Sri Jayendravani    Chapters    Last Page

35. గీతాసందేశం

శ్లో|| ''వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం |

దేవకీపరమానందం కృష్ణం వందేజగద్గురుం ||

úxmsxmsLi¿RÁLiÍÜ[ ¿yÍØ ª«sV»yÌÁVƒyõLiVV. úxms¼½ ª«sV»y¬sNTP µy¬sNTP xqsLi‡ÁLiµ³j…LiÀÁƒ«s úxmsµ³yƒ«s aSxqsòQû úgRiLi´yÌÁVƒyõLiVV. ª«sVƒ«s úFyÀdÁƒ«s z¤¦¦¦LiµR…W ª«sV»y¬sNTP xqsLi‡ÁLiµ³j…LiÀÁƒ«sLi»R½ ª«sLRiNRPV ¿yÍØ úgRiLi´yÌÁVƒyõLiVV. ªyÉÓÁÍÜ[ LSª«sW¸R…VßáLi, ˳ØgRiª«s»R½Li, ª«sV¥¦¦¦Ë³ØLRi»R½Li úxmsª«sVVÅÁ\®ªsVƒ«s„s. LSª«sW¸R…VßáLi LSª«sVNRP´R…ƒ«sV, ˳ØgRiª«s»R½Li NRPXxtñsQÖdÁÌÁÖÁõ, A¸R…W ¸R…VVgRi µ³R…LSøÖÁõ ËÜ[µ³j…ryòLiVV. ª«sV¥¦¦¦Ë³ØLRi»R½Li N_LRiª«sFyLi²R…ª«soÌÁ NRP´R…ƒ«sV ÀÁú¼d½NRPLjixqsVòLiµj….

భగవద్గీత అంటే భగవంతునిచే గానం చేయబడినదని, లేక భగవంతునిచే బోధింపబడినదని అర్థం. నిజానికి కృష్ణభగవానుని నోటినుండి వెలువడిన దంతా భగవద్గీతే. యుద్ధారంభంలో అర్జునునకు చేసిన ఉపదేశ##మే భగవద్గీత అనటం అలవాటయి పోయినది.

యుద్ధం ముగిసిన తర్వాత శ్రీకృష్ణుడు అర్జునునకు ఈ బోధనలనే కొన్నింటిని మరల విశదీకరిస్తాడు. ఆ బోధల సంపుటిని 'అనుగీత' లేక'ఉత్తర గీత'అంటారు. గీత మన ప్రాచీన మతానికి ప్రామాణిక గ్రంథాలలో ఒకటి. గీతలో శ్రీకృష్ణభగవానుడు వ్యక్తి యొక్క అధికార భేదాల్ని, సామర్థ్యాన్ని దృష్టిలో వుంచుకొని అనేక ధర్మసూక్ష్మాల్ని ఆవిష్కరించాడు.

మామూలుగా ఉపదేశం ఒక ప్రశాంత వాతావరణంలో ఒక పెద్ద వృక్షం క్రింద గాని, నదీ తీరంలోగాని, లేక అరణ్యంలో గాని, ఒక ఆశ్రమంలో గాని ఒక గురువు ఉన్నత పీఠంపై సుఖంగా కూర్చుండి ఎదురుగా భక్తితో, ఏకాగ్రతతో శ్రద్ధాసక్తులతో నిలబడియున్న శిష్యునకు ఇస్తాడు.

కాని గీతాబోధన విషయంలో పై పరిస్థితులు తారు మారైనాయి. అర్జునుడు ఆయుధాల్ని ధరించి యుద్ధసన్నద్ధుడై ఇరుపక్షాల సైన్యం మధ్యలో ప్రశాంతత ఉండని చోట ఉండగా ఉపదేశం చేయబడిందంటే అది చాల విశేషమైన సంఘటనగా తలచాలి. భగవానుడు మాత్రమే అలాంటి ఉపదేశాన్ని ఈయటానికి సమర్థుడు; అర్జునుడు లాంటి మానవుడు మాత్రమే దాన్ని స్వీకరించి జీర్ణించు కోగలవాడు.

కృష్ణుడు రథం యొక్క క్రింది భాగంలో సారధిగా కూర్చొని యుంటాడు. అర్జునుడు ఉన్నత స్థానంలో ఆసీనుడై యుంటాడు. ఇక్కడ కూడ మామూలు క్రమానికి విరుద్ధంగానే ఉన్నది. శ్రీకృష్ణుని ఉపదేశాన్ని విన్న అర్జునుడు లోకంలో లాగే ధ్యానం కొరకు అడవికి వెళ్ళక స్వధర్మాన్ని నిర్వర్తించటం ఆరంభించాడు. అంటే యుద్ధానికి అంగీకరించని తాను ఇప్పుడు క్షత్రియ వీరునివలె సమరం చేసేందుకు పూనుకున్నాడు.

