Sri Naradapuranam-3    Chapters    Last Page

చతుర్దశో7ధ్యాయః =పదునాలుగవ అధ్యాయము


గోధావిముక్తి

వసిష్ఠువాచ :-


సంప్రస్థితా వుభౌ రాజ న్గిరిశీర్షాద్దరాతలమ్‌ | పశ్యమానౌ బహూన్భావా న్గిరి జాతా న్మనోహరాన్‌ || 1 ||
కేచిద్విద్రుమసంకాశాః కేచిద్రజతసన్నిభాః | కేచిన్నీల సమప్రఖ్యాః కేచిత్కాంచన సత్విషః || 2 ||
కేచిత్స్ఫాటి కవర్ణాభా హరితాలనిభాః పరే | అన్యోన్య శ్లేషతాం ప్రాప్తౌ సకలైస్ద్సావరైరివ || 3 ||
సంప్రాప్య వసుధాం భూపో హ్యపశ్య ద్వాజినాం వరమ్‌ | ఖన్యమానం ఖురేణోర్వీం కులిశాభేన వేగినా || 4 ||
తస్య దారయతః పృధ్వీం సుతీక్షేన ఖురేణ హి | గృహగోధా భవత్తస్మి న్భూభాగాంతర్గతా కిల || 5 ||
నిర్గచ్ఛమానా నృపతే ఖురేణ విదలీకృతా | విదీర్య మాణాం నృపతి రపశ్యత్స దయాపరః || 6 ||
అభ్యధావత వేగేన హా హతేతి ప్రియాం వదన్‌ | తతస్స వృక్షపత్రేణ కోమలేన మహీపతిః
|| 7 ||
ఉత్సార్య తా ఖు రాదాశు ప్రాక్షి పత్తృణ శాద్వలే | తతస్తు మోహినీం ప్రాహ ప్రేక్ష్య మూర్ఛగతాం హి తామ్‌ || 8 ||
శీఘ్ర మాహర చార్వంగి జలం జలజలోచనే | యేన మూర్భాగతాం సించే గృహగోధాం విమర్దితామ్‌ || 9 ||
సా భర్తు ర్వచనా ఛ్చీఘ్ర మానయ ఛ్ఛీతలం జలమ్‌ | తేనాభ్యషించ న్నృపతి ర్గృహ గోధాం విమూర్ఛితామ్‌ || 10 ||
అవాప చేతనాం రాజన్‌ శీతలాజ్జలసేచనాత్‌ | అభిగాత్రేషు సర్వేషు శస్తం వారి ప్రసేచనమ్‌ || 11 ||
అథవాక్లిన్న వస్త్రేణ సహసా బంధనం హితమ్‌ | సంప్రాప్త చేతనా భూప గోధా వచన మబ్రవీత్‌ || 12 ||
రాజాన మగ్రతో వీక్ష్య వేదనార్తా శ##నైశ్శనైః | రుక్మాంగద మహాబాహో నిబోథ మమ చేష్టితమ్‌ || 13 ||
శాకలే నగరే రమ్యే భార్యహం హ్యగ్ర జన్మనః | రూప¸°వన సంపన్నా తస్య నాతిప్రియా విభో || 14 ||
సదా విద్వేషసంయుక్తో మయి నిష్ఠురజల్పకః | నాన్యస్యకస్యచిద్ద్వేష్టా స తు మే నృపతే పతిః || 15 ||

తతో
హం క్రోధసంయుక్తా వశీకరణలంభనాత్‌ | అపృచ్ఛం ప్రమదరాజ న్యాస్త్స్యక్తాః పతిభిః కిల || 16 ||
తాభిరుక్తా హ్యహం భూప వశ్యో భర్తా భవిష్యతి | ఆస్మాకం ప్రత్యయో జాతో భర్తృత్యాగావమాననాత్‌ || 17 ||
ప్రవ్రజ్యా భేషజైర్వశ్యా జాతా హి పతయస్తు నః | త్వం పృచ్ఛతాం వరారోహే దాస్యతే భేషజం శుభమ్‌ || 18 ||

