Sri Jayendravani    Chapters    Last Page

37. స్మృతులు - ధర్మశాస్త్రాలు

®ªs[µyÌÁNRPV @ƒ«sLi»R½\®ªsVƒ«s aSÅÁÌÁVƒyõLiVV. (""@ƒ«sLi»y\®ªsaSÆØM''). NRPÖÁ¸R…VVgRiLiÍÜ[ ÒÁ„sxqsVòƒ«sõ ª«sVƒ«sLiµR…Lji r¢NRPLRiùLi N]LRiNRPV ®ªs[µR…ªyùxqsV²R…V µy*xmsLRi¸R…VVgSLi»R½LiÍÜ[ ®ªs[µyÖÁõ ƒyÌæÁV ˳ØgSÌÁVgS „s˳ÏÁÑÁLiÀÁ ªyÉÓÁ¬s ª«sVLRiÌÁ DxmsaSÅÁÌÁVgS NRPW²R… LRiWF~Liµj…Li¿yLRiV. ‡ÁVVlgi[*µR…Li, ¸R…VÇÁÙlLi[*µR…Li, ryª«sV®ªs[µR…Li, @µ³R…LRi*ßá ®ªs[µR…Li @®ƒs[„s ®ªs[µyÌÁV. DxmsaSÅÁÌÁNRPV xqsLiz¤¦¦¦»R½ÌÁ¬s }msLRiV.

ఋగ్వేదం 21 శాఖలుగాను, యజుర్వేదం 101 శాఖలుగాను, సామవేదం 1000 శాఖలుగాను, అధర్వణవేదం 9 శాఖలుగాను విభజింపబడ్డాయ. దురదృష్టమేమంటే వాటిలో చాలశాఖలు అంతర్థానమైనాయి. పదిశాఖలు మాత్రమే ప్రచారంలో వున్నట్లు తెలుస్తుంది. ఋగ్వేదంలో శాకలశాఖ అనే ఒకశాఖ యజుర్వేదంలో తైత్తిరీయం, మైత్రాయణీయం, కాణ్వ, మధ్యందిన, అనే నాల్గుశాఖలు; సామవేదంలో కౌథూమ, జైమిని, రాణాయనీయ అనే మూడు శాఖలు; అధర్వవేదంలో శౌనక, పిప్పలాద అనే రెండు శాఖలు లభిస్తున్నాయి.

ఈ వేదశాఖల క్షయాన్ని అరికట్టడానికి కొన్ని సంస్థల ఆధ్వర్యంలో వేదసదస్సులు అప్పుడప్పుడు నిర్వహింపబడటం ద్వారా కృషి జరుగుతోంది.

ప్రతి వేదంలో సంహిత, బ్రాహ్మణము, ఉపనిషత్తు అనే మూడు భాగాలుఉంటాయి. సంహితలు అగ్నిదేవుని ఉపాసనను, యజ్ఞయాగాది క్రతువులు నిర్వహించే వివిధ విధానాల్ని వివరిస్తాయి. ఆ సందర్భాల్లో పఠించే మంత్రాల్ని గురించి కూడ అవి వివరిస్తాయి. సంహితలలో వివరింపబడ్డ క్రతువుల్ని జరుపవలసిన విధానాన్ని బ్రాహ్మణాలు ఆమూలాగ్రం విశదీకరిస్తాయి. ఉపనిషత్తులు పరమాత్ముని విశ్వవ్యాపకత్వాన్ని గురించి, భగవత్సాక్షాత్కారం లభించటానికి అవలంబించాల్సిన మార్గాలను, పరమాత్మను విగ్రహారాధన ద్వారా పూజించే పద్ధతులను కూడ ఉద్ఘాటిస్తాయి.

మన సౌకర్యం కొరకు వేదవ్యాసుడు శ్రమించి వేదాల్ని ఇన్ని విభాగాలుగ చేసిన మానవులకు వేదప్రయుక్తమైన ధర్మ సూక్ష్మాల్ని అవగాహన చేసికోవటం, వాటిననుసరించి కర్మల్ని నిర్వర్తించటం కష్టసాధ్యమౌతుంది. అంతేగాక వేదోక్తమైన విషయాల భావాల్ని గ్రహించటం కూడ దుస్సాధ్యమే. అందుచేత వేదసారాన్ని సులభగ్రాహ్యం చేయటానికి మనం ఏయే సమయాల్లో ఏ యే కర్మలు ఎలాచేయాలో వివరించటానికి మహర్షులు ధర్మశాస్త్రాల్ని లేక స్మృతుల్ని రచించి మన ముందుంచారు.

