Sri Naradapuranam-3    Chapters    Last Page

షట్చత్వారింశత్తమోధ్యాయః =నలుబది యారవ అధ్యాయము

పిండదాన మహాత్మ్య కథనమ్‌

వసురువాచ:-

అధతే సంప్రవక్ష్యామి భుక్తిముక్తి ప్రదాయకమ్‌ l తృతీయ దివసే కృత్యం గయాసంగ ఫల ప్రదమ్‌ 1

స్నాత్వాతు బ్రహ్మసరసి శ్రాద్ధం కుర్యాత్సపిండకమ్‌ l''స్నానం కరోమి తీర్దేsస్మి న్నృణత్రయ విముక్తయే 2

శ్రాద్ధాయ పిండదానాయ తర్పణాయార్థ సిద్ధయే''lతత్కూపయూపయోర్మధ్యే కుర్వంస్తారయతే పితౄన్‌ 3

స్నానం కృత్వోఛ్ఛ్రితో యూపో బ్రహ్మణో యూప ఇత్యుత l కృత్వా బ్రహ్మ సర శ్శ్రాద్ధం బ్రహ్మళోకం నయేత్పితౄన్‌ 4

గోప్రచార సమీపస్థా ఆమ్రా బ్రహ్మప్రకల్పితా ః l తేషాం సేచన మాత్రేణ పితరోమోక్షగామినః 5

''ఆమ్రం బ్రహ్మసరోద్భూతం సర్వదేవమయం విభుమ్‌ l విష్ణురూపం ప్రసించామి పితృణాం చైవ ముక్తయే 6

ఏకో మునిః కుంభకుశాగ్రహస్త ఆమ్రస్య మూలే సలిలం దదాతి l ఆమ్రాశ్చ సిక్తాః పితరశ్చ తృప్తా ఏకా క్రియా ద్వ్యర్ధకరీ ప్రసిద్ధా 7

ఆచమ్య మూలే సలిలం దదానో నోపేక్షణీయో విబుదైర్మనుష్యః 8

యూపం ప్రదక్షిణీకృత్య వాజపేయ ఫలం లభేత్‌l బ్రహ్మణం చ నమస్కృత్య పితౄ న్బ్రహ్మపురం నయేత్‌ 9

ఓం నమో బ్రహ్మణజాయ జగజ్జన్మాదికారిణ l భక్తానాం చ పితృణాం చ తారకాయ నమో నమః'' 10

తతో యమబలిం క్షిప్త్యా మంత్రేణానేన సంయతః l ''యమరాజ ధర్మారాజౌ నిశ్చలార్ధా వితి స్థితిః 11

తాభ్యాం బలిం ప్రయచ్ఛామి పితృణాం ముక్తిహాతవే '' l తత శ్శ్వాన బలిం కృత్వా పూర్వమంత్రేణ మోహిని 12

తతః కాక బలిం కుర్యా న్మంత్రేణానేన సంయతః l ''ఐన్ద్రవారుణ వాయవ్యా యామ్యావైనైఋతాస్తధా 13

వాయసాః ప్రతిగృహ్ణన్తు భూమౌ పిండం మయార్పితమ్‌''l తతస్స్నానం ప్రకుర్వీత బ్రహ్మతీర్ధే కుశాన్వితః 14

ఏవం తృతీయ దివసే సమాప్య నియమం సుధీః l నత్వా గదాధరం ఏవం బ్రహ్మచర్య పరో భ##వేత్‌ 15

ఫల్గుతీర్ధే చతుర్ధే చ స్నానాదిక మాధాచరేత్‌ l గయా శిరస్యధో శ్రాద్ధం పదే కుర్యాత్స పిండకమ్‌ 16

సాక్షాద్గయా శిరస్తత్ర ఫల్గుతీర్థాశ్రయం కృతమ్‌ l క్రాంచ పాదాత్ఫల్గు తీర్థం యావత్సా క్షాద్గయాశిరః 17

గయాశిరే నగాద్యాశ్చ సాక్షాత్తత్ఫల్గు తీర్థకమ్‌ l ముఖం గయాసురసై#్యత త్స్నా త్ర్వా శ్రాద్ధం సమాచరేత్‌ 18

