Jagadguru divyacharithra   Chapters   Last Page

 

10. కామకోటిపీఠం - జగద్గురుపరంపర

(ఆదిశంకరులనుండి నేటివరకు)

అద్వైతబ్రహ్మవిద్యకు అనాది సిద్ధమైన గురుపరంపర ఉన్నది. ఈ సంప్రదాయంలోనే అవిచ్ఛిన్నంగా ఈపరంపర ఇప్పటికి ప్రవర్తిల్లుతోంది. ఈ అద్వైతబ్రహ్మవిద్యను సదాశివుని వద్ద శ్రీమన్నారాయణుడు గ్రహించాడు. అతనివల్ల బ్రహ్మ, బ్రహ్మవల్ల వశిష్ఠుడు, అలాగే క్రమపరంపరలో అతనినుండి శక్తి తరువాత పరాశరుడు, వేదవ్యాసుడు, శుకుడు గ్రహించాడు. శ్రీ శుకయోగీంద్రుల వల్ల శ్రీగౌడ పాదాచార్యులవారి కిది లభించింది. వీరి శిష్యులు శ్రీగోవింద భగవత్పాదులు. వీరి శిష్యులు శ్రీఆదిశంకరులు. 'భజగోవిందం' అనే మకుటంగల స్తోత్రంలో వీరు తమ గురునామాన్ని తదభేదమైన భగవన్నామంతో ఏకరూపత నొందించి కీర్తించారు.

శ్రీ ఆదిశంకరు లధిష్ఠించిన ఈ కంచికామకోటిపీఠ ముద్రలో ఆదినుండి ఆయా ఆచార్యుల పేరుతో కలిపి ఈ క్రింది విధంగా పేర్కొనబడుతోంది-

'శ్రీచంద్రమౌళీశ్వర'

శ్రీః -చంద్రమౌళీశ్వరాయనమః

శ్రీమత్పరమహంస పరివ్రాజకాచార్య, శ్రీమచ్ఛంకర

భగవత్పాద ప్రతిష్టిత శ్రీకామకోటి పీఠాధిప

శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ సంయమీంద్రో విజయతే.'

ప్రస్తుతం ఆచార్యులైన శ్రీచంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామివారి పేరుతో కలిపి పై విధముగా పేర్కొనబడుచున్నది.

ఆదిశంకరులనుండి నేటివరకు సుమారు రెండువేల ఐదువందల సంవత్సరాలనుండి ఈ కంచికామకోటి పీఠాన్ని ఏయే మహాత్ములధిష్టించి అవిచ్ఛిన్నంగా నేటివరకు సంప్రదాయాన్ని, ధర్మాన్ని పరిరక్షిస్తూ లోకోద్ధరణం చేస్తున్నారో ఇప్పుడు మనం తెలుసుకోవచ్చును.

ఈ గురుపరంపరనుగూర్చి తెలిసికోవటానికి అధికారికమైన ప్రధానాధారాలు రెండున్నవి. 1. పుణ్యశ్లోకమంజరి, 2. గురురత్నమాలిక * ఇందు మొదటిది ఆయా పీఠాధిపతులు సిద్ధిపొందినపుడు వ్రాసి చదువబడిన శ్లోకసంపుటి. రెండవది శ్రీ సదాశివబ్రహ్మేంద్ర సరస్వతీ స్వామివారు ఆదిశంకరుల నుండి తమ గురువులవరకు ఉన్న గురుపరంపరను, వారి చరిత్రను వర్ణిస్తూ వ్రాసిన గ్రంథం. వీని వ్యాఖ్యగా ఉన్న 'సుషమ'లో ఆత్మబోధేంద్ర సరస్వతి మరికొన్ని వివరములు వ్రాశారు. కనుక ఇవి చారిత్రకంగా అధికారికమైన అంశాలు.

1. ఆదిశంకరులు : (బి.సి. 509-477) కంచికామకోటి పీఠాధిష్ఠితులైన మొట్టమొదటి ఆచార్యులు. ఈ పీఠాన్ని శ్రీ ఆచార్యుల వారు బి.సి. 482 లో సిద్దార్థి సంవత్సర వైశాఖశుక్ల పూర్ణిమనాడు

___________________________________________ * ఈ 'గురురత్నమాల' అనే గ్రంథం 'సుషమ' వ్యాఖ్యతో నాగరి లిపిలో ముద్రింపబడిఉన్నది. 200 పుటలుగల గ్రంథం, శ్రీ కామకోటికోశస్థానం-4 ఫ్రాన్సిస్‌జోసెఫ్‌ స్ట్రీట్‌-మదరాసు 1 లో లభిస్తుంది. వెల రు. 2-00 లు.

స్థాపించినట్లు తెలియుచున్నది. కాగా శ్రీ ఆచార్యులవా రీ పీఠాధిపతులుగా ఐదు సంవత్సరాలుండి కంచిలో బి.సి. 477 లో రక్తాక్షి సంవత్సర వైశాఖ శుద్ధ ఏకాదశినాడు సిద్ధిపొందారు.

ఇదివరలో పేర్కొనినవిధంగా ఇకమీదట ఈ గురు పరంపర లోనివారి నామముల చివర - ఈపీఠ సంప్రదాయం ప్రకారం 'ఇంద్రసరస్వతి' అని కలిపి చదువుకోవాలి.

2. సురేశ్వరాచార్యులు : ఆదిశంకరుల అనంతరం వీరే పీఠానికి జగద్గురువులు. కాని బ్రహ్మచర్యంలో ఆశ్రమ స్వీకారం చెయ్యకపోవటంచే శ్రీ సర్వజ్ఞాత శ్రీచరణులు ఆచార్యులవారి యోగలింగ శ్రీ మేరువుల నర్చించటానికి నియమింపబడినారు. శ్రీసురేశ్వరులు భాష్య ప్రవచనాదులు చేస్తూ పీఠ పరిపాలాన్ని నిర్వహించారు. శ్రీ ఆచార్యుల అనంతరం వీరు 70 సంవత్సరాలు పీఠాన్ని నిర్వహించారు. వీరు బి.సి. 407 లో భావసంవత్సర జ్యేష్ఠ శుద్ధ ద్వాదశినాడు కంచిలోనే సిద్ధిపొందారు. వీరి తరువాత కంచి పీఠాధిపతులందరు బ్రహ్మచర్యంలో ఆశ్రమ స్వీకారంచేసి పీఠాన్ని అధిష్ఠించినవారే.

3. సర్వజ్ఞాత్మ : వీరి అవతరణం : తామ్రపర్ణి : పూర్వాశ్రమనామం మహాదేవ, తండ్రిపేరు వర్ధనుడు. వీరు మిక్కిలి బాల్యం లోనే బ్రహ్మచర్యంలో ఆశ్రమస్వీకారం చేసి ఆదిశంకరుల అనంతరం శ్రీయోగలింగ శ్రీమేరువులను అర్చిస్తూ శ్రీసురేశ్వరులవద్ద భాష్యాదులు అధ్యయనం చేశారు. వీరు 'సంక్షేపశారీరకం' అనే గ్రంథాన్ని రచించారు. అందులో శ్రీసురేశ్వరులు తమ గురువులని పేర్కొన్నారు. శ్రీ సురేశ్వరుల అనంతరం 42 సంవత్సరాలు పీఠాధిపత్యం వహించారు. నూటపందొమ్మిది సంవత్సరాలు జీవించారు. వీరుకూడ కంచిలోనే బి.సి. 364 లో వైశాఖ బహుళ చతుర్దశినాడు సిద్ధిపొందారు.

4. సత్యబోధ : (364-268 బి. సి. = 96) అవతరణం : చేరప్రాంతంలో అమరావతీ తీరం ; సాంఖ్య, జైన బౌద్ధులతో విశేషంగా వాదించి విజేతలైనారు. వీరి రచన పాదక-శతం. వీరు కంచిలో నందన వైశాఖ బహుళ అష్టమినాడు సిద్ధిపొందారు.

