Sri Jayendravani    Chapters    Last Page

41. పితృదేవతలు - శ్రాద్ధాదికర్మల ఆవశ్యకత

(స్థూల సూక్ష్మ శరీరాలు)

úxms¼½ª«sùQQNTPòNTP xqósWÌÁaRPLkiLRiLi, xqsWORPQQøaRPLkiLRiLi, NSLRißá aRPLkiLRiLi @¬s ª«sVW²R…V „sµ³R…ª«sVV\ÛÍÁƒ«s aRPLkiLSÌÁVLiÉØLiVV.

శ్రాద్ధకర్మలు, తర్పణాలు మొదలైనవి చేయటమనే ఆలోచనలు హిందూ మతానికి మౌలికాంశములు. ఈ జన్మలో స్థూల శరీరంతో సంస్కారాలన్నీ సవ్యంగా జరుపబడితే సూక్ష్మశరీరం ఆ కర్మ ఫలాల్ని బట్టి సంతృప్తికరమైన శరీరాన్ని ఆశ్రయిస్తుంది. కాని స్థూల

శరీరం ఆ సంస్కారాల్ని అపసవ్యంగా నిర్వర్తిస్తే, స్థూల శరీరమూ, సూక్ష్మశరీరమూ కూడ ఇబ్బందులకు గురి¸°తాయి. అన్నీ సవ్యంగా నిర్వర్తిస్తే రెండు శరీరాలు సుఖంగా వుంటాయి.

సూక్ష్మశరీరాన్ని ఎలా కాపాడుకుంటాం ? దాని కొరకు చేయవలసిన కర్మలేవి ? శ్రాద్ధకర్మ నిర్వర్తించేటప్పుడు పిండాలని దర్భలమీద, నీటిని, నువ్వులను నేలమీద వుంచుతారు. ఈ సమర్పణ వచ్చే జన్మలోని సూక్ష్మ శరీరాన్ని ఎలా చేరుతుందనే అనుమానం మనకు కల్గవచ్చు. మన పితృదేవతలు ఈ సమర్పించిన వాటిని గ్రహిస్తారు. వారి ద్వారా అవి వచ్చే జన్మకు సంబంధించిన సూక్ష్మశరీరాన్ని పొందుతాయి. మనం సమర్పించిన వస్తు సముదాయం ఏ రూపంలో ఉన్నా, వారు వాటిని ఏ రూపంలో కావాలని, అవసరమని అనుకుంటారో అవి ఆ రూపాల్లోనే వారికి చేరుతాయి.

ఒక వ్యక్తి రష్యాగాని, అమెరికాగాని వెళ్లాలని కోరుకుంటాడని అనుకుందాం. అచ్చట మన ద్రవ్యం చలామణికాదు గనుక రిజర్వుబ్యాంకుకు వెళ్లి మన ద్రవ్యం యిచ్చి రష్యా ద్రవ్యానికిగాని, అమెరికా ద్రవ్యానికి గాని చెక్కులు తీసుకుంటాడు. అలాగే మన పితృదేవతలకు మనం ఇక్కడ ఏ రూపంలో ఏది అర్పించినా వారి కవసరమైన రూపంలోనే వారికి చేరుతుంది.

మనం అర్పించేవి సరియైన గమ్యాలకు చేర్చటానికి నియమితులైన వారు ఇరువురు కర్తలున్నారు. అందులో మొదటివారు ఇంద్రుని ఆధిపత్యంలోని దేవతలు. మనం పరమేశ్వరారాధన గాని, నవగ్రహ హోమంగాని, మరియే యితర దైవకార్యం గాని చేసినప్పుడు సాధారణంగా నేతిని, సమిధల్ని అన్నాన్ని మొదలైన వాటిని అగ్నిలో హోమం చేస్తాం. అగ్నిదేవత రిజర్వుబ్యాంకు క్యాషియర్‌ వలె వ్యవహరిస్తాడు. మనం సమర్పించిన వాటిని వివిధ దేవతలకు వారి కనుకూలమైన రూపంలో ఆయన అందజేస్తాడు. దేవతలు వాటిని స్వీకరించి మనకు వారి ఆశీస్సులను అందజేస్తూ మన కోర్కెలను కూడ తీరుస్తారు.