స వికల్పస్త్వయా కార్యో భవితా దాసవత్పతిః | తతో
హం త్వరితం గత్వా తాసాం వాక్యేన భూపతే || 19 ||
ప్రాసాదః కధితస్తస్యాః పృచ్ఛన్త్యా మమ మానవైః | శతస్తంభసమాయుక్తః కాంతిమత్సు ధయాయుతః || 20 ||
ప్రవిశ్య తం సుతేజస్కా మపశ్యం బ్రహ్మచారిణీమ్‌| ప్రావృతాం దీర్ఘవస్త్రేణ సంధ్యారాగసవర్ణినీమ్‌ || 21 ||
దీర్ఘాభి స్సాజటాభి స్తు సంవృతా దీప్తిసంయుతా | పరిచారకైస్తు సంయుక్తా వీజ్యమానా శ##నైశ్శనైః || 22 ||
అక్షసూత్రకపాలా తు జపన్తీ భగమాలినీ | సర్వవశ్యకరం మన్త్రం క్షోభకం ప్రత్యయావహమ్‌ || 23 ||

తతో
హం ప్రణతా భూత్వా పద్భ్యాం న్యస్యాంగులీయకమ్‌ | మృదుకాంచనసంభూతం అతిరిక్తప్రభాన్వితమ్‌ || 24 ||
తతో హృష్టాభవద్దృష్ట్వా పదస్థం చాంగులీయకమ్‌ | అప్పష్టయా తయా జ్ఞాతం మమభర్తుర్విమాననమ్‌ || 25 ||
తయోక్తాహం తతో భూప తాపస్యా ప్రణతా స్థితా | చూర్ణోరక్షాన్వితా హ్యేష సర్వభూతవశానుగః || 26 ||
త్వయా భర్తరి ససంయోజ్యో రక్ష్యం గ్రీవాశయాంకురమ్‌ | భవిష్యతి పతిర్వశ్యో నాన్యాం యాస్యతి సుందరీమ్‌ || 27 ||
చూర్ణరక్షాం గృహీత్వాహం ప్రా ప్య భర్తృగృహం పునః | ప్రదోషే పయాసా యుక్త శ్చూర్ణో భర్తరి యోజితః || 28 ||
గ్రీవాయాం హి కృతారక్షా న విచారో మయాకృతః | యదా స పీతచూర్ణస్తు భర్తా నృపవరోత్తమ || 29 ||
తదహః క్షయరోగ్యాభూ త్పతిః క్షీణో దినే దినే | గుహ్యే తు క్రిమయో జాతాః క్షతదుష్టవ్రణోద్భవాః || 30 ||
దినైః కతిపయైర్జాతై ర్దీపవద్రవిదర్శనాత్‌ | హతతేజా స్తధా భర్తా మామువాచకులేన్ద్రియః
|| 31 ||

క్రన్దమానో దివారాత్రౌ దాసో
స్మి తవ శోభ##నే | త్రాహి మాం శరణం ప్రాప్తం నగచ్ఛేయం పరస్త్రియమ్‌ || 32 ||
తత్తస్య రుదితం శ్రుత్వా భయభీతా మహీపతే | తస్యాం నివేదితం సర్వం కథం భర్తా భ##వేత్సుఖీ || 33 ||
తయాసి భేష జం దత్తం ద్వితీయం దాహ శాన్తయే | దత్తే తు భేషజే తస్మిన్‌ సుస్థో
7 భూత్తతత్‌క్షణాత్పతిః || 34 ||
పూర్వ చూర్ణోద్భవో దాహ శ్శాన్తస్తేనౌషధేన హ | తతః ప్రభృతి మే భర్తా వశ్యో
భూద్వచనే స్థితః || 35 ||
కాలేన పంచతాం ప్రాప్తా గతా నరక యాతనామ్‌ | తామ్రభ్రాష్ట్రేహ్యహం దగ్దా యుగాని దశ పంచ చ | | 36 ||
సూక్ష్మాణి తిలమాత్రాణి కృత్వా ఖండాన్యనేకశః | కించిత్పాతక శేషేణ ధరాయామవతారితా || 37 ||
గృహగోధామయం రూపం కృతం భాస్కరజేన మే | సాహమత్ర స్థితా భూప వర్షాణామయుతం పురా || 38 ||
యాన్యాపి యువతిర్భూప భర్తుర్వశ్యం సమాచరేత్‌ | వృథాధర్మా దురాచార దహ్యతే తామ్ర భ్రాష్ట్రకే || 39 ||
భర్తా నాధో గతిర్భర్తా దైవతం గురురేవచ | తస్యవశ్యం చరేద్యాతు సా కథం సుఖమాప్ను
యాత్‌ || 40 ||
తిర్యగ్యోని శతం యాతి క్రిమికుష్ఠా సమాన్వితా | తస్మాద్భూపాల కర్తవ్యం స్త్రీభిర్భర్తృవచస్సదా || 41 ||
సాహం యస్యే పునర్యోనిం కుత్సితాం పాతకాన్వితామ్‌ | యది నోద్దరసే రాజ న్నద్య మాం శరణాగతామ్‌ || 42 ||
సుకృతస్య ప్రసాదేన విజయాజనితేన హి | యా త్వయా సంగమే పుణ్య కృతా శ్రవణద్వాదశీ || 43 ||
సరయ్వాశ్చైవ గంగాయాః పాపనాశ విధాయకే | ప్రేతనిర్యాతనీ పుణ్యా మానసేప్సిత దాయినీ || 44 ||

