Sruthi Sourabham    Chapters    Last Page

14. తైత్తిరీయ పాణినీయ

స్వరిత లక్షణ సమన్వయః

విదిత మైవైత త్సమేషాం వేద విదుషాం వేదే ఉదాత్తానుదాత్త స్వరితాది భేదేన స్వరా విద్యన్త ఇతి. తత్ర ఉచ్చస్థానే ఉదాత్తః. నీచస్థానే అనుదాత్తః, ఉచ్చతరేణ స్వరితశ్చ ఉచ్చార్యన్తే. లిఖిత గ్రంథేషు రేఖా రహితో వర్ణ ఉదాత్తో భవతి; వర్ణా ధస్థితా తిర్యగ్రేఖా అనుదాత్త బోధికా; వర్ణోర్ధ్వ స్థితా ఊర్థ్వరేఖా స్వరిత బోధికేతిచ వేదగ్రంథ పఠన పరాణాం సుపరిచిత మేవ.

కింతు పాణినీయ వ్యాకరణ శాస్త్రే స్వరలక్షణ కథనే ''ఉచ్చై రుదాత్తః'' (తాల్వాదిషు సభాగేషు స్థానేషు ఊర్ధ్వ భాగే నిష్పన్నోచ్‌ ఉదాత్త సంజ్ఞ స్స్యాత్‌) 'నీచై రనుదాత్తః'' (తాల్వాదిషు సభాగేషు స్థానే ష్వధోభాగే నిష్పన్నోజ్‌ అనుదాత్త సంజ్ఞస్స్యాత్‌.) 'సమాహార స్స్వరితః' ఉదాత్తానుదాత్తత్వే వర్ణ ధర్మౌ సమాహ్రియేతే యస్మిన్‌ సోచ్‌ స్వరిత సంజ్ఞ స్స్యాత్‌) ఇతి స్వర లక్షణ కథనావసరే స్థితం స్వరిత లక్షణం వైదికోచ్చారణ విరుద్ధతయా వర్తత ఇవావభాతి. (1) కథమనయో స్సమన్వయ ఇత ప్రశ్నో విద్యతే.

వ్యాకరణస్య సకల వేద సాధారణత్వాత్‌ కుత్రాపి స్థితం ఉదాత్తానుదాత్త వర్ణ ధర్మ సమాహార రూపం స్వరిత మాలక్ష్య సకల విధ స్వరితాణా ముత్సర్గ విధినా తత్ర తాదృశ లక్షణ ముచ్యతామ్‌. కింతు ప్రతి శాఖం ప్రత్యేక లక్షణం కథితుం ప్రవృత్తేషు ప్రాతిశాఖ్యేష్వపి పాణినీయ రీత్యా ఉదాత్తాది లక్షణ కథనం విస్మయం జనయిష్యతి. తథాహి; తైత్తిరీయ ప్రాతిశాఖ్యే ఉచ్చైరుదాత్త ఇత్యాది సూత్రత్రయం యథా తథం వర్తతే (2) కాత్యాయన ప్రాతిశాఖ్యే 'ఉచ్చైరుదాత్తః, నీచై రనుదాత్తః, ఉభయవాన్‌ స్వరితః' ఇతి లక్షణాని సన్తి. (3)

పాణినీయ శిక్షాన్తే ముద్రితే స్వర సంచార విధావపి

అనుదాత్తో నీచై ర్గతేన హస్తేన సూచ్యతే' ఉదాత్తోచ ఉపరిగతేన హస్తేన సూచ్యతే' 'స్వరితో మధ్యే తిష్ఠతి ఇత్యస్తి (4) అత్ర ఉదాత్తానుదాత్త లక్షణయో ర్నకాచన విప్రతి పత్తిః. స్వరితస్తూదాత్త తరోవా? ఉదాత్తానుదాత్త సమాహార రూపోవా? ఇతి శంకా ఉత్తిష్ఠతే. తదపనోదనార్థం స్వరితభేదాన్‌ పరిశీలయాయః.

1) క్షైప్రః 2) నిత్యః 3) ప్రాతిహతః 4) అభినిహతః 5) ప్రశ్లిష్టః 6) పాదవృత్తః 7) తైరోవ్యఞ్జనశ్చేతి స్వరితేషు సన్తి సప్తభేదాః.

