Sri Jayendravani    Chapters    Last Page

44. నమస్కారము

మన మతంలో నమస్కారం ఒక ప్రముఖమైన పరిహారసాధనగా పేర్కొనబడింది. మన నిత్యజీవితంలో తెలిసికొన్నీ, తెలియకకొన్నీ ఎన్నో పొరపాట్లు, తప్పులు, పాపకార్యాలు చేస్తుంటాం. వానినుండి సంక్రమించే పాపాలను ప్రక్షాళన చేసుకునే నిమిత్తం భగవంతుని ముందు మోకరిల్లి నమస్కరించమని పెద్దలు సూచిస్తారు. దైనందిన జీవితంలో కూడ ఎవరైన తప్పుగాని, పొరపాటుగాని చేస్తే, సంబంధితవ్యక్తి వద్దకుగాని, లేక భగవానుని ముందుకుగాని వెళ్లి వారి ముందు మోకరిల్లి తప్పును క్షమించమని అడగమని అతనికి సలహాయిస్తాం. ఆ విధంగా నమస్కారాన్ని పాపపరిహారం కొరకు వినియోగించే ప్రక్రియగా పరిగణిస్తాం.

ప్రతి మతంలోను, పశ్చాత్తాపం, దాన్ని అనుసరించి భగవంతుని క్షమాభిక్ష కోరటం అనేది ఉన్నది. క్రైస్తవ మతస్థులు, ఇస్లాం మతస్థులు భగవంతుని ముందు మోకరిల్లి శిరస్సులు వంచి ప్రార్థనలు చేస్తారు. ఇలా శిరస్సువంచి ప్రార్థించే పద్ధతిని భగవానుని క్షమాభిక్ష వేడే విధానంగా భావించవచ్చు.

మనం నిత్యజీవితంలో తెలిసో, తెలియకో చేసే అనేక రకాలైన దుష్కృత్యాలవల్ల పరిణమించే పాపాలనుండి విముక్తి పొందుటకే ఈశ్వరుని ముందు నమస్కారాలర్పిస్తాం.

కొంతమంది ఒక చెయ్యిని శిరస్సు ప్రక్కన చేర్చి అవనతులవుతారు. మరికొంతమంది తమ గడ్డం రెండుచివరల చేతితో రెండుసార్లు స్పృశిస్తారు. ఇంకా కొందరు రెండు చేతుల్ని పైకియెత్తి నమస్కారరూపంలో ఉంచుతారు. కేరళ దేశంలో ప్రజలు నేలను ముందుతాకి తర్వాత శిరస్సును స్పృశిస్తారు.

మనశాస్త్రాలు పంచాంగ నమస్కారాన్ని, సాష్టాంగ నమస్కారాన్ని చెప్పాయి.

పంచాంగ నమస్కార విధానంలో శరీరం యొక్క ఐదు అవయవాలు భూమిని స్పృశిస్తాయి. సాష్టాంగనమస్కార పద్ధతిలో ఎనిమిది శరీరావయవాలు నేలను తాకుతాయి. వైష్ణవులలో అయితే దండసమర్పణ అనే విధానం వున్నది. ఆంధ్రప్రదేశ్‌లో దీన్నే 'దణ్ణంపెట్టు'అంటారు. తమిళంలో కూడ 'స్వామియే విదుండుకుంబిడు' అనే పదసముచ్చయం వున్నది. భగవంతుని ముందు సాష్టాంగ ప్రణామాన్ని 'దండవత్‌ ప్రణామం' అంటారు. మనం సాష్టాంగ నమస్కారం చేసినప్పుడు మన శరీరం కర్రవలెనే భూమిని స్పృశిస్తుంది. అప్పుడు మన దేహం కూడ కర్రనుపోలి వుంటుంది. శరీరస్థితిలో అది కర్రగానే వుంటుంది. తమిళంలో అది యథార్థంగా దండమే (నిరుపయోగమైనది). శరీరంలో ప్రాణం వున్నంతవరకే దానిమీద ప్రీతి. దేహాన్ని ప్రాణం వదలి వెళ్లిన తర్వాత దాన్ని గురించి ఎవరూ పట్టించుకోరు. దీన్నే ఆదిశంకరులు భజగోవింద స్తోత్రాల్లో :