యస్యాం గృహే
పి భూపాల సంస్కృతో మనుజైర్హరిః | సర్వతీర్థ ఫలావాప్తిం కురుతే నాత్ర సంశయః || 45 ||
దత్తం జస్తం హుతంయచ్చ కృతం దేవార్చనా దికమ్‌ | సర్వం తదక్షయం భూప యత్కృతం విజయాదినే || 46 ||
ఏవం విధం ఫలం యస్యా స్తద్దేహి సుకృతం మమ | ద్వాదశ్యాముపవాసేన త్రయోదశ్యాం తు పారణ || 47 ||
ద్వాదశాబ్దోపవాసస్య ఫలం ప్రాప్నోత్యుపోషణ | దయాం కృత్వా మహీపాల ధర్మమూర్తి ర్భవాన్‌క్షితౌ || 48 ||
వైవస్వతపథ ధ్వంసీ పరిత్రాహి సుదుఃఖితామ్‌ | గృహగోధావచ శ్రుత్వా మోహినీ వాక్యమబ్రవీత్‌ || 49 ||
వసిష్ఠి మహర్షి పలికెను : -
ఓ రాజా! మోహినీ రుక్మాంగదులు గిరి దుర్గము నుండి బయలుదేరి బహు విధ భావములను మనోహరములను పర్వత సంభవములను చూచుచుండిరి. అచట కొన్ని పగడములవలెనున్నవి. కొన్ని వెండివలెనున్నవి. కొందరు నీల సమములు. కొన్ని కాంచన సన్నిభములు. కొన్ని స్ఫటిక వర్ణప్రభలు, మరికొన్ని హరితాలనిభలు అవి యన్నియు ఇతరస్థావరములతో వలె పరస్పరము సంశ్లేషమును పొందియున్నవి. భూమిమిద చేరి వజ్రమువలె వాడియగు డెక్కతో భూమిని త్రవ్వుచున్న ఉత్తమాశ్వమును చూచెను. వాడిడెక్కతో ఆ యశ్వము భూమిని త్రవ్వుచుండగా భూ అంతర్భాగమున ఒక బల్లి యుండెను. బయటికి వచ్చుచు గుఱ్ఱపుడెక్కతో చీల్చబడెను. చీల్బబడు చుండగా రాజు చూచుచుండెను. అయ్యో! చనిపోయెను అనుచు పరుగెత్తెను. వెంటనే సుకుమారమగు ఒక పత్రముతో ఆబల్లిని ప్రక్కకు జరిపెను. గడ్డిమీద పడవేసెను. మూర్ఛిల్లిన బల్లిని చూచి మోహినతో పద్మాక్షీ! త్వరగా జలమును తెమ్ము! బల్లిపై చల్లెదను. అని పలికెను. భర్తమాటతో మోహిని త్వరగా నీరును తెచ్చెను. ఆ జలము బల్లిపై చల్లెను. చల్లని నీరు చల్లుటచే బల్లికి స్పృహ కలిగెను. గాయములన్నిటిపై చల్లని నీరు చల్లెను. తడి బట్టతో శరీరమును తుడిచెను. అట్లు స్పృహ వచ్చిన బల్లి ఎదరుగా రాజును చూచి వేదనతో ఆర్తురాలై మెలమెల్లగా ఇట్లు పలికెను. ఓ మహావీరా ! రుక్మాంగద మహారాజా! నా కథను తెలియుము. నేను శాకల నగరమున ఒక బ్రహ్మణోత్తముని భార్యగా ఉంటిని. రూపముతో ¸°వనముతో ఉన్ననూ, నా భర్తకు ఇష్టురాలను కాకపోతిని ఎపుడు నాయందు ద్వేషముతో నిష్ఠురముగా మాటలాడుచుండెను. ఇతరులనెవ్వరినీ ద్వేషించెడి వాడు కాడు. అపుడు నేను కోపము గల దాననై భర్తలచే విడువబడిన యువతులను వశీకరణ మంత్రముకాని, ఔషధము కాని లబించు ప్రదేశమును అడిగితిని. వారు నీకు భర్త వశము కాగలడు. మాకు భర్తలు విడిచిన అవమానము తొలగుటచే నమ్మకమేర్పడినది. సన్యసించిన భర్తలుకూడ జౌషధములచే వశులైరి. నీవు కూడా ఆమె వద్దకు వెళ్ళుము. అడుగుము. నీకు మంచి జౌషధము నీయగలదు. ఈ విషయమున సందేహించ వలదు. నీ భర్త నీకు దాసుడగును. అపుడు నేను వారి మాటలతో ఆమె ఇంటి మార్గమును తెలుసుకొని వెళ్లితిని. అచట ఆమె శతస్తంభ సమాయుక్తము, కాంతి మత్సుధతో కూడియున్న భవనమున ప్రవేశించితేజో వంతురాలగు బ్రహ్మచారిణిని చూచితిని. దీర్ఘవస్త్రమునుకప్పుకొని సంధ్యారాగ వర్ణముతో నుండెను. పరిచారికలు వీవనలతో వీచుచుండిరి. ఆమె పేరు