SARA SUDHA CHINDRIK    Chapters   

ఓం తత్‌ సత్‌

శ్రీ గణశాయనమః శ్రీరామచంద్రపరబ్రహ్మణనమః

10. ఛాందోగ్యోపనిషత్తు.

ప్రధమ అధ్యాయము

ఈ ఉపనిషత్తు సామవేద తలవ కార శాఖాంతర్గత ఛాందోగ్య బ్రాహ్మణ భాగము.

ఓంకార రూప అక్షరమును ఉద్గీధశబ్ద వాచ్య పరమాత్మ రూపమున ఉపాసించవలెను. జీవునకు సముపృధ్వి, పృధ్వికి జలము, జలమునకు ఓషధులు, ఓషధులకు మానవశరీరము, మానవునకు ప్రధాన అంగమగు వాణి, వాణికి ఋచ, ఋచకుసామము, సామమునకు ఉద్గీధ (ఓంకారము) రసములైన ఆధార భూతములుగా నున్నది. ఊద్గీధరూప (ఓంకారము) సమస్త రసములందు ఉత్కృష్టరసము. సర్వశ్రేష్ఠ పరబ్రహ్మ పరమాత్మ యొక్క ధామము. వాణి, ఋచ, ప్రాణము సామము, ఓంకారము ఉద్గీధ, వాణి , ప్రాణములను ఓంకారమునందు లయింపజేసిన పూర్ణకాముడై కృతకృత్యుడగును. ఓంకారము అనుమతి, ఓంకారము ఋక్‌, యజుః సామవేదముల, యజ్ఞములందు అధ్వరుయు, ఋత్విక్‌, ఉద్గాతలు ఓంకార పూర్ణమంత్ర పఠనము చేయుదురు. (ఓంకారముయొక్క వ్యాఖ్య.)

2) ఓంకారముయొక్క ఆధ్యాత్మిక ఉపాసన:- దేవతలు, అసురులు ఒండారులతో పోరుచుండిరి. విజయము కొరకు దేవతలు ఓంకారమును ద్యేయముగా ఉపాసనాయజ్ఞమారంభించిరి. నాసికయందలి ఘ్రాణంద్రియము, వాణి, నేత్రములు, శ్రోత్రములు, మనస్సులను ప్రధానముగా జేసి ఉద్గీధ ఉపాసన చేయజొచ్చిరి. కాని రాక్షసులు ఆయా ఇంద్రియములను క్రమముగా రాగ ద్వేషము లచే అభి భూతముల చేయుటచే జీవుడు మంచిచెడులను వానిద్వారా గ్రహించుడు రాగ ద్వేషయుక్తుడాయెను. పిదప దేవతలు ప్రాణమును ఉద్గీధరూపమున ఉపాసించిరి. అసురులు దానిని కూడా రాగ ద్వేషములచే అభిభూతము చేయగడంగిరి. కాని రాతిని ఢీకొనిన మట్టి పెల్లవలె భిన్న భిన్న మైనది. ఉద్గీధరహస్యము తెలిసినవారికి అహితము చేయగోరు వారు భిన్నా భిన్నమగుదురు. అంగీర ఋషి ఓంకారమును ప్రతీకగా నెంచి ఓంకార స్వరూప పరమాత్మను ఉపాసించెను.అందు చేఆయనను ఆంగీరస (సమస్త అంగముల రసపోషకుడు) అందురు. బృహస్పతికూడా (ప్రాణమును ఓంకార స్వరూప పరమాత్మ వాచ్య ఉద్గీధగా ఉపాసించెను. కావున ఆయన వాణి (బృహత్‌) పతి, రక్షకుడు. ఆయాస్యముని కూడా ప్రాణమును ఉద్గీధ రూపమున ఉపాసించెను. ప్రాణము ఆస్య (ముఖము) ద్వారా లోపలికి బయటకు వెడలును. కావున ప్రాణమును ఆయాస్యమందరు.

3) ఓంకారముయొక్క అధిదైవిక ఉపాసన:-

సూర్యుని ఉద్గీధ రూపమున ఉపాసించవలెను. సూర్యుడు ఉదయించి సమస్త ప్రజలకు అన్నాదుల ఉత్పత్తి ఉద్దేశ్యముచే ఉద్గానముచేసిన వారికి ఉన్నతికి కారణభూతుడగును. అంధకార భయనాశకుడు ప్రాణము సూర్యుడు సమానుడే రెండింటి యందు ఉష్ణము , స్వరము (క్రియాశక్తి) ప్రత్యాస్వర (ఇతరులకు క్రియాశక్తి) నిచ్చువారు. కావున ప్రాణమును సూర్యుని రూపమున ఉద్గీధోపాసన చేయవలెను. ప్రాణాపాన క్రియల సంధియే వ్యానము. వ్యానమే వాణి, సాధారణముగా మాట్లాడునపుడు ఉచ్ఛ్వాస, నిశ్వాసక్రియ జరుగదు. వాణియే ఋచ , ఋచమేసామము, సామమే ఉద్గీధ. కావున మానవుడు ఉచ్ఛ్వాసక్రియ జరుపకనే ఉచ్చస్వరమున ఉద్ధీధ గానము చేయవలెను. కష్టతరకార్యములు చేయునపుడుకూడా మానవుడు శ్వాసక్రియ జరుపడు. కావున ప్రాణ పానవ్యాసములందు వ్యానము శ్రేష్ఠము. కావున వ్యానరూపమున ఉద్ఘీదోపాసన చేయవలెను. ఉద్గీధశబ్దమందు 'ఉత్‌' ప్రాణము, (ఉద్ధానవాచకము) గీ. (వాణీ వాచకము) ధ (అన్నవాచము) ఉత్‌ స్వర్గలోకము, గీ, అంతరిక్షలోకము, ధ భూలోకము, ఉత్‌ ఆదిత్యుడు, గీ, వాయువు, ధ అగ్ని, ఉత్‌ సామవేదము, గీ యజుర్వేధము, ధ ఋగ్వేదము. కావున ఉద్గీద శబ్ద మందలి మూడు అక్షరములు ఓంకారవాచ్య పరమాత్మ రూపమున ఉపాసించవలెను.

4) ఓంకారోపాసన చే అమృతత్వప్రాప్తి:- ఓంకారమునే ఉద్గాత ఉచ్చ స్వరమున గానము చేయును. దేవతలు మృత్యువు చే భయపడి ఋక్‌ యజు, సామ వేదముల ప్రవేశించి గాయత్రిని ఛందములచేతమను ఆచ్ఛాదితము చేసుకొని తమకు కవచము గాచేసుకొనిరి. వేదమంత్రములకంటె పై నున్న ఓంకారమునందు ప్రవిష్టులై అమృతత్వము పొందిరి. ఓంకారము పరమాత్మవాచ్య మగుటచే మృత్యుభయ రహిత అమృతత్వము.

5) సూర్యరూపమున ఓంకారోపాసన:- ఉద్గీధగాముచేయు పరమాత్మయే ప్రణవరూప ఓంకారము. నామీ నామములందు భేదములేదు. సూర్యుడు ఓంకారము నుచ్చరించుచు గమనము చేయువాడు. 'స్వరన్‌ఏతి' కావున సూర్యుడాయెను. ముఖ్య ప్రాణము కూడా సూర్యరూపమే. ప్రాణము ద్వారా నిరంతర ఓంకారధ్వనికలుగును. ఓంకారయుక్త భగవన్నామోచ్ఛారణ చే యజ్ఞములందలి అన్ని లోపములు తొలగును.

6) వివిధ రూపముల ఉద్గధోపాసన:- పృధ్వి ఋక్స, అగ్ని సామము, పృధ్వి 'సా' అగ్ని 'ఆమ' రెండును కలసి సామము, అటులనే అంతరిక్షము ఋక్‌, వాయువు సామము, ద్యులోకము ఋక్‌, సూర్యసామము, నక్షత్రమండలము ఋక్‌ , చంద్రుడు సామము, సూర్యుని ప్రకాశము ఋక్‌, అందలి నీలత్వము సామము, సూర్యాంతరీపురుషుడు పరమాత్మయే. పరమాత్మయే స్వర్గాది లోకముల శాసకుడు.

7) శరీర పరముగా :- వాగింద్రియము ఋక్‌, ప్రాణము సామము, నేత్రము ఋక్‌, అందలినల్ల గ్రుడ్డు సామము, శ్రోత్రము ఋక్‌, మనస్సు సామము, కన్నులయందలి శ్వేత ప్రకాశము ఋక్‌, నీలకాంతి సామము, నేత్రము నందలి పురుషుడే ఋక్‌ యజుసామవేదరూప పరబ్రహ్మ, ఆదిత్య మండలస్థ పురుషుడు, నేత్రస్థిత పురుషుడు ఆ పరమాత్మయే ఓంకార స్వరూప పరమాత్మయే స్వర్గాది సమస్త లోకముల శాసకుడు. సర్వభోగములు ఆయన వలననే ప్రాప్తించును.

8-9) శిలకదాలభ్యమునుల సంవాదము:- శిలకుడు దాలభ్యుని ప్రశ్నించెను. దాని జవాబు- సామమునకు స్వరము, స్వరమునకు ప్రాణము, ప్రాణమునకు అన్నము, అన్నమునకు జలము, జలమునకు స్వర్గలోకము ఆశ్రయములు. దాలభ్యుని ప్రశ్నకు శిలకుని జవాబు- స్వర్గలోకమునకు మనుష్యలోకము ఆధారము. శిలకుని ప్రశ్నకు ప్రవహణుని జవాబు- మనిష్యలోకమునకు ఆధారము ఆకాశము, సర్వము ఆకాశమునుండియే ఉత్పన్న మగును. కావున ఆకాశ స్వరూప పరమాత్మయే ఉద్గీధ, అట్లు ఉద్గీధోపాసన చేయుటచే నిశ్చయముగా గొప్ప లోకములు పొందును.

