Sri Naradapuranam-3    Chapters    Last Page

ఏకత్రింశోధ్యాయ ముప్పది : ఒకటవ అధ్యయము

మాఘమాహాత్యమ్‌

వసిష్ఠ ఉవాచ:-

తచ్ఛృత్వా వచనం తస్యాః కాష్ఠీలాయాః శుచిస్మితే సంధ్యావళీ నామ భృశం తామువాచ హ సాదరమ్‌ 1
త్వద్వాక్యాద్విస్మయో జాతః కాష్ఠీలే సాంప్రతం మమ | కథం దృష్టా మయా త్వం చ యాస్యంతీ కుత్సితాం గతిం 2
కర్మణా కేన తే ముక్తి ర్భవేత్కుత్సితయోనితః | తన్మే వద విశాలాంగీ త్వాం దృష్ట్వా దుఃఖితాహ్యహమ్‌ 3
మాంసపిండోపమం శ్లక్ణం నవనీతోపమం శుభే | శరీరం తవ సంవీక్ష్య దయా మే జాయతే హృది 4
కాష్ఠీలోఉవాచ:-
పృథివీం దాస్యసే బుభ్రు సకలామపి మత్కృతే | తథాపి నైవ ముచ్యేయం సద్యః కుత్సిత యోనితః 5
యేన పుణ్యన సుభ##గే ముచ్యేయం కర్మబంధనాత్‌ | తన్నిర్దిశామి సుమహ ద్గతిదం త్వం నిశామయ 6
యశ్చాయం మాఘమాసస్తు సర్వమాసోత్తమః స్మృత: | యస్మిన్‌ క్రోశంతి పాపాని బ్రహ్మహత్యాదికాని చ 7
దుర్లభం మాఘమాసో వై దుర్లభం జన్మ మానుషం | దుర్లభం చోషసి స్నానం దుర్లభం కృష్ణసేవనమ్‌ 8
దుర్లభో వాసరో విష్ణో ర్విధినా సముపోషితః | దేవైస్తేజః పరిక్షిప్తం మాఘమాసే స్వకం జలే 9
తస్మాజ్జలం మాఘమాసే పావనం హి విశేషతః | వేదృశీ సంగరే శూరైః గతిః ప్రాప్యేత సౌఖ్యదా 10
యాదృశీ ప్లవనే ప్రాతః ప్రాప్యతే నియమిస్థితైః | సరిత్త డాగవాపీషు స్నానే సత్తమ శీరితమ్‌ 11
కూపభాండ జలైర్మధ్యం జఘన్యం వహ్నితాపితైః | న సౌఖ్యైర్లభ్యతే పుణ్యం దుఃఖైరేవాప్యతే తు తత్‌ 12
ధర్మసేవార్ధకం స్నానం నాంగనైర్మల్య హేతుకమ్‌ | హోమార్ధం సేవనం వహ్నే ర్నచ వీతాదిహానయే 13
యావన్నో దయతే సూర్య స్తావత్‌ స్నానాం విధీయతే | అచ్ఛాదితే ఘనైర్వ్యోమ్ని | హ్యుద్గమిష్యంత మర్ధయేత్‌ 14
అభావే సరిదాదీనాం నవకుంభ స్థితం జలమ్‌ | వాయునా తాడితం రాత్రౌ స్నానే గంగా సమం విదుః 15
మాఘస్నాయీ వరారోహు దుర్గతిం వైవ పశ్యతి | తన్నాస్తి పాతకం యత్తు మాఘస్నానం న శోధయేత్‌ 16
అగ్ని ప్రవేశాదధికం మాఘస్నానం న శోధయేత్‌ | జీవితా భుజ్యతే దుఃఖం మృతేన బహుళం సుఖమ్‌ 17
ఏతస్మాత్కారణద్భద్రే మాఘస్నానం విశిష్యతే | అహన్యహని దాతవ్యా స్తిలాః శర్కరయాన్వితాః 18
మేఘపుష్పో పపన్నేన సహాన్నేన సుమధ్యమే | యావక్తైశ్చైవ హోతవ్యా గవ్యసర్పిః సమవ్యన్వితైః 19