భగమాలిని. చేతిలో జపమాలను ధరించి సర్వవశ్యకరము, సర్వక్షోభకరమును జపించుచుండెను. అపుడు నేను ఆమెకు సమస్కరించి పాదములు యందు ఒక ఉంగరమునుంచితిని. ఆమె నన్నడుగకనే నా భర్త నన్నవమానించెనని తెలుసుకొనెను. అపుడు ఆ తాపసి రక్షతో కూడి ఈ చూర్ణము సర్వప్రాణులను వశము చేయును. నీవు నీభర్తకిమ్ము. భర్తకంఠమును మాత్రము కాపాడుము. భర్త నీవశమగును. ఇతర స్త్రీని కోరడు. అని పలికెను. అంతట నేను రక్షాచూర్ణమును తీసుకొని ఇంటికి వెళ్ళితిని. ప్రదోష కాలమున రక్షా చూర్ణమును పాలతో కలిపి భర్తకు ఇచ్చితిని. కంఠవిషయమున రక్ష చేసితిని. ఇంక ఇతరమునాలోచించలేదు. రక్షా చూర్ణము త్రాగిననాడే అతనికి క్షయరోగము సంక్రమించినది. రోజురోజుకు క్షీణించసాగెను. గుహ్యమున పుండుపుట్టి, దాని నుండి క్రిములు పుట్టినవి. కొన్ని దినములు గడచిన తరువాత సూర్యని ముందు దీపమువలె కాంతి హీనుడాయెను. కలతతో నాతో ఇట్లనెను. పగలు రాత్రి ఆక్రోశించుచుండెను. ప్రియురాలా! నేను నీకు దాసుడనగుదును. నిన్నే శరణు వేడుచున్న నన్ను కాపాడుము. పరస్త్రీని కోరను అతని ఆక్రందనను విని భయముతో వణుకుచు యోగిని వద్దకు వెళ్ళి జరిగినంతయు నివేదించితిని. నా భర్త సంతాపమును తొలగించమని ప్రార్ధించితిని. అపుడామె దాహశాన్తి కొరకు మరొక జౌషథమునిచ్చెను. ఆ ఔషథమును భర్తకీయగా రోగము శాంతించెను. మొదటి చూర్ణము వలన కలిగిన దాహము శాంతించెను. అప్పటి నుండి నా భర్త నావశమాయెను. కొంతకాలమునకు నేను మరణించి నరకమును చేరితిని పదిహేను యుగములు రాగి మూకుడులో నువ్వు గింజంత ఖండములుగా నా శరీరమును చేసి కాల్చబడితిని. కొంచెము పాతకము మిగిలియుండగా భూమి మీద పుట్టితిని. యమ ధర్మరాజు నన్ను బల్లిగా పుట్టించెను. ఈ రూపముతో ఇచటనే పదివేల యేండ్ల నుండి యుంటిని. ఇట్లు భర్తను వశమున నుంచుకొనుటకు ప్రయత్నించు ప్రతి స్త్రీ ధర్మాచరణము వ్యర్థమై, దురాచారపరురాలై రాగి మూకుడులో కాల్చబడును. భర్తయే నాథుడు, భర్తయే గతి. భర్తయే దైవము, గురువు. అట్టి భర్తను వశమున నుంచు కొనవలయునని ప్రయత్నించు స్త్రీ ఎట్లు సుఖము నొందగలదు. కుష్ఠురోగము కలదై నూరు జన్మలు పశుపక్ష్యాదులుగా పుట్టును. కావున స్త్రీలు భర్తమాటను పాటించవలయును. కావున నేను మరల కూడ కుత్సిత జన్మనే పొందెదను. ఈ రోజు నిన్ను శరణు వేడిన నన్ను ఉద్దరించుము. పాపమును నశింప చేయు గంగా సరయూసంగమమున విజయయనబడు శ్రవణ ద్వాదశీ వ్రతము నాచరించితివి. ఆ ద్వాదశి ప్రేతత్వముక్తి ప్రదాయిని, ఆభీష్ట ఫలదాయిని, శ్రీహరిని స్మరించు ఇంట్లో సర్వతీర్థ ఫలప్రాప్తి కలుగును. విజయాద్వాదశిన చేసిన దానము, జపము హోమము, దేవపూజ అన్నియూ అక్షయములగును. కావన విజయా ద్వాదశీ వ్రత ఫలమును నాకిమ్ము. ద్వాదశినాడుపవశించి, త్రయోదశిన పారణము చేసిన ద్వాదశవత్సరోపవాస ఫలమును పొందును. నీవీ భూమి మీద దయా మూర్తివి. కావున నాయందు దయ జూపి యమ మార్గమును ధ్వంసము చేయువాడవు గావున దుఃఖించు నన్ను కాపాడుము. ఇట్లు పలికిన బల్లి మాటలను విని మోహిని ఇట్లనెను.

