Jagathguru Bhodalu Vol-3        Chapters        Last Page

అర్థములు శతావధానులు : శ్రీ వేలూరి శివరామశాస్త్రి

పుట7 'కాలకాల ప్రపన్నానాం కాలః కిం ను కరిష్యతి?'

కాలః = మృతువు లేక యము-డు, కాల ప్రపన్నానాం=యమునకు యము-డైన దేవర శరణు చొచ్చినవారిని, కిం ను కరిష్యతి? =ఏమి చేయగల-డో చెప్పు-డు.

పుట11 జగత్‌ సూతే ధాతా హరి రవతి రుద్రఃక్షపయతే

తికస్కుర్వ స్నేతత్‌ స్వ మపి వపు రీశ స్తిరయతి,

సదాపూర్వః సర్వం తదిద మనుగృహ్ణాతి చ శివ

స్త్వదాజ్ఞామాలంబ్యక్షణచలితయోర్భ్రూలతికయోః||

- లక్ష్మీధర వ్యాఖ్య.

హేభగవతి! ఓయయమ్మా!. ధాతా=బ్రహ్మజగత్‌=ప్రపంచమును, సూతే= సృజించుచున్నా-డు, హరిః=విష్ణువు, (జగత్‌=జగతిని) అవతి = ఏలుచున్నా-డు' రుద్రః = రుద్రు-డు, బ్రహ్మయు విష్ణువును రుద్ర-డును ప్రపంచమును పుట్టింపను పాలింపను ముగింపను అధికారులు. ఈశః=ఈశు-డు లేక మహేశ్వరతత్త్వము ఏవత్‌ = బ్రహ్మ విష్ణు రుద్రాత్మకమగు ముగుర శరీరమును, స్వ మపి=తనదియు నగు, వపు రపి=శరీరమును గూడ, తిరస్కుర్వన్‌=ఉపసంహరించుచు, తిరయతి=అంతర్‌ హిత మొనరించుచున్నా-డు. ఈశ్వరుడు బ్రహ్మ విష్ణు రుద్రలను తనయం దారోపించుకొని తానును సదాశివ తత్త్వమునం ద-తర్భూతు- డగుచున్నాడని అర్థము. (ఇది బ్రహ్మాండ ప్రలయము. ఇటుపిదప సదాశివునకు బ్రహ్మాండమును సృజించు ఇచ్ఛాకలుగును.) సదాపూర్వః శివః=సదాశివు-డు; తత్‌ ఇదం సర్వం = ఆయీ సమస్తమును. బ్రహ్మ విష్ణు రుద్ర-ఈశానాత్మకమగు నాలుగు తత్త్వములను; క్షణ చలితయోః=క్షణమాత్రము కదలిన, తవ=నీ, భ్రూలతిక యోః=తీవలవంటి కనుబొమలయొక్క, ఆజ్ఞాం=ఆనతిని -ముదలను, ఆలంబ్య=ఆలంబించి, భ్రూలతికాచాలనముచే తెలియ-దగిన ఆజ్ఞను బట్టి అని అర్థము. అనుగ్బహ్ణాతి=అనుగ్రహించు చున్నా-డు. నీవు ఱప్పలెత్తిన మాత్రమున బ్రహ్మవిష్ణురుద్రేశానాత్మకమగు నాలుగు తత్త్వములు పుట్టును. బొమముడి వెట్టినంత మాత్రమున గిట్టును. ఇటులు అనేకకోటి బ్రహ్మాండములు సృష్ఠించుట యందును సంహరించుటయందును సదాశివునకు నీ భ్రూ విక్షేపమాత్రకూపమగు శక్తి సాయము చేయుచున్నదని తాత్పర్యము.

హే దేవి = ఓదేవి! ధాతా = బ్రహ్మ.

'బ్రహ్మ విష్ణు మహాదేవా అస్యాః పుత్రా వరాననే!

చతుర్థో7హం మహేశాని! సుతస్త స్యా మహేశ్వరః

తస్యాః పతిర్‌ బ్రహ్మరూపీ స్వయం సాక్షాత=దాశివః'

- అరుణామోదిని.

బ్రహ్మయు విష్ణువును మహాదేవు-డును ఈమెపుత్రులు. మహేశ్వరు-డను నేను నాలుగవ పుత్త్రుడను. ఆమె పతి బ్రహ్మరూపి యగు సదాశివు-డు- అని దక్షిణామూర్తి సంహిత చెప్పుటచే బ్రహ్మాఆమె జ్యేష్ఠకుమారు-డని గ్రహించునది. జగత్‌=ప్రపంచమును. సూతే=సృజించుచున్నా-డు, హరిః=ప్రపంచ పాలనమునకు అధికార మీయ-బడిన రెండవ కొడుకగువిష్ణువు, అవతి=బ్రహ్మ సృజించిన ప్రపంచమును ఏలుచున్నా-డు, రుద్రః=సంహారమున కధికార మీయ-బడిన కాలరుద్రు-డు అను పేరుకల మై-డవకొడుకు, క్షయపతే=ఆజగతినే సంహరించుచున్నా-డు. వీ రందఱును కాలపురుషులు. ఈశః=బ్రహ్మాదులకు కారణభూతు-డగు ఇత-డు నాలుగవ కొడుకు మహేశ్వరు- ఈ విషయము భారతమం దిటులు కలదు-

'అహం బ్రహ్మ కపిలో7థా ప్యనంతః

పుత్త్రా స= ర్వే బ్రహ్మణ శ్చాత్ర వీరాః,

త్వత్త స= ర్వే దేవదేవ ప్రసూతా

ఏవం చేశః కారణాత్మా త్వ మీడ్యః,

'ఒ దేవదేవా! నేనును బ్రహ్మయు కపిలు-డును ఆనంతు-డును ఈశు-డును ఈయందఱును బ్రహ్మమ వగు నీవలన జనించితిమి. కారణరూపు-డవగు నీవు కొనియాడ-దగిన వా-డవు.'

