Sri Naradapuranam-3    Chapters    Last Page

అశీతితమో%ధ్యాయః=ఎనుబదియవ అధ్యాయము

బృన్దావనమాహాత్మ్యమ్‌

మోహిన్యువాచ:-


మధురాయాస్తు మాహాత్మ్యం వనానాం చాపి మానద! | శ్రుతం బృన్దావనస్యాపి రహస్యం కించిదీరయ 1
బృన్దారణ్యం భువో బ్రహ్మ న్కీర్తిరూపం రహోగతమ్‌ | తచ్ఛ్రోతుం మమ వాంఛాస్తి తన్నిరూపయ విస్తరాత్‌ 2
మోహిని పలికెను :- గురవర్యా! మధురా మాహాత్మ్యమును వనముల మాహాత్మ్యమును చక్కగా వింటిని. బృందావన రహస్యమును కూడా కొంచెము చెప్పుము. భూమియొక్క కీర్తిరహస్య భూతము బృన్దావనము. దానిని వినుటకు నాకు కోరిక గలదు. కావున విస్తరముగా వర్ణింపుము.
వసురువాచ:-
శృణు దేవి రహస్యం మే బృన్దారణ్యసముద్భవమ్‌ | యన్నకసై#్మచిదాఖ్యాతం మయా ప్రాప్య గురూత్తమాత్‌ 3
గురవే కధితం భ##ద్రే నారదేన మహాత్మనా | బృన్దయా నారదాయోక్తం రహస్యం గోపికాపతేః 4

తత్తే
%హం సంప్రవక్ష్యామి జగదుద్ధారకారణమ్‌ | ఏకదా నారదో లోకా న్పర్యటన్భగవత్ర్పియః 5
బృందారణ్యం సమాసాద్య తస్ధౌ పుష్పసరస్తటే | పశ్చిమోత్తరతో దేవి మాధురే మండలే స్థితమ్‌ 6
బృన్దారణ్యం తురీయాంశం గోపికేశరహస్థ్సలమ్‌ | గోవర్ధనో యత్ర గిరిః సఖిస్థలసమీపతః 7