శ్లో|| యావత్పవనో నివసతి దేహే తావత్‌ కుశలం పృచ్ఛతి గేహే |

గతవతి వా¸° దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్‌ కాయే ||

®µ…[x¤¦¦¦LiÍÜ[ EzmsLjiª«soƒ«sõLi»R½ª«sLRiNRPV úxms¼½ªy²R…V ®ªs×ýÁ A ª«sùQQNTPò¬s xmsLSª«sVLji+ryò²R…V. NS¬s aS*xqs AgjiF¡LiVV, úFyßáLi F¡LiVVƒ«s »R½LS*»R½ @»R½¬s˳ØLRiù NRPW²R… A ®µ…[¥¦¦¦¬sõ ÇÁÚÀÁ ˳ÏÁ¸R…Vxms²R…V»R½VLiµj…. ÒÁ„sLiÀÁ¸R…VVƒ«sõLi»R½ NSÌÁLi @®ƒs[NRP LRiNS\ÛÍÁƒ«s }qsª«sÌÁV¿Á[zqsƒ«s ˳ØLRiù NRPW²R… @»R½²R…V ¿RÁ¬sF¡¸R…W²R…¬s ¾»½ÖÁ¸R…VgS®ƒs[, LiVVLiNS aRPLkiLRiLiÍÜ[ úFyßáLiª«soƒ«sõµk…, ÛÍÁ[¬sµj… ¿RÁW²R…ª«sV¬s A®ªsV »R½ƒ«s úxmsNRPäLiVVLiÉÓÁªyLji¬s N][LRiV»R½VLiµj…. FsLiµR…VNRPLiÛÉÁ[ „sgRi»R½ÒÁª«s\®ªsVƒ«s ®µ…[¥¦¦¦¬sõ xqs„dsVzmsLi¿RÁÉجsNTP A®ªsVNRPV ˳ÏÁ¸R…VLi NRPƒ«sVNRP.

తమిళంలో 'దండం' అంటే నిరుపయోగం అని. శరీరం అశాశ్వతమైందని భావం.

అయినా ఆ శరీరాన్ని క్రమమైన పద్ధతిలో వినియోగిస్తే అది ఉపయోగకరమైంది అవుతుంది. ఒకే కర్రను మంచిపనులకు, చెడ్డపనులకు కూడ ఉపయోగించవచ్చు. దేహాన్ని నిరుపయోగమైన కర్రను వలె రూపొందించక భగవంతుని పాదపద్మములకు సమర్పణము చేయవలెను. వైష్ణవులు 'దండసమర్పణం'అని వచించునప్పుడు వారు పై విశ్వాసాన్నే ప్రకటిస్తారు.

పూర్వజన్మలో మనంచేసిన సత్కర్మల ఫలితంగా మనకీ జన్మలో మానవ శరీరం లభించినది. భగవత్కృపతో సమకూరిన శక్తితో ఈ శరీరాన్ని నిల్పుకోగల్గుతున్నాం. అదే శరీరం రోగగ్రస్తమైనప్పుడు మంచంలో పడివుండి లేవటానికి శక్తిని కోల్పోతుంది. భగవంతుని వల్లనే మనం మనశరీరాన్ని శక్తివంతంగా వుంచుకోగల్గుతున్నామని, లేనిచో అది మామూలు కర్రతో సమానమేననే భావంతో మనం భగవానుని ముందు ప్రణమిల్లాలి.

దేహాన్ని సహజస్థితిలో భూమిపై తాకుతూపడియుండునట్లు చేయుటనే సరియైన నమస్కారంగా పరిగణిస్తాం. మనం ఒక దండంవలె పడతాం. సాష్టాంగ నమస్కారం పురుషులు మాత్రమే చేయాలి. ఈ క్రియలో భూమిని స్పృశించే దేహావయవాలు ఏవనగా : 1) శిరస్సు 2) రెండుచేతులు 3) రెండు శ్రవణంద్రియాలు 4) గడ్డం 5) రెండుకాళ్లు. స్త్రీలకు పంచాంగ నమస్కారము నియమితమైంది. వారు వారి నడుము, వక్షస్థలభాగములను నేలను ఆననీయరాదు. ఈ నమస్కారం చేసే విధానంకూడ నిర్ణయింప బడివుంది. వక్షస్థలం భూమిని స్పృశించునట్లు మన శిరస్సును నేలపై వుంచాలి. తర్వాత కుడిచేతిని, పిదప ఎడమ చేతిని ముందుకు చాచాలి. తర్వాత అదే రీతిలో చేతులను వెనుకకు ముడుచుకోవాలి. తదుపరి కుడి, ఎడమ భుజాలను నేలను తాకునట్లు చేయాలి. ఆ పిదప చేతులను వెనుకకుతీసి నడుమువైపునకు మడవాలి. తర్వాత మొదట కుడిచెవిని, తదనంతరం ఎడమచెవిని భూమిని తాకునట్లు చేయాలి. ఈ నమస్కారంచేసే సమయంలో మనం చొక్కానుగాని, బనియనుగాని ధరించరాదు.