స్మృతి అనే శబ్దానికి అర్థం జ్ఞాపకం. సాధారణంగా 'అపస్మృతి'అనే పదంతో మనందరకు పరిచయం వుంది. అపస్మృతి అంటే మరుపు అని అర్థం. అది ఒక రోగం కాదు. పూర్తిగా జ్ఞాపకశక్తి లోపించుటకు అపస్మృతి అంటాం.

19)

మనువు, యాజ్ఞవల్క్యుడు, పరాశరుడు మొదలైన మహర్షులు స్మృతులను రచించారు. వానిలో పదునెనిమిది మాత్రం చాల ముఖ్యమైనవి. వాటిని రచించిన మహర్షులు :

1. మనువు 2. యాజ్ఞవల్క్యుడు 3. అత్రి 4. విష్ణువు 5. హారీతుడు 6. ఉశనసుడు 7. ఆంగీరసుడు 8. యముడు 9. కాత్యాయనుడు 10. బృహస్పతి 11. పరాశరుడు 12. వ్యాసుడు 13. దక్షుడు 14. గౌతముడు 15. వసిష్ఠుడు 16. నారదుడు 17. భృగువు 18. శంఖుడు

తమ ఘోరతపశ్శక్తి ద్వారా సాధించిన ప్రత్యేక మహిమ వలన మహర్షులు వేదస్వనము లను గ్రహించి శబ్దోచ్చారణ ద్వారా మనవరకు కూడ వాటిని అందీయగల్గారు. ఈ క్రింది వాక్యం చూడండి.

''శృతిం పశ్యంతి మునయః | సంస్కారజన్యం జ్ఞానం స్మృతి ః ||

®ªs[µyÍýÜ[¬s µ³R…LRiøxqsWú»yÖÁõ, xqs»yùÖÁõ xqsøQX¼½NTP ¾»½¿RÁVèN]¬s ªyÉÓÁ¬s xqsøQX»R½VÌÁ LRiWxmsLiÍÜ[ úªyaSLRiV.

స్మృతి అనే శబ్దం మూడు విషయాలపై ఆధారపడి ఉంది.

1. అనుభవం 2. స్మృతి 3. అతీంద్రయత్వం. ప్రస్తుతం అలాంటి అనుభవం లేకున్నా, పాత అనుభవాన్ని స్మృతిపథంలోకి తెచ్చుకొనుటనే 'అనుభవం' అంటారు. గతంలో సంభవించిన అనుభవాన్ని మరల అనుభవించిన తర్వాత ఆ అనుభవాన్ని జ్ఞప్తికి తెచ్చుకొనుటనే 'అతీంద్రియత్వం అంటారు.

''సంస్కారజన్యం జ్ఞానంస్మృతిః'' | సంస్కారాలలోంచి జనించిన జ్ఞానాన్నే స్మృతి అంటారు.

ఒక్కొక్కప్పుడు ప్రజలు నావద్దకు వచ్చి ''కాలం మారుతోంది గనుక మన శాస్త్రాలు కూడ కాలానుగుణంగా మారే అవసరాలను బట్టి మారవలదా ?'' అని ప్రశ్నిస్తారు. ''నీవు గొప్ప మఠాధిపతివి. నీవొక మహర్షితో సమానమైన వాడివి. అధునాతన ప్రపంచావసరాలనుబట్టి ధర్మశాస్త్రాల్ని మార్చలేవా ?'' అని కూడ అడుగుతారు. ''మార్పుజేసే హక్కు మనకు లేదు. మనం స్మృతులను విశ్వసిస్తాం. ఎందువల్లనంటే అవి మన సౌలభ్యం కొరకు మహర్షులు రాశారని కాదు. మహర్షులు వేదాలను విని అర్థంచేసుకొని ఆ స్మృతులలో వ్రాసి యుంచారు గనుక వాటిని నమ్ముతాం. వేదాల్లో వున్న విషయాలనే మహర్షులు మనకు చెప్పారు. వేదాలు ఎవరిచేతను వ్రాయబడినవి కావు. అంతేగాక అవి శాశ్వతమైనవి, ఎవరిచేత మార్పుచేయబడనివి. అట్లే స్మృతులు కూడ. కాళిదాసు రఘువంశంలో ఇలా అంటాడు.