I సూ : 'ఇవర్ణోకారయో రుదాత్తయోః యవకారభావే యస్స్వరితోవిహితః'

వృత్తి : ఉదాత్తయోః ఇవర్ణోకారయోః యథోపదేశం యవకార భావే సతి తస్మాత్పరతః స్థితస్య అనుదాత్తస్య స్వరితోయో విహితః స క్షైప్ర సంజ్ఞాయతే యథా :- విశ్యస్మిన్‌ రాష్ట్రే అత్ర శ్యవర్ణః క్షైప్ర స్వరితో భవతి. (20-1) (5)

II సూ : 'స యకార వకారం త్వక్షరం యత్ర స్వర్యతే స్థితే పదేనుదాత్త పూర్వే పూర్వేవా నిత్య ఇత్యేవ జానీయత్‌'

వృత్తి : స యకారం వా సవకారం వా అక్షరం పదకాలే యత్ర స్వర్యతే అనుదాత్త పూర్వే. అపూర్వేవా సః సర్వత్ర నిత్య ఏవేతి జానీయాత్‌. యథా :- ఉక్థ్యః. అత్రక్థ్య వర్ణః నిత్య స్వరితో భవతి. (20-2) (6)

III సూ : అపిచే న్నానాపదస్థ ముదాత్తం అథచే త్సాగ్‌ం హితేన స్వర్యతే సప్రాతిహతః.

వృత్తి : నానా పదస్థ మక్షరం ఉదాత్త పూర్వఞ్చేత్‌ పరతః నీచం సాంహితేన విధినా స్సర్వతే చేత్‌ స ప్రాతిహతో వేదితవ్యః. యథా : - మాతే అస్యామ్‌. అత్ర 'తే' కారః స్వరితః ప్రాతిహతో భవతి. (20-3) (7)

IV సూ : 'తస్మా దకార లోపే అభినిహతః'

వృత్తి : నానా పదస్థో దాత్తాత్‌ పరభూతస్య అనుదాత్తాకారస్య లోపే సతి యః స్వరితః సః అభినిహతో వేదితవ్యః యథా :- సో బ్రవీత్‌. (8)

V సూ : ఊభావే ప్రశ్లిష్టః

వృత్తి : నానా పదస్థో దాత్తాత్‌ ఊభావే యః స్వరితో విహితః స ప్రశ్లిష్ట సంజ్ఞోభవతి. యథా :- సూన్నీయ మివ (20-5) (9)

VI సూ : పద వివృత్త్యాం పాద వృత్తః

వృత్తి : స్వరయో రసంధి ర్వివృత్తిః. పదమధ్య వర్తిన్యాః వివృతే రుపరి యస్స్వరితః సపాద వృత్త సంజ్ఞో భవతి. యథా :- ప్రఉగముక్థమ్‌. అత్ర ఉకారః పాదవృత్త సంజ్ఞోభవతి. (10)

VII సూ : ఉదాత్త పూర్వ సై#్తరో వ్యఞ్జనః

వృత్తి : సమాన పదే ఉదాత్త పూర్వకో వ్యఞ్జన వ్యవహితోయ స్స్వరితః సతైరో వ్యఞ్జనో భవతి యథా : ఇమాం వాచమభి విశ్వేగృణన్తః. అత్ర శ్వే ఇతి తైరోవ్యఞ్జనో భవతి. (11)

ఏతేషు క్షైప్ర నిత్యయోః దృఢతరః ప్రయత్నః కార్యః. అభినిహతే దృఢయత్నః కార్యః. ప్రశ్లిష్ట ప్రాతిహతయోః మృదుతరః ప్రయత్నః కర్తవ్యః. తైరోవ్యఞ్జన పాదవృత్తయో రల్పతరః ప్రయత్నః కరణీయః. (20 అ. 9, 10, 11, 12 సూ. వ్యాఖ్య)

సప్తస్వేతేషు స్వరితః నతూదాత్తా నుదాత్త సమాహార రూపేణ శ్రూయతే.

అపిచ 'ద్వి యమ ఏకే ద్వి యమ పరే తా అణుమాత్రాః' ఇత్యనేన స్వరిత పరే స్వరితే ఏకే ఆచార్యాః (శిక్షాకారాః) అణుమాత్ర మనుదాత్త మిచ్ఛన్తీతి విజ్ఞాయతే. (19-3) అణుర్నామ హ్రస్వకాలస్య చతుర్థాంశః.