మాఘ్యాం స్నాన సమాప్తౌ తు దద్యాద్విప్రాయ షడ్రసమ్‌ | సూర్యో మే ప్రీయతాం దేవో విష్ణుమూర్తి ర్నిరంజనః 20
వసిష్ఠి మహర్షి పలికెనుః ఆ కాష్ఠీలావనమును వినిన సంధ్యావళీ ఆదరముగా ఇట్లు పలికెను. ఓ కాష్ఠీలా నీ మాటల వలన ఇప్పుడ నాకాశ్చర్యము కలుగుచున్నది. నీవు కత్సితగతికి విళ్ళుచుండగా ఎట్లు చూడగలను? నీచ జాతినుండి నీవు విముక్తురాలవగుటకు ఏమి చేయవలయును? నాకా విషయమును చెప్పుము. నిన్ను చూచి నాకు దుఃఖము కలుగుచున్నది. కోమలము మృదవు నవనీతము వంటి నీ శరీరము మాంసపిండముగా నుండుట చూచి నా మనసులో దయ కలుగుచున్నది.
కాష్ఠీల పలికెను ః ఓ సుందరీ ! నా కొఱకు సమస్త భూమంలమును దానము గావించినను నాకు నీచజాతి నుండి విముక్తి లభించదరు. నాకు విముక్తిని కలిగించి ఉత్తమ గతిని ప్రసాదించు గొప్ప పుణ్యమును తెలిపెదను వినుము. ఈ మాఘమసము సర్వమాసపములలో ఉత్తమ మాసము. ఈ మాసమున బ్రహ్మహత్యాది పాపములు ఆక్రోశించును. మాఘమాసము దుర్లభము. మానవ జన్మ దుర్లభము. ఉషఃకాల స్నానము, శ్రీ కృష్ణ సేవనము, యధావిధిగనుపవసించు హరి వాసరము దుర్లభము. మాఘమాసమున దేవతలు తమ తేజస్సును జలమును నుంచెదరు. కావుననే మాఘమాసమున జలము విశేషముగా పావనము. మాఘ మాసమున ప్రాతఃకాలమున స్నానము చేయువానికి లభించు గతి యుద్ధమున శూరులకు కూడా లభించదు. భావి, చెరువు నదులలో మాఘస్నానము శ్రేష్ఠము, కూపజలము, ఖండాజలము మధ్యమములు. వేడి నీరు అధమము. పుణ్యము సుఖములచే లభించదు. దుఃఖముల చేతనే లభించును. స్నానము ధర్మసేవనమునకే కాని శరీర శుద్ధి కొఱకు కాదు. వహ్నిని హోమము కొఱకు సేవించవలయును కాని శీతమును వారించుటకు కాదు. సూర్యోదయమునకు ముందే స్నామాడవలయును. ఆకాశమున మేఘములు కప్పియుండగా ఉదయించుచున్న సూర్యని ప్రార్ధించవలయును. నద్యాదికము లేనిచో కొత్త కుండలోని నీరు రాత్రిపూట గాలి కుంచినది గంగాజలసపమమని చెప్పెదరు. మాఘ స్నామును చేయువాడు దుర్గతిని చెందడు. మాఘ స్నానము శుద్ధి చేయని పాతకములు లేవు. అగ్ని ప్రవేశము కంటే మాఘోషస్స్నానమే శ్రేష్ఠము. బ్రతికిపుడు దుఃఖించును. మరణించి సుఖించును. కావున మాఘ స్నానము విశిష్టము. ప్రతి దినము శర్కరతో కూడిన తిలలు దానము చేయవలయును. తరువాత బ్రాహ్మణునికి సూర్యుడు నిరంజన విష్ణురూపుడు ప్రీతి చెందునని షడ్రసాన్నమును భుజింపచేయవలయును.