పితృకార్యంలో మనం ఏది సమర్పించినా దానిని పితృదేవతలు స్వీకరించి మన పూర్వీకులకు సమర్పిస్తారు. ఈ విషయాల్లో పితృదేవతలు రిజర్వుబ్యాంకు క్యాషియరు పాత్రను వహిస్తారు. మన పితృదేవతల ద్వారానే మనకు మన పూర్వీకుల ఆశీస్సులు లభిస్తాయి. కనుక మనం ఇంద్రాధిపత్యంగల దేవతలకు, మనపితృదేవతలకు చేసే సమర్పణల విషయాల్లో శ్రద్ధ వహించాలి.

మామూలుగా ప్రజలు రాముణ్ణో, కృష్ణుణ్ణో ఆరాధించి వారి నామాలు జపిస్తే సరిపోతుందని, వారి కృపాకటాక్షంతో మన జీవితాలు సుఖప్రదం ఔతాయని, సాఫీగా నడచిపోతాయని భావిస్తారు. కాని భగవాను డేమి చెప్పాడో పరికించండి.

గీతలో కృష్ణుడిలా అంటాడు :

''నా స్మరణను మరువవద్దు. అలాగని అన్ని వేళల నన్ను మాత్రమే తలచవద్దు. మీ విధులను, మీ కర్మలను యధావిధిగా నిర్వర్తించండి.'' కనుక భగవానుడు మన జీవితాల్ని ఎలా గడపాలో ఆదేశాలిచ్చాడు. మనం మామూలుగ మన కార్యాలు నిర్వర్తించినప్పుడు ప్రతిపని ముగిసిన తర్వాత 'కృష్ణార్పణం', 'శివార్పణం'అని అంటూంటాం. అంటే పనులన్నింటిని భగవానుని కంకితం చేస్తున్నట్లు. అలా భగవంతుని స్మరిస్తూ పనులను చేస్తే మనకు సత్ఫలితాలు లభిస్తాయని, మన జీవితాలు సుఖమయం అవుతాయని మనం విశ్వసిస్తాం. దైవకార్యాల్ని, పితృకార్యాల్ని కూడ ఈశ్వరార్పణమని భావిస్తూ నడపగల్గితే, భగవానుడే వాటిలో ప్రమేయం కల్పించుకొని వాటిని జయప్రదం చేస్తాడు.

దేవతల యొక్క, మనపూర్వీకుల యొక్క శుభాశీస్సులను మన కందచేయుటకు ఇంద్రాదిదేవతలు, పితృదేవతలు సారధ్యం వహించాల్సిన అవసర మేమిటనే ప్రశ్న మనకు ఉదయించవచ్చు. ఈ సందర్భంలో ఒక ఆసక్తికరమైన మహాభారతంలోని కథ పైప్రశ్నకు సమాధానం సమకూరుస్తుంది. భీష్ముడు తన తండ్రి శంతనుని కొరకు శ్రాద్ధకర్మను నిర్వహించాడు. పిండాన్ని సమర్పిస్తుండగా దేవతాంశుడైన శంతనుడు దేవతరూపంలో భీష్మునకు ఎదురుగా నిలబడి చేతులు చాచి తా నిప్పుడు దేవతారూపంలో నున్నానని పిండాన్ని తనకే నేరుగా అర్పిస్తే స్వీకరిస్తానని అన్నాడు. దానికి సమాధానంగా భీష్ముడు, ''నాకు తెలుసు, నీవు దేవతాంశలో నున్నావని. నీకు నేను నమస్కారాలు అర్పించగలను. కాని పిండాన్ని నేరుగా సమర్పించలేను. దర్భలపై మాత్రమే నేను దాన్ని సమర్పిస్తాను. దాన్ని పితృదేవతలు స్వీకరించి అమృతరూపంలో వారు నీకు అందచేస్తారు అన్నాడు.'' మనం సమర్పించే పిండాలు అన్నంరూపంలో వుంటాయి. కాని దేవతల ఆహారం అమృతం. కనుక పితృదేవతలు అన్నరూపంలో వున్న పిండాల్ని దేవతలకు అవసరమైన అమృతరూపంలో అందజేస్తారు. దానితో మన పూర్వీకులు తృప్తిచెంది వారి ఆశీస్సులను మనపై కురిపిస్తారు. మన పూర్వీకులకు పిండ ప్రదానం చేసేటప్పుడు మనం ఇలా అంటాం.