ఆద్యో గదాధరో దేవో వ్యక్తావ్యక్తార్థ మాస్థితః l విష్ణ్వాది పదరూపేణ పితౄణాంముక్తి హెతవే 19

తత్ర విష్ణు పదం దివ్యం దర్శనాత్పాపనాశనమ్‌ l స్పర్శ నాత్పూజనాచ్చాపి పితౄణాం మోక్షదాయకమ్‌ 20

శ్రాద్ధం సపిండకం కృత్వా సహస్రకులమాత్మనః l విష్ణులోకం సముద్ధృత్య నయేద్విష్ణు పదే నరః 21

వసువుపలికెనుః ఇపుడు నీకు తృతీయ దినమున చేయవలసిన దానిని భుక్తి ముక్తి ప్రదాయకమగు గయాసంగమ ఫలప్రదమును చెప్పెదను. బ్రహ్మసరస్సున స్నానము చేసి పిండ ప్రదానముతో శ్రాద్ధము చేయవలయును. ఋణత్రయ విముక్తికి, శ్రాధ్దము కొరకు, పిండదానము కొరకు, తర్పణము కొరకు అర్ధసిద్ధి కొరకు ఈతీర్థమున స్నానమును చేయుచున్నాను. ఆ కూపయూపముల మధ్యన శ్రాద్ధము చేయుచు పితరులను పతరింపచేయును. స్నానముచేసి పెరిగియున్న యూపము బ్రహ్మ యూపమనబడును. బ్రహ్మసరస్సు స్నానము చేసి పితరులను బ్రహ్మలోకమును చేర్చును. గోప్రచార సమీపస్థములు బ్రహ్మ ప్రకల్పితములు ఆమ్రములు. వీటిని సేచనమాత్రమున పితరులు మోక్షమునకువెళ్ళెదరు. బ్రహ్మ సరోద్భూతము, సర్వదేవమయము, విభువు విష్ణు రూపమగు ఆమ్రమను తడుపుచున్నాను. పితరులకు ముక్తి కలుగవలయును. కుంభకుశాగ్రహస్తుడగు ఒక మునియే ఆమ్రమూలమున సలిలమునుంచును.

ఆమ్రవృక్షములు తడియును. పితరులు తృప్తి పొందుదురు.. ఒకే పని రెండు ప్రయోజనములను కలిగించును. ఆచమనముచేసి ఆమ్రమూలమున జలమునిచ్చు నరుని దేవతలు పేక్షించరు. యూపమును ప్రదక్షిణమును చేసి వాజపేయ ఫలమును పొందును. బ్రహ్మను నమస్కరించి పితరులను బ్రహ్మపురమునకు చేర్చును .''ఓం నమో బ్రహ్మణsజాయ జగంజ్జన్మాదికారిణ.

భక్తానాం చ పితృణాంచ తారకాయనమోనమః''

అను ఈ మంత్రముచే సమస్తమునుంచి '' యమరాజ ధర్మారాజా అను ఈ మంత్రముచే సమస్తము నుంచి ''యమారాజ ధర్మరాజౌ నిశ్చలార్ధా వితిస్థితిః తాభ్యాం బలిం ప్రయచ్ఛామి పితృణాం ముక్తిహేతవే '' అని మత్రము నుచ్చరించవలయును. ఇక పూర్వమంత్రముచే శ్వాస బలిని చేసి ఈ మంత్రముచే కాక బలిని చేయవలయును'' ఐన్ద్రవారుణ వాయవ్యాయామ్యావైనైఋతాస్తధా

వాయసాః ప్రతిగృహ్ణన్తు భూమౌ పిండం మయార్పితమ్‌'' అనునది మంత్రము.