స్వకృతం తు జనో
శ్నాతి సుఖదుఃఖాత్మకం విభో | తస్మాత్కిమనయా కార్యం పాపయా భర్తృదుష్టయా || 50 ||
యయా భర్తా వశం నీతో రక్షా చూర్ణాదిభిర్నృప | సాధుభ్యో యత్కృతం రాజ న్యశ స్స్వర్గ కరం భ##వేత్‌ || 51 ||
ఉభయోర్భ్రంశతామేతి పాపేభ్యోయత్కృతం భ##వేత్‌ | శర్కరా మిశ్రితం క్షీరం కాద్రవేయే నియోజితమ్‌ || 52 ||
విషవృద్ధిం కరోత్యేవ తద్వత్పాపకృతం భ##వేత్‌ | పరిత్యజే మాం త్వ పాపాం గచ్ఛావో నగరాయంవై || 53 ||
జన్మవ్యాపార సక్తానా మాత్మసౌఖ్యం వినశ్యతి |
ప్రతి ప్రాణి తాను చేసిన కర్మఫలమునే సుఖదుఃఖ రూపముగా అనుభవించును. కావున భర్తకు ద్రోహము చేసిన ఈమెతో మనకేమి పని? రక్షాచూర్ణమునిచ్చి భర్తను వశము చేసుకున్న పాతకి ఈమె. వంచి వారికి చేసినది కీర్తినిచ్చును. పాపులకు చేసిన ఇద్దరూ భ్రష్టులగుదురు. శర్కర కలిపిన పాలను పాముకు ఇచ్చిన విషమును పెంచినట్లు పాపులకు మేలు హానిని చేయును. కావున ఈ పాతకిని విడువుము. మనము నగరమునకు వెళ్ళెదము. బ్రతుకంతా ఇతరులకు మేలు చేసినవారికి సౌఖ్యము నశించును.
రుక్మాంగద ఉవాచ:-
బ్రహ్మత్మజే కథం వాక్యమీ దృశం వ్యాహృతం త్వయా | న సాధూనా మిదం వృత్తం భవతీతి వరాననే || 54 ||
ఆత్మసౌఖ్య కరాః పాపా భవన్తి పరతాపినః | విప్రపన్నా వరారోహే పరోపకరణాయ వై || 55 ||