ఉదా :- పితృదేవత్యాం గ్‌హ్యేతత్‌. అత్ర 'త్యాం' ఇత్యస్య స్వరితే ఉదాత్తానుదాత్త సమాహార రూపత్వం దృశ్యతే (12)

కిన్తు పాణినీయే 'తస్యాదిత ఉదాత్త మర్ధహ్రస్వమ్‌' ఇతి స్వరితే అర్ధ హ్రస్వ ముదాత్త మితి కథితమ్‌ (13) అత్రతు అణుమాత్ర మనుదాత్త మితి వర్తతే. తస్మాత్‌ పాణినీ యోక్తః స్వరితః అస్మాత్‌ భిన్న ఏవ.

అన్యచ్చ 'తస్యాదిత ఉదాత్త మర్ధహ్రస్వ మిత్యస్య వ్యాఖ్యానే కేచన హ్రస్వగ్రహణ మవివక్షిత్వా హ్రస్వదీర్ఘ ప్లుతేషు ఆదావర్ధ ముదాత్త మిత్యవోచన్‌. అన్యేతు అర్ధ హ్రస్వ శ##బ్దే నార్ధ మాత్రా లక్ష్యత ఇతి మన్యన్తే. ఇతరే అర్ధ హ్రస్వ శబ్దో అర్ధ మాత్రాయాం రూఢ ఇత్యవోచన్‌. హ్రస్వాదిషు త్రివిధేష్వపి స్వరితేషు ఆదావర్ధమాత్రై వోదాత్తేతి భాష్య, కైయట, వృత్తి, హరదత్త గ్రన్థేషు స్థితమ్‌. తైత్తిరీయ ప్రాతిశాఖ్యేపి స్వరితేష్వాదా వర్ధమాత్రై వోదాత్త తరేత్యభిహితమ్‌ (14). తస్మాత్‌ పాణినీయోక్త లక్షణః స్వరితః తైత్తిరీయ యజుర్వేదే నాస్తీతి భాతి.

పాణినీయోక్త లక్షణలక్షితః స్వరితః బహ్వృచ శాఖాయాం వర్తత ఇతి స్వర సంచార విధా వస్తి. ఉదా :- క్వ1 వోశ్వాః. శతచక్రం యో3హ్యః. సిద్ధాంత కౌముద్యామపి ఇమే ఉదాహృతే. అత్రానుదాత్త భాగస్య ఉదాత్తే స్వరితే పరే సత్యేవ శ్రవణం భవతి. ఉదాత్త స్వరిత పరత్వా భావే తూదాత్తసై#్యవ శ్రవణం భవతి. నానుదాత్తస్య. (15) అయం కమ్ప స్వరిత ఇత్యుచ్యతే.

తైత్తిరీయ ప్రాతిశాఖ్యేతు తస్యాది రుచ్చై స్తరాముదాత్తా దనన్తరే యావదర్ధగ్‌ం హ్రస్వస్య (1-41) ఉదాత్త గుణా త్స్వరా దనన్తరే అవ్యవహిత పరే స్వరితే తస్యాది రుచ్చై స్తరా ముదాత్త తర ముచ్చార్యతే. ఇతి స్వరితాదౌ హ్రస్వార్ధస్యోదాత్తతరత్వం విహితమ్‌ 'ఉదాత్త సమశ్శేషః' ఇతి శిష్ట భాగస్య ఉదాత్త తుల్యత్వ మభిహితమ్‌ (1-42). ఏతేనాన్త్య భాగస్య అనుదాత్త ధర్మో నిరాక్రియతే 'సవ్యంజనోపి (1-43) వ్యంజన పూర్వక స్సర్వ స్వరితః అదౌ హ్రస్వార్ధ మాత్రే ఉదాత్త తరః, శిష్టాంశే ఉదాత్త సమశ్చ భవతీతి విహితమ్‌. అయమేవ స్వరితః సామాన్యతః దృశ్యతే తైత్తిరీయ శాఖాయామ్‌. 16

