Sri Jayendravani    Chapters    Last Page

18. అర్థనారీశ్వరారాధన

కైలాస వాసియైన పరమేశ్వరారాధనకు మహాప్రదోష దినం ప్రత్యేకమైనది. ఆ రోజులో కూడ సూర్యాస్తమయం తర్వాత వెంటనే వచ్చు ప్రదోషకాలం ప్రత్యేకంగా మరింత ముఖ్యమైంది.

ప్రతి రోజు కూడ సాయంత్రం మనం దీపాలు వెలిగించే సమయం చాల శుభప్రదమైంది. అందునా ప్రదోష సమయం అతి ముఖ్యమైంది. శబ్దతః 'ప్రదోష' అనే పదానికి అర్థం 'అధిక దోషం కల సమయం'. కాని నిజానికి ఇది చాల శుభకరమైన సమయం. ఇంత శుభప్రదమైన కాలాన్ని శబ్దార్థం ప్రకారం వ్యతిరేకమైన భావాన్ని స్ఫురింపజేసే 'ప్రదోష' అనే పదంతో వర్ణించటం వింతగా కన్పిస్తుంది.

శబ్దార్థం ప్రకారం కలియుగ అనే పదానికి పాపంతో నిండిన యుగం అని అర్థం. కాని ఈ యుగంలో తప్ప మరియే యితర యుగాల్లోను అధిక మోతాదులో పుణ్యం సముపార్జించటానికి అవకాశంలేదు.

భగవంతుణ్ణి విగ్రహాల యందు అనేక రూపాల్లో ప్రతిష్ఠించి ఆరాధించే మహద్భాగ్యం కలియుగంలో మాత్రమే వుంది. కలియుగంలో మాత్రమే ఈశ్వరభక్తితో భగవానుని అనుగ్రహాన్ని సులభంగా పొందటానికి అవకాశం వుంది.

అదే విధంగా సూర్యునిది గాని, చంద్రుడుది గాని గ్రహణకాలం యధార్థంగా శుభప్రదమైంది. ఈ గ్రహణకాలాన్నే దోషకాలంగా ఊహిస్తారు.

అలాగ, ప్రదోష, కలియుగ మరియు గ్రహణ కాలాలు శుభప్రదమైనవిగా సామ్యాన్ని కలిగియున్నాయి. వానినే దోషభరిత కాలాలుగా ఎలా ప్రకటిస్తావు ?

కలియుగంలో మనిషి పాపం చేస్తే పాపఫలం మిగతా యుగాల్లో దానికంటే అధిక తరంగా వుంటుంది. ఈ యుగంలో దైవానుగ్రహాన్ని ఇతర యుగాల్లో కంటే సులభంగా పొందగల్గినట్లే ఈ యుగంలో చేసిన పాపాలకు ఫలితాలు కూడ మిగతా యుగాల్తో పోలిస్తే తీవ్రతరంగా వుంటాయి. ఈ ఫలితాలు ఇంచుమించు ఇతర యుగాల్లో కంటే పదిరెట్లు వుంటాయి. ఈ అర్థంలోనే ఈ యుగాన్ని పాపయుగం లేక కలియుగం అంటాం. ఈ యుగంలో పుణ్యం సంపాదించటం ఎంత తేలికో, పాపాలు చేయటంకూడా అంత సులభం. దోషపూరిత వాతావరణం కారణంగా దీన్ని పాపయుగం అంటున్నాం. కాని ఫలితాల దృష్ట్యా నిర్ణయంచేస్తే ఈ యుగం మిగతా కాలాలకంటే చాల పవిత్రమైంది.