తరువాత దర్భలను గ్రహించి బ్రహ్మతీర్థమున స్నానమును చేయవలయను .ఇట్లు మూడవదినమున కృత్యమును పూర్తి చేసి గదాధరుని నమస్కరించి బ్రహ్మచర్య పరుడు కావలయును. నాలుగవ దినమున ఫల్గు తీర్థమున స్నానాదికము నాచరించవలయును. గయాశిరమున సపిండక శ్రాద్ధము నాచరించవలయును. గయాశిరమే ఇచట ఫల్గు తీత్రత్రయమైనది. క్రౌంచపాదము నుండి ఫల్గుతీర్థము గయాశిరము వరకుండును. గయాశిరమున నగాది నుండి ఉన్నది ఫల్గు తీర్థము. ఇదియే గయాసురుని ముఖము ఇచట స్నానము చేసి శ్రాద్ధమునాచరించవలయును. ఆది దేవుడగుగదాధురుడు వ్యక్తావ్యక్తము కొరకు పితరుల ముక్తి కొరకు విష్ణ్యాది పదరూపముగా యుండెను. ఇచట దివ్యమగువిష్ణు పదము దర్శన మాత్రముననే పాపనాశనము. స్పృశించిననూ పూజించిననూ పితరులకు మోక్షమును ప్రసాదించును. సపిండకముగా శ్రాద్ధమునాచరించి తమ సహస్ర కులమునుద్ధరించి విష్ణుపదమున విష్ణులోకమును చేర్చును.

శ్రాద్ధం కృత్వా రుద్రపదే నయే త్కులశతం నరః l సహాత్మనా శివపురం తధా బ్రహ్మపదే శుభే 22

దక్షిణాగ్ని పదే శ్రాద్దీ వాజపేయ ఫలం లభేత్‌ l గార్హ పత్య పదే శ్రాద్దీ రాజసూయఫలం లభేత్‌ 23

శ్రాద్ధం కృత్వా చన్ద్రపదే వాజిమేధ ఫలం లభేత్‌ l శ్రాద్ధం కృత్వా సత్యపదే జ్యోతిష్టోమ ఫలం లభేత్‌ 24

ఆవసధ్య పదే శ్రాద్ధీ సోమలోకమవాప్నుయాత్‌ l శ్రాద్ధం కృత్వా సత్యపదే శక్రలోకం నయేత్పితౄన్‌ 25

అన్యేషాంచ పదే శ్రాద్ధీ పితౄన్బ్రహ్మపదే నయేత్‌ l శ్రాద్ధీ సూర్యపదే యశ్చ పాపినోsర్కపురం నయేత్‌ 26

కార్తికేయ పదే శ్రాద్ధీ శివలోకే నయేత్పితౄన్‌ l శ్రాద్ధం కృత్వాగస్త్య పదే బ్రహ్మలోకం నయేత్పితౄన్‌ 27

సర్వేషాం కాశ్యపం శ్రేష్టం విష్ణో రుద్రస్య వై పదమ్‌ l బ్రహ్మణశ్చ పదం తత్ర సర్వశ్రేష్ఠముదాహృతమ్‌ 28

ప్రారంభే చ సమాప్తౌచ తేషామన్యతమం స్మృతమ్‌ l శ్రేయస్కరం భ##వేత్తత్ర శ్రాద్ధకర్తుశ్చ మోహిని 29

కశ్యపస్య పదే దివ్యో భారద్వాజో మునిః పూరా l శ్రాద్ధం హి చోద్యతో దాతుం పిత్రాదిభ్య శ్చ పిండకమ్‌ 30

శుక్ల కృష్ణౌ తదా హస్తౌ పదముద్భిద్య నిష్కృతౌ l దృష్ట్వా హస్తద్వయం తత్ర పితృసంశయ మాగతః 31

తతస్స్వ మాతరం శాంతాం భారద్వాజస్తు పృష్టవాన్‌ l కశ్యపస్య పదే కస్మిన్‌ శుక్లే కృష్ణే పదే పునః 32

పిండో దేయో మయా మాత ర్జానాపి పితరం వద l తచ్ఛ్రుత్వా వచనం తస్య భారద్వాజస్య ధీమతః 33

శాంతోవాచ ప్రసన్నాస్యా పుత్రం శ్రాద్ధప్రదాయినమ్‌ l

భారద్వాజ పమహాప్రాజ్ఞ పిండం కృష్ణాయ దేహి భోః l శ్వేతో దృశ్యో బ్రవీత్పుత్ర దేహి పుత్రో మమౌరసః 35

కృష్ణోs బ్రవీత్‌ క్షేత్రజస్త్వం తతో మే దేహి పిండకమ్‌ l శుక్లో sబ్రవీత్స్యైరిణీయం యతో జాతోం మమౌరసః 36

