Sri Naradapuranam-3    Chapters    Last Page

పంచదశోధ్యాయః = పదిహేనవఅధ్యాయము

పితాపుత్రసంవాదః

వసిష్ఠఉవాచ:-


విమోచ్య పాతకాద్రాజా గృహగోధం హసన్నివ | ఉవాచ మోహినీం హృష్టః శీఘ్రమారుహ్యతాం హయః || 1 ||
యోజనాయుతగామీ చ క్షణాత్కృష్ణహయో యధా | తదాకర్ణ్య వచో రాజ్ఞో మోహినీ మదలాలసా || 2 ||
ఆరురోహ సమం భర్త్రా తం హయం వాతవేగినమ్‌ | ఉవాచ చ వచో భూపం భర్తారం చారుహాసనీ || 3 ||
ప్రచోదయేమమర్వాణం స్వపురాయ మహీపతే | పుత్రవక్త్రం స్పృహా ద్రష్టుం లంపటా తవ వర్తతే || 4 ||
తవాధీనా నృపశ్రేష్ఠ! గమ్యతాం యత్ర తే మనః | మోహిన్యా వచనం శ్రుత్వా ప్రతస్థే నగరం ప్రతి || 5 ||
పశ్యమానస్సు సంహృష్టః పాదపాన్పర్వతాన్నదీః | వనాని సువిచిత్రాణి మృగాన్బహువిధానపి || 6 ||
గ్రామాన్దుర్గాం స్తధా దేశా న్నగరాణి శుభాని చ | సరాంసి చ విచిత్రాణి భూభాగాన్సుమనోహరాన్‌ || 7 ||
అచిరేణాశ్రమం దృష్ట్వా వామదేవస్య భూపతే ! | ఆకాశస్థో మహీపాలో నమస్కృత్య త్వారానితః || 8 ||
పునరేవ య¸° రాజా వాయువేగేన వాజినా | పశ్యమానో బహూన్దేశా న్దనధాన్యసమన్వితాన్‌ || 9 ||
ఆససాద పురం రాజా వైదిశం స్వవశం చ తత్‌ | తమాయాన్తం నృపం శ్రుత్వా చారై ర్ధర్మాంగదస్సుతః || 10 ||
పితరం హర్ష సంయుక్తో భూపాలా న్వాక్యమబ్రవీత్‌ | ఏషా ప్రకాశమాయాతి ఉదీచీ ది జ్నృపోత్తామాః || 11 ||
మత్పితుర్వాజినాక్రాన్తా తత్తేజః పరిరంజితా | తస్మాద్గచ్ఛామహే సర్వే సంముఖం హ్యవనీపతేః || 12 ||
పితురాగతమాత్రస్య సంముఖం నసుతో వ్రజేత్‌ | స యాతి నరకం ఘోరం యావదిన్ద్రాశ్చతుర్దశ || 13 ||
సంముఖం వ్రజమానస్య పుత్రస్య పితరం ప్రతి | పదే పదే యజ్ఞఫలం ప్రోచుః పౌరాణికా ద్విజాః || 14 ||
ఉత్తిష్ఠధ్వం వ్రజామ్యేష భవద్భిః పరివారితః | అభివాదయితుం ప్రేవ్ణూ ఏష మే దేవదేవతా || 15 ||
తధేత్యక్తస్తుతైస్సర్వై ర్భూమిపాలైర్నృపాత్మజః| జగామ సంముఖం పద్భ్యం క్రోశమాత్రం పితుస్తదా || 16 ||
తతో రాజసహస్రేణ మూర్తిమానివ మన్మధః| || 17 ||
సంప్రాప్య పితరం స్నేహా జ్జగామ ధరణీం తదా | శిరసా రాజభి స్సార్థం ప్రణామమకరోత్తదా || 18 ||
ప్రేవ్ణూ సమాగతం ప్రేక్ష్య తం పతన్తం నృపైస్పహ | అవరుహ్య హయాద్రాజా సముత్థాప్య సుతం విభో! || 19 ||
భుజాభ్యాం సాధు పీనాభ్యాం పర్యష్వజత భూపతిః | మూర్థ్ని చైవముపాఘ్రాయ ఉవాచ తనయం తదా || 20 ||
