Sri Jayendravani    Chapters    Last Page

26. భక్తి యొక్క లక్షణాలు

మానవ జీవితానికి అంతిమలక్ష్యం భగవస్సాక్షాత్కారమే. అంటే ఆత్మ తత్వాన్ని గురించి ఎరుగుటయే. దీన్ని సాధించటానికి బహువిధ మార్గాలున్నాయి.

నిజమైన భక్తియొక్క లక్షణాలేమిటో విచారిద్దాం. భక్తుని యొక్క స్థితి ఏమిటి ? ఆత్మజ్ఞానాన్ని పొందే ముందు అతడు ఏ యే దశలను అనుగమించాలి ? భక్తి యొక్క మూలాంశ##మేమి ? మామూలుగ భగవన్నామం భజనరూపంలో చేయటం, పూజలు నిర్వర్తించటం మొదలైనవే భక్తిగా ప్రచారంలో ఉన్నాయి. శివానందలహరిలో శంకర భగవత్పాదులు భక్తిని గురించి సుందరతరమైన వివరణనిచ్చారు. సర్వప్రాణులకు అధిపతియైన పశుపతి లేక పరమేశ్వరుని పాదపద్మములయందే మనస్సును లగ్నం చేయుటే భక్తియని వారి నిర్వచనం.

శంకరుని వాక్యం ఇలా వుంది.

శ్లో|| ''అంకోలం నిజనీజ సంతతిరయస్కాంతోపలం

సాధ్వీ నిజవిభుం లతా క్షితిరుహం సింధుః సరిద్వల్లిభమ్‌ |

ప్రాప్నోతీహ యథా తథా పశుపతేః పాదారవిందద్వయమ్‌

చేతోవృత్తి రుపేత్య తిష్ఠతి సదా సా భక్తి రిత్యుచ్యతే ||

ryª«sWƒ«sù úxmsÇÁÌÁÍÜ[¬s ˳ÏÁNTPò¹¸…VVNRPä úxms´R…ª«sV µR…aRPƒ«sV @LiN][ÍØ ª«sXORPQª«sVV µy¬s ¹¸…VVNRPä „s»R½òƒ«sª«sVVÌÁ ª«sVµ³R…ùƒ«sVƒ«sõ @ƒ«sV‡ÁLiµ³R…Li µR…XuíyLi»R½LkiNRPLjixqsVòLiµj…. @LiN][ÍØ Â¿ÁÈíÁV gjiLiÇÁÌÁV ÀdÁNRPÉÓÁ®ªs[ÎÏÁÍÜ[ ¿ÁÈíÁVƒ«sVLi²T… úNTPLiµR…xms²T… xqsWL][ùµR…¸R…V xqsª«sV¸R…VLiÍÜ[ ¼½Ljigji ¿ÁÈíÁVƒ«sNRPV ¿Á[Lji @¿RÁèÛÉÁ[¸R…VVLi²T… úNRPª«sVLigS ª«sVLRiÌÁ ª«sXORPQLiÍÜ[ ˳ØgRiLigS ª«sWLSòLiVV. C „sÀÁú»R½ úxmsúNTP¸R…VÖÁõ ‡ÁVVÇÁÙª«so xmsLRi¿RÁVN][ªyÌÁ¬s úxms¸R…V¼½õLi¿yLi. NS¬s xqsxmnsÖdÁNRPX»R½VÌÁLi NSÛÍÁ[µR…V. NS¬s @ÈÁ„dsaSÅÁªyLRiV A „s»R½òƒyÌÁV ¿ÁÈíÁV \®ªsxmso NRPµR…ÌÁÈÁLi µy¬s¬s ¿Á[LRiÈÁLi ¸R…Vµ³yLóRiª«sV¬s, NS¬s A úNTP¸R…V ª«sVƒ«sNRPV NRPƒ«s‡Á²R…NRPVLi²y ÇÁLRiVgRiV»R½VLiµR…¬s µ³R…X„dsNRPLjiLi¿yLRiV.

