Sri Naradapuranam-3    Chapters    Last Page

అష్టసప్తతి తమో%ధ్యాయః డెబ్బది యెనిమిదవ అధ్యాయము

అవంతికా మాహాత్మ్యమ్‌

మోహిన్యువాచ :-


అత్యద్భుత మిదం విప్ర మాహాత్మ్యం నర్మదా భవమ్‌ | శ్రుతం త్వయా నిగదితం నృణాం పాప వినాశనమ్‌1

అదునా తు మహాభాగ బ్రూహి మే
%వంతి సంభవమ్‌ | మాహాత్మ్యం దేవ వన్ద్యస్య మహాకాలస్య చ ప్రభో2
మోహిని పలికెను :-
ఓ బ్రాహ్మణోత్తమా ! నర్మదా మాహాత్మ్యము అత్యద్భుతము. నరులకు పాపవినాశము. నీవు చెప్పగా వింటిని. మహానుభావా? ఇపుడు అవంతికా మాహాత్మ్యమును తెలుపుము. అట్లే దేవవన్ద్యుడగు మహాకాలుని మాహాత్మ్యమును కూడా తెలుపుము.
వసురువాచ :-
శృణు భ##ద్రే ప్రవక్ష్యామి హ్యవంత్యాః పుణ్యదం నృణామ్‌ | మాహాత్మ్యం సర్వపాపఘ్నం యధావత్పరి కీర్తితమ్‌ 3
మహాకాల వనం పుణ్యం తపస్థ్సాన మనుత్తమమ్‌ | యత్ర దేవో మహాకాల స్థ్సితస్తపసి నిత్యదా 4
మహాకాల వనాత్‌క్షేత్రం నాపరం విద్యతే భువి | యత్‌ గత్వా నరో దేవి స్పర్థతే దైవతై స్సహ 5
కపాల మోచనం నామ యత్ర తీర్థం సులోచనే | తత్ర స్నాత్వా నరో భక్త్యా బ్రహ్మహాపి విశుద్ధ్యతి 6
తథావకలకలే శాఖ్యం దేవమభ్యర్చ్య మానవః | వివాదే జయ మాప్నోతి కార్య సిద్ధిం చ సంతతమ్‌ 7
అత్రాన్యదప్సరః కుండం తీర్థం తత్ర ప్లుతో నరః | సుభగో భోగ వాన్భూయా త్సాక్షాత్కన్దర్ప సన్పిభః 8
మహిషాఖ్యే తధా కుండే స్నానశ్శత్రూ ఞ్జ యేద్రణ | స్నాతస్తు రుద్ర సరసి రుద్రలోకే మహీయతే 9
కుండలేశ్వర మాసాద్య సమభ్యర్చ్య విధానతః | వ్యాపారే లాభమాప్నోతి జాయతే చ శివప్రియః 10
విద్యాధరాహ్వయే తీర్థే నరస్స్నాత్వా విశుద్ధ్యతి | మార్కండేశ్వర మభ్యర్చ్య దీర్ఘాయుశ్చ ధనీ భ##వేత్‌ 11
సంపూజ్య శీతలం దేవీం నరః కాలవనే స్థితామ్‌ | విస్ఫోటకమయం నైవ కదాచిత్తస్య జాయతే 12
స్వర్గ ద్వారం సమాసాద్య స్నాత్వా భ్యర్చ్యసదాశివమ్‌ | నరో న దుర్గతిం యాతి స్వర్గలోకే మహీయతే 13
రాజస్థలం నరః ప్రాప్య తతః స్సాముద్రికే ప్లుతః | స్నానస్య సర్వతీర్థానాం లభ##తే ఫలముత్తమమ్‌ 14
శంకరస్య తథా వాప్యాం స్నాత్వా నియమవాన్నరః | ప్రాప్యేహ వాంఛితాన్భోగా నంతే రుద్రపురం వ్రజేత్‌ 15
శంకరాదిత్యమభ్యర్చ్య నరస్స్యాద్దుష్ర్పధర్షణః | స్నాతస్తు నీలగంగాయాం దేవీం గన్దవతీం నరః 16
సంపూజ్య భక్తి భావేన సర్వపాపైః ప్రముచ్యతే | దశాశ్వమేధికే స్నాత్వా వాజిమేధఫలం లభేత్‌ 17
అధ మర్త్యస్సమాసాద్య ఏకానంశాం సురేశ్వరీమ్‌ | సంపూజ్య గంధపుష్పాద్యై స్సర్వాన్కామానవాప్నుయాత్‌ 18
హరసిద్ధిం నర్యోభ్యర్చ్య సర్వసిద్ధీశ్వరో భ##వేత్‌ | పిశాచకాదికాన్మర్త్య స్సమభ్యర్చ్య చతుర్దశ 19
సర్వాన్కామానవాప్నోతి నాత్ర కార్యా విచారణా | హనుమత్కేశ్వరం ప్రార్చే త్స్నాత్వా రుద్ర సరోవరే 20