కచ్చిత్పాసి ప్రజాస్సర్వాః కచ్చిద్దండయసే రిపూన్‌ | న్యాయాగతేన విత్తేన కోశం పుత్ర బిభిర్ష చ || 21 ||
కచ్చిద్విప్రేష్వత్యధికా వృత్తిర్దత్తానపాయినీ | కచ్చిత్తే కాంతశీలత్వం కచ్చిద్వక్తా న నిష్ఠురమ్‌ || 22 ||
కచ్చిద్గావో నదుహ్యన్తే పుత్ర చాండాలవేశ్మని | కచ్చిద్వచనకర్తార స్తనయాశ్చపితుస్సదా || 23 ||
కచ్చిద్వధూశ్శ్వశ్రూవాక్యే వర్తతే భర్తరి క్వచిత్‌ | కచ్చిద్వివాదాన్విపై#్రస్తు సమం నేక్షస ఆత్మజ! || 24 ||
కచ్చిద్గావో నరుధ్యన్తే విషయేవివిధైసృణౖః | తులామానాని సర్వాణి హ్యన్నదీనాం సదేక్షసే || 25 ||
కుటుంబినం కరైఃపుత్ర నాత్యర్థమభిదూయసే | కచ్చిన్నద్యూతపానాది వర్తతే విషయ తవ || 26 ||
కచ్చిద్భిన్నరసైర్లోకా భిన్నవాక్యైః పురే తవ | న దానైర్జీవర్ణసై#్త్రశ్చ నోపజీవంతి మానవాః || 27 ||
కచ్చిద్దృష్వా స్వయం పుత్ర హస్త్యశ్వం పరిరక్షసి | కచ్చిచ్చ మాతరస్సర్వా హ్యవిశేషేణ పశ్యసి || 28 ||
కచ్చిన్న వాసరే విష్ణో ర్నరా భుంజంతి పుత్రిక! | శశిని క్షీణతాం ప్రాప్తే కచ్చిచ్ఛ్రాద్ధపరోనరః || 29 ||
కచ్చిచ్చాపరరాత్రేషు సదా నిద్రాం విముంచసి | నిద్రామూలమధర్మస్య నిద్రాపాపవివర్థినీ
|| 30 ||
నిద్రాదారిద్ర్యజననీ నిద్రాశ్రేయోవినాశినీ | నహినిద్రాన్వితోరాజా చిరంశాస్తివసుంధరామ్‌
|| 31 ||
పుంశ్చలీవ సదా భర్తు ర్లోకద్వయవినాశినీ | ఏవముచ్చరమాణం తం తనయో వాక్యమబ్రవీత్‌ || 32 ||
ధర్మాంగదో మహీపాలం ప్రణమ్య చ పునః పునః | సర్వమేతత్కృతం తాత పునః కర్తాస్మి తే వచః || 33 ||
పితుర్వచనకర్తారః పుత్రా ధన్యా జగత్త్రయే | కిం తతః పాతకం రాజ న్యో నకుర్యాత్పితుర్వచః || 34 ||
పితృవాక్యమనాదృత్య వ్రజేత్స్నాతుం త్రిమార్గగామ్‌ | నతత్తీర్థఫలం భుంక్తే యో నకుర్యాత్పితు ర్వచః || 35 ||
త్వదధీనం శరీరం మే త్వధధీనంహి జీవితమ్‌ | త్వదధీనో హి మేధర్మస్త్యం చమే దైవతం పరమ్‌ || 36 ||
త్రైలోక్యస్యాపి దానేన నశుద్ధ్యేత ఋణాత్సుతః | కింపునర్దేహవిత్తాభ్యాం క్లేశదానాదిభిర్విభో || 37 ||
ఏవం ఋవాణంతనయం బహుభూపాలసంవృతమ్‌ | రుక్మాంగదః పరిష్వజ్య పునరాహ సుతం వచః || 38 ||
సత్యమేతత్త్వయా పుత్ర వ్యాహృతం ధర్మవేదినా | పితురభ్యధికం కించి దైవతం న సుతస్య హి || 39 ||

దేవాః పరాఙ్మఖాస్తస్య పితరంయో
7వమన్యతే | సో7హంమూర్థ్నాత్వయాపుత్ర ధృతస్తత్‌క్షితిరక్షణాత్‌ || 40 ||
జిత్వా ద్వీపవతీం పృధ్వీం బహుభూపాల సంవృతామ్‌ | ఏతత్సౌఖ్యం పరం లోకే ఏత్స్వర్గపదం ధ్రువమ్‌ || 41 ||