అంకోలాచెట్టు యొక్క విత్తనాలవలెనే మనమందరం పరమాత్మ యొక్క అణుప్రాయులం. పరమాత్మ నుంచి ఆవిర్భవించిన జీవాత్మ అన్నిటికి మూలకారణం. పరమాత్మ నుండి మనం ఉద్భవించాం. మనల్ని అజ్ఞానం ఆవరించి యున్నప్పుడు ఆయన్నుంచి వేరుబడి పతనం చెందుతాం. మరల అజ్ఞాన తిమిరాలు వీడి జ్ఞానోదయం కాగానే మనకు పునరుత్థానం జరిగి పరమాత్మతో అనుసంధింప బడతాం. ఇచ్చట అంధకారం అజ్ఞానంతోను, జ్ఞానం వెలుగు లేక సూర్యోదయంతోను పోల్చబడ్డాయి. అంధకార సమయంలో విత్తనాలు వృక్షంనుండి వేరయి క్రిందపడతాయి. అట్లే అజ్ఞానాంధ కారంలో మనం పరమాత్మనుండి విడిపోయి క్రిందకు పతనం చెందుతాం. తిరిగి సూర్యోదయం కాగానే విత్తనాలు చెట్టును చేరినట్లే మనం కూడ జ్ఞానోదయం కాగానే మరల పరమాత్మకు అనుబంధితులమౌతాం.

సాధారణంగా మనం ఇబ్బందులకు గురియైనప్పుడు మాత్రమే దైవాన్ని గురించి చింతిస్తాం, జ్ఞానాన్ని అన్వేషిస్తాం. మనజీవితం సుఖమయంగా సాగిపోతున్నప్పుడు హాయిగా వుంటాం; మనం చేయాల్సిందంతా చేసేశా మనుకుంటాం. భగవంతుని మరచిపోతాం. మనం దుస్థితిలో నున్నపుడు అంధకారంలో కొట్టుమిట్టాడుతున్నట్లు తలుస్తాం. అదే మన అజ్ఞానస్థితి. అప్పుడే దైవం మన స్మృతి పథంలోకి వస్తాడు. మన కష్టాన్ని పారద్రోలమని కాళ్లావేళ్లా పడి వేడుకుంటాం. అంధకారం ఆవరించినప్పుడు వెలుగుతో అవసరం ఏర్పడుతుంది. ఇది భక్తి యొక్క ప్రథమ దశ.

ఆదిశంకరులు భక్తి యొక్క తర్వాతి దశను ఇలా వర్ణించారు.

''అయస్కాంతోపలం సూచిక''

ముందు మనం భగవంతుని స్మరించాలి. తర్వాత ఆయన తనంతట తానేవచ్చి మనలను ఆయనవైపు ఆకర్షించు కుంటాడు.

వల్లభాచార్యుడు తదితరులు దీనినే వారి ప్రధాన సిద్ధాంతంగా రూపొందించి దాన్ని కేంద్రంగా జేసి ఈశ్వరభక్తి ఆధారంగా ఒక వేదాంతతత్వాన్ని వెలువరించారు.

ఒక సూదంటురాయికి, ఇనుపముల్లునకు మధ్యనున్న ఆకర్షణ భక్తి యొక్క ద్వితీయ స్థాయిని దృష్టాంతరీకరిస్తుంది. మన చిన్నతనంలో సూదంటు రాళ్లను, ఇనుపరజనును సమీకరించి వాటితో ఆడుకునేవారం. అయస్కాంతం ఇనుపముక్కలను ఆకర్షించే తత్వం కలిగి వుంటుంది. ఇనుప ముక్కలను అయస్కాంతం సమీపానికి జేరిస్తే అవి అయస్కాంతానికి కరచుకుంటాయి. తర్వాత కొంత సమయానికి అవి క్రిందపడతాయి. మళ్లీ అయస్కాంతం వాటిని లాక్కుంటుంది. ఇది చాలా ముఖ్యమైన వేదాంత సత్యాల్ని విశదీకరిస్తుంది. ఒక అయస్కాంతం ఇనుపముక్కల్ని ఆకర్షించేశక్తి కల్గియున్నట్లే దైవం తన ఆకర్షణతో మనలను తనవైపు త్రిప్పుకొని ముందుకు నడిపే ప్రభావం కల్గి వుంటాడు.

కష్ట వలయాల్లో చిక్కుకొని పతనం చెందినప్పుడు, మన స్థితి అయస్కాంతం నుండి క్రిందబడ్డ ఇనుపముక్కల స్థితికి సమానం. కాని ఇనుపముక్క నిశ్చేతన పదార్థం అయినా దాన్ని అయస్కాంతం తనవైపు ఆకర్షిస్తుంది. కాని మానవులమైన మనం శక్తివంతులం, జడత్వం లేనివారం. అందుచేత భగవానుడు మనలను తిరిగి సుళువుగా పైకి లేవనెత్తి తనవైపు తీసుకోగల్గుతాడు.

