Sri Naradapuranam-3    Chapters    Last Page

ద్విచత్వారింశత్తమో ధ్యాయః నలుబది రెండవ అధ్యాయము

గుడధేను విధి కథనమ్‌

మోహిన్యువాచః-

ధన్యాహం కృతకృత్యాహం సఫలం జీవితం మమ l యచ్ఛృతం త్వన్ముఖాంభోజా ద్గంగా మాహాత్మ్యముత్తమమ్‌ 1

అహోగంగా సమంద్ధతీర్థం నాస్తి కించిద్ధరాతలే l యస్యాః సందర్శనాదీనా మీదృశం పుణ్య మీరితమ్‌ 2

గుడ ధేన్వాదిధేనూనాం విధానం చ యధాక్రమం l తధా కధయ విప్రేన్ద్ర భక్తాహం తవ సర్వదా 3

వసిష్ఠ ఉవాచః-

తచ్ఛృత్వా మోహినీ వాక్యం వసుస్తస్యాః పురోహితః l వేదాగామానాం తత్త్వజ్ఞః స్మయమాన ఉవాచ హ 4

వసురువాచః-

శృణు మోహిని వక్ష్యామి యత్పృష్టం హి త్వయా మమ l గుడధేను విధానం చ యధా శాస్త్రే ప్రకీర్తితమ్‌ 5

కృష్టాజినం చుతుర్హస్తం ప్రాగ్గ్రీవం విన్యసేద్భువి l గోమయే నోపలిస్తాయాం కుశానాస్తీర్యయత్నతః 6

ప్రాఙ్ముభీం కల్పయేద్ధేను ముదక్పాదాం సవత్సకాం l ఉత్తమా గుడధేనుస్తు చతుర్బాగైః ప్రకీర్తితా 7

వత్సం భారేణ కుర్వీత భారాభ్యాం మధ్యమా స్మృతా l అర్ధభారేణ వత్సః స్యా త్కనిష్ఠా భారకేణ తు 8

చతుర్ధాంశేన వత్సః స్యాత్‌ గృహవిత్తాను సారతః l ప్రభుః ప్రధమ కల్పస్య యోను కల్పేన వర్తయేత్‌ 9

న సాంపరాయికం తస్య దుర్మతేర్జాయతే ఫలమ్‌ l ధేనువత్సౌ ఘృతసై#్యతా సితశ్లక్షాంబ రావృతౌ 10

శుక్తి కర్ణావిక్షుపాదౌ శుద్ధముక్తా ఫలేక్షణౌ l సితసూత్ర శిరాలౌచ సితకంబలకంబలౌ 11

తామ్రగుండూక పృష్ఠౌ తౌ సితచామరలోమకౌ l విద్రుమక్రమగోపేతా నవనీతస్తనాన్వితౌ 12

కాంస్య దోహావింద్ర నీల మణికల్పిత తారకౌ l సువర్ణ శృంగాభరణౌ శుద్ధరౌప్యఖురావుభౌ 13

నానా ఫల సమాయుక్తౌ ఘ్రాణ గంధకరండకౌ l ఇత్యేవం రచయిత్వా తు ధూపదీపై రధార్చయేత్‌ 14

యా లక్ష్మీః సర్వభూతానాం యా చ దేవేష్వవస్థితా l ధేను రూపేణ సాదేవీ మమ శాంతిం ప్రయచ్ఛతు 15

విష్ణోర్వక్షసి యా లక్ష్మీః స్వాహా రూపా విభావసోః l చంద్రార్క శక్రభక్తిర్యా ధేనురూపాస్తు సా శ్రియే 17

లక్ష్మీర్యా లోకపాలనాం సా ధేను ర్వరదాస్తు మే 18

స్వధాయా పితృముభ్యానాం స్వాహా యజ్ఞభూజాం చ యా l సర్వపాపహరా ధేనుః సా మే శాంతిం ప్రయచ్ఛతు 19

ఏవమామంత్ర్య తాం ధేనుం బ్రాహ్మణాయ నివేదయేత్‌ l విధానమేత ద్ధేనూనాం సర్వాసామిహ పఠ్యతే 20

యాస్తు పాపవినాశిన్యః కీర్తితా దశ##ధేనవః l తాసాం స్వరూపం వక్ష్యామి శాస్త్రోక్తం శృణు మోహిని 21

మోహిని దేవి పలికెను : ఓ మహానుభావా ! నీ ముఖ పద్మమునుండి ఉత్తమమగు గంగా మాహాత్మ్యమును వినిన నేను ధన్యురాలను. కృతకృత్యురాలను, నా జీవితము సఫలము, ఈ భూమండలమున గంగా సమమగు తీర్థమే లేదు. ఈ గంగా సుందర్శనాదులకింతటి పలము తెలుపడినది. గుడధ్వేన్వాదిధేనువుల విధానమును కూడా యధా క్రమముగా తెలుపుము.