పితురభ్యధికః పుత్రో యద్భవేత్‌క్షతిమండలే | సో
7హం పుత్ర కృతార్థస్తు కృతస్సద్గుణవర్త్మనా || 42 ||
త్వయా సాధయతా భూపా న్యధా హరిదినం శుభమ్‌ | తత్పితుర్వచనం శ్రుత్వా పుత్రో ధర్మాంగదో
7బ్రవీత్‌ || 43 ||
క్వగతస్తు భవాంస్తాత ని వేశ్య మయి సంపదః కస్మిన్థ్సానే త్వియం ప్రాప్తా సూర్యాయుతసమస్రభా || 44 ||
మన్యే నిర్వేదమాపన్న ఇమాం సృష్ట్వా ప్రజాపతిః | నైతద్రూపా మహీపాల నారీ త్రైలోక్యమధ్యతః || 45 ||
మన్యే భూధరజాతేయ మధవా సాగరోద్భవా | మాయావా మ యదైత్యస్య ప్రమదా రూపసంస్థితా || 46 ||
అహో సునిపుణో ధాతా యేనేయం నిర్మితా విభో! | బాలాగ్రశతభాగోహి వ్యలీకో నో పపద్యతే || 47 ||
ఇయం హి యోగ్యా కనకావదాతా గృహాయ తుభ్యం జగతీపతీశ! |

ఏవం విధా మే జననీ యది స్యా త్కోన్యో
7స్తి మత్తస్సుకృతీ మనుష్యః || 48 ||
ఇతి శ్రీ బృహన్నారదీయ మహాపురాణ ఉత్తరభాగే మోహినీ చరితే పితాపుత్ర సంవాదో నామ పంచదశో
7ధ్యాయః
వసిష్ఠమహర్షిపలికెను:- రుక్మాంగదమహారాజు చిరునవ్వుతో బల్లిని పాపము నుండి విముక్తురాలను చేసి మోహినితో త్వరగా అశ్వము నధిరోహించుమనెను. ఈ అశ్వము శ్రీ కృష్ణుని అశ్వమువలె క్షణములో పదివేల యోజనముల దూరమువెళ్ళును. అని చెప్పగా మదలాలసయగు మోహిని రుక్మాంగదమహారాజు మాటతలను విని వాయువేగముగల అశ్వమును భర్తతో కలిసి అధిరోహించెను. అందమైన చిరునవ్వుగల మోహిని భర్తతో ఇట్లు పలికెను. ఓరాజా! ఈ అశ్వమును నీ నగరమునకు సాగించుము. నీకు పుత్రుని ముఖమును చూడవలయునను ఉత్కంఠ అధికముగా నున్నది. నేను నీ యధీనమున నుండుదానను. నీకు నచ్చిన ప్రదేశమునగొని పోమ్ము! మోహిని మాటలను వినిన రాజు నగరమునకు బయలు దేరెను. సంతోషముచే వృక్షములను, పర్వతములను, నదులను, విచిత్రములగు వనములను, పలువిధములగు మృగములను, గ్రామములను, దుర్గములను, దేశములను, నగరములను, విచిత్రములగు సరస్సులను, మనోహరములగు భూభాగములను, చూచుచు త్వరలో వామదేవహర్షి ఆశ్రమమును చూచి, త్వరలోనున్న రాజు ఆకాశమునుండియే వామదేవునకు నమస్కరించి, మరల వాయువేగముతో వెడలసాగెను. దారిలో ధనధాన్య సమృద్ధములగు పలు ప్రదేశములను చూచుచు తన ఆధీనములో నున్న విదిశానగర ప్రాంతమును చేరెను. అంతట చారులచే రుక్మాంగద మహారాజు రాకను తెలిసిన ధర్మాంగదుడు సంతోషముతో తోటి రాజులను చూచి ఇట్లు పలికెను. ఓరాజవర్యులారా? ఉత్తరదిక్కు నుండి