Sri Naradapuranam-3    Chapters    Last Page

సప్తత్రింశోధ్యాయః ముప్పదియేడవ అధ్యాయము

మోహిన్యువాచ:-

ఏకాదశీ సమం దేవా: పావనం నాపరం భ##వేత్‌ l యయా పూతా మహాపాపా గచ్ఛంతి హరిమందిరమ్‌ 1

తత్సమీపే మమ స్థానం యుక్తం భాతి విచార్యతాం

దేవా ఊచు:-

వేధో నిశీధే దేవానాం ఉపకారాయ మోహినీ

సూర్యోద్యయే సురాణాం చ హరిణా పరికల్పితః l పారణంచ త్రయోదశ్యాం ఉపవాస వినాశనమ్‌ 2

మహాద్వాదశికా హ్యష్టౌ యాః స్మృతా వైష్ణవాగమే l తాస్తు హ్యే కాదశీ భిన్నా ఉపోష్యంతే చ వైష్ణవైః 4

ఏకాదశి వ్రతం భిన్నం వైష్ణవానాం మహాత్మనాం l నిత్యం పక్షద్వయే ప్రోక్తం విధినా తరిదినాత్మకే 5

సాయం ప్రాతః త్యజేద్భుక్తిం క్రమాత్పూర్వాపరాహ్ణయోః l ఏకాదశీ యదా భిన్నా ఉపోష్యా హి పరేహని

ద్వాదశ్యాం హి వ్రతం కార్యం నిరంబు సముషోషణమ్‌ 6

లంఘనే త్వసమర్ధానాం జలం శాకం ఫలం పయః l నైవేద్యం వా హరే ః ప్రోక్తం స్వాహారాత్‌ పాదసంమితమ్‌ 7

స్త్మార్తాః సూర్యోదయే విద్దాం త్యజంత్యేకాదశీం సతి l నిష్కామా మధ్యరాత్రే చ విద్ధాం ముంచంతి యామ్యయా 8

సర్వేష్వసి లోకేషు విదితా దశమీ తిధిః l యమస్య తస్యాః ప్రాంతే తు స్థితిః కార్యా త్వయానఘా 9

ఏతేన దేవకార్యం చ సిద్ధం భవతి శోభ##నే l సూర్యేందుచారా తిధ్యాస్తు దశమ్యాః ప్రాంతగామినీ 10

భువి తీర్ధాని చైవ త్వం స్వాఘనాశాయ సంచర l అరుణోదయ మారభ్య యావత్సూర్యోదయో భ##వేత్‌ 11

తదంతస్త్వం వ్రతే ప్రాప్తా లభ##సై#్యకాదశీ ఫలమ్‌ l యః కశ్చిత్కురతే విద్ధం త్యయాహ్యేకాదశీత్రమ్‌ 12

సతూపకారక స్తుభ్యం భవిష్యతి సురప్రియే l ముహుర్తద్వయమాత్రం తు జ్ఞేయం చాత్రారుణోదయమ్‌ 13

ముహుర్తాః పంచదశ చ స్మృతా రాత్రే ర్దివస్య చ l జ్ఞేయాస్తే హ్రస్వదీర్ఘత్వే త్రైరాపాశికవిధానతః 14

త్రయోదశాన్ముహుర్తాత్తు రాత్రే రూర్ధ్వం సమాగతా l లబ్ధ్వోపవాసినాం పుణ్యం స్వస్థా భవ శుచిస్మితే 15

యమ సంస్థాపనార్ధాయ వైకుంఠ ధ్వంసనాయచ l పాఖండానాం వివృద్ధ్యర్ధం పాప సంచయనాయ చ 16

దత్తం తే మోహిని స్థానం ప్రత్యూషసమయాంకితం 17

విద్ధం త్వయైకాదశీకావ్రతం యే కుర్వన్తి కర్తార ఆహ ప్రయత్నాత్‌ l తేషాం భ##వేద్యత్సుకృతం శుభే ఫలం భుంక్ష్య ప్రసన్నాభవ భూసురే త్వమ్‌ . 18