గ్రహణ కాలాన్ని పవిత్రమైంది గాను, శుభప్రదమైందిగాను చేసుకోవాలంటే ఆ సమయంలో దానధర్మాలు, జపతపాలు, పుణ్యస్నానాలు నిర్వర్తించాలి. అలా చేయకుండా ఇతర కార్యకలాపాల్లో నిమగ్నమైతే నిజమైన గ్రహణ కాలంలో అంటే పాపకాలంగా మిగులుతుంది. సమయంలో మామూలు వస్తువులు కూడ భ్రష్టత్వానికి గురి¸°తాయి. దానిని నివారించటానికే మన ఇండ్లలోని భోజన పదార్థాల్లో దర్భలు గాని, తృణాలుగాని ఉంచుతారు.

ప్రదోష కాలంలో ప్రజలు సమావేశ##మై పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తే ఆ సమయం వార్కి శుభప్రదమౌతుంది. అలాగాక వారు ఇతర కార్యక్రమాల్లో ఆ సమయాన్ని గడిపితే దోషాల్ని లేక అనర్థాల్ని ఇస్తుంది. ప్రదోష కాలంలో చేసిన పాపాల ఫలితాలు మామూలు వేళల్లో చేసిన పాపాల ఫలితాలకంటే నూరు రెట్లు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఆ కాలంలో ఒనరించిన పుణ్యాల ఫలితాలు కూడ ఇంచుమించు అదే నిష్పత్తిలో ఉంటాయి.

నిజాన్ని గ్రహిస్తే ప్రదోష కాలం చాల పవిత్రమైంది, శుభప్రదమైంది కూడ. ప్రదోష కాలంలో కైలాసంలో వున్న పరమేశ్వరుడు పరవశించి తాండవం చేస్తుంటాడు. ఆ నృత్యాన్ని దర్శించటానికి దేవతలందరూ అక్కడ సమావేశమౌతారు. కనుక ప్రదోష సమయంలో ఇతర దేవతల సాన్నిధ్యం కొరకు ఆయా దేవుళ్ళ ఆలయాలకు పోనక్కరలేదు. ప్రదోష కాలంలో అందరు దేవతలు శివుని దగ్గరే ప్రత్యక్షమౌతారు. కాన ఆ కాలంలో శివుని ఆరాధిస్తే మనకు శివుని ఆశీస్సులతోబాటు మిగతా దేవతల ఆశీస్సులు కూడ లభిస్తాయి. ప్రదోషకాలం యొక్క విశేష లక్షణమిదే.

ప్రదోష కాలంలో పరమేశ్వరుడు అర్థనారీశ్వరుడుగా మనకు దర్శనమిచ్చుట ద్వారా ఒకే శరీరంలో రెండు రూపాల్ని ప్రదర్శిస్తాడు. ఆయన ఎడమ వైపు పార్వతి లేక అంబిక రెండవ పార్శ్వమున శివుడు లేక ఈశ్వరుడు ఉంటారు. మన మతం ప్రకారం సర్వాంతర్యామియైన పరమాత్మ నిత్యుడు, శాశ్వతుడు. సృష్టి సమయంలో ఆయన తన మాయ సహాయంతో సృష్టిని నిర్వహిస్తాడు. సృష్టించిన జీవుల్ని పోషిస్తాడు, సంహరిస్తాడు. సృష్టి, స్థితి లయములను నిర్వహించటానికి పరమాత్మ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల రూపాల్ని దాలుస్తాడు. కాని తాను పరమాత్మగానే ఉంటాడు. ఈ మూడు కార్యాలను నిర్వహించటంలో త్రిమూర్తులు ముగ్గురు (అనగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు) సరస్వతి, లక్ష్మి, పార్వతి యను మూడు శక్తులతో కూడి ఉంటారు.

ప్రదోష కాలంలో మనం అర్థనారీశ్వర స్వరూపాన్ని ధ్యానిస్తే మనకు రెండు ప్రయోజనాలు సిద్ధిస్తాయి. కామం అనగా కోర్కెలను నియంత్రించగల్గటం ఒకటి. కాలాన్ని అనగా మరణాన్ని జయించ గల్గటం రెండవది.