శ్లో|| తస్యా ః ఖురన్యాస పవిత్రపాంసుం

అపాంసులానాం ధురి కీర్తనీయా |

మార్గం మనుష్యేశ్వర ధర్మపత్నీ

శ్రతేరివార్థం స్మృతిరన్వగచ్ఛత్‌ ||

µj…ÖdÁxmso¬s ˳ØLRiùQ\¹¸…Vƒ«s xqsVµR…OTPQßØ®µ…[„s ƒ«sLiµj…¬ds®µ³…[ƒ«sVª«so ¹¸…VVNRPä @²R…VgRiVÇزR…ÌÁÍÜ[ ®ªsÎýÏÁ§¿RÁVƒ«sõ µj…ÖdÁxmso¬s @²R…VgRiVÌÁ ƒ«sƒ«sVxqsLjiLiÀÁ ®ªsÎýÏÁ§¿RÁVƒ«sõµj…. @µj… xqsøQX»R½VÌÁV ®ªs[µy¬sõ @ƒ«sVxqsLjiLiÀÁ ƒ«sÈýÁVƒ«sõµj….

వేదాలుగాని, స్మృతులుగాని కొన్ని ఆపదలందు అనుసరించే ధర్మాల్ని కూడ నిర్ణయించాయి. అసాధారణమైన అగత్యమైన విషయాలకు వర్తించే విధంగా అవి చాల మినహాయింపులను సమకూర్చినాయి. అలాంటి సందర్భాల్లో ధర్మాన్ని కొద్ది సవరణలతో అనుసరించవచ్చు. కాని స్మృతులను గాని, ధర్మశాస్త్రాల్నిగాని ఈ ప్రయోజనం సాధించటానికై మొత్తం మార్చటానికి అధికారం యెవరికిని లేదు.

స్మృతుల్లో సాధారణ మానవుడు కూడ అవగాహన చేసుకునే విధంగా వాక్యాలుగాని, శ్లోకాలుగాని వుంటాయి. ఏ యే సందర్భాల్లో ఏయే ఆపద్ధర్మాలు అమలు చేయవచ్చునో కూడ అవి తెల్పుతాయి.

ఉదాహరణకు :

శ్లో|| ''సత్యం బ్రూయాత్‌ ప్రియం బ్రూయాత్‌

న బ్రూయాత్‌ సత్యమప్రియం

ప్రియం చాపి నానృతం బ్రూయాత్‌

ఏష ధర్మ స్సనాతనః ||''

µk…¬s úxmsNSLRiLi ª«sùQQNTPò úzms¸R…V\®ªsVƒ«s xqs»yù®ƒs[õ FsÌýÁxmsöV²R…V ª«sWÉýزyÖÁ. @úzms¸R…V\®ªsVƒ«s xqs»yù¬sõ Fsƒ«sõ²R…W ª«sWÉýزR…NRPW²R…µR…V. „sxtsQ¸R…VLi @úzms¸R…V\®ªsVƒ«s xqsLiµR…LS÷éÍýÜ[ ª«s°ƒ«s®ªs[V úZaP[¸R…VxqsäLRiLi. ª«sVƒ«sLi ¿Á}msö xqs»R½ùLi xmsÌÁVª«soLRiNRPV ÍØ˳ÏÁµy¸R…VNRPLigS DLi²yÖÁ. @ÍØNSƒ«sxmsöV²R…V ª«sVƒ«sNRPV ª«s°ƒ«s®ªs[V aRPLRißáùLi. AxmsµR… xqsª«sV¸R…WÍýÜ[ µ³R…LSø¬sõ FyÉÓÁLi¿RÁª«sÌÁzqsƒ«s „sxtsQ¸R…VLiÍÜ[ „sVƒ«s¥¦¦¦LiVVLixmsoƒ«sNRPV @ƒ«sVª«sV¼½ DLiµj…. NS¬s xqsøQX»R½VÌÁƒ«sV NS¬s, µ³R…LRiøaSryòQûÌÁƒ«sV gS¬s xqsLixmspLñRiLigS ª«sVƒ«sNRPV @ƒ«sVNRPWÌÁLigS ª«sWLRiVèN][ÉجsNTP @µ³j…NSLRiLi ÛÍÁ[µR…V. ª«sVƒ«sLi NýTPQxtísQxmsLjizqós¼½ ®ƒsµR…VL]äLiÈÁVƒ«sõxmsöV²R…V @úzms¸R…V\®ªsVƒ«s INRP ¬sÇجsõ ¿Áxmsöª«sÌÁzqsª«s}qsò DFy¸R…VLi»][ A xmsLjizqós¼½ƒ«sVLi²T… ‡Á¸R…VÈÁxms²yÖÁ.