యో నర శ్రద్ధయాయుక్త స్సలబేత్సంపదో
%ఖిలాః | వాల్మీకేశ్వర మభ్యర్చ్య సర్వవిద్యానిధిర్భవేత్‌ 21
శుక్రేశ్వరాది లింగాని యోర్చయే ఛ్ర్చద్ధయా నరః | సస్యాధఖిల భోగాఢ్య స్సర్వ రోగవివర్జితః 22
పంచేశానం సమభ్యర్చ్య స్యాన్నరస్సర్వ సిద్దిభాక్‌ | కుశస్థలీం పరిక్రమ్య వాంచితం లభ##తేఫలమ్‌ 23
అక్రూరేశంతు సంపూజ్య క్రూరేభ్యోప్యభయం లభేత్‌ | మందాకిన్యాం సమాప్లుత్య గంగాస్నాన ఫలం లభేత్‌ 24
అంకపాదం నర్యోభ్చర్చ్య శివస్యానుచరో భ##వేత్‌ | మంద్రాదిత్యం ప్రపూజ్యాధ భోగాన్నానావిధాంల్లభేత్‌ 25
వసువు పలికెను :-
నరులకు పుణ్యప్రదము, సర్వ పాపహరము అగు అవంతీ మాహాత్మ్యమును చెప్పెదను వినుము. మహాకాల వనము పరమ పావనము సాటిలేని తపస్థానము. ఇచటనే మహాకాల దేవుడు ఎల్లపుడూ తపమునాచరించు చుండును. ఈ భూమండలమున మహాకాల వనమును మించిన క్షేత్రము మరియొకటి లేదు. ఇచటికి వెళ్ళిన వారు దేవతలతో పోటీ పడుదురు. ఇచటనే కపాలమోచనమును తీర్థము కలదు. ఇచట స్నానమాడిన వారు బ్రహ్మాహత్య నుండి విముక్తులగుదురు. అట్లే కలవలేశాఖ్య దేవుని పూజించిన వారు వివాదములలో విజయమును, కార్యసిద్ధిని పొందెదరు. ఇచటనే అప్సరః కుండమను తీర్థము మరియొకటి కలదు. ఇచట స్నామాడినవారు మన్మధుని వంటి రూపవంతుడు భోగవంతుడు కాగలడు. మహిష తీర్థమున స్నానమాడిన వారు శత్రువులను జయించెదరు. రుద్రసరస్సున స్నానమాడిన వారు రుద్రలోకమున విహరించును. కుండలేశ్వరుని చేరి యధావిధిగా పూజించిన వారు వ్యాపారమున లాభము బడయుదురు. శివునికి ప్రీతిపాత్రులగుదురు. విద్యాధర తీర్థమున స్నానమాడిన వారు పరిశుద్ధిని పొందెదరు. మార్కండేశ్వరుని పూజించిన వారు దీర్ఘాయుష్మంతులు ధనవంతులగుదురు. కాలవనమునందున్న శీతలాదేవిని పూజించిన వారికి ఎపుడూ విస్ఫోటకము రాదు. స్వర్గ ద్వారమునకు వెళ్ళెదరు. రాజస్థలమును చేరి అచట సముద్ర జలమున స్నానమాడిన వారు సర్వతీర్థ స్నాన ఫలమును పొందెదరు. శంకర వాపియందు నియమముతో స్నానమాడిన వారు ఇహమున అభీష్టభోగములనను భవించి అంతకాలమున రుద్రలోకమును చేరును. శంకరాదిత్యుని పూజించిన వారు ఇతరులచే గెలువ బడ జాలరు. నీలగంగలో స్నానమాడి గంధవతీదేవిని పూజించిన వారు సర్వపాప వినిర్ముక్తులగు దురు. దశాశ్వమేధ తీర్థమున స్నానమాడిన వారు అశ్వమేధ యాగ ఫలమును పొందెదరు. సురేశ్వరీ దేవిని చేరి గంధపుష్పాదులచే పూజించినవారు సర్వాభీష్టములను బడయుదురు. హరిసిద్ధిని పూజించి సర్వసిద్ధీశ్వరుడగును. పిశాచికాదులను పదునాలుగు మందిని పూజించి సర్వాభీష్టములను బడయును. రుద్ర సరోవరమున స్నానమాడి శ్రద్ధచే హనుమత్కేశ్వరుని పూజించి నవారు అఖిల సంపదలను పొందగలరు. వాల్మీకేశ్వరుని పూజించిన వారు సర్వవిద్యానిధి కాగలరు. శుక్రేశ్వరాది లింగములను శ్రద్ధతో పూజించిన వారు సర్వరోగ వివర్జితులై అఖిల భోగాఢ్యులయ్యెదరు. పంచేశానుని పూజించిన వారు సర్వసిద్ధులను పొందును. కుశస్థితిని ప్రదక్షిణ మాచరించి వాంఛితములను పొందును. అక్రూరేశుని పూజించి క్రూరులనుండి అభయమును పొందగలడు. మందాకినిలో స్నానమాడిన వారు గంగా స్నాన ఫలమును పొందును. అంక పాదుని పూజించిన వారు శివానుచరులగుదురు. చంద్రాదిత్యుని పూజించిన వారు నానావిధ భోగములను పొందగలరు.
కరభేశ్వరమభ్యర్చ్య యాన సౌఖ్యమావాప్నుయాత్‌ | లడ్డుక ప్రియ విఘ్నేశం సమభ్యర్చ్య సుఖీ భ##వేత్‌ 26
కుసుమేశాదికాన్ర్పార్చ్య సర్వాన్భోగాన్సమశ్నుతే | యజ్ఞ వాప్యాం నరస్స్నాత్వా మార్కండేశం సమర్చ్య చ 27
సర్వయజ్ఞ ఫలం లబ్ధ్వా యుగమేకం వసేద్దివి | సోమవత్యాం నరస్స్నాత్వా భ్యర్చ్య సోమేశ్వరం సతి 28
వాంఛితాం ల్లభ##తే కామా నిహాముత్ర చ మోహిని | యాతనాకలనే స్నాత్వా యాతనాం నైవ పశ్యతి 29
నరకేశం సమభ్యర్చ్య స్వర్గ లోకగతిం లభేత్‌ | కేదారేశం తతః ప్రార్చ్య రామేశ్వర మధాపి వా 30
సౌభాగ్యేశం నరాదిత్యం లభ##తే వాంఛితం ఫలమ్‌ | కేశవార్కంతు సంపూజ్య నరస్స్యాత్కేశవప్రియః 31

