Sri Jayendravani    Chapters    Last Page

43. తిలకధారణము

హిందూమతానుయాయు లందరూ ఫాలభాగంపై విభూతి గాని చందనంగాని, కుంకుమగాని ఏదో ఒక చిహ్నాన్ని ధరించాలనే నియమం ఆమతంయొక్క ప్రత్యేకాంశాల్లో ఒకటి.

గోపీచందన ధారణ మహావిష్ణువును, మధ్వులు ధరించే నల్లనిరేఖలు విష్ణుమూర్తిని స్మరింపచేస్తాయి. ఆ విధంగా ప్రతిచిహ్నానికి ఒక ప్రత్యేక ప్రాముఖ్యత వుంది.

విభూతి ధారణ పరమేశ్వరుని స్ఫురింపజేస్తుంది.

''విభూతిర్భూతిరైశ్వర్యమ్‌''

విభూతి అంటేనే ఐశ్వర్యం. లక్ష్మీనిలయమైన గోవు పృష్ఠభాగాన్నుండి వెలువడే ఆవుపేడతో విభూతి తయారు చేసికోవాలి. మార్కెట్టులో లభించేది స్వచ్ఛమైన విభూతికాదు. లక్ష్మి గోవు యొక్క పృష్ఠభాగంలో వున్నట్లే ఇతరదేవతలు కూడ గోవు యొక్క వివిధ శారీరక భాగాల్లో వుంటారు. కనుక గోమలానికి విశేషమైన ప్రాముఖ్యం వున్నది. దానినుండి తయారు కాబడే విభూతి సంపదకు చిహ్నం కావటంలో విశేషం లేదు.

లక్ష్మి ప్రధానంగా ఐదు ప్రదేశాల్లో నివసిస్తుంది : గోవు యొక్క పృష్ఠభాగం, వివాహితస్త్రీయొక్క పాపటభాగం, గజం యొక్క కుంభస్థలం, పద్మము, బిల్వదళాలు. ఉత్తర హిందూస్థానంలో వివాహిత స్త్రీలు తమపాపటభాగంలో సిందూరాన్ని ధరిస్తారు.

పూజకొరకు వినియోగించే చాలా పుష్పాలు, ఆకులు, వాటని కోసిన రోజునే వాడవలసి యుంటుంది. కాని బిల్వదళాలు, పద్మాలు పదిరోజుల వరకు నిల్వయుంచి పూజ కొరకు ఉపయోగించవచ్చు. అవి లక్ష్మీనిలయాలుగనుక నిర్మాల్యదోషం వాటిని అంటదని నమ్మిక.

ధైర్యసాహసాలుండేచోట, సచ్ఛీలత నెలకొన్న స్థానాల్లో, సత్యసంధత విలసిల్లిన ప్రాంతాల్లోను కూడ లక్ష్మి స్థిరంగా వసిస్తుంది. విభూతి ఐశ్వర్య చిహ్నం గనుక దానిని ధరించి నందున దారిద్ర్యం ఉండదు. మనం ఋణగ్రస్తులంకాము.

మనప్రజలు విభూతిధారణను విసర్జించినారు. విభూతిధారణను ప్రజలు పాటిస్తూ వున్నట్లయితే మనదేశం ఈ స్థాయిలో ఋణాలు సేకరించాల్సిన అవసరంవుండేది కాదు. ప్రజలు విభూతిధారణ ప్రారంభించిన తర్వాత దేశప్రగతి, శోభాయమానమైన సంఘటనలు దేశచరిత్రలో మనకు విరివిగా దర్శనమిస్తాయి. మధురైలో మహాత్మ తిరుజ్ఞానసంబందార్‌ ప్రజలను విభూతిధారణకై ప్రబోధించి ఆచరింపచేయగా దేశంలోదారిద్ర్యం నిర్మూలింపబడి సర్వసౌభాగ్యాలు నెలకొల్పాయి. కొంతమంది మాత్రము అనుష్ఠాన సమయాల్లో విభూతి ధరించి కార్యాలయాలకు వెళ్లేటప్పుడు చెరిపి వేస్తారు. తత్ఫలితంగా ప్రజలకు లభించే ఫలితాలు, సంపదలు, సంతోషాలు కూడ చాల పరిమితస్థాయిలో నిలిచిపోతున్నాయి.