స్మృతులుగాని, ధర్మశాస్త్రాలుగాని వేదాల్ని అనుసరిస్తాయి గనుక, అనాదిగా మనకు సంక్రమించిన ఒకే ఒక్క మతం హిందూ మతంవలెనే, మనం నిత్యం అనుసరించాల్సిన ధర్మం ఒక్కటే అవుతుంది.

మనం ఆచరించాల్సిన కర్మల విషయంలో వేదాలు ధర్మసూక్ష్మాల్ని నిర్దేశించాయి. కొంతమంది ఆజ్ఞరూపంలో వారిని ఆదేశిస్తే తప్ప ఏ పని చేయరు. తండ్రి, కొడుకులను ఆజ్ఞాపించి వారిచే పనులను నిర్వర్తింపచేసిన విధంగానే, వేదాలు కొన్ని ధర్మాలను ఆజ్ఞలరూపంలో యిచ్చి మనచేత కొన్ని కర్మలను చేయిస్తాయి.

స్మృతులు మాతృదేవత వంటివి. అవి కూడ అలాంటి ఆజ్ఞలనే మనకు నియమిస్తాయి. కాని తండ్రి ఆదేశాల్లాగ కఠినత్వంగాని, నిర్బంధతగాని యుండదు. అవి ప్రియవచనాల్తో ఇది నీకు మంచిది, నీ యోగక్షేమం కొరకే నీవు దీనిని తప్పక ఆచరించు అని ప్రబోధిస్తాయి.

పురాణాలు భార్యవలె అనునయించి విషయాలు చెప్తాయి. ఆ నేపథ్యంలో వాటిని 'కాంతా సంహితా'అంటారు. భార్య భర్తతో ''ఇది నీ కెంతో శ్రేయస్కరం, దీనివల్ల మన కుటుంబం యొక్క గౌరవ ప్రతిపత్తులు ఇనుమడిస్తాయి; ఫలానివారి కథ నీవువినలేదా ?'' అంటూ ప్రియవచనాల్తో చెప్పవలసిన విషయం చెపుతుంది. భర్త వెంటనే భార్య చెప్పిన పనులన్నీ తు,చ తప్పకుండా ఆచరిస్తాడు. వేదాలుగాని, పురాణాలుగాని, స్మృతులుగాని అవి ఆదేశించే ప్రధాన ధర్మసూక్ష్మం ఒక్కటే. ఐతే దానిని బోధించే విధానంలోను నిర్ధారణతలోను వాటి మధ్య తేడా వుంటుంది.

నిజానికి స్మృతులలో చర్చించని విషయమంటూ ఏదీ వుండదు. మానవులు చేయవలసిన కర్మల్ని గురించి అవి వివరిస్తాయి. ఏ కర్మల ఫలితంగా ఇప్పుడున్న జన్మ లభించిందో సూచిస్తాయి. మానవుడు జన్మించింది మొదలు మరణం వరకు నిర్వర్తించవలసిన కర్మలను గురించి, ఏ యే సద్గుణాల్ని అలవరచుకొని, పెంపొందించు కోవాలో, ఏ యే దుర్గుణాలకు దూరంగా వుండి జీవించాలో దాన్ని గురించి కూడ అవి బోధిస్తాయి. అంతేగాక వివిధ వృత్తులలో వున్న వ్యక్తుల విధులను, దేశ రాజకీయ విధానాలను, వాణిజ్య వ్యాపారాలకు సంబంధించిన నియమ నిబంధనలను స్మృతులు విశదీకరిస్తాయి. ఇంకా వ్యక్తి మరణానంతరం చేయవలసిన క్రియలు, మరణించిన తర్వాత వ్యక్తి యొక్క స్థితి, పునర్జన్మ లేకుండుటకై చేయవలసిన కృషి-వీటన్నింటిని గురించిన వివరణ కూడ మనకు స్మృతులయందు లభిస్తుంది.