బృన్దాయాస్తత్తపో
%రణ్యం నందిగ్రామానుయామునమ్‌ | తటే తు యామునే రమ్యే రమ్యం బృన్దావనం సతి 8
పుణ్యం తత్రాపి సుభ##గే సుపుణ్యం కౌసుమం సరః | బృందాయాస్తు తటే రమ్యే ఆశ్రమో
%తిసుఖావహః 9
నిత్యం విశ్రమతే యత్ర మధ్యాహ్నో సఖిభిర్హరిః | ముహూర్తం స తు విశ్రమ్య స్నిగ్ధఛాయాతరోస్థ్సలే 10
శీతలం పుష్పసరసో వార్యుపస్టృశ్య నారదః | కృత్వా మాధ్యాహ్నికం కర్మ తస్థౌ తత్ర సరస్తటే 11
తత్ర బృన్దాశ్రమే రమ్యే గోప్యో గోపాశ్చ మోహిని | ఆయాన్తి వర్గశో యాన్తి నారదస్వ విపశ్యతః 12
అధైవం యామమేకం తు తత్సస్థిత్వా తు నారదః | ప్రహరార్ధావశిష్టే
%హ్ని వివేశాశ్రమముద్భుతమ్‌ 13
యత్ర బృన్దా స్థితా దేవీ కృష్ణభక్తి పరాయణా | సమాగతానాం సత్కారం విదధానా ఫలదిభిః 14
నమస్కృత్యం వినమ్రాంగో నిషసాద ధరాతలే 15
తతస్సా ధ్యానయోగాంతే సమున్మీల్య విలోచనే | ఆసనం సందిదేశాధో
% తిధయే నారదాయ వై 16
తతస్సనారదస్తత్ర సత్కృతో బృన్దయావసత్‌ | రహస్యం గోపికేశస్య తస్యా జిజ్ఞాసురాదరాత్‌ 17
తయా కృతాం సత్కృతిం తు స్వీకృత్య విధినందనః | సుప్రసన్నాంతరాం బృందాం జ్ఞాత్వ హార్దం వ్యజిజ్ఞపత్‌ 18
సాతు తద్వాంఛితం జ్ఞాత్వా ధ్యానయోగేన భామిని | స్వసఖీం మాధవీం తత్ర సమాహూయాబ్రవీదిదమ్‌ 19
మాదవి ప్రియమేతస్య నారదస్యమహాత్మనః | సంపాదయ యధా మహ్యం ఆశ్రమస్య సుపుణ్యతా 20
స్వాశ్రమం హ్యాగతసై#్యవ యో న సంపాదయేత్ర్పియమ్‌ | నిష్ఫలో హ్యాశ్రమస్తస్య ఫేరురాజగృహాపమః 21
అధ సా మాధవీ దేవీ నత్వా నారదమాజ్ఞయా | స్వాధిష్ఠాత్ర్యాస్తు బృన్దాయా సరస స్తటముత్తమమ్‌ 22
పశ్చిమోత్తరతస్తస్మి న్స్నాతుం తం సందిదేశ హ | తతస్తదాజ్ఞయా భ##ద్రే నారదో దేవదర్శనః 23
నిమమజ్జ జ లేతస్మిన్‌ ధ్యాయన్శ్రీకృష్ణసంగమమ్‌ | నిమజ్జమానే సరసి నారదే మునిసత్తమే 24
య¸° బృన్దాన్తికం భ##ద్రే సంవిధాయ తదీప్సితమ్‌ | అధాసౌ నారదస్తత్ర సన్నిమజ్జ్యోద్గతస్తదా 25
దదర్శ నిజమాత్మానం వనితారూపమద్భుతమ్‌ | తతస్తు పరితో వీక్ష్య నారదీ సా శుచిస్మితా 26
పూర్వోత్తరాయాం తిష్ఠన్తీ ఆహ్వయన్తీ కరేంగితైః 27
వసువు పలికెను :- మోహినీ! బృన్దారణ్య రహస్యమును చెప్పెదను. వినుము. నేను గురువు వలన పొంది ఇంతవరకు ఎవ్వరికీ తెలుపలేదు. నారదమహర్షి నా గురువునకు తెలిపెను. నారదమహర్షికి గోపికాపతిరహస్యమును బృన్ద చెప్పెను. అట్టి జగదుద్ధార కారణమగు బృన్దా మాహాత్మ్యమును ఇపుడు నీకు చెప్పెదను. భగవత్ర్పియుడగు నారదమహర్షి లోకములను పర్యటించుచు ఒకప్పుడు బృన్దావనమును చేరి పుష్పసరస్తీరమున నిలిచెను. ఈ సరస్సు మధురామండలమున నైఋతిదిశగా నున్నది బృందావనము మధురామండలమున నాలుగవస్థానము. గోపికాపతిరహస్య ప్రదేశము. ఇచటికి సమీపముననే గోవర్ధన పర్వతము కలదు. యమునానదీ తీరమున నందిగ్రామసమీపమున బృన్దాదేవి తపః ప్రదేశము. యమునా నదీ తీరమున సున్దరమగు బృన్దావనము కలదు. అచట పరమ పావనమగునది పుష్పసరస్సు. యమునానదీ తీరమున బృన్దా ఆశ్రమము అతి సుఖప్రదము. ఇచటనే చెలులతో శ్రీహరి విశ్రమించును. నారదమహర్షి దట్టమగు చెట్టునీడలో ముహూర్తకాలము విశ్రమించి, పుష్పసరోవరపు శీతల జలమును ఆ చమనము గావించి, మాధ్యాహ్నిక కర్మనాచరించి ససస్తీరమున నిలిచెను. సున్దరమగు ఆ బృన్దాశ్రమమున గోపాలకులు, గోపికలు నారదమహర్షి చూచుచుండగా బృందములుగా వచ్చుచుండిరి. ఇట్లు అచట ఒక ఝాము నిలిచి ఒకటిన్నరఝాము పగలుండగా అద్భుతమగు బృన్దాశ్రమమున ప్రవేశించెను. ఇచటనే కృష్ణభక్తి పరాయణురాలగు బృన్దాదేవి యుండును. అచటికి వచ్చినవారికి ఫలాదులతో సత్కారములను చేయుచుండును. సాధుసమ్మతుడగు నారదమహర్షి బృన్దాదేవిని ధ్యానయోగాంతమున కనులు తెరిచి అతిధియగు నారదునకు ఆసనమును అర్పించెను. బృందాదేవిచే సత్కరించబడిన నారదుడు ఆసనముపై కూర్చుండెను. గోపికాపతి రహస్యమును అతి రహస్యమును ఆదరముతో తెలియగోరెను. బృందాసత్కారమును స్వీకరించి బృందప్రసన్నురాలని తెలిసి హృదయభావమును తెలిపెను. బృన్దాదేవి ధ్యానయోగముతో నారదుని అభిమతమును తెలుసుకొని తన సఖియగు మాధవిని అచటికి పిలిచి ఇట్లు పలికెను. మహాత్ముడగు నారద మహర్షికి ప్రియమును చేకూర్చుము. ఈ ఆశ్రమమునకు పావనత్వమును చేకూర్చి నాకు ప్రీతిని కలిగించుము. తన ఆశ్రమమునకు వచ్చినవారికి ప్రీతిని కలిగించని ఆశ్రమము నక్కల ఇల్లువలె నిష్పలమగును. అంతట ఆ మాధవీదేవి బృన్దాదేవి ఆజ్ఞచే నారధుని తీసుకొని సరస్తీరమునకు వెళ్ళి వాయవ్య భాగమున స్నానము చేయుమని చెప్పెను. మాధవీదేవి ఆజ్ఞచే దేవర్షియగు నారదుడు శ్రీకృష్ణసంగమమును ధ్యానించుచు జలమున మునిగెను. నాదర మహర్షి నీట మునుగు చుండగా మాధవీదేవి బృన్దేప్సితమును నెరవేర్చి బృన్దాసమీపమునకు వెళ్ళెను. అంతట నారద మహర్షి మునిగి లేచి తనను వనితారూపముగా చూచి ఆశ్చర్యమును చెందెను. అంతట శుచి స్మితయగు నారదీదేవి ఈశాన్య కోణమున నున్న ఉత్తమ భూషణాలంకృతమై చేసన్నచే తనను పిలుచుచున్న సౌందర్యవతియగు వనితను చూచెను.
తతస్తయా సమాహూతా నారదీ సా తదంతికమ్‌ | ప్రాప్తా విశ్వాసితా స్వస్థా నీతా చాపి స్థలాంతరమ్‌ 28
రత్నప్రాకారఖచితే భవనేవనితాకులే | ప్రాపయ్య తాం నివృత్తాసౌ సాపి తాభిస్సుసత్కృతా 29
విశాఖాదిసఖీబృన్దై రాశ్వాస్యాలైకయా తతః | ప్రాపితాభ్యన్తరం దేవి సా పశ్యద్గోపికేశ్వరమ్‌ 30
దూత్యాం తస్యాం నివృత్తాయాం సమాహూతా ప్రియేణ సా | నారదీ ప్రణిపత్యేశం లజ్జానమ్రాంతికం య¸° 31
రసికేన సమాశ్లిష్య రమయిత్వా విసర్జితా | క్రమేణౖవ తు సంప్రాప్తా సా పునః కౌసుమం సరః 32
సా పునస్తత్ర మాధవ్యా మజ్జితా దక్షపశ్చిమే | పుంభావమభిసంప్రాప్తో నారదో విస్మితోకబ్రవీత్‌ 33
తతో బృందాజ్ఞయా తత్ర సరసః పూర్వదక్షిణ | ఏకాన్తం తప ఆస్థాయ తస్థౌ తత్ర్పేక్షణోత్సుకః 34
ఏవం తపస్యతస్తస్య నారదస్య మహాత్మనః | వృన్దయా ప్రేషితైర్వృత్తిం నిజాకల్పయత ఫలైః 35
ఏకదా నారదస్తత్ర విచరన్నాశ్రమాంతరే | శుశ్రావ సౌభగం శబ్దం
కయాచిత్సముదీరితమ్‌ 36

తచ్ఛ్రుత్వా కౌతుకావిష్టో నారదో
%ధ్యాత్మదర్శనః | విచిన్వన్వనమాస్థాయ న దదర్శ చ తత్పదమ్‌ 37
తతస్స విస్మయా విష్టో వృందాం పప్రచ్ఛ సాదరమ్‌ | సాపి తసై#్మ సమాచఖ్యౌ కుబ్జావృత్తాంతమాదితః 38
భూమ్యంతర గుహస్థానా కుబ్జానారీ వరావిభోః | కామమేకాంతకే స్వేశం సముపాచరతి స్వయమ్‌ 39