మన శాస్త్రాలు మనం భగవంతుని సమక్షంలోను, పూజ్యులైన పెద్దలముందు ఎన్నిమార్లు నమస్కారం చేయాలో విధించాయి. ప్రస్తుతం చాలమందికి ఈ వివరాలు తెలియవు. వారిష్టప్రకారం వారికి తోచినట్లు నమస్కారాలు చేస్తున్నారు.

పురుషులు పెద్దలముందు నమస్కారం చేయునప్పుడు వారి వంశపరంపరను, నామధేయాన్ని, గోత్రాన్ని చెప్పి నమస్కారం, లేక 'అభివాదం'చేయాలి. వారే స్త్రీలకు నమస్కారం చేసే సమయంలో, కేవలం నమస్కారం మాత్రమే చేయాలి. స్త్రీలముందు వంశపరంపరను, గోత్రాది వివరాలను వల్లించపనిలేదు. పెద్దలుముందు, అన్నగార్లు, గృహస్థుల ముందు నమస్కారం ఒకే పర్యాయం చేయాలి.

ఒక వ్యక్తి పెద్దలముందు నమస్కరించినప్పుడు, నమస్కారం స్వీకరించే వ్యక్తి తన శుభాశీస్సులను అందచేయాలి. పూర్వకాలంలో పెద్దలు 'చిరంజీవీభవ' అని ఆశీర్వదించేవారు. కాని ప్రస్తుతపు రోజుల్లో పెద్దలు పిల్లవాని వీపుపై తట్టి 'మంచి బాలునిగా ప్రవర్తించు; నీ తరగతిలో ప్రథమశ్రేణి విద్యార్థిగా రాణించు'అని దీవిస్తున్నారు.

తమ ఆశీర్వచనాన్ని ఈయని పెద్దలముందు నీవు నమస్కరించవద్దని శాస్త్రాలు చెపుతున్నాయి. ఆశీర్వాదాన్ని అపేక్షించే ఎవరైనా పెద్దలకు నమస్కారం చేస్తారు. అంతేగాని తమకై తాము గౌరవాన్ని పొందటానికిగాని అవతలవారికి గౌరవం సమకూర్చాలనీగాదు. పెద్దవారి దీవెనలు మనకు శ్రేయస్కరం గనుక వారిముందు సాష్టాంగపడి వారి ఆశీర్వచనాల్ని అర్థించాలి.

సన్యాసుల ముందుగాని, మఠాధిపతుల ఎదుటగాని మనం నమస్కరించవలసి వచ్చినపుడు వారు చతుర్ధాశ్రమానికి చెందినవారు గనుక వారి విషయంలో నాల్గు నమస్కారాలు నిర్ణయింపబడినవని గుర్తుంచుకోవాలి. ఇది గమనించండి :

''కాషాయదండ మాత్రేణ యతిః పూజ్యః ||''

కాషాయివస్త్రాలు ధరించి దండహస్తులైన వారిని నిస్సంకోచంగా పూజ్యభావంతో చూడాలి. కనుక సన్యాసులను, మఠాధిపతులను తప్పక గౌరవించాలి. సన్యాసుల సమక్షంలో గోత్రనామాలు ప్రకటించాల్సిన ఆవశ్యకతలేదు. వారిక్షమాభిక్షను అర్థించవలసిన అవసరం కూడ లేదు. వారిముందు 'నారాయణాయ నమః' లేక 'నారాయణ' అని మాత్రం చెపితేచాలు. సన్యాసులు కూడ ప్రతివచనంగా 'నారాయణ' అంటారు. సన్యాసులమైన మేము అన్నివేళల నారాయణున్ని గురించే స్మరించాలి.