అపిచ 'అనన్తరో వా నీచై స్తరామ్‌' అనుదాత్త సమోవా (1-44; 45) ఇతి తత్రైవోక్తమ్‌. తత్తు అన్యశాఖా విషయమితి వ్యాఖ్యాత్రా గార్గ్యగోపాలయజ్వనా అభిహితమ్‌. ఆదిరస్యోదాత్త సమశ్శేషోనుదాత్త సమ ఇత్యాచార్యాః ఇతి చోక్తమ్‌ ఇదమేవ స్వమత మితి గార్గ్యగోపాల యజ్వా అవదత్‌. తమనూద్య తదాదౌ హ్రస్వార్ధ స్యోదాత్తతరత్వమ్‌ శిష్టస్యోదాత్త సమత్వ మపవాద విధానే నోక్త్వా స్వగ్రంథస్యవ్యాకరణ వైరుద్ధ్యం న్యవారయత్‌ (17).

బహ్వృచశాఖాయాం కమ్వస్వరిత మాత్రే ప్రవర్తమానం లక్షణం సకలస్వరిత సాధారణతయా కథం ప్రణినాయ పాణిని ముని రితి శంకా వర్తత ఏవ.

స్వరసిద్ధాంత చంద్రికా సంపాదకః శ్రీమాన్‌ క.అ. శివరామకృష్ణశాస్త్రీ.

''పూర్వభాగః ఉదాత్తతరః, ఉదాత్త సమః, ఉత్తరః అనుదాత్తసమః అనుదాత్తతరః, ఉదాత్త సమః, భాగవిశేషం వినాకృత్స్నః అచ్‌ ఉచ్ఛః ఇతి నానావిధాః స్వరితస్య దర్శితాః అతః సర్వసాధారణం స్వరూపం స్వరితస్య వివక్షన్‌ పాణినిః తద్గత ప్రకర్షా పరిహారేణ సూత్రం ప్రణినాయ. ప్రాతిశాఖ్యేతు విశిష్యతరపా స్వరితే శ్రుతి ప్రకర్షః ప్రదర్శిత ఇత్యవదత్‌ (18).

యది పాణిని మునే రయ మేవా శయః తర్హి ప్రచుర ప్రయోగవతః ఉదాత్త తరో దాత్త సమత్వ సై#్యవ స్వరితత్వ మవదిష్యత్‌. నత థోచే.

కిఞ్చ ప్రాతిశాఖ్యకారాః స్వాభిప్రాయానుగుణ్యన స్వరిత లక్షణ మనుక్త్వా ప్రథమం వ్యాకరణ మార్గేణ సమం సమాహార స్వరిత ఇతి లక్షణ ముక్త్వా పశ్చాత్తదాదౌ హ్రస్వార్థస్యోదాత్త తరత్వం కేన హేతునా అకథయ న్నితి ప్రశ్న స్తథైవ వర్తతే'. శీక్షాయాం

శ్లో. అనుదాత్తో హృదిజ్ఞేయో మూర్ధ్న్యుదాత్త ఉదాహృతః, స్వరితః కర్ణ మూలీయ స్సర్వాస్యేప్రచయస్మృతః ఇత్యనుదాత్తాది లక్షణా న్యుక్తాని (19). అత్ర ఋషి స్సూక్ష్మేక్షికయా అనుదాత్తా ద్యుచ్చారణ నిదాన భూతం ప్రేరణం యేభ్యః ఆగచ్ఛతి తాని స్థానా న్యాహ. అనుదాత్తోచ్చారణస్య ఆది ప్రేరణం హృదయేభవతి. ఉదాత్తస్య మూర్ధ్ని తాదృశ ప్రేరణం భవతి. స్వరితోచ్చారణ హృదయ మూర్ధోభయస్థానాభ్యాం లబ్ధప్రేరణః కర్ణమూలీయాభ్యా ముతిక్షప్యమాణః హ్రస్వార్ధే ఉదాత్తతరత్వే నోచ్చారిత స్స్వరితో భవతి. స్వత్యతే పార్శ్వత ఉతిక్షప్యత ఇతి స్వరితః ఇతి విగ్రహాత్‌. యథా హస్తేనైకేన ఉన్నేతుం శక్యం వస్తు ఏకేన హస్తే నోన్నీయతే. గురు తమం వస్తూభయ హస్తాభ్యా మున్నీయతే. తథైవోచ్చతరోచ్చారణార్థం హృన్మూర్ధోభయ జన్య ప్రయత్న స్యావశ్యకత్వ మితిభాతి.