ఏతత్‌=బ్రహ్మ విష్ణు రుద్రాది సకల ప్రపంచమును, తికస్కుర్వ&=తనలో ఇమిడ్చికొనుచు, స్వ మపి వపుః=తన శరీరముగూడ, తిరయతి=తనకు కారణమగు సదాశివునం దంతర్హిత మొనరించును, సదా పూర్వః శివః=సదాశివు-డను పేరుకల నీభర్త. క్షణచలితయోః=క్షణకాలమాత్రము ఎత్తబడిన, తవ=బ్రహ్మాండములను సృజించు నీయొక్క, భ్రూ లతికయోః=తీవలవంటి కనుబొమలయొక్క, ఆజ్ఞాం=ముదలను, అలంబ్య=గ్రహించి, తత్‌ ఇదం=బ్రహ్మ విష్ణు రుద్రేశానాది రూపమగు అయీ ప్రపంచము నెల్ల, అనుగృహ్ణాతి=తనయిచ్చ కనుకూలముగా సృస్ఠిస్థితిసం హృత్యనుగ్రహముకలదానిగాజేయుచున్నాడు. ఇచట- జెప్పవలయు దేవీప్రాధాన్యము మాచే వెనుకనే చెప్ప-బడెంగాన నిట మఱల దానిని తడవము. ఇచట-'ఆత్మా వైపుత్త్రనా మాసి', 'స ఏవాయం పురుషః ప్రత్యక్షేణోప లభ్యతే, ఈ మొదలగు శ్రుతిచే బ్రహ్మాద్యనేక రూపములు కేవల కల్పన. దేవి ఒకర్తే ఇట్టి కల్పనల కాస్పదము సకలజననీస్తవ మిటులు చెప్పుచున్నది-

'విరించాఖ్యా మాతః సృజసి హరిసంజ్ఞా త్వ మవసి

త్రిలోకీం రుద్రాఖ్యా హరసి విదధా సీశ్వరతయా,

భవన్తీ సాదాఖ్యా ప్రభవసి చ పాశౌఘ దళ##నే

త్వ మే నైకా నేకా భవసి కృతిభేదైర్గిరిసుతే!'

'ఓయమ్మా! బ్రహ్మయను పేరుకలదానవై అన-గా బ్రహ్మవై సృజింనుచున్నావు. హరివై పాలించుచున్నావు. రుద్రు-డవై ముల్లోకములను మాపుచున్నావు. ఈశ్వరు-డవై ముగ్గుర మూర్తులను ధరించుచున్నావు. ఆ నీవే సాదాఖ్యవై పాశములను త్రెంచుచున్నావు; ఇటుల నీ వొకత వయినను ఆ యా యీ పనులనుబట్టి పలువుర వగుచున్నావు.' సహస్రనామము మొదలగు గ్రంథములందును ఈ యర్థవే వ్యక్తమగుచున్నది కావున అందందు చూచునది.

పుట 14 యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి నంయమీ

యస్యాం జాగ్రతి భూతాని సానిశాపశ్యతో మునేః||

- గీతా269.

సర్వభూతానాం=ఎల్ల ప్రాణులకును, యా=ఏ వరమార్థ తత్త్వము, నిశా=(రాత్రివంటిదై) రాత్రియగుచున్నదో, తస్యాం=ఆ పరమార్థ తత్త్వమునందు, సంయమీ=జితేంద్రియ-డగు యోగి, జాగర్తి=మేలుకొనును, యస్యాం=ఏ అవిద్యయను రాత్రియందు, భూతాని-ప్రాణులు, జాగ్రతి=నిదిరించునేమెల-కువ గనునో, సా=అవిద్యయను రేయి, పశ్యతః=ఎఱుకగల, మునేః=యోగికి, నిశా=రాత్రి వంటిది. అజ్ఞులు దేనిని చీకటి అని పగలని అనుకొందురో, స్థితప్రజ్ఞున కది చీకటి. అజ్ఞులకు ఆత్మజ్ఞానము చీకటివంటిది, స్థితప్రజ్ఞునకో అది పగటి వంటిది. స్థితప్రజ్ఞనకు ఆవిషయప్రవృత్తి రేయివంటిదని తాత్పర్యము. నిశా పద మిచట 'నిశ్శాఇవ' అని ఉపమార్థకము. ఉపమానమగు నీ విషయిచాటున ఆత్మచింతా7వరూపమగు విషయము(నిగీర్ణమై)ఉన్నది. 'మెలుకనును' అను అర్థము కల 'జాగర్తి' అను విషయిచాటున 'ప్రబుద్ధు-డై యున్నా-డు' అను విషయము (నిగీర్ణమై) ఉన్నది. ఉత్తరార్థమునందున్న 'జాగ్రతి' అను విషయిచాటున విషయప్రవృత్తి దా-గియున్నది. 'నిశా' అను పదము తటస్థముగా విషయ నివృత్తిని దా-చికొన్నది కావున ఈ శ్లోకము అతిశయోక్తి భేదమున కుదాహరణమని కసగంగాధర ద్వితీయాననాతిశయోక్తి ప్రకరణమున పండితకాయలు.

పుట 19 దంతినిదారువకారేదారుతిరోభవతిసో7పితత్త్రెవ,

జగతితథాపరమాత్మా పరమాత్మ న్యపి జగత్తిరోధత్తే.

దారువికారే=కొయ్యతో చేయ-బడిన, దంతిని=ఏను-గులో, దారు=కొయ్య, తిరోభవతి=అంతర్థాన మగుచున్నది. సో7పి=ఆ యేను-గు కూడ. తత్త్రెవ=ఆ కొయ్యలోనే, తిరోభవతి=కన-బడక పోవుచున్నది. తథా=అటులే, పరమాత్మా=పరమాత్మ. జగతి=ప్రపంచములో, తిరోధత్తే=తిరోధాన మగును, జగదపి=ప్రపంచముసైతము, పరమాత్మని=పరమాత్మలో, తిరోధత్తే=తిరోధానము చెందుచున్నది.