ఓ బ్రాహ్మణోత్తమా? నేను నీకు సర్వదా భక్తురాలను.

వసిష్ఠ మహర్షి పలికెను ః అ మోహినీ వాక్యమును వినిన అమె పురోహితుడగు వసువు వేద శాస్త్రాగమతత్త్వజ్ఞుడు కావున చిరునవ్వుతో ఇట్లు పలికెను.

వసువు పలికెను : ఓ మోహినీ ! నీ వడిగిన గుడధేను విధానము శాస్త్రమున తెలుపబడిన విధముగా చెప్పెదను వినుము. చతుర్హస్తమితమగు కృస్ణా జినమును పూర్వ గ్రీవముగా నుంచవలయును. గోమయముచే అలుకవడిన భూమిపై దర్భలను పరిచి దర్భలపై నుంచవలయును. అచటనే ధేనువును ప్రాజ్మఖముగా ఉదక్పాదముగా సవత్సను కల్పించవలయును. చతుర్బారములచే నున్నది ఉత్తమగుఢ ధేనువని చెప్పబడినది . ఒక భారము కలది వత్సనుంచవలయును, రెండు భారములు కల ధేనువు మధ్యమము. వత్స అర్ధ భారము కలది, ఒక భారము కల ధేనువు కనిష్ఠము. గృహవిత్తాను సారముగా వత్సచతుర్థాంశముతో నుండవలయును. ఉత్తమగుడ ధేను దాన సమర్థుడై యుండి కూడా ఇతర విధానమును అనుసరించినవానికి దుర్మతికి ఫలము కలుగదు. ఇట్లు ఘృత పరికల్పితములగు ధేనువత్సలు శితశ్లు క్లాంబరావృతములు, శుక్తి కర్ణములు, ఇక్షుపాదములు, శుద్ధ ముక్తాఫలనేత్రలు సితసూత్ర శిరాలములు, సిత కంబలములు తామ్ర గండూకఫృష్ఠములు, సితచామరలొమకములు విద్రుమ క్రమగో పేతములు, నవనీత స్తనాన్వితములు, కాంస్య దోహములు, ఇన్ద్రనీల మణి కల్పిత తారకములు, సువర్ణ శృంగాభరణములు, శుద్ద రౌప్యఖురములు, నానాఫలసమాయుక్తములు, ఘ్రాణగంద కరండకములుగా నిర్మించి ధూపా దీపాదులచే అర్చించ వలయును. సర్వభూతములలో సర్వదేవతలలొ ధేనురూపముతో నుండు లక్ష్మీదేవి నాకు శాంతిని ప్రసాదించుగావుత. రుద్ర దేహస్థిత, శంకర ప్రియ అగు ధేనురూప యగు దేవి నాపాపమును తొలగించుగాత. శ్రీహరి వక్షస్థ్సలమున, స్వాహారూపమున అగ్నిలో చంద్రార్క శక్రులలొ అంశగా ధేనురూపముగా నుండు దేవి నాకు సంపదనిచ్చు గాత. చతుర్ముఖ లక్ష్మి, కుబేర లక్ష్మి, లోక పాలుర లక్ష్మి యగు ధేనురూప నామ వరప్రదురాలగు గావుత. పితృ ముఖ్యులకు స్వధారూపముగా యజ్ఞ భుక్కులకు స్వాహారూప సర్వపాపహార యగు ధేనువు నాకు శాంతిని ప్రసాదించుగావుత. ఇట్లు ధేనువును ప్రార్థించి బ్రాహ్మణునకు నివేదించ వలయును. ఈ విధానము అన్ని ధేనువులకు అనువర్తించును. పాప వినాశినులను ప్రసిద్ధగాంచిన పది విధములగు ధేనువుల స్వరూపమును శాస్త్రోక్త విధానముగా వివరించెదను. సావధానముగా వినుము.