ఏతాదృశం శీక్షామతం, కమ్ప స్వరిత లక్షణ మపి సంజిగృక్షద్భిః వ్యాకరణాచార్యైః ప్రాతిశాఖ్యకారైశ్చ సమాహార స్స్వరితః ఇతి లక్షణ ముక్తమితి ప్రతిభాతి. ఏతద్రీత్యా సూత్రస్యాస్య ఉదాత్త నుదాత్తత్వే వర్ణధర్మౌ సమాహ్రియేతే యస్మిన్‌ సోచ్‌ స్వరిత సంజ్ఞ స్స్యాదితి వివరణం కమ్పస్వరితే, ఉదాత్త తరోదాత్త సమత్వే వర్ణధర్మౌ సమాహ్రియతే యస్మిన్‌ సోచ్‌ స్వరిత ఇతి వివరణం తైత్తిరీయ ప్రాతిశాఖ్యోక్త స్వరితే, హృదయ మూర్ధోభయ జన్మనా ప్రయత్నేన కర్ణమూల భాగోచ్చార్యమాణః స్వరః స్వరిత ఇతి గార్గ్య గోపాల యజ్వకృత వివరణం సర్వస్వరితేచ సమన్వేతి.

వైదికోచ్చారణ శ్రూయమాణ స్వరితేన సమన్వయార్థం ప్రాతిశాఖ్య కారైః హ్రస్వార్ధస్యోదాత్త తరత్వమ్‌; శిష్టస్యోదాత్త సమత్వఞ్చ విహితమితిశమ్‌.

అధస్సూచికా

1. శ్రీ భట్టోజీ దీక్షితః సిద్ధాన్త కౌముదీ సంజ్ఞ 5, 6, 7, సూ.

2. తైత్తిరీయ ప్రాతిశాఖ్యమ్‌ - I - 38, 39, 40, సూత్రాణి

3. కాత్యాయన ప్రాతిశాఖ్యమ్‌ 1-101-10

4. పాణినీయ శిక్షా భార్గవ్‌ పుస్తకాలయ్‌, గయాఘాట్‌, బనారస్‌ : 69 పు.

5. తైత్తిరీయ ప్రాతిశాఖ్యమ్‌ 20-1 సూ.

6. తైత్తిరీయ ప్రాతిశాఖ్యమ్‌ 20-2 సూ.

7. తైత్తిరీయ ప్రాతిశాఖ్యమ్‌ 20-3 సూ.

8. తైత్తిరీయ ప్రాతిశాఖ్యమ్‌ 20-4 సూ.

9. తైత్తిరీయ ప్రాతిశాఖ్యమ్‌ 20-5 సూ.

10.తైత్తిరీయ ప్రాతిశాఖ్యమ్‌ 20-6 సూ.

11. తైత్తిరీయ ప్రాతిశాఖ్యమ్‌ 20-7 సూ.

12. తైత్తిరీయ ప్రాతిశాఖ్యమ్‌ 19-3 సూ.

13. సిద్ధాంత కౌముదీ - సంజ్ఞ 8 సూ.

14. స్వరసిద్ధాన్త చంద్రికా తస్యాదిత సూత్ర వ్యాఖ్యా

15. పాణినీయ శిక్షా 'స్వరసంచార విధిః' 71 పు.

16. తైత్తిరీయ ప్రాతిశాఖ్యమ్‌ - 1-41, 42, 43 సూ.

17. తైత్తిరీయ ప్రాతిశాఖ్యమ్‌ - 1-44, 45, 46 సూ.

18. స్వర సిద్ధాంతచంద్రికా 'ఉపోద్ఘాతః (xiii) పు.

19. తైత్తిరీయ ప్రాతిశాఖ్యమ్‌ - 1-40 సూ. వ్యాఖ్య.

వ్యాససారం

శ్రీకృష్ణయజుర్వేదంలో ఉదాత్తం, అనుదాత్తం, స్వరితం అని స్వరాలున్నాయి. ఈ వేదగ్రంథాల్లో స్వరితాన్ని సూచించటానికి పైన నిలువు గీత, అనుదాత్తాన్ని సూచించడానికి అడుగున అడ్డగీత వ్రాస్తారు. ఉదాత్తానికి మాత్రం పై రెండు రకాల గీతలూ ఉండవు.