అప్పుడప్పుడు మాకు సమీక్ష నిమిత్తంగాని, 'శ్రీముఖం' రాయటంకొరకుగాని గ్రంథాలు వస్తుంటాయి. వాటిని వ్రాసేటప్పుడు ముగింపు వాక్యంగా 'ఇతినారాయణ స్పృతిః క్రియతే'అని వ్రాస్తాము. సన్యాసులకు ఇదిచాల ముఖ్యం. కనుక మీరందరూ సన్యాసులు నిత్యం నారాయణుని గుర్తించుకొనుటకు, నారాయణుని సదా స్మరించుకొనుటకు దోహదం చేయాలి.

సన్యాసి నారాయణ స్మరణ ఎల్లపుడు ఎందుకు చేయాలో దానికి ఒక ప్రత్యేక హేతువున్నది. ఒక వ్యక్తి సన్యాసాశ్రమం స్వీకరించేముందు నారాయణ లేక విష్ణుసాలగ్రామాన్ని అతని శిరస్సుపై వుంచి అభిషేకం చేస్తారు. దానితో ఆ సన్యాసి నారాయణునితో సముడౌతాడు. ఆక్షణంనుండి అతడు నారాయణున్ని గురించే ఆలోచిస్తూ తనమనస్సులో ఆయన చింతననే రూఢిచేసుకోవాలి. ఏ సన్యాసి కూడ తన మనస్సును నారాయణ ధ్యానం నుండి మరల్చుకోరాదు. సన్యాసి ముందు ప్రణమిల్లేవారు కూడ ఆయనకు నారాయణుని గురించి మాత్రమే గుర్తుచేస్తూ వుండాలి. అలాగాక తనకున్న సమస్యలను ఈతిబాధలను ఆయనముందు ఏ కరువుబెట్టి, వాటి పరిష్కారాలను అర్థించరాదు.

సన్యాసి నారాయణునే ఎందుకు స్మరించాలి, శివుని ఎందుకు తలంచకూడదనే సంశయం మనకు కల్గవచ్చు. ప్రత్యేక ప్రయోజనాల్ని సాధించటానికి ప్రత్యేక దేవతల్ని ఆరాధించాలని మన శాస్త్రాలు శాసిస్తున్నాయి.

శ్లో|| ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్‌

శ్రియమిచ్ఛేదుతాశనాత్‌ |

ఈశ్వరాత్‌ జ్ఞానమిచ్ఛేత్‌

మోక్షమిచ్ఛేత్‌ జనార్దనాత్‌ ||

""AL][gRiù„sV¿Á[èé»`½ ˳ØxqsäLS»`½.'' ª«sùQQNTPò ª«sVLiÀÁ aRPLkiLSL][gRiùLi N]LRiNRPV xqsWLRiVùßñÓá DFyzqsLi¿yÖÁ.

అలాగే 'శ్రియమిచ్ఛేత్‌ హుతాశనాత్‌.' సంపదల నపేక్షించిన వ్యక్తి అగ్నిని ఆరాధించాలి.

తర్వాత నిర్మలమైన వివేకం కొరకు, మానసిక స్వస్థతకు, నిత్యసత్యమైన జ్ఞానం కొరకు దేవుని లేక దక్షిణామూర్తిని ఆరాధించాలని పెద్దల వాక్యం.

23)

''ఈశ్వరాత్‌ జ్ఞానమిచ్ఛేత్‌''

తర్వాత, ''మోక్షం ఇచ్ఛేత్‌ జనార్దనాత్‌.''

