Jagadguru divyacharithra   Chapters   Last Page

 

18. పూర్ణ - విజయ - యాత్ర

కామకోటి పీఠాధిపతులు విజయయాత్రలు తఱచుచేస్తూ ఉండటం చరిత్రలో ప్రసిద్ధమైన విషయమే. ఇచట 'విజయ యాత్ర' అనే పదానికి అర్థాన్ని ఈ గ్రంథంలోనే 183వ పుటలో వివరించారు. అలాగే కామకోటి పీఠాధిపతులైన శ్రీ మహాదేవేంద్ర సరస్వతీ స్వామివారు క్రీ.శ. 1885వ సంవత్సరంలో ఆంధ్రప్రాంతంలో పర్యటించారు. ఆ సమయంలో వారు విజయనగరానికి విజయంచేసినపుడు వారచట 3-7-1885 నుండి 3-11-1885 వరకు ఉండిరి. ఆనందగజపతి మహారాజుగారి సమయమది.

తరువాత ఈ పీఠాధిపతులైన శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ శ్రీచరణులు క్రీ.శ. 1936లో ఈ విజయనగరమునకు విజయంచేశారు. 15-10-1936 నుండి 7-11-1936 వరకు ఇచట విజయంచేసి ఉన్నారు. శరన్నవరాత్ర్యుత్సవాదుల నిచట నిర్వర్తించారు.

శ్రీ ద్వారకా భమిడిపాటి వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రిగారు తమ తండ్రిగారు వ్రాసియుంచిన 1885 ప్రాంతమున శ్రీవారి విజయయాత్రా విశేషములకు సంబంధించిన విశేషములను, 1936 లో శ్రీవారి విజయయాత్రకు సంబంధించిన విశేషములను మొత్తము ఒక గ్రంథముగా సిద్ధపరచిరి. విజయనగర సంస్థానం పక్షాన శ్రీద్రావేజర్‌ మహారాణీవారి ఆదరాభిమానాలతో దానిని ప్రచురించారు. సుమారు 1/8 రాయల్‌సైజులో డెబ్బైపుటల గ్రంథమది. 1885 లోను, 1936 లోను ఈ పీఠాధిపతు లచటకు విజయం చేసినపుడు జరిగిన విశేషములు సంస్థాన 'దినచర్య' (Diary) నుండి గ్రహించి ఇందులో వ్రాసి ఉంచారు.

అంతేకాక కామకోటిపీఠ ఔన్నత్యం, పౌరాతన్యం మున్నగు అంశాలను వివరించే సుదీర్ఘమైన ఆంగ్లపీఠికకూడ ఇందులో ఉన్నది. ఇది 1937లో విజయనగరములోని శ్రీ వేదవ్యాస ప్రెస్సులో ముద్రింపబడి ప్రచురింపబడినది. ఇందులో ఆనాడు కామకోటి పీఠాధిపతులకు విజయనగర సంస్థాన వేదవిజ్ఞాన సభాపక్షాన సమర్పించిన స్వాగత పత్రమిచట ఉల్లేఖింపబడుచున్నది.

 

ఓమ్‌

''శ్రీ చంద్రమౌళీశ్వరో విజయతే''

శ్రీ 1ంంం జగద్గురు శ్రీ కాంచీకామకోటిపీఠాధిష్ఠాన

శ్రీ మచ్ఛంకర ధగవత్పాదానాం



శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ శ్రీచరణానాం

స్వాగతపత్రికా

శ్రీమదాచార్యచరణాః,

అపి స్వాగతం శ్రీచరణానాం శ్రీమత్పరమహంసపరి వ్రాజకాచార్యవర్యాణాం, శ్రీ శివరహస్యాదిప్రమాణసిద్ధ శ్రీమదాద్య శంకరాచార్యసిద్ధిస్థాన శ్రీ కంచికామకోటిపీఠమలంకుర్వాణానాం, నిరతశయ తపశ్చర్యా పవిత్రీకృత భారతవర్షాణాం అనుష్ఠానతో7పి స్వవశంవదీకృత సాంఖ్యయోగాద్వైతాది దర్శనతత్త్వానాంఅద్యశంకరభగవత్పాదీయ దశవిభాగా స్తర్గతేన సురేశ్వరాపరపర్యాయేంద్ర పదఘటితే నేంద్ర సరస్వతీసమాఖ్యేన యోగపట్టేన ''బ్రహ్మతాముపదిదేశ చతుర్భిర్వేద శేఖరవచోభిరముషై#్మ'' ఇతి శ్రీ మాధవీయ శంకరవిజయత శ్చత్వార్యపి మహావాక్యాన్యనుసంధేయానీతి నియమావలంబినం సురేశ్వరాచార్య ప్రవర్తితం సరస్వతీ సంప్రదాయ మలంకుర్వాణానాంచ జగద్గురు శ్రీమచ్ఛంద్ర శేఖరేంద్ర సరస్వతీ పదాంకిత శ్రీమచ్ఛంకరభగవత్పాదానాం :