5. జ్ఞాననంద : (268-205 బి. సి. = 63) పూర్వాశ్రమనామం : జ్ఞానోత్తమ, తండ్రిపేరు నాగేశుడు, ద్రావిడ బ్రాహ్మణులు, వీరు గొప్ప తార్కికులు, వీరు శ్రీ సురేశ్వరాచార్యులవారి 'నైష్కర్మ్యసిద్ధి' అనే గ్రంథానికి 'చంద్రిక'అనే వ్యాఖ్య వ్రాశారు. వీరు కంచిలో మన్మథ మార్గశిర శుద్ధ సప్తమినాడు సిద్ధిపొందారు.

6. శుద్ధానంద : (205-124 బి. సి. = 81) అవతరణం వేదారణ్యం. వీరు భిన్న మార్గానుయాయుల్ని జయించి వైదిక మార్గాన్ని సుప్రతిష్ఠితం చేశారు. వీరు కంచిలో నలసంవత్సర జ్యేష్ఠ శుద్ధ షష్ఠినాడు సిద్ధిపొందారు.

7. అనంతానంద : (124-55 బి. సి. = 69) అవతరణం : చేరప్రాంతం ; వీరు అలౌకిక సారస్వతశక్తి సంపన్నులు ; వీరు శాంకరభాష్యానికి, సురేశ్వరుల వార్తికానికి వ్యాఖ్యలు వ్రాశారు. వీరు శ్రీశైలంలో క్రోధన సంవత్సర వైశాఖ కృష్ణ నవమినాడు సిద్ధిపొందారు.

8. కైవల్యానంద : (బి.సి. 55 ఎ.డి. 28 = 83) వీరికే కైవల్యయోగి అనే ప్రసిద్ధి ఉన్నది. అవతరణం : తిరుపతి ; ఆంధ్రులు. వీరి ఆధ్వర్యంలోనే కృపాశంకరులు సుభట విశ్వరూపస్వామిని, అపుడు ఖాళీగా ఉన్న శృంగేరీపీఠానికి పంపించారు. వీరు కంచిలోని మండన మిశ్రాగ్రహారంలో సర్వధారి మకర మాసంలో ప్రతిపత్తిధినాడు పరమ పదించారు.

9. కృపాశంకర : (క్రీ.శ. 28-69 = 41) అవతరణం : ఆంధ్రదేశం : ఆంధ్రులు. పూర్వాశ్రమనామం గంగేశోపాధ్యాయులు. ఆదిశంకరుల తరువాత పీఠ చరిత్రలో స్వర్ణయుగం వీరి ఆధ్వర్యంలో ఆరంభ##మైంది. ఆదిశంకరులతో ఆరంభ##మైన అధ్యాత్మిక పునరుజ్జీవనాన్ని మరల దక్షిణ భారతంలో వీరు విశేషంగా ఉజ్జీవింపజేశారు. కాశి, కంచి, తిరువత్తియూరు మున్నగు క్షేత్రాలలో యంత్రప్రతిష్ఠలు చేశారు. వింధ్య పర్వతావళిలో విభవ సంవత్సర కార్తీక బహుళ తదియ నాడు సిద్ధిపొందారు.

10. సురేశ్వర : (క్రీ.శ. 69-127 = 58) అవతరణం : మహారాష్ట్ర ప్రాంతం. పూర్వాశ్రమ నామం : మహేశ్వర, తండ్రిపేరు ఈశ్వర పండితుడు. వీరు కంచిలో ఆక్షయసంవత్సర అషాడ పూర్ణిమనాడు సిద్ధిపొందారు.

11. శివానందచిద్ఘన : (127-172 = 45) అవతరణం : కర్ణాటక ప్రాంతం. వీరు వృద్ధాచలంలో విరోధికృత్‌ వత్సర జ్యేష్ఠశుద్ధ దశమినాడు సిద్ధిపొందారు.

12. చంద్రశేఖర | : (172-235 = 63) అవతరణం : పాలారు నదీతీరంలోని గ్రామం. వీరు తమ పీఠాధిపత్యం, పరిపాలనా కార్యక్రమాలను నిర్వహించుటానికి తమ శిష్యుల్ని నియోగించి తాము 'సార్వభౌమయోగసమాధి' నిష్ఠులై ఉండేవారు. 63 సంవత్సరాల అనంతరం తుదకు శేషాచలం పర్వతాలలోని ఒక గుహలో ఆనంద సంవత్సర ఆషాడ శుద్ధ నవమినాడు అదృశ్యులైనారు. మరల వారి దర్శనం కాలేదు.

13. సచ్చిద్ఘన : (235 -272 = 37) అవతరణం : గడిలం నదీతీరాన చిన్న గ్రామం. వీరు పూర్వం వృషభయోగీశ్వరుల్లాగా తమ మఠాధిపత్యం మొదలైన కార్యక్రమాన్ని తమ తరువాత ఆచార్యుల కప్పగించి కంచిపరిసరాల్లో 'అవధూత'గా తిరుగుతూ ఉండేవారు. అలా ముపై#్పరెండు సంవత్సరాలు జరిగిన తరువాత కంచిలోనే ఒక దేవాలయంలో అదృశ్యులై ఒక శివలింగాకృతిని పొందారు. అది ఖర సంవత్సర మార్గశిర శుద్ధ పాడ్యమి.

14. విద్యాఘన | : (272-317 = 45) అవతరణం : ఆంధ్రప్రాంతం ; ఆంధ్రులు. శ్రీ భాపన్న సోమయాజిగారి కుమారులు. వీరు మంత్రశాస్త్ర పారంగతులు. వీరు అగస్త్య పర్వత సమీపంలోని మలయపర్వతంలో ధాత సంవత్సర మార్గశిర అమావాస్యనాడు సిద్ధిపొందారు.

15. గీష్పతిగంగాధర : (317-329 = 12) వీరు ఆంధ్రులు వీరి తండ్రి పేరు కంచి భద్రగిరి. వీరి అగస్త్య మహర్షిస్వయంగా పంచదశాక్షరీ మహామంత్రోపదేశం చేశారు. కంచిలోనే అగస్త్యాశ్రమం ఉన్నదని శ్రీవిద్యకు ఆయన ప్రధానుడని ఈ గ్రంథంలో మొదట స్పష్టము చేయబడినది. వీరు పాండిత్య జ్ఞాన వైభవాలకు మిక్కిలి ప్రసిద్ధి పొందారు. వీరు అగస్త్య పర్వతంలో సర్వధారి చైత్ర శుద్ధ పాడ్యమి నాడు సిద్ధిపొందారు.

16. ఉజ్జ్వల శంకర : (329-367 = 38) అవతరణం : మహారాష్ట్రప్రాంతం. వీరు దిగ్విజయయాత్ర చేశారు. సింధుప్రాంతం వరకు వ్లుెచ్ఛ జైన బౌద్ధవాదుల్ని ఖండించారు. వీరు కాశ్మీరం వెళ్ళి అక్కడ (కలిశకం 3468) అక్షయ సంవత్సర వైశాఖ శుద్ధ అష్టమి నాడు కోలాపురిలో సిద్ధిపొందారు. అందువల్లనే అది 'ఉజ్జ్వల' మహాయతిపురం' అనే పేరు పొందింది.

17. గౌడసదాశివ : (367-375 = 8) వీరికే బాలగురువులనే పేరున్నది. వీరి తండ్రి దేవమిశ్ర. కాశ్మీర సంస్థానంలో బ్రాహ్మణమంత్రి. ఈ బాలగురువులు అతిబాల్యంనుంచే 'సర్వమాత్మేతి సత్యం' అని పదేపదే పలుకుతూ ఉండేవారు. చిన్నతనంలోనే వీరు పై ఉజ్జ్వల శంకరులకు శిష్యులైనారు. వీరు బ్రహ్మసూత్రభాష్యాన్ని 'యాభై'సార్లు ప్రవచనం చేశారు. వీరున్నచోట నిత్యం సహస్ర బ్రాహ్మణ సమారాధన జరిగేది. వీరు భారతదేశం అంతటా విజయయాత్ర జరిపారు. బౌద్ధాన్ని ఖండించారు. వీరు నాసికాత్ర్యంబకంవద్ద భావ సంవత్సర జ్యేష్ఠ శుద్ధ దశమినాడు సిద్ధిపొందారు.