వాసాంసి ద్విజయుగ్మాయ స సప్తాన్నాని చార్పయేత్‌ | త్రింశచ్చ మోదకాః దేయాః తిలాన్నాః శర్కరామయాః 21
భాగాస్త్రయస్తిలానాంతు చతుర్దః శర్కరాంశకః | తాంబూలదీని భోగ్యాని భక్త్యా దద్యాద్విధానవీత్‌ 22
స్రోతోముఖ ః సరతి చా న్యత్ర భాస్కర సంముఖః | స్నాయాదావాహ్య తీర్ధాని గంగాదీ న్యర్కమండలాత్‌ 23
యదనేక జనుర్జన్యం యజ్‌జ్ఞానాజ్ఞానతః కృతమ్‌ | త్వత్తేజసా హతం చాస్తు తత్తు పాపం సహస్రధా 24
దివాకర జగన్నాధ ప్రభాకర నమోస్తుతే | పరిపూర్ణ కురుష్వేదం మాఘస్నానం మమాచ్యుత 24
తీర్ధస్నాయీ వరారోహే మాఘస్నాయీ ఫలాల్పకః
మాఘస్య ధవళే పక్షే భ##వేదేకాదశీతు యా | రవివారేణ సంయుక్తా మహాపాతక నాశినీ 27
వినాపి ఋక్షసంయోగం సా శుక్లైకాదశీ నృణాం | వినిర్దహతి పాపాని కనృపో విషయం యథా 28
కుపుత్రస్తు కులం యద్వత్‌ కుభార్యాచ పతిం యధా | అధర్మస్తు యధాధర్మం కుమంత్రీ నృపతిం యధా 29
అజ్ఞానం చ యధా జ్ఞానం కుశౌచం శుచితాం యధా | యధా హంత్యనృతం సత్యం వాద స్సంవాదమేవచ 30
ఉష్ణం హిమ మనర్ధోర్ధం పాపం కీర్తిం స్మయస్తపః | యధా రసా మహారోగాన్‌ శ్రాద్ధం సంకేత ఏవ చ 31
తధా దురిత సంఘం తు ద్వాదశీ హంతి సాధితా | బ్రహ్మహత్యా సురాపానం స్తేయం గుర్వంగనా గమః 32
మహాన్షి పాతకాన్యేతా న్యాశు హంతి హరేర్దినమ్‌ | సమవేతాని, చైతాని న శామయతి పుష్కరం 33
నచాపి నైమిషారణ్యం క్షేత్రం కురు సంజ్ఞితమ్‌ | ప్రభాసో న గయా దేవి న రేవ న సరస్వతీ 34
న గంగా యమునా చైవ ప్రయాగో నచ దేవికా | న సరాంసి నదాశ్చాన్యే హోమదాన తపాంసి చ 35
న చాన్యాత్‌ సుకృతం సుభ్రు పురాణ పఠ్యతే స్ఫుటం | పాప సంఘవినాశాయ ముక్వైకం హరివాసరమ్‌ 36
ఉపోషణాత్‌ సకృద్దేవి వినశ్యంత్యఘరాశయః | ఏకతః పృధివీదానం ఏకతో హరివాసరమ్‌ 37
న సమం బ్రహ్మణౖ ప్రొక్తం అధికం హరివాసరమ్‌ | తస్మిన్వ రాహ వపుషం కృత్వా దేవం తు హాటకం
ఘటోపరి నవే పాత్రే ధృత్వా తామ్రమయే శుభే | సర్వబీజాన్వితే చైవ సితవస్త్రావ గుంఠితే 39
సహిరణ్య సుదీపాఢ్యే కృత పుష్పావంతంసకే విధినా పూజయిత్వా చ కుర్యాజ్జాగరణం వ్రతీ 40
ప్రాతర్విప్రాయ దద్యాచ్చ వైష్ణవాయ కుటుంబినే తత్కుంభ క్రోడసంయుక్తం సనైవేద్య పరిచ్ఛదమ్‌ 41
పశ్చాచ్చ పారణం కుర్యాత్‌ ద్విజాన్‌ భోజ్య సుహృద్వృతః | ఏవం కృతే వరారోహే న భూయో జాయతే క్వచిత్‌ 42