ఏవం ప్రదిష్టా కమలాసనాద్యైః సా మోహినీ హృష్టతరా బభూవ l మేనే కృతార్ధం నిజజీవతంచ స్వపాపతీర్థాభినిషేవణన 19

సంసాధితం కార్యమిదం సురాణాం భస్మావశేషాం హి గతే పి దేహే l చైతన్యమాత్రే పవనాత్మకే స్మిన్‌ సంమార్జితో భూపకృతస్తు పంథాః 20

నీతం మరూ చాత్మకృతం హి వాక్యం ప్రహృష్టయా వై యదుదాహృతం హి ll ఏవం విమృశ్య క్షితిపాలదేవాన్‌ ప్రణమ్య హృష్టా చ పురోధసం స్వమ్‌ 21

ప్రాంతే స్థితా సూర్యవిహీన సంజ్ఞే కాలే దశమ్యా జనమోహనాయ l కృచ్ఛ్రాంతరూపా చ దినం చ భుంక్తే ప్రకృష్టరూపా నరకాయనౄణామ్‌ 22

ప్రాంతస్థితాం తాం రవిజోనిరీక్ష్య ప్రహృష్టవక్త్రో వచనం జగాద l త్వయా ప్రతిష్ఠా మమ చారునేత్రే కృతా భసంస్థఃపటహ !ఃసుఘోష 23

దృష్టే కార్యే జనః సర్వః ప్రత్యయం కురుతే త్వితి 24

సూర్యోదయ స్పృశాహ్యేషా దశమీగ ర్హితా సదా l అస్పృష్టముదయంనృణా మోహనాయ భవిష్యతి 25

విహాయ తాం యత్ర్పియయోగభుక్తిం పాదస్థితా సాపి హ్యదృశ్యరూపా l సత్యం హి తే నామ విశాలనేత్రే యన్మోహి నీత్యేవ జనో బ్రనీతి 26

విమోమయిత్వా హి జనం సమప్తం పటే మదీయే లఖితం కరోషి | ఇత్యేవముక్త్వా తనయో వివస్వతః ప్రణమ్య తాం బ్రహ్మసుతాం ప్రనహృష్టః 27

జగామ దేవైః సహ నాకలోకం కరే గృహీత్వా లిపిలేఖితారమ్‌ l గతేషు దేవేషు విమోహినీ సా బ్రహ్యాణమాసాద్య సురాసురేశమ్‌ 28

విజ్ఞాపయామాస పితః పురోధా మమాయమత్యగ్రతరశ్చ కోపాత్‌ l దగ్ధం శరీరం మమ లోకనాథ పునః ప్రపత్ప్యేధ తథా కురుష్వ 29

విమోహితం చైవ జగన్మయేదం ప్రాంతే సమాస్థాయ యమస్య తిధ్యాః

జాతో హి రాజ్ఞా శమనః పురాద్య l కృతో జయీ తాత తవ ప్రభావాత్‌ 30

తవ కృత్యమిదం తాత యత్పునర్దేహధారిణీ l భూయామహం జగన్నాథ బ్రాహ్మణం సాంత్వయస్వ భోః 31

తచ్చృత్వా మోహినీవాక్యం బ్రహ్మా లోకవిదానకృత్‌ l బ్రాహ్మణం సాంత్వయామాస పునరేవ సూతాకృతే 32

వసో తాత నిబోధేదం యద్ర్బవీమి హితావహం | తవ చాస్యా మహాభాగ సర్వలోక హితాయచ 33

త్వయేయం మోహినీ కోపా త్కృతా భస్మావశేషితా l పునః శరీరం యాచేత తదాజ్ఞాం దేహి మానద 34

మత్రుత్రీ తవ యాజ్యేరుం దుర్గతిం తాత గచ్ఛతి l త్వయా మయా చ సా పాల్యా కృతకార్యా తపస్వినీ 35