10-13) ఉషిత్పుడు ప్రస్తోతనుప్రశ్నించెను. నీవు స్తుతించు దేవత ఎవరు? ప్రస్తోత సమాధానముచెప్ప లెక ఉషిత్సు నే చెప్పమనెను. ప్రస్తోతస్తుతించుదేవత ప్రాణము , ఉద్గాత స్తుతించుదేవత, సూర్యుడు, ప్రతిహరిస్తుంతిచు దేవత అన్నము. కావున పరమాత్మను అన్నమొసంగుమని ప్రార్థించెను. సామగాన సమయమున స్వరలయ పూర్తికి ప్రయోగించు 13 శబ్దములను 'సోభ' యందురు. అవి హావు -మనుష్యలోకవాచకము, హాఇ- వాయు లోక, అధ- చంద్రలోక, ఇహ-ఆత్మ, ఈ-అగ్నిరూప, ఊ- సూర్యరూప, ఏ-ఆవాహన బోధక, జేహాయి- విశ్వదేవ , హిం- ప్రజాపతి, స్వరూప, సర్వ- ప్రాణరూప , యా-అన్నరూప, వాక్‌- విరాట్‌ రూప, హ్కం- నిర్విశేష బ్రహ్మవాచకము. సామరహస్యము తెలిసినవారికి వాణి స్వయముగా తన రహస్యములు ప్రకటించును. అట్టి వారు భోగములనుభవింతురు.

------

ఛాందోగ్యోపనిషత్తు - ద్వితీయ అధ్యాయము

ఓం సమస్త సామముయొక్క ఉపాసనసాధువు. సామమునకు సాధువు. సామమునకు సాధు, శుభ అను అర్థములు కూడా కలవు.

ఐదు ప్రకారముల సామోపాసన చేయవలెను. (1-7)

(అ) పృధ్వి హింకారము, అగ్ని ప్రస్తారము, అంతరిక్షము ఉద్గీధ, ఆదిత్యప్రతీహార, ద్యులోకమునిధనము, ఈవిదముగా పైలోకముల సమావిష్టము.

(ఆ) ద్యులోకమహింకారము, ఆదిత్యప్రస్తారము, అంతరిక్ష ఉద్గీధ. అగ్నిప్రతీహారము, పృధ్వినిధనము -ఇవి అధోలోక సామోపాసన నిరూపణము.

(ఇ) పూర్వవాయువు హింకారము, మేషముపుట్టుట ప్రస్తారము, వర్షించుట ఉద్గీత, మెరుపు ఉరుములు ప్రతీహారము, జల, గ్రహణమునిధనము. ఇది వృష్టియందలి 5 విధముల సామెపాసన.

ఈ) జలమునందు సామోపాసన- మేఘముఘనీభవించుట హింకారము,వర్షించుట ప్రస్తారము, నదులు తూర్పుగా ప్రవహించుట ఉద్గీధ, పశ్చిమమునకు ప్రవహించుట ప్రతీహారము, సముద్ర నిధనము.

(ఉ) ఋతువుల యందు సామోపాసన - వసంతము హింకారము, గ్రీష్మము ప్రస్తారము, వర్ష ఋతువు ఉద్గీధ, శరత్‌ ప్రతీహారము, హేమంతము నిధనము.

(ఊ) పశువులలో సామోపాసన- మేకలు హింకారము, గొర్రెలు ప్రస్తారము, ఆవులు ఉద్గీధ, గుర్రములు ప్రతిహారము, పురుషుడు నిధనము

(ఋ) ప్రాణమునందు సామోపాసన- ప్రాణము హింకారము, నాక్కు ప్రస్తారము, చక్షువులు ఉద్గీధ, శ్రోత్రుము ప్రతీహారము, మనస్సు నిధీనము. ఈ ఉపాసన ఉత్తరోత్తరా ఉత్కృష్టము.

8-21) అ) వాణియందు సమస్త విధ సామోపాసన- వాణియందు 'హ్కం' హింకారము, ప్ర- ప్రస్తారము, ఆ-ఆది, ఉత్‌- ఉద్గీధ, ప్రతి- ప్రతిహారము, ఉప- ఉపద్రవము, ని- నిధనము, ఈ ఉపాసనచేయువారు అన్నము చే సంపన్నులై భోక్తలగుదురు.

(ఆ) ఆదిత్యదృష్టిచే సప్తవాధ సామోపాసన-

ఆదిత్యుడు సర్వదా సముడు, నాయెడల అందరియెడల సమముగా నుండుటచే సామము. ఆదిత్యనందు సర్వభూతములు అనుగతము, సూర్యాదయపూర్వము హింకారము, పశువులు అనుగతము కావున హింకారము చేయును. సూర్యుని ప్రధమ రూపము. ప్రస్తారము. మనుష్యుడు అనుగామి, కావున మనుష్యుడు సూర్యుని ప్రస్తుతి (ప్రత్యక్షస్తుతి) ప్రశంశ (పరోక్షస్తుతి) చేసి సేవించును. సంగమవేళ (3 జాముల తర్వాత) ఆది, ఆరూపమునకు పక్షులు అనుగతము, కావున అవి అంతరిక్షమున నిరాధారముగా అన్ని దిశలచరించును. మధ్యందినరూపము ఉద్గధ. దేవతలు అనుగతములు, కావున ప్రజాపతి సృష్టిలోని సర్వప్రాణులు శ్రేష్ఠులు. ఉద్గీధ భక్తులు. మధ్యాహ్న, అపరాహ్న, మధ్యకాలములు ప్రతీహారము. అనుగామిగర్భము. కావునపైకి ఆకృష్టమైన క్రిందపడదు. అపరాహ్ణ సూర్యస్థమధ్య కాలము ఉపద్రవము.అనుగామి వన్య పశువులు. కావున పురుషుని చూచి భయముచే అడవుల లోనికి గుహలలోనకి పారిపోవును. సూర్యాస్తపూర్వము నిధనము. అనుగతము పితృగణము, కావున వారిని శ్రద్ధాకాలమున దర్భలపై స్థాపించెదరు.

(ఇ) మృత్యువుకంటె అతీత సప్త విధ సామోపాసన- హింకార , ప్రస్తార, ఆది, ప్రతిహార, ఉద్గీత, ఉపద్రవ, నిధన మొత్తం 22 అక్షరములు. మూడేసి అక్షరముల సమానత్వమున 21 అక్షరములద్వారా సాధకుడు ఆదిత్య లోకమునుపొందును. 22వ అక్షరముచే మృత్యువుకంటె అతీతమగులోకముపొందును.

(ఈ) గాయత్రిసామోపాసన- మనస్సు హింకారము, వాక్కు, ప్రస్తారము, చక్షు ఉద్గీధ శ్రోత్రము ప్రతిహారము, ప్రాణము నిధనము గాయత్రి సంజ్ఞక సామోపాసన చేయువారు పూర్ణాయువుపొంది ప్రశస్తజీవనము, ప్రజ, పశు, కీర్తి, పొంది మనస్వియగును.

(ఉ) రధంతర సామో పాసన- అభిమంధనము హింకారము, ధూమము ప్రస్తారము, ప్రజ్వలించుట ఉద్గీధ, అంగారము ప్రతిహారము, శాంతిచుట నిధనము. రధంతర సామోపాసకులు, బ్రహ్మతేజ సంపన్నులై పూర్ణ జీవులై, ఉజ్వల జీవనము గడపి, ప్రజ, పశు కార్యాదులచే మహాత్ముడగును. అగ్ని వైపు ముఖముంచి భక్షణ, ఉమ్ముట చేయరాదు.

(ఊ) వామదేవ్య సామోపాసన- స్త్రీ పురుష సంకేతము హింకారము, పరస్పర సంతోషము ప్రస్తారము, సహశీయనము ఉద్గీధ, అభిముఖ శయనము ప్రతిహారము. సమాప్తి నిధనము, మిధున మందు వామదేవ్య సామోపాసన చేయువారు వియోగము పొందరు. సత్సంతానము పొంది, పూర్ణాయువుకలిగి, ఉజ్వల జీవితము గడపుచు, ప్రజా, పశు,కీర్తి, పొంది మహాత్ములగుదురు. పరస్త్రీ అపహరణ, వ్యభిచారము చేయకూడదు. ఇది వ్రతము.

(ఋ) బృహత్సామోపాసన- ఉదయించు సూర్యుడు హింకారము, ఉదయించిన సూర్యడు ప్రస్తారము, మధ్యాహ్న కాలము ఉద్గీధ, అపరాహ్ణము ప్రతీహారము, అస్తమించు సూర్యుడు నిధనము. సకలముపొందెదరు. సూర్యనిందచేయరాదు.

(బూ) వైరూపసామోపాసన- మేఘములు కలయుట హింకారము, మేఘములు ఉత్పన్నమగుట ప్రస్తారము, వర్షించుట ఉద్గీధ, మెరుపులు ఉరుములు ప్రతిహారము, వర్షము ఆకుట నిధనము. వర్షించు మేఘముల నిందించరాదు.

ఎ) వైరాజసామోపాసన- వసంతము హింకారము, గ్రీష్మము ప్రస్తారము, వర్ష ఋతువు ఉద్గీధ, శరత్‌ ప్రతీహారము, హేమంతము నిధనము.ఋతునిందచేయరాదు.

ఏ) శక్కరీ సామోపాసన- పృధ్వి హింకారము, అంతరిక్షము ప్రస్తారము, ద్యులోకము ఉద్గీధ, దిశలు ప్రతిహారము, సముద్రము నిధనము.

ఐ) రేవతీ సామోపాసన- మేక హింకారము, గొర్రెలు ప్రస్తారము, ఆవులు ఉద్గీధ, గుర్రములు ప్రతిహారములు, పురుషుడు నిధనము

ఒ) యజ్ఞ యజ్ఞేయ సామోపాసన- లోమముహింకారము, త్వచ ప్రస్తారము, మాంసము ఉద్గీధ, అస్థి ప్రతిహారము. మజ్జనిధనము. మాంస భక్షణ చేయరాదు.

ఓ) రాజససామోపాసన- అగ్నిహింకారము, వాయువు ప్రస్తారము, ఆదిత్యుడు ఉద్గీధ, నక్షత్రములు ప్రతిహారము, చంద్రుడు నిధనము, దేవతల సాలోక్య సాయుజ్యప్రాప్తి పొందును. బ్రాహ్మణ నింద చేయరాదు.

ఔ) సర్వానుస్యూత సామోపాసన- త్రయీవిద్యహింకారము, మూడు లోకములు ప్రస్తారము, అగ్ని, వాయు, ఆదిత్యులు, ఉద్గీధ, నక్షత్రములు , పక్షులు, కిరణములు ప్రతిహారములు, సర్వగంధర్వ పితృగణములు నిధనము. సర్వరూపమును పొందును. నేనే సర్వము అని ఉపాసించవలెను.