ఈశ్వరుడుకూడ విభూతిని మూడు అడ్డు రేఖలుగా ఫాలభాగంపై ధరిస్తాడు. కనుక మనం కూడ విభూతి యొక్క ఆవశ్యకతను గుర్తించి, దాన్ని ఐశ్వర్యానికి, సుఖసౌభాగ్యాలకి చిహ్నంగా భావించి నడుచుకోవాలి. విభూతి ధారణ అంతిమంగా ఈశ్వరుణ్ణి గురించి తలపింపచేస్తుందని మరచిపోకూడదు.

అంతేగాక ప్రపంచంలోని ప్రతివిషయంయొక్క అంతిమ స్థితిని విభూతి సూచిస్తుంది. దేనినైనా పూర్తిగా కాలిస్తే కడపటికి లభించేది బూడిదే. వస్తువుల యొక్క చరమస్థాయి పరమేశ్వర తత్వమే. విభూతి స్వచ్ఛతను కూడ గోచరింపచేస్తుంది. ప్రాపంచిక విషయాలన్నిటికి పరమావధి. అంతిమస్థితి స్వచ్ఛమైన శ్వేతరూపుడైన పరబ్రహ్మమాత్రమే. ఆ విధంగా విభూతిధారణ గొప్ప వేదాంత సత్యాన్ని మనముందుంచుతుంది.

సర్వసృష్టికి హేతుభూతమైన నిత్యచైతన్య శక్తికి చిహ్నంగా మనం విభూతిధారణ చేస్తాం. ప్రపంచంలో ప్రతివిషయం శివమయమని, అదేమనకు అంతిమలక్ష్యమని విభూతి విశదీకరిస్తుంది. ఒక వస్తువును కాలిస్తే, అది ముందు నల్లగా మారుతుంది. దానినింకా కాలిస్తే అది తెల్లటి బూడిదగా పరిణమిస్తుంది. దాన్ని ఇంకాకాల్చిన దానిలో మార్పు ఏమీ సంభవించదు. కనుక అన్నిరకాలైన దేహాల యొక్క చరమస్థితి బూడిద మాత్రమే. కనుక భౌతికరంగంలోని విభూతి ఆధ్యాత్మిక రంగంలో శివునితో సామ్యస్థితి కల్గియున్నది. విజ్ఞానమనే అగ్నిగుండంలో మనం ప్రతివస్తువును కాలిస్తే చివరకు మిగిలేది శివుడు లేక పరబ్రహ్మము మాత్రమే.

అలాగే రక్తవర్ణంకల్గిన కుంకుమ లక్ష్మిదేవిని స్మృతిపథంలో నిల్పుతుంది. నిమ్మరసం, ఘృతం ఇంకా యితర పదార్థాలు కలిపిన చింతపండుతో దీన్ని తయారుచేస్తారు. ఈ కుంకుమనే మనం ధరించాలి. దేవతారాధనకు వినియోగించబడిన కుంకుమనే మనం ధరించాలి. అది సాక్షాత్తు పార్వతీస్వరూపాన్ని లేక లక్ష్మీ స్వరూపాన్ని స్మరణకు తెస్తుంది. సంపదకు చిహ్నమైన కుంకుమ లక్ష్మీదేవిని తలపింపచేస్తుంది.

శ్రీకృష్ణుని పాదఘట్టములచే పవిత్రీకరింపబడిన గోబి-మృణ్మయం మనం ధరించే గోపిచందనం ద్వారా మనస్ఫురణకు వస్తుంది. దీనివల్లనే భగవానుడు శ్రీకృష్ణుడు, గోపవనితలు కూడ మనహృదయ సీమలో సాక్షాత్కరిస్తారు.