పుట 20 ఈశానః సర్వవిద్యానామీశ్వరః సర్వభూతానాం

బ్రహ్మ7ధిపతి ర్బ్రహ్మణో7ధిపతి ర్బ్రహ్మా

శివో మే అస్తు సదా శివోమ్‌.

- తైత్తిరీయ నారాయణ ప్రశ్న 21 అను.

సర్వవిద్యానాం=ఎల్లవిద్యలకు, ఈశానః=నియామకు-డును. సర్వభూతానం=ఎల్ల ప్రాణులకు, ఈశ్వరః=ఏలికయు, బ్రహ్మధిపతిః=వేదములకు అధిపతియు, బ్రహ్మణః=హిరణ్యగర్భునకు, అధిపతిః=ప్రభువును అగు, బ్రహ్మ=పరమేశ్వరు-డు, మే=నాకు, శివః=మంగళకరు-డు, అస్తు=అగు-గాక!, సదాశివః=ఆనిత్య మంగళకరు-డను, ఓమ్‌=నే నగుదును.

పుట 22 యదా యదా హిధర్మస్య గ్లానిర్బవతి భారతః

ఆభ్యుత్థానమధర్మస్యతదా77త్మానంసృజామ్యహమ్‌.

- గీత. 4్‌్త

భారత=అర్జునా!, యదా యదా=ఎపుడెపుడు, ధర్మస్య=ధర్మమునకు, గ్లానిః=హాని, భవతి=అగునో, అధర్మస్య=అధర్మమునకు, అభ్యుత్థానం=ఎగువు, భవతి=అగునో, తదా=అపుడు, అహం=నేను. ఆత్మానం=నన్ను, సృజామి=సృజించు కొందును.

పుట 24 వీతరాగభయక్రోధామన్మయామాముపాశ్రితాః,

బహవో జ్ఞాన తపసా పూతా మద్భావ మాగతాః.

- గీత 410.

బహవః=పలువురు, వీత...క్రోధాః=కామభయక్రోధములు పోయినవారై, మన్మయాః= నాకును తమకును వేఱిమి లేదని ఎఱి-గినవారై, అనగా బ్రహ్మవేత్తలై, మాం=నన్ను, ఉపాశ్రితాః=ఆశ్రయించినవారై జ్ఞాననిష్ఠ కలవారై అని తాత్పర్యము. జ్ఞాన తపసా=జ్ఞానమను తపసు=చే, పూతాః=పవిత్రులై, మద్భావమ్‌=నా స్వరూపమును, ఆగతాః=పొందిరి.

పుట 27 పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణన స్వయం

వ్యాసేనగ్రథితాంపురాణమునినా మధ్యామహాభారతమ్‌,

అద్వైతామృత వరిణీం భగవతీ మష్టా దశాధ్యాయినీ

ముంబ! త్వా మనుసందధామి భగవద్గీతే! భవద్వేషిణీమ్‌.

- భగవద్గీత.

అంబ భగవద్గీతే!=అమ్మా భగవద్గీతా!, పార్ధాయ=అర్జునునికొఱకు, భగవతా=భగవంతు-డగు, నారాయణన, స్వయం=స్వయముగా, ప్రతిబోధితాం=బోధింప-బడినదియు, మధ్యే మహాభారతము నడుమ, పురాణమునినా వ్యాసేన=ప్రా-తకాలపుమునియగు వ్యాసులచే, గ్రథితాం=కూర్చ-బడినదియు, అద్వైతామృతవరిణీం=అద్వైత మను అమృతమును కురియునదియు. అష్టాదశాధ్యాయినీం=పదునెనిమిదధ్యాయములుకలదియు, భవద్వేషిణీం= సంసారమును ద్వేషించునదియు, భగవతీం ద్వాం=భగవతియునగు నిన్ను, అనుసందధామి=అనుసంధింతును.

పుట 28 అంతః ద్రష్టా ఆద్యోన

అంతః=ప్రతిప్రాణిలోనుఉన్న, ద్రష్టా=ద్రష్ట అన-గా ప్రత్యగాత్మ, అన్యః=పరమాత్మకంటె వేఱగువా-డు, న=కా-డు.

పుట 29 న కరోతి నలిప్యతే

న కరోతి=చేయ-డు, న లిప్యతే=లేపము&ఒంద-డు అన-గా అంట-డు.

యోగ యుక్తో విశుద్ధాత్మా విజితాత్మా జితేంద్రియః,

సర్వభూతాత్మ భూతాత్మా కుర్వ న్నపి న లిప్యతే||

- గీతా 5్‌్త.

యోగయుక్తః=కర్మయోగముతో యుక్తు-డై, విశుద్ధాత్మా=ఆంతఃకరణ శుద్ధి కలవా-డై, విజితాత్మా=కాయ జయము కలమా-డై, జితేంద్రియః=జయించిన ఇంద్రియములుకలవా-డై సర్వభూతాత్మాభూతాత్మా=బ్రహ్మాది స్తంబ పర్యంతములైన అజడములకును జడములకును ఆత్మస్వరూపమగు ఆత్మకలవా-డు, అన-గా జడాజడాత్మక మగు ప్రపంచము నెల్ల తానుగనేచూచువా-డు; కుర్వన్నపి=కర్మ చేయుచున్నను, నలిప్యతే=బంధింప-బడడు.

పుట 29 న కర్మ ఫలలేపః.

న కర్మ ఫలలేపః=కర్మ ఫలముతోడి సంబంధము లేదు.

