనం ఏ ఆహారం భుజించినా, ముందు సర్వసృష్టి కర్తయైన పరమాత్మునకు సమర్పిస్తాం. 'నివేదనం అనే శబ్దానికి 'సమాచారమందించుట'యని అర్థం. భగవంతుడు అన్ని వస్తువుల్ని మన ప్రయోజనం కొరకు మాత్రమే సృష్టించాడు. ఆయనకు దేనియొక్క ఆవశ్యకత లేదు. మనము భుజించే ముందు మనం స్వీకరించే వాటిని గురించి ఆయనకు తేల్పితే మనకు శ్రేయోదాయకం.

అధునాతన నాగరికతపై మనకున్న మక్కువ, పరదేశీయుల అలవాట్లను అనుకరించుట పట్ల మనకున్న పిచ్చివ్యామోహం కారణంగా మనం ఎక్కువ బాధల్ని అనుభవిస్తున్నాం. రసాయనపు ఎరువుల వాడకాన్ని నిలిపివేసిన మరుక్షణం మనం తిరిగి వివేకవంతుల మవుతాం. మన ఆహారం స్వచ్ఛంగా వుండాలంటే మనం ఆహారధాన్యాల ఉత్పత్తి విధానంపై శ్రద్ధ చూపాలి. రసాయనపు టెరువుల వలన మనం తీసుకునే ఆహారపు గుణాత్మక విలువలు క్షీణిస్తాయి. దాన్ని అనుసరించి మన ఆలోచనల స్వభావం కూడ దిగజారిపోతుంది.

పూర్వకాలంలో మన పంటపొలాలకు ఎరువుగా ఆవుపేడను వాడేవారు. గోవు సాత్విక జంతువు కనుక ఆవుపేడ ఎరువుగా వాడి పండించిన ఆహారధాన్యాలు కూడ స్వచ్ఛమైనవిగా వుండి మనకు స్వచ్ఛమైన ఆలోచనలను సమకూర్చేవి. కాని ఇప్పుడు ఉత్పత్తిని పెంపొందించే లక్ష్యంతో మనం రసాయనపు టెరువులను అమితంగా ఉపయోగించం ఆరంభించాం. ఆ పద్ధతుల్లో ఉత్పత్తి చేసిన ఆహారం తీసుకున్నప్పుడు, మన శరీరంలో జీవపదార్థాల రసాయనిక మార్పుల దాని వలన ప్రభావితములై మానసిక చర్యలను ఆలోచనలను తారుమారు చేస్తున్నాయి. ఈ విధానాన్ని సవరించుకోవాలని నేను చాల పర్యాయాలు ప్రకటించాను.

ఆహారధాన్యాల ఉత్పత్తి విషయంలో శ్రద్ధ వహించటమే కాకుండా మనం భుజించే ఆహారం తయారుచేసే విధానాన్ని గురించి కూడ మనం కొన్ని జాగ్రత్తలు తీసికోవాలి. మనం తినే ఆహారం స్వచ్ఛమైన పద్ధతిలో తయారుచేయబడితే మన మనస్సు కూడ పవిత్రంగా వుంటుంది. స్వచ్ఛమైన ఆహారం అంటే బాగా మరబట్టిన తెల్లని బియ్యంతో వండిన అన్నం అని నా అభిప్రాయం కాదు. సాత్వికమైన, కాలుష్యరహితమైన ఆహారాన్నే స్వచ్ఛమైన ఆహారం అనాలి. కనుక ఆహారాన్ని సాత్విక రీతుల్లో స్వచ్ఛమైన పద్ధతిలో తయారు చేయాలి.

కొంతమంది చాకలిచేత ఉతకబడి అప్పుడే తీసికొని రాబడిన తెల్లని దుస్తులను ధరించి తాము స్వచ్ఛమైన దుస్తులను ధరించామని తద్వారా ఆచారాన్ని పాటిస్తున్నామని భావిస్తారు. కాని దుస్తులు తెల్లవైనా వాటికి పవిత్రతను గాని, ఆచారాన్ని గాని అనుసంధించలేము. అలాగే ఆహార విషయంలో కూడ పవిత్రత అనే అంశం వుంటుంది.