22) అగ్ని సంబంధమగు ఉద్గీధ:- సామముయొక్క వినిర్ది నామక గానము అగ్ని దేవతాసంబంధ ఉద్గీధ, ప్రజాపతి ఉద్గీధ అనిరుక్తము, సోమునిది నిరుక్తము, వాయువు మృదులము, ఇంద్రుని విశ్లష్ణ బలవంతము, బృహస్పతిదిక్రౌంచము, వరుణునిది భ్రష్టము, వరుణుని ఉద్గీధ పదవి మిగిలినది సేవించవలెను. దేవతలకు అమృతత్వము పితృగణములకు స్వధా మనుష్యులకు ఆశ (ఇష్టవస్తువులు) పశువులకు తృణము, యజమానికి స్వర్గలోకము, తనకొరకు అన్నము, సాధనకొరకు. ప్రమాదరహితముగా స్తుతించవలెను. సంపూర్ణ స్వరములు ఇంద్రునియఆత్మ, సమస్త ఊష్మ వర్ణములు ప్రజాపతి ఆత్మ, సమస్త స్పర్శ వర్ణములు మృత్యువుయొక్క ఆత్మ. స్వరములకు ఉచ్చారణయందు దోషమువచ్చిన ఆయా అధిదేవతల శరణు పొందవలెను. సంపూర్ణ స్వరములను ఘోషయుక్తముగా , బలయుక్తముగా ఉచ్చరించవలెను. ఊష్మ వర్ణములను అగ్రస్త, అనిరస్త, వివృత రూపముల ఉచ్చరించవలెను. స్పర్శ వర్ణములను ఒకదానితో ఒకటి కలపక ఉచ్చరించవలెను.

23) ధర్మముయొక్క మూడు స్కంధములు - ఓంకార స్వరూపము- ధర్మముయొక్క మూడు స్కంధములు - యజ్ఞ, అధ్యయన, దానములు ప్రధమస్కంధము, తపము రెండవ స్కంధము. ఆచార్యకులమున వశించు బ్రహ్మచారి అచట తన శరీరమును మిక్కిలి క్షీణింప జేయుట మూడవ స్కంధము. వీరు పుణ్య లోకము పొందెదరు. సన్యాసులు అమృతత్వము పొందెదరు. ప్రజాపతి లోకముల గూర్చి తపస్సుజేసెను. త్రయీ విద్యచే భూః భూవః స్వః లోకములు ఉత్పన్నమాయెను. అక్షరములు ఆలోచన చేయగా ఓంకారము ఉత్పన్న మాయెను. ఓంకారము నుండి వాణి వ్యాపించెను. ఓంకారమే సర్వము.

24) మూడు కాలములయందు సవనము:- ప్రాతః సవనము వసువులకు, మధ్యాహ్నసవనము రుద్రులకు, తృతీయ సవనము ఆదిత్యులు లేక విశ్వేదేవులకు, యజమాని యజ్ఞానుస్థానము చేయును. ప్రాతః సవనముచేయు యజమాని గార్హ పత్యాగ్ని, వెనుకు ఉత్తరాభి ముఖముగా కూర్చుండి వసుదేవతాసంబంధ సామ గానము చేయును. అగ్ని దేవతానీక మంత్రము ద్వారా యజమాని పృధ్వీలోకప్రాప్తి కలిగించుమనియు, ఆయువు పూర్తి యైన పిదప పుణ్యలోకము పొందుటకు 'స్వాహా' యని హవనము చేయవలెను. వసుగణము లతనికి ప్రాతః సవనము ప్రసాదింతురు.

మధ్యాహ్న సవనము చేయుటకు పూర్వము యజమాని దక్షిణాగ్నికి వెనుక ఉత్తరాభిముఖముగా కూర్చిండి రుద్రదేవతా సంబంధమగు సామగానము చేయును. వాయుదేవా! నీవు అంతరిక్షలోక ద్వారము తెరచి వైరాజ్య పద ప్రాప్తికి మేము నిన్ను దర్శింపనిమ్ము. అని మంత్రపూర్వకముగా హవనము చేయును. రుద్ర గణములతనికి మధ్యాహ్న సవనము ప్రసాదింతురు.

తృతీయ సవనారంభమునకు పూర్వము ఆహవనీయాగ్నికి వెనుకు ఉత్తరాభిముఖుడై కూర్చుండి ఆదిత్య, విశ్వదేవ, సంబంధమగు సామగానముచేయును. స్వర్గమునందు ద్యులోకవాసులకు ఆదిత్య విశ్వదేవులుకు. నమస్కరించి పుణ్యలోకప్రాప్తికి మంత్ర పూర్వకముగా 'స్వాహా'యని హవనము చేయగా ఆదిత్య విశ్వదేవులాతనికి తృతీయ సవనము ప్రసాదింతురు. ఇది యజ్ఞము యొక్క యధార్థ స్వరూపము.

------

తృతీయ అధ్యాయము

1-5) ఆదిత్యుని మధు రూపమున కల్పన- ఓంకార రూప ఆదిత్యుడు దేవతల యొక్క మధువు. ద్యలోకము అడ్డకర్ర, అంతరిక్షము పట్టు, కిరణములు తెనెటీగల పిల్లలు, ఋక్కులు మధుకరము, ఋగ్వేదము పుష్పము, సోమాది రూప అమృత జలము అభి తప్త ఋగ్వేదము నుండి యశ, తేజ, ఇంద్రియవీర్య అన్నాది రూపరసముల ఉత్పన్నమాయెను. అవి ఆదిత్యుని పూర్వభాగము నాశ్రయించుటచే ఎరుపు రంగు కలిగెను.

ఆదిత్యుని దక్షిణ దిశ కిరణములు దక్షిణావర్తమధునాడులు, యజు, శృతులు మధుకరము, యజుర్వేదము పుష్పము, సామమం%ులు అమృత జలిము, అభితప్తయజుర్వేదము నుండి యశామలు కలిగి దక్షిణ భాగమున శుక్ల వర్ణము కలిగెను.

ఆదిత్యుని పశ్చిమ దిశ కిరణములు పశ్చిమీయ మధునాడులు సామశృతులు మధుకరము, సామవేద విహిత కర్మలు పుష్పము, సోమాదిరూప అమృత జలము అభి తప్త సామవేదము నుండి యశాదులు కలిగి పశ్చిమ భాగమున కృష్ణ వర్ణము కలిగెను.

ఆదిత్యుని ఉత్తర దిశాకిరణములు ఉత్తర దిశ మధునాడులు అధ్వరాంగి సశృతులు మధు కరము, ఇతి హాస పురాణములు, సోమాది అమృత జలము. అభితప్త ఇతిహాస పురాణాదులు యశాదులు కలిగి ఉత్తర భాగమున మిక్కిలి కృష్ణ వర్ణము కలిగెను.

ఆదిత్యుని ఊర్ధ్వ కిరణములు ఊర్ధమధునాడులు గుహ్య ఆదేశ్ము మధుకరము ప్రణవరూప బ్రహ్మ పుష్పము సోమాది అమృత జలము, గుహ్య ఆదేశములు అభితప్త బ్రహ్మనుండి యశాదులు కలిగెను. ఆదిత్య మధ్య భాగము క్షుభితమగునదియే మధువు.ఆదిత్య రూపములే రసములకు రసము. అమృతము. వేదములే అమృతమునకు అమృతము.

6-11) ప్రధమ అమృతము అగ్ని ప్రధాన మగు గుణ రూపమున జీవనధారణ చేయును. దేవగణము అమృతము త్రాగక చూచుటచేతనే తృప్తి పొందెదరు. ఉదాసీన ఉత్సాహితులగుదురు. ఈప్రకారము అమృతమును తెలుసుకొనువారు (సాధకుడు) వసురూపమున అగ్ని ప్రధానత చే తృప్తి నొందును. సూర్యుడు తూర్పున ఉదయించి పశ్చిమమున అస్తమించు సమయమాత్రము వసు ఆధిపత్యము పొంది స్వరాజ్యము పొందును.

ద్వితీయ అమృతము ఇంద్ర ప్రధాన రుద్రగణము. సాధకుడు రుద్ర రూపమున ఇంద్ర ప్రధానతను అమృతమును చూచి తృప్తుడగును. దిన ప్రమాణ ద్విగుణ సమయ పర్యంతము రుద్రాధి పత్య స్వరాజ్యము పొందును. దక్షిణమున ఉదయించి ఉత్తరమున అస్తమించును.

తృతీయ అమృతము వరుణ ప్రధాన ఆదిత్యగణము . వరుణ ప్రఘాన ఆదిత్య రూపమున సూర్యుడు పశ్చిమమున ఉదయించి తూర్పున అస్తమించు సమయపర్యంతము ఆదితుయ ఆధిపత్య స్వరాజ్యము పొందును.

చతుర్థ అమృతము సోమ ప్రధాన మరుద్గణ జీవనము పొందును. సాధకుడు సోమ ప్రధాన అమృతము చూచి తృప్తి పొందును. సూర్యుడు ఉత్తరమున ఉదయించి దక్షిణమున అస్తమించు పర్యంతము మరుద్గణ ఆధిపత్యము పొందును.

పంచమ అమృతము బ్రహ్మ ప్రధాన సాధ్యగణాశ్రిత జీవనము పొందును. సాధకుడు బ్రహ్మ ప్రధాన సాధ్య గణ రూపమున అమృతము చూచి తృప్తి పొందును. సూర్యుడు పైన ఉదయించి క్రింద అస్తమించు పర్యంతము సాధ్యగణాధి పత్యము పొందును.

అట్టి సాధకుడు ఊర్ధ్వ గతుడైన పిదప మధ్య స్థితుడగును. అచట సూర్యుడు ఉదయించడం, అస్తమించడు మధు జ్ఞానమును బ్రహ్మప్రజాపతికి, ప్రజాపతి మను వునకు , మనువు ప్రజలకు తెలిపెను. ఉద్దాలకునికి అతని తండ్రి తెలిపెను. బ్రహ్మ విజ్ఞానమును తండ్రి తన పెద్ద కుమారునికి గాని, యోగ్యుడైన శిష్యునకు గాని ఉపదేశించెను. అన్యులకు కాదు.