దైవం మన స్మృతిపథంలోకి వచ్చిన మరుక్షణం, మనపై ఆయన కృప వెల్లివిరుస్తుంది. అందువలన మనమందరం భగవానుని మన హృదయాల్లో ప్రతిష్ఠించుకోటానికి ఉద్యమించాలి. అప్పుడు ఇనుపముక్కలకువలె మన మనస్సులు కూడ భగవంతునివైపు ఆకర్షింపబడి ఆయనకు హత్తుకొని వుంటాయి. ఇనుపమక్క అయస్కాంతం వైపు లాగబడి, దానితో అనుసంధింపబడి యున్నంత కాలం అది కూడ అయస్కాంతీ కరింపబడి వుంటుంది. అదే విధంగా మన మనస్సు భగవానుని వైపు ఆకర్షణతో మరలింపబడి ఆయన యందు నిశ్చలస్థితిలో నున్నంత వరకు బ్రహ్మానందాను భూతిలో తేలియాడతాం.

భక్తి యొక్క మూడవ దశ ఈ క్రింది విధంగా ఉంటుంది

''సాధ్వీ నిజవిభుం''.

ఒక పతివ్రతా స్త్రీ తన పిల్లలను సాకుతూ, వంటావార్పూ నిర్వహిస్తూ, మిగతా గృహసంబంధమైన విధులనన్నింటినీ నిర్వర్తిస్తూ కూడ ఎల్లవేళల తన పెనిమిటిని గురించే ఆలోచిస్తూ వుంటుంది. భర్తను గురించి తలచకుండా ఆమె ఏ పనీ చేయదు. భక్తుడు కూడ భగవంతుని స్మరణ లేకుండా ఏ కార్యాన్ని నిర్వహించడు. అలాగే మన మనస్సులు కూడ భగవంతునిలో ఐక్యం కావాలి. దైవానుగ్రహం మనపై ఎల్లవేళల ప్రసరిస్తే మనం తలపెట్టే కార్యాలన్నీ జయప్రదంగా సాగుతాయి. వాటిని ఎక్కువ సామర్థ్యంతో ఫలప్రదం చేసుకోగలం.

ఇక్కడ భక్తి విషయమేగాక స్త్రీ ధర్మం కూడ ఉల్లేఖింపబడింది. సాధ్వియైన స్త్రీ పరపురుష ధ్యాస లేక ఎల్లపుడు తన భర్తనే స్మరిస్తూ గృహకృత్యాలు నిర్వర్తిస్తుంది. దైవధ్యానంతో మన విధులను నిర్వహిస్తే మన జీవితాల్లో సర్వశ్రేయస్సులు, లాభాలు సమకూరుతాయి.

తర్వాత ఆదిశంకరులు వృక్షాన్ని అల్లుకున్న తీగెయొక్క ఉదాహరణనిస్తూ ఇలా అంటారు.

''లతా క్షితిరుహం''

ఒక లత భూమిపై విరివిగా పాకి, ఆలంబనం కొరకు తుదకొక వృక్షాన్ని ఆశ్రయించి చెట్టునుండి విడదీయలేని విధంగా పెనవేసుకుంటుంది. వృక్షాన్నుండి విడదీస్తే తీగె నిలబడలేదు. జీవించలేదు. అలాగే భగవంతుని చేయూత, పోషణ లేకుండా మనం విషాదానికి గురి¸°తాం. తీగెను బలవంతంగా చెట్టునుండి విడదీస్తే చెట్టుపై తరచుగా ఒక చార లాంటి గుర్తు మనకు గోచరిస్తుంది. మనం కూడ అదే విధంగా భగవంతునికి అనుసంధింప బడతాము. ఆయన రక్షణలో మన జీవితాల్ని సాగించుకుంటాం. ఆయన సన్నిధి నుండి పతనం చెందినప్పుడు లేక ఆయన్నుండి విడిపోయినప్పుడు మనం అష్టకష్టాలకు గురి¸°తాం. అంతేగాదు భగవానుడు కూడ మనపట్ల సానుభూతితో చింతా క్రాంతుడౌతాడు. లత తన అస్తిత్వం కొరకు వృక్షం యొక్క ఆలంబనాన్ని అపేక్షించినట్లే మానవులం కూడ భగవానుని చేయూతను, ఆధారాన్ని ఆశ్రయించుకొని మనుగడ సాగాంచాలి. మనం పరమాత్ముని వద్దనుండే ప్రపంచంలోకి వస్తాం; తిరిగి ఆయన సాన్నిధ్యానికే చేరుతాం. తీగె విడదీస్తే తప్ప తనకై తాను వృక్షాన్నుండి విడిపోనట్లే మనం కూడ మూడవ వ్యక్తి మనల్ని భగవానుని నుంచి దూరంచేస్తే తప్ప మనకై మనం ఆయన్నుంచి దూరం కాలేము. ఆదిశంకరులు భక్తి విషయంలో సమర్పించిన నాల్గవ ఉదహరణ యిది.