మధ్వులు వారిదేహంపైన, ఫాలభాగం మీద కూడ బొగ్గుతో మిళితమైన కాలవర్ణరేఖల్ని ధరిస్తారు. ప్రపంచంలోని సమస్త వస్తుజాలం నశింపునకు గురికావాల్సిందే; నశించిన ప్రతిది కాలిన బొగ్గుయొక్క మసిరూపాన్ని పొందవలసినదే. కనుక ప్రతివ్యక్తి ప్రాపంచిక విషయాలపై అనుబంధాన్ని త్యజించి, వైరాగ్య ప్రవృత్తిని అలవరచుకోవాలి. మధ్వులు దీనితోబాటు గోపీచందనాన్ని కూడ ధరిస్తారు. ఆ విధంగావారు మహావిష్ణువును హృదయంలో స్మరిస్తూ, వైరాగ్యప్రవృత్తిని పెంపొందించుకుంటారు.

పైన సూచించిన ఏ రూపంలోనైనా సరే తిలకం ధరించటం హిందూమతం యొక్క విశేషలక్షణం. ఈ తిలక ధారణచేసే వారందరూ పునర్జన్మ సిద్ధాంతంలో విశ్వాసం ఉన్నవారనే విషయాన్నికూడ ఇది సూచిస్తుంది. బౌద్ధులు, జైనులు కూడ ఈ సిద్ధాంతాన్ని ఆమోదిస్తారు గనుకనే వారుకూడ ఫాలభాగంమీద ఈ చిహ్నాల్ని ధరిస్తారు.

తిలకంగాని, విభూతిగాని ధరించేవిషయంలో మరొక విశిష్టత కూడవుంది.

''లలాట లిఖితా రేఖా''

ఇంకా :

శ్లో|| యద్ధాత్రా నిజభాలపట్టలిఖితం స్తోకం మహద్వా ధనం |

తత్‌ప్రాప్నోతి మరుస్థలేపి నితరాం మేరౌ తతోనాధికమ్‌ ||

తద్ధీరో భవ విత్తవతు కృపణాం వృత్తిం వృధా మా కృథాః |

కూపే పశ్య వయోనిధావపి ఖఘటో గృహ్ణాతి తుల్యం జలం ||

ª«sùQQNTPò ¹¸…VVNRPä ÌÁÍØÈÁÖÁÐÁ»y¬sõ Fsª«sLRiW ª«sWLRièÛÍÁ[LRiV. A „sxtsQ¸R…VLiÍÜ[ CaRP*LRiV²R…V NRPW²R…

అశక్తుడే. ఒక వ్యక్తి బాధలకు గురియై వాటిని గురించి వివరించినప్పుడు ''అలాగని నీ లలాటంమీద వ్రాసియున్నది గనుక నీవు అనుభవించి తీరాల్సిందే''నని అంటాం. అదే విధంగా వ్యక్తికి సుఖప్రాప్తి కల్గితే 'అదినీకు రాసిపెట్టుంది గనుక నీవు సుఖంగా వున్నావు; ఆనందాన్ని అనుభవిస్తున్నావు' అని ఎవరూ చెప్పరు. వ్యక్తికి చెడుసంభవించినప్పుడు మాత్రమే లలాటలిఖితాన్ని ప్రస్తావిస్తారు.యథార్థంగా వ్యక్తికి మంచిగాని, చెడుగాని అతని లలాటలిఖితాన్నిబట్టే జరుగుతుందని, దానిని ఎవ్వరూ తప్పించలేరని, అది అనుభవించి తీరవలసిందేనని మనం గ్రహించాలి.