''క్షేత్రం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషుభారతః

క్షేత్రక్షేత్రజ్ఞయోర్‌ ర్ఞానం యత్తద్‌ జ్ఞానం మనంమమ.

- గీత 132.

భారన=అర్జునా!, సర్వక్షేత్రేషు=ఎల్లుపాధుల యందును (ఉన్న) క్షేత్రజ్ఞం చ= ఆ ఉపాధుల నెఱు-గు వానిని, ఉపాధులను. మా మపి=నన్ను-గనే ('అపి' ఇచట ఏ వార్థకము). విద్ధి=తెలియుము, క్షేత్ర క్షేత్రజ్ఞయోః=క్షేత్రక్షేత్రజ్ఞులయొక్క, యత్‌ జ్ఞానం=ఎఱుక యేధికలదో, తత్‌=ఆయెఱుక, మమ=నాకు, మతం=ఇష్టము, ఏ యెఱుకలో ఉపాధియు దానిని ఎఱు-గువా-డును విషయ మగుదురో, అన-గా ఉపాధియు దిని, నెఱు-గువా-డును పరమాత్మ స్వరూపులను ఎఱుక నాకు సమ్మత మని తాత్పర్యము.

పుట 31 యదిహ్యహంనవర్తేయంజాతుకర్మణ్యతంద్రితః,

మమవర్త్మా నువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః||

ఉతీ=దేయు రిమే లోకా న కుర్యాం కర్మ చే దహమ్‌,

సంకరస్య చ కర్తా స్యా మపహన్యా మిమాః ప్రజాః||

- గీత 323,24.

పార్థ = అర్జునా, అహం = నేను, జాతు = ఒకానొకపుడేని, కర్మణి = కర్మయందు, అతంద్రితః = పాలుమాలిన మా-డనై, యది న వర్తేయం = ఉండనియెడల, మమ = నా, వర్త్మ = బాటను, మనుష్యాః = మనుజులు-(అందఱును), సర్వశః = అన్ని-టను, అనువర్తంతే = అనుసరింతురు. అహం=నేను, కర్మ=కర్మను, న కుర్యాం=చేయనేని, ఇమే=ఈ, లోకాః=లోకములు, ఉతీ=దేయుః=ఉత=న్నము లయిపోవును, అహం=నేను, సంకరస్య చ=సంకరమునకును, కర్తాస్యామ్‌=చేయుమా-డ నగుదును, ఇమాః=ఈ, ప్రజాః=ప్రజలను, ఉపహన్యామ్‌=చంపువా-డ నయ్యెదను. (324).

పుట 31 సర్వధర్మాన్‌ పరిత్యజ్యమా మేకం శరణం వ్రజ,

అహంత్వాసర్వపాపేభ్యోమోక్షయిష్యామిమాశుచః ||

- గీత 1866.

సర్వధర్మా& = ఎల్ల ధర్మములను - ధర్మమును అధర్మమును లేక అన్ని కర్మములను, పరిత్యజ్య=విడనాడి, మామ్‌ ఏకమ్‌=నన్నొకనిని - సర్వాత్మయు సర్వభూత స్థితు-డను అగువా-డను నేనే యని నన్ను, శరణం వ్రజ=శరణు పొందుమా!, అహం=నేను, సర్వపాపేభ్యః = ఎల్ల పాపముల నుండియు, మోక్షయిష్యామి=విడుదల చేయింప-గలను, మాశుచః=దుఃఖింపకుమా.

పుట 31 అశోచ్యా నన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాం శ్చ భాషసే,

పుట 32 గతాసూనగతాసూం శ్చ నానుశోచన్తి పండితాః.

- గీత 2.11.

త్వం=నీవు. అశోచ్యాన్‌=దుఃఖింప-దగని (ఆత్మస్వరూపులు గాన దుఃఖింప-దగనివారని తాత్పర్యము.) భీష్మాదుల-గూర్చి. అన్వశోచః=దుఃఖించితివి, ప్రజ్ఞావాదాం శ్చ=జ్ఞానులు చెప్పినటులు, భాషసే=పలుకుచుంటివి, పండితాః=ఆత్మజ్ఞానము కలవారు, గతాసూన్‌=మరణించిన వారి-గూర్చియు, అగతాసూం శ్చ=ప్రాణములు పోతివారి- గూర్చియు, న అనుశోపన్తి=దుఃఖింపరు.

పుట 34 'వేదో7ఖిలో ధర్మమూలమ్‌'

ధర్మ=ధర్మములకు, మూలం=మూలము, అఖిలః=సమస్తమగు, వేదః=వేదము.

పుట 35 తర్కో7ప్రతిష్ఠః

తర్కః=తర్కము (అనుమానాది ప్రమాణములచే వస్తుస్థితిని సాధించుట తర్కము. పొగ ఉన్నచోట నిప్పుఉండును, ఈ మొదలగు వ్యాప్తి మొదలగువానిని చెప్పునది). అప్రతిష్ఠః=స్థిరత్వము లేనిది.

పుట 35 ధర్మస్య తత్త్వం నిహితం గుహాయామ్‌

ధర్మస్య=ధర్మముయొక్క, తత్త్వం=స్వరూపము, గుహాయాం=గుహలో నున్నది. అన-గా అంత గూఢము.

పుట 36 తస్మాచ్ఛాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ.

జ్ఞాత్వా శాస్త్ర విధానో క్తంకర్మ కర్తు మిహార్హసి.

- గీతా 1624.

తస్మాత్‌=కావున, కార్యాకార్య వ్యవస్థతౌ=ఇటులు చేయవచ్చు ననిగాని ఇటులు చేయరా దనిగాని నిర్ణయింపవలసినపుడు, శాస్త్రం=శాస్త్రము, తే=నీకు, ప్రమాణం=జ్ఞానమునకు ఉపకరణము, ఇహ=ఈ యెడల, శాస్త్రవిధానోక్తం=ఇటులు చేయవచ్చును ఇటులు చేయరాదు అని చెప్పు శాస్త్రవిధినిబట్టి, కర్మ=స్వకర్మను, కర్తుం=చేయుటకు, అర్హసి=తగుదువు.