గీత మనకు మనం అనుసరించవలసిన ధర్మాల్ని గురించి, మన అంతిమ గమ్యాన్ని, దాన్ని చేరే విధానాల్ని గురించి వివరిస్తుంది.

మనకున్న చింతలను నివృత్తి చేయటమే గీత యొక్క ప్రథమ లక్ష్యం. అర్జునుడు వ్యాకులిత మనస్కుడై యుండి తన బంధువులను, గురువులను సంహరించటం కంటే బిచ్చమెత్తుకొని జీవించటం ఉచితమని భావించాడు.

శ్లో|| ''అశోచ్యాన్‌ అన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే |

గతాసూనగతాసూంశ్చ నాను శోచన్తి పండితాః ||

""¬dsª«so Fsª«sLji¬s gRiWLjiè µR…VMÐÁLi¿RÁNRPW²R…µ][ ªyLji¬s gRiWLjiè ÀÁLi¼½xqsVòƒyõª«so. Çì؃«sVÖdÁ„sµ³R…LigS ¿Á[¸R…VLRiV.'' @ƒ«sV¿RÁW @®ƒs[NRP µ³R…LSøÌÁƒ«sV ¬slLôi[bPLiÀÁƒ«s »R½µR…VxmsLji $NRPXxtñsv²R…V 18ª«s @µ³yù¸R…VLiÍÜ[ »R½Vµj… ¬sLñRi¸R…VLigS

శ్లో|| ''సర్వధర్మాన్‌ పరిత్యజ్య మామేకం శరణం ప్రజ |

అహం త్వాం సర్వపాపేభ్యో మోచయిష్యామి మాశుచః||''

""xqsLRi*ª«sVW ƒyNRPV „s²T…ÀÁ|msÈíÁV. ¬sƒ«sVõ ®ƒs[ƒ«sV @¬sõ „sµ³yÌÁ LRiOTPQxqsWò DLiÉ؃«sV. ®µ…[¬sNUP ¬dsª«so Ëص³R…xms²R… ƒ«sNRPäLRiÛÍÁ[µR…V''@LiÉزR…V. NRPƒ«sVNRP gki»R½ ¹¸…VVNRPä úxmsµ³yƒ«s xqsLi®µ…[aRPLi µR…VMÅÁ„s®ªsW¿RÁƒ«s®ªs[V. ª«sVƒ«s Ëص³R…ÌÁƒ«sV, ÀÁLi»R½ÌÁƒ«sV µR…WLRiLi ¿Á[xqsVN][ª«sÉجsNTP ª«sVƒ«s µ³R…LSø¬sõ, ª«sVƒ«s „sµ³j…¬s ¬sLRi*QQLjiòLi¿RÁ²R…®ªs[V @¬s ¿ÁFyö²R…V $NRPXxtñsv²R…V.

కృష్ణుని ఉపదేశం విన్న తర్వాత అర్జునుడు తన క్షత్రియ ధర్మాన్ని నిర్వర్తించాడు. స్వధర్మ నిర్వహణం వలన ఏ దుఃఖాలు ఉండవు. ఇదే గీత యొక్క ప్రత్యేక సందేశం.

గీత 18 భాగాలుగా విభజింపబడ్డది. ఒక్కొక్క భాగానికి అధ్యాయమనిపేరు. ప్రతి అధ్యాయంలోను శ్రీకృష్ణుడు అనేక ధర్మాల్ని వివరిస్తాడు. మొదటి అధ్యాయ ఆరంభంలో శ్రీకృష్ణుడు తాను చేయదలచిన ఉపదేశానికి అవసరమైన నేపథ్యాన్ని, ఏర్పాటును సమకూరుస్తాడు. శిష్యుడు కల్లోలిత మనస్కుడై యున్నప్పుడు అతని కలవరాన్ని నివృత్తి చేయటానికి గురూపదేశం అవసరం. శ్రీకృష్ణుడు తానే విజయునకు సారధియై రధాన్ని ముందుకు నడిపి యుద్ధ భూమిలో నిలబెట్టాడు. తన గురువులను, స్వజనాన్ని ఇరుపక్షాలలోని ప్రధాన వ్యక్తులను వీక్షించి అర్జునుడు గౌరవ సూచకంగా వందన సమర్పణం చేశాడు.