సై#్వరిణీ జో దదౌ చాదౌ క్షీత్రిణ బీజినే తతః l తతో భక్త్యా మహాభాగే దత్వా పిండాన్మహామతిః 37

కృతకృత్యం నిజాత్మానం మేనే ప్ర్పత్యక్షభాషణాత్‌ l భీష్మో విష్ణు పదే శ్రాద్ధ ఆహూయ తు పితౄన్స్వకాన్‌ 38

శ్రాద్ధం కృత్వా విధానేన పిండదానాయ చోద్యతః l పితుర్వినిర్గతౌ హస్తౌ గయాశిరసి శంతనోః 39

భీష్మః పిండం దదౌ భూమౌ నాధికారః కరే యతః l శంతనుః ప్రాహ సంతుష్ట శ్శాస్త్రార్దే నిశ్చలో భవాన్‌ 40

త్రికాలదర్శీ భవసి విష్ణుశ్చాంతే గతిస్తవ l స్వేచ్ఛయా మరణం చాస్తు ఇత్యుక్త్వా ముక్తి మాగతః 41

రుద్రపదమున శ్రాద్ధము నాచరించి తనతోపాటు కులశతమును శివపురమును చేర్చును. బ్రహ్మపదమున చేసిననూ ఇదే ఫలితము. దక్షిణాగ్ని పదమున శ్రాద్ధమునాచరించిన వాజపేయ ఫలము లభించును. గార్హపత్యపదమును శ్రాద్ధము చేసినచో రాజసూయ ఫలము లభించును. చంద్రపదమున శ్రాద్ధము నాచరించిన ఆశ్వమేధ ఫలము లభించును, సత్యపదమున శ్రాద్ధము సోమలోకమునిచ్చును. చన్ద్రపదమున చేయు శ్రాద్ధము ఇన్ద్రలోకమును చేర్చును. ఇతర పదములలో చేయు

శ్రాద్ధము పాపులను కూడా సూర్యపురము చేర్చును. కార్తికేయ పదమున చేయు శ్రాద్ధము పితృలోకమునకు పితరులను చేర్చును. అగస్త్యపదమున చేయు శ్రాద్ధము బ్రహ్మలోకమున చేర్చును. అన్ని పదములలో కాశ్యప పదము శ్రేష్ఠము. తరువాత విష్ణుపదము రుద్రపదము బ్రహ్మపదము సర్వశ్రేష్ఠముగా చెప్పబడినది. ప్రారంభమున కాని సమాప్తిలో కాని వీటిలో ఒక పదమున చేయవలయును. ఇచట శ్రాద్ధకర్తకు మేలు చేయారును. పూర్వము కశ్యపపదమున భరద్వాజముని శ్రాద్ధమును పిండ ప్రదానమును చేయుటకు సిద్ధపడెను. అంతట ఆ పదమును బేధించుకొని శుక్ల కృష్ణ హస్తములు వెడలినవి. రెండు హస్తములను చూచిన భరద్వాజమునికి తండ్రి విషయమున సందేహము కలిగెను. అంత తన తల్లియగు శాంతను తండ్రె వరని యడిగెను. ఈ కశ్యపపదమున శుక్ల హస్తమున చేయవలయునా, కృష్ణ హస్తమున చేయవలయునా తండ్రెవరో నీవు తెలియుదువు కదా అతని మాటను వినిన శాంత కృష్ణవర్ణున కీయమని పలికెను. అపుడు భారద్వాజుడు కృష్ణహస్తునకు పిండ ప్రదానము చేయ సిద్ధపడెను. అంతట శ్వేత వర్ణుడు కనపడి నీవు నాకు జౌరసపుత్రుడవు కాన నాకిమ్మని అడిగెను. కృష్ణ వర్ణుడు నీవు నాక్షేత్రజుడవు. నాకు పిండమునిమ్ము అని అడిగెను. నీ మాత సై#్వరణి కావున నీవు నాకు జౌరసపుత్రుడవు. అనెను. అంతట సై#్వరిణీ పుత్రుడగు భరద్వాజుడు మొదట క్షేత్రికి, తయవాత బీజికి పిండ ప్రదానమును గావించెను. ఇట్లు భక్తిచే ఇరువురికి పిండ ప్రదానమును గావించి వారిరువురు ప్రత్యక్షముగా మాట్లాడినందున తనను తాను కృతకృత్యునిగా తలచెను. భీష్ముడు విష్ణుపదమున శ్రాద్ధమును చేయ సంకల్పించి పితరులనాహ్వానించెను. యధావిధిగా శ్రాద్ధమునాచరించి పిండదానమునకు సిద్ధపడెను. అంతట గయాశిరమున తండ్రియగు శంతనుని హసిములు చాపబడెను. కాని కరమున ఇచ్చుట కధికారము లేదని భీష్ముడు భూమియందుంచెను. అంతట శంతనుడు సంతోషించి నీవు శాస్త్రార్థమున నిశ్చలుడవు. కావున త్రికాల దర్శవై స్వేచ్ఛామరణము కలవాడవై అంతమున విష్ణులోకమున చేరెదవు అని పలికి ముక్తిని పొందెను.