సాధారణంగా చాలమంది గృహస్థుల ఇండ్లలో ఉదయం కాలకృత్యాలు, వాటితోబాటు కాఫీ తీసుకునే అభ్యాసం స్థిరపడిపోయింది. ఆహారం తయారుకాగానే భోజనం చేసే ముందు వ్యక్తి స్నానం చేసి ఆహారం తీసికొని ఆఫీసుకు వెళ్తాడు. కొంతమంది రెండవసారి భోజనం తర్వాతనే స్నానం చేస్తారు. అలా తీసుకున్న ఆహారానికి పవిత్రతగాని, శుచిత్వం గాని వుండదు. అలాంటి ఆహారం ఆహారశుద్ధకి, సత్వ శుద్ధికిగాని, పవిత్రమైన సాత్విక తలంపులకుగాని దోహదం చేయదు.

ఆహారం శుచియైన పద్ధతిలో తయారుచేయటానికి వంటచేసే సమయంలోకూడ ఆచారం పాటించాలి.

మనం బయటకు పోయి హోటల్‌లో తినే ఆహారం కంటే మన స్వగృహంలో భుజించినప్పుడు తీసుకునే ఆహారం ఎక్కువ పరిమితిలో వుంటుందని నేను తరచుగా చెపుతూ వుండేవాణ్ణి. హోటల్లో రెండు ఇడ్లీలు తినగానే మన కడుపు నిండినట్లు అనిపిస్తుంది. అవే మన ఇంట్లో అయితే ఇంకా ఎక్కువ తినటానికి యిష్టపడతాం.

మనం హోటల్‌లో తక్కువ ఆహారం తీసికోటానికి నాల్గు, ఐదు కారణాలు సూచిస్తూవుండేవాణ్ణి. మొదటి కారణం వంటవానికి సంబంధించినది. అతని యొక్క మానసిక ధోరణి ఈ విషయంలో ఎక్కువ పాత్ర వహిస్తుంది. వంటవాడు కాలపరిమితి లేకుండా వంటచేయడుకదా. వంట ఎంత తక్కువ కాలంలో చేసి బయట పడదామా అని తొందరపడుతాడు. రెండవది వంట పదార్థాలను గురించినది. హోటలు మేనేజరు వంటకాలు రుచిగా వుండటానికి అవసరమైనంత వరకు పదార్థాలను సమకూర్చడు. మూడవది డబ్బు చెల్లించి పదార్థాలు తినే వ్యక్తి వెచ్చించే ధనాన్ని గురించి ఆలోచిస్తూ తక్కువ ఖర్చుతో బయటపడాలని చూస్తాడు. నాల్గవ కారణం తన పదార్థాలు తాను తింటూ తన ప్రక్క నున్న వ్యక్తి తాను అమితంగా భుజిస్తున్నాడని భావించవచ్చనే ఆలోచనతో వుంటాడు. సహజంగా పైన చెప్పిన పరిస్థితుల్లో వ్యక్తి ఆహారం తినటానికి పూనుకుంటే ఉదాహరణకు రెండు ఇడ్లీలు తినగానే కడుపునిండిందనే అనుకుంటాడు. ఐదవ కారణం కూడ ఒకటి వుంది. హోటలులో ఇచ్చే ఆహార పదార్థాలు జీర్ణావయాలకు హానికలిగించవచ్చుననే భయం తినే వ్యక్తికి కలుగవచ్చు. ఇలాంటి ఆలోచనలు వ్యక్తి మనస్సులో చొరబడినప్పుడు సహజంగానే ఆ ఆహారం తిన్న తర్వాత అతని ఆలోచనా విధానంలోనే మార్పు సంభవిస్తుంది. కనుక మనం బయట తీసుకునే ఆహారంవల్ల ఈ పరిణామాలన్నీ ఏర్పడతాయి.

ఇంట్లో మన పిల్లలతోను, బంధువులతోను కలసి భుజిస్తాం. కనుక సహజంగా ఎక్కువ ఆహారం తీసుకుంటాం. మన గృహాల్లో తీసుకునే ఆహారం స్వచ్ఛమైందిగా వుంటుంది గనుక మన మానసిక ప్రవృత్తికూడ నిర్మలంగా వుంటుంది.