యుద్ధ భూమిలో సమావేశితులైన వీరులందరిని చూచి అర్జునుడు యుద్ధ ఫలితంగా ఆసన్నమయ్యే విధ్వంసాన్ని, కోట్లకొలది కుటుంబాలకు జరుగబోయే దుష్పరిణామాల్ని ఒక మారు ఊహించి చింతాక్రాంతు డౌతాడు. ''నా గురువుల్ని, ఆప్తులను నా చేతులమీదగానే తుదముట్టించాలి. ఎంత పాపం చుట్టు కుంటుంది ? జయం ఏ పక్షాన్ని వరిస్తుందో ఎవరూ చెప్పలేరు. మేమే విజయాన్ని సాధిస్తామనుకున్నను, కోట్ల కొలది ప్రజలు మారణహోమానికి గురియైన తర్వాత ఎవరికొరకీ రాజ్యాన్ని పరిపాలించాలి ? దానికంటే భిక్షుకుడుగా జీవించటం ఎంతో మేలు'' అని అర్జునుడు ఆయుధ విసర్జనం చేసి మిన్నక కూర్చున్నాడు.

అప్పుడు శ్రీకృష్ణుడు అతన్ని యుద్ధానికి ప్రేరేపిస్తూ 'నీవు విలువిద్యలో ఆరితేరినవాడవు. యుద్ధం నుండి విముఖుడవైతే ప్రజలు నిన్ను గూర్చి ఏమనుకుంటారు ? నీవొక పిరికిపందవలె సమరాన్ని నిరసిస్తున్నావనే అపకీర్తి నీకు ప్రాప్తించదా ? ఈ తరుణంలో ఈ రకమైన భీరుత్వాన్ని ప్రదర్శించటం ఉచితంకాదు' అన్నాడు. అర్జునుడు కొంతసేపు వాదించి శ్రీకృష్ణుని సమాధానములతో నిరుత్తరుడై భగవానుని పాదములపై బడి శరణు వేడుతూ ''నేను సంశయాత్మకుడను. నాకు కర్తవ్య బోధను చేయుము. నేను నీకు ప్రసన్నుడను. నన్ను నీవు శిష్యునిగా స్వీకరించి నేననుసరించవలసిన శ్రేయోమార్గాన్ని నిర్దేశించు''అని వేడుకొని భగవానుని పాదములను విడవక అక్కడే ఆసీనుడైనాడు.

అర్జునుని ప్రార్థనను విన్న శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వాడు. ఇంతకు ముందు వరకు అర్జునుడు శ్రీకృష్ణుని బంధువువలె ప్రవర్తించాడు. శిష్యుని లక్షణాలు ఆయన వద్ద కన్పించలేదు. కాని యిప్పుడు మాత్రమే అతడు భగవానునికి శరణాగతుడై శిష్యునిగా స్వీకరించమని, కర్తవ్యాన్ని బోధించమని కోరుతున్నాడు. శ్రీకృష్ణు డర్జునుని ఆవేదనను గ్రహించి, తన సలహాను అతడా సమయమున తప్పక పాటించగలడని నమ్మి ఆనందభరితుడైనాడు. అర్జునునకు ఉపదేశం ఆరంభించటానికి ఇది చాల ఉచితమైన సమయమని భావించి ఉపదేశాన్ని ఉపక్రమించాడు.

రెండవ అధ్యాయంలో శ్రీకృష్ణుడు సత్స్వరూపమైన, నిత్యమైన ఆత్మతత్వాన్ని గురించి విశదీకరించాడు. శరీరం నశ్వరమైందని, పుట్టుట, చచ్చుట యను లక్షణములు గలది గనుక దానిని గురించి దుఃఖింపరాదని బోధిస్తాడు. తర్వాత నిజమైన జ్ఞాని లేక స్థితప్రజ్ఞుని గురించి వర్ణిస్తాడు.

3వ అధ్యాయంలో కర్మ సిద్ధాంతాన్ని వివరిస్తాడు. ఫలాపేక్షరహితంగా కర్మలనాచరిస్తే, కర్మ బంధం నుంచి మానవుడు విముక్తుడౌతాడనే విషయాన్ని కూడ నిరూపిస్తాడు. కర్మమార్గాన్ని గురించి కూడ ఇదే అధ్యాయంలో విపులీకరిస్తాడు.

