Sruthi Sourabham    Chapters    Last Page

15. సర్వసార తత్త్వోపనిషది

విజ్ఞాన శాస్త్రమ్‌

సర్వసార తత్త్వోపనిషది కేచన విశేషా ఇహపర సాధకా స్సన్తి. తత్ర కాంశ్చన వక్తు మిచ్ఛామి. అద్యవయం 'టెలిఫోన్‌' 'రేడియో' ఇత్యాది యన్త్ర ద్వారా ఖణ్డాన్తరశబ్ద శ్రవణం కుర్మః. తస్యాముపనిషది వినా యన్త్రం దూర శ్రవణ మార్గ శ్శ్రూయతే.

శ్లో. 'నాదే మనోలయం బ్రహ్మన్‌ దూరశ్రవణ కారణమ్‌'

(ఉ.3 - అ. 2 - 13 శ్లో.)

శరీరే అనాహత నాదో వర్తతే తస్మిన్‌ మనసి ధ్రియమాణ దూరశ్రవణ శక్తి స్సిద్ధ్యతి.

అద్య గోళాన్తర దృశ్యాని దూరదర్శన యన్త్ర సాహాయ్యేన వయం

పశ్యామః. వినైవ యన్త్రం సుదూర దృశ్యాని ద్రష్టు ముపాయ

ఆమ్నాయతే యథా

శ్లో. బిన్దౌ మనోలయంఙ్కృత్వా దూరదర్శన మాప్నుయాత్‌

(ఉ.3 - అ. 2 - 13 శ్లో.)

శ్రీ చక్రే బిందౌ పరమాత్మా వసతి. హృదయే శ్రీచక్రభావనే బిందు రపి

హృదయ స్థిత ఏవ భవతి. శరీరే శ్రీచక్ర భావనేతు భ్రూమధ్యం బిందు

స్థానమ్భవతి. బ్రహ్మారన్ధ్రం మహాబిన్దు స్థానం భవతి. బిందౌ కృతే

మనోలయే దూరదర్శన శక్తి ర్భవతి

వాత పిత్త కఫ దోషైః శరీర మస్వస్థం భవతి. రోగాపనుత్తయే ఔషధాని స్వీక్రియన్తే. అస్యాముపనిషదిరోగ పరిహారాయ వాయుధారణా శ్రూయతే యథా.

శ్లో. యత్ర యత్ర ధృతో వాయు రంగే రోగాది దూషితే

ధారణా దేవ మరుత స్తత్త దారోగ్య మశ్నుతే ఇతి

(ఉ 2 - అ. 2 - 30 శ్లో)

అస్వస్థ శరీరభాగే కుంభక ప్రాణాయామ ద్వారా వాయు ర్ధృతో యది రోగనివృత్తి రారోగ్య ప్రాప్తిశ్చ భవతి. యోగ సిద్ధే రుపాయః అత్రామ్నాతః.

శ్లో. కట్వావ్లు లవణ త్యాగీ క్షీరపాన రత స్సుఖీ

బ్రహ్మచారీ మితాహారీ యోగీ యోగ పరాయణః

(ఉ 2 - అ. 2 - 43 శ్లో)

అబ్దా దూర్ధ్వం భ##వేత్సిద్ధో నాత్ర కార్యా విచారణా

సంసార సాగరం తర్తు మేష ఉపాయః శ్రూయతే.

మం. సంసార వార్ధిం తర్తుం సూక్ష్మ మార్గ మవలంబ్య

సత్త్వాది గుణానతిక్రమ్య తారకమవలోకయేత్‌

(ఉ 3 - అ. 2 - 44 శ్లో)

అత్ర భ్రూమధ్యే సచ్చిదానంద తేజః కూట రూపం తారక మిత్యుచ్యతే అపిచ.

శ్లో. మనసా మన ఆలోక్య వృత్తి శూన్యం యదా భ##వేత్‌

తతః పరం పరం బ్రహ్మ దృశ్యతేచ సుదుర్లభమ్‌

(ఉ 2 - అ. 3 - 19 శ్లో)

తతః మనోవృత్త్యా మనోదర్శనేన బ్రహ్మసాక్షాత్కారో భవతి.

చిత్తస్థైర్య ప్రకరణ స్థితోయం శ్లోకః విజ్ఞాన శాస్త్ర పరిశోధక పండితాన్‌ పరిశోధనాయ ప్రేరయతి. యథా

శ్లో. రసశ్చ మనసశ్చైవ చఞ్చలత్వం స్వభావతః

రసో బద్ధో మనోబద్ధం కిం నసిద్ధ్యతి భూతలే

మూర్ఛితో హరతి వ్యాధిం మృతో జీవయతి స్వయమ్‌

బద్ధః ఖేచరతాం ధత్తే బ్రహ్మత్వం రసచేతసీ

(ఉ 3 - అ. 2 - 3 శ్లో.)

అత్ర రస మూర్ఛనేన వ్యాధిహరణం, రసమారణన మృతజీవనం, రసబన్ధనేన ఆకాశగమనం భవతీతి వర్తతే. రసస్య మూర్ఛనాది కరణ ఇతి కర్తవ్యతా పరిశోధనీయా అస్తి.

కాయకల్ప చికిత్సేతి గుప్తప్రక్రియా ఆయుర్వేదే వర్తతే యయా వృద్ధోపి తరుణాయతే. యోగేనాపి తాదృశీ సిద్ధి రస్తీతి శ్రూయతే.