నతాం కో
%పి మునిశ్రేష్ఠ నిజానాతి మయా వినా | తతస్సంక్షేపతో వక్ష్యే యాం దిదృక్షుస్తపోచరః 40
ప్రాతః ప్రబోధితో మాత్రా స్నాత్వా భుక్త్వానుగాన్వితః | గోచారణాయ విపినే బృన్దావన ఉపావిశత్‌ 41
సఖిభిర్గోపకై క్రీడాం కుర్వన్సంచరాయంశ్చ గాః | ద్విత్రైః ప్రియసఖైరత్ర మమాశ్రమ ఉపావ్రజత్‌ 42
మయా ప్రకల్పితైర్వత్స భవనౌ సార్వకామికే | ఫలమూలాదిభిర్బక్తై స్తర్పితః ప్రియయాస్వపత్‌ 43
సుసఖ్యా రాధయా తత్ర సే వ్యమానో వ్రజప్రియః | సార్థయామం విహరతి నికుంజేషు పృథక్తృధక్‌ 44
రాధిదిభిస్తత్ర సుప్తో వీజితశ్శయనం గతః | సార్థయామే స్వయం బుద్ధో నిజాస్సంమాన్య తాః ప్రియాః 45
గోపైర్గోభిర్వృత స్సాయం వజ్రం యాతి ప్రహర్షితః | సఖ్యస్సఖిస్థలం ప్రాప్య ప్రియాం సంచయ రాధికామ్‌ 46
తయా సహ విశాలాక్ష్యః స్వగేహాన్యాన్తి చాన్వహమ్‌ | ఏవం గతాగతం కుర్వం ల్లీలా నిత్యముపాగతః 47
మయైవ దృశ్యతే వత్స నాపి బ్రహ్మభవాదిభిః | మయాప్యలక్షితం వత్స కుబ్జాసంకేతవైభవమ్‌ 48
ప్రీతిప్రియోక్త్యా జానామి సుగోప్యం ప్రవదామి తే | అంగారగార్పణంపు ణ్యా త్ర్పాప్తా సంకేతముత్తమమ్‌ 49
సదా సా సేవనవ్యగ్రా సైకైకేనాప్యనేకధా | శతకోటిమితాన్యేవం మిథునాని వసన్తి హి 50
కుబ్జాకృష్ణానురూపాణి నానాక్రీడాపరాణి చ | సంభూతాన్యాద్యమిధునా త్థ్సావరం భాషయన్త్యపి 51
గతాగతవిహీనాని నిత్యం నవనవాని చ | తదగమ్యం తృతీయస్య ద్వితీయసై#్యకతాం గతమ్‌ 52
రూపం విలక్షణం విప్ర సృష్టిస్థితిలయైకలమ్‌ | ఏకైవాహం విజానామి శ్రుతం శ్రుత్వా త్వమప్యధ 53

దగ్ధః షట్కర్ణగో మంత్ర ఇత్యుక్తం సముపాచర | శ్రుత్వైతద్దుర్లభం సో
%పి బృన్దోక్త్యా నారదో మునిః 54
ఉభయం చిన్తయన్ర్పాప్తో మునిస్తత్రైవ తత్పరమ్‌ | ఏతద్రహస్యం విధిజే విషయం గురు శిష్యయోః 55