18. యోగితిలకసుర : (375-385 = 10) అవతరణం: మహారాష్ట్ర ప్రాంతం. వీరు చార్వాకాన్ని విశేషంగా రూపుమాపారు. 'ఉజ్జయిని'కి సమీపంలో తారణ సంవత్సర మార్గశిర శుద్ధ పాడ్యమినాడు సిద్ధిపొందారు.

19. మార్తాండ విద్యాఘన లేక విద్యాఘన || (385-398 = 13) వీరికే సూర్యదాసస్వామి అనే పేరున్నది. వీరు తమ కేర్పడిన తీవ్రమైన చర్మవ్యాధిని నిత్యం 1008 సూర్యనమస్కారాలు చేసి పూర్తిగా నిర్మూలమయ్యేట్టు చేసికొన్నారు. వీరు గోదావరీ తీరంలో హేవిలంబి సంవత్సర భాద్రపద కృష్ణ నవమినాడు సిద్ధిపొందారు.

20. శ్రీ మూక శంకర, లేక, శంకర IV : (398-437 = 39) వీరు జన్మచే మూగవారగుటచే శ్రీ విద్య పూర్ణ స్వరూపులైన పై శ్రీ విద్యాఘనస్వాముల అనుగ్రహంచేత, వాక్సుద్ధి లభించింది. వెంటనే వేదాలు కరతలామలకము లైనాయి. తరువాత సన్యాసించి పీఠాన్ని అధిష్టించారు. మాతృ గుప్తుని తర్వాత కాశ్మీర ప్రభువైన ప్రవరసేనుడు వీరిని సేవించాడు. వీరు 'మూకపంచశతి' అనే కామాక్షి స్తోత్రాన్ని రచించారు. ఇది ఐదువందల శ్లోకాలసంపుటి. లీలాశుకుల 'కృష్ణకర్ణామృతం' వంటిది. 'ప్రాచీన శంకర విజయం' అనే గ్రంథం వీరిచే వ్రాయబడినదని తెలుస్తోంది. వీరు గోదావరి తీరంలో ధాత సంవత్సర శ్రావణ పూర్ణిమనాడు సిద్ధిపొందారు.

21. సార్వభౌమ చంద్రశేఖర : (437-447 = 10) చంద్రశేఖర |. వీరి అవతరణం : కొంకణప్రాంతం. పూర్వాశ్రమనామం మాతృగుప్త. వీరు కామకోటి పీఠంలో నిత్యం చందనంతీసి శ్రీ మేరువు నర్చించటానికి సిద్ధంచేశేవారు. వీరు తమ గురుకృప (మూకశంకరులు) వల్ల పాండిత్యాన్ని, జ్ఞానసిద్ధిని పొందారు. మహాకవులైనారు. ఆశ్రమస్వీకారం చేసి 10 సంవత్సరాలు పీఠాధిపత్యం వహించి వ్యయ సంవత్సర శ్రావణ కృష్ణ అష్టమినాడు కాశీలో సిద్ధిపొందారు.

22. పరిపూర్ణ బోధ : (447-481 = 34) అవతరణం : రత్నగిరి. వీరు వైద్యయోగశాస్త్రాల్లో నిష్ణాతులు. వీరు రౌద్రి సంవత్సర కార్తీక శుద్ధ నవమినాడు జగన్నాధ క్షేత్రానికి సమీపంలో సిద్ధిపొందారు.

23. సచ్చిత్సుఖ : (481-512 = 31) అవతరణం : ఆంధ్రప్రాంతంలోని శ్రీకాకుళం. తండ్రి సోమనార్యులు, పూర్వాశ్రమనామం గిరీశం. వీరు గొప్ప సుబ్రహ్మణ్యోపాసకులు. వీరు సుప్రసిద్ధ జ్యోతిశ్శాస్త్రజ్ఞుడు, నాస్తికుడునైన 'ఆర్యభట్టు'తో వాదించి అతణ్ణి వైదికమతామయాయిగా చేశారు. వీరు ఖరసంవత్సర వైశాఖ శుద్ధ సప్తమి నాడు జగన్నాధ క్షేత్రానికి సమీపంలో సిద్ధిపొందారు.

24. సచ్చిత్సుఖ | (512-527 = 15) అవతరణం : కొంకణ ప్రాంతం. వీరు పరాభవ సంవత్సర శ్రావణ శుక్ల నవమినాడు రత్నగిరి సమీపంలో సిద్ధిపొందారు.

25. సచ్చిదానందఘన : (527-548 = 21) వీరికే సిద్ధ గురువులనే ప్రసిద్ధి ఉన్నది. అవతరణం : శ్రీముష్ణం. వీరు భారత వర్ష అంతటా మూడుమారులు విజయయాత్ర చేశారు. వీరు గొప్ప యోగశక్తి సంపన్నులు. వీరికి జంతుభాష తెలిసికొనే శక్తి ఉండేది. వీరు తమ యోగశక్తి ప్రభావంతో ప్రభవ సంవత్సర ఆషాడ శుద్ధపాడ్యమి నాడు గోకర్ణ క్షేత్రంలో లింగాకృతిని పొందారు.

26. ప్రజ్ఞాఘన : (548-564 = 16) అవతరణం : పినాకిని నదీతీరంలోని గ్రామం. వీరు స్వభాను సంవత్సర వైశాఖ శుద్ధ అష్టమినాడు కంచిలో సిద్ధిపొందారు.

27. చిద్విలాస : (564-577 = 13) అవతరణం : హస్తిగిరి వీరు ఆంధ్రులు. దుర్ముఖి సంవత్సరాదినాడు కంచిలోనే సిద్ధిపొందారు.

28. మహాదేవ | : (577-601 = 24) అవతరణం : భద్రాచలం. మైధిల బ్రాహ్మణ వంశం. వీరి పూర్వులు ఆంధ్ర ప్రాంతానికి ప్రవాసం వచ్చారు. వీరు కంచిలోనే రౌద్రివత్సర ఆశ్విన కృష్ణదశమినాడు సిద్ధి పొందారు.

29. పూర్ణబోధ | (601-618 = 17) వీరు కంచిలోనే ఈశ్వర సంవత్సర శ్రావణ శుద్ధ ఏకాదశినాడు సిద్ధిపొందారు.

30. బోధ | (618-6555 = 37) వీరు ఆంధ్రులు. పూర్వాశ్రమనామం బాలయ్య. తండ్రిపేరు కాళహస్తి. వీరు కంచిలో ఆనందవైశాఖ కృష్ణ చతుర్థినాడు సిద్ధిపొందారు.

31. బ్రహ్మానందఘన | (655-668 = 13) : వీరికే శీలనిధి అనే పేరున్నది. అవతరణం : గడిలం నదితీరాన గ్రామం. వీరు ఆరు దర్శనాల్లోను విశేష పాండితీ ప్రాభవ సంపన్నులు. వీరు శిష్యులు చిదానంద ఘనేంద్ర సరస్వతిని, వీరిని, దర్శించి కాశ్మీర ప్రభువు లలితాదిత్యుడు వీరి ఆశీస్సులను పొందాడు. కాశ్మీర ప్రభువు దక్షిణ భారతదేశానికి వచ్చినట్లు తెలసుస్తోంది. సుప్రసిద్ధ సంస్కృత నాటక కర్త భవభూతి మహాకవి వీరి ఆశీస్సులను పొందాడు. ఈతడు తన 'మహాపురుష విలాస' గ్రంథంలో ఈ ఉభయ గురువుల్ని పేర్కొన్నాడు. శ్రీ బ్రహ్మానంద ఘనేంద్ర సరస్వతి కంచిలోనే ప్రభవ సంవత్సర జేష్ఠ శుద్ధ ద్వాదశినాడు సిద్ధిపొందారు.