12) గాయత్రియే సర్వ భూతములు- ప్రాణివర్గము:- వాక్కుయే గాయత్రి. వాక్కుయే ఈ సర్వప్రాణులు- గాయత్రియే పృధ్వి. జీవులు ఇందువశించును. పృధ్వియే పురుషుని శరీరము. పురుషుని శరీరము లోని అంతః పురుషుడే హృదయము. గాయత్రి నాలుగు పాదములు, ఆరు ప్రకారములుగా నున్నది. నిరాకార పురుషుడు సర్వశ్రేష్ఠుడు. బాహ్యాంతర హృదయకాశముల ప్రవృత్తుడు పురుషుడే.

13) పంచ ప్రాణోపాసన:- హృదయమునకు పంచ సుషి (రంధ్రము) కలవు. పూర్వభి ద్రమందు ప్రాణము చక్షు, ఆదిత్యతేజ అన్నాది రూపము ననుండును. ఆవిధముగా ఉపాసించువారు తేజస్వులు, అన్నభోక్త లగుదురు. దక్షిణ ఛిద్రము వ్యానము. శ్రోత్ర, చంద్ర, శ్రీ, యశ రూపముల ఉపాసించువారు యశశ్వులగుదురు. పశ్చిమఛిద్రము అపానము. వాక్‌, అగ్ని, బ్రహ్మతేజము అన్నాది రూపము. ఉపాసకులు బ్రహ్మతేజస్వులగుదురు. ఉత్తర ఛిద్రముసమానము. మన మేఘ, కీర్తి, దేహ లావణ్య రూపము. ఉపాసకులు కీర్తివంతులు, కాంతి వంతులగుదురు. ఊర్ధ్వ ఛిద్రము ఉదానము, వాయు, ఆకాశ,ఓజ, తేజోవంతము. ఉపాసకుడు ఓజస్వి తేజస్వియగును. ఈ ఐదు బ్రహ్మపురుషులు స్వర్గలోకద్వారపాలకులు. పంచ ప్రాణోపాసకులు. స్వర్గలోకము పొందెదరు. ద్యులోకముపైన పరమ జ్యోతి లోకము. చెవులుమూసుకొని వచ్చునాదము వినువారు హృద్గత జ్యోతి స్వరూప పరమాత్మను పొందెదరు.

14) జగత్తు-ఆత్మల బ్రహ్మ రూపమున ఉపాసన:- ఈజగత్తంతయు బ్రహ్మయే. బ్రహ్మ నుండియే ఉత్పన్నమై చేష్టితమై లయమొందును. హృదయకమలమందుండు బ్రహ్మము మనోమయ ప్రాణ , శరీర, ప్రకాశ , స్వరూప, సత్య సంకల్ప , సర్వ కర్మ , సర్వకామ, సర్వగంధ రస సంపూర్మ జగత్‌ వ్యాపకుడు. పృధ్వి, అంతరిక్ష ద్యు లోకములకంటెఅధికుడు. అట్టి బ్రహ్మను మరణానంతరము పొందుటకు ఉపాసించవలెను.

15) విరాట్‌ రూప కోశము యొక్క ఉపాసన:- విరాట్‌ పురుషునకు అంతరిక్షమే ఉదరము. పృద్వి మూలము, దిశలు కోణము, ఆకాశము పైరంద్రము. ఈకోశమునందే విశ్వమున్నది. పూర్వది శజుహు, దక్షిణము సహమాన, పశ్చిమ రాజ్ఞి, ఉత్తరదిశ సుభూతనామము కలది. దిశలయొక్క వాయువు వత్సము. సాధకుడు అవినాశికోశము. భుః భువః స్వః ప్రాణ పృద్వి, అంతరిక్ష, ద్యులోక, అగ్ని, వాయు, ఆదిత్య, ఋక్‌, యజు, సామవేదముల శరణుపొందవలెను.

16) పురుషుని యజ్ఞ రూపమున ఉపాసన:- పురుషుడేయజ్ఞము. ప్రాతః సవన యజ్ఞ పురుషుని వయస్సు 24 సం||. 24 అక్షరముల గాయత్రీ ఛందము ప్రాతః సవనము తో సంబంధము. వసుగణ అనుగతము. ప్రాణణమే వసువు. మధ్యం దిన సవనము 44 వర్షయజ్ఞ పురుషుడు. 44 అక్షరముల త్రిష్టుప్‌ ఛందము సంబంధిత రుద్ర గీతాను గతుడు ప్రాణమే రుద్రులు. రుద్రులు ప్రాణము నేర్పింతురు. తృతీయ సవన యజ్ఞపురుషుడు 48 వర్షప్రాయ 48 అక్షరముల జగతీఛంద ఆదిత్యగణ అనుగతుడు. ప్రాణమే ఆదిత్యుడు. సమస్త విషయ జాతముల గ్రహించును. సవన సమయ కష్ట నివారణ ఆయా అధిపతుల ప్రార్థించవలెను. ఈ విధముగా సవనవిద్యను తెలిసికొను వారు నిరోగులై 116 సం|| జీవింతురు.

17) ఆత్మయజ్ఞముయొక్క అన్య అంశములు:- ఏ పురుషుడు, భోజన, పాన, ప్రసన్నత పొందునో వాడు దక్ష, తిని, త్రావి, రతి అనుభవము పొందువాడు ఉపనదుల సదృశడుగును. ఆనందించుచు భక్షించి, మైధునము చేయువాడు స్తుత శస్తర సమానత పొందును. తప, దాన, ఆర్జవ, అహింసా సత్యవచనములే దక్షిణ అంగీరస ఋషి కృష్ణునికి యజ్ఞ దర్శనము వినిపించెను. ఇతర విద్యల విషయమున తృష్ణాహేనుడాయెను. సర్వత్ర వ్యాప్త దేదీప్యమాన పరమతేజము పరబ్రహ్మ స్థితము,అంధకార రూప అజ్ఞానము నుండి అతీతుడు. అట్టి ఉత్కృష్ఠ జ్యోతిని చూచుచు జ్యోతి స్వరూప సూర్యుని పొందును.

18) మనస్సు, ఆకాశముల బ్రహ్మరూపమున ఉపాసన:- మనస్సు బ్రహ్మమను ఉపాసన ఆధ్యాత్మ దృష్టి. ఆకాశము బ్రహ్మమనునది అధి భౌతిక దృష్టి. వాక్‌, ప్రాణ, చక్షు, శ్రోత్రములు ఆధ్యాత్మ బ్రహ్మ పాదములు, అగ్ని వాయు ఆదిత్య దిశలు అధిభౌతిక పాదములు, అధి దైవిక పాదములను అధిభ తిక పాదములకు దీపించి తపింప జేసిన కీర్తి, యశము, బ్రహ్మ తేజముచే ప్రకాశించును.

19) ఆదిత్యుని బ్రహ్మ రూపమున ఉపాసన:- ఆదిత్యుడే బ్రహ్మ. అసత్‌ నుండి సత్‌, అంకురము నుండి అండము. అండము రెండు ఖందములు, మొదటిది రజతయుక్త పృధ్వి, రెండవది స్వర్ణయుక్త ద్యులోకము. అండముయొక్క జరాయువు పర్వతములు, ఉల్బ మేఘములు, ధమనులునదులు, వస్తిజలము, వానినుండిఆదిత్యుడు, ఆదిత్యుని శబ్ద ఘోషచే సర్వప్రాణులు భోగముకలిగెను.

------

చతుర్థ అధ్యాయము.

1-3) జనశృత పౌత్రాయణుడను రాజు తన అన్నము అన్నిచోట్ల ప్రజలు తినవలెనని ధర్మశాలలు పెట్టించెను. హంసలు ఎగురుచు ఒక హంసలు ఎగురు చు ఒక హంస జన శృత పౌత్రాయణుని తేజముద్య లోకమువలె వ్యాపించె ననెను. రెండవ హంస బండి వాడగు రైక్వుని ప్రజల సత్కర్మలన్నియు చేరుననెను. జన శృతి ఇదివిని రైక్వునికలసి అతనికి మెండుగా కానుకలిచ్చి రాజకన్యను కూడా ఇచ్చెను. రైక్వుడు

ఆకన్నను విద్యాగ్రహణ ద్వారమున భాషించుట మొదలిడెను.

వాయు వేసంవర్గము. అగ్ని ఆరిపోయి వాయువు లోలీన మగును. సూర్యచంద్రులు అస్తమించి వాయువు లోలీనమగుదురు. జలము ఎండి వాయువులోలీనమగును. ఇది అధిదైవ తదృష్టి. ఆధ్యాత్మ దర్శనము ప్రాణమే సంవర్గము.పురుషుడు నిద్రించు చున్నపుడు వాక్కు, చక్షువు, శ్రోత్రము. మనస్సు అన్నియు ప్రాణములో లీనమగును. దేవతలలో వాయువు. ఇంద్రియములలో ప్రాణము ఉన్నవి.

కపిగోత్రశౌనకుడు, తక్షసేనపుత్రుడు అభిప్రాతరీ భోజనసమయమున బ్రహ్మచారికి భిక్షనిజకుండుటచే అతడు బ్రహ్మచారి రూపమున వచ్చిన భగవానునికి అన్మయ కుండుటను తెలుపగా వారా తనికి అన్నము నిచ్చిరి. అగ్ని వాయువు మొదలగు ఐదును వాగాదులకంటె అన్యము. వాగాది ప్రాణములు వానికంటె అన్యము. ఇవి పది అన్న రూప దశకృత (ప్రాచికలు), విరాట్‌ అన్నాదిభక్షకుడు.

4-9) జాబాలి పుత్రుడు సత్యకాముడు తన గోత్రమును జావాలి గోత్రముగా సత్యమును పంలుకుటచే హరిద్రమత గౌతముడు మెచ్చి ఉపనయనము చేసి 400 బక్క చిక్కిన ఆవుల నిచ్చి వానిని వేయిగాచేసి రమ్మనెను. సత్యకాముడు వనమునందు అవి వేయి యగువరకు మేపుచుండెను. అపుడు వృషభము పూర్వ, పశ్చిమ, దక్షణి, ఉత్తర దిక్కుళలు ప్రకాశవంతుడగు బ్రహ్మయొక్క చతుష్కళల పాదముగా చెప్పెను. అట్లు పాసించిన వారు ప్రకాశవంతులగుదురు. పృధ్వి, అంతరిక్షము, ద్యులోకము, సముద్రము బ్రహ్మ యొక్క చతుష్కళపాద మనియు, అట్లు పాసించువారు అనంతవంతులలగుదురని, అగ్నిద్వితీయ పాదము గూర్చి చెప్పెను. అగ్ని, సూర్య, చంద్ర, విద్యుత్‌, అనునవి బ్రహ్మ యొక్క చతుష్కళ జ్యోతి మయ పాదమని, అట్లు పోషించు వారు జ్యోతి వంతులగుదురని హంస చెప్పెను. ప్రాణ, చక్షు, శ్రోత్ర, మనస్సు అనునవి బ్రహ్మ యొక్కఆయతవాన్‌ పాదమని, అట్లు పాసించు వారు ఆయతన వానులగుదురని మద్గుచెప్పెను. గోవులను తీసుకొనివచ్చిన సత్యకాముని చూచి సౌమ్యుడా ! నీవు బ్రహ్మవేత్తవలె అగుపడుచున్నావు. నీకు ఎవరు పదేశించి రనగా దేవతలు ఉవడే శింబిరనెను. పూజ్యపాదులు నాకు, విద్యను పదేశింప ప్రార్థించెను. అట్లు గురువుచే విద్యనుపదేశింపబడి సత్యకాముని విద్యపరిపూర్ణమైనది.