ప్రథమా గుడధేనుః స్యాత్‌ ఘృత ధేనురథా పరా l తిలధేనుస్తృతీయాచ చతుర్దీ జలసంజ్ఞితా 22

పంచమీ క్షీర ధేనుశ్చ షష్ఠీ మధుమయీ స్మృతా l సప్తమీ శర్కరా ధేను ర్దధిధేనుస్త ధాష్టమీ 23

రత్న ధేనుశ్చ నవమీ దశమీ తు స్వరూపతః l కుంభాః స్యుర్ద్రవధేనూనాం చేతరాసాం తు రాశయః 24

సువర్ణధేను మప్యత్ర కేచిదిచ్ఛంతి సూరయః l నవనీతేన తైలేన తథా కేsపి మహర్షయః 25

ఏతదేవ విధానం స్యా దేత ఏవహ్యుపస్కరాః l మంత్రా వాహన సంయిక్తాః సదా పర్వణిపర్వణి 26

యథా శ్రధ్దం ప్రదతవ్యా భుక్తి ముక్తి ఫలప్రదాః l అనేక యజ్ఞ ఫలదా ః సర్వపాపహరా ః శుభాః 27

అయనే విషువే పుణ్య వ్యతీపాతే%ధవా పునః l యుగాదౌ చైవ మన్వాదౌ చోపరాగాది పర్వసు 28

గుఢధేన్వాదయో దేయా భక్తి శ్రద్దా సమన్వితైః l తీర్ధేషు స్వగృహే వాపి గంగాతీరే విశేషతః 29

ఏవం దత్వా విధానేన ధేనుం ద్విజవరాయ చ l ప్రదక్షిణీ కృత్య విప్రం దక్షిణాభిః ప్రతోష్య

చ 30

ఋత్విజః ప్రీతి సంయుక్తో నమస్కృత్య విసర్జయేత్‌ l తతః సంపూజయేద్గంగాం విధినా సుసమాహితః 31

అష్టమూర్తి ధరాం దేవీం దివ్యరూపాం నిరీక్ష్య చ l శాలితండుల ప్రస్థేన ద్విప్రస్థ పయసా తథా 32

పాయసం కారయుత్వా చ దత్వా మదు ఘృతం తథా l ప్రత్యేకం స్థల మాత్రం చ భక్తి భావేన సంయుతః 33

తత్పాయస మపూ పాంశ్చ మోదకా మండలానిచ l తధాగుంజార్ద మాత్రంచ సువర్ణం రూప్యమేవచ 34

చందనాగరు కర్పూర కుంకుమాని చ గుగ్గులం | బిల్వ పత్రాణి దూర్వాశ్చ రోచన సితచందనమ్‌ 35

నీలోత్పలాని చాన్యాని పుష్పాణి సురభీణిచ l యధా శక్తి మహాభక్త్యా గంగాయాం చైవ నిక్షిపేత్‌ 36

మంత్రేణానేన సుభ##గే పురాణోక్తేన చాపి హి l ఓం గంగాయై నారాయణ్యౖ శివాయై చ నమో నమః 37

ఏత దేవ విధానం తు మాసి మాసి చ మోహిని l పౌర్ణమాస్యా మమాయాం వా కార్యం ప్రాతః సమాహితైః 38

వర్షం యస్తు నరో భక్త్య యధా శక్త్యర్చయన్ముదా l హవిష్యాశీ మితాహారో బ్రహ్మచర్య సమన్వితః 39

దినే వాపి తథా రాత్రౌ నియమేన చ మోహిని l సంవత్సరాంతే తసై#్యషా గంగా దివ్య వపుర్థరా 40

దివ్య మాల్యాంబరా చైవ దివ్యరత్న విభూషితా l ప్రత్యక్ష రూపా పరత స్తిష్ఠత్యేవ వరప్రదా 41

ఏవం ప్రత్యక్ష రూపాం తాం గంగాం దివ్యవపుర్థరాం l దృష్ట్వాస్య చక్షుషా మర్త్యః కృతకృత్యో భ##వే చ్చుభే 42

యన్యాన్కామయతే వర్త్యః కామాంస్తాం స్తానవాప్నుయాత్‌ l నిష్కకామస్తు లభేన్మోక్షం విప్రస్తేనైవ జన్మనా 43

ఏతద్విదానం తు మయోదితం తేపృష్టు హి సర్వం గుడదేను పూర్వం l గంగార్చనం ముక్తి కరం వ్రతం చ సాంవత్సరం శ్రీ పతితుష్టదం హి 44