వెలుగొచ్చుచున్నది. ఆవెలుగు నా తండ్రిగారి అశ్వమునకు సంబంధించినది. కావున మనమందరము రాజుగారికి అభిముఖముగా వెళ్ళెదము. వచ్చుచున్నతండ్రి ఎదుటకు వెళ్ళనిపుత్రుడు పదునాల్గురు ఇంద్రుల కాలము నరకమున నివసించును. వచ్చుచున్నతండ్రి అభిముఖమునకు వెళ్ళు పుత్రునకు ప్రతిక్షణము యజ్ఞఫలము లభించునని పౌరాణిక ద్విజులు చెప్పియుండిరి. కావున రండు. నాపాలిట దేవదేవుడగు పితృదేవుని నమస్కరించుటకు మీతో కలిసి వెళ్ళెదను. ఆ రాజులందరూ అట్లేయని లేవగా వారందరితో కలిసి కాలినడకన ఒక కోసు దూరము వెళ్ళెను. రాజ సహస్రముతో కూడి ధర్మాంగదుడు రూపు దాల్చిన మన్మధునివలె ప్రకాశించుచు చాలా దూరము నడిచి దారిలో తండ్రిని చెరుకొనెను. తండ్రిని చెరుకొని రాజులందరితో కలిసి భూమిపై పడి తండ్రికి సాష్టాంగ ప్రణామమాచరించెను. ప్రేమతో వచ్చి రాజులతో కలిసి నమస్కరించుచున్న పుత్రుని చూచి, అశ్వము నుండి దిగి, పుత్రుని లేపి ధృఢమగు భుజములతో ఆలింగనము చేసుకొని, శిరస్సును మూర్కొని పుత్రునితో ఇట్లు పలికెను. ఓకుమారా? ప్రజలందరిని చక్కగా పరిపాలించుచున్నావా? శత్రువులను దండన చేయుచున్నావా? న్యాయముగా వచ్చుధనముతో కోశమును నింపుచున్నావా? బ్రాహ్మణులయందు తరగని భక్తిని చూపుచున్నావా? నీస్వభావము అందరికి ప్రియముగా నున్నదా? పరుషముగా మాటలాడుట లేదుకదా? చండాలగృహమున ఆవులకు పాలు పితుకుటలేదు కదా. రాజ్యమున పుత్రులు తండ్రిమాటను వినుచున్నారా? కోడలు అత్తగారి ఆజ్ఞను, భార్య భర్త ఆజ్ఞను పాటించుచున్నదా? బ్రాహ్మణులతో వివాదమునకు దిగుటలేదుకదా? ఆవులను పలువిధముల తృణములను భక్షించునపుడు అడ్డగించుట లేదుకదా? అన్నాదులను సిద్ధము చేయుపదార్థములను తూచు పరికరములు కొలచు పరికరములు సక్రమముగా నున్నవో లేదో చూచుచున్నావా? బహుసంతానవంతులను పన్నులతో బాధించుట లేదుకదా? నీరాజ్యమున ద్యూతపానాది దుర్వ్యసనములు లేవుకదా? నీపురమున మతిభేదముతో, రుచిభేదముతో, వాక్యభేదములతో, దాన లబ్థపదార్థములతో, జీర్ణవస్త్రములతో ప్రజలు జీవించుటలేదు కదా? నీవు స్వయముగా పర్యవేక్షించుచు హయాశ్వములను కాపాడుచున్నావా? నీతల్లులందరిని సమానముగా చూచుచున్నావా? శ్రీహరి వాసరమున మానవులు భుజించుట లేదుకదా? రాత్రికాలమున ఎవరూ శ్రాద్ధము నాచరించుటలేదుకదా. అపరరాత్రియందు నిద్రించుట లేదు కదా? నిద్ర అధర్మమునకు మూలము. నిద్రయే పాపమును పెంచును. నిద్ర దారిద్ర్యమును కలిగించును. నిద్రయే