Sri Jayendravani    Chapters    Last Page

33. రామేశ్వర - సమాస విశ్లేషణ

µR…OTPQßá ˳ØLRi»R½LiÍÜ[ LS®ªs[VaRP*LRiª«sV®ƒs[ úxmsxmsLi¿RÁ „sÆØù¼½Â¿ÁLiµj…ƒ«s µj…ª«sùxmsoßáù ZOP[QQú»R½ª«sVVLiµj…. A ®µ…[ªyÌÁ¸R…V @µ³j…uîyƒ«s ®µ…[ª«s»R½}msLRiV "LSª«sVƒy®´…[aRP*LRiV²R…V'.

ఒకప్పుడు దేవతల మధ్య 'రామేశ్వర' శబ్దానికి సరియైన అర్థమేమిటియనే మీమాంస తలెత్తింది. ఆ శబ్దం ఎలా ఏర్పడింది, దానిలోని 'రామ', 'ఈశ్వర' అనే విభిన్న పదాల కలియకకు ఏ సమాసం వర్తిస్తుంది, అనే విషయాలు వారు తెలుసుకోగోరారు.

ఆ సందర్భంలో చెప్పబడిన శ్లోకాన్ని చూడండి :

శ్లో|| విష్ణుస్తత్పురుషం బ్రూతే బహువ్రీహిం మహేశ్వరః |

ఉభయోరప్యతృప్తానామాత్మభూః కర్మధారయమ్‌ ||

ªyLjiÍÜ[¬s \ZaPª«sª«sV»yª«sÌÁLi‡ÁNRPVÌÁV ""LSª«sVxqsù CaRP*LRiM = రామేశ్వరః.'' అది తత్పురుష సమాసం అవుతుంది. దాని అర్థం 'రాముడు ఈశ్వరుని కంటే భిన్నమైనవాడు, మరియు ఈశ్వరుడు రామునికంటే అధికుడు అన్నారు. వారిలోని వైష్ణవుల శైవులతో విభేదిస్తూ అది బహువ్రీహి సమాసం అని నిర్థారించారు. 'రామః ఈశ్వరః యస్య సః రామేశ్వరః.' ఎవరికైతే రాముడు ఈశ్వర స్వరూపుడో అని దాని భావం. దీనిననుసరించి 'రాముడు ఈశ్వరునికంటే అధికుడని, లేక రాముడే ఈశ్వరుడని' తేలుతుంది. ఇలా విరుద్ధమైన అభిప్రాయాలు వెలువడటంతో వారు ఇదమిత్థమని నిర్ణియించలేక పోయారు. ''సీతోద్వాహ సమయంలో రాముడు శివధనస్సును భంగం చేశాడు కదా ! కనుక శివుడు రామునకు ఈశ్వరుడెట్లా అవగలడు?'' అనే ప్రశ్న వారికుదయించింది.

దీని పరిష్కార మార్గంవారికి లభించక, రామావతారాన్ని దాల్చిన విష్ణువును అడగాలని వైకుంఠానికి వెళ్లారు. అచ్చట విష్ణువును దర్శించి ప్రణమిల్లి ఆయన్ని ''రామేశ్వర సమాసంలోని విగ్రహవాక్యాల విషయంలో వ్యాకరణవేత్తలు మా సందేహాన్ని తీర్చలేకపోయారు. దానిని వివరించమని కోరుతున్నాం.'' అని అడిగారు. ''అందులో సందేహానికి అవకాశ##మేలేదు. అది తత్పురుష సమాసం మాత్రమే.'' అని విష్ణువు సమాధాన మిచ్చాడు.

''నాకుగూడ శివుడు ఈశ్వరుడే'' అని విష్ణు వన్నాడు. కాని వారిలోని వైష్ణవులు దాని నామోదించలేదు. నమ్రత విష్ణువునకు స్వాభావికం. కనుక ఆ భావంతోనే శివుడు తనకంటే ఉన్నతుడంటున్నాడు. అని వారు భావించారు.

అప్పుడు వారు కైలాసానికేగి ఈశ్వరుని ముందే ఈ సమస్యనుంచుదామని నిశ్చయించుకొని ఆయన సన్నిధికి వెళ్లారు. ఆయనకు ప్రణమిల్లి రామేశ్వర శబ్దంలోని సమాస ప్రక్రియను విపులీకరించమని ప్రాధేయపడ్డారు. సమాధానంగా ఈశ్వరుడు వారితో ''ఇది బహువ్రీహి సమాసమే''నన్నాడు.

రామేశ్వరః = రామః ఈశ్వరః యస్య సః. అనగా ''ఎవరికైతే రాముడు ఈశ్వరుడో అతడు రామేశ్వరుడు''అని చెప్పాడు.

దేవతల్లో ఇప్పుడు ఇంకా ఎక్కువ సంఘర్షణ మొదలైంది. పై రెండు వివరణలలోని వైరుద్ధ్యాన్ని సమన్వయపరచుకో లేకపోయారు. శివకేశవులిరువురు వారివారి నమ్రతా భావాలతో తనకంటే రెండవవాడు అధికుడని ప్రకటిస్తున్నారని వారు భావించారు. తటస్థ వైఖరి నవలంబించే మరియొకరి నిర్ణయాన్ని సేకరించాలని తలంచి బ్రహ్మను సమీపించారు.

బ్రహ్మ వారి సమస్యనాలకించి ''ఆ సమాసం కర్మధారయం ఔతుంది. అన్నాడు.''

''రామశ్చాసౌ ఈశ్వరశ్చ రామేశ్వరః''.

''రాముడు, ఈశ్వరుడు అని భిన్నభిన్న ప్రకృతులు లేవు. ఇరువురు ఒకటే.'' అని బ్రహ్మగారి తీర్పు.

రాముడు, ఈశ్వరుడు ఇరువురు ఉన్నతులే. ఇరువురు సత్యస్వరూపుడైన పరమాత్ముని అంశ##లే.

రామునకు శివునకు మధ్య ఏమీ వైరం లేదు. మానవుల అజ్ఞానం వలన పరమాత్మ యొక్క నిజమైన తత్వాన్ని తెలియలేక వారు సృష్టించుకున్నవే ఈ వివాదాలు. ఉదాహరణకు రాముడు, పరశురాముడు విష్ణువు యొక్క అవతారాలే. ఐనా ఒకరితోనొకరు యుద్ధంచేసి నట్లు వింటాం. అది నిజమైందికాదని మనం తెలుసుకోవాలి.

దైవం ఎన్నిరూపాల్లో కనిపించినా అవన్నియూ పరమాత్మయొక్క భిన్నభిన్న అవతారాలే. ఒక్కొక్క అవతారం ఒక ప్రత్యేకమైన ప్రయోజనంతో ఉంటుంది.

కనుక మనం భగవంతుని ఎలా ఆరాధించినా పరమాత్ముని మాత్రమే ఆరాధించినట్లు.

Sri Jayendravani    Chapters    Last Page