పాణినీయ వ్యాకరణ శాస్త్రంలో ''ఉచ్చైరుదాత్తః'' (భాగాలతో కూడిన తాలువు మొదలయిన స్థానాల్లో ఊర్ధ్వభాగమందు పుట్టిన అచ్చు ఉదాత్తం.) నీచై రనుదాత్తః'' (భాగాలతో కూడిన తాలువు మొదలయిన స్థానాల్లో క్రింది భాగంలో పుట్టిన అచ్చు అనుదాత్తం.) ''సమాహార స్స్వరితః'' (ఉదాత్తత్వం, అనుదాత్తత్వం అనే వర్ణ ధర్మాలు ఏ అచ్చు యందు కలిసి ఉంటాయో ఆ అచ్చు స్వరితం) అనే సంజ్ఞలను పొందుతాయని నిర్వచించారు.

కాని తైత్తిరీయ శాఖలో స్వరాలు పై గీతలు సూచించిన దాని కనుగుణంగా ఉంటాయి. అంటే స్వరితం బాగా పై భాగంలో ఉచ్చరిస్తున్నట్లు అనుదాత్తం బాగా క్రింది భాగంలో ఉచ్చరిస్తున్నట్లు, ఉదాత్తం అనుదాత్తం కంటే పైన స్వరితం కంటే క్రింద ఉచ్చరింపబడుతున్నట్లు ఉంటాయి.

వ్యాకరణం లక్షణం, వేదం లక్ష్యం ఈ రెండింటికీ తేడా ఎందుకు వచ్చిందని సంశయం కలుగుతుంది. పాణినీయం అన్ని వేదశాఖలకు ప్రవర్తించేది. కనుక దానిలో లక్షణాలు తు.చ. తప్పకుండా ప్రతి వేదశాఖకు ప్రవర్తించకపోవచ్చు. కాని తైత్తిరీయ వేదశాఖనుద్దేశించి బయలుదేరిన ప్రాతి శాఖ్యలో కూడా పాణినీయంలో చెప్పిన స్వరలక్షణ సూత్రాలే ఉండడం వింత. లక్షణానికి లక్ష్యం సరిపడాలి గదా! వీటి సమన్వయ మెలాగ అని ప్రశ్న.

శ్రీకృష్ణయజుర్వేదంలో క్షైప్రము, నిత్యం, ప్రాతిహతం, అభినిహతం, ప్రశ్లిష్టం, పాదవృత్తం, తైరోవ్యంజన అని ఏడు రకాల స్వరితాలున్నాయి. వీటిలో ఏ ఒక్కదానిలో ఉదాత్తానుదాత్తాల కలయిక కనబడదు.

ఉదా :- 1) విశ్యస్మిన్‌ రాష్ట్రే దీనిలో శ్యవర్ణంలో ఉన్న అకారం క్షైప్రం.

2) 'ఉక్థ్యః' ఇక్కడ 'క్థ్య' వర్ణంలో ఉన్న అకారం నిత్యం.

3) 'మాతే అస్యామ్‌' దీనిలో తేలో ఉన్న ఏకారం ప్రాతిహతస్వరితం

4) 'సో బ్రవీత్‌' దీనిలో అకార ప్రశ్లేషలో లోపించిన అకారం అభినిహిత స్వరితం.

5) 'సూన్నీయమివ' దీనిలో సూకారంలో ఉన్న ఊకారం ప్రశ్లిష్టం.

6) 'ప్రఉగ ముక్థమ్‌' దీనిలో ఉకారం పాదవృత్తం.

7) ఇమాం వాచ మభివిశ్వేగృణన్తః' ఇక్కడ 'శ్వే' లో ఉన్న ఏకారం తైరోవ్యంజన స్వరితం.

కాని 'పితృదేవత్యాంగ్‌ హ్యేతత్‌' అనేచోట త్యాం అనే దానిలో ఆకార మందున్న స్వరితంలో ఉదాత్తానుదాత్తాల సమాహారం ఉంది.