నైవకో
%ప్యపరో వేత్తి ధర్మసై#్సవావయోరపి | ఏకైవ సా విజానాతి వక్తుశ్శ్రోతైకత శ్శుభౌ 56
తదేకం తత్త్వమేవాస్తి నేహ నానాస్తి కించన | గదితం తే మహాభాగే రహస్యం గోపికేశితుః 57
అట్లు ఆమెచే పిలువబడిన నారది ఆమెను సమీపించినది. ఆ వనిత నారదీ దేవికి నమ్మకము కలిగించి ఓదార్చి మరొక ప్రదేశమునకు తీసుకొని వెళ్ళెను. అచట రత్నప్రాకారఖచితము వనితాకులమగు భవనమున చేర్చి వనిత మరలిపోయెను. నారదీదేవి కూడా అచటి వనితలచే సత్కరించబడినది. విశాఖా మొదలగు సఖీబృన్దముచే ఓదార్చబడినది. వారిలో ఒక చెలి నారదీదేవిని అంతఃపురమునకు గొనిపోయినది. అచట నారది గోపికాపతిని దర్శించెను. దూతి వెడలిపోగానే ప్రియుడగు గోషికానాథుడు పిలువగా నారదీదేవి నమస్కరించి లజ్జచే తలవంచి సమీపించెను. రసికుడగు గోపికాపతి చక్కగా ఆలింగనము చేసుకొని రమింపచేసి విడిచిపుచ్చెను. నారదీదేవి క్రమముగా మరల పుష్పసరమస్సును చేరినది. అచట నున్న మాధవీదేవి నై
తి కోణమున స్నానము చేయించెను. స్నానము చేసిన వెంటనే పుంభావమును పొందిన నారదుడు ఆశ్చర్యమును చెందెను. తరువాత బృన్దాదేవి ఆజ్ఞచే నారదమహర్షి సరస్సునను ఆగ్నేయ కోణమున తపము నాచరించుచు శ్రీకృష్ణ దర్శనమును కోరుచుండెను. ఇట్లు తపమునాచరించుచు బృన్దాదేవి పంపిన ఫలములచే జీవనమును గడుపుచుండెను. ఒకపుడు నారదమహర్షి ఆశ్రమమున తిరుగాడుచు ఒక యువతి పలికిన మధుర శబ్దమును వినెను. అధ్యాత్మ జ్ఞానముగల నారదమమర్షి ఆ శబ్దమును విని కుతూహలముతో వెతకుచు వనమును చేరి ఆమె స్థానమును చూడజాలక పోయెను. అంతట ఆశ్చర్యమును చెందిన నారదమహర్షి ఆదరముతో బృన్దాదేవిని అడిగెను. బృందాదేవి నారద మహర్షికి మొదటి నుండి కుబ్జావృత్తాంతమును తెలిపెను. భూమ్యంతరమగుహస్థితయగు కుబ్జాదేవి ఉత్తమస్త్రీ. శ్రీకృష్ణభగవానునకు అత్యంత ప్రియురాలు. ఏకాంతమున స్వామికి పరిచర్యలను చేయించుచుండును. కుబ్జాదేవిని నేను తప్ప ఎవరూ తెలియ జాలరు. నీవు ఎవరిని చూడగోరి తపమునాచరించు చుంటివో ఆకుబ్జా వృత్తాంతమును సంక్షేపముగా తెలిపెదను. శ్రీకృష్ణభగవానుడు ప్రాతఃకాలమున తల్లి లేవపగా లేచిస్నానమాడి భుజించి అనుచరులతో కలిసి గోవులను మేపుటకు అరణ్యమునకు చేరి బృందావనమున విశ్రమించెను. స్నేహితులగు గోపాలకులతో క్రీడించుచు ఆవులను త్రిప్పుచు ఇద్దరు మువ్వురు ప్రియమిత్రులతో నా ఆశ్రమమునకు వచ్చెను. సర్వారామప్రదమగు భవనమున నాచేకల్పించబడిన ఫలమూలాదులచే తృప్తి చెంది ప్రియురాలితో కలిసి పరుండెను. అత్యంత ప్రియురాలగు రాధచే సేవించబడుచు గోపికా ప్రియుడు ఆయా పొదలలో వేరువేరుగా ఒక ఝామున్నర విహరించును. అచట పరుండిన స్వామిని రాధాదులు వింజామరలచే వీచుచుందురు. ఝామున్నరకు స్వయముగా మేల్కాంచి తన ప్రియురాళ్ళను లాలించి గోపాలకులతో గోవులతో సాయంకాలమున సంతోషముతో ఇల్లు చేరును. చెలులందరూ తమ ప్రదేశమున చేరి ప్రియురాలగు రాధావేవిని వెతకి ఆమెతో కలిసి వారందరూ ప్రతిదినమూ తమ తమ గృహములకు వెళ్ళెదరు. ఇట్లు ప్రతిదినము ఈ లీలలనే చేయుచుండును. ఈ లీలను నేను మాత్రమే చూచుచుందును. బ్రహ్మ రుద్రాదులు కూడా చూడజాలరు. కుబ్జాసంకేత వైభవమును నేను కూడా చూడజాలకపోతిని. ప్రీతిప్రియుల మాటచలే తెలిసితిని. ఈకు అతి రహస్యమును తెలుపుచున్నాను. పవిత్రమగు అంగరాగార్పణము వనల కుబ్జాదేవి ఉత్తమ సంకేతమును పొందగలిగినది. కుబ్జాదేవి ఎప్పుడూ సేవించుటలోనే మునిగియుండును. ఒక్కడే యగు గోపికాపతిని పలువిధములుగా సేవించుచుండును. ఇచట ఇట్లు శతకోటి మిథునములు నివసించుచుండును. కుబ్జాకృష్ణాను రూపములు నానా క్రీడాపరములుగా నుండి ఆద్యమిథునము నుండి పుట్టి ఇచటి వనమునకు శోభనిచ్చుచుండును. ఈ మిథునములు గతాగత రహితములు. నిత్యనూతనములు. తృత్రీయమునకు అగమ్యమై ద్వితీయమున ఐక్యమును పొందిన విలక్షణ రూపము సృష్టిస్థితిలయములకు ఏక మూలస్థానము. ఈ విషయమును నేనొక్కదానినే తెలియుదును. ఇపుడు నా నుండి విని వీవు కూడా తెలియుదువు. షట్కర్ణగతమగు దుగ్ధమంత్రమును చక్కగా ఉపాసించుము. ఇట్లు బృన్దాదేవి తెలుపగా దుర్లభమగు విషయమును తెలిసి దుర్లభమగు ఆ మిథునమును చింతించుచూ అచటనే యుండెను. ఓ బ్రహ్మపుత్రా! ఇది గురు శిష్యుల రహస్యము. ఇతరులు తెలియజాలరు. మనధర్మము కూడా ఇదియే. మొదట ఒకడే తెలియును. తరువాత వినువాడు తెలియును. ఇదియే ఒకటే తత్త్వము కలదు. ఇచట నానా తత్త్వస్వరూపము లేదు. ఇట్లు నీకు అతి రహస్యమగు గోపికాపతి చరితమును తెలిపితిని.
ప్రకాశాచ్చరితం చాపి వక్ష్యే సమ్యజ్నిశామయ | యత్ర సందర్శితం తత్త్వం త్వత్పిత్రే విధినందిన 58
తద్బ్రహ్మకుండమేతద్ది పుణ్యం బృన్దావనే వనే | తత్ర యస్స్నాతి మనుజో మూలవేషం విభావయన్‌ 59
వైభవం పశ్యతే కంచి దేవం నిత్యవిహారిణః | శ##క్రేణ జ్ఞాతతత్త్వేన గోవిన్దో యత్ర చిన్తితః 60
గోవిన్దకుండం తద్భద్రే స్నాత్వా తత్రాపి తల్లభేత్‌ | ఏకానేకస్వరూపేణ యత్ర కుంజావిహారిణా 61
వల్లవీభి స్సమారబ్ధో రాసస్తదపి తద్విధమ్‌ | యత్ర నన్దాదయో గోపా దదృశుర్వైభవం విభోః 62
తచ్చ తత్త్వప్రకాశాఖ్యం తీర్థం శ్రీయమునాజలే | దర్శితం యత్ర గోపానాం కాలియస్య విమర్దనమ్‌ 63
తచ్చ పుణ్యం సమాఖ్యాతం తీర్థం పాపాపరాంనృణామ్‌ | దావాగ్నేర్మోచితా యత్‌ స స్త్రీ బాలధనార్భకాః 64
గోపాః కృష్ణేన తత్పుణ్యం తీర్థం స్నానదఘాపహమ్‌ | యత్ర కేశీ హతస్తేన లీలయైన హయాకృతిః 65
తత్ర స్నాతస్తు మనుజో లభ##తే ధామ వైష్ణవమ్‌ | యత్ర దుష్టోవృషస్తేన హతస్తత్రాభవచ్ఛుచిః 66