32. చిదానందఘన || : (668-672 = 4)వీరు గొప్ప లుంబికా యోగ సిద్ధులు. వీరు కేవలం పండుటాకుల్ని ఆహారంగా స్వీకరించేవారు. అనగా పర్ణవృత్తి నవలంభించారు. వీరు కంచిలో ప్రజోత్పత్తి సంవత్సర మార్గశిర శుద్ధ షష్ఠినాడు సిద్ధి పొందారు.

33. సచ్చిదానంద || : (672-692 = 20) వీరికే 'భాషా పరమేష్టి' అని పేరున్నది. అవతరణం : చంద్రభాగ నదీతీరాన సామాన్య గ్రామం. వీరికి పలుభాషల్లో బహుముఖ పాండితీప్రాభవ సంపన్నత ఉండేది. వీరు ఖర సంవత్సర భాద్రపదకృష్ణ షష్టినాడు కంచిలో సిద్ధిపొందారు.

34. చంద్రశేఖర : (692-710 = 18) వేగవతీ నదీతీరానగల గ్రామంలో అవతరణం. వీరు విశేషంగా విజయయాత్రలు చేశారు. వీరొకపుడు అరణ్యంలో అగ్నిజ్వాలల మధ్యలో అలమటిస్తున్న బాలుణ్ణి సాహసంతో రక్షించారు. కాశ్మీర ప్రభువులైన లలితాదిత్యుని మంత్రి, ప్రఖ్యాత బౌద్ధుడైన చంకుణుణ్ణి వాదంలో పరాభూతుణ్ణి గావించారు. వీరు కంచిలో సౌమ్య సంవత్సర మార్గశిర అమావాస్యనాడు సిద్ధి పొందారు.

35. బహురూపచిత్సుఖ || (710-737 = 27) అవతరణం, వేదాచలం. వీరు చాలాకాలం సహ్యపర్వతాల్లోని కావేరముని గుహల్లో తపస్సు చేశారు. కావేరీనదికి ప్రక్కన వీరు సహ్యపర్వతాల్లోనే ధాత సంవత్సర ఆషాడ శుద్ధ షష్టి నాడు సిద్ధి పొందారు.

36. చిత్సుఖానంద (737-758 = 21) వీరినే చిదానంద అని కూడ అనేవారు. అవతరణం పాలార్‌ నదీతీరం. వీరు కంచిలోనే హేవిలంబి సంవత్సర అశ్వయుజ పూర్ణిమ నాడు సిద్ధి పొందారు.

37. విద్యాఘన ||| : (758-788 = 30) వీరు అనేక దుష్టశక్తుల బారినుండి ధర్మాన్ని రక్షించటానికి విశేషకృషి చేశారు. వీరు చిదంబరంలో ప్రభవ సంవత్సర పుష్యశుద్ధ ద్వితీయ నాడు సిద్ధిపొందారు.

38. శంకర V లేక అభినవ శంకర : (788-840 = 52) వీరి విజయ చరిత్రను వాక్పతిభట్టు తన 'శంకరేంద్ర విలాసం' లో పేర్కొనటం జరిగింది. వీరినే ధీరశంకరేంద్ర సరస్వతి అని కూడ అంటారు. అవతరణం : చిదంబరం వద్ద తిల్లాయివనం. తండ్రి విశ్వజిత్‌, తల్లి విశిష్ట. వీరు మాతృగర్భంలో ఉండగానే పితృ వియోగం జరిగింది. వ్యాఘ్రపాదముని దంపతులు వీర్ని పెంచి ఐదవయేట ఉపనయనం వారే చేశారు. వేదశాస్త్రాల్ని అధ్యయనం చేయించారు. వీరికి బాల్యంలోనే సన్యసించాలని సంకల్పం కల్గింది. వీరికి పూర్వ పీఠాధిపతులైన విద్యాఘనులు తగిన శిష్యునికొఱకు చూస్తూ ఉండగా దైవ ప్రేరణచే వారు చిదంబరం వెళ్ళారు. అక్కడ వీరిని స్వీకరించారు. వీరు ఆదిశంకరుల అవరావతారం. భారతవర్షం అంతటా దిగ్విజయయాత్ర చేశారు. దుర్మతాల్ని సంపూర్ణంగా ఖండించారు. కాశ్మీరంలోని శారదాదేవిని అర్చించారు. అక్కడి సర్వజ్ఞ పీఠాన్ని అధిష్టించారు. ఆదిశంకరుల చరిత్రకు వీరి చరిత్రకు చాలా సామ్యాలున్నాయి. కనుకనే చాలామంది చరిత్రకారులు, గ్రంథకర్తలు వీరే ఆదిశంకరులని భ్రాంతిపడ్డారు. అందువల్లనే ఆదిశంకరులు చిదంబరంలో జన్మించారని తండ్రి విశ్వజిత్తని ఇలాంటి వ్రాతలు ప్రభవించాయి. అంతేకాక వీరు తుదిలో హిమాలయాల్లోని ఆత్రేయ పర్వతంలో దత్తాత్రేయ గుహలో సిద్ధార్థి సంవత్సర ఆషాడ బహుళ అమావాస్య నాడు ప్రవేశం చేశారు. దీనివల్ల కూడ చాలామంది గ్రంథకర్తలు బి.సి. 477లో కంచిలో సిద్ధిపొందిన ఆచార్యులవారిని గూర్చి - ఆదిశంకరులు హిమాలయాల్లో గుహప్రవేశం చేశారని వ్రాశారు. వీరు కాశ్మీర ప్రభువు ఆస్థాన విద్వాంసుల్లో ఉద్ధండ పండితుడైన వాక్పతి భట్టును ఓడించి అచటి సర్వజ్ఞ పీఠాధిరోహణం చేశారు.

39. సచ్చిద్విలాస (840-873 = 33) అవతరణం : కన్యాకుబ్జం. పూర్వాశ్రమనామం : శ్రీపతి, తండ్రి : కమలేశ్వరుడు. వీరు చాలాకాలం పద్మపురంలో ఉన్నారు. కాశ్మీరంలో అవంతివర్మ ఆశ్రయంలో ఉన్న 'ధ్వని' కర్త ఆనంద వర్ధనుడు వీరిని పరమ పూజ్యభావంతో సేవించాడు. వీరు కంచిలో నందన సంవత్సర వైశాఖ పూర్ణిమనాడు సిద్ధిపొందారు.

40. మహాదేవ ||| : (873-915 = 42) 'శోభన' లేక 'ఉజ్జ్వల' అనే ఉపనామంకూడ వీరికి ప్రసిద్ధమైంది. అవతరణం : కర్ణాటక ప్రాంతం. వీరు అతి సుకుమార సౌందర్య మూర్తులుగా ఉండటంచేత 'శోభన, ఉజ్జ్వల' నామాలు కలిసినవి. వీరు భావ సంవత్సర వైశాఖ శుద్ధ షష్టినాడు సిద్ధిపొందారు.

41. గంగాధర || : (915-950 = 35)అవతరణం : భీమానదీతీరం. వీరు కర్ణాటక బ్రాహ్మణులు. శ్రీవిద్యా పరిపూర్ణ మూర్తులు. కవి, ప్రభువునైన రాజశేఖరుడు తాను బాలరామాయణంపై వ్రాసిన మూడు నాటకాలను వీరికి అంకితం చేశాడు. ఆ రాజు అంధుడు కాగా ఈ గుర్వనుగ్రహం అతనికి దృష్టిని ప్రసాదించింది. వీరు సౌమ్యవత్సర శ్రావణ శుద్ధ పాడ్యమినాడు కంచిలో సిద్ధిపొందారు.