రామో రుద్రపదే రమ్యే పిండార్పణ కృతోద్యమః l పితా దశరధస్స్వర్గా త్ప్రసార్య కరమాగతః 42

నాదాత్పిండం కరే రామో దదౌ రుద్రపదే తతః l శాస్త్రార్ధాతిక్రమాద్భీతో రామం ద శరధోsబ్రవీత్‌ 43

తారితోsహం త్వయా పుత్ర రుద్రలోకోహ్య భూన్మమl పదే పిండ ప్రదానేన హస్తే తు స్వర్గతిర్నహి 44

త్వంచ రాజ్యం చిరం కృత్వా పాలయిత్వా నిజాః ప్రజాః lయజ్ఞాన్స దక్షిపణాన్కృత్వా విష్ణులోకం గమిష్యసి 45

సహాయోధ్యాజనైస్సర్వైః కృమికీటాదిభిస్సహ l ఇత్యుక్త్వా స నృపో రామం రుద్రలోకం పరం య¸° 46

కనకేశం చ కేదారం నారసింహం చ వామనమ్‌ lరధమార్గే సమభ్యర్చ్య పితౄన్సర్వాంశ్చ తారయేత్‌ 47

గయా శిరసి యః పిండం యేషాం నామ్నాతు నిర్వపేత్‌ l నరకస్థా దివం యాంతి స్వర్గస్థా మోక్షగామినః 48

గయా శిరసి యఃపిండం శమీపత్ర ప్రమాణతః l కందమూల పలాద్యైర్యా దద్యాత్స్వర్గం నయేత్పితౄన్‌ 49

పదాని యత్రదృశ్యంతే విస్ణ్వాదీనాం తదగ్రతః l శ్రాద్ధం కృత్వా పదే యేషాం తేషాం లోకాన్నయేత్పితౄన్‌ 50

సర్వత ముండపృష్ఠాద్రిః పదై రేభిస్సల క్షితః l ప్రయాన్తి పితరస్తత్ర పూజితా బ్రహ్మణః పదమ్‌ 51

గయాసరస్య తు శిరో గదయా యద్ద్విధాకృతమ్‌ l యతః ప్రక్షాలితా తీరే గదాలోలస్తతస్మృతః 52

క్రౌంచరూపేణ హి ముని ర్ముండ పృష్టే తపోక కరోత్‌ l తస్య పాదాంకకో యస్మాత్‌ క్రాంచపాద స్స్మృతస్తతః 53

విస్ణ్వాదీనాం పదాన్మత్ర లింగయాపస్థితాని చ l దేవాది త్పరణం కృత్వా శ్రాద్ధం రుద్రపదాదితః 54

చతుర్ధ దివసే కృత్య మేతత్కృత్వాథ మోహిని l పూతః కర్మాధికారీ స్యా చ్ఛ్రాద్ధ కృద్బ్రహ్మలోక భాక్‌ 55

శిలాస్థితేషు తీర్ధేషు స్నాత్వా కృత్వాధ తర్పణమ్‌ l శ్రాద్ధం సపిండకం యేషాం బ్రహ్మలోకం ప్రయాన్తితే 56

స్థాస్యన్తి చ రమిష్యన్తి యావదాభూత సంఫ్లవమ్‌ l దేహం త్యక్త్వా శిలాపృష్ఠే స్వేదజాండ జరాయుజాః 57

గచ్ఛన్తి విష్ణు సాయుజ్యం కులైస్సప్త శ##తైస్సమం 58

ఇతి శ్రీ బృహన్నారదీయ మహాపురాణ ఉత్తర భాగే మోహినీ వసుసంవాదే గయామహాత్మ్యే

విష్ణ్వాది పదే పిండదాన మాహాత్మ్య కధనం నామ షట్చ త్వారింశతమోsధ్యాయ!