''ఈ పిండంతో తృప్తులయి మాకు సౌఖ్యాలు ప్రసాదించండి.''

''శ్రద్ధయా దీయతేతి శ్రాద్ధ'' అని శ్రాద్ధ శబ్దాని కర్థం. దేన్నైతే శ్రద్ధతో, సమర్పిస్తామో అదే శ్రాద్ధం. కనుక శ్రాద్ధకర్మను భక్తి విశ్వాసాలతో నిర్వర్తించాలి. ప్రస్తుత కాలంలో శ్రాద్ధకర్మ రోజున పురోహితుణ్ణి, భోక్తలని దక్షిణతో బాగా తృప్తిపరుస్తూ అంతా సవ్యంగా ముగిసిందని చాలమంది అభిప్రాయపడతారు. కాని అది సవ్యమైంది కాదు. మనకెన్ని ఇబ్బందులున్నా మనం యథావిధిగా శ్రద్ధతో మన పూర్వీకుల సాంవత్సరిక క్రతువును నిర్వర్తించాలి.

బదరీనాథయాత్రలో బ్రహ్మకపాలం వద్ద పిండప్రదానం చేస్తే తర్వాత వారి జీవితంలో శ్రాద్ధకర్మ చేయనవసరం లేదని కొందరు సూచిస్తారు. అలాగే గయలో అక్షయవటం వద్ద పిండప్రదానం చేస్తే తర్వాత జీవితంలో శ్రాద్ధకర్మల ఆవశ్యకత లేదని తలుస్తారు. ఇది సరియైన తలంపుకాదు. వ్యక్తి దేనినైనా మానవచ్చు, కాని తన పూర్వీకులకొరకు చేసే శ్రాద్ధకర్మలను మానరాదు. దేవతలకు ఆరాధన చేయనందువల్ల, పూర్వీకుల శ్రాద్ధకర్మల్ని నిర్వర్తించకపోవటం వల్ల, చాల కుటుంబాలు యీరోజు కష్టాలకు గురౌతున్నాయి. కొందరు దైవపూజమాత్రం నిర్వర్తించినా వారిబాధలు తప్పటంలేదు. కనుక దేవతా రాధనతోబాటు పితృకార్యాలు కూడ ప్రతివ్యక్తి శ్రద్ధాభక్తులతో నిర్వహించాలి.

బ్రహ్మకపాలంలోను, అక్షయవటంవద్ద పిండప్రదానం చేయటం ఒకవిశేషమైన కర్మమాత్రమే. అంతేకాని అది నిర్వర్తించి నందువల్ల వ్యక్తికి తాను విధిగా చేయాల్సిన సాంవత్సరిక శ్రాద్ధకర్మలనుండి మినహాయింపు లభిస్తుందని కాదు. కొన్ని సందర్బాల్లో ఒకదాని గొప్పతనాన్ని ఎక్కువగా చెప్పడానికి మరొకదానిని కొంచెం తగ్గించి చెప్పవచ్చు. ఉదాహరణకీ విషయంచూడండి కాశీని గురించి ఇలాచెప్పబడింది.