శివునకు కాలసంహారమూర్తియని, కామసంహారమూర్తియని బిరుదులున్నవని ఒక కవి అతిమనోహరంగా వర్ణించాడు. మనం కోరికల వల్ల, మృత్యువును జయించలేక ఇబ్బందులకు గురి¸°తాం. ఆహారం అమితంగా తీసుకుంటే బాధ అనుభవిస్తాం. లేక మరణిస్తాం. కోరికలను జయించగల్గితే కామాన్ని గురించి వ్యధచెందాల్సిన పనిలేదు. అలాగే మృత్యువును జయించగల్గితే ఈ ప్రపంచంలో దేన్ని గురించి మరణాత్పూర్వంగాని, మరణానంతరం గాని వ్యాకులత చెందనవసరంలేదు.

శివునకు చాలా ఇతర నామాలున్నాయి. కంచిలో ఒక మామిడి వృక్షం క్రింద ఉంటాడు గనుక అక్కడ ఆయన్ని ఏకామ్రేశ్వరుడంటారు. మద్రాసులోని మైలాపూరులో ఆయన్ని కపాలేశ్వరుడని పిలుస్తారు. అక్కడ ఉన్న ఈశ్వరుడు చేతిలో కపాలాన్ని ధరించి ఉంటాడు. మన్మథుణ్ణి సంహరించాడు. గనుక ఆయనకు 'కామసంహారమూర్తి'యనే పేరు కూడ ఉంది.

శివునకు మూడు నేత్రాలున్నాయి. మనం మన రెండు నేత్రాలతో ప్రపంచాన్ని అంతా చూస్తాము. మూడవ నేత్రాన్ని తెరిస్తే మన కోరికలను భస్మీభూతం చేయవచ్చు. మనకు మూడవ నేత్రం లేదు గదా తెరవటం ఎలా సంభవం ? త్రినేత్రుడైన ఈశ్వరుని ధ్యానిస్తే ఆయన కరుణించి మనకు జ్ఞానమనే మూడవ నేత్రాన్ని ప్రసాదిస్తాడు. ఆ మూడవ నేత్రంతో కామాన్ని భస్మంచేసే శక్తిని సంపాదిస్తాం. ప్రదోష కాలంలో ప్రతిరోజు అర్థనారీశ్వరుని స్మరిస్తే ఆయనమూర్తి మన మనస్సులో స్థిరపడి మనం చాల ప్రయోజనాలను సాధిస్తాం. శివుడు తన మూడవ నేత్రాన్ని తెరచి కామానికి చిహ్నమైన మన్మథుణ్ణి నశింపచేశాడు. అందువల్ల ఆయన కామసంహారమూర్తి యైనాడు. భక్తుల మనస్సుల నుండి మృత్యువును గురించిన భయాన్ని తొలగిస్తాడు గనుక ఆయన్ని 'కాలసంహారమూర్తి'యని కూడ పిలుస్తారు. ఆ కవి ఈ రెండు భావాల్ని ఈ క్రింది శ్లోకంలో అతిరమణీయంగా ప్రస్తావిస్తాడు.