భార్య వడ్డించే ఆహారం కంటే తల్లివడ్డించే భోజనం ఉత్తమమైనది. తల్లి ప్రతిఫలాపేక్షా రహితంగా కుమారుడు మంచి ఆహారం తీసికొని మంచి ఆరోగ్యంతో జీవించాలని అభిలషిస్తుంది. కాని భార్య అలాగాక పెనిమిటికి భోజనం పెడుతూ ప్రతిఫలాన్ని గురించి కూడ ఆలోచించవచ్చు.

కనుక మనకు ఉదాత్తమైన, స్వచ్ఛమైన ఆలోచనలు ఉద్భవించాలంటే మనం తీసుకునే ఆహారం సాత్వికమైనది, పవిత్రమైనదిగా వుండాలి.

మధ్యప్రదేశ్‌ లేక వింధ్యారణ్యాల ద్వారా జరిగిన మా ప్రయాణ కాలంలో పోలీసుభటులు మాకు రక్షణగా మమ్మల్ని అనుసరించే వారు. మేము ప్రయాణించిన ప్రతి రాష్ట్రంలోను ఆ రాష్ట్రానికి చెందిన పోలీసులు మాతోవచ్చి మరొక రాష్ట్రంలో ప్రవేశించినప్పుడు వారి బాధ్యతలను తరువాతి రాష్ట్ర పోలీసుభటులకు అప్పగించారు.

ఆ పోలీసుభటులు వారి రొట్టెలను వారే తయారుచేసికొని భుజించేవారు. మేము తయారుచేసిన రొట్టెలను వారికి యిస్తామంటే వారు నిరాకరించేవారు.

మేము మధ్యప్రదేశ్‌ దాటి ఉత్తరప్రదేశ్‌లోకి ప్రవేశిస్తుండగనే ఉత్తరప్రదేశ్‌ తాలూకు పోలీసుభటులు మధ్యప్రదేశ్‌ వారి వద్దనుండి బాధ్యతలను స్వీకిరంచి కొంతదూరం ఇరు రాష్ట్రాల పోలీసుభటులు కలసి మాతో వచ్చారు.

ఒక రోజ రాత్రి పదిగంటలకు ఒక నిర్జన ప్రదేశంలో అడవి జంతువులు మా ముందు అటు యిటూ సంచరించటం ప్రారంభించాయి. హఠాత్తుగా ఉత్తరప్రదేశ్‌ పోలీసుభటుడు ఒకడు అడవి జంతువుల్ని కొట్టబోయాడు. అప్పుడు మధ్యప్రదేశ్‌ రక్షకభటుడు అతనితో అన్న మాటలు నేనెన్నటికి మరువలేను. ''మనం స్వామీజీతో ప్రయాణం చేస్తున్నామని గుర్తుంచుకో. కనుక జంతువును కొట్టి హింసించవద్దు. మన మార్గాన్నుంచి దూరంగా తోలు.'' అని అతడు చెప్పాడు. అతని మాటల్లో :

''ప్రాణియోంసే సద్భావనా హో''

''జంతువులపట్ల సద్భావన పెంపొందించుకో'' అంతే. ఆ జంతువు ఏమైనదో ఎంత పరిశీలించినా కనపడలేదు.

అతనికి ఆ విధమైన స్వచ్ఛమైన ఆలోచనలు మనసులో స్ఫురించాయి. ఈ ప్రయాణంలో కల్గిన ఈ అనుభవాన్ని నేనెన్నటికీ మరువలేను. మనం భుజించే ఆహారం పరిశుద్ధమైన పద్ధతిలో తయారు చేయబడి పవిత్రంగా వుంటే మనమనస్సుల్లో పుణ్య ప్రదమైన భావాలు అంకురిస్తాయి. కలుషితమైన విధానాలతో తయారు చేయబడిన ఆహారం లేక మాలిన్యసహితమైన ఆహారం మాత్రమే మానసిక చర్యల్ని తారుమారు చేసి వక్రమార్గంలో నడిపిస్తుంది.

మన మనస్సులో సద్భావనలు, ఉన్నతమైన ఆలోచనలు ఉద్భవించాలంటే మనం తినే ఆహారం పరిశుద్ధంగా తయారు కావాలి; మనం సాత్వికాహారాన్నే భుజించాలికూడ.

Sri Jayendravani    Chapters    Last Page