అప్పుడ భక్తి మార్గాన్ని స్పష్టీకరిస్తూ, ఫలాపేక్ష లేకుండా భగవదర్పితంగా కర్మలు నిర్వర్తించటంలోని ప్రాధాన్యతను నిర్ధారిస్తాడు. ఉదాహరణకు 9వ అధ్యాయంలో ఆయన ఇలా అంటారు :

శ్లో|| ''మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు |

మామేవైష్యసి యుక్త్యైవాత్మానం మత్పరాయణః ||''

""xqsµy ƒ«s®ƒs[õ xqsøLjiLi¿RÁVª«sVV. ƒyNRPV ˳ÏÁNRPVò²R…\®ªs @ª«sƒ«s»R½V²R…ª«so NRPª«sVVø,'' NRPƒ«sVNRP úxms¼½ª«sùQQNTPò ¬sLRi»R½ª«sVV ˳ÏÁgRiª«sLi»R½V¬s xqsøLjiLi¿RÁª«sÛÍÁƒ«sV. ˳ÏÁgRiª«sƒyõª«sV ˳ÏÁÇÁƒ«s ¿Á[¸R…VVÈÁ¹¸…[VgSNRP, ˳ÏÁgRiª«sµ][÷µ³R…ƒ«sÌÁƒ«sV ª«sVƒ«sƒ«sLi ¿Á[xqsVNRPVLiÈÁW xqs*µ³R…LSø¬sõ ¬sLRi*QQLjiòLi¿yÖÁ. »yƒ«sV ¿Á[}qs úxms¼½NRPLRiø ˳ÏÁgRiª«sµj…*xtsQ¸R…VLigS A¸R…Vƒ«sZNP[ @LiNTP»R½Li NS‡Á²yÖÁ.

శ్రీకృష్ణుడే ఈ సందర్భంలో ఇలా అంటాడు :

శ్లో|| ''యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్‌ |

యత్తపస్యసి కౌన్తేయ తత్కురుష్వ మదర్పణమ్‌ ||''

""¬dsª«so Gµj… ˳ÏÁVÑÁLiÀÁƒy, Gµj… ¿Á[zqsƒy, ¸R…VÇìÁLRiWxmsLiÍÜ[ G ®ªsVVƒ«sLjiLiÀÁƒy, G »R½xmsxqsV=ƒ«sV ¬sLRi*z¤¦¦¦LiÀÁƒy, @¬sõÉÓÁ¬ds ƒyZNP[ xqsª«sVLjiöLi¿RÁV.''

భగవదర్పితంగా చేసే కర్మలేవైనా వాటికి బంధన వాసన యుండదని శ్రీకృష్ణుని ఉపదేశం. ఏ ప్రాణి కూడ ఏదో ఒక కార్యంలో నిమగ్నంకాకుండా ఒక నిముషం కూడ వూరికే ఉండదు. మనం శారీరకంగా కాని, మానసికం కాని క్రియా శీలురమై యుంటాం. భగవంతుని స్మరిస్తూ, మన కర్మలను భగవంతునకు అంకితం చేస్తే, భగవదనుగ్రహం మనకు అతి సులభంగా లభిస్తుంది.

ఈ సందర్భంలో భగవానుడు చెప్పినది చూడండి :

శ్లో|| ''యజ్ఞార్ధాత్కర్మణా న్యత్ర లోకో యం కర్మబంధన ః

''తదర్ధం కర్మ కౌంతేయ ముక్తసంగః సమాచర ||''

G NRPLRiø DÀÁ»R½\®ªsVƒ«sµ][ ¬sLñRiLiVVLi¿RÁÉجsNTP ª«sWLæRiµR…LRi+NRP xqsWú»yÖÁõ ¬slLôi[bPLi¿y²R…V.

ఆయన మాటల్లో :

''తస్మాచ్ఛాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ ||''

గీతలో పలుసందర్భాల్లో శ్రీకృష్ణుడు స్వధర్మాన్ని గురించి ఇలా అంటాడు :

శ్లో|| స్వధర్మమపి చావేక్ష్య న వికంపితుమర్హసి ||

స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః ||

స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవః ||

స్వే స్వే కర్మణ్యభిరతః సంసిద్ధిం లభ##తే నరః ||

స్వకర్మనిరతః సిద్ధిం యథా విందతి తచ్ఛృణు ||''

\|msƒ«s xqsWÀÁLiÀÁƒ«s AÅÁLji aý][NRPLi\|ms ªyÆØù¬sxqsWò Aµj… aRPLiNRPLRiVÌÁV »R½ª«sV ªyùÆØùƒ«sLiÍÜ[ BÍØ @ƒyõLRiV.