42. బ్రహ్మానందఘన || (950-978 = 28) తండ్రి సుబ్రహ్మణ్యం. పూర్వాశ్రమనామం : నరసంభట్టు. వీరు కంచిలోనే ఈశ్వర సంవత్సర కార్తీక శుద్ధ అష్టమినాడు సిద్ధిపొందారు.

43. ఆనందఘన : (978-1014 = 36)అవతరణం : తుంగభద్రా నదీతీరం. తండ్రి సుదేవభట్టు. పూర్వాశ్రమ నామం శంకర పండిత. వీరు కంచిలో ప్రమాదీచవత్సర చైత్ర శుద్ధనవమినాడు సిద్ధిపొందారు.

44. పూర్ణబోధ || : (1014-1040 = 26) అవతరణం : కర్ణాటకం. తండ్రి శివ. పూర్వాశ్రమనామం హరి. వీరు కంచిలో ప్రమాదివత్సర భాద్రపద బహుళ త్రయోదశినాడు సిద్ధిపొందారు.

45. పరమశివ | (1040-1061 = 21) తండ్రిపేరు శివసాంబ పండితుడు. పూర్వాశ్రమనామం శ్రీకంఠుడు. వీరు చాలకాలం సహ్యపర్వత గుహలో ఉండేవారు. సోమదేవు డనే శిష్యుడుమాత్రం వీరి దగ్గర ఉండేవాడు. వీరు కంచిలో శార్వరివత్సర ఆశ్వయుజ శుద్ధ సప్తమినాడు సిద్ధిపొందారు.

46. సాంద్రానందబోధ లేక బోధ || (1061-1098 = 37) పూర్వాశ్రమనామం సోమదేవుడు. వీరు పూర్వాశ్రమంలో పై 45వ పీఠాధిపతులకు విశేషంగా సేవచేస్తూ ఉండేవారు. వీరు 'కథాసరిత్సాగరాన్ని' రచించారు. ధారానగర చక్రవర్తి వీరికి విలువైన మణులు పొదిగిన ముత్యాలహారాన్ని అర్పించాడు. అనేకమంది ప్రభువులు వీరికి ముఖ్యశిష్యులు. వారి సహాయంతో మహమ్మదీయ దండయాత్రనుండి కంచిని రక్షించారు. వీరు అరుణాచలక్షేత్రంలో ఈశ్వరవత్సర ఆషాడ అమావాస్యనాడు సిద్ధిపొందారు.

47. చంద్రశేఖర ||| (1098-1166 = 68) వీరినే చంద్ర చూడేంద్ర సరస్వతి అనేవారు. అవతరణం : కుండినదీతీరం. పూర్వాశ్రమనామం శ్రీకంఠ. ఆంధ్రులు-ఇంటిపేరు పొప్పిల్లు. వీరు తమ విజయయాత్రతో సుప్రసిద్ధజైనుడు కుమార పాలచరిత్ర వ్రాసిన, విద్యాలోల కుమారపాలుని ఆస్థానంలోఉన్న, హేమచార్యుణ్ణి శాస్త్రచర్చలో జయించారు. శ్రీ కంఠచరిత్ర వ్రాసిన మంఖకవి; ప్రబోధచంద్రోదయం, గురువిజయం వ్రాసిన కృష్ణమిశ్రుడు; ప్రసన్నరాఘవం, చంద్రాలోకం. భక్తికల్పలతిక వ్రాసిన జయ దేవకవి; వైద్యాభిధాన చింతామణి వ్రాసిన కాశ్మీరవైద్యుడు సుహలుడు చాలాకాలం వీరి ననుగమించి సేవించారు. జయదేవుడు తన భక్తికల్పలత కావ్యంలో ఈ గురువుల విజయవృత్తాన్నిలా వ్రాశాడు-

శ్రీ చంద్రచూడ చరణాంఛ్రిత కాంచీపీఠాన్‌

సర్వజ్ఞ శేఖర మణిన్‌ సతతం శ్రయామః |

యద్వా గనర్గల గలత్సరసోక్తివర్షైః

ఆచార్య హేమవదవహ్ని రపి వ్యరంసీత్‌ ||

కాశ్మీర ప్రభువైన జయసింహుడు వీరిని సేవించి అనుగ్రహాన్ని పొందాడు. వీరు అరుణాచలక్షేత్రంలో పార్థిన చైత్ర అమావాస్యనాడు సిద్ధిపొందారు.

48. అద్వైతానందబోధ : (1166-1200 = 34) వీరినే చిద్విలాసేంద్ర సరస్వతి అనికూడ అనేవారు. అవతరణం : పినాకినీ నదీతీరం. తండ్రి ప్రేమేశుడు. పూర్వాశ్రమనామం : సీతాపతి ఖండన ఖండఖాద్యం, నైషధకావ్యం వ్రాసిన శ్రీహర్షుణ్ణి శాస్త్రచర్చలో ఓడించి తమ శిష్యునిగా స్వీకరించారు. తంత్రకర్తయైన అభినవ గుప్తాచార్యుణ్ణి జయించారు. బ్రహ్మ విద్యాభరణం. శాంతి వివరణం. గురుప్రదీపం. అనే గ్రంథాలను రచించారు. వీరు చిదంబరలో దేవాలయంలోని మోక్షలింగాన్ని అర్చిస్తూ చిదాకాశరూపాన్ని పొందారు (సిద్ధిపొందారు). అది సిద్ధార్ధివత్సర జ్యేష్ఠ శుద్ధ నవమి.

49. మహాదేవ || (1200-1247 = 47) అవతరణం : తంజావూరు జిల్లా ఛాయావసం, తండ్రి అచ్యుతుడు, పూర్వాశ్రమనామం గురుమూర్తి. వీరు గొప్ప పరాశక్తి ఉపాసకులు, కాని కేవల తంత్రమార్ధగాములు కారు. వీరు గాదిల నదీతీరాన పరాభవవత్సర శ్రావణ బహుళ అష్టమినాడు సిద్ధిపొందారు.

50. చంద్రచూడ || (1247-1297 = 50) తండ్రి అరుణగిరి. పూర్వాశ్రమనామం గంగేశుడు. వీరు తమ గురువులైన మహాదేవుల వలెనే శాక్తసిద్ధులై ఆ పరదేవతాను గ్రహాన్ని, శాంతిలాభాన్ని పొందటం కోసం కోటి సంఖ్యాకమైన పవిత్ర హోమవిధిని నిర్వర్తించారు. వీరు గాదిల నదీతీరాన దుర్ముఖి సంవత్సర జ్యేష్ఠ శుద్ధ షష్ఠినాడు సిద్ధిపొందారు.

51. విద్యాతీర్థ : (1297-1385 = 88) తండ్రిపేరు; సారంగపాణి అవతరణం : బిల్వారణ్యం. పూర్వాశ్రమనామం సర్వజ్ఞ విష్ణు. వీరు 73 సంవత్సరాలు కంచిలో ఉన్నారు. 15 సంవత్సరాలు హిమాలయాల్లో తపస్సు చేశారు. వేదభాష్యం వ్రాసిన సాయణాచార్యుడు. ఆయన సోదరుడు, తరువాత విద్యారణ్యస్వామిగా ప్రసిద్ధులైన మాధవాచార్యులు, సుప్రసిద్ధ వైష్ణవ పండితులు వేదాంత దేశికులు, హరిహర రాయలు, బుక్కరాయలు, శృంగేరి మఠాన్ని మరల పూర్వస్థితికి తేవటంలో మొదటి ఆచార్యులైన భారతీ కృష్ణతీర్థులు మున్నగు వారు వీరి శిష్యులు. వీరినే విద్యానాథులని, విద్యాశంకర అనికూడ పిలిచే వారు. వీరు ఎనిమిదిమంది తమ ప్రధాన శిష్యులతో కర్ణాటక ప్రాంతంలో ఎనిమిది మఠాలను స్థాపించి ఆ ఆచార్యులద్వారా ఇటు మధ్వపద్ధతిని అటు గోవానుండి వచ్చే రోమన్‌ కాథలిక్కుల క్రైస్తవమత ప్రచారాన్ని నిరోధించారు.

ఆదిశంకరులు స్థాపించిన శృంగేరీమఠం తేజస్సు ఈ సమయంలోనే మేఘచ్ఛన్నంగా ఉంది. అపుడు వీరు విద్యారణ్యుల్ని పంపి లింగాయతికుల్ని పరాభూతుల్ని గావింపజేసి ఈ మఠాన్ని ఉద్ధరింపజేశారు. విద్యారణ్యులు మహమ్మదీయుల దాడినుండి దేశాన్ని రక్షించటంకోసం విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు. నాటినుండే విద్యారణ్యులను శృంగేరీ, పుష్పగిరి మున్నగు పీఠాల శ్రీముఖంలో 'కర్ణాటక సింహాసన ప్రతిష్ఠాపనాచార్య' అనే బిరుదు ఏర్పడి అది నేటికి ప్రసిద్ధంగా ఉన్నది. ఈ మఠాల శ్రీముఖంలోని ముద్రలో కూడ, 'విద్యాశంకర' * అని పేర్కొనటానికి కారణం ఏమంటే-ఈ సమయంలో గురువులైన విద్యా

___________________________________________

* ఈ 'విద్యాశంకర' పదాన్ని గూర్చి ఆత్మబోధేంద్రుల సుషమలో ఇలా ఉన్నది. 106-107 పుటలు.

'సస్యస్వాచార్యయోశ్చ విద్యాతీర్థ-శంకరానంద యోర్నామ్నా విద్యారణ్య - విద్యాశంకరాన్యతరేణ లాంఛితాని శ్రీముఖాని, సర్వతోముఖాని ప్రచారయన్‌ ఆజ్ఞయైన శంకరానందస్య ప్రాతిష్ఠిపత్‌ పునరపి వైదికాచారం'

క్రీ. శ. 1873లో-అనగా ఇప్పటికి 96 సంవత్సరాల క్రిందట అంగీరస సంవత్సర చైత్రబహుళ శనివారంనాడు మదరాసులోని శ్రీమదేకాంబరేశ్వరాలయంలో జరిగిన ఆస్తిక మహాసభవారు కళ్యాణపుర నివాసులైన శ్రీ సుబ్రహ్మణ్య సిద్ధాంతిగారు తాము రచించిన ప్రజోత్పత్తి సంవత్సర పంచాంగ పీఠికలో శృంగేరీకి లేని ఘనతను కల్పిస్తూ వ్రాసిన వ్రాతలను ఖండించారు.

ఆనాటికి నూరు సంవత్సరములకు పూర్వంనుండి ఉన్న ఆయా మఠాధిపతుల ''శ్రీముఖ బిరుదావళి''ని సేకరించి అనేక గ్రంథ ప్రామాణ్యంతో కామకోటి-పౌరతన్యాన్ని, ఔన్నత్యాన్ని స్పష్టం చేశారు. ఆనాటి సభకు 'ఉభయ వేదాంత ప్రవర్తక' శ్రీ వేదాంత రామానుజజియ్యంగారు అధ్యక్షులై 'సిద్ధాంత పత్రిక'ను ప్రచురించారు.

ఈ విశేషములన్నీ 'శ్రీముఖ సిద్ధాంత పత్రిక' అనే గ్రంథంలో ప్రచురింపబడి ఉన్నవి. దీని పునర్ముద్రణాన్ని - ఈ గ్రంధాన్ని ప్రచురించిన - కమలా పబ్లికేషన్స్‌ వారే చేశారు. వెల రూ. 0.50లు.

ఆనాటి ఆ గ్రంథంలోని శ్రీముఖ ముద్రం నిచట చూడవచ్చు.

1. శ్రీ కంచి కామకోటిపీఠం

'శ్రీ చంద్రమౌళీశ్వర'

శ్రీ చంద్రమౌళీశ్వరాయనమః

శ్రీమత్పరమహంస పరివ్రాజకాచార్య

శ్రీమచ్ఛంకర భగవత్పాద ప్రతిష్ఠిత

శ్రీ కామకోటిపీఠాధిపశ్రీమహాదేవేంద్ర

సరస్వతీ సంయమీంద్రో

విజయతే.



2. పుష్పగిరి మఠం

'శ్రీవిద్యాశంకర'

శ్రీశృంగగిరి శ్రీవిరూపాక్ష

శ్రీ పుష్పగిరి శ్రీ అలంపురి

శ్రీ విద్యాశంకర కరకమల

సంజాత శ్రీ విద్యానృసిహ్మ

భారతీస్వామినః



3. విరూపాక్ష మఠం

'శ్రీవిద్యా శంకర'

శ్రీ

విద్యాశంకర మహీపాల

ముద్రా

4. శృంగేరీ మఠం

'శ్రీవిద్యాశంకర'





5. కుడలి మఠం

'శ్రీ విద్యాశంకర'



6. అమని మఠం

'శ్రీవిద్యాశంకర'

తీర్థుల పేరులోని 'విద్యా' శబ్దం, వీరి శిష్యులైన శంకరానందుల పేరులోని ''శంకర' పదాన్ని కలిపి 'విద్యాశంకర' పదాన్ని తమ పీఠముద్రలో చేర్చుకొన్నారు. కాగా ఆనాటి కంచి పీఠాధిపతులై తమ గురువులైన పై ఉభయగురువుల యెడ శ్రీ విద్యారణ్యులవారు ఈ విధంగా విశేష గౌరవ ప్రతిపత్తిని సుప్రతిష్ఠితం చేశారు. అప్పటినుండి విజయనగర ప్రభువులు కంచి కామకోటి-పీఠానికి భూముల్ని దానం చేశారు. ఆ తామ్రశాసనాలు ఇప్పటికి ఉన్నవి.

ఈ పీఠాధిపతులు రక్తాక్షి, మాఘ శుద్ధ పాఢ్యమినాడు దేహవిముక్తి నందారు.

52. శంకరానంద:(1385-1417=32) తండ్రి బాలచంద్రుడు. అవతరణం : మధ్యార్జునం. పూర్వాశ్రమనామం. మహేశుడు పైన పేర్కొన్న వీరి గురువులతో వీరు పీఠాధిపత్యం వహించకపూర్వం హిమాలయాల్లో 15 వత్సరాలున్నారు. కర్నాటకంలో 8 మఠాల్ని

___________________________________________

కామకోటిపీఠం-కంచి.

1. పుష్పగిరిమఠం - కడప తాలూకా, కడపజిల్లా, 2. విరూపాక్ష మఠం హోస్పేట తాలూకా-బళ్ళారిజిల్లా, 3. శృంగేరి-మైసూరు రాష్ట్రంలో షీమోగాజిల్లా-తుంగానదీతీరం, 4. కుడలి-మైసూరు రాష్ట్రంలో షిమోగాజిల్లా-తుంగ, భద్ర నదుల సంగమస్థానం, 5. ఆమని మైసూరు రాష్ట్రంలో, కోలారుజిల్లా.

6. సంకేశ్వర కరవీరమఠం - 'విద్యాశంకర'

ఈ పేరుతో 1 పూనా, 2 సంకేశ్వరం, 3. కొల్హాపూరు, 4.సతారాలలో ఉన్నవి.

స్థాపించటానికి కృషిచేశారు. శృంగేరీ పునరుద్ధరణానికి కృషిచేసి విద్యారణ్యులకు విశేష గౌరవభా జను లైనారు. ఈశ, కేన, ప్రశ్న, బృహదారణ్యకాది ఉపనిషత్తులకు 'దీపిక'ను వ్రాశారు. భగవద్గీక్షకు వ్యాఖ్య వ్రాశారు. ఆత్మపురాణాన్ని కూడ వ్రాశారు. తీవ్రరూపం పొందిన మధ్వవైష్ణవ మార్గాలను పక్కకు తొలగించి అద్వైతపథాన్ని సుగమం చేశారు. 32 సంవత్సరాలు పీఠపరిపాలనంచేసి కంచిలో దుర్ముఖ వైశాఖశుద్ధ పాడ్యమినాడు సిద్ధిపొందారు.