10-17) ఉపకోశలుడు సత్యకామ జాబాలివద్ద పండ్రెండు సంవత్సరములు బ్రహ్మచర్య వ్రతము గ్రహించి అగ్ని సేవ చేయుచు గడిపెను. జాబాలి మిగిలిన శిష్యులకు విద్యాపరి సమాప్త వ్రతము (సమాదర్తన) ఆచరించి పంపెను. జాబాలి భార్య కారణమడుగ తెలుపకయే వెడలిపోయెను. భోజనమిడిన గురుపత్నితో మనుష్యునిలో అనేక కోరికల రూపన్యాధులున్నవి. కావున నేను భోజనము చేయననెను. అపుడు అగ్నులు ప్రాణము బ్రహ్మమనియు, కాకులుకూడా బ్రహ్మమనితెలిపెను. అపుడు అన్నము, ప్రాణము దాని ఆశ్రయ భూత ఆకాశమును గూర్చి ఉపదేసించెను. పృధ్వి, అగ్ని, అన్నము, ఆదిత్యుడు ఈనలుగురు నాశరీరము. ఆదిత్యాంతర్గతపురుషుడను నేనే, అట్లు ఉపాసించు వారు పూర్ణ ఆయువు కలిగి, ఉజ్వల జీవితము గడపి ఇహలోక పరలోక పాలన చేయుదురని గార్హపత్యాగ్ని తెలిపెను. జలము, దిశలు, నక్షత్రములు, చంద్రుడు, ఈ నలుగురు నాశరీరము. చంద్రునియందుండు పురుషుడను నేనే, అట్లు పాసించువారు పూఅర్ణాయువులై ఉజ్వల జీవితము గడపి ఇహలోక పరలోక పాలన చేయుదురని అన్యాహార్య వచన నామక ద్వితీయాగ్ని ఉపదేశించెను. ప్రాణము , ఆకాశము, ద్యులోకము, విద్యుత్‌ ఈనాలుగు నాశరీరము. విద్యుత్‌ నందు గల పురుషుడను నేనే. ఇట్లు పాసించు వారు పూర్ణాయువులై ఉజ్వల జీవితము గడపి ఇహలోక పరలోకముల పాలింతురని ఆహవ నీయ గ్ని ఉపదేశించెను.

గురువు ఉపకోశలుని చూచి నీవు బ్రహ్మ వేత్త వలె అగుపడుచున్నావు. నీకు ఎవరు ఉపదేసించిరనగా ఉపకోశలుడు విషయముధాచ ప్రయత్నించెను. అంతట గురువు నీకు ఈ అగ్నికే ఉపదేశించెను. అది ఈ లోక సంబంధమగు ఉపదేశము. నీకు పాపనాశక ఉపదేశము చేతునని ఇట్లు పదేశించెను. నేత్రములు కనిపించు పురుషుడే ఆత్మ. అమృత అభయ బ్రహ్మ. నేత్రము లలో ఘృత జలములు వేసిన నవికనురెప్పలలోనికి పోవును. దానినే సంయమ, వ్యామ, హ్యామనీ, భామినీ, అని సర్వ వస్తువులు సేవనీయము. భాసమాన మగుచు వహింప బడును. బ్రహ్మ వేత్తలు మరణించి అర్చి, అభిమాన దేవతల పొందుదురు. దిన, శుక్లపక్ష మా, సంవత్సర, ఆదిత్య చంద్ర, విద్యుత్‌ లోకముల ద్వారా బ్రహ్మమార్గమున బ్రహ్మమును పొంది తిరిగి మనుష్యలోకమునకు రారు.

చలించు పవనము యజ్ఞము., మనస్సు,వాక్కు, దీనిరెండు మార్గములు ఒక మార్గమును బ్రహ్మ మనస్సుద్వారా సంస్కరించును. అధ్వర్యుడు ఉద్గాత, వాణి ద్వారా రెండవ మార్గమును సంస్కరింతురు. ఈ రెండు మార్గములు రెండు రధ చక్రములవంటిది. ఇట్లు యజ్ఞము స్థిరమైన యజమానికుశ్రేష్ఠుడు.

ప్రజాపతి లోకములను లక్ష్యపరచి ధ్యాన రూపతపము చేసెను. లోకములనుండి రస రూపమున పృధ్వి నుండి అగ్ని, అంతరిక్షము నుండి వాయువు, ద్యులోకము నుండి ఆదిత్యుని తీసెను. అగ్ని నుండి ఋక్‌, వాయువు నుండి యజు, ఆదిత్యునినుండి సామముగ్రహించెను. పిదప తపమొనర్చి రసరూపమున ఋక్‌ నుండి భుః యజుః నుండి భువ, సామమునుండి స్వ,రసముల గ్రహించెను. యజ్ఞమునందు ఋక్‌ శృతుల క్షీతమైన భూస్వాహాయని గార్హపత్యాగ్నినందు, యజు శృతి క్షీతమైన భువ, స్వాహాయని దక్షిణాగ్నియందు, సామ శృతి క్షతమైన స్వః స్వాహాయని ఆహవ నీయాగ్ని యందు హవనము చేసిన ఆయజ్ఞ సంధానము జరుగును. ఇది తెలిసిన బ్రహ్మ ఓషధుల ద్వారా సంస్కరించును. ఋత్వికుడే మానవ బ్రహ్మ. యజ్ఞ యజమాన సమస్త ఋత్వికుల రక్ష చేయు బ్రహ్మనే యజ్ఞ ఋత్వికునిగా నియమించవలెను.

------

పంచమ అధ్యాయము.

ప్రాణము సర్వశ్రేష్ఠత:- ప్రాణము జ్యేష్ఠము, శ్రేష్ఠము వాక్కుయందలి వశిష్టము. చక్షువు నందలి ప్రతిష్ట , శ్రోత్రము నందలి సంపద, మనస్సునందలి ఆయతనము. అన్నియు ప్రాణమే. వాగింద్రయములు లోపించినను మానవుడు జీవించును. కాని ప్రాణము లేనిదే జీవించడు. వాగాదింద్రియములు ప్రాణమే.

2) మహత్వప్రాప్తికి మంధోపాసన:- ప్రాణమునకు 'అన' అను ప్రత్యక్ష నామముకలదు. 'అన' అనగా అన్నము. అన్నమే ప్రాణము. ప్రాణమునకు వస్త్రము జలము. ప్రాణదర్శనము కొరకు జాబాలి అమావాస్యనాడు దీక్షితుడై, పున్నమి నాటిరాత్రి సరౌషదులు, దధి, మధుస సంబంధమంధనమును మంధనము చేయుచు జ్యేష్టాయశ్రేష్ఠాయ స్వాహా' అని ఘృతము హవనము చేసి మిగిలినది మంధనముపై వేసెను. అటులనే వశిష్టాయ స్వాహా, ప్రతిష్టాయ స్వాహా, సంపదేస్వాహా, ఆయతనాయస్వాహా యని హవనము చేయగా మిగిలిన ఘృతము. మంధనము పై వేయవలెను. పిమ్మట జ్యేష్ఠ, శ్రేష్ట, రాజ్య,ఆదిపత్య ప్రాప్తికి దానిని మం%ుదు ఒక భాగము తర్వాత మంత్ర పూరితముగా మిగిలినది భక్షించి, పిమ్మట అగ్నికి వెనుక వానిని సంయమన పరచి నిద్రించి, కలలో స్త్రీని చూచిన కర్మ సఫలమగును.

3-10) శ్వేతకేతు ప్రహరణ సంవాదములో ప్రాణముయొక్క గతి, మరల పురుషు ప్రాప్తి రూపవిషయిక విద్యతనకు తెలియదనిన శ్వేతకేతు తండ్రిని ప్రశ్నించెను. అతడు తనకును తెలియదని రాజు నడిగెను. పూర్వము ఈ విద్య రాజుల పరమైయుండెననుచు గౌతమునకి చెప్పెను.

ద్యులోకము అగ్ని, ఆదిత్యుడు, సమిధ, కిరణములు ధూమము దినము జ్వాల, చంద్రుడు నిప్పులు, నక్షత్రములు విస్ఫులింగములు, ద్యులోకమగు అగ్ని లో దేవతలు శ్రద్ధతో హవనము చేయగా సోమరాజు ఉత్పన్నమగును.

పర్జన్యము అగ్ని, వాయువు సమిధ, మేఘములు ధూమము విద్యుత్‌ జ్వాల, వజ్రముల అంగారము,గర్జనవిస్ఫులింగము . అగ్ని యందు దేవతలు సోముని హవనము చేయగా వర్షము కలుగను.

పృధ్వి అగ్ని, సంవత్సరము సమిధ, ఆకాశము ధూమము రాత్రి జ్వాల, దిశలు అంగారము. అవాంతరదిశలు విస్ఫులింగములు ఆ అగ్నియందతు దేవతలు వర్షమును హోమముచేయగా అన్నముకలిగెను.

పురుషుడే అగ్ని, వాక్కుసమిధ, ప్రాణము ధూమము, జిహ్వజ్వాల, చక్షువులు అంగారము, శ్రోత్రము విస్ఫులింగములు. అగ్నిలోదేవతలు, అన్నము హోమముచేయగా వీర్యము ఉత్పన్నమగును.

స్త్రీయే అగ్ని, ఉపస్థ సమిధ, పురుషుని ఉపమంత్రణ ధుమము యోని జ్వాల, లోనికి చొనుపుట అంగారము, దాని వలన కలుగు సుఖము విస్ఫులింగములు. అగ్నిలో దేవతలు వీర్యము హవనము చేయగా కర్జముకలుగును.