''స్వే స్వే యథోక్త లక్షణ భేదే కర్మణి అభిరతః తత్పరః సంసిద్ధిం |

స్వకర్మానుష్ఠానాత్‌ అశుద్ధిక్షయే సతి కాయేంద్రియాణాం జ్ఞాన నిష్ఠా

యోరయతాలక్షణం లభ##తే ప్రాప్నోతి నరః అధికృతః పురుషః |

కిం స్వకర్మానుష్ఠానాత్‌ ఏవ సాక్షాత్‌ సంసిద్ధిం న కథం తర్హి

స్వకర్మ నిరతః సిద్ధిం యథా కేన ప్రకారేణ విందతి తచ్ఛృణు ||

NRPƒ«sVNRP úxms¼½ª«sùQQNTPò »R½ƒ«s xqs*µ³R…LSø¬sõ ¬sLRi*QQLjiòLi¿yÖÁ. @xmsöV²R…V ª«sWú»R½®ªs[V »yƒ«sV ¿Á[}qs xmsƒ«sVÌÁƒ«sVLi²T… r¢ÅÁùLi úFyzmsòxqsVòLiµj…. @ÍØ NSNRPVLiÛÉÁ[ „sÌÁVª«sÌÁV »R½ÌÁúNTPLiµR…V\ÛÍÁ @aSLi¼½, @xqsLi»R½Xzmsò úxms‡ÁÌÁV»yLiVV.

అదే సందర్భంలో శ్రీకృష్ణుడు భక్తిమార్గాన్ని, జ్ఞాన మార్గాన్ని, అనుసరించాలని ఉద్ఘాటిస్తాడు. రెండవ అధ్యాయంలో జ్ఞానమార్గాన్ని గూర్చి వివరిస్తాడు. కాని జ్ఞానమార్గం అందరికి సులభం కాదు. అలాంటివారు అనుసరించతగ్గ వివిధములైన ఇతర మార్గాలను ఆయన నిర్దేశిస్తారు. ఒక సందర్భంలో ఆయన అర్జునుణ్ణి స్వధర్మాన్ని పరిరక్షించుటకై కర్మను ఆచరించమంటాడు. మరియొక సందర్భంలో కర్మనుండి వెనుదిరగ మంటాడు. ఈ క్రింది శ్లోకంలో ఆయన ఏంచెప్పింది గమనించండి.

శ్లో|| ''సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే సుఖం వశీ ||

నవద్వారే పురే దేహి నైవ కుర్బన్న కారయన్‌ ||

యోగీ యుంజీత సతతమాత్మానం రహసి స్థితః |

ఏకాకి యతచిత్తాత్మ నిరాశీరపరిగ్రహః ||''

BLiN]NRP xqsLiµR…LRi÷éLiÍÜ[ @LêRiVƒ«sV¬s $NRPXxtñsv²R…V ˳ÏÁNTPòª«sWLæS¬sõ @ƒ«sVxqsLjiLiÀÁ »R½ƒ«s xqsLRi*ry*¬sõ ˳ÏÁgRiª«sLi»R½V¬sNTP xqsª«sVLjiöLi¿RÁª«sVLiÉزR…V.

కనుక ఆయన నిర్దేశించిన మార్గాలు పరస్పర విరుద్ధంగా వున్నట్లు కనిపించినా ఒక్కొక్క సందర్భంలో ఒక్కటే ఉత్తమ మైందిగా ఉద్బోధింపబడి మిగిలినవి దానికి సహాయభూత మైనవిగా సూచింప బడతాయి.

కాని ఆదిశంకరులు మనకు కనిపించే ఈ వైరుద్ధ్యాన్ని కూడ ఈ క్రింది శ్లోకంపైన చేసిన వ్యాఖ్యానంలో పరిష్కరించారు.