ప్రతివ్యక్తి జీవితంలో ఏవో కష్టాల్ని, దైన్యాన్ని అనుభవిస్తాడు. ఈ విషయంలో మహాత్ములకు కూడ మినహాయింపు లేదు. వీటి నివృత్తికొరకు భగవానుని ఆశ్రయ మొక్కటే శరణ్యం. వృక్షాన్ని ఆశ్రయించి పెన వేసుకుంటే తప్ప లత ఎలా జీవించలేదో, అలాగే జీవాత్మ పరమాత్మకు దూరమై తన అస్తిత్వాన్ని నిలబెట్టుకోలేదు.

''రసాంతరాణి ఏకరసం యధాదివ్య పయోశ్నుతే''

Aµj…aRPLiNRPLRi ˳ÏÁgRiª«s»yöµR…VÌÁ ª«s¿RÁƒ«sLiÍÜ[ ""zqsLiµ³R…VM xqsLjiµR…*ÌýÁ˳ÏÁLi''

పవిత్ర భారత భూమిపై గంగా, సోనె, గోదావరి, కావేరి, కృష్ణ మొదలుగాగల అనేక నదులు ప్రవహిస్తున్నాయి. ఈ నదులన్నిటికి ప్రత్యేకమైన పేర్లున్నాయి. అవన్నీ వివిధ మార్గాల్లో, పలుదిశల్లో, పలుప్రాంతాల్లో ప్రవాహ రూపంలో సెలయేళ్లుగా గర్జన ధ్వనులతో ప్రవహిస్తాయి. పరీవాహక ప్రదేశాలననుసరించి నదీజలాల రుచి, రంగు కూడ భిన్నంగా వుంటాయి. ఉదాహరణకు సోనె నది యొక్క నీటి రంగు ఎర్రగాను, కృష్ణానదీ జలాల రంగు నల్లగాను, గంగాజలం తెల్లగాను వుండటం గమనిస్తాం. కాని అన్ని నదులు తుదకు సముద్రంలో కలసి వాటివాటి ప్రత్యేక నామాల్ని, రంగుల్ని, రుచులను అన్నిటిని కోల్పోతాయి. సముద్ర సంగమం జరిగింతర్వాత ఆ జలాల రుచి మొత్తం ఉప్పదనం మాత్రమే. రంగు సముద్రజలాల రంగు మాత్రమే. అంటే సాగర సంగమానంతరం నదులు తమ ప్రత్యేక గుణాల్ని అన్నింటిని కోల్పోయి సాగరంగానే పరిణమిస్తాయి.

అన్ని నదులు సాగరంలో సంగమించినట్లు, మనం కూడ భగవత్సాన్నిధ్యాన్ని చేరే లక్ష్యంతో వివిధ మార్గాల్ని అనుసరించి, వివిధ దిశలలో పయనించి, వివిధ రూపాల్లో అవతరించిన పరమాత్ముని ధ్యానించి ప్రయత్నాలు సాగిస్తాం. భక్తులు అనుసరించే మార్గాలు వేరైనా భగవత్సాన్నిధ్యాన్ని చేరటమనే గమ్యం ఒక్కటే. రామభక్తి, కృష్ణభక్తి మొదలైన భక్తి మార్గాలెన్ని వున్నా అవి పరమాత్మకు అనుసంధింపబడి వున్నంతవరకు అన్నీ సారూప్యమైనవే. ఒక దేవాలయం చేరటానికి త్రోవలుండ వచ్చు. కాని అన్నిటికి గమ్యం ఆలయం మాత్రమే.