ఇట్లు పంచ ఆహుతులు ఇచ్చిన పిదప పురుషుడు కలుగును.జిరాయువులచే ఆవృత గర్భము. నవమాసములు నిండిన పిదప, మాతృ గర్భము నుండి వెలువడును. ఆయుపర్యంతము జీవించి మరణము పొంది కర్మ వశమున పరలోక ప్రాప్తి నొందిన జీవుని అగ్నిలో దహింతురు. ఎచట నుండి వచ్చెనో,దేనిని పొందెనో అదేపొందును.

ప్రాణ ప్రయాణానంతరము అర్చి అభిమాన దేవతలు పొందెదరు. అటనుండి దినము, శుక్ల పక్షము, మాసము ఆయనము సంవత్సరము, ఆదిత్యుడు, చంద్రుడు, విద్యుక్‌ లోకముల పొంది అటనుండి అమానవ పురుషుడు బ్రహ్మ లోకమును చేర్చును. ఇదియే దేవయానము. ఇష్ట పూర్తి ఉక్తరూపమున ఉపాసించిన గృహస్థులు ధూమము, రాత్రి, కృష్ణ పక్షము, దక్షిణాయనము, పితృలోక చంద్రలోకముల పొంది కర్మ క్షయమైన పిదప అదే మార్గమున చంద్ర లోకమునుండి ఆకాశ , వాయు, పర్జన్య , అన్ని రూపమున పురుషుని చే గ్రహింపబడి వీర్య రూపమున సంచయమొంది మాతృగర్భమున వశించి మరల కర్మ ఫలాను సారము ఉత్తమ యెనులందు జన్మింతురు. పాపులు పాపయోనులందు తగిలి జన్మమరణ చక్రమున పరిభ్రమింతురు. అట్టి వారిది మూడవ గతి.

11-24) ప్రాచీన శాలాదులు ఉద్దాలకుని ద్వారా వైశ్వానర విద్యను గ్రహింపగోరిరి. కాని వారిని ఆయన కేకయికుమారుడు అశ్వపతిరాజు వద్దకు కొనిపోయెను. ఆయన వారికిట్లు ఉపదేశించెను.

నీవు ఆత్మను ద్యులోకముగా ఉపాసించుచున్నావు. అది సుతేజి నామక వైశ్వానర ఆత్మ. అట్టి వారికులమున బ్రహ్మతేజులు జన్మింతురు. ఇదివైశ్వానరుని మస్తకమని ప్రాచీన శాలునకు తెలిపెను. సత్యయజ్ఞుడు ఆదిత్యుని ఆత్మగా ఉపాసించుచుండెను. అంతట రాజు అది విశ్వరూప వైశ్వానరుని ఆత్మ. అట్లు పాసించువారి కులమున బ్రహ్మతేజులు పుట్టెదరు. ఇది ఆత్మయొక్క నేత్రము. వాయువును ఆత్మ రూపమున ఉపాసించు ఇంద్ర్యద్యుమ్నుని చూచి ఇది పృధ గ్వర్మ వైశ్వానర ఆత్మ. అట్టికులమున బ్రహ్మతేజులు కలుగుదురు. ఇది ఆత్మయొక్క ప్రాణము. ఆకాశమును ఆత్మరూపమున ఉపాసించు జనునక. అది బహుళ సంజ్ఞక వైశ్వానర ఆత్మ. అట్టి ఉపాసకులకులమందు బ్రహ్మతేజులు కలిగెదరు. కాని అవి ఆత్మయొక్క సందేహము. అనగా శరీరమధ్యభాగము. ఆత్మను జలరూపమున ఉపాసించు బుడిలుని చూచి అవి రయి సంజ్ఞక వైశ్వానర ఆత్మ. అట్టి ఉపాసకుల కులమందు బ్రహ్మతేజులు కలిగెదరు. కాని అవి ఆత్మయొక్క సందేహము, అనగా శరీరమధ్యభాగము. ఆత్మను జలరూపమున ఉపాసించు బుడిలుని చూచి అవి రయి సంజ్ఞక వైశ్వానర ఆత్మ. అట్టికుంమున బ్రహ్మతేజములు కలిగెదరు. ఇది ఆత్మయొక్క బస్తి అనెను. ఆత్మను పృధ్వీరూపమున ఉపాసించు ఉద్దాలకుని చూచి అది ప్రతిష్ఠా సంజ్ఞక వైశ్వానర ఆత్మ. అట్టి కులమున బ్రహ్మతేజులు కలిగెదరు. ఇది ఆత్మయొక్క చరణము.

వైశ్వానర ఆత్మయొక్క మస్తకము సుతేజ (ద్యులోకము) చక్షువు విశ్వరూప (సూర్యుడు) ప్రాణము పృ ధ గర్వర్మ (వాయువు) దేహ మధ్య భాగము బహుళ (ఆకాశము) బస్తిరయి (జలము) పృధ్విరెండు చరణములు, వక్షస్థలమువేని, లోమము దర్భలు, హృదయమున గార్హపత్యాగ్ని మనస్సు అన్యాహార్య పచనము, ముఖణు ఆహవనీయుము.

ప్రాణాయస్వాహా అని అన్నమును ఆహుతి చేసిన ప్రాణము, నేత్రము, సూర్యుడు ద్యులోకము, ఆదిత్యుడు క్రమముగా తృప్తినొందగా భోక్త, ప్రజ, పశు, అన్నాద్య, తేజ, బ్రహ్మతేజముల ద్వారా తృప్తుడగును.

వ్యాసాయ స్వాహా అను ఆహుతిచే ధ్యానము శ్రోత్రము, చంద్రుడు, దిశలు తృప్తి నొందగా భోక్త, ప్రజా, పశు, అన్నాద్య తేజ బ్రహ్మతేజము తృప్తుడగును.

అపానా యస్వాహా అను ఆహుతిచే అపానము, వాగింద్రయము, అగ్ని, పృధ్వి, తృప్తినొందగా భోక్త ప్రజాదులపొంది బ్రహ్మతేజమున తృప్తుడగును.

సమానాయ స్వాహా అను ఆహుతిచే సమానము, మనస్సు, పర్జన్యము, విద్యుత్‌ తృప్తి నొందగా భోక్త ప్రజాదులపొంది బ్రహ్మతేజమున తృప్తుడగును.

ఉదానాయ స్వాహా అను ఆహుతిచే ఉదానము, త్వచ, వాయువు, ఆకాశము తృప్తి నొందగా భోక్త ప్రజాదుల పొంది. బ్రహ్మ తేజమున తృప్తుడగును.

ఈ విధముగా వైశ్వానర రూపమున భోజనమును హవనము చేసిన సమస్త లోకములు, సర్వభూతములు, సంపూర్ణ ఆత్మల యందు హవన ప్రాప్తి కలుగును.

-------

షష్ఠ అధ్యాయము

1-6) ఆరుణి పౌత్రుడు శ్వేతకేతు. గురుకులమున వేదాధ్యాయనముచేసి తను గొప్ప పండితుడనను గర్వమున తిరిగి వచ్చెను. అపుడు తండ్రి అతనిని చూచి దేనివలన అశృతము, శృతము, అమతము - మతము, అని జ్ఞాతము జ్ఞాతమగునని ప్రశ్నింప తనకు గురువుచెప్పలెదనెను. అంతట ఆరుణి మృత్తికతో తయారగువస్తువులు కేవలము వాణియొక్కఆశ్రయ భూతమై నామ రూపముల నొందును. వాస్తవము నకు అది మట్టియే. అటులనే బంగారము ఆభరణముల రూపమున వివిదముగా కనబడినను అది కేవలము వికారము మాత్రమే. వాస్తవమునకు అది బంగారమే.

ఆరంభమున కేవల ఏకమత్ర అద్వితీయ సత్‌ బ్రహ్మకలదు. అది అనేకము కావలెనని ఇక్షణ (కోరిక ) చేయగా తేజము, తేజము నుండి జలము, జలమునుండి అన్నము ఉత్పన్నమాయెను. స్వరూప దేవతయొక్క ఈక్షణచే అండజ జీవజ, ఉద్బిజ, ప్రాణులు ఉత్పన్న మాయెను. జీవాత్మ రూపమున ఆదేవత వానియందు ప్రవేశించి ప్రతి దానిని త్రివృతము చేసెను.

అగ్ని , ఆదిత్యుడు, చంద్రుడు, విద్యుత్‌ యందలి రోహిత రూపము తేజస్సు, శుక్ల రూపము జలము, కృష్ణ రూపము అన్నము, తినిన అన్నముయొక్క స్థూల రూపము మలము, మధ్యభాగము మాంసము, అత్యంత సూక్ష్మభాగము మనస్సు అగును. త్రాగిన నీరు స్థూల భాగమున మూత్రము, మధ్యభాగమురక్తము , సూక్ష్మ భాగము ప్రాణము తిన్నట్లు వంటి ఘృతాది తేజోమయములు స్థూల భాగము ఎముకలు, మధ్య భాగము మజ్జ, సూక్ష్మ భాగము వాక్కు, మనస్సు అన్నమయము, ప్రాణము జలమయము, వాక్కు తేజోమయోము. పెరుగుచిలికిన దాని సూక్ష్మ భాగము వెన్న రూపమున ఘృతమగునట్లే అన్న జల ఘృతముల సూక్ష్మ రూపము మనస్సు, ప్రాణము, వాక్కు అగును.

7-8) పురుషుడు షోడశకళలవాడు, పదిహేను రోజులు అన్నము తినక కేవలము నీరు త్రాగిన శ్వేత కేతు వేదగానము చేయలెకపోయెను. మరల అన్నము తినగా వేదగానము చేయు శక్తి కలిగెను. పదిహేను దినములు అన్నము తినక పోవుటచే ప్రాణము (అగ్ని,తేజము) కేవలము ఒక మిణుగురు పురుగువలె కొంచెము కాంతి కలిగి యుండెను.అన్నము తినుటచే మరల ఆ చిన్న నిప్పుకణిక ప్రజ్వలితమాయెను. కావున అన్నముచే పదునారు కళలు ప్రజ్వలితమగును. కావున మనస్సు అన్నమయము, ప్రాణము జలమయము, వాక్కు తేజోమయము.