బహుజన్మార్జితం పాప జ్ఞానా జ్ఞానకృతం చ యత్‌ | తత్సర్వం నాశమాయాతి తమః సూర్యోదయే యధా 43
యధా శాస్త్రం మయా తుభ్యం వర్ణితా ద్వాదశీ శేభే | యా సా కృతా త్వయా పూర్వమాసీద్దేవ్యన్య జన్మని 44
యస్యా స్తవాతులా పుష్టి ర్వర్తతే వర్తయిష్యతతి | భర్తుస్తవ చ పుత్రస్య సర్వదా సుఖదాయినీ 45
తస్యా స్త్వయా తరీయాంశో దేయశ్చేన్మహ్యమాదరాత్‌ | తదా ప్రీతా గమిష్యామి తద్విష్ణోః పరమం పదమ్‌ 46
విత్తాహ్రుతిజం పాపం యద్భూతం మమ సుందరి | తస్య పావన హేతుం చ తురీయాంశం ప్రయచ్ఛ మే 47
జీవితేనాపి వత్తేన భర్తారం వంచయేత్తు యా కృమియోని శతం గత్వా పుల్కసే జాయతే తుసా
సురతం యాచమానాయ పత్యే విత్తం చ మానిని | యాన యచ్ఛతి దుర్బుద్ధిః కాష్ఠీలా జాయతే ధ్రువమ్‌ 49
తత్పాతక విశుద్ధ్యర్దం దేహి మే ద్వాదశీ భవమ్‌ | తురీయాంశమితం పుణ్యం యద్యస్తి మయి తే ఘృణా 50
ఏతచ్ఛృత్వా వచ స్తస్యాః కాష్ఠీలాయాః సులోచనే | పుణ్యం దత్తవతీ తసై#్మ పాణౌ వారి ప్రగృహ్య చ 51
యత్కృతం హి మయా పూర్వం ఏకాదశ్యాముపోషణమ్‌ | తత్తురీయాంశ పుణ్యన కాష్ఠీలేయం విముచ్యతామ్‌ 52
పూర్వజన్మకృతాత్‌ పాపాత్‌ సత్యం సత్యం మయోదితమ్‌ | ఏవముక్తే తు వచనే మయా విద్యుత్సమ ప్రభా 53
దృష్టా దివ్య విమానస్థా గచ్ఛంతీ వైష్ణనం పదమ్‌ | పతిర్హి దైవం తలోకే వంచనీయో న భార్యయా 54
దేహేన చాపి విత్తేన యదీచ్ఛేచ్ఛోభనాం గతిం | సా త్వం బ్రూహి ప్రదాస్యామి భర్తురర్దే తవేప్సితమ్‌ 55
విత్తం దేహం తధా పుత్రం యచ్చాన్య ద్వా వరాననే | కిమన్యద్దైవతం లోకే స్త్రీణామేకం పతిం వినా 56
తస్యార్దే వా త్యజే ద్విత్తం జీవితం వా సులోచనే || కల్ప కోటి శతం సాగ్రం విష్ణులోకే మహీయతే 57
అగ్న్యాది సాక్ష్యే వృతమీక్ష్య నిఫ్ఠురా యుక్తం సుఘోరైర్వ్య సనైర్ద్విజాత్మజా |
పతిం దదౌ నైవ చ యాచితా ధనం తైనైవ పాపేన బభూవ కీటా || 58
ఏతన్మయా దృష్టమనంగయష్టి కౌమారభావే పితృవేశ్మవాసే
జ్ఞాత్వా హితం తధ్యమిదం స్వభర్తు ర్దదామి సర్వం చ గృహాణ సుభ్రు 59
ఇతిశ్రీ బృహన్నారదీయ పురాణోత్తర భాగే మోహినీ చరితే కాష్ఠీలోపాఖ్యానే మాఘమహాత్మ్యం నామైకత్రింశో ధ్యాయః