శ్లో|| ''సాధారణ స్మరజయే నిటలాక్షిసాధ్యే |

భాగీ శివో భజతు నామ యశః సమగ్రమ్‌ |

వామాంచి మాత్రకలితే జనని త్వదీయే |

కా వా ప్రసక్తిరిహ కాలజయే పురారే ః||

úxmsµ][xtsQ NSÌÁLiÍÜ[ Dª«sWª«sV}¤¦¦¦aRP*LRi xqs*LRiWFy¬sõ µ³yù¬sLi¿yÌÁ¬s ª«sVƒ«sNRPV gRiVLRiVò¿Á[¸R…VVÈÁ N]LRiZNP[ NRP„s \|ms aý][NS¬sõ LRiÀÁLi¿y²R…V. A¸R…Vƒ«s FyLRi*¼½¬s xqsLiËÜ[µ³j…LiÀÁ BÍØ @LiÉزR…V; ""@LóRiƒyLkiaRP*LRi LRiWxmsLiÍÜ[ ª«sVW²R…ª«s ®ƒs[ú»R½Li „dsV µR…Lixms»R½VÌÁNTPLRiVª«soLRiNRPV ¿ÁLiµj…ƒ«s®µ…[. NS¬s "NSª«sVxqsLi¥¦¦¦LRiª«sVWLjiò'ÛÍÁ[NRP "NSª«sWLji' @®ƒs[ ÕÁLRiVµR…V bPª«soƒ«sNRPV ª«sWú»R½®ªs[V ¿ÁLiµR…V»R½VLiµj…. ¬ds NSÆØù¼½¬s, g_LRiªy¬sõ ¼d½xqsVNRPV®ƒs[ @ª«sNSaRPLi C¸R…V‡Á²R…ÛÍÁ[µR…V. „dsVLjiLRiVª«soLRiNRPV Dª«sVø²T…\¹¸…Vƒ«s INRP ª«sxqsVòª«soª«sÌýÁ INRP NSLRiùLi ryµ³j…Li¿RÁ‡Á²T…¾»½[, µy¬sª«sÌýÁ ÌÁ‡ôðÁª«sV¹¸…[Vù NUPLjiògS¬s, }msLRiVgS¬s LiVVLRiVª«soLRiNRPV ¿ÁLiµR…ª«sÌÁ¸R…VVgRiµy. NS¬s LiVVNRPä²R… A }msLRiV xmsLRi®ªs[VaRP*LRiVƒ«sNRPV ª«sWú»R½®ªs[V C¸R…V‡Á²T…ƒ«sµj…. @µj… @ÍØ DLi²R…gS, "NSÌÁxqsLi¥¦¦¦LRiª«sVWLjiò'¸R…V®ƒs[ }msLRiVNRPW²R… A¸R…Vƒ«sZNP[ µR…NSäÍØ ? NSÌÁVßñÓá @ƒ«sgS ¸R…Vª«sVVßñÓá »R½ƒ«s ªyª«sVFyµR…Li»][ »R½Li»y²R…V. ªyª«sVFyµR…Li ¬dsNRPV xqsLi‡ÁLiµ³j…LiÀÁƒ«sµj…. Hƒy C NUPLjiò NRPW²R… ¬dsNRPV µR…NRPäNRPVLi²y A¸R…Vƒ«sZNP[ xqsLiúNRP„sVxqsVòLiÛÉÁ[, J FyLRi*¼d½ FsÍØ „sVƒ«sõNRPVƒyõª«so ?''

ఈ చమత్కార రచన ద్వారా పార్వతీపరమేశ్వరుల మధ్య స్పర్థ సృష్టించటం కవి యొక్క ఉద్దేశ్యం కాదు. ఆ విధంగా భక్తుల దృష్టిని అర్థనారీశ్వరుని వైపు త్రిప్పి ప్రదోష కాలంలో ఆ రూపాన్ని నిత్యం క్రమంగా వారిచే ధ్యానింపచేయటమే కవి సంకల్పం. భగవంతుని ఈ రూపంలో స్మరించిన ప్రతివాడు కోరికలను జయించి పూర్వం కంటే సుఖతరమైన జీవితాన్ని గడపగల్గుతాడు.

ఏదైనా ఒక భావన మన మనస్సుకు హత్తుకుపోవాలంటే దానికి చాలా మార్గాలున్నాయి. ఉదాహరణకు ఒక విషయాన్ని పురాణాలనుండి సేకరించిన ఒక కథ రూపంలో చెప్పితే అది ఆసక్తికరంగా ఉంటుంది. దానినే పద్యరూపంలో చెప్పితే ఇంకా రసవత్తరంగా ఉంటుంది. పద్యంలోని రసభావం మనస్సు ఆస్వాదిస్తే, ధ్యానం ఎక్కువ ఆనందదాయకంగా పరిణమిస్తుంది.