పురుషుడు (పరమాత్మ) నిద్రించునపుడు, సత్‌ సంపన్నుడై తన స్వరూపమును పొందును. కావున దానిని "స్వపితి" యందురు. త్రాటికికట్ట బడిన పక్షి నలు దిక్కులకు ఎగిరినను తనుకట్టుబడిన స్థానము చేరినట్లే. స్వప్నావస్థలో మనస్సు నలుదిశలు సంచరించినను, మరల తన బంధన స్థలమైన ప్రాణము చేరును. పురుషునకు తినవలె (ఆశి శిషతి) నను కోరిక కలిగినపుడు తినిన అన్నును జలము తీసుకు వెళ్లును. కావున జలము "అశనాయ" అని పిలువ బడును. త్రాగిన నీటిని తేజము తీసుకువెళ్లును. కావున తేజము "ఉద్యాన' మనబడును. కావున అన్నరూప అంకురము నుండి జలరూప మూలము జలరూప అంకురము నుండి తేజో రూపమూలము,తేజోరూప అంకురమునండి సద్రూప మూలమును అను సంధానము చేసిన ప్రజయంతయు సన్మూలక మగును. 'సత్‌' యే దీని ప్రతిష్ఠ, ఇదియే త్రివృతము, మరణాసన్న పురుషుని వాక్కుమనస్సునందు, మనస్సు ప్రాణము నందు, ప్రాణము తేజము నందు, తేజము పరదేవతయందు లీనమగును. అదియే సత్యము, ఆత్మ, అదినీవెను దృష్టాంత పూర్వకముగా.

9-16) తెనెటీగలు నానా వృక్షములనుండి రసమును తెచ్చి మధువును సమకూర్చును. ఏవృక్షరసమో ఆ మధువునకు తెలియదు. అటులనే 'సత్‌' ను పొందిన సమస్త జీవులకు , అజ్ఞానమే ఉండదు. ఏత ద్రూపమును పొందిన అణిమయే సత్యము. ఆత్మ, నదులు సముద్రమును కలసి తమ అస్తిత్వము కోల్పోయి ఎత ద్రూపమును పొందును.అటులనే జీవులన్నియు ఏత ద్రూపమును పొందిన అణిమయే సత్యము, ఆత్మ.

వృక్షము యొక్క ఏ భాగమున జీవముండదో అది ఎండి పోవును. పిదప వృక్షము మరమ దశ పొందును. అటులనే జీవరహిత శరీరము మరణించును. కాని జీవుడు మరణించడు.అదియే సత్యము. ఆత్మ.

వరిబీజము నందలి అణువులయందు వట వృక్షము నిబిడీ కృతమైయున్నది. ఆ బీజరూప అణిమయే ఎతద్రూప సత్యము, ఆత్మ. నీట కలసిన ఉప్పుకణములు నీటినంతను ఉప్పుగా చేయును. అది జలము నందేయున్నది.అటులనే మకు కనబడని అణిమయే ఏతద్రూప సత్యము, ఆత్మ.

కండ్ల గంతలు కట్టిన వ్యక్తి ఏదిశకు త్రిప్పివదలినను తన గమ్యము అడిగి తెలిసికొని చేరునటుల ఈ లోకమునే ఆచార్య పురుషుడు తన గమ్యమగు మోక్షమును, దేహసంబంధ విముక్తి యగుటతోడనే బ్రహ్మపదము పొందెదరు. జ్వరపీడిత వ్యక్తి కూడా వాణ్యాదులు పరదేవత యందు లీనమగువరకు అందరిని గుర్తించ గలుగును. వాణ్యాదులు పరదేవతయందు లీనమగుట తోడనే మరణము పొందును. ఆ అణిమయే సత్యము. ఆత్మ, మిధ్యాభినివేశ పురుషుడు, కర్మ ఫలమనుభవించును. సత్యాభి సంధుడు ఫలవిముక్తుడగును. అటులనే పరీక్షా సమయమున సత్యాభి సంధుడగు విద్వాంసుడు పునరావృత్తిని పొందడు. అవిద్వాంసుడు పునారవృత్తిని పొందును. అట్టి అణిమయే ఎతద్రూప సత్యము. ఆత్మ, అది నీవేను.

--------

సప్తమ అధ్యాయము

1-7) నారదుడు సనత్కుమారులవద్దకు వెళ్లి తనకుపదేశింప వేడెను. నీకు తెలిసిన విద్యలు తెలిపిన మిగిలినవి చెప్పెదనని సనత్కుమారులనగా, నాకు వేదములు, వేదాంగములు, ఇతిహాస పురాణములు, తదితర దేవత, బ్రహ్మ, భూత, క్షత్ర, నక్షత్ర, సర్ప , నృత్యసంగీతాది విద్యలు తెలుసుననగా, అవినామములు, నామమును బ్రహ్మగా ఉపాసించువారు నామమునకు ఎంత వరకు గతికలదో అంత వరకు యధేచ్ఛగా గమనము కలిగియుందురు. నామముకంటె అధికమైన దున్నదా అను ప్రశ్నకు జవాబుగా:-

వేదములు, శాస్త్రములు, ఇతిహాసపురాణములు మొదలగునవి ద్యులోక, పృధ్వి, వాయు, ఆకాశ, జల, తేజ, దేవ, మనుష్య, పశు, పక్షి, తృమ, వనస్పతి మొదలగు ప్రాణులు ధర్మ, అధర్మ, సత్య, అసత్య, సాధు-అసాధు, మనోజ్ఞ-అమనోజ్ఞ, అంతయు వాక్కుయే. వాక్కును బ్రహ్మగా ఉపాసించిన వాక్‌ పర్యంత గతి కలుగును.

మనస్సు వాణికంటె ఉత్కృష్టము. వాక్కు, నామము, మమస్సులో అంతర్భావము పొందును. మనస్సు యొక్క కోరిక ననుసరించి సంకల్పించును. కావున మనస్సు, ఆత్మ, లోకము, బ్రహ్మ, ఈవిధముగా ఉపాసించిన మనోగతపర్యంత గతి కలుగును.

సంకల్పము మనస్సుకంటె శ్రేష్ఠము. సంకల్పము మనస్సును వాణిని, నామము, మంత్రము క్రమముగా ప్రవృత్తమై కర్మయందు అంతర్భావమొందును. ద్యులోకము, పృధ్వి, వాయువు, ఆకాశము, జలము, తేజము, సంకల్పము చేయగా వృష్టినుండి అన్నము, అన్న సంకల్పము చే ప్రాణము, మంత్రము , కర్మ ఫలము కలుగను. కావున సంకల్పమును బ్రహ్మగా నుపాసించిన సంకల్ప గతి పర్యంత లోకముల స్వేచ్ఛా గతికలిగియుండును.

చిత్తము సంకల్పము కంటె శ్రేష్ఠము. పరురుషుడు చేతన యుక్తుడై సంకల్ప ,మనన, వాణి, నామ, మంత్రకర్మల ప్రవృత్తుడై చిత్తము నందే ప్రతిష్టితుడగును. కావున చిత్మతును బ్రహ్మ రూపమున ఉపాసించి ధృవాది ప్రతిష్టితలోకములను, చిత్తగతి పర్యంత స్వేచ్ఛా గతి కలిగియుండును.

ధ్యానము చిత్తము కంటె శ్రేష్ఠము. పృధ్వి, ద్యులోక అంతరిక్ష, జల, పర్వత, దేవతా మనుష్యాదుల ధ్యానము చేమహాత్వ్ము పొందెదరు. క్షుద్రులు కూడా ధ్యాన లాభాంశము పొందెదరు. కావున ధ్యానమును బ్రహ్మగా నుపాసించిన ధ్యానగతిపర్యంత స్వేచ్ఛాగతి పొందును.

విజ్ఞానము ధ్యానముకంటె శ్రేష్ఠము. విజ్ఞానము చే పురుషుడు, వేదశాస్త్రములు నానావిధ విద్యలు, పంచభూతములు, దేవమనుష్య, పశుపక్ష్యాదుల ధర్మాధర్మములు సమస్తము తెలిసికొనును. కావున విజ్ఞానమును బ్రహ్మ రూపమున ఉపాసించిన విజ్ఞాన లోకముల పొందును.

8-15) బలము విజ్ఞానముకంటె ఉత్కృష్టము. బలముచేతనే పురుషుడు వేచి గమనముకలిగి, ధర్మన, శ్రవణ, మనన బోధ యజ్ఞడగుచున్నాడు. బలము చేతనే పృధ్విమొదలగులోకములు, సమస్త ప్రాణులు, లోకములు ఉన్నవి. కావున బలమును బ్రహ్మ రూపమున ఉపాసించిన బలగతి పర్యంత స్వేచ్ఛా గతి పొందును.

అన్నము బలము కంటె శ్రేష్ఠము, అన్నము లేక పదిదినములుండినను జీవించి యుండియు, ద్రష్ట ,శ్రోత, మనన, బోధ, కర్మాది, విజ్ఞాతుడుకాక మరల అన్నము భుజించినంతనే ఆయా క్రింయలు చేయకలుగును. కావున అన్నమును బ్రహ్మరూపమున ఉపాసింపుము. అంతవరకు స్వేచ్ఛాగతి పొందెదవు.

జలము అన్నము కంటె శ్రేష్ఠము. జలముచేతనే అన్నాదులు కలుగును. సర్వలోకములు , సర్వప్రాణులు, జలమయము కావున జలమును బ్రహ్మరూపమున ఉపాసింతురు. తేజము జలము కంటె శ్రేష్ఠము. తేజము తన తాపముచే ఉద్భూతమై ఊర్ధ్వగామియై ఉరుములు మెరుపులతో వర్షరూపమున ఉత్పన్నమగును. కావున తేజమును బ్రహ్మరూపమున ఉపాసింపుము. ఆకాశము తేజముకంటె శ్రేష్ఠము. సూర్య, చంద్ర, విద్యుత్‌, నక్షత్ర, అగ్ని, ఆకాశము నుండి శ్రవణ, ప్రతిశ్రవణ, రమణాదులు ఆకాశమందే ఉత్పన్నమగును. కావున ఆకాశమును బ్రహ్మరూపమున ఉపాసింపుము. స్మరణము చేతనే పుత్రాదులను పోల్చగలుగును. కావున స్మరణను బ్రహ్మరూపమున ఉపాసింపుము. ఆశస్మరణము కంటె శ్రేష్ఠము. ఆశ##చే ఉద్దీప్త స్మరణము మంత్ర కర్మాదులద్వారా పశుపుత్రాదికోరికలు పొందును. కావున ఆశను బ్రహ్మరూపమున ఉపాసింపుము. ప్రాణము ఆశకంటె శ్రేష్ఠము. ప్రాణము చక్రము యొక్క నాభివంటిది. ప్రాణమే ప్రాణము కొరకు, ప్రాణమును ప్రాణముచే శక్తియుతమగును. ప్రాణమే తల్లి, తండ్రి, సోదరులు, ఆచార్యాదులు, ప్రాణమే సర్వము. ప్రాణము ను ఈవిధముగా చూచువారు అతివాదులు ఇదిదాచ పనిలేదు.