మనకు సూర్య, చంద్రగ్రహణాలు సంభవిస్తూ వుంటాయి. అవి ఎవరి జన్మనక్షత్రాల్లో సంభవిస్తాయో వారికవి కీడును కల్గచేస్తాయనే విశ్వాసం ప్రచారంలోవుంది. ఆ కీడునుండి రక్షించుకునే ప్రయత్నంలో వారు లిఖింపబడ్డ కాగితపు ముడత కల్గిన తాళ పత్రాన్నిధరిస్తారు. ఉదాహరణకు చంద్రగ్రహణ కాలంలో వాడే కాగితపు మడతలో

శ్లో|| ఇంద్రో నలో యమోనిరృతిర్వరుణో వాయురేవ చ |

కుబేర ఈశోఘ్నం త్విరదూపరాగోత్థవ్యధాం మమ ||

xqsWLRiùúgRix¤¦¦¦ßáNSÌÁLiÍÜ[ xmnsVõLi»R½*L][äxmsLSgRiª«sùµ³yLi aRPËôØÌÁV ª«sryòLiVV. C „sµ³R…LigS ¿Á[}qsò

గ్రహణదోషాలు పోతాయి.కాని దౌర్భాగ్యమేమంటే పై ఆచారం క్రమంగా మాసిపోతోంది.

మండుటెండలో బయటకు వెళ్లవలసివస్తే పాదరక్షలు ధరిస్తాం. అలాగే వర్షంకురిసే సమయంలో వర్షపు-కోటు ధరించి బయటకు వెళతాం. అదేవిధంగా మంత్రసంయుతమైన తాళపత్రం గ్రహణంవల్ల ప్రాప్తించే చెడు ఫలితాలనుండి మనలను రక్షిస్తుంది.

అలాగే విభూతి మనల్ని సర్వదా కాపాడుతూ, కర్మసిద్ధాంతాన్ని, పరమేశ్వరతత్వాన్ని మనకుస్ఫురింప చేస్తుంది. మనం అందరం జీవితంలో సంభవించే సుఖదుఃఖాల్ని రెండింటినీ ఎదుర్కొనవలసినదే. కొంతవరకు వాటి తీవ్రతను తగ్గించుకొన గలమేకాని వాటని పూర్తిగా నిర్మూలించలేము. బాధల తీవ్రతను తగ్గించుట కొరకే ప్రాయశ్చిత్తాలు, నవగ్రహ జపాలు, ఇత్యాది కర్మకాండలు ఏర్పడ్డాయి. మనం చేసిన కర్మ ఫలితాల్ని మనం అవశ్యం అనుభవించవలసిందే. దానినెవరూ ఆపలేరు. ఒక తమిళ సామెతలో చెప్పబడ్డట్టు 'తలను తీసివేయవలసి వస్తే తలపాగను మాత్రమే తప్పించగలం, అంటే బాధల తీవ్రతను తగ్గించుకునే ప్రయత్నం చేయవచ్చు నన్నమాట.

ఉత్తరదేశంలో తలపై తలపాగధరించటం సర్వసామాన్యం గనుక పై సామెత అక్కడే ఆవిర్భవించిందనకోవచ్చు.

కొన్నిసమయాల్లో కొంతమంది ప్రజలు తమబాధల్ని తట్టుకోలేక దుఃఖిస్తారు. కొద్దికాలం మాత్రమే దుఃఖాక్రాంతులై తర్వాత దాన్ని మరచి సహనశీలురై ప్రవర్తిస్తారు.

విభూతిని ధరించి నప్పుడు మనకు ఈశ్వరుడు స్మరణకు వస్తాడు. బ్రహ్మ మనలలాటంపై లిఖించిన కీడు ఈశ్వరుని కరుణవలన తొలగి మన బాధలు నశిస్తాయి.

కనుక ప్రతివాడు ప్రాతఃకాలంలో లేచి స్నానాది కాలకృత్యాలు నెరవేర్చుకొని, ఫాలభాగంపై విభూతిని గాని, తిలకాన్ని గాని ధరించి సంధ్యావందనం, దేవతారాధనచేసి ఈశ్వరకృపకు పాత్రుడై దినచర్యలకు సమాయత్తం కావాలి.

Sri Jayendravani    Chapters    Last Page