'తస్యాః ఖురన్యాస పవిత్రపాంసు

మపాంసులానాంన ధురి కీర్తనీయా,

మార్గం మనుష్యేశ్వర ధర్మపత్నీ

శ్రుతే రివార్థమ్‌ స్మృతి రన్వగచ్ఛత్‌.

- రఘు 22.

అపాంసులానాం=కలంకము లేనివారిలో, ధురి=మొదట, కీర్తినీయా=కొనియాడ-దగిన. మనుష్యేశ్వర ధర్మపత్నీ=దిలీపుని ధర్మపత్ని సుదక్షిణ, తస్యాః=ఆ నందినియొక్క, ఖురన్యాస పవిత్రపాంసుం=గిట్టల నుంచుటచే పవిత్రమయిన పరాగము గల, మార్గం=దారిని, శ్రుతేః=వేదముయొక్క, అర్థం=అర్థమును, స్మృతి రివ=స్మృతివలె, అన్వగచ్ఛత్‌=అనుగమించెను.

ఈశ్లోకము, దీనియర్థము రెండవసంపుటమున-గలదు.ొ

పుట 37 రేఖామాత్రమపిక్షుణ్ణాదామనోర్వర్త్మనఃపరమ్‌,

న వ్యతీయుః ప్రజాస్తస్య నియంతుర్నే మివృత్తయః,

- రఘు 11్‌్త.

నియంతుః=ఏలికయగు, తస్య=అతనియొక్క (దిలీపుని), నేమి వృత్తయః=చక్రపు అంచుయొక్క, వ్యాపారము వంటి వ్యాపారము కల; ప్రజాః=ప్రజలు, ఆమనోః=మనువు మొదలుకొని, క్షుణ్ణాత్‌=అలవాటయిన, వర్త్మనః=ఆచార పద్ధతికంటె, రేఖామాత్ర మపి=గీటు వాసియేని, పరం=ఎక్కువమేరను, న వ్యతీయుః=అతిక్రమణము చేయరైరి. నియంత అన-గా బండి తోలువా-డు, నేమి వృత్తి=చక్రపు అంచు తిరుగుట, క్షుణ్ణ=నలిగిన, వర్త్మ=బాట అనియు శ్లేష. నేర్పరి యగు బండితోలువా-డు నడపెడు బండిచక్రపు అంచు గా-డి దా-టి ఒక చిన్న గీటువాసి మేరయేని బెసకదు. అటులే, ప్రజలు అను చక్రముల మీ-ద నిలిచిన, రాజ్యము అను రథమును నడపు దిలేపుడను రథచోదకు-డు మనుపు నా-టనుండి వచ్చుచున్న ధర్మమను నలిగిన బండిగా-డి రవంతయేని తొల-గకుండ నడిపె నని తాత్పర్యము.

పుట 40 'తమస్తు రాహుః స్వర్భాను

సై#=ంహికేయో విధుంతుదః'

- అమరకోశము.

తమః, రాహుః, స్వర్భానుః, సైంహి కేయః, విధుంతుదః, ఇవి రాహువు పేరులు.

పుట 43 అంతర్నాడీ నియమిత మరుల్లంఘిత బ్రహ్మ రంధ్రం

స్వాంతే శాంతి ప్రణయిని సమున్మీల దానందసాంద్రం,

ప్రత్యక్‌ జ్యోతిర్‌ జయతి యమినః స్పష్ట లాలాట నేత్ర

వ్యాజ వ్యక్తీకృత మివ జగద్‌ వ్యాపి చంద్రార్థమౌళేః.

- ప్రబోధ చంద్రోదయ 1 అంక-2.

యమినః=ఎల్లపుడును సంయమము కల, అన-గా జితేంద్రియు-డగు, చంద్రార్ధమౌళేః=నెలవంకతో-గూడిన జటామకుటము గల శివునియొక్క, అంతర్నాడీ...బ్రహ్మరంధ్రం=సుషుమ్నలో, చొనుప-బడిన, గాలిచే-దా-ట-డిన, బ్రహ్మరంధ్రము కలట్టియు, స్వాంతే=అంతఃకరణము, శాంతి ప్రణయిని (సతి)=ఉపశమింప-గా, సమున్మీలత్‌ సాంద్రం=వెల్లివిరిసిన సుఖముచే సాంద్రమయి నట్టియు, అన-గా ఆనందమయమయి నట్టియు; స్పష్ట...వ్యక్తీకృత మివ=ప్రకటమయిన (అందఱకును గానిపించు) నేన్నుదుటి కన్ను, అను మిషచే వ్యక్తీకృతమయినదో అన-బర-గినదియు, జగద్వ్యాప్తి=ప్రపంచవ్యాప్తమగు లేక జగతినివిషయముగా- జేయు, ప్రత్యగ్‌ జ్యోతిః=ప్రత్యగాత్మయొక్క వెలు-గు అన-గా అంతర్‌ జ్యోతి, జయతి=వెలయుచున్నది.

పుట 47 వేద్రాహతిం విభక్తుం విశ్వాత్మకతా ప్రదర్శితా భవతా.

కరగత కబళగ్రాసే పున రఖినీతం శివాద్వైతమ్‌.

వేత్రాహతిం=బెత్తపు దెబ్బ (లు), విభక్తుం=పంచి పెట్టుటకు, భవతా=నీచే, విశ్వాత్మకతా=సర్వాత్మకత్వము, ప్రదర్శితా=ప్రకటన చేయ-బడెను, కర...గ్రాసే, పునః=చేత నున్న దోసెలు తినునపు డన్ననో, శివాద్వైతము (శివుడు జీవు-డు అను ద్వైతము చెప్పునది శివాద్వైతమ,) అభినీతమ్‌=అభినయింప-బడెను. నీవు దెబ్బలుమాత్రము అందఱకును పంచితివి; దోసెలనోనీవొక-డవేతింటివని తాత్పర్యము.