ఇతి శ్రీ బృహన్నారదీయ పురాణోత్తర భాగే

మోహినీవసు సంవాదే

గంగా మాహాత్య్మే

గుడధేను విధికథనం నామ ద్విచత్వారిం శత్తమోsధ్యాయః

మొదటి ది గుఢ ధేనువు. రెండవది ఘృతధేనువు. మూడవది తిలధేనువు. జలధేనువు నాలుగవది . క్షీరధేనువు అయిదవది. మధు ధేమవు ఆరవది . ఏడవది శర్కరా ధేనువు. దధిధేనువు ఎనిమిదవది. రత్నధేనువు తొమ్మిదవది. పదవది స్వరూపముగా ధేనువు . ద్రవధేనువులు కుంభరూపములుగా నుండును. ఇతర ధేనువులకు రాశులుండును. ఇచట కొందరు సువర్ణ దేనువును కూడా చెప్పెదరు. నవనీత ధేనువును, తైలధేనువును కూడా కొందరు మహర్షులు చెప్పెదరు. విధానము అర్చన మాత్రము ఇదే విధముగా నుండును. ప్రతి పర్వకాల మందు మంత్రా వాహనగావించి యదావిధగా శ్రద్ధతో దానముగావించ వలయును. ఇట్లు చేసిన భుక్తి ముక్తులను ప్రసాదించును. ఈ ధేనువులు అనేక యజ్ఞఫల ప్రదములు సర్వపాపహారములు, శుభప్రదములు. అయన కాలమున విషువమున, వ్యతీపాతమున, యుగాదియందు, మన్వాదులందు, గ్రహణ కాలములందు భక్తి శ్రద్దా సమన్వితులై గుఢధేన్వాదులను దానమును గావించ వలయును. తీర్థములందు కాని, స్వగృహమునందు కాని విశేషించి గంగా తీరమున కాని దానమును చేయవలయును. ఇట్లు యధావిధిగా బ్రాహ్మణునకు గోదానమును గావించి విప్రునికి ప్రదక్షిణ మాచరించి, దక్షిణలచే సంతోషపరిచి ప్రీతిపయుక్తుడై ఋత్విజులకు నమస్కరించి పంపవలయును. తరవాత యధావిధిగా అష్టముర్తిధర దివ్య రూపగా గంగాదేవిని చూచి పూజించవలయును. శాలితండుల ప్రస్థముచే, ద్విప్రస్థ క్షీరముల చే పాయసమును చేయించి తేనెను నేయిని ఒక పల మాత్రము వేసి భక్తి భావముచే కూడిన వాడై, ఆపాయసమును, అపూపములను, మోదక మండలములను గుంజార్థ సువర్ణమును రజతమును చందనా గురు కర్పూర కుంకుమలను గుగ్గులమును బిల్వపత్రములను, దూర్వలను, గోరోచనమును, శ్వేత చందనమును, నిలోత్పలములను, ఇతర సుగంధ పుష్పములను శక్తికొలది గంగ యందు పడవేయవలయును. ఈ మంత్రము చే పురాణోక్తముగా ఆచరించవలయును. ''ఓం గంగాయై నారాయణ్యౖ శివాయై చ నమో నమః ''అని మంత్రము. అనగా గంగారూపు ధరించిన నారాయణికి శివకు నమస్కారము అని యర్థము. ప్రతి మాసమున ఇదే విధానమును ఆచరించవలయును. పూర్ణిమయందు, అమావాస్య యందు ప్రాతఃకాలమున సావధానముగా చేయవలయును. ఇట్లు ఒక సంవత్సరము భక్తితో శక్తి కొలది హవిష్యమును భుజించుచు మితాహారియై, బ్రహ్మచర్య ప్రతమునవలంభించి పగలుకాని రాత్రి కాని నియమముచే పూజించినచొ సంవత్సరాంతమున అతనికి గంగాదేవిదివ్యపు ర్థారిణియై దివ్య మాల్యంబర ధారిణియై దివ్యరత్న విభూషితురాలై ప్రత్యక్ష రూపమున వర ప్రదురాలై నిలుచును. ఇట్లు దివ్యవపుర్దారిణియై ప్రత్యక్షరూపముగా నిలిచిన గంగా దేవిని చూచి కృత కృత్యుడగును. తాను కోరిన కోరికలనన్నింటిని పొందును. నిష్కాముడైనచొ ఆ జన్మలోనే మోక్షమును పొందును. ఇట్లు నీ వడిగిన గుఢధేను విధానమును గంగార్చనమును, ముక్తి ప్రదమగు వ్రతమును ఒక సంవత్సరము చేయవలసిన దానిని , చేసిన శ్రీహరిని ప్రీతునిచేయు వ్రతము చెప్పితిని.

ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున ఉత్తర భాగమున

మోహినీ వసుసంవాదమున గంగా మాహాత్మ్యమున

గుడధేను విధికధనమను

నలుబదిరెండవ అధ్యాయము

Sri Naradapuranam-3    Chapters    Last Page