శక్తి భేదే తతస్స్నాత్వా ముచ్యతే
%త్సగ్రసంకటాత్‌ | స్వర్ణక్షుర బ్రహ్మవాప్యాం స్నాత్వాభ్యర్చ్యాభ##యేశ్వరమ్‌ 32
అగస్త్యేశం చ విధిజే సంపదామయనం భ##వేత్‌ | ఓంకారే శాది లింగాని యో నరస్సమ్య గర్చయేత్‌ 33
స లభేదఖిలా న్కామా న్మహేశస్య ప్రసాదతః | మహాకాలవనే దేవి లింగసంఖ్యా న విద్యతే 34
యత్ర తత్ర స్థితం లింగం సంపూజ్య స్యాచ్ఛివప్రియః | తధా కనక శృంగాహ్వా కుశస్థల్యప్య వంతికా 35
తధా పద్మావతీ దేవీ కుముద్వత్యుజ్జయిన్యపి | ప్రతికల్పాభిధా భిన్నా విశాలాఖ్యా మరావతీ 36
శిప్రాయాం వై నరస్స్నాత్వా యో మహేశం సమర్చయేత్‌ | స లభేత్సకలాన్కామా న్దేవయోస్తు ప్రసాదతః 37
స్నాత్వా తు గోమతీకుండే స్వర్గతిం లభ##తే నరః | కుండేతు వామనే స్నాత్వా స్తౌతి నామ సహస్రతః 38