శ్లో|| ''యతః ప్రవత్తిర్భూతానాం యేన సర్వమిదం తతం |

స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విన్దతి మానవః ||''

B¿RÁèÈÁ ¿Áxmsö‡Á²T…ƒ«s zqsµôðj… @LiÛÉÁ[ ®ªsWORPQLi NSµR…V. @µj… ZNP[ª«sÌÁLi xqs*µ³R…LSøª«sÌÁLi‡Áƒ«sLi ª«sWú»R½®ªs[V. xqs*µ³R…LSøª«sÌÁLi‡Áƒ«sLi ÀÁ»R½ò aRPVµôðj…NTP, ÀÁ»R½òaRPVµôðj… ¹¸…WgRizqsµôðj…NTP, @µj… ÀÁª«sLRiNRPV Çì؃«szqsµôðj…NTP @Li¿ÁÌÁLi¿ÁÌÁVgS µyLji¼d½ryòLiVV. ÀÁ»R½òLi NRPLRiø µy*LS xqs*¿RÁèé»R½ƒ«sV, ¹¸…WgRiLi µy*LS ¬saRPèÌÁ»R½ƒ«sV ryµ³j…LiÀÁ »R½VµR…NRPV ú‡Áx¤¦¦¦øÇì؃y¬sõ F~LiµR…V»R½VLiµj…. ˳ÏÁNTPò NRPW²R… ÀÁª«sLRiNRPV ú‡Áx¤¦¦¦øÇì؃y¬sõ F~LiµR…ÉجsNTP µ][x¤¦¦¦µR…Li ¿Á[xqsVòLiµj…. ˳ÏÁNTPò ¹¸…VVNRPä »R½Vµj… gRiª«sVùLiÍÜ[ ª«sùQQNTPò ú‡Áx¤¦¦¦øxmsµyLóRiLiÍÜ[ HNRPùª«sVª«so»y²R…V.

ఈ వాక్యం పరికించండి :

శ్లో|| ''తతో మాం తత్త్వతో జ్ఞాత్వా విశ##తే తదనన్తరం||''

''తస్యకార్యంన విద్యతే ||''

Aµj…aRPLiNRPLRiVÌÁV »R½ƒ«s ˳ÏÁÇÁg][„sLiµR…r¡òú»R½LiÍÜ[ BÍØ Â¿ÁFyöLRiV.

''భగవద్గీతా కించిదధీతా''

మోక్షసాధనకు భగవద్గీత పారాయణం చేస్తే చాలని కొందరి అభిప్రాయం. కాని అదిచాలదు. దానివల్ల కించిత్‌ భగవదనుగ్రహం లభించవచ్చు. కాని మోక్షం లభించదు. భగవద్గీతను కొలదిగా చదివినా చాలని ఆదిశంకరులు అంటారు. కాని వారి అభిప్రాయం కూడ గీతోపదేశాల్ని అమలుచేయుటే ముఖ్యమని. శ్రీకృష్ణుడిలా అంటాడు :

శ్లో|| ''మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు |

మామేవైష్యసి యుక్త్యైవాత్మానం మత్పరాయణః ||

˳ÏÁgRiª«sƒyõª«sVLi L][ÇÁÙÍÜ[ ®ªsLiVVù ryLýRiV ¿Á[¸R…VÈÁLiª«sÌýÁ A¸R…Vƒ«s @ƒ«sVúgRix¤¦¦¦Li N]Li»R½ F~LiµR…ª«s¿RÁVè. NS¬s ®ªsWOSQ¬sõ ryµ³j…Li¿RÁÛÍÁ[Li. xms„sú»R½ gRiLiú´R…\®ªsVƒ«s ˳ÏÁgRiª«sµæk…»R½ xmshjiLiÀÁƒ«sLiµR…Vª«sÌýÁ ª«sVƒ«saS+Li¼½, xqsµR…xqsµj…*®ªs[NRPª«sVV ÌÁÕ³ÁryòLiVV. xqsƒyøLæRiª«sLRiòƒ«sVÌÁ ª«s°»yLi. C úgRiLi´yÌÁV ª«sVƒ«sNRPV NRPLRiòª«sù ËÜ[µ³R…ƒ«sV ¿Á[ryòLiVV. µ³R…LSøÖÁõ @ª«sVÌÁV¿Á[}qs Ëص³R…ù»R½ ª«sVƒ«s\|ms®ƒs[ ª«soLiÈÁVLiµj….

కనుక ప్రతివాడు ఉదయం లేచి కాలకృత్యాలు నిర్వర్తించి భగవన్నామ స్మరణ చేసి, ఏదైన ఉత్తమ గ్రంథ పారాయణం కావించి, తర్వాత స్వధర్మాన్ని నిర్వర్తించాలి. వ్యక్తి తాను ధర్మమాచరిస్తూ ఇతరులు కూడ అవలంబించటానికి అనుకూలమైన వాతావరణాన్ని సమకూర్చాలి.

కృష్ణభగవానుడు అందరకు సర్వశ్రేయస్సులను ప్రసాదించు గాక!

Sri Jayendravani    Chapters    Last Page