పుట 47 త్రాణ యో7ధికృతః సమస్త జగతాం తస్యాంబుకాశౌసుఖం

నిద్రాణస్య తధావిధే7పి సమయే ప్రష్టైవ నా లక్ష్యతే

కష్టం కుర్వతి తామ్యతి శ్రమభరా ద్వేత్రాహతి స్త్వయ్యభూత్‌

కస్యాగ్రే కథయిష్యసీమమనయం స్వామి న్న నాథోహ్యసి.

స్వామిన్‌=ఓ యీశ్వరు-డా!, సమస్త జగతామ్‌=ఎల్లలోకముల యొక్కయు, త్రాణ=కాపాడుట యెడల, యః=ఎవరు, అధికృతం=అధికరింప-బడెనో, అధికారియో? తథావిధే=అట్టి, సమయే7పి=వేళయందు-గూడ- దెబ్బలు తినువేళలో కష్టసమయములో-గూడ అని తాత్పర్యము. సుఖం=సుఖముగా. అంబురాశౌ=సముద్రములో, నిద్రాణస్య తస్య=నిదురబోవునట్టి విష్ణుమూర్తిని, ప్రష్టైవ=అడుగువా-డే. నా77 లక్ష్యతే=చూడ-బడ-డు, కష్టం=కష్టమును. కుర్వతి=చేయుచున్నట్టియు, శ్రమభరాత్‌=పరిశ్రమ భారమున, తామ్యతి=అలయుచున్న, త్వయి=నీమీ-ద, వేత్రాహతిః=చబుకుదెబ్బ, అభూత్‌,=ఆయెను, నీ మీ-ద దెబ్బపడెనుఅని తాత్పర్యము. ఇమం=ఈ, అనయం=అవినీతిని, అన్యాయ్యము నన్నమాట. కస్య అగ్రే=ఎవని ముందు, కథయిష్యసి=చెప్పుకొన-గలము? హి=ఏల యన-గా, అసి=నీవు, అనాథు-డవు!

పుట 48 హే నంతః శ్రుణు తాధునైవ మిళితై రస్మాభి రేతచ్ఛివే

వాచ్యం- 'వేత్రహతం విభజ్య న వయం భోక్తుం సమర్థా' ఇతి,

నో చేత్‌ పాదహతిః శిలాప్రహరణం కోదండ దండాహతిర్‌

గండూషాంబునిషేచనం చ సకలం సర్వం విభాజ్యం భ##వేత్‌.

హే సంతః=ఓ సజ్జనులారా!, శ్రుణుత=విను-డు! అస్మాభిః మిళితైః (సద్భిః)=మనమందఱము కలిసిన వారమై, ఏతత్‌=ఈచెప్ప-బోవువిషయము, శివే=శివునియెడల, అన-గా శివునితో. అధునైవ=ఇపుడే, వాచ్చమ్‌ = చెప్పుకోదగినది, నో చేత్‌=చెప్పుకొనని యెడల, పాదహతిః=కాలి తావు, శిలాప్రహరణ=రాళ్ళదెబ్బ, కోదండ దండ ఆహతిః=వింటికఱ్ఱపోటు, గండూషాంబు నిషేచనం=ఉమ్మి నీటిజల్లు, సకలం=దేనిని విడువకుండ సమగ్రముగా, సర్వంచ=ఎల్లయు, విభాజ్యం భ##వేత్‌=పంచుకో-దగినది అగును.

దీనికి తాత్పర్యము 48 పుటలో చుచుకొనునది.ొ

పుట 50 గాయంతం త్రాయతే యస్మా ద్గాయత్రీ త్యభిధీయతే.

యస్మాత్‌=దేనివలన, గాయంతం=గానము చేయు వానిని (తన్ను జపించువానిని, ధ్యానము చేయువానిని), త్రాయతే=రక్షించుచున్నదో, (తస్మాత్‌=దానివలన) గాయత్రీతి=గాయత్రి అని, అభిధీయతే=చెప్ప-బడుచున్నది.

'గాయత్రీ ఛందసాం మాతా'

గాయత్రీ=గాయత్రి, ఛందసాం=ఛందసు=లకు, మాతా=తల్లి.

దేవోదేవాలయః ప్రోక్తోజీవః ప్రోక్తస=నాతనః.

దేహః=శరీరము, దేవాలయః=దేవాలయము అని, ప్రోక్తః=చెప్ప-బడెను, జీవః=జీవుడు, సనాతనః=ఎల్లపుడును ఉండు, దేవః=దేవు-డు అని, ప్రోక్తః=చెప్ప-బడెను.

పుట 56 త్రిభ్యఏవతు వేదేభ్యః పాదంపాదమదూదుహత్‌,

తది త్వృచో7స్యాః సావిత్ర్యాఃపరమేష్ఠీ ప్రజాపతిః,

- మమ 2్‌్త్‌్త.

పరమేష్ఠీ=పరమపదమునందున్న, ప్రజాపతిః=బ్రహ్మ, త్రిభ్యః ఏవ వేదేభ్యః=ముక్కుట మూ-డు వేదముల నుండి అన-గా ఋగ్యజుసా=మములనుండి, తత్‌ ఇతిఋచః=తత్‌ అను ఋక్‌ ప్రతీకముచే అనూదితమైన, సావిత్ర్యాః=గాయత్రియొక్క, పాదం పాదమ్‌=మూ-డుపాదములను, అదూదుహత్‌=పితికెనుఅన-గా ఏఱి తీసెను.

పుట 57 కువుత్రో జాయేత క్వచిదపి కుమాతా న భవతి.