శ్రీరామ చంద్రుడు రుద్రపదమును పిండార్పణ చేయుటకు సిద్ధము కాగా తండ్రి యగు దశరధుడు స్వర్గమునుండి చేయి చాచి వచ్చెను. శాస్త్రాతి క్రమభయముచే శ్రీరాముడు చేతిలోనిడక రుద్రపదమున ఇచ్చెను. ఆపుడు దశరథ మహారాజు రామునితో ఇట్లు పలికెను. నీవిట్లు రుద్రపదమున పిండ ప్రదానము చేయుటచే నేను తరించితిని. నాకు రుద్రలోకము లభించినది. కరమున పిండ ప్రదానము చేసిన స్వర్గము లభించదు. నీవు చాలా కాలము రాజ్యమును చేసి ప్రజలను చక్కగా పాలించి సదక్షిణలుగా యజ్ఞముల నాచరించి విష్ణులోకమును చేరెదవు. అయోధ్యాజనులతో క్రిమికీటాదులతో విష్ణులోకమునకు వెళ్ళెదవు. ఇట్లు పలికి దశరధ మహారాజు రుద్రలోకమును చేరెను. కనకేశుని కేదారమును నారసింహుని వామనుని రథమార్గమున పూజించి పితరులనందరిని తరింపచేయువచ్చును. గయాశిరమున ఎవరి పేరుతో పిండ ప్రదానమును చేయునో వారు నరకములోనున్న స్వర్గమును, స్వర్గములోనున్న మోక్షమును పొందెదరు. గయా శిరమున కందమూల పలాదులచే కాని శమీపత్ర ప్రమాణముతో పిండ ప్రదానముగావించిన పితరులను స్వర్గమును చేర్చును. విష్ణ్వాది పదములు కనపడుచోట ఆ పదముల ముందు శ్రాద్ధము చేసినచో అయా లోకమలకు పితరులు చేరుదురు. ముండ పృష్ఠాద్రి యంతట ఈ పదముల గుర్తుంలుండును. ఇచట పూజించబడిన పితరులు బ్రహ్మలోకమును చేరెదరు. గదచే గయాసురుని శిరము రెండుగా చేసి ఆగదను ఈతీర్థమున కడిగెను కావున గదాలోలమనబడును. ఋషిక్రౌంచరూపముచే ముండ పృష్ఠమున తపము నాచరించెను. అతని పాదముల ముద్ర పడుటచే క్రౌంచ పాదమని పేరు కలిగినది. విస్ణ్యాది పదములు ఇచట లింగరూపముగానన్నవి. రుద్ర పదాది తీర్థములలో దేవాది తర్ఫణమును గావించి శ్రాద్ధమును ఆచరించి ఈ నాలుగవ దినమున కృత్యమునాచరించి పవిత్రుడై కర్మాధికారమును పొంది శ్రాద్ధమును చేయువాడు బ్రహ్మలోకమును పొందును. ప్రేతశిలయందు కల తీర్థములందు స్నానము నాచరించి తర్ఫణము గావించి సపిండకముగా శ్రాద్దము చేసినచో పితరులు బ్రహ్మలోకమును చేరెదరు. ఆ బ్రహ్మలోకముననే ప్రలయకాలము వరకు ఉందురు. ఆనందింతురు. స్వేదజ అండజ జరాయుజ ప్రాణులన్నింటిలో శిలాపృష్ఠమున తనువును చాలించిన ప్రాణులు ఏడువందల తరములలో విష్ణుసాయుజ్యమును పొందెదరు.

ఇది శ్రీబృహన్నారదీయ మహాపురాణమున ఉత్తర భాగమున మోహినీ వసుసంవాదమున

గయా మాహాత్మ్యమున విష్ణ్వాది పదమున పిండదాన మాహాత్మ్య కధనమను

నలుబది యారవ అధ్యాయము

Sri Naradapuranam-3    Chapters    Last Page