అరిష్టకుండం విఖ్యాతం స్నానమాత్రేణ ముక్తిదమ్‌ | ధేనుకో
భోఘో బకో వత్సో వ్యోమో లంబాసురోపి చ 67
హతాః కృష్ణేన లీలాసు తత్ర తీర్థాని యాన్యపి | తేషు స్నాత్వా నరో భక్త స్సన్తర్ప్య పితృదేవతాః 68
లభ##తే వాంఛితాన్కామా న్గోపాలస్య ప్రసాదతః | సుప్తం భుక్తం విచరితం శ్రుతం దృష్టం విలక్షణమ్‌ 69
కృతం యత్ర చ తత్‌ క్షేత్రం స్నానాత్స్వర్గగతిప్రదమ్‌ | శ్రుతస్సంచిన్తితో దృష్టో నతశ్ల్శిష్టస్త్సుతో
ర్థితః 70
యత్ర పుణ్యనరైర్భద్రే తచ్చ తీర్థం గతిప్రదమ్‌ | యత్ర శ్రీరాధయా భ##ద్రే తపస్తప్తం సుదారుణమ్‌ 71
తచ్ఛ్రీకుండం మహత్పుణ్యం స్నానే దానే జపాదికే | వత్సతీర్థం చన్ద్ర సర స్తధైవాప్సరసాం సరః 72
రుద్రకుండం కామకుండం పరమం మందిరం హరేః | విశాలాలకనందాఢ్యా నీపఖండం మనోహరమ్‌ 73
విమలం ధర్మకుండం చ భోజనస్థలమేవ చ | బలస్థానం బృహత్సామః సంకేతస్థానకం హరేః 74

నంద్రిగ్రామః కిశోర్యాశ్చ కుండం కోకిలకాననమ్‌ | శేషశాయి పయో
బ్ధిశ్చ క్రీడాదేశోక్షయో వటః 75
రామకుండం చీర చౌర్యం భద్రఖాండీరబిల్వకమ్‌ | మానాహ్వం చ సరః పుణ్యం పులినం భక్త భోజనమ్‌ 76
అక్రూరం తార్‌క్ష్యగోవిందం బహులారణ్యకం శుభే | ఏతద్బృన్దావనం నామ సమంతాత్పంచయోజనమ్‌ 77
సుపుణ్యం పుణ్యకృజ్జుష్టం దర్శనాదేవ ముక్తిదమ్‌ | యస్య సందర్శనం దేవా వాంఛన్తి చ సుదుర్లభమ్‌ 78
లీలా మాభ్యంతరీం ద్రుష్టుం తపసాపి న చ క్షమాః | సర్వత్ర సంగముత్సృజ్య యస్తు బృన్దావనం శ్రయేత్‌ 79
న తస్య దుర్లభం కించిత్‌ త్రిషు లోకేషు భామిని | బృందావనేతి నామాపి యస్సముచ్చరతి ప్రియే 80
తస్యాపి భక్తిర్భవతి సతతం నన్దనన్దనే | యత్ర బృందావనే పుణ్య నరనారీప్లవంగమాః 81
కృమికీటపతంగాద్యాః ఖగా వృక్షా నగా మృగాః | సముచ్చరంతి సతతం రాధాకృష్ణేతి మోహిని 82