శశీ సూర్యో
థ పర్జన్యో మేదినీ హుతభుగ్జలమ్‌ | చందనం పాదపాస్సంతః పరోపకరణాయవై || 56 ||
శ్రూయతే కిల రాజాసీ ద్దరిశ్చన్ద్రో వరాననే | చండాల మందిరావాసీ భార్యాతనయ విక్రయీ || 57 ||
అసత్య వచనాద్భీతో దుఃఖా ద్దుఃఖ తరంగతః | తస్య సత్యేన సంతుష్ఠా దేవా శ్శక్ర పురోగమాః || 58 ||
వరేణ ఛందయా ఞ్చక్రు ర్హరిశ్చంద్రం మహీపతిమ్‌ | తేన సత్యవతా చోక్తాదేవా బ్రహ్మపురోగమాః || 59 ||
యది తుష్టా హి విబుధా వరం మే దాతు మర్హథ | ఏషా హి నగరీ సర్వా సద్రుమా ససరీసృపా || 60 ||
సబాల వృద్దతరుణా సనారీ సచతుష్పదా | ప్రయాతు కృతపాపాపి స్వర్గతిం నగరీ మమ || 61 ||
అయోధ్యాపాతకం గృహ్య గతాహం నరకం ధ్రువమ్‌ | ఏకాకీ న హిగచ్ఛామి పరిత్యజ్య జనం క్షితౌ || 62 ||
స్వర్గం విబుథ శార్దూలాః సత్యమేతన్మయేరితమ్‌ | తస్య తాం స్థిరతాం జ్ఞాత్వా సహ తేనైవ సా పురీ || 63 ||
జగామ స్వర్గలోకం చ ఇంద్రాదీనా మనుజ్ఞయా | సో
పి స్వర్గేస్థితో రాజా స్వపురేణ సమన్వితః || 64 ||
కామగేన విమానేన పూజ్యమానో
మరైరపి | అస్థిదానం కృతం దేవి కృపయా హి దధీచినా || 65 ||
దేవానా యుపకారార్థం శ్రుత్వా దైత్యైః పరాజితాన్‌ | కపోతార్థం స్వమాంసాని శిబినా భూభుజా పురా || 66 ||
ప్రదత్తాని వరారోహే శ్యేనాయ క్షుధితాయ వై | జీమూతవాహినో రాజా పురాసీత్‌క్షతిమండలే || 67 ||
తేనాపి జీవితం దత్తం పన్నగాయ వరాననే | తస్మాద్దయాలునా దేవి భవితవ్యం మహీభుజా || 68 ||