అన్నిశ్రేయస్సులను నశింపచేయును. నిద్రనెక్కువగా పొందురాజు చాలాకాలము ప్రజలను పాలించజాలడు. పుంశ్చలివలె నిద్ర రాజునకు ఇహపరములను నశింప చేయును. ఇట్లు పలుకుచున్న తండ్రిని గూర్చి పుత్రుడగు ధర్మాంగదుడు పలుమార్లు నమస్కరించుచు ఇట్లు పలికెను. ఓతండ్రీ! మీరు చెప్పిన వన్నీ చేసితిని. ఇక ముందు కూడా చేయగలను. ఈజగత్త్రయమున తండ్రి మాటలను పాటించు పుత్రులు ధన్యులు. తండ్రిమాటలను అతిక్రమించుట కంటే గొప్ప పాతకము మరొకటి లేదు. తండ్రి మాటను అతిక్రమించి గంగానదీ స్నానమాచరించిననూ గంగాస్నానఫలము లభించదు. నాశరీరము, నాజీవితము, నాధర్మము మీ అధీనము. మీరే నాకు పరదైవము. మూడు లోకములను దానము గావించిననూ తండ్రి ఋణము తీరదు. అయినపుడు దేహముతో, ధనముతో, క్లేశదానములతో ఎట్లు తీరును. ఇట్లు చాలామంది రాజులతో కూడి పలుకుచున్న పుత్రుని రుక్మాంగద మహారాజు మరల ఆలింగనము చేసుకొని, ఇట్లు పలికెను. దర్మమును తెలిపిన నీవు సత్యమునే పలికితివి. పుత్రునకు తండ్రిని మించిన దైవములేదు. తండ్రిని అవమానించు పుత్రునకు దేవతలు పరాఙ్మఖులగుదురు. కావున ఇపుడు నీవు సప్తద్వీపవతియగు భూమిని గెలిచితివి. ఈ భూమండలమున తండ్రిని మించిన తనయుడుండుటయే అధికసౌఖ్యము. ఇదియే మానవులకు స్వర్గప్రదము. కావున ఈనాడు సద్గుణములరాశివై సద్ధర్మపాలకుడవై నీవు రాజులను గెలిచి, హరివాసరమును చక్కగా పాలింప చేయుటచే నేను ధన్యుడనైతిని. ఇట్లు తండ్రి పలికిన మాటలను విని ధర్మాంగదుడిట్లు పలికెను. ఓ తండ్రీ! నాయందు రాజ్యసంపదలనుంచి మీరు ఎటు వెళ్ళితిరి. ఎచట పదివేల సూర్యుల ప్రకాశముగల ఈయువతి లభించినది? ఈ యువతిని సృష్టించి బ్రహ్మసంతృప్తి పొంది యుండునను కొందును. ఈ మూడు లోకములలో ఇటువంటి రూపము కల యువతి లేదు. ఈమె పార్వతి వంటిది. లేదా లక్ష్మీదేవి వంటిది అనుకొనుచున్నాను. లేక మయుని మాయయె రూపు దాల్చి వచ్చి యుండును. ఇంతటి రూపసిని నిర్మించిన బ్రహ్మ చక్కని నిపుణుడు. ఈమెలో నూరవ అంశమును నిర్మించిన వాడు కూడా చతురుడేయగును. ఇతరులు చేయలేరు. ఈ స్వర్ణకాంతులను విరజిమ్ముసుందరి మీ ఇంటిలో యుండదగినది. ఈ సుందరి నాకు తల్లియగుచో నాకంటే ధన్యుడగు పుత్రుడు ఈ ముజ్జగములలో మరియొకడుండడు.
ఇది శ్రీ బహృన్నారదీయ మహాపురాణమున ఉత్తరభాగమున మోహినీ చరితమున పితాపుత్రసంవాదమను పదిహేనవ అధ్యాయము.

Sri Naradapuranam-3    Chapters    Last Page