కృష్ణ మాయాభిభూతానాం కామకశ్మలచేతసామ్‌ | స్వప్నే
పి దుర్లభం పుంసాం మన్యే బృందావనేక్షణమ్‌ 83
బృందావణ్యం తు యైర్దృష్టం నరైస్సుకీతిభిశ్బ్శుభే | తైః కృతం సఫలం జన్మ కృపాపాత్రాణి తే హరేః 84
కిం పునర్బహునోక్తేన శ్రుతేన విధినందిని | సేవ్యం బృన్దావనం పుణ్యం భవ్యం ముక్తిమభీప్సుభిః 85
దృశ్యం గమ్యం చ సంసేవ్యం ధ్యేయం బృన్దావనం సదా | నాస్తి లోకే సమంతస్య భువి కీర్తివివర్ధనమ్‌ 86
ఇక ఇపుడు ప్రకాశమగు చరితమును చెప్పెదను. చక్కగా వినుము. ఈ తత్త్వమును నీ తండ్రికి చూపెను. చూపిన ప్రదేశమీ బ్రహ్మకుండమే. బృన్దావనమున ఈ కుండము పరమ పావనము. ఇచట స్వామి మూల రూపమును ధ్యానించుచు స్నానమాడినవారు నిత్య విహారియగు గోపికాపతి వైభవమును చూడగలడు. ఇచటనే తత్త్వమునెరిగిని ఇంద్రుడు గోవిందుని ధ్యానించెను. ఇట్లు ధ్యానించిన ప్రదేశ##మే గోవిన్ద కుండము. ఇచట స్నానమాడినవారు కూడా గోవిన్ద వైభవమును దర్శించగలరు. ఏకరూపములో, బమురూపములతో గోపికలతో పొదలిండ్లలో క్రీడించిన రాసక్రీడ కూడా అత్యద్భుతము. పరమపావనము. ఇచటనే నందాది గోపాలకులు శ్రీహరి వైభవమును దర్శించిరి. ఇదియే తత్త్వప్రకాశతీర్థము. శ్రీయమునా జలమున కలదు. గోపాలకులకు కాలియమర్దనము చూపిన ప్రదేశము సర్వపాపాపహతీర్థము. గోపగోపీ జనమును దావాగ్నినుండి కాపాడిన ప్రదేశము కూడా పరమ పావనము. స్నానమాత్రమున సర్వపాపహారము. శ్రీకృష్ణ భగవానుడు విలాసముగా హయాకారమున నున్న కేశియను రాక్షసుని సంహరించిన ప్రదేశమున స్నానమాడినవారు శ్రీహరిలోకమును చేరెదరు. దుష్టుడగు వృషాసురుని సంహరించిన ప్రదేశము అరిష్టకుండము. స్నానమాత్రమున ముక్తిప్రదము, ధేనుకాసురుడు, అఘాసురుడు, బకాసురుడు, వత్సాసురుడు, వ్యోమాసురుడు, లంబాసురుడు శ్రీకృష్ణభగవానునిచే లీలగా చంపబడిన ప్రదేశములన్నియూ పవిత్ర తీరథములే. వీటిలో స్నానమాడి పితృదేవతలకు తర్పణము లిడినవారు శ్రీకృష్ణానుగ్రహము వలన సకలాభీష్టములను పొందగలరు. శ్రీకృష్ణ భగవానుడు నిదురించిన, భుజించిన, సంచరించిన, వినిన, చూచిన ప్రదేశములన్నియూ విలక్షణ క్షేత్రములే. వీటిలో స్నానమాడినవారికి స్వర్గము లభించును. పుణ్యాత్ములకు గోపాలకులు స్వామి చరితమును వినిన ప్రదేశము, ధ్యానించిన, దర్శించిన, నమస్కరించిన, ఆలింగనము చేసుకోబడిన, స్తుతించబడిన, యాచించబడిన ప్రదేశములన్నియూ పరమ పావనములు. ఉత్తమగతి ప్రదములు. శ్రీ రాధాదేవి తపమునాచరించిన ప్రదేశము శ్రీ కుండమనబడును. ఇది పరమ పావనము. ఇచట స్నానదాన జపాదికములు అక్షయగతి ప్రదములు. వత్సతీర్థము, చన్ద్రసరస్సు, అప్సరస్సరస్సు, రుద్రకుండము, కామకుండము, శ్రీహరి మందిరము, అలకనంద పొదలో నున్న విశాల, మనోహరమగు నీపఖండము, ధర్మకుండము, భోజనస్థలము, బలస్థానము, బృహత్సానువు, శ్రీహరి సంకేతస్థానము, నందిగ్రామము, కిశోరమండము, కోకిలకాననము, శేషశాయిపయో
%బ్ధి, క్రీడాదేశము, అక్షయవటము, రామకుండము, చీర చౌర్యము, భద్రభాండీరబిల్వకము, మానసరస్సు, ప్రలినము, భక్త భోజనము, అక్రూరము, తార్‌క్ష్యగోవిన్దము బహులారణ్యకము, ఇవన్నియూ కలిసి బృందావనకమండలమనబడును. ఇది యంతయూ పంచయోజన విస్తీర్ణము. పరమపావనము. పవిత్ర జనసేవితము, దర్శన మాత్రమున ముక్తిప్రదము. సుదర్లభమగు బృన్దావనమును దేవతలు కూడా చూడగోరెదరు. శ్రీహరి రహస్యలీలలను చూడగోరి తపస్సునాచరించియు చూడజాలక పోయిరి అని సంగములను విడిచి బృన్దావనమునాశ్రయించిన వారికి మూడులోకములలో దుర్లభమగునదేదియును లేదు. బృన్దావననామమును పలికిన వారికి కూడా నన్దనన్దనునియందు భక్తి కలుగును. బృన్దావనమునందు నరులు, నారీజనము, వానరులు, కృమికీటపతంగాదులు, పక్షులు, వృక్షములు, పర్వతములు, మృగములు, ఎప్పుడూప రాధాకృష్ణ నామమును జపించుచుచుందురు. కృష్ణమాయాభి భూతులు, కామకశ్మల చిత్తులు అగువారికి స్వప్నములలో కూడా బృన్దావన దర్శనము లభించదు. బృన్దావనమును దర్శించిన వారు సఫలమగు జన్మను పొందెదరు. శ్రీహరి కృపాపాత్రులయ్యెదరు. ఇంకనూ ఏమి చెప్పవలయును. ముక్తిని కోరువారు శుభప్రదము, పుణ్యప్రదమగు బృన్ధావనమును సేవించవలయును. దర్శించవలయును. ధ్యానించవలయును. దీనిలో సరూపమగు కీర్థివర్ధకమగు మరియొక క్షేత్రము ఈ భూమండలముననే లేదు.
యత్ర గోవర్ధనో నామ ద్విజకల్పే పురాతనే | విరక్తస్సర్వసంసారా
త్తప్తవాన్పరమంతపః 87
తద్గత్వా దేవి దేవేశో భగవాన్వివిష్ణురవ్యయః | క్రీడాస్థానం నిజం ప్రాప్తో వరం దాతుం ద్విజన్మనే 88
తం దృష్ట్వా దేవదేవేశం శంఖచక్రగదాధరమ్‌ | విలసత్కౌస్తు భోరస్కం
మకరాకృతి మండలమ్‌ 89
సుకిరీటం సుకటకం కలనూపురభూషితమ్‌ | వనమాలానివీతాంగం శ్రీవత్సాంకితవక్షసమ్‌ 90
పీతకౌశేయ వసనం నవాంబుదసమప్రభమ్‌ | సునాభిం సుందరగ్రీవం సుకపోలం సునాసికమ్‌ 91
సుద్విజం సుస్మితం సుష్ఠు జానూరు భుజమధ్యగమ్‌ | కృపార్ణవం ప్రముదితం సుప్రసన్నముఖాంబుజమ్‌ 92
దృష్ట్వా స సహసోత్థాయ ననామ భువి దండవత్‌ | వరం బ్రూహీతి నిర్దిష్టో ప్రాహ గోపర్ధనో హరిమ్‌ 93
పద్భ్యామాక్రమ్య మత్పృష్ఠే తిష్ట చైష వరో మమ | తచ్ఛ్రుత్వా భక్తవశ్యో వై విచిన్త్య చ పునః పునః 94