పూజ్యపాదః |

శ్రీమన్తోహి పంచాననస్య శ్రీవిశ్వనాథ స్యోర్థ్వముఖా పరస్వరూప పరబ్రహ్మోపనిష త్ర్పతిపాద్యోర్ధ్వామ్నాయరూపం శ్రీ కాంచీనగరస్థ కామకోటిపీఠ మధితిష్ఠన్తో మహర్షిణాం తీర్థయాత్రాక్రమమేవా నాదిసంప్రదాయసిద్ధ మాదర్శరూప మద్యాపి స్వార్థం శకరటాదివాహనపరిత్యాగేన పరిపాలయంత స్సతతవేవ సంతుష్టాంతరంగా మందస్మితపూరిత దిగంతరాశ్చ సాంవ్రతమపి భారతవర్షం మహర్షీణాం స్థానమితి సిద్ధాంతం స్వీయే నాదర్శనచరితేన స్మారయంతి. గురువరేణ్యాః!

పంచాశద్వత్స రేభ్యః పూర్వం శ్రీమత్పరమేష్ఠిగురూణా మివ శ్రీచరణానా మప్యత్ర విద్యానగరే విజయనగరరాఖ్యయా సుప్రసిద్ధే యథా సంస్థాన మర్యాదం పురస్కృతయూ చిరకాంక్షితయా విజయయాత్రయూ కాష్ఠమౌనాది తపశ్చర్యానుష్ఠానపూర్వక నవరాత్రోత్సవానుష్ఠానేన ఋగ్వేదహోమ శ్రీవిద్యా హోమ మహాపురుషసూక్తహోమ సాంగత్రయీ పారాయణాది బహుతర వ్రతకలాప సధ్రీచీనేన పరమపావన జగదాంబా శ్రీ చంద్రమౌళీశ్వరపూజాది దర్శనేన సాధూపదేశామృతపానేన చైతన్న గరస్థ వేదవిజ్ఞానవర్థనీ పరిష దియం సనాతనధర్మైక ప్రవణా భగవతి శ్రీమదాచార్యచరణషు భాగవతేషు చ నిరతిశయభక్తి సంపన్నా పరోపకారధురంధరా శ్రీమత్పరిపోష్యసనాతనధర్మసభా స్వేకతమాచ శ్రీచరణానా మనుగ్రహేణ యది స్యాత్త దేవేదమస్మాక మేత త్పరిష దంతర రంగసదస్యానాం పరమ సౌభాగ్యం తదేవ చ చిరాభిలషీతం సుకృత మితి నాత్ర కో7వ్యతిశయోక్తిలేశో7పి.

అంత పున రిదం నివేద్యతే

శ్లో|| శ్రీకాంచీమఠ రాజపీఠకలితా న్సాష్ఠాంగ యోగన్వితా

న్విద్యామూర్తి ముపేత్య సర్వజగతే బోధామృతం యచ్ఛత |

దుస్సాదైక తనః క్రియావిలసితా నానందరూపాస్పదా

శ్రీమచ్ఛంకర చంద్రశేఖర యతీంద్రా న్వందామహే సాదరమ్‌||

ఇతి

శ్రీ విద్యానగర (విజయనగర) సంస్థాన స్థిత

వేదవిజ్ఞాన వర్ధనీ సభా ప్రతినిధయః.

1. మూలరామప్రియ: కానుకర్తి వేంకట

కృష్ణరాయః.

విజయనగరే 2. అకెల్ల సత్యనారాయణః

శ్రీ శాలివాహన 3. 'మహామహోపాధ్యాయ,

శతాబ్దే 1858 తమే తాతా సుబ్బరాయశాస్త్రి

ధాతృ నామసంవత్సరే 4. 'మహో పాధ్యాయ నౌడూరి వేంకటశాస్త్రి

అశ్వినశు క్లెయికాదశ్యాం 5. న్యాయరత్న పేరి

సోమవాసరేసమర్పితా లక్ష్మీనారాయణశాస్త్రి

26-10-1936 6. శ్రీమత్కోయిల కందాడై

వేంకటరామాచార్యః

'విజయనగర విజయయాత్ర' అనే గ్రంథాన్నే 26 పుటల్లో సంగ్రహంగా కూడ ప్రచురించారు.