16-26) సత్యమునే విశేష, రూపమున తెలిసికొనవలెను. విజ్ఞానముచే విశేష రూపమున జిజ్ఞాస చేయవలెను. మననము చేతనేతెలిసికొనును. కావున మననమునే విశేషరూపమున జిజ్ఞాసచేయవలెను. మననము శ్రద్ధ చేతను, శ్రద్ధ నిష్ఠచేతను, కర్మనిష్టచేతను సంపన్నమగును. కావున వానిని విశేషరూపమున తెలిసికొనవలెను. సుఖము కొరకే పురుషుడు కర్మ చేయును. భూమాయే సుఖము. ఎక్కడ ఏమియు చూడబడక , వినబడక, తెలియ బడక యుండునో అదియే భూమ, భూమాయే అమృతము. శ్రవణ దృశ్యాదుల తెలిసికొనుట అల్పము. అట్టి అల్పమే మనుష్యుడు. భూమాత తన మహిమ యందే ప్రతిష్ఠితము. ఈ లోకమునందలి పశు పక్ష్యాదులు, ధన ధాన్యాదులు, భార్యాపుత్రాదులు, మహిమకలవారు కారు. అన్య పదార్థములు అన్యము నందే ప్రతిష్ఠితమగును. ఆత్మయే భూమి ఆత్మయే సర్వత్ర వ్యాప్తము. అట్లు తెలిసికొనువారు ఆత్మ రతులై ఆత్మానందము పొందెదరు. విపరీతముగా నెరుగువారు క్షయలోకముల పొందెదరు. ఇట్లు తెలిసికొను విద్యార్ధులు ఆత్మయే ప్రాణము, ఆశ, స్మృతి, ఆకాశము, తేజము, జలము, అదికార తిరోభావములు. అన్న, జల , విజ్ఞాన, ధ్యాన, చిత్త, సంకల్ప, మనోవాక్కు, నామ మంత్ర కర్మ సమస్తము, అట్టి విద్వాంసులు సమస్తమును ఆత్మ రూపమున చూచి, పొంది, సహస్రాది రూపములు పొందెదరు. ఆహారశుద్ధిచే అంతఃకరణ శుద్ధి, తద్వారా నిశ్చల స్మృతి , నొంది సమస్త గ్రంధుల నివృత్తిచే సమస్త వాసనలు క్షీణించిన నారదుని సనత్కుమారుడు అజ్ఞానాంధకారము నుండి ఆవలకు తీసుకు వెళ్లెను.

--------

అష్టమ అధ్యాయము.

1-6) హృదయాంతర్గత బ్రహ్మరూపమున కమలాసనమున సూక్ష్మ ఆకాశము క్రిందనుండి ఆత్మయే పరమాత్మ. సత్యము. సూర్యచంద్రాదులు, సర్వలోకములు, పంచ భూతములు, సర్వము ఆత్మయందే సూక్ష్మ రూపమున వశించును. దేహము జీర్ణమై మరణించినను ఆత్మ మరణించదు. ఇది జరామృత్యుశోకాదిరహిత సత్యకామ, సత్యసంకల్పము. ఈ లోకముననే ఆత్మను దాని సత్య కామనలను తెలిసికొను వారు సమస్త లోకముల యధేచ్ఛగా సంచరింతురు. పురుషుడు పితృ, మాతృ,భ్రాతృ, సఖా, గంధమార్య, అన్నపాన, గీతవాద్య, స్త్రీమొదలగు ఏలోకముల ఏభాగమున నిచ్చు గలిగియుండునో ఆయా లోకముల భోగము పొందును.

భూమిపై నిక్షిప్త ధనముపైన సంచరించువాడు దానిని తెలిసికొనవలెనట్లే అనృతముచే ఆవరింప బడిన ఆత్మను తెలిసికొనలేరు. ఆత్మ హృదయ మందు కలదు.ఆత్మ యే సత్యము. ఇందు సకారము అమృతము. త కారము మర్త్య యమ్‌ రెంటినినియమనముచేయునది. కావున సత్యము తెలిసిన స్వర్గలోకము పొందును.

ఆత్మ ఈ లోకమున పారస్పరిక సంఘర్షణల విశేషరూపమును ధరించు సేతవు. ఈ సేతువు రాత్రి బగళ్లు జరామృత్యుశోకాదులు దాటలేవు. ఈ సేతువున తరించువారు ప్రకాశమయ బ్రహ్మలోకము పొందెదరు. బ్రహ్మలోక ప్రాప్తి బ్రహ్మ చర్యము వలననే, శాస్త్ర ఆచార్యోపదేసము చే తెలిసికొని సంపూర్ణ లోకముల యధేచ్ఛగా సంచరించును.

యజ్ఞము ,ఇష్టి, మౌనము, అనాశకాయనము, ఆరణ్యయనము, బ్రహ్మచర్యము వలననే ప్రాప్తించును. బ్రహ్మలోకమున 'అర' 'ణ్య' అను రెండు సముద్రములు కలవు. మూడువ దగు ద్యులోకము ఐరంమదీయమను సరోవరము, సోమ సవనమను అశ్వద్ధములు కలవు. అచటనే బ్రహ్మయొక్క అపరాజిత పురమునందు సువర్ణ మంయ మందీపమున గల బ్రహ్మను బ్రహ్మచర్యము చేతనే పొందవచ్చును.

హృదయము నందు 101 నాడులు కలవు. అందు ఒకటి సుషుమ్న మస్తకము చేరును. మిగిలినవి శరీరము మంతావ్యాపించును. ఆదిత్య మండల కిరణములు శుక్ల, నీల, పీత, లోహిత, వర్ణములు కలిగియుండును. అటులనే ఈనాడులుకూడా, సుషుప్తి యందు ఈనాడులు ఆదిత్య లోకమును పొందును. సుషుమ్నద్వారా ప్రాణోత్ర్కమణ జరిగిన జ్ఞానులు ఆదిత్య లోకము ద్వారా బ్రహ్మ లోకము పొందెదరు. ఇతర నాడులు ద్వారా ప్రాణోత్ర్కమణ జరిగిన ఆదిత్యలోకము వరకు మాత్రమే వెల్ల గలరు.

7-25) పాప శోక జరామృత్యురహిత సత్య సంకల్ప సత్యకామ ఆత్మను తెలిసికొనిన వారు సంపూర్ణ భోగములు, సంపూర్ణ లోకములు పొందెదరు. ప్రజాపతి వాక్యమును బట్టి దేవతలరాజు ఇంద్రుడు రాక్షసుల రాజు విరోదనుడు ప్రజాపతి వద్దకు వెళ్లిరి. ప్రజాపతి నేత్రము లలోకనబడు పురుషుడే ఆత్మ, అమృతము, అభయము, బ్రహ్మయనెను. ప్రజాపతి జలపాత్రయందు, వస్త్రాభరణాదుల అలంకృత, పరిష్కృత దేహంపై చూదీమెను. ఇంద్రుడు, విరోచనుడు జలపాత్రయందు అట్టిరూపమునే చూచితిమనిరి. ప్రజాపతి అదియే ఆత్మ, బ్రహ్మమనెను. ఇద్దరు శాంతచిత్తులై వెడలిరి. విరోచనుడు ఈశరీరమే పూజనీయము, సేవనీయము అనెను. అట్టి స్వభావము కలవారందరు అసురులు, వారు అట్లు చేసి పరలోక ప్రాప్తి నొందగోరెదరు.

ఇంద్రుడు ఆలోచించసాగెను. జలపాత్రయందు కనిపించిన సర్వాలంకృత శరీరము ఆత్మ కాజాలదు.ఇండిత నష్టమైన చో ఈశరీరము ఆత్మ ఎట్లగునను ఈ సందేహమును ప్రజాపతి ముందుంచగా 32సం|| తపమొనరింపగోరెను.

స్వప్నమునందు పూజితుడగువాడే ఆత్మ, బ్రహ్మయను కొనిన ఇంద్రుడు మరల అదికాదని ప్రజాపతిని అడుగగా ఏ అవస్థలో నిద్రించువాడు దర్శన వృత్తిరహితుడై సమ్యక్‌ రూపమున ఆనందిచుచు స్వప్నాను భవము పొందనిడే ఆత్మ బ్రహ్మ మని ప్రజాపతి తెలిపెను.కాని ఇంద్రుడు అదియు ఫల ప్రాప్తి కాదనగా ప్రజాపతి ఇంద్రునకిట్లు ఉపదేసించెను. ఆత్మ అమృతము, అశీరము, కాని శరీరముదాని ఆధారము. ఆత్మ జ్ఞానము కలవారు బ్రహ్మ లోకమున సమస్త భోగములు పొందెదరు.

నేను హృదయస్థ బ్రహ్మనుండి శబల బ్రహ్మను శబలనుండి శ్యామ బ్రహ్మను పొందెదరు. నామ రూపములు ఎవరి అంతర్గతములో అతడే బ్రహ్మ, అమృత ఆత్మ, ఇట్టి ఆత్మ జ్ఞానీమును బ్రహ్మ ప్రజాపతికి ప్రజాపతి మనువునకు, మనువు ప్రజావర్గమునకు బోధించెను. గురువు తన పుత్రులు, శిష్యులతో గూడ సమస్త ఇంద్రియముల అంతఃకరణమున స్థాపించి, శాస్త్రాను సారము ఆయుః పర్యంతము వ్యవహరించి బ్రహ్మలోకమును పొందును.

----------

ఛాందోగ్యోపనిషత్తు సమాప్తము.

ఓం తత్‌ సత్‌, ఓం తత్‌ సత్‌, ఓం తత్‌ సత్‌.

ఓం శాంతిః శాంతిః శాంతిః.

-----------------

SARA SUDHA CHINDRIK    Chapters