పరమాత్మను చేరటానికి చాలా మార్గాలున్నాయి. వాటిలో భక్తిమార్గం, జ్ఞానమార్గం, కర్మమార్గం, యోగమార్గం, ఆత్మ విచార మార్గం ముఖ్యమైనవి. ఈ మార్గాలన్నింటికి పరమాత్మునిలో ఐక్యం మవటమనే లక్ష్యం ఒక్కటే. నదులన్నీ సాగరంలో కలసిపోయినట్లు, మనమందరం బ్రహ్మ పదార్థంలో కలిసినప్పుడు మన ప్రత్యేక వ్యక్తిత్వాలన్నీ పూర్తిగా అదృశ్యమై మనం ఆనంద స్వరూపులమౌతాం. ప్రతివ్యక్తి దైవానుగ్రహాన్ని సంపాదించటానికి తనకనుసరణీయమైన బాటను ఎన్నుకుంటాడు. అందరి అంతిమ లక్ష్యం భగవదనుగ్రహాన్ని పొందటమే.

గీతలో శ్రీకృష్ణుడిలా చెప్పాడు.

''యే యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం ||''

ª«sWƒ«sª«soÌÁV G ª«sWLæS¬sõ @ƒ«sVxqsLjiLiÀÁƒy, A ª«sWLæRiLi µy*LS®ƒs[ ªyLjiNTP ˳ÏÁgRiªyƒ«sV²R…V »R½ƒ«s @ƒ«sVúgRi¥¦¦¦¬sõ ÌÁÕ³ÁLixmsÛÇÁ[ryò²R…V.

భగవంతుని గురించిన జ్ఞానంతో మనం ఆయనలో ఐక్యం కాగల్గితే మన కష్టాలు, దుఃఖాలు అన్నీ మటుమాయమౌతాయి. భక్తి మార్గంలో భగవంతునితో అనుసంధింపబడాలంటే మనం అనుసరించాల్సిన మార్గాన్ని గురించి ఆదిశంకరు లిట్లా అన్నారు.

''ప్రాప్నోతీహి యథా తథా పశుపతే ః పాదారవిందద్వయం ||''

ª«sVƒ«s ÀÁ»yò¬sõ CaRP*LRi FyµR…xmsµR…øª«sVVÌÁ\|ms FsÍØ ÌÁgRiõLi ¿Á[¸R…WÌÁ®ƒs[ „sxtsQ¸R…VLi\|ms lLiLi²R…V Dµyx¤¦¦¦LRißáÌÁV ª«sWª«sVWÌÁVgRi ¿Áxmsö‡Á²R…V»yLiVV. ª«sVƒ«sª«sVƒ«sxqsV=ÌÁV CaRP*LRi FyµR… xmsLiNRPÇØÌÁ\|ms ¬sÖÁzms¾»½[®ƒs[ ˳ÏÁNTPò ryLóRiNRP ª«s°»R½VLiµR…¬s Aµj…aRPLiNRPLRiVÌÁ @Õ³Á˳ØxtsQßá.

పైన నుడివిన వానిలోని మొదటి ఉదాహరణ, మర్కట కిశోరం, దానితల్లిని గురించింది.

తల్లికోతి ఒక చెట్టునుండి మరొక చెట్టు మీదకు, ఒక కొమ్మనుంచి మరొక కొమ్మ మీదకు ఎగురుతుంది. తల్లికోతి ఎగురుతున్నంత సేపు దాని పిల్ల తల్లి పొట్టను గట్టిగా కరచుకొని పడకుండా సురక్షితంగా ఉంటుంది. ఇక్కడ తన రక్షణ బాధ్యతను మర్కటకిశోరమే వహించి తన తల్లి పొట్టను వదలక కరచుకొని వుంటుంది. దీనినే మర్కట కిశోరన్యాయ మంటారు. అదే విధంగా మనం పరమాత్మునికి దగ్గరగా అనుబంధితులమైతే ప్రపంచంలో ఎక్కడ విహరించినా కష్టాలకు గురికాము.

పై ఉదాహరణలోని మర్కట వృత్తాంతం మరియొక విషయంలో కూడ ప్రాధాన్యత వహిస్తుంది. మన మనస్సు కూడ మర్కటంవలెనే ఒక విషయం నుండి మరొక దానివైపు విహరిస్తూ వుంటుంది. అలాగాక మనస్సును నియంత్రించి పరమేశ్వరుని పాదపంకజాలపై స్థిరీకరించగల్గినచో అది నిలకడ స్థితిని పొందుతుంది. ఇదే విషయాన్ని శ్రీ కృష్ణుడు గీతలో ఇలా అంటాడు.

''తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం''

ª«sVLRiäÈÁNTPa][LRiLi »R½ÖýÁN][¼½¬s NRPLRi¿RÁVN]¬s ¸R…VVƒ«sõÈýÁVgRi®ƒs[, ª«sVƒ«sLi ®µ…[ª«s®µ…[ª«so¬s FyµR…xmsµyøÖÁõ AúaRPLiVVLiÀÁ ª«sµR…ÌÁNRPVLi²y xmsÈíÁVN]¬s ¸R…VVƒ«sõ¿][ ª«sVƒ«sNRPV xqsLi˳ÏÁ„sLi¿Á[ NRPuíyLjiuíyÌÁƒ«sV @µ³j…gRi„sVLiÀÁ xqsLRi*úZaP[¸R…VxqsV=ÌÁƒ«sV F~LiµR…gRiÌÁLi.

రెండవ ఉదాహరణగా మార్జాలం దాని పిల్లల విషయం చెప్పబడింది. పిల్లి పిల్లలను కని వానిని అమిత జాగరూకతతో సంరక్షిస్తుంది. ఎవరిని దాని పిల్లల సమీపానికి కూడ రానీయదు. అదే విధంగా భగవంతుడు తన భక్తుల్ని అమిత శ్రద్ధతో సంరక్షిస్తాడు. వారికి ఎవరి వల్లను హాని జరుగకుండా కాపాడుతాడు.

మార్జాలం తన పిల్లలకు ఏదైనా కీడుకల్గుతుందని శంకిస్తే తనువున్న ప్రదేశాల్ని వదలి పిల్లలను నోట కరచుకొని మరియొక సురక్షితమైన ప్రదేశానికి తీసికొని వెళ్తుంది. మానవుల విషయంలో కూడ భగవానుడు తన భక్తుని కేదైనా విపత్తు సంభవిస్తుందని తలస్తే వానిని రక్షించి సురక్షిత ప్రదేశానికి తీసికొని వెళ్తాడు. ఈ విధంగా మనం పరమాత్ముని యందు అచంచల భక్తిని ప్రదర్శిస్తే, పిల్లి తన పిల్లల్ని రక్షించినట్లు, మన పూర్తి రక్షణ బాధ్యతను ఆయనే వహించి మనకు అండగా నిలుస్తాడు.

ప్రస్తుతం మనముందు జరిగే ప్రతికార్యాన్ని మనమే నిర్వహిస్తున్నామని, భగవంతుని ప్రమేయం ఏమీలేదని విర్రవీగుతున్నాం. అందువల్లనే మనకు అన్ని విషయాల్లోనూ కొరత ఏర్పడుతోంది. తాగటానికి నీటి కొరత, తింటానికి ఆహారం కొరత, కరువులు, కాటకాలు, వర్షాభావం, వ్యాధులు అన్నీ ఏర్పడుతున్నాయి. మనకు మంచి సంభవించినప్పుడు ఇది అంతా మా ప్రయోజకత్వమేనని చాటుకుంటాం. పరమాత్ముని కృపవల్ల ఆ మంచి జరిగిందనే ఆలోచనే రాదు. కాని మనకు కీడేదైనా వాటిల్లితే, వెంటనే దానికి కారణం భగవంతుడేనని ఆయన్ని నిందిస్తాం. ఇది చాల సహజమైన మానవ ప్రకృతి.

అర్జునుడు గీతలో చెప్పినట్లు మన మనస్సు చంచలమైంది. పలువిషయాలపై విహరిస్తుంది.

''చంచలం హి మనః కృష్ణ''

ఎల్లవేళల పలువిషయాలపై సంచరించే స్వభావంగల మనస్సును నియంత్రించి భగవంతుని పాదాల వద్ద స్థిరీకరించాలి. ఈ విధంగా ఈశ్వర భక్తిని పెంపొందించుకొని పరమాత్ముని నిజతత్వాన్ని, ఆయన పాదపద్మాల్ని స్మరించాలి.

తర్వాత ఈ సందర్భంలో భ్రమరకీటక న్యాయంగా ప్రకటింపబడుతున్న ఉదాహరణను పరిశీలిద్దాం. కందిరీగ, ఒక చిన్న కీటకాన్ని పట్టుకొని ఒక మట్టి గూటిలో వుంచి దాన్ని మాటిమాటికి కుడుతూ వుంటుంది. అలా కొంత సమయం గడిచింతర్వాత కీటకం భయంలో చిక్కుకొని, తానే కందిరీగ లేక భ్రమరంగా మారుతుంది. అదే విధంగా భగవత్కృప మనపై నిర్విరామంగా ప్రసరిస్తే, కందిరీగచే కుట్టబడిన కీటకం భ్రమరంగా పరిణమించినట్లే, మనం కూడ భగవత్స్వరూపాన్ని పొందగల్లుతాం.

