Jagadguru divyacharithra   Chapters   Last Page

 

9. తఇంద్ర సరస్వతి

సన్న్యాస నామములు పది ఉన్నవిత. సామాన్యంగా సన్న్యాసాశ్రమం తీసికొనేవారు వారి గురుసంప్రదాయాన్ని అనుసరించి సరస్వతీ, భారతీ, మున్నగు పది నామాలలో ఒకదానిని తమ సన్న్యాస నామంతో కలిపి వ్యవహరించుకొంటూ ఉంటారు. దీనినే 'యోగపట్టం' అని కూడ అంటారు.త

శ్రీసురేశ్వరులు 'సరస్వతీ సాంప్రదాయంలో ఆశ్రమ స్వీకారం చేసినట్లు ఆనందగిరీయం స్పష్టంగా పేర్కొన్నది. సరస్వతీ సంప్రదాయ వర్తినం సురేశ్వరం ఆహూయ'-అని కాగా ఆదిశంకరుల శిష్యులలో సరస్వతీ సంప్రదాయ ప్రవర్తకులైన శ్రీసురేశ్వరులు కామకోటిపీఠ గురుపరంపరకు ముఖ్య ప్రవర్తకులైరి. వారి ప్రధానాధ్యక్ష్యంలో సర్వజ్ఞాత్ములనుండి ఈ కామకోటిపీఠ జగద్గురు పరంపర ప్రవర్తితమైనది. ఈ సరస్వతీ సంప్రదాయంలో, ఆదిశంకరుల అనంతరం మిక్కిలి పూజానీయులైన శ్రీసురేశ్వరా పరపర్యాయమైన 'ఇంద్ర' పదాన్ని సరస్వతీ శబ్దాన్ని సంయోజనం చేయగా ఇది 'ఇంద్ర సరస్వతి'గా రూపొందటంలో కూడ మిక్కిలి ఔచిత్యం ఉన్నది.

ఐతే, భారతీ సంప్రదాయంలో ప్రవర్తితమైన శృంగేరికి 800 సంవత్సరాలు సురేశ్వరులు అధిపతులుగా ఉన్నారనే భావాన్ని, మాధవీయంలో ధర్మసింధు నిర్దేశానుసారియగు సామవేద వాక్యంతో పాటు ఈ అంశంకూడ నిర్ద్వంద్వంగా ఖండిస్తోంది.

'ఇంద్రోమాయాభిః పురురూప ఈయతే' అను శ్రుతిని బట్టి 'ఇంద్ర' పదము పరమాత్మవాచక మౌతోంది. పరబ్రహ్మ వాచకమైన ఇంద్రపదం సరస్వతీ పదంతోకూడి తదభేదాన్ని కూడ సూచిస్తోంది.

వాసనాదేహస్తుతియందు ఈ 'ఇంద్రసరస్వతీ' పదాన్ని గూర్చి ప్రత్యేకమైన ఐతిహ్యంకూడ ఉన్నది.

ఈ 'ఇంద్రసరస్వతీ' సంప్రదాయంలో సిద్ధులైన యతి సార్వభౌములు సుప్రసిద్ధులై ఉన్నారు. శ్రీ సదాశివేంద్ర సరస్వతి, గంగా ధరేంద్ర సరస్వతి, గీర్వాణంద్ర సరస్వతి, వాసుదేవేంద్ర సరస్వతి, ఉపనిషద్బ్రహ్మేంద్ర సరస్వతి మున్నగు అద్వైతసిద్ధు లీ ఇంద్ర సరస్వతి సంప్రదాయమున, విఖ్యాతులై ఉన్నారు.

బ్రహ్మామృతవర్షిణి, స్వారాజ్యసిద్ధి, ప్రపంచసారసిద్ధి మున్నగు ప్రాచీన ప్రామాణికాద్వైత గ్రంథకర్తలగు అద్వైత సిద్ధు లీ ఇంద్ర సరస్వతీ సంప్రదాయమువారే.

కనుక కామకోటి పీఠాధిష్ఠితులైన శ్రీ సర్వజ్ఞాత్ములు మొదలు నేటివర కీ 'ఇంద్రసరస్వతీ' యోగపట్ట మీపీఠాధిపతులకు సంప్రదాయ సిద్ధమై ఉన్నది.

సుర +ఈశ్వర = ఇంద్ర + సరస్వతి, శ్రీసర్వజ్ఞాత్మ + ఇంద్ర సరస్వతి మొదలు, జయ + ఇంద్రసరస్వతి యని నేటివరకు అవిచ్ఛిన్నంగా విరాజిల్లుతోంది.

''కామకోటి మఠేత్వస్మిన్‌ గురు రింద్రసరస్వతీ''

Jagadguru divyacharithra   Chapters   Last Page