తస్థౌ తత్పృమాక్రమ్య తదా భూయో ద్విజో
%బ్రవీత్‌ | నాహం త్వాముత్సహే దేవ నిజపృష్ఠే జగత్పతే 95
అవతారయితుం తస్మా దేవమేవ స్తిరోభవ | తతః ప్రభృతి విశ్వాత్మా త్యక్త్వా గోవర్ధనం ద్విజమ్‌ 96
గిరిరూపధరం యాతి నిత్యం యోగివనం క్వచిత్‌ | కృష్ణావతారే భగాన్‌ జ్ఞాత్వ గోవర్ధనం ద్విజమ్‌ 97
సంప్రాప్తం నిజసారూప్యం నందాద్యైస్సమభోజయత్‌ | అన్నకూటేన దోహేన తర్పయిత్వా చలం ద్విజమ్‌ 98
తృట్పరీతం సమాజ్ఞాయ నవమేఘానపాయయత్‌ | మిత్రం స వాసుదేవస్య సంజాతం తేన కర్మణా 99
తం యో భక్త్యా నరో దేవి పూజయేదుపచారకైః | ప్రదక్షిణం పరిక్రామే న్నతస్యపునరుద్భవః 100
గోవర్ధనో గిరిః పుణ్యో జాతో హరినివాసతః | తం దృష్ట్వా దర్శనేనాల మన్యపుణ్యాచలస్య చ 101
యామునం పులినం రమ్యం కృష్ణవిక్రీడనాంచితమ్‌ | త్వమేవ బ్రూహి సుభ##గే క్వాన్యత్ర జగతీతలే 102
తస్మాత్సర్వప్రయత్నేన త్యక్త్వావననదీగిరీన్‌ | సుపుణ్యాన్పుణ్యదాన్నౄణాం సేవ్యం బృన్దావనం సదా 103
యమీ పుణ్యా నదీ యత్ర పుణ్యో గోవర్ధనోగిరిః | తత్కింబృన్దావత్పుణ్యం అరణ్యం భువి విద్యతే 104
కలికల్మషభీతానాం విషయాసక్తచేతసామ్‌ | నాన్యం బృన్దావనాత్సేవ్య మస్తి లోకేష్వపి త్రిషు 105
యస్మిన్నిత్యం వి చరతి హరిర్గోగోగోపికాభిః | బర్హాపీడే నటవరవపుః కర్ణికారావతం సీ
వంశీహూసీస్వనజితరవో వైజయన్తీ వృతాంగో | నందస్యాంగాద్ధృత మణిగణీ యశ్చ హంసో
హమాఖ్యః 106
యస్య ధ్యానం న గజనియుతో
హర్ణిశం వై గిరీశో | భక్తిక్లిన్నో రహసి కురుతే హ్యర్థనారీశ్వరాఖ్యః
గాయత్రీం స్త్రీం హృదయకుహరే పద్మయోనిర్విధత్తే | నేత్రైరిన్ద్రోదశశతమితై ర్వీక్షతే వైశచీతామ్‌ 107
అశ్రోత్రేశో రహసి వనితాం రక్షతి స్వాం రసజ్ఞో | వంశీనాదశ్రవణజభియా కాన్యవార్తా జనానామ్‌
ఛేదం శోషం తదను దహనం భేదనం ప్రాప్య యాసీత్‌ | శ్రీగోపీశాధరజనిసుధాం సాదరం శీలయన్తీ 108
యాభిర్బృన్దావనమనుగతో నందసూనుఃక్షపాసు | రేమే చన్ద్రాంశుకలితసముద్యోత భ##ద్రేనికుంజే
తాసాం దిష్టం కిమహమధునా వర్ణయే వల్లవీనాం | యాసాం సాక్షాచ్చరణజ రజశ్శ్రీశవిధ్యాద్యలభ్యమ్‌ 109
యత్ర ప్రాప్తాతృణమృగఖగా యే కృమిప్రాణిబృన్దా | బృన్దారణ్య విధిహరరమాభ్యర్హణీయా భవన్తి
తత్సంప్రాప్యాద్వయపదరతో బ్రహ్మభూయం గతః కౌ | ప్రేమస్నిగ్ధో విహరతి సుఖాంభోధి కల్లోలమగ్నః 110
యత్ర క్రూరా సహజమసుభృద్ర్వాత జాతాం విసృజ్య | వైరం సై#్వరం సుహృదివ తత్సౌఖ్యమేవాశ్రయన్తే
తత్కింప్రాప్య ప్రభుమివ జనస్సంపరిత్యజ్య గచ్ఛన్‌ | క్వాప్యన్యత్రప్రభవతి సుఖీ కృష్ణ మాయాకరంసే 111
బృందారణ్యం తదఖిలధరాపుణ్యరూపం శ్రయన్మే | స్వాంతం ధ్వాన్తం జగదిదమధః కృత్య వర్వర్తి శశ్వత్‌
గోపీనాధః ప్రతిపదమపి ప్రేమసంక్లిన్నచేతా | నీచం వోచ్చం న చ గణయతి ప్రోద్భరత్యేవ భక్తాన్‌ 112
గోపాన్గోపీః ఖగమృగనగాగోష్ఠ గోభూరజాంసి | స్మృత్వాదృష్ట్వా ప్రణమతి జనే ప్రేమరజ్జ్వానిబద్ధః
దాస్యం భ##క్తే కలయతితరాం తత్కమన్యం వ్రజేశాత్‌ | సేవ్యం దేవం గణయ విధిజే
హంతు జానామి నైవ 113
ఏతత్సంక్షేపతః ప్రోక్తం బృన్దారణ్యసముద్భవమ్‌ | మాహాత్మ్యం విధిజే తుభ్యం వక్తవ్యం నావశేషితమ్‌ 114
సంసారభృతైర్మనుజై రేతదేవ సదానఘైః | శ్రోతవ్యం కీర్తనీయం చ స్మర్తవ్యం ధ్యేయమేవ చ 115
బృందారణ్యస్య మాహాత్మ్యం యశ్శృణోతి నరశ్శుచిః | కీర్తయేద్వాపి విధిజే సో
పి విష్ణుర్నసంశయః 116
ఇతి శ్రీ బృహన్నారదీయ మహాపురాణ బృహదుపాఖ్యానే
ఉత్తరభాగే వసుమోహినీసంవాదే
శ్రీ బృన్దావనమాహాత్మ్యం నామ
అశీతితమో
ధ్యాయః పురాతన కల్పమున గోవర్ధనుడను ద్విజుడు సర్వసంసారమునుండి విరక్తుడై ఉత్తమ తపమునాచరించెను. అవ్యయుడగు శ్రీహరి భగవానుడు తన క్రీడాస్థానమగు భూమండలమునకు వచ్చి బ్రాహ్మణునకు వరమునీయ సంకల్పించెను. దేవదేవేశుడు, శంఖచక్రగదాధరుడు, విలసత్కాస్తుభోరస్కుడు, మకరకుండలధారి, సుకిరీటుడు, సుకటకుడు, కలనూపుర భూషితుడు, వనమాలానిరీతాంగుడు, శ్రీవత్సాంకితవక్షసుడు, పీతకేశేయవస్త్రుడు, న వాంబుద సమప్రభుడు, సునాభి, సుందరగ్రీవుడు, సుకపోలుడు, సునాసికుడు, సుదంతుడు, సుస్మితుడు, సుజానువక్షస్థ్సలుడు, కృపాసాగరుడు, ప్రృష్టుడు, సుప్రసన్నముఖాంభుజుడు, అగు శ్రీహరిని చూచి సంభ్రమముతో లేచి భూమిపై దండవత్ర్పణామములాచరించెను. వరమును కోరుమని స్వామి యడుగగా