ప్రదోష కాలంలో గజపూజ నిర్వర్తిస్తున్నపుడు శివనామమే జపిస్తాం. రామనామంగాని ఇతర నామాలుగాని పఠించటం. విశేష మేమంటే ప్రదోష సమయంలో మనం స్మరించాల్సింది శివుణ్ణిగాని, ఇతర దేవుళ్ళను గాదు.

ఉదయం వేళలో మనం 'శ్రీహరిః, శ్రీహరిః'అంటూ విష్ణువునే స్మరించాలి. బహు ప్రజానీకం వారి దినచర్యను 'శ్రీహరిః శ్రీహరిః'అంటూ నామజపంతోనే ఆరంభిస్తారు. మన పోషకత్వాన్ని నిర్వహించేది విష్ణువు గనుక ఉదయం లేవగానే ఆయన్ని స్మరిస్తే మన నిత్యజీవితం సాఫీగా, సుఖప్రదంగా సాగిపోతుంది. సూర్యాస్తమయ సమయంలో హరుని లేక శివుని స్మరించాలి. అలా చేస్తే జీవితంలో సమతుల్యత లభిస్తుంది. రాత్రి నిద్రించునపుడు కలల బాధ లేకుండా ప్రశాంతమైన గాఢనిద్ర సంప్రాప్తిస్తుంది. 'హర' శబ్ధానికి హరించువాడని అర్థం. ఆయన్ని సాయం సమయాల్లో ధ్యానిస్తే మన పాపాల్ని అన్నింటిని హరింప చేస్తాడు.

ప్రదోష సమయంలో వైష్ణవాలయాన్ని దర్శించనవసరంలేదు. ఈ సూత్రానికి నృసింహస్వామి, రాముడు మినహాయింపులు. అంటే అవసరమైతే వారిని దర్శించవచ్చు.

ఈ విషయాన్నే ఈ క్రింది మాటల్లో.

''ప్రదోషే హరిం న పశ్యాత్‌ నృసింహం రాఘవం వినా ||''

విష్ణువు నృసింహావతార మెత్తింది సాయం సంధ్యాసమయంలోనే గనుక నృసింహునకు మినహాయింపు ఈయబడింది. ఇక రాముని విషయానికొస్తే 'రమ యతీతి రామః' అనే శబ్దార్థాన్ని బట్టి రాముని పేరులోనే ప్రజలను రంజింప చేసేవాడు, సుఖశాంతుల్ని ప్రసాదించేవాడు అని వుంది గనుక రాముని ఎల్లవేళల స్మరించవలసిందే. కనుక మనం అన్ని సమయాల్లోను ఈ రెండు స్వరూపాల్ని స్మరించాల్సిందే.

పక్షానికి ఒక సారి సంభవించే 'మహాప్రదోష' కాలంలో శివదర్శనం, శివనామ జపం మనకు అమిత ప్రయోజనకరం. సాయంసంధ్య సమయంలో ఉన్న త్రయోదశి తిధినాటి ప్రదోష కాలమే మహాప్రదోషమవుతుంది. ఆనాడు ఉదయం ద్వాదశి తిధిఉన్నా ఇబ్బందిలేదు.

కనుక ప్రదోష కాలం అన్ని విధాలా శుభప్రదమైంది, పవిత్రమైందని ఎంచి అర్థనారీశ్వరుణ్ణి ధ్యానించి మనం తరించాలి. 'శివ'శబ్ధానికి'శుభప్రదం'అని అర్థం. శ్రేయస్సు, శివం, మంగళం, కళ్యాణం, శుభం అనే భావాల్ని 'శివ' శబ్దం సూచిస్తుంది.

'స్వశ్రేయసమ్‌, శివం, భద్రం, కళ్యాణం మంగళం, శుభం'

శివుడావిధంగా మనకందరకు శుభప్రదాయకుడు, సర్వశ్రేయస్కరుడు.

శివానుగ్రహంతో ప్రజలందరకు సర్వశ్రేయస్సులు, శుభాలు లభించు గాక !

''నమః పార్వతీపతయే''

Sri Jayendravani    Chapters    Last Page