యది త్వం శుద్ధభావేన మాం జ్ఞాపయసి మానద l తతోహ మస్యా భుయోపి దేహముత్పాదయామ్యహమ్‌ 36

కింతు విష్ణుదినసై#్యషా వైరిణీ పాపకారిణీ l యధా శుద్ధ్యేత విప్రేంద్ర తధైవాశు విధీయతామ 37

తచ్ఛృత్వా వచనం తస్య బ్రహ్మణః స పురోహితః l యాజ్యాయా దేహయోగర్ధమాదిదేశ ముదాన్వితః 38

విప్రవాక్యం సమాకర్ణ్య బ్రహ్మా లోకపితామహః l కమండలు జలేనౌక్ష న్మోహి నీదేహ భస్మ తత్‌ 39

సముక్షితే బ్రహ్మణా లోకకర్త్రా సా మోహినీ దేహయుతా బభూవ l ప్రణమ్య తాతాం చ వసోః పురోధసో జగ్రాహ పాదౌ వినయేన నత్వా 40

తతో వసుర్యాజక ఏవ రాజ్ఞో ముదాన్వితో యాజ్య నితంబినీం తాం l విమోహినీం స్వామిసుతోజ్ఘితాం చ జగాద వాక్యం విదుతామవీరామ్‌ 41

వసురువాచ;-

క్రోధస్త్యక్తో మయా దేవి బ్రహ్మణో వచనదధ l గతిం తే కారయిష్యామి తీర్దస్నానాది కర్మణా 42

ఇత్యుక్త్వా మోహినీం విప్రో బ్రహ్మాణాం జగతాం పతిం l విససర్జ నమస్కృత్య మోహినీ పితరం ముదా 43

మోహిన్యా వసునా చైవ ప్రీత్యా బ్రహ్మా విసర్జితః l జగామ లోకం తమసః పరమవ్యక్తవర్త్మనా 44

స వసుర్బ్రాహ్మణశ్రేష్ఠో రుక్మాంగద పురోహితః l మోహినీం సమనుగ్రాహ్యం మత్వా హృది విచారయన్‌ 45

ముహుర్తం ధ్యానమాసన్నో బుబుధే కారణం గతేః 46

ఇతి శ్రీబృహన్నారదీయ పురాణోత్తరభాగే

మోహినీచ రితే సప్తత్రింశోధ్యాయః.

మోహిని పలికెను:- ఓ దేవతలారా ఏకాదశితో సమానమగు పావనము మరొకటి లేదు. ఏకాదశిచే మహాపాపులుకూడా పవిత్రులై శ్రీహరిలోకమును చేరెదదు. కావున ఏకాదశీసమీపమున నాకు స్థానముచితమని తోచుచున్నది. ఆలోచించుడు.