ప్రకృతం ఈ దివ్యచరిత్ర గ్రంథంలో 33వ పుటలో శ్రీపుల్య ఉమామహేశ్వర శాస్త్రిగారి గ్రంథాన్ని గూర్చి ప్రస్తావించారు.

ఈ సందర్భంలో ముఖ్యంగా నాలుగు మాటలు చెప్పవలసి ఉన్నది. కంచికామకోటి పీఠాధిపతులు ప్రథమ విజయయాత్రా సందర్భంగా కాశీకి, కలకత్తాకు విజయం చేసినపుడు జరిగిన రెండు పండిత సభలను గూర్చి (పుట 235) పేర్కొనటం జరిగింది. కాశీలో వేదశాస్త్ర సారంగతులైన శ్రీశ్రీశ్రీ కరపాత్రీస్వామి ప్రభతి సన్న్యాసులు, అఖిల భారత వర్ణాశ్రమ స్వరాజ్య సంఘ కార్యదర్శి శ్రీ దేవనాయకాచార్య ప్రభృతి ధర్మనిష్ఠులైన మహాపండితులు కొన్ని దుష్టవాదాలను ఖండించారు. ఆదిశంకరుల కంచీపీఠాన్నత్యాన్ని సప్రమాణంగా నిరూపించారు. ఈ అంశాలన్నీ 'శాంకరపీఠ తత్త్వదర్శన'అనే గ్రంథంగా రూపొందించి అచటి పండితులు ప్రచురించారు. ఈ గ్రంథం కాశీలోని 'చౌకాంబా సంస్కృత సీరిసు' వారివద్ద లభిస్తుంది. వెల రూ. 2-50లు. చౌకాంబావారి 1966వ సంవత్సరంలోని 9 నెం|| క్యాటలాగు 39వ పుటలో 1008వ పుస్తకంగా వేదాంతగ్రంథాల పట్టికలో ఉన్నది. అలాగే కలకత్తాలోని భట్ట శ్రీనారాయణశాస్త్రి ప్రచారంచేసిన సంకోచాలను బెంగాల్‌ బ్రాహ్మణ మహాసభ పక్షాన 130 మంది మహామహులైన పండితులు ఏకవాక్యంగాను, నప్రమాణంగాను సోపపత్తికంగాను ఖండించారు. ఈ విషయం అంతా 9-5-1935న 'శ్రీ శంకరాచార్య దిగ్రేట్‌ అండ్‌ హీజ్‌ కనెక్షన్‌ విత్‌ కాంచీపురం'-అనే పేరుతో బెంగాలు బ్రాహ్మణ మహాసభవారు గ్రంథంగా ప్రచురించారు.

ఈ సభలతో ప్రత్యక్షసంబంధం కలవారు శ్రీదేవ నాయకాచార్యులవారు. వీరు, శ్రీ ద్రవిడ రాజేశ్వరశాస్త్రి ప్రభృతి మహాపండితులు ఇప్పటికి రెండు దశాబ్దాలకు పూర్వం విజయవాడలోని దుర్గాపురంలోని శ్రీబేతపూడి వీరశరభయ్యగారి గుళ్ళవద్ద జరిగిన అఖిలభారత వర్ణాశ్రమ స్వరాజ్యసంఘ అధినివేశనంలో పాల్గొన్నారు. అందులో శ్రీ పుల్య ఉమామహేశ్వరశాస్త్రి ప్రభృతి ఆంధ్రదేశ పండితులు కూడ వారితో సమానంగా ధర్మచర్చలు చేశారు. ఈ పండిత గోష్ఠుల దృశ్యాలు నేటికి నావంటి వారింకను మరువలేదు. ఈ సభలు పూర్తియైన తరువాత చాలాకాలమునకు శ్రీపుల్య ఉమామహేశ్వరశాస్త్రిగారు నవశంకర విజయార్యాసహస్రం' అనే గ్రంథాన్ని వ్రాశారు. ఈ సందర్భంలో దేవనాయకాచార్య ప్రభృతి మహాపండితులతో సంభాషణలు జరిపారు. గనుకనే శ్రీ ఉమా మహేశ్వరశాస్త్రిగారు 'కాశీ' పండిత సమావేశాలను గురించి తమ గ్రంథంలో స్పష్టంగా పేర్కొన్నారు. వారి నవశంకరవిజయాచార్యా సహస్రంలోని 99 పుటను చూచి విశేషాలు తెలిసికొనవచ్చును.

శ్రీవారి పూర్ణయాత్ర సంపూర్ణ విజయయాత్రగా అప్రయత్నంగానే రూపొందింది.

''జయతు సకలలోకై స్సేవ్యమానో గురుర్మే

Jagadguru divyacharithra   Chapters   Last Page