శ్లో. అపాన మూర్ధ్వముత్థాప్య ప్రాణం కణ్ఠా దధోనయన్‌

యోగీ జరా వినిర్ముక్తః షోడశో వయసా భ##వేత్‌

(ఉ 2 - అ. 1 - 35 శ్లో.)

బన్ధసహిత శీర్షాసనే అపాన వాయో రూర్ధ్వగమనం, ప్రాణవాయోః కణ్ఠాధ స్థితిశ్చ భవతీతి యోగ విదో వదన్తి.

ప్రాణాయామస్య, యోగస్య నాడీమణ్డలశుద్ధి రావశ్యకీ భవతి యయా వినా కుమ్భకప్రాణాయామం కర్తుం యోగ్యతా నాస్తి. నాడీ మణ్డల శుద్ధే ర్మార్గః అత్ర ఆమ్నాయతే

శ్లో. పీత్వా పిఙ్గలయా సమీరణ మధో

బద్ధ్వా త్యజే ద్వామయా

సూర్యాచన్ద్రమసో రనేన విధినా

భ్యాసం సదా తన్వతాం

శుద్ధా నాడిగణా భవన్తి యమినాం

మాసత్రయా దూర్ధ్వతః

అస్యేతి కర్తవ్యతా ఉపనిషద్భాష్యే

శ్రీ శంకర భగవత్పాదాచార్యైః స్పష్టమభివర్ణితా

ఏవం సర్వసార తత్త్వోపనిషది విజ్ఞానశాస్త్ర మపి వర్తతే.

వ్యాస సారం

సర్వసార తత్త్వోపనిషత్తులో చాలా విశేషాలు ఇహ పరాలను సాధించేవి ఉన్నాయి.

శరీరంలో అనాహత నాదం నిరంతరం వినబడుతూంటుంది. దానిలో మనస్సును లయం చేస్తే దూరశ్రవణ శక్తి లభిస్తుంది. బిందువు నందు మనస్సును లయం చేస్తే దూరదర్శన శక్తి లభిస్తుంది. హృదయంలో కనుబొమల నడుమ, బ్రహ్మరంధ్రంలో బిందువు కలదని తెలుస్తోంది. మహాభారత వ్యాఖ్యలో నీలకంఠాచార్యులవారు హృదయంలో సూర్యమండలముందని అక్కడ మనస్సు లగ్నం చేస్తే సూర్యకాంతి ఎంత దూరం ప్రసరిస్తోందో అంత దూరం కనబడుతుందని వ్రాశారు. కనుక ఇక్కడ బిందు పదానికి 'హృదయం' అని అర్థం చెప్పడం సముచితం.

యోగ సాధన వల్ల రోగాలు తొలగుతాయి. శరీరంలో అనారోగ్యం ఉన్నచోట కుంభకంలో వాయువును ధరించినట్లయితే రోగం తొలగి ఆరోగ్యం కలుగుతుంది.

కారం, పులుపు, ఉప్పు వదలి ఆవుపాలు త్రాగుతూ మితాహారం తీసుకుంటూ, బ్రహ్మచర్యంతో ఒక సంవత్సరకాలం సాధన చేస్తే యోగసిద్ధి కలుగుతుంది. ఈ విషయంలో సంశయం లేదు.

సంసార సముద్రాన్ని దాటాలంటే శరీరంలో సూక్ష్మమార్గంలో ప్రవేశించి సత్త్వం మొదలయిన గుణాలను దాటి తారకాన్ని దర్శించాలి. కనుబొమలు నడుమ ఉన్న సచ్చిదానంద తేజః కూటాన్ని తారక మంటారు.

మనస్సుతో మనస్సును చూస్తూంటే కొంతకాలానికి మనస్సులో వృత్తి శూన్యమవుతుంది. తరువాత పరబ్రహ్మ దర్శన మవుతుంది.

పాదరసానికి, మనస్సుకు స్వభావం చేత చఞ్చలత్వం ఉంది. ఈ రెండింటిని బంధిస్తే భూతలంలో ఏం సిద్ధించవు! ఈ రెండింటినీ మూర్ఛ పొందిస్తే రోగాలను తొలగిస్తాయి. ఈ రెండింటినీ మరణింపజేస్తే అవి బ్రదికిస్తాయి. వాటిని బంధిస్తే ఆకాశ గమనాన్ని బ్రహ్మత్వాన్ని ఇస్తాయి.

శరీరంలో అపానవాయువును పైకి లేపి, ప్రాణవాయువును కంఠానికి క్రిందికి తీసుకువెడుతూ యోగసాధన చేసేవాడు ముసలితనం లేనివాడై పదునారేండ్ల వయసు వాడవుతాడు.

ప్రాణాయామానికి, యోగానికి నాడీమండలశుద్ధి అవసరం. ఈ శుద్ధి లేనిదే కుంభక ప్రాణాయామం చేసే యోగ్యత ఉండదు.

పిఙ్గల నాడితో గాలిని పీల్చి కుంభకం చేసి ఇడా నాడితో గాలిని వదలాలి. ఇలా మూడు నెలలు సదా అభ్యాసం చేస్తే నాడులన్నీ శుద్ధమవుతాయి.

ఇలా సర్వసార తత్త్వోపనిషత్తులో ఇహపర సాధకమయిన రహస్యాలు చాలా చెప్పారు.

Sruthi Sourabham    Chapters    Last Page