స్మృతులు గాక మహర్షులు స్మృతులను పోలిన ఇతర ధర్మఅంశాల్ని కూడ ఏర్పరిచారు. అవి సూత్రగ్రంథాల్లో లభిస్తాయి. వాటిలో ముఖ్యమైన సూత్రాలు :

1) కల్పసూత్రాలు అనగా ఆపస్తంబ సూత్రాలు, అశ్వలాయన సూత్రాలు మొదలైనవి. 2) శ్రౌత సూత్రాలు 3) ధర్మ సూత్రాలు

సూత్రశబ్దానికి అర్థం సూక్తి అంటే ఒక సత్యాన్ని సూక్ష్మంగా వివరించే ఒక వాక్యంగాని, పదసముచ్చయంగాని (''సూచనాత్‌-ఇతి సూత్రం''). ఈ సూత్రసముదాయంలో వేదసారం ఇమిడి ఉంటుంది.

స్మృతులు వ్యక్తి యొక్క జీవితకాలంలోని వివిధ దశలకు అనగా బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాసాశ్రమం మొదలైన వానికి, ఆయాదశలలో అనుసరించవలసిన ధర్మసూత్రాల్ని నిర్దేశిస్తాయి. కల్పసూత్రాలు కర్మలను నిర్వహించటం విషయంలో అవసరమైన వివరాలను గురించి విశదీకరిస్తాయి. ఈ కల్పసూత్రాలు వేదముల యొక్క ఆరు అంగాల్లోను ఒక అంగంగా పరిగణింపబడతాయి.

గృహస్థు తనగృహంలో నిర్వహించవలసిన విధులను గృహ్యసూత్రాలు నిర్ణయిస్తాయి. ప్రజామందిరాల్లో ప్రజల సహకారంతో సమాజక్షేమం కొరకు నిర్వహింపబడే ప్రజాసంబంధిత కార్యాలు, క్రతువులను గురించి శ్రౌత సూత్రాలు వివరిస్తాయి.

వర్ణాశ్రమ ధర్మాలననుసరించి వ్యక్తి చేయవలసిన కర్మకాండల వివరణ ధర్మసూత్రాలిస్తాయి. వ్యక్తికి వుండవలసిన ఆత్మగుణాలను, అతడు ఆచరించవలసిన ధార్మిక కర్మలను, అతడు విసర్జించవలసిన అధార్మిక కర్మలను విశదీకరిస్తాయి. వ్యక్తి వ్యక్తిగా తాననుసరించవలసిన ధర్మసూక్ష్మాలను సామాజిక జీవనంలో అతడవలంబించవలసిన నైతిక బాధ్యతలను కూడ ఇవి ప్రకటిస్తాయి.

ఇంకా మనం పరిగణనలోకి తీసుకోవాల్సిన ఇతర ముఖ్యసూత్రాలు కూడా వున్నాయి. అవి పతంజలి యోగసూత్రాలు, గౌతముని న్యాయసూత్రాలు, కణాదుని వైశేషిక సూత్రాలు, జైమిని యొక్క మీమాంస సూత్రాలు, ఆఖరుగా18 పురాణాలు రచించిన, నారాయణావతారుడైన వేదవ్యాస ప్రణీతమైన బ్రహ్మసూత్రాలు. పాణిని యొక్క వ్యాకరణ సూత్రాలు కూడ గణనీయమైనవే.

పతంజలి యొక్క యోగసూత్రాలు వ్యక్తి యొక్క ఆరోగ్య శాస్త్రానికి సంబంధించినవి. ఉచ్ఛ్వాస నిశ్వాసముల నియంత్రణ, విస్తరణ, మనసును నిరోధించి యోగనిష్ఠతో సమాధి స్థితిని పొందుటకు ఆచరించే ప్రాణాయామ ప్రక్రియకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడ ఈ యోగసూత్రాలు చెప్తాయి.