త్రికరణశుద్ధిగా అంటే స్వచ్ఛమైన మనోవాక్కాయ కర్మలతో, భగవన్నామ స్మరణను కనీసం రోజులో అరగంట లేక పదిహేను నిముషాలు చేస్తే భగవత్స్వ రూపాన్ని పొందగల్గుతాం.

మన చెవులతో ఒక విషయాన్ని వింటాం, కనులతో చూస్తాం. ఐనా మన మనస్సు ఆ విషయంపై లగ్నమై యుండదు. పరిపరి విషయాలపై సంచరిస్తూ వుంటుంది. మన జ్ఞానేంద్రియాలు ఐదింటిని కనీసం ఒక నిమిషమైన భగవత్పాద పంకజములపై కేంద్రీకృతం చేయగల్గితే మనకు సత్ఫలితాలు అనేకం సిద్ధిస్తాయి. భక్తుడు భక్తిధ్యానంలో రోజంతా గడప నవసరం లేదు. త్రికరణశుద్ధితో కొద్ది కాలమైనా భగవధ్యానంలో గడిపితేచాలు; మన బాధలు, కష్టాలు పటాపంచలైపోతాయి.

ప్రస్తుతకాలంలో త్రికరణశుద్ధితో భక్తిని ఆచరించేవారు చాల తక్కువ. సాధారణంగా మనుజులు స్నానమాచరించితాము పవిత్రులమైనా మనుకుంటారు. నిజమే స్నానంవల్ల దేహ పరిశుభ్రత, మంచి ఆరోగ్యం సమకూరుతాయి. కాని దైవచింతనకు పవిత్రమైన మనస్సు కూడా కావాలి. ఐతే మానసిక పవిత్రత దేహస్నానం వల్ల సమకూరేది కాదు. దుస్తుల్ని శుభ్రం చేయాలంటే సబ్బులు, ఇతర పరికరాలు వున్నాయి. కాని మనస్సు యొక్క స్వచ్ఛతను సాధించాలంటే దానికొరకై సబ్బుగాని, ఇతర పరికరాలుగాని లేవు. ధనమేగాదు, గంగానదీ జలాలుకూడ చిత్తశుద్ధిని సాధించలేవు. భక్తితో భగవన్నామ స్మరణ చేయటంవల్ల మాత్రమే మనం మనస్సు యొక్క స్వచ్ఛతను పొందవచ్చును.

మనం మన దంత ధావనతోబాటు ముఖ ప్రక్షాళనం చేసి మనస్సును కూడ పరిశుభ్రపరచుకోవాలి. స్వచ్ఛమైన మనస్సుతో ఏ కార్యాన్ని నిర్వర్తించినా అది మంచి ఫలితాల్ని ఇస్తుంది. అలాకానిచో దుష్ఫలితాలు లభిస్తాయి.

భగవత్సాన్నిధ్యాన్ని చేరాలన్నా మానసిక పవిత్రత అత్యంత ఆవశ్యకం.

పై విషయాల్ని క్రోడీకరిస్తే ఆదిశంకరుల నిర్వచనం ప్రకారం భక్తియుంటే భగవత్పాద కమలములపై కేంద్రీకరింపబడే మానసిక వైఖరి మాత్రమే. ఆ భగవంతుడే మన పట్ల అన్ని వేళల స్నేహప్రవృత్తితో మెలగి మన పాపాలను క్షమించి, మనకు సకల శ్రేయస్సులను ప్రసాదించి, మనం చేసే స్మరణకే ఆయన తృప్తి చెంది మనపై ఆయన అనుగ్రహాన్ని ప్రసరింప చేయటానికి సన్నద్ధుడైయుంటాడు. భక్తి కామ్యభక్తి కాకూడదు. ప్రతిఫలాపేక్ష లేకుండా, వ్యక్తిగత ప్రయోజనాల ప్రేరణలేకుండ భగవంతునిపై చూపే భక్తిమాత్రమే అత్యుత్తమస్థాయిభక్తిగా పరిగణింపబడుతుంది.