53. పూర్ణానంద సదాశివ : (1417-1498 = 81) అవతరణం : నాగారణ్యం : తండ్రి నాగనాథుడు. వీరు తమ విజయ యాత్రలోనే నేపాలంవెళ్ళి అచటి రాజువల్ల సేవింపబడ్డారు. వీరు కంచిలో పింగళ జ్యేష్ఠశుద్ధ దశమినాడు సిద్ధిపొందారు.

54. వ్యాసాచల మహాదేవ లేక మహాదేవ IV : (1498-1507 = 9) అవతరణం : కంచి, తల్లి కమలాంబ. తండ్రి కామేశ్వరుడు. పూర్వాశ్రమానామం కుప్పన్న. వీరు విశేషంగా వ్యాసాచలంలో ఉండేవారు. అందువల్ల వీరి పేరునకీ పదం కలిసింది. వ్యాసాచలీయ శంకర విజయాన్ని వీరు రచించారు. వీరు వ్యాసాచలంలో అక్షయ ఆషాడ బహుళ పాడ్యమినాడు సిద్ధిపొందారు.

55. చంద్రచూడ ||| (1507 -1524 = 17) అవతరణం : దక్షిణార్కాటుజిల్లా ఆస్మాచలం. తల్లిదండ్రులు, పురారి, శ్రీమతి. పూర్వాశ్రమనామం అరుణగిరి. స్వభాను మీనమాసశుద్ధ ఏకాదశినాడు వీరు సిద్ధిపొందారు.

56. సర్వజ్ఞసదా శివబోధ : (1524 -1539 = 15) అవతరణం : ఉత్తర పెన్నారుతీరం. కామకోటిపీఠం గురుచరిత్ర కొంతవరకు తెలిసి కోవటాని కుపకరించే 'పుణ్యశ్లోక మంజరి'ని నీరు గ్రంథ రూపంలో సిద్ధంచేశారు. 'స్వాత్మ నిరూపణం' అనే గ్రంథాన్ని రచించారు. విలంబివత్సర చైత్రశుద్ధ అష్టమినాడు వీరు సిద్ధిపొందారు.

57. పరమశివ || (1539 - 1586 = 47) అవతరణం : పంపాతీరం. పూర్వాశ్రమనామం: శివరామకృష్ణ, గొప్ప బ్రహ్మజ్ఞాని, గురురత్నమాలికా కర్తఐన సదాశివ బ్రహ్మేంద్రుల గురువులుగా వీరు సుప్రసిద్ధులు. సదాశివ బ్రహ్మేంద్రులు నిరంతరం వీరి పాదుకల్ని శిరస్సున ధరించి తిరుగుతూ ఉండేవారు. ఈ సదాశివ బ్రహ్మేంద్రుల్ని గూర్చి సంప్రదాయ సిద్ధమైన ఒక కథ ఉంది. వీరు అవధూతలై వీధుల వెంట పిచ్చివానిలాగా తిరుగుతూ ఉండేవారు. అపుడొకాయన వచ్చి పరమశివులతో సదాశివులకు పిచ్చియెత్తిందన్నారట. అందుకీ పరమశివులిలా అన్నారని చెప్పుకొంటారు.' ఆ పిచ్చియొక్క గాలైనా నన్ను సోకితే బాగుండునని నేననుకుంటాను.' అసలు ముఖ్యాంశం ఏమంటే సదాశివ బ్రహ్మేంద్రులు తమ 'ఆత్మ విద్యావిలాసం'లో ఈ పరమశివేంద్రుల దివ్యమూర్తిని మనకు చూపారు. వీరు శివగీతకు వ్యాఖ్యవ్రాశారు. వీరు తంజావూరు జిల్లాలోని శ్వేతారణ్యంలో పార్థివ, శ్రావణ శుద్ధ దశమినాడు సిద్ధిపొందారు. వీరి సమాధిపైన చక్కని ఆలయం నిర్మింపబడింది.

58. ఆత్మబోధ - లేక - విశ్వాధిక ఆత్మబోధ : (1586 - 1638 = 52) అవతరణం : వృద్ధాచలం. తండ్రి : విశ్వముఖి. పూర్వాశ్రమనామం విశ్వేశ్వరుడు. వీరు విశేషంగా విజయయాత్రలు చేశారు. కాశీలో చాలాకాలం ఉన్నారు. శ్రీ రుద్రభాష్మం వ్రాశారు. గడిలం నదీతీరంలో ఈశ్వర వత్సరం, తులా మాసంలో బహుళ అష్టమినాడు సిద్ధిపొందారు.

59. బోధ ||| (1638-1692 = 54) వీరికి భగవన్నామ బోధేంద్ర, యోగేంద్ర, అనే పేర్లు ప్రసిద్ధమై ఉన్నవి. అవతరణం కంచిలోని మండన మిశ్రాగ్రహారం. తండ్రి కేశవ పాండురంగడు. పూర్వాశ్రమనామం' పురుషోత్తముడు. వీరు తమ 'నామామృత రసాయనం' 'నామామృత రోసోదయం'అనే గ్రంథాల్లో కలిలో నామస్మరణం ప్రధానం అని నామ సిన్థాన్తానికి ప్రాధాన్యం ఇచ్చారు. వీరు పూర్వాశ్రమంలో కాశీ-వెళ్లారు. తిరిగి వస్తూండగా భగవన్నామ ప్రబోధం జరిగి అనేక అద్భుతాలేర్పడ్డాయి. ఆ ప్రబోధంతోనే కంచికి వచ్చారు. తరువాత పీఠాధిపతులై భగవన్నామ ప్రభావాన్ని ప్రబోధిస్తూ దక్షిణ భారతం అంతా పర్యటించారు. వీరి ప్రబోధంతోనే భజన సంప్రదాయ విశిష్టమార్గంలో ప్రవర్తిల్లుతోంది. ఇప్పటి భజనపరులు తాము భగవద్భజన ప్రారంభించటానికి ముందు వీరినిలా స్మరిస్తారు.

భగవన్నామ సామ్రాజ్యలక్ష్మీ సర్వస్య విగ్రహః |

శ్రీమద్భోధేంద్ర యోగీంద్రదేశి కేంద్రముపాస్మహే ||

యస్యస్మరణ మాత్రేణ నామభక్తిః ప్రజాయతే |

తన్న మామియతి శ్రేష్ఠం బోధేంద్రం జగతాం గురుమ్‌ ||

వీరు రామేశ్వరంనుండి తిరిగివస్తూ జంబుకేశ్వరంలో అఖిలాండేశ్వరికి తాటంక ప్రతిష్టచేశారు. తిరిగి కంచికివస్తూ కుంభకోణం సమీపంలోఉన్న గోవిందపురంలో ప్రజోత్పత్తి వత్సర భాద్రపద పూర్ణిమనాడు విదేహముక్తి నందారు. నేటికి ఇక్కడ వీరి ఆరాధనోత్సవాలు విశేష వైభవంతో జరుపబడుతూ ఉంటవి.

ఇప్పటికి నిశ్శబ్ధనిశీధంలో వీరి సమాధివద్ద మధురాతి మధురపై సుందర సుకుమారంగా రామనామం మెల్లమెల్లగా ధ్వనిస్తూ ఉంటుంది.

60. అధ్యాత్మ ప్రకాశ : (1692 -1704 = 12) అవతరణం: వశిష్ఠ నదీతీరం. వీరు చిరకాలం గోవిందపురంలో ఉన్నారు. తంజావూరు ప్రభువు షహాజీ వీరిని విశేష ప్రతిపత్తితో సేవించాడు. వీర స్వభాను చైత్రబహుళ విదియనాడు కంచి సమీపంలోని అంబిలో సిద్ధి పొందారు.