న్యాయసూత్రాలు పరమాత్మతత్వం యొక్క నిజస్థితిని అవగాహన చేసికొనుటకు తోడ్పడుతాయి. ప్రపంచం, ప్రాపంచిక విషయాలు, వీటిని తార్కికదృష్టితో యుక్తి యుక్తంగా సవివరమైన విశ్లేషణ చేసిన తర్వాతనే మనకా అవగాహన ఏర్పడుతుంది. కాణాదుడు, అక్షపాదుడు, ఉదయనాచార్యుడు, ఇంకా కొందరు న్యాయసూత్రాలపై రచనలు చేశారు.

వేదాల్లో వున్న విషయాలను విశ్లేషించి, వాటి సారాన్ని, లక్ష్యాన్ని నిర్ధారణ చేశేవే మీమాంస సూత్రాలు. ఉపనిషత్తులలోని భిన్నభిన్నమైన సత్యాలను బ్రహ్మ సూత్రాలు ప్రకాశింపజేసి సమీకరణ విధానంలో నిర్ధారిస్తాయి. ఉపనిషత్తులలోని సత్యాలు పరమాత్మ తత్వాన్ని గురించినవే.

పాణిని వ్యాకరణ సూత్రాలు శబ్దముల వర్గీకరణ, వాటి ఉచ్చారణ, భాషాస్వచ్ఛతను భద్రపరిచే లక్ష్యంతో చేసిన తత్సంబంధిత నియమావళిని ప్రకటిస్తాయి.

వేదాలు, వేదశాఖలుగాక ఆరువేదాంగాలున్నాయి. అవి వేద పురుషునికి అంగములవలె వ్యవహరిస్తూ వేదాలు కాలగతిలో భ్రష్టత్వాన్ని చవి చూడకుండా, వాటి స్వరంయొక్క, ఉచ్చారణ యొక్క విషయముల యొక్క పవిత్రతను సురక్షితంగా నిలిపే బాధ్యతను వహిస్తున్నాయి. శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిషం, కల్పం ఇవే ఆరువేదాంగాలు. వేద స్వరాల యొక్క స్వచ్ఛతను రక్షించటంలో శిక్ష, వ్యాకరణ ప్రముఖ పాత్రను వహిస్తాయి. అవి వేదస్వరాల వర్గీకరణను గురించి, వాటి ఉత్పత్తిని గురించి, ఉచ్చారణను గురించి వివరిస్తాయి. అంతేగాక మంత్రాలు సవ్యంగా, సర్వశుద్ధితో చదివితే సత్ఫలితాలు, లేక అపనవ్యంగా, ఉచ్చారణలోపంతో చదివితే దుష్ఫలితాలు సమకూరుతాయని సూచిస్తాయి.

నిరుక్తం వేదశబ్దాలను గురించిన శబ్ధలక్షణశాస్త్రాన్ని పరిచయంచేస్తుంది. దీన్ని వేదపురుషుని యొక్క శ్రవణంద్రియాలుగా భావిస్తారు. ఇది వేదాల్లో తటస్థించే వేదశబ్దాల యొక్క అర్థాల్ని స్పష్టంగా చెపుతుంది. ఈ విషయాలు మామూలు వ్యావహారికంలో లభించవు. ఒకవేళ లభించినా సందర్భభేదాన్ని బట్టి అర్థభేదం, వివిధ రూపాల్లో మనం వాడటం లాంటివి తటస్థిస్తాయి. నిరుక్తం మీద అధిక ప్రాధాన్యతను సంతరించుకొన్నది యాస్కునియొక్క రచన.

వివిధములైన వేదమంత్రాల యొక్క ఛందోబద్ధతను నిరూపించేదే చంధస్సు. ఇది వేదాలకు ఆయువుపట్టు.

జ్యోతిషం వేదపురుషుని యొక్క నయనాలే. మానవ జీవితాలపై గ్రహాల, నక్షత్రాల ప్రభావాన్ని సూచించేదే జ్యోతిషం. జ్యోతిష సంహితలను రచించిన వారిలో ముఖ్యులు వరాహమిహిరుడు, గార్గ్యుడు, పరాశరుడు, నారదుడు మొదలైనవారు.