కు పుత్రః=చెడుకొడుకు, జాయేత=పుట్టవచ్చును, క్వచిదపి=ఒకటనేని, కుమాతా=చెడుతల్లి (కొడుకులను పాడుచేయు తల్లి), న జాయేత=పుట్టదు.

పుట 57 జాతస్య హి ధ్రువో మృత్యుః,

- గీతా 22్‌్త.

జాతస్య=పుట్టినవానికి, మృత్యుః=చావు, ధ్రువః=నిక్కము. పుట్టినవా-డుగిట్టక తప్పదు అని తాత్పర్యము

'' ఈశావాస్య మిదం సర్మమ్‌.

- ఈశోపనిషత్‌ 1.

ఇదం=ఈ, సర్వమ్‌=ఎల్లయు, (ఈప్రపంచ మెల్లయు), ఈశా=ఈశునిచే, వాస్యం=నివసింప-దగినది.

పుట 60 జీర్ణ పర్ణాశినః క్వచిత్‌.

క్వచిత్‌=ఒకానొకట, జీర్ణపర్ణాశినః=కారాకులను తినువారు.

పుట 64 ఆపాతాల నభస్థ=లాంత భువన బ్రహ్మాండ మావిన్పుర

జ్జ్యోతి స్ఫాటికలింగ మౌళి విలసత్‌ పూర్ణేందు వాంతామృతైః |

అస్తోకాప్లుత మేక మీశ మనిశం రుద్రానువాకాన్‌ జపన్‌

ధ్యాయే దీపి=త సిద్ధయే ధ్రువపదం విప్రో7భిషించే చ్ఛివమ్‌ ||

అపాతాల=పాతాలము మొదలుకొని, నభస్థ=లాంత=ఆకాశతలము తుదగానున్న, భువన=భువనములతోగూడిన, బ్రహ్మాండం=బ్రహ్మాండ రూపముగా, ఆవిఃస్ఫురత్‌=ఆవిర్భవించు (ఆ విస్ఫురత్‌ అను పాఠమున ప్రకాశించుఅనిఅర్థము), జ్యోతిఃస్ఫాటికలింగ=జ్యోతిర్మయమగు స్ఫటిక లింగముయొక్క, మౌళి=తలపై, విలసత్‌=వెలుగు, పూర్ణేందు=నిండు చంద్రునినుండి, వాంత=(టుపమ=ఉద్గిరణ) కురియు, అమృతైః=అమృతములచే, అస్తోకాప్లుతం=దట్టముగా ముంపబడినట్టియు, ఏకం=కేవలుడగు, ఈశం=ఈశ్వరుని, ఈపి=త సిద్ధయే=కోరిక నెరవేరుటకు, అనిశం=ఎల్లపుడును, రుద్రానువాకాన్‌=రుద్రానువాకములను, జపన్‌=జపించుచు, ధ్యాయేత్‌=ధ్యానించునది, ధ్రువపదం=మూడు కాలములందును చెడని, శివం=శివుని, విప్రః=విప్రుడు, అభిషించేత్‌=అభిషేకించునది.

మొదట పరమేశ్వరుడు జ్యోతిర్లింగముగ నావిర్భవించెననియుపిదప బ్రహ్మాండము భువనము మొదలుగా నెల్లయు దాన ప్రతిబింబించె ననియు తాత్పర్యము. జ్యోతిర్లింగముగ ఆవిర్భవించెనని అనుటకు స్కాందము, కాళికా పురాణాదులు ప్రమాణము.

కొందరు-'ఆపాతాల...బ్రహ్మాండమ్‌'అను సమస్త పదము క్రియావిశేషముగా చేసి పాతాళము మొదలు ఆకాశము వరకు బ్రహ్మాండముగా అగుచు-ప్రతిబింబించుచు - రజ్జు సర్పముగా కానిపించుచు - రూపొందు స్ఫటిక లింగముతో ఆపాతాల...బ్రహ్మాండమే యగు స్ఫాటిక లింగము అని చెప్పి 'ఆవిర్భవ జ్జ్యోతిః' అను పదమును 'ఈశమ్‌' అను కర్మను విశేషింతురు. వీరు 'అస్తోకాప్లుత లోకమ్‌' ఆనియు పఠించి దానిని 'ఈశ' పదమునకు విశేషణముగా చెప్పుదురు. ఇం కొందరు-'బ్రహ్మాండ మభితః' అని అధ్యాహరించి ద్వితీయావిభక్తి యనియు, బ్రహ్మాండ మంతటను ఆవిః స్ఫురజ్జ్యోతి - శివస్వరూప మని చెప్పుదురు. ఇందలి పదములు ఈ అర్థము అన్వయక్లేశము లేనిదేయనిసాక్ష్యము చెప్పుటకు జంకును. అర్థమునందీష ద్భేదమున్నను తాత్పర్య మొకటియే. బ్రహ్మమగు శివుడు వ్యోమ కేశుడు, చంద్రమౌళి. శివలింగము శివ చిహ్నము. బ్రహ్మాండము ఇంచుమించు గుండ్రము. లింగము గుండ్రము. ఈదెపనిర్గుణము సగుణమాయెను. ఈ రెంటికిని వాచకము ఓంకారము. బ్రహ్మమునకు నాలుగు పాదములు. ఓంకారమునకును నాలుగు మాత్రలు.

కవుల భావనయు; ఉపాసకులయు, ధ్యాతలయు, మంత్రయోగులయు ప్రతీకాదులు - ఇంచుమించుగా కలియు చుండును.

కొందరు ఈ పయివిషయము లన్నియు పరిశీలించి ఈ శ్లోకమందలి బ్రహ్మాండమును, లింగమును, ఈశుని విరాట్‌ హిరణ్య గర్భేశ్వరులుగను, జాగ్రదాదులను ఆంతర పూజాధ్యానములలో చంద్రమండలమును శివపురాణాదులను గురు తింతురు.