నిజమైన భక్తుడు భగవత్సాన్నిధ్ధ్యం కొరకు నిత్యం తపన చెందుతాడు. అంతేగాదు పశుపతి పాదపంకజాలపై అతని మనస్సు నిల్పుతాడు. భగవానునితో ఏ రకమైన ఎడబాటైనా అతన్ని దుఃఖాక్రాంతుణ్ణి చేస్తుంది. నిజమైన భక్తికి పరమావధి ఆత్మసాక్షాత్కారమే. అదే భగవత్సాక్షాత్కారం. ఆదిశంకరులు సూచించిన దృష్టాంతాల్లో వివరింపబడ్డ ఆకర్షణలన్నీ సహజమైనవి, స్వేచ్ఛాజనితాలేగాని, కృత్రిమమైనవి ఎంతమాత్రంకాదు. అంకోలా విత్తనం, సాధ్వియైన భార్య, లత, నది, మర్కటము దానికిశోరం, పిల్లి, పిల్లలు - వీటిలో ఏ ఒక్కటీ రెండవదాని ఎడబాటును సహించలేదు, విడివిడిగా వాటికి అస్తిత్వం లేదు. సహజీవనంలోనే అవి సఫలీకృతమౌతాయి.

ఇక్కడ గమనించాల్సిన మరొక ముఖ్య విషయ మేమంటే మనమందరం పరమాత్ముని దగ్గరనుండి వస్తాం, తిరిగి అక్కడకే చేరుకుంటాం. భగవంతుని చేరటానికి చాలా మార్గాల్లో భక్తి ఒకటియైనా అన్నిటిలోకీ ఇది సులభ##మైంది. అంకోలా విత్తనం చెట్టుకు జన్మిస్తుంది. అది క్రిందపడుతుంది, తిరిగి అదే చెట్టుకు, చేరుతుంది. అలాగే నదులు పర్వతముల పైభాగాల్లో చేరిన నీటినుండి ఉద్భవిస్తాయి. సముద్రంలోని నీరు ఆవిరిగామారి, ఆవిరి మేఘాలుగా ఏర్పడి అవి వర్షించగా వచ్చిన నీరే కొండపై భాగాల్లోని నీరు. కనుక నదులు సముద్ర జలాల ద్వారా తమ పుట్టుకను సాధించి మరల చివరకు సముద్రజలాన్నే చేరుతాయి. అదేవిధంగా ఒక పతివ్రతయైనస్త్రీ తనభర్తతో ఎల్లపుడూ నడిపే సహజీవనంలోనే పరిపూర్ణ సౌఖ్యాన్ని, సంతృప్తిని అనుభవిస్తుంది. అంతేగాక భగవత్సాన్నిద్ధ్యంలో వ్యక్తి దైవం నుంచి శాంతి దమనాల ప్రసరణను పొందుతాడు. ఉదాహరణకు అమితవేగంతో, భీకరస్వనంతో ప్రవహించే నదులు కూడ ప్రశాంతతను, నిలకడస్థాయిని సమకూర్చుకొని సాగర సంగమం కావించి దానిలో ఐక్యమౌతాయి. సముద్రం కూడ నదులకు ప్రేమతో స్వాగతం చెపుతుంది.

భక్తియొక్క పరమావధి ఆత్మ సాక్షాత్కారమే గనుక ఆ గమ్యాన్ని నిజమైన భక్తుడు ఉత్కృష్టభక్తి ద్వారా సాధిస్తాడు.

నిజమైన భక్తుని వచనాల్లో : ''మదీయం ఏవ స్వరూపం దేహి.'' ఆత్మజ్ఞానం అనగా నీవే. దాన్నే నాకు ప్రసాదించు. ఆత్మజ్ఞానం అనే గమ్యాన్ని చేరటానికి భక్తి ఒక సాధనం. దానినే స్వస్వరూప అనుసంధానం అంటాం. గమ్యాన్ని స్వస్వరూ అవబోధ అంటాం.

కనుక ప్రతివారు ప్రాతఃకాలంలో లేచి, కాలకృత్యాలు నెరవేర్చి, భగవద్ధ్యానం చేసి సన్మార్గానుసారులై, సనాతన ధర్మాన్ని పాటించాలి. సగుణరూపంలో పరమాత్ముని యందు భక్తిని పెంపొందించుకొని, సర్వకాల సర్వావస్థల యందు భగవంతునే స్మరిస్తూ వ్యక్తి జీవించాలి. అలా చేస్తే అతనికి సర్వశ్రేయస్సులు లభిస్తాయి. అతని జీవితం సుఖమయం మౌతుంది.

Sri Jayendravani    Chapters    Last Page