జ్యోతిషం మూడు స్కంధాలుగా ఉంది. వృక్షకాండములోని అతిక్రింది భాగం నుంచి మొలకెత్తే శాఖను స్కంధం అంటాం. మనకున్న మూడు స్కంధాలపేర్లు సిద్ధాంతస్కంధ, హోరాస్కంధ, సంహితస్కంధ.

సిద్ధాంత స్కంధంలో వ్యక్తగణితం, అవ్యక్తగణితం రెండూ వున్నాయి. వ్యక్తమంటే మన మెరిగినది, అవ్యక్తమంటే మన మెరుగనిది. నిత్య జీవితంలో మనం వ్యవహరించే అంకెలకు సంబంధించిన సాధారణ గణితాన్నే వ్యక్తగణితమంటాం. ప్రస్తుతం బీజగణితం అనే పేరుతో ఎ.ఎక్స్‌ (a, x) లాంటి ఊహా సంఖ్యలకు సంబంధించిన గణితమే అవ్యక్తిగణితం, క్షేత్రగణితం, త్రికోణమితి కూడ దానిలోని భాగాలే. వివిధ రూపాల్లో నిర్మితమయ్యే యజ్ఞవేదికలను గూర్చి చెప్పే సుల్బసూత్రాలు క్షేత్ర గణితాంశాల్ని, త్రికోణమితి అంశాల్ని విరివిగా కల్గియుంటాయి. సమీకరణశాస్త్రం సమీకరణ పరిష్కార విభాగాన్ని గూర్చి వివరిస్తుంది. సమీకరణ పరిష్కారాన్నే తెలిసిన దత్తవిషయం నుండి తెలియని దాన్ని తెలిసికునే విధానం అనికూడ అంటారు. ఈ సమీకరణం కూడ సిద్ధాంత స్కంధంలో ఒక భాగమే.

ఉపరితల జలప్రవాహం, భూగర్భ జలప్రవాహం మొదలైన అంశాలు, పరిమళద్రవ్యాల తయారీవిధానాలు, శిల్పశాస్త్ర సంబంధిత విషయాలు, శకునాల్ని గురించిన వివరాలు మొదలైన వాటిని విశదీకరించేదే సంహిత స్కంధం.

క్లుప్తంగా సమీకరించి చెప్పాలంటే సిద్ధాంతస్కంధం ఖగోళశాస్త్ర విషయాలు, గ్రహసంచారసంబంధిత విషయాలు చర్చిస్తుంది. వ్యక్తి జీవితంలో సంభవించే సుఖదుఃఖాల్ని గురించి హోరా-స్కంధం వివరిస్తుంది. మిగతా విషయాలన్నీ సంహిత-స్కంధలో పొందుపరచబడ్డాయి.

వివిధ కార్యకలాపాల్ని నిర్వహించటానికి శుభముహూర్త నిర్ణయం జ్యోతిషం నిర్థారిస్తుంది.

లోగడ చెప్పినట్లు సమాజక్షేమం కొరకు, వ్యక్తి శ్రేయస్సు కొరకు నిర్వర్తింపబడే కర్మలను గూర్చిన వివరణ కల్పసూత్రాల్లో లభిస్తుంది. కల్పసూత్రాలు విరివిగా రచింపబడ్డాయి. కృష్ణయజుర్వేదానికి ఆపస్తంబుడు, బోధాయనుడు, వైఖానసుడు, సత్యాషాఢ, భరద్వాజుడు, అగ్నివేశుడు కల్పసూత్రాల్ని రాశారు. ఋగ్వేదం కొరకు అశ్వలాయనుడు రచించాడు. శుక్లయజుర్వేదం కొరకు కాత్యాయనుడు, సామవేదానికి ద్రాహ్యాయనుడు గౌతమశాఖకు, జైమిని తలవాకార శాఖకు కల్పసూత్రాలు రచించారు.