దేవతలు పలికిరి:- ఏకాదశినిశీథకాలమున విద్ధ అయినచో దేవతలకు, సూర్యోదయకాలవేధ సురలకు అని శ్రీహరియే కల్పించెను. త్రయోదశిపారణ ఉపవాసమును నశింప చేయును. వైష్ణవాగమమున ఎనిమిది మహాద్వాదశులని చెప్పబడినవి. ఎనిమిది ద్వాదశులు ఏకాదశీ భిన్నములుగా వైష్ణవులచే ఉపవసించబడును. మహాత్ములగు విష్ణుభక్తులకు రెండు పక్షములలో యథావిధిగా ఏకాదశీవ్రతము భిన్నముగా త్రిదానాత్మకముగ నుండును. ప్రాతః కాలము సాయంకాలము భోజనము చేయరాదు. యధాక్రమముగా పూర్వాహ్ణాపరాహ్ణపరాహ్ణములలో విసర్జించవలయును. ఏకాదశి విద్ధ అయినచో మరునాడుప వసించవలయును. ద్వాదశినాడు నిర్జలముగరా ఉపవసించవలయను. ఉపవసించ శక్తిలేనివారు జలమును, శాకమును, ఫలమును, పాలను, శ్రీహరి నైవేద్యమును కాని తన అహారములో నాలుగవ భాగమును భుజించవచ్చును. సూర్యోదయకాలమున విద్ధ అయినచో స్మార్తు లు ఏకాదశిని విడిచెదరు. నిష్కాములు మధ్య రాత్రి విద్ధను విడిచెదరు. అన్నిలోకములలో దశమి యమధర్మరాజతిధియని తెలిసి యున్నది. దశమీ ప్రాంతమున నీవు ఉండవలయును. దీనితో దేవకార్యముకూడా సిద్ధించును. సూర్య చంద్రులతో తిరుగుచు దశమీ ప్రాంతమున నివసించుము. నీపాపనాశమునకై సర్వతీర్ధములలో సంచరించుము. అరుణోదయమునుండి సూర్యోదయమగువరకు సంచరించుము. ఆమధ్యలో వ్రతమున చేరి ఏకాదశీఫలమును పొందుము. దశమీవిద్దయగు ఏకాదశిన వ్రతము నాచరించువాడు నీకు ఉపకారకుడగును. ఈనాడు అరుణోదయకాలము ముహుర్తద్వయపరిమితమని తెలియుము. రాత్రికి పగలుకుపదిహేను ముహుర్తములుండును. త్త్రెరాశిక విధానము ననుసరించి రాత్రింబవళ్ళు హ్రస్వములు దీర్ఘములు అగును. పదమూడవ ముహుర్తము తరువాత రాత్రిపూట వచ్చును అపుడుపవసించువారి పుణ్యమును నీవు పొందెదవు. స్వస్థురాలవు కమ్ము. యముని స్థాపించుటకు వైకుంఠధ్వంసమునకు పాషండవృద్ధి కొఱకు, పాపమును పెంచుటకు నీకు ప్రత్యూషసమయ సమీప ప్రాంతమునిచ్చుచున్నాము. ఈ లోకమున దశమీవిద్ధయగు ఏకాదశినాడు వ్రతము నాచరించువారి పుణ్యము నీకు లభించును. ఆ ఫలమును నీవు అనుభవించుము. ప్రసన్నురాలవు. కమ్ము. బ్రహ్మాదులు ఇట్లు చెప్పగా మోహినీ మిక్కిలి సంతోషించెను. తన పాపపరిహారమునకు తీర్థ సేవనము చేయుటచే తన జీవితము కృతార్ధమగునని తలచెను. దేహము భస్మావశేషమైననూ దేవకార్యమును సాధించితిని. చైతన్యమాత్రముండి వాయురూపముగా నుండి కూడా రాజు చేసిన మార్గమును తుడిచివేసితిని. నేను సంతోషముతో పలికిన మాటనాచరించితిని. ఇట్లు విచారించి బ్రాహ్మణులను పురోహితుని నమస్కరించి సూర్యవిహీనమగు దశమీప్రాంతకాలమున జనమోహనము కొరకు నివసించెను. కృచ్ఛ్రాంతరూపముగా దినమున భుజించువారికి ప్రకృష్టరూపముగా నరకమును ప్రసాదించును. దశమీప్రాంతమున నున్న మోహినిని చూచిన యమధర్మరాజు సంతోషముచే విప్పారిన మోము కలవాడై ఇట్లు పలికెను. ఓ చారునేత్రి! నీవు మరల ఈ లోకమున నా ప్రతిష్ఠను నిలిపితివి. రుక్మాంగదుని మత్తేభముపై నున్న పటహమును