బ్రాహ్మణ జంటకు వస్త్రములను సప్తాన్నములను ఆర్పించవలయును. ముప్పది మోదకములను శర్కరా సహితములగు అన్నములను దానము చేయవలయును. మూడు భాగములు తిలలు, ఒక భాగము శర్కరను, భోగ్యములగు తాంబూలాదులను భక్తిచే దానము గావించవలయును నదులలో నదీముఖముగా, ఇతర ప్రదేశములలో సూర్యముఖముగా గంగానది తీర్ధములను ఆవాహన గావించి స్నానము చేయవలయును. అనేక జన్మలలో తెలసీ తెలియక చేసిన పాపముల్నియూ నీ తేజస్సుతో హతమగుగాక. ఓ దివాకరా! జగన్నాధాః ప్రభాకరా! నీకు నమస్కారము. ఓ అచ్యుతా! ఈ నా మాఘస్నామును పరిపూర్ణమును గావించుము. మాఘస్నానము చేయువాని కంటే తీర్ఘస్నానము చేయువాడు అప్పఫలమును పొందును. తీర్ధస్నానము వలన స్వర్గమును పొందును. మాఘ స్నానము వలన పరమ పదమును పొందును. మాఘ శుక్ల ఏదాదశి ఆదివారమున వచ్చినచో మహాపాతకములను నశింప చేయును. నక్షత్ర యోగము లేకున్ననూ శుక్లేకాదశి చెడు రాజు రాజ్యమును బోనాడునట్లు పాపములను దహింప చేయును. దుష్ట పుత్రుడు కులమును, అసత్యము సత్యమును, వాదము సంవాదమును, ఉష్ణము హిమమును, అనర్ధము అర్ధమును, పాపము కీర్తిని, గర్వము తపస్సును, రసము మహారోగములను, శ్రాద్దమును సంకేతము నశింపచేయునట్లు ఆచిరంచబడిన ద్వాదశి పాప సంఘమును నశింపచేయును. బ్రహ్మహత్య, సురాపానము, చౌర్యము, గుర్వంగ
నాసంగమము అను మహాపాతకములను కూడా శీఘ్రముగానశింపచేయును. ఈపాపములన్నింటిని పుష్కరము,నైమి శారణ్యము, కురుక్షేత్రము, ప్రభాసము, గయ, రేవా, సరస్వతి, గంగా, యమునా, ప్రయాగము, దేవిక, సరస్సులు ఇతర నదులు, హోమదానతపములు, పురాణములలో చెప్పబడు ఇతర సుకృతములు నశింపచేయజాలవు. ఒక్క హరివాసరము మాత్రమే నశింపచేయును. ఒక మారు ఉపవాసముతో పాపారాశులన్నియూ నశించును. పృధివీదానము ఒకవైపు హరివాసరము ఒక వైపుంచినచో రెండు సమములు కాజాలవు. హరివాసరమే అధికము అని బ్రహ్మ చెప్పెను. ఈ హరివాసరమున బంగారముతో వరాహమూర్తిని చేసి ఘటముపైన కొత్త తామ్రపాత్రలో సర్వబీజాన్వితము. శ్వేత వస్త్రాచ్ఛాదితము, హిరణ్యసహితము, దీపశోభితము, పుష్పమాలాంకృతము అగుదానిలో నుండి యధావిధిగా పూజించి, రాత్రి జాగరణ చేసి ప్రాతఃకాలమున, విష్ణుభక్తుడు కుటుంబియగు బ్రాహ్మణునకు దానము గావించవలయును. వరాహ ప్రతిమాయుత మగు ఆకుంభమును నైవేద్య పరిచ్ఛద సహితముగా దానము గావించి, బ్రాహ్మణులను భుజింపచేసి బంధు మిత్రులతో కలిసి తాను పారణ చేయవలయును. ఇట్లు చేసినచో మరల జన్మ కలుగదు. చాలా జన్మలలో తెలిసీ తెలియక చేసిన పాపములనన్నింటి సూర్యోదయము చీకటిని నశింపచేసినట్లు నశింప చేయును. ఓ శుభకరురాలా ! ఇట్లు శాస్త్ర విధిననుసరించి నేను ద్వాదశీవ్రతమును వర్ణించితిని. నీవు పూర్వజన్మలో ఈ వ్రతము నాచరించితివి. దీని వలన నీకు సాటిలేని పుష్టియున్నది. ఉండగలదు. నీకు నీ భర్తను పుత్రునకు సర్వకాలములందు సుఖములనిచ్చును. ఆవ్రతపుణ్యములో నాలుగవ భాగమున నాకిచ్చితివేని నేను ప్రీతితో శ్రీహరి పరమధామమును పొందెదను. పూర్వజన్మలో నేను చేసిని విత్తాపహరణ పాపమును నశింపచేయగల నాలుగవ భాగమును నాకిమ్ము. జీవితముతో విత్తముతో భర్తను వంచించిన స్త్రీ నూరు జన్మలు క్రిమిగా పుట్టి పుల్కసిగా సంభోగమును ధనమును యాచించు భర్తకు ఆరెంటిని ఈయని స్త్రీ కాష్ఠీలగా పుట్టును. కావున ఆ పాపము నశించుటకు ద్వాదశి వలన కలిగిన పుణ్యములో నాలుగవ భాగమునిమ్ము. నా యందు జాలికలదేవి ఇమ్ము. ఇట్లు యాచించిన. కాష్ఠీలా వాక్యమును, విని చేతిలో జలమును తీసుకొని ఆమె కోరిన పుణ్యమునిచ్చితిని. నేను పూర్వజన్మలో ఏకాదశీ ఉషోషము వలన కలిగిన పుణ్యములో నాలుగవ భాగముచే ఈ కాష్ఠీల విముక్తిని పొందుగాక. పూర్వ జన్మకృతపాపము నశించుగాక. నా మాట సత్యము సత్యము. నేనిట్లు పలికిన వెంటనే ఆకాష్ఠీల విద్యుత్సమ ప్రభ##యై దివ్యవిమానమున కూర్చుండి విష్ణు పదమునకు వెళ్ళుటను చూచితిని. కావున ఈ లోకమున భర్తయే దైవము. భర్తను వంచించరాదు. సద్గతిని కోరు భార్య ధనముచే జీవితముచే మోసగించరాదు. కావున ఓ మోహినీ, నా భర్త కొరకు నీ ఇష్టమునిచ్చెదను. కావున చెప్పుమును. ధనము, దేహమును, పుత్రుని ఇంకా ఇతరములను కూడా ఇచ్చెదను. ఈలోకమున భర్తకాక ఇతర దైవమే లేదు. అట్టి భర్త కొరకు ధనమును కాని జీవితమును కాని త్యాగము చేయవలయును. అట్లు చేసినచో కల్పకోటి శతము విష్ణులోకమున విరాజిల్లును అగ్నిసాక్షిగా వివాహామాడిన బ్రాహ్మణపుత్రి కఠినురాలై ఘోరవ్యసనములు కల భర్తను దానము చేసెను కాని అతను కోరిన ధనము నీయజాలకపాయెను. ఆపాపముచే కాష్ఠీలగా పుట్టెను. నేను కుమారిగా యుండి త్రడి యింటిలో దీనిని చూచితిని. కావున నేను ఈ సత్యమును హితమును తెలిసి నా భర్త కొఱకు సర్వమునీయగలను. స్వీకరించుము.
ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణము ఉత్తర భాగమున మోహినీ చరితమున కాష్ఠీలోపాఖ్యానమున మాఘ మహాత్మ్యమను ముప్పది యొకటవ అధ్యాయము

Sri Naradapuranam-3    Chapters    Last Page