శ్లో|| అన్యక్షేత్రే కృతం పాపం పుణ్యక్షేత్రే వినశ్యతి |

పుణ్యక్షేత్రే కృతం పాపం వారాణస్యాం వినశ్యతి ||

B»R½LRixqósÍØÍýÜ[ ¿Á[zqsƒ«s FyFyÌÁ¬dsõ xmsoßáùQZOP[QQú»yÍýÜ[ x¤¦¦¦LjiLixms‡Á²R…»yLiVV. xmsoßáùQZOP[QQú»yÍýÜ[

చేసిన పాపాలన్నిటికి కాశీక్షేత్రంలో నిష్కృతి లభిస్తుంది. అంటే మనం యథేచ్ఛగా పాపాలను చేసి వాటి పరిహారం కొరకు కాశీవెళ్లి ప్రక్షాళనం చేసికోవచ్చని కాదు దీనియర్థం. కాశీగొప్పతనం చెప్పడాని కిలా చెప్పారు. అదేవిధంగా అక్షయవటం వద్ద, బ్రహ్మకపాలం వద్ద పిండప్రదానం చేసి శ్రాద్ధకర్మల్ని చేయటం నిలిపివేయకూడదు. ఎవరైనా పైవిధంగా శ్రాద్ధకర్మల్ని మానియుంటే మరల వారందరూ వాటిని ప్రతిసంవత్సరం యథావిధిగా నిర్వర్తించాలని మా ఆదేశం.

ఒక వ్యక్తికి ఎక్కువ మంది మగసంతానం వుంటే వారిలో ఏ ఒక్కరైనా గయవెళ్లి అక్షయవటం వద్ద పిండప్రదానం చేసే అవకాశం వుంటుందని మన పూర్వుల ఆలోచన -

''ఏష్టవ్యా బహవః పుత్రాః యేకేపి గయాంప్రజేత్‌ ||''

ª«sLiaSÕ³Áª«sXµôðj…¬s N][LRiÈÁLiÍÜ[¬s ª«sVVÆÜ[ù®µô…[aRPLi NRPW²R… @Li»R½ª«sVLiµj…ÍÜ[ INRP NRPVª«sWLRiV\®²…ƒy

అక్షయవటం వెళ్లి అక్కడ పిండప్రదానం చేయగల్గుతాడనే కాని మన వృద్ధాప్యంలో వారు మనల్ని పోషిస్తారని కాదు. పెద్దవారమైన తర్వాత మనల్ని పోషిస్తారనే విశ్వాసంతోనే మన పిల్లలకు మనం ఈ రోజు విద్యాబుద్ధులు నేర్పుతాం. అలాగే మన మరణానంతరం కూడ వారు మనల్ని పోషిస్తారు. మనం పితృకార్యాల్ని సవ్యంగా నిర్వర్తించనందువల్లనే నీటి ఎద్దడితో కరువుకాటకాలతో పడరాని ఇక్కట్లు పడుతున్నాం. మన పితృకార్యాలు శ్రద్ధతో ఆచరిస్తే, ఏ ప్రభుత్వం పదవిలోవున్నా మనకు సకాలంలో వర్షాలు లభిస్తాయి.