ఛేదించగలిగితివి. కార్యము దృష్ఠముగాన జనులందరూ విశ్వసింతురు. కావున సూర్యోదయకాలమును స్పృశించు దశమీ ఎపూడూ నిందితమే. స్పర్శలేని ఉదయము నరులను మోహింప చేయును. పావు భాగము ఉన్ననూ అదృశ్యరూపముగా నున్న ప్రియయోగభుక్తిని విడిచి ఉంటివి. కావున నిజముగా నిన్ను మోహిని అని జనులు పిలుచుచున్నారంటే నీ పేరు సార్థకమే. సమస్త జనమును మోహింప చేసినా పటమున వ్రాయించుచున్నావు. ఇట్లు యమధర్మరాజు పలికి ఆ బ్రహ్మపుత్రికను నమస్కరించి సంతోషించెను. దేవతలతో కలిసి చిత్రగుప్తుని చేత పట్టుకొని తన లోకమునకు వెళ్ళెను. ఇట్లు దేవతలందరూ వెళ్ళిన తరువాత మోహిని సురాసురనాయకుడగు బ్రహ్మను సమీపించి ఇట్లు విజ్ఞాపన చేసెను. ఓ తండ్రీ! ఈ పురోహితుడు చాలా భయంకరుడు. ఇతని కోపముచే నా శరీరము దగ్ధమాయెను. మరల శరీరమును దాల్చునట్లు చేయుము. దశమీప్రాంతమున నిలిచి నేను జగత్తును మోహింపచేసితిని పూర్వము రాజు యముని గెలిచెను. నేడు నీ ప్రభావముతో యముడు విజయి ఆయెను. నేను మరల దేహమును ధరించునట్లు నీవు చేయవలయును. పురోహితుని శాంతిపంచేయుము. లోకకర్తయగు బ్రహ్మ మోహినీ వాక్యమును విని పుత్రిక కొరకు మరల పురోహితుని ఓదార్చసాగెను. ఓ బ్రాహ్మణా! నేను నీకు ఈ మోహినికి సర్వలోకమునకు హితము కలుగుటకు చెప్పుమాటను వినుము. నీ కోపముచే ఈ మోహిని భస్మమైనది. మరల శరీరమును యాచించుచున్నది. కావున అనుమతినిమ్ము. నాపుత్రిక నీకు కూడా గౌరవించదగినదే. ఇపుడు దుర్గతిని చెందుచున్నది. నేను నీవు ఆమెను కాపాడవలయును. ఆమె దీక్షతో దేవకార్యమునాచరించినది. నీవు పరిశుద్ధభావముచే అనుమతించినచో నేను ఈమెకు మరల దేహమును కల్పించెదను. కాని హరివాసరమును ద్వేసించి పాపమునాచరించినది కావున ఈమె పరిశుద్ధికి ఉపాయమును ఆలోచించుము. బ్రహ్మ మాటలను వినిన పురోహితుడు పరిశుద్ధాంత్తకరణమతో మోహినికి దేహకల్పనకనుమతించెను. బ్రాహ్మణవాక్యమును వినిన లోకపితామహుడగు బ్రహ్మ కమండలు జలమును మోహినీ దేహభస్మముపై చల్లెను. ఇట్లు కమండలు జలమును చల్లిన వెంటనే మోహిని దేహమును దాల్చెను. తండ్రియగు బ్రహ్మను నమస్కరించి పురోహితుని పాదములను పట్టుకొనెను. అంతట రుక్మాంగద పురోహితుడగు వసువు మోహినితో ఇట్లు పలికెను.

వసువు పలికెను:- ఓ మోహినీ! బ్రహ్మవాక్యము వలన నేను కోపమును విడిచితిని. తీర్థస్నానాదికర్మలచే నీకు గతిని కల్పించెదను. ఇట్లు పలికి బ్రహ్మను పంపివేసెను. ఇట్లు మోహినిని పురోహితుని సంతోషింపచేసి బ్రహ్మ తమస్సునకు దూరముగా నున్న తనలోకమునకు ఆవ్యక్తమార్గముచే వెళ్ళెను. రుక్మాంగద పురోహింతుడు బ్రహ్మణ శ్రేష్ఠుడగు వసువు మోహినిని అనుగ్రహించవలయునని తలచి హృదయమున ఆలోచించుచు ముమహుర్తకాలము ధ్యానించి గతి కారణమును తెలుసుకొనెను.

ఇది శ్రీబృహన్నారదీయమహాపురాణమున

ఉత్తర భాగమున మోహినీ చరితమున

ముప్పది యేడవ అధ్యాయము

Sri Naradapuranam-3    Chapters    Last Page