మనకింకా మహర్షులు రచించిన ఆగమశాస్త్రాలు చాలా వున్నాయి. ఆగమాలు నాల్గు భాగాలుగా విభజింపబడ్డాయి. వాటినే చర్య, క్రియా, యోగ, జ్ఞానభాగాలు అంటారు. చర్యభాగం వ్యక్తి భగవంతుణ్ణి ఆరాధించే వివిధములైన మార్గాల్ని వివరిస్తుంది. క్రియావిభాగం ఆలయాల్లో విగ్రహాల ఏర్పాట్లు, వాటి ప్రతిష్ఠలు, దేవతారాధనలను గురించి విపులీకరిస్తుంది. యోగ విభాగం మాత్రం వ్యక్తి పరమాత్మునిపై మనసునిలిపి ధ్యాననిష్ఠతో ఆత్మతత్వంతో ఐక్యమయ్యే విధానాన్ని ప్రకటిస్తుంది. జ్ఞాన విభాగం ధ్యానానికి పరమావధిగా తాను అంతిమంగా పొందగల స్థితిని గూర్చి వివరిస్తుంది. క్లుప్తీకరించి చెపితే, ఆగమశాస్త్రాలు వివిధములైన ఉపాసన లేక ఆరాధనా విధానాల్ని విశదీకరిస్తాయి. మనకు ఇరవైయెనిమిది శైవఆగమాలు వున్నట్లు తెలుసు. వైష్ణవ ఆగమాల్లో పాంచరాత్ర ఆగమాలు, వైఖానస ఆగమాలు పేర్కొనదగినవి.

మన సమిష్టి జీవితంలో దేవాలయాలు ప్రముఖపాత్రను నిర్వహిస్తున్నాయి. వాటిని ఆశ్రయించుకొని పట్టణాలు, పల్లెలు వాటి చుట్టూ వృద్ధిపొందాయి. ఆ కారణంగా మనకు మార్గదర్శకంగా శిల్పశాస్త్రాలు కూడ వెలువడ్డాయి. వాటిలో ఆలయనిర్మాణ విషయాలు, పట్టణాలు, పల్లెలు రూపొందించే విధానాలు గృహనిర్మాణ సమాచారం, ఆలయాల్లో ప్రతిష్ఠించే విగ్రహాలు ఏ రీతిలో ఉండాలో, ఏరకమైన రాయి లేక లోహం విగ్రహాలకు ఉపయోగించాలో మొదలైన వివరాలన్నీ ప్రామాణికంగా సూచింపబడతాయి.

ఇవిగాక ప్రతివేదానికి ఉపవేదాలున్నాయి. ఉదాహరణకు ఋగ్వేదానికి ఉపవేదంగా ఆరోగ్యశాస్త్రాన్ని గూర్చి వివరించే ఆయుర్వేదం వుంది. అలాగే యజుర్వేదానికి ఉపవేదంగా దండోపాయాన్ని, విలువిద్యానైపుణ్యాన్ని గురించి చెప్పే ధనుర్వేదం విలసిల్లింది. సామవేదానికి సంగీత, నృత్య శాస్త్రాల్ని గురించి తెలిపే గాంధర్వం ఉపవేదంగా భాసిస్తుంది. అధర్వవేదానికి ఉపవేదంగా పరిపాలనా విధానాన్ని, రాజు తనప్రజలను పాలించునపుడు పాటించవలసిన పద్ధతులను సూచించే అర్థశాస్త్రం వుంది.

ఆ విధంగా మనమతంలో వేదాలు, ఉపనిషత్తులు గాక మనకు ఉపవేదాలు, పురాణాలు, స్మృతులు, ఇతిహాసాలు, ఇంకా భగవద్గీతలాంటి ఇతర మతగ్రంథాలు వున్నాయి. ఇవన్నీ మన నిత్యజీవితాన్ని క్రమపద్ధతిలో నడుపుతాయి. ప్రజల యోగ్యతలు, సామర్థ్యాలు హెచ్చుతగ్గులలో వుంటాయి గనుక వారి వారి కనుకూలమైన శాస్త్రాలు బహుసంఖ్యలో వున్నాయి. ఇతరమతాల్లో మాత్రం ఒక్కొక్క మతానికి-బైబిలు, కురాన్‌ వలె ఒక్కొక్క మత గ్రంథమే వుంటుంది. అలా మనహిందూ మతం తన సంపన్నమైన వారసత్వపు విలువలతో అనేక ప్రయోజనాలను కల్గివుంది.

కనుక ప్రతివ్యక్తి మన స్మృతులలో తెల్పిన ఆదేశాలను అనుసరించి, ధర్మాల్ని అవలంబించి తన నిత్యజీవితాన్ని సుఖమయం చేసుకోవాలి.

Sri Jayendravani    Chapters    Last Page