ఈ సందర్భంలో మీకు మహాభారతంలోని ఒక ఆసక్తి కరమైన కథ చెప్తాను. అవివాహితుడైన బ్రహ్మచారి యొకడు. తపస్సు కొరకు అడవికి వెళ్లాడు. అతని తల్లిదండ్రులు కతడొకడే కొడుకు గనుక, అతడు అవివాహితుడుగానే వుండటం వల్ల అతని వంశం అభివృద్ధిచెందే అవకాశం మృగ్యమవటంవల్ల పితృదేవతలు బాధలకు గురియై అశాంతితో వున్నారు. ఒక రోజున అతడు తపస్సు కొనసాగిస్తుండగా అస్థిపంజర ఆకృతిలో దయ్యాలు కొన్ని దర్శనమిచ్చాయి. యువకుడు కళ్లుతెరచి చూచి యా యాకృతులెవరో తెలియని అయోమయస్థితిలో మీరెవరని వారిని ప్రశ్నించాడు. ''మేమెవరిమో నీవెరుంగవా ? మేము నీ పితృదేవతలం, నీపూర్వీకులం. మాకు పిండప్రదానాలు లేనికారణంగా ఆకలితో అలమటించి పోతున్నాం. నీవు పెండ్లికి విముఖుడవై యున్నావుగనుక వంశాభివృద్ధి నిలచిపోయింది. ఇప్పుడు మాకు పిండప్రదానం లేదుసరికదా ముందుకూడ పితృకార్యాలు చేయటానికి ఎవరూ వుండరు. నీవు వివాహితుడవై సంతానాన్ని కనకపోతే మాపరిస్థతి మరింత క్షీణదశకు చేరగలదు.'' అని సమాధాన మిచ్చారు. వారి మాటలాలకించి బ్రహ్మచారి పెండ్లిచేసికొని పుత్రసంతానాన్ని పొందుటకు సుముఖుడైనాడు. అలా పెండ్లిచేసికొని పుత్రులనుకని కొంతకాలం గడచిన తర్వాత తపమాచరించటానికి మరల అడవికి వెళ్లాడు. వ్యక్తి బహుసంతానవంతుడైతే పితృకార్యాలకు, పిండప్రదానాలకు అంతరాయం కల్గదు గనుక పితృదేవతలు సంతృప్తులై మనకు శుభాల్నిస్తారనేదే దీని సారాంశం.

మరుజన్మలో సూక్ష్మశరీరం సుఖంగా వుండాలంటే ఈ జన్మలో శ్రాద్ధకర్మలు, పితృకార్యాలు శ్రద్ధతో, భక్తి విశ్వాసాలతో నిర్వహింపబడాలి.

సూక్ష్మశరీరం విషయంలో మనం జాగ్రత్తవహిస్తే, స్థూలశరీరం యొక్క కార్యకలాపాలు యధావిధిగా కొనసాగుతాయి. అప్పుడే మన జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనోప్రాణాలు బ్రహ్మపదార్థంలో అంతర్గతమై మనకు దివ్యానందానుభూతి లభిస్తుంది.

బ్రహ్మసత్యం, జగన్మిధ్య అంటాంకదా, మరి శ్రాద్ధకర్మల ఆవశ్యకత ఏమిటని ప్రశ్నించవచ్చు. స్వప్నావస్థలో కలలు కనేసమయంలో కలలో చూచేవన్నీ యథార్థాలే. కాని నిద్ర మేల్కొనిన తర్వాత తన కల అంతా అసత్యమని విశదమౌతుంది. అలాగే వ్యక్తికి మోక్షప్రాప్తికల్గి బ్రహ్మజ్ఞానం కల్గిన తర్వాత అతని కొరకు యీ జగత్తు అంతా మిధ్యయే¸°తుంది. ఆ స్థితి లభించే వరకూ, దృశ్యప్రపంచమంతా సత్యమై భాసిస్తుంది. కనుక వ్యక్తి పూజాది కార్యక్రమాలు, దేవకార్యాలు, పితృకార్యాలు శ్రాద్ధకర్మలు యథావిధిగా ఆచరించవలసినదే. కాని బ్రహ్మజ్ఞానియై, ఆ తత్వంలో అంతర్గతుడైనప్పుడు, నిజమైన జ్ఞానిగా పరిణమిస్తాడు. అతనికి కర్మల అవసరం లేదు.

సూక్ష్మశరీరాన్ని స్వస్థతలో నుంచాలంటే మనం శ్రాద్ధాదులను, దేవక్రియలను, పితృకార్యాలను, అగ్ని కార్యాలను నిర్వర్తించాల్సిందే. వీటితోబాటు దైవరాధన, పూజావిధులు భక్తితో నిర్వహిస్తే మనకు సర్వసౌఖ్యాలు, సంపదలు సమకూరుతాయి.

Sri Jayendravani    Chapters    Last Page