సన్యాసులకు జీవిత లక్ష్యం ఒక్కటే. అంటే మోక్షసాధన మాత్రమే. కనుక వారు క్రమముక్తిని పొందుట కొరకు జనార్దనుని, స్మరించాలి. 'క్రమముక్తి' అనే పదాన్ని నేను కావాలనే ఉపయోగించాను. ముక్తిని సాధించాలంటే అనేక మార్గాలున్నాయి. వ్యక్తి ముక్తిని ఇప్పుడే, ఇక్కడే సంపాదించవచ్చు. ఈ విధమైన ముక్తిని విజ్ఞానం ద్వారా పొందవచ్చు. ఈ ముక్తినే విదేహముక్తి లేక కైవల్యముక్తి లేక జీవన్ముక్తి అంటారు. ఇవిగాక మరొకరకమైన మోక్షమొకటుంది. ఒకజగత్తులో ప్రవేశించి క్రమంగా అక్కణ్ణుంచి మరొక జగత్తుకు చివరకు బ్రహ్మలోకం చేరటాన్నే ఆ మోక్షం అంటారు. దీనిలో వ్యక్తి ముందుగా విష్ణులోకం చేరుతాడు. తర్వాత క్రమంగా, మరొక జన్మ ఎత్తకుండానే, బ్రహ్మలోకంలో ప్రవేశిస్తాడు. జనార్దనుడు మోక్షాన్ని ప్రసాదిస్తాడు గనుక సన్యాసి ఎల్లప్పుడు నారాయణుని గురించే స్మరించాలి. ఈ ఉద్దేశంతోనే సన్యాసాశ్రమాన్ని స్వీకరించేముందు అతనిశిరస్సుపై నారాయణసాలగ్రామాన్ని ఉంచి అభిషేకం చేస్తారు.

కనుక సన్యాసులముందు నాల్గు నమస్కారాలు చేసి 'నమోనారాయణాయ' అని చెప్పాలి. సన్యాసి కూడ 'నారాయణాయ' అని ప్రతివచనం పలికి దీవించాలి.

కాని తరచుగా ప్రజలు మఠాధిపతులమైన మా వద్దకు వచ్చి వారికోర్కెలను, ఇబ్బందులను వెలిబుచ్చుతుంటారు. మేము అనిశం 'నారాయణుని' స్మరణలోనే వుండాలనే విషయాన్ని వారు విస్మరిస్తారు. అయినా, మేము మఠాధిపతులం గనుక వారుచెప్పేది విని వార్కి కొన్ని ఉపాయాలు సూచించి అంతా మంచి జరుగుతుందని సమాధానపరచి పంపిస్తూ ఉంటాం. మేము అన్నివేళల నారాయణ స్వరూపుని స్మరిస్తూ భక్తుల యిక్కట్లు తీర్చమని నారాయణుని ప్రార్థిస్తాం.

దేవాలయాల్లో ఈశ్వరుని ముందు మూడు నమస్కారాలు చేయాలనే నియమం వుంది. మనలో వున్న మూడు గుణాలకు ప్రాతినిధ్యంవహించే త్రిమూర్తులకు ఒక్కొక్క మూర్తికి ఒక్కొక్క నమస్కారం చెందాలనేది దీని ఉద్దేశం. అందువల్లే వినాయకునికి సుబ్రహ్మణ్యశ్వరునికి, విష్ణువునికి, శివునికి ఇంకాకొందరు దేవతలకు మూడు నమస్కారాలను చేయాలనే నియమం పాటించబడుతోంది. దేవి విషయంలో మాత్రం, నాల్గు నమస్కారాలు చేయాలని చెప్పబడుతోంది.

మనం అర్పించే నమస్కారలకు ప్రతిఫలంగా మనకు భగవానుడు తన ఆశీర్వచనాలను, శుభాలను ఈయడని, మన శ్రమవృధాయని ఎవరూ తలంచరాదు. భగవానుడు సర్వవ్యాపకుడు, సర్వవేత్త. ఆయనకు మానసికంగా సర్వమూ విదితమే కనుక మనం అడగకుండానే మనకు శుభాల్ని ప్రసాదిస్తాడు. దేవాలయాల్లో దేవతలముందు నమస్కారాలు అర్పించే సమయంలో గోత్రనామాలు, వంశపరంపరలు ప్రకటించ నవసరంలేదు. స్తోత్రాలతో, శ్లోకాలతోను భగవంతుని ప్రార్థించి, నమస్కారాలర్పించి, క్షమాభిక్ష నర్థించి వరాలను ప్రసాదించమని అడుగుతాం.

నమస్కారాలు చేసిన తర్వాత, ముకుళిత హస్తాలతో ధ్యానశ్లోకాలు పఠిస్తూ సవ్యపద్ధతిలో ఆలయం చుట్టూ బేసిసంఖ్యలో మూడు నుండి 21 పర్యాయాలు ప్రదక్షిణాలు చేయాలి.

Sri Jayendravani    Chapters    Last Page