శుచావమేధ్యే
పి శుభే సమం వర్షతి వారిదః | చాండాలపతితౌచంద్రో హ్లాదయేచ్చ నిజైః కరైః || 69 ||
తస్మాదిమాం వరారోహే గృహగోధాం సుదుఃఖితామ్‌ | ఉద్దరిష్యే నిజైః పుణ్యౖ ర్ద్రౌహిత్రై ర్నాహుషో యధా || 70 ||
విమోహినీం తిరస్కృత్య గృహగోధామువాచ మాం | దత్తం దత్తం మాయా పుణ్యం వియజా సంభవం తవ || 71 ||
గచ్ఛ విష్ణుగతాన్లోకా న్విధూతాశేషకల్మషా | తద్వాక్యాత్సహసా భూప దివ్యాభరణభూషితా || 72 ||
విముచ్య దేహం తజ్జీర్ణ గృహగోధాసముద్భవమ్‌ | జగామామంత్ర్య తం భూపం ద్యోతయంతీ దిశో దశ || 73 ||
సీమంతమివ కుర్వాణా వైష్ణవం పదమద్భుతమ్‌ || 74 ||
యద్యోగిగమ్యం హుతభుక్ప్రకాశం వరం వరేణ్యం పరమాత్మభూతమ్‌ |
తస్మాదియం చైవ శిఖిప్రదీపా జగత్ప్రకాశాయ నృప ప్రసూతా || 75 ||
ఇతి శ్రీ బృహన్నారదీయ మహాపురాణ ఉత్తర భాగే గోధా విముక్తిర్నామ చతుర్దశో
ధ్యయః
రుక్మాంగదమహారాజు పలికెను: - ఓ బ్రహ్మపుత్రికా? నీవెట్లు ఇటువంటిమాటను పలుకుచున్నావు. ఇది సాధువుల పనికాదు. తన సుఖములను మాత్రమే చూచుకొందురుపాపులు. పరులను బాధించెదరు. పరోపకారమును చేయుటకిష్టపడరు. చంద్రుడు, సూర్యడు, మేఘము, భూమి అగ్ని, జలము, చందనము, వృక్షములు, సత్పురుషులు పరోపకారమునకే సృజించబడుదురు. పూర్వకాలమున హరిశ్చన్ద్రుడను మహారాజు అసత్యమునకు భయపడి భార్యను విక్రయించి, చండాలగృహమున నివసించి ఘోర దుఃఖమును పొందెను. అతని సత్యవ్రతమునకు సంతసించిన ఇంద్రాదిదేతలు అతనిని వరమును కోరమని అడిగిరి. అపుడు హరిశ్చంద్ర మహారాజు బ్రహ్మదిదేవతలను గూర్చి ఇట్లు పలికెను. దేవతలు నాయెడ సంతోషించినచో నానగరము వృక్షములతో, సర్పములతో బాల వృద్ద యువనర నారీ యుతముగా పశుపక్ష్యాది యుతముగా పాపములనాచరించియున్ననూ స్వర్గమును చేరవలయును. అయోధ్యానగరములోనివారు చేసిన పాపమును నేనే స్వీకరించి నరకమునకు వెళ్ళెదను. నా ప్రజలను వదలినేనొంటిగా స్వర్గమునకు వెళ్ళజాలను. అని. అతని స్థిర నిశ్చయమును గ్రహించి ఇంద్రాదులు అయోధ్యా పురవాసులందరూ హరిశ్చంద్రమహారాజుతో స్వర్గమును చేర్చబడిరి. హరిశ్చంద్ర మహారాజు కూడ కామగతిగల విమానముతో దేవతలచే పూజించబడుచు స్వర్గమున విరాజిల్లెను. దధీచిమహర్షి అస్థిదానమును చేసెను. శిబిచక్రవర్తి కూడా కపోతమును కాపాడుటకు డేగకు తన శరీరమాంసమును ఖండించి ఇచ్చెను. పూర్వకాలమున జీమూతవాహనుడను రాజు పామును కాపాడుటకై తన జీవితమునే అర్పించెను. కావున రాజులు దయాపరులు కావలయును. మేఘము పవిత్రస్థలమున అపవిత్రప్రదేశమున కూడ వర్షించును. చండాలులను పతితులను కూడ చంద్రుడు ఆనందింప చేయును. కావున దౌహిత్రులు నహుషుని ఉద్దరించినటుల ఈ బల్లిని నాపుణ్యములచే ఉద్దరింతును. ఇట్లు మోహినితో పలికి రుక్మాంగద మహారాజు బల్లితో ఇట్లు పలికెను. ఓ గోధా! నేను విజయావ్రతాచరణము వలన కలిగిన పుణ్యమును నీకిచ్చితిని. కావున అన్ని పాపములనుండి విముక్తి పొంది విష్ణులోకమును చేరుము. రుక్మాంగదమహారాజు ఆమాటను పలికిన వెంటనే ఆ బల్లి తన దేహమును విడిచి దివ్యాభరణ భూషితురాలై, రుక్మాందుని అనుజ్ఞను పాంది, పదిదిక్కులను ప్రకాశింపచేయుచు ఆకాశమున పాపిటను కల్పించి విష్ణులోకమును చేరెను. యోగులకు మాత్రమే చేరదగినది అగ్నివలె తేజోమయము, ఉత్తమములలో కెల్ల పరమోత్తమము పరమాత్మ భూతము అగు విష్ణులోకమున రుక్మాంగదమహారాజు చేసిన పుణ్యము జగత్తును ప్రకాశించుచు ఉత్తమ దీపముగా బల్లిరూపమును విడిచి దివ్యదేహమున విలసిల్లెను.
ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున ఉత్తర భాగమున గోధావిముక్తి యను పదునాలుగవ అధ్యాయము.

Sri Naradapuranam-3    Chapters    Last Page