61. మహాదేవ V (1704-1746 = 42) వీరు గొప్ప యోగ్యులు వీరి సమక్షంలోనే గురురత్న మాలికకు 'సుషమా' వ్యాఖ్య రచింప బడినది. వీరు మదరాసువద్ద తిరువత్తియూరులో క్రోధన జ్యేష్ఠ శుద్ధనవమినాడు సిద్ధిపొంందారు.

62. చంద్రశేఖర IV (1746-1783 = 31) ఈ సమయంలో కాంచీపుర కర్ణాటకయుద్ధం కారణంగా అశాంతికి గురియైంది. కంచిలో నామమాత్రంగా పీఠాన్ని నిర్వహింపజేస్తూ ఈ గురువులు తంజావూరు ప్రభువైన ప్రతాపసింహుని కోరిక ప్రకారం మఠాన్ని క్రమంగా తంజావూరుకు తరలించారు. ఇచటనుండి తీసుకొని వెళ్ళిన బంగారు కామాక్షి విగ్రహం తంజావూరులో ప్రతిష్ఠింపబడింది. ఈ పట్టణంలో ప్రధానమైన పశ్చిమ వీధిలోని దేవళంలో ఈ విగ్రహం ఇప్పటికి పూజింపబడుతోంది. తరువాత అచటి మంత్రి దాబిర్‌పంత్‌ నదీతీరంకోసం కావేరీతీరాన ఆదికుంభేశ్వర మంగళాంబికల సమక్షంలో కుంభకోణంలో పీఠానికి మఠం కట్టించాడు. అప్పటినుండి ఈ మఠం కుంభకోణం మఠం అని ప్రసిద్ధిపొందింది. వీరు 'శివాష్టపది'ని వ్రాశారు. ఇది జయదేవుని గీత గోవిందమువంటింది.

ఈ పీఠాధిపతులు కుంభకోణంలో శుభకృత్‌వత్సర పుష్యకృష్ణ ద్వితీయనాడు సిద్ధిపొందారు.

63. మహాదేవ VI (1783 -1814 = 31) వీరు గొప్పయోగసిద్ధులు. అవతరణం : కుంభకోణం. పూర్వాశ్రమనామం అన్న శ్రౌతి. వీరి హయాంలో ఇచటి మఠ నిర్మాణం పూర్తిరూపం పొందింది. వీరు శ్రీముఖ ఆషాడశుద్ధ ద్వాదశినాడు సిద్ధి పొందారు.

64. చంద్రశేఖర V (1814 -1851 = 37) పూర్వాశ్రమనామం : వెంకట సుబ్రహ్మణ్య దీక్షితులు. తంజావూరు ఆస్థాన బ్రాహ్మణమంత్రి గోవింద దీక్షితుల కుటుంబంలోని వారు. వీరు మంత్రశాస్త్రంలో సిద్ధహస్తులు. శ్రీ విద్యాపారంగతులు. వీరు ముఖ్యంగా కంచికామాక్షీదేవి ఆలయాన్ని పునరుద్ధరించి యంత్రప్రతిష్ఠచేశారు. జంబుకేశ్వరంలోని అఖిలాండేశ్వరీదేవికి 'తాటంకాభరణాలు'గా యంత్రాలను పునఃప్రతిష్ఠించారు. తంజావూరు ప్రభువు శివాజీ (తంజావూరి మహారాష్ట్ర ప్రభువుల్లో తుదివాడు) వీరికి స్వర్ణాభిషేకంచేసి గురుభక్తిని వెల్లడించుకొన్నాడు. వీరు కుంభకోణంలో సాధారణ వత్సర కార్తీకబహుళ విదియనాడు సిద్ధిపొందారు.

65. మహాదేవ VII లేక సుదర్శన మహాదేవ : (1851 - 1891 = 40) అవతరణం : మధ్యార్జునం. తండ్రి శేషాద్రిశాస్త్రి పూర్వాశ్రమనామం మహాలింగం. వీరు విశేషంగా పండితుల్ని ఆదరించేవారు. పుదుక్కోట సంస్థానాధీశ్వరుడు భక్తితో 36 వేల రూపాయల్ని పీఠానికి సమర్పించారు. వీరు విశేషంగా విజయయాత్రలు చేశారు. వీరి విజయయాత్ర సందర్భంలో ఆంధ్రప్రాంతంలోని విజయనగరానికి విచ్చేశారు. అచట విజయనగర సంస్థాన పక్షాన వ్రాసియుంచిన 'విశేషదిన చర్య'లో 3-7-1885 నుండి 3-11-1885 వరకు వీరి కార్యక్రమ విశేషాలు వర్ణింపబడిఉన్నవి. వీరిచటినుండి బొబ్బిలికి విజయం చేశారని కూడ అందులో ఉన్నది. వీరు ఇలయాత్తంగుడిలో విరోధి ఫాల్గుణ అమావాస్యంనాడు సిద్ధిపొందారు. వీరి సమాధిపై దేవళం నిర్మింపబడినది. పుదుక్కోట, శివగంగ, కాళహస్తి, కార్వేటినగరం, బొబ్బిలి, విజయనగరం, వెంకటగిరి, ఎట్టియాపురం, తిరువాన్కూరు సంస్థానాధీశులు వీరియందు విశేషభక్తి ప్రపత్తులతో ఉండేవారు.

66. చంద్రశేఖర VI (1891 -1907 = 17) అవతరణం : చెంగల్పట్టు జిల్లాలోని ఉదయాంబక్కం. తండ్రి సీతారామశాస్త్రి. పూర్వాశ్రమనామం స్వామినాథ. వీరు కంచివద్ద కలవాయిలో పరాభవ మాఘకృష్ణ అష్టమినాడు సిద్ధిపొందారు.

67. మహాదేవ VIII (1907 - 7 రోజులు) తండ్రి నరసింహశాస్త్రి. అవతరణం : కుంభకోణంవద్ద తిరువిశాలూరు. పూర్వాశ్రమనామం : లక్ష్మీనరసింహం. వీరు ఋగ్వేదం అంతా అధ్యయనం చేసి తమ పదునైదవయేటనుండి వీరి పూర్వపీఠాధిపతుల శుశ్రూషచేస్తూ ఉండేవారు. వీరి పదునెనిమిదవయేట పీఠాధిపత్యం వహించారు. వెంటనే ప్రస్తుత పీఠాధిపతులను నియుక్తుల్నిచేసి వీరుపరాభవ ఫాల్గున శుక్లప్రతిపత్తునాడు సిద్ధిపొందారు.

ఇచట ముఖ్యాంశం ఏమంటే 66వ ఆచార్యులైన శ్రీచంద్రశేఖరేంద్ర సరస్వతీస్వామివారు ప్రస్తుతం 68వ ఆచార్యులుగా నున్న శ్రీవారిని దీక్ష ఇవ్వటానికి కబురంపి పిలిపించారు. వారు ప్రయాణమై వచ్చునంతలో ఆలస్యం కావటంచేత అంతవరకు తమ శిష్యులుగా ఉన్న శ్రీ లక్ష్మీనరసింహంగారికే దీక్ష యిచ్చి ఈ శ్రీవారు అచటకు చేరిన వెంటనే దీక్ష ఇవ్వవలసినదిగా వీరితో చెప్పి సిద్ధిపొందారు. వీరు వెంటనే శ్రీవారికి దీక్ష ఇచ్చారు. అత్యల్పకాలంలోనే సిద్ధిపొందటం కూడ దైవికంగా సంభవించింది. ఈ 67వ ఆచార్యులనే పూర్వాశ్రమంలో లక్ష్మీకాంతం అనికూడ పిలచేవారు.

Jagadguru divyacharithra   Chapters   Last Page