కాని పాణినీయంలో స్వరితంలో 'అర్ధ్రహ్రస్వం ఉదాత్తం; మిగిలింది అనుదాత్తం'అని 'తస్యాదిత ఉదాత్త మర్ధ హ్రస్వమ్‌'అనే సూత్రం చెబుతుంది. అర్ధ హ్రస్వమనే మాటకు 'స్వరితంలో సగభాగం' అని కొందరు, 'స్వరితంలో ఒక అర్ధ మాత్ర' అని కొందరు అర్థం చెప్పారు. అంటే దీర్ఘాక్షరం స్వరితమయినపుడు దానిలో అర్ధమాత్ర ఉదాత్తం, 11/2 మాత్రలు అనుదాత్తం కావాలి.

కాని 'పితృదేవత్యాంగ్‌ హ్యేతత్‌' అనేచోట 'త్యాం'లో ఉండే స్వరితంలో చివరి 'అణుమాత్రం'మాత్రమే అనుదాత్తమని 'ద్వియమ ఏకే ద్వియ మపరేతా అణుమాత్రాః' అనే ప్రాతిశాఖ్య సూత్రం చెబుతోంది. 'అణుమాత్రం' అంటే హ్రస్వంలో నాలుగవ వంతు. కనుక పాణినీయం చెప్పిన స్వరితం కంటె ఈ స్వరితం వేరు. పాణినీయంలో చెప్పిన ఋగ్వేదంలో ఉంది.

తైత్తిరీయ ప్రాతిశాఖ్యలో 'ఉదాత్త స్వరానికి అవ్యవహిత పరంగా ఉన్న స్వరితంలో మొదటి భాగం ఉదాత్త తరమవుతుంది. మిగిలిన భాగం ఉదాత్త మవుతుం'దని 'తస్యాది రుచ్చైస్తరా ముదాత్తా దనన్తరే యావదర్ధగ్‌ం హ్రస్వస్య' 'ఉదాత్త సమశ్మేషః' అనే సూత్రాలు విధిస్తున్నాయి. 'సవ్యంజనోపి'అనే సూత్రంవ్యంజన పూర్వక మయిన సర్వస్వరితమూ మొదట హ్రస్వార్ధ మాత్రం ఉదాత్తతరం, మిగిలిన భాగం ఉదాత్త సమం అవుతాయని చెబుతోంది. తైత్తిరీయ వేదశాఖలో సామాన్యంగా కనబడే స్వరిత మిది.

శీక్షలో 'అనుదాత్తం హృదయమందు, ఉదాత్తం మూర్ధ మందు, స్వరితం కర్ణమూలములందు ప్రేరణాన్ని పొందుతాయని సూచించారు. 'స్వర్యతే పార్శ్వత ఉతిక్షప్యత ఇతి స్వరితః'అనే నిర్వచనాన్ని బట్టి స్వరితోచ్చారణానికి హృదయమూర్ధోభయజన్య ప్రయత్నం అవసరమని తోస్తుంది. ఈ శీక్షామతాన్ని ఋగ్వేదంలో ఉన్న స్వరిత లక్షణాన్ని గ్రహించాలనే కోరికతో వ్యాకరణాచార్యులు, ప్రాతిశాఖ్యకారులు ఒకే రకమయిన లక్షణాన్ని చెప్పి ఉంటారు. కాని ఆ లక్షణాలను వేరు వేరు సందర్భాలలో వేరు వేరు విధాలుగా వివరించుకోవాలి.

ఋగ్వేదంలో స్వరితం ఉదాత్తానుదాత్త వర్ణధర్మాలు కలిసిందిగాను, తైత్తిరీయంలో ఉన్న స్వరితం ఉదాత్తతర, ఉదాత్త వర్ణ ధర్మాలు కలిసింది గాను, వివరించుకోవాలి. హృదయ మూర్ధోభయములందు కలిగిన ప్రయత్నంచే కర్ణమూల భాగమున ఉచ్చరింపబడేది స్వరితమనే లక్షణం అన్ని స్వరితాలకూ వర్తిస్తుంది. ఇలా 'సమాహారస్స్వరితః' అనే సూత్రం పలు అర్ధాలనిస్తూ అన్ని రకాల స్వరితాలకు లక్షణాన్ని చెబుతోంది.

Sruthi Sourabham    Chapters    Last Page