గోవర్ధనుడిట్లు పలికెను. పాదములనుండి నామూపుననుండుము. ఇదియే నాకు వరము. ఆ మాటలను విని గోవిన్దుడు మాటిమాటికాలోచించి గోవర్ధనుని పృష్టము నాక్రమించి నిలిచెను. అపుడు మరల గోవర్ధనుడిట్లు పలికెను. ఓ దేవా! నేను నిన్ను నాపృష్ఠమునుండి దించుటకు ఉత్సహించను. కావున ఇచట ఇట్లే స్థిరముగా నుండుము. అప్పటినుండి శ్రీహరి గోవర్ధన ద్విజుని విడిచి గిరిరూపధరుడగు గోవర్ధనమునకు వెళ్ళి నిలిచెను. శ్రీకృష్ణావతారమున శ్రీహరి గోవర్ధన పర్వతమును ద్విజునిగా తన సారూప్యమును పొందినవానిగా తెలిసి నందాదులచే భజింపచేసెను. ఇట్లు అన్నకూటముచే క్షీరానిదోహనముచే పర్వతరూపుడగు ద్విజునకు తృప్తి కలిగించి దాహము గొనినాడని తెలిసి నవమేఘములచే వర్షింప చేసి నీరుత్రాగించెను. అప్పటినుండి గోవర్ధనుడు వాసుదేవునకు మిత్రుడాయెను. గోవర్ధన పర్వతమును భక్తి కలిగి ఉపచారములచే పూజించిన వారు, ప్రదక్షిణములనాచరించిన వారు మరల పుట్టరు. గోవర్ధన పర్వతము శ్రీమరినివాసము వలన పుణ్యప్రదమాయెను. గోవర్ధనపర్వతమును దర్శించిన, ఇతర పుణ్యపర్వతములను దర్శించ పనిలేదు. యమునాతీరము సుందరము కృష్ణక్రీడావిభూషితము. భూమండలమున ఇంత పవిత్రమైనది ఎచట కలదో నీవే చెప్పుము. కావున ఇతర వననదీపర్వతములను విడిచి సర్వ ప్రయత్నముతో బృన్దావనమును సేవించవలయును. ఇచట పవిత్రమగు యమునానది, పావనమగు గోవర్ధన పర్వతముకలదు. కావున బృన్దావకముకంటే పవిత్రమగు నది ఈ భూ మండలమున ఏది కలదు? కలికల్మషభీతులకు విషయాసక్తచిత్తులకు బృందావనముకంటే సేవించదగినది ఈ మూడులోకములలో మరియొకటి లేదు. ఈ బృన్దావనమున నన్దగోపపుత్రుడు, నెమలిపింఛమును ధరించినవాడు, నటవరవేషధారి, కర్ణికారభూషణుడు, వేణు నాదముతో హంసీరవమును గెలిచినవాడు, వైయజన్తీ మాలావృతాంగుడు అహంపదార్థభూతుడు హంసస్వరూపుడగు శ్రీ కృష్ణభగవానుడు గోపాలులతో గోపికలతో ప్రతినిత్యము విహరించుచుండును. పార్వతీ సహితుడగు పరమేశ్వరుడు అర్ధనారీస్వరూపుడు భక్తి పరవశుడై రహస్యముగా శ్రీకృష్ణ భగవానుని ధ్యానించు చుండును. బ్రహ్మ గాయత్రీ స్వరూపముతో నున్న స్త్రీ మూర్తిని హృదయ కుహరమున నిలుపుకొనును. ఇంద్రుడు వేయి కనులతో నిత్యము శశీ రూపమున దర్శించుచుండును. ఆదిశేషుడు రసజ్ఞుడుకావున తన ప్రియురాలిని వేణు నాదశ్రవణము నుండి రహస్యముగా కాపాడుచుండును. అనగా ఇతరుల విషయమేమి చెప్పవలయును? ఖేదమును, శోషణమును, తాపమును, భేదమును పొంది గోపిక శ్రీ గోపీనాధాధరసుధను సాదరముగా పానము చేయుచుండెను. శ్రీకృష్ణభగవానుడు బృన్దావనమును చేరి రాత్రులందు చంద్రుని వెన్నెలలచే కాంతివంతమగు పొదలలో గోపికలతో క్రీడించెను. ఆ గోపికల అదృష్టమును ఏమని చెప్పవలయును. వీరి చరణ పరాగము బ్రహ్మాదులకు కూడా దుర్లభ##మే. బృందావనమున గల తృణమృగఖగకృమిప్రాణి బృందములు బ్రహ్మ రుద్రేందాదులచే పూజింపదగినవగును. అట్టి బృందావనమును చేరి బ్రహ్మభూతుడగు శ్రీహరి సుఖాంభోధికల్లోలమగ్నుడై ప్రేమస్నిగ్ధుడై విహరించుచుండును. ఈ బృన్దావనమున క్రూరప్రాణులు సైతము సహజముగు క్రౌర్యమును వైరమును విడిచి యధేచ్ఛముగా మైత్రితో సుఖముగా నుందురు. కావున మానవులు శ్రీకృష్ణుని కంటే ఇతరుల నాశ్రయించి ఎక్కడ ఆనందించగలరు? ఇట్లు సకల భూమండల పుణ్యరూపముగా నున్న బృన్దావనమును చేరినా మనస్సు అంధకారమును, ఈ జగత్తును తృణీకరించి ఎప్పుడూ ఆనందించుచున్నది. ఇచట గోపీనాథుడు ప్రతి పదమున ప్రేమార్ధ్రహృదయుడై ఎక్కువ తక్కువలను లెక్కించక భక్తులనుద్ధరించుచుండును. గోపాలకులను, గోపికలను, ఇచటి ఖగమృగ నగములను, గోపగోభూరజమును తలచి దర్శించి ప్రేమపాశబద్ధుడై నమస్కరించుచుందురు. భక్తియందు మనస్సులగ్నమగును. కావున గోపికాపతికంటె సేవించదగిన వారెవరో నాకు మాత్రము తెలియదు. ఇట్లు బృందావనమాహాత్మ్యమును సంక్షేపముగా చెప్పితిని. ఇక చెప్పవలసిన దేమియూ లేదు. సంసారభూతులకు మనుజులు ఈ బృందాతవనమాహాత్మ్యమునే వినవలయును. అనవలయును. స్మరించవలయును, ధ్యానించవలయును. ఈ బృందావనమాహాత్మ్యమును శుచియై వినిననూ చదివిననూ వారు విష్ణుతుల్యులగుదురు.

ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున
బృహదుపాఖ్యానమున ఉత్తరభాగమున
వసుమోహినీసంవాదమున శ్రీ
బృన్దావనమాహాత్మ్యమను
ఎను బదియవ
అధ్యాయము

Sri Naradapuranam-3    Chapters    Last Page