శ్రీదరం సర్వదేవేశం యస్ససాక్షాద్ధరిర్భువి | స్నాత్వా వీరేశ సరసి యో
%ర్చయే త్కాల భైరవమ్‌ 39
స సర్వా సంపదో భుక్త్వా శివలోక మవాప్నుయాత్‌ | యః కుటుంబేశ్వరం ప్రాప్య పూజయే దుప చారకైః 40

సంప్రాప్య వివిధాన్కామా నంతే స్వర్గగతిం లభేత్‌ | దేవ ప్రయాగ సరసి యో
%ర్చయే ద్దేవ మాధవమ్‌ 41
సభక్తిం మాదవే ప్రాప్య పదం విష్ణోస్సమాప్నుయాత్‌ | కకరాజస్య తీర్థేతు స్నాత్వా ప్రయతమానసః 42
సర్వరోగ వినిర్ముక్తో ధనీ భోగీ భ##వేత్సతి | అంతర్గృహస్య యాత్రాయాం విఘ్నేశం భైరవం హ్యూమామ్‌ 43

రుద్రాదిత్య స్సురానన్యా న్యో
%ర్చయే చ్ఛ్రద్దయా నరః | యధా లభ్దోప చారాద్యై స్సభ##వేత్సర్గ లోక భాక్‌ 44
రుద్రసరః ప్రభృతి షు తీర్థాన్యన్యాని భామిని | బహూని తేషు చాభ్యర్చ్య శంకరం స్యాత్సుఖీ నరః 45
అష్టతీర్థ్యాం నరస్స్నాత్వా సాంగం యాత్రా ఫలం లభేత్‌ | కాలారణ్యస్య విధిజే సత్యం సత్యం మయోదితమ్‌ 46
ఏతత్తే సర్వమాఖ్యాతం మాహాత్మ్యం పాపనాశనమ్‌ అవన్త్యా యన్నర శ్శ్రుత్వా సర్వపాపైః ప్రముచ్యతే 47
ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున బృహదుపాఖ్యానమున ఉత్తర భాగమున వసుమోహినీ సంవాదమున అవంతికా మాహాత్మ్యమను
అష్టసప్తతితమోధ్యాయము
కరభేశ్వరుని పూజించిన వారు వాహన సౌఖ్యమును పొందెదరు. లడ్డుక ప్రియ విఘ్నేశుని పూజించిన వారు సుఖాన్వితులగుదురు. కుసుమేశాదికులను పూజించిన వారు సర్వభోగములను పొందెదరు. యజ్ఞవాపియందు స్నానమాడి మార్కండేశుని పూజించిన వారు సర్వ యజ్ఞ ఫలమును పొంది స్వర్గమున ఒక యుగ కాలము నివెసించును. సోమవతీ తీర్థమున స్నానమాడి సోమేశ్వరుని పూజించి ఇహపరములందు వాంఛితార్థములను పొందగలరు. యాతనా కలనమున స్నానమాడిన వారు యాతనలను చూడ జాలరు. నరకేశుని పూజించిన వారు స్వర్గమును పొందెదరు. కేదారేశుని, రామేశ్వరుని, సౌభాగ్యేశుని, నరాదిత్యుని పూజించిన వారు సకలాభీష్టములను పొందగలరు. కేశవార్కుని పూజించిన వారు కేశవప్రియులయ్యెదరు. శక్తిభేదమున స్నానమాడిన వారు అత్యుగ్ర సంకటముల నుండి విముక్తులగుదురు. స్వర్ణక్షుర బ్రహ్మవాపి యందు స్నానమాడి అభ##యేశ్వరుని అగస్త్యేశుని పూజించి సర్వ సంపదలను పొందును. ఓంకారేశాది లింగములను పూజించిన వారు మహేశ ప్రసాదము వలన సకలాభీష్టములను పొందగలడు. మహాకాలవనమున లింగ సంఖ్యలేదు. అచట ఉన్న లింగమును పూజించిన వారు శివప్రియులయ్యెదరు. అట్లే కనకశృంగా కుశస్థలీ, అవంతికా, పద్మావతీదేవి, కుముద్వతీ ఉజ్జయినీ, ప్రతికల్పా, విశాలా, అమరావతీ మొదలగు పుణ్యతీర్థ క్షేత్రములెన్నియో కలవు. శిప్రానదిలో స్నానమాడి మహేశుని పూజించిన వారు సకలాభీష్టములను పొందగలరు. గోమతీ కుండమున స్నానమాడిన వారు స్వర్గమును చేరెదరు. వామనకుండమున స్నానమాడి సర్వదేవేశుడగు శ్రీధరుని సహసప్రనామములతోస్తుతించు వారు సాక్షాత్తు శ్రీమరి యగును. వీరేశ సరస్సున స్నానమాడి సర్వదేవేశుడగు శ్రీధరుని సహస్రనామములతోస్తుతించు వారు సాక్షాత్తు శ్రీహరి యగును. వీరేశ సరస్సున స్నానమాడి కాలభైరవుని పూజించిన వారు ఇహమున సకల సంపదల ననుభవించి అంతమున శివలోకమును చేరును. కుటుంబేశ్వరుని చేరి ఉపచారములచే పూజించిన వారు సకల కామనలను పొంది అంతమున స్వర్గమును చేరును. దేవప్రయాగ సరస్సున దేవమాధవుని పూజించిన వారు శ్రీహరి యందు భక్తిని పొంది అంతమున విష్ణులోకమును చేరును. కనక రాజ తీర్థమున నియతమనస్కులై స్నానమాడిన వారు సర్వరోగ వినిర్ముక్తులై ధనవంతులు, భోగవంతులు అయ్యెదరు. అంతర్గృహయాత్యందు విఘ్నేశుని భైరవుని, ఉమాదేవిని, రుద్రులను, ఆదిత్యులను ఇతర దేవతలను శ్రద్ధతో పూజించినవారు స్వర్గలోకమును పొందెదరు. రుద్ర సరస్సు మొదలగు తీర్థములు చాలా కలవు. ఈ తీర్థములలో శంకరుని పూజించిన వారు సుఖవంతులగుదురు. అష్టతీర్థియందు స్నానమాడిన వారు సమగ్ర యాత్రా ఫలమును పొందెదరు. ఇది పాపనాశకమగు అవన్తీ మాహాత్మ్యము. నీకు సమగ్రముగా చెప్పితిని. దీనిని వినిన వారు సర్వపాప వినిర్ముక్తులయ్యెదరు.
ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున బృహదుపాఖ్యానమున ఉత్తర భాగమున వసుమోహినీ సంవాదమున అవంతికా మాహాత్మ్యమను
డెబ్బది యెనిమిదవ అధ్యాయము

Sri Naradapuranam-3    Chapters    Last Page