ఈశ్లోకమున 'అస్తోకాప్లుత మేకమ్‌'కు బదులు 'అస్తోకాప్లుత లోకమ్‌' అనియు 'ధ్రువపదమ్‌'కు బదులు 'అద్రుతపదమ్‌' అనియు మేలు పాఠములు.

పుట 67 సరో గభీరం పురి గోపురం చ యః

సమున్నతం శోణగిరీశితుర్‌ వ్యధాత్‌,

అశక్తయో రంఘ్రి శిరో విలోకితుం

మహాపథౌ మాధవ వేధసో రివ.

- సాహిత్య రత్నాకర పీఠిక.

శోణ గిరీశితుః=అరుణాచయేశ్వరుని యొక్క, అంఘ్రి శిరః=పాదములను తలను (ఏకవద్‌ భావము), విలోకితుం=చూచుటకు, అశక్తయోః=శక్తిచాలని, మాధవ వేదసోః=విష్ణువునకును బ్రహ్మకును, మహాపథౌ వివ=పెను దారులవలె, గభీరం=లో-తయిన, సరః=తటాఈకమును, సమున్నతం=మిగుల నెత్తయిన, గోపురమును; పురి=అరుణాచల క్షేత్రరూప పత్తనము నందు, యః=ఎవ-డు, వ్యధాత్‌=నిర్మించెనో, విష్ణువు పాదములు కను-గొనుటకు క్రిందికి పోవలయును గాన ఆదివరాహ మగు ఆ విష్ణువునకు లొ-తుగా త్రవ్విన యెడల శ్రమ కలుగదని సరసు=ను త్రవ్వించె ననియు, బ్రహ్మ తలను కను-గొనుటకు మీ-దికి పోవలయును గాన నిచ్చెనవంటి ఎత్తు కట్టడము బ్రహ్మకు ఉపకరించునని గోపురమును కట్టించినటు లున్నది అని తాత్పర్యము. 'అయ్యన్‌' అను ఆయన ఈసరోగోపురములకు నిర్మాణ కర్త.

పుట 71 మన ఏవ మనుష్యాణాం కారణం బంధ మోక్షయోః

మనుష్యాణాం=మనుష్యుల యొక్క, బంధ మోక్షయోః=బంధమునకు- గాని ముక్తికి-గాని, మన ఏవ=మనసే=, కారణం=హేతువు.

పుట 71 శక్నోతీహైవ యఃసోఢుం ప్రాక్‌ శరీర విమోక్షణాత్‌.

కామక్రోధోద్భవం వేగంసయుక్తః స సుఖీనరః.

యః=ఎవడు, కామ క్రోధోద్భవం=కోరికల వలనను క్రోధమువలనను కలుగు, వేగం=వడిని, శరీర విమోక్షణాత్‌ ప్రాక్‌=శరీరమును విడుచుముందే, సోఢుమ్‌=ఓర్చి కొనుటకు, ఇహైవ=ఈలోకము నందే- (బ్రతికి యుండగనే) శక్నోతి=సమర్థుడో, సఃనరః=అల్లతడు, యుక్తః=యోగి, సుఖీ=సుఖి.

పుట 73 పుంఖానుపుంఖ విషయేక్షణ తత్పరో7పి

బ్రహ్మావలోకనధియం న జహాతి యోగీ,

సంగీత తాళ లయ నృత్త వశం గతా7పి

మౌళిస్థ కుంభ పరిరక్షణ ధీ ర్నటీవ.

పుంఖ........అపి=అంతులేకుండ ఒకదానివెంట మణియొకటిగా వచ్చుచుండ విషయములను చూచుటయెందు మఱ-గియున్నను, యోగీ=యోగి, సంగీత... అపి=పాట, తాళము, లయ, అట, వీనికికైవసమయ్యును; మౌళి...ధీః=తలమీ-ద నున్న కుంభమును పడకుండ కాపాడుకొను బుద్ధి గల నటీవ=నటివలె, బ్రహ్మావలోకనధియం=ఆత్మను జూచు బుద్ధిని న జహాతి=విడనాడ-డు.

పుట 75 'బాలోన్మత్త పిశాచవత్‌'

బాలురవలె, పిచ్చివారివలె, పిశాచములవలె (జ్ఞాని స్థితి ఉండును).

పుట 76 అర్కద్రోణప్రభృతికుసుమైరర్చనంతేవిధేయం

ప్రాప్యంతేన స్మరహరఫలం మోక్షసామ్రాజ్యలక్ష్మీః,

ఏత జ్జాన న్నపి శివశివ వ్యర్థయ& కాల మాత్మన్‌

ఆత్మద్రోహీ కరణవివశో భూయసా7ధః పతామి.

స్మరహర=మన్మథుని జయించిన ఓపరమేశ్వరా! తే=నీకు, అర్క, కుసుమైః=జిల్లెడు తుమ్మి మొదలగు పూలచే, పూజనం=పూజ, విధేయం=చేయ-దగినది, తేన=దానిచే, మోక్ష...లక్ష్మీః=ముక్తి సామ్రాజ్య లక్ష్మి అను, ఫలం=ఫలము, ప్రాప్యం=పొంద-దగినది, ఏతత్‌=ఈ సంగతి, జాన న్నపి=ఎఱు-గుచున్నను, శివ శివ=అయ్యయో, ఆత్మ&=ఓ ఆత్మస్వరూపు-డా! కాలం=కాలమును, వ్యర్థయ&=వితపుచ్చుచు, కరణ వివశః=ఇంద్రియములకు వశు-డనై, ఆత్మద్రోహీ=నాకే (నేను) ద్రోహము చేసికొన్న వా-డనై, భూయసా=మఱల, అధః పతామి=అధఃపతనము చేయుచున్నాను.

పుట 79 మహేశ్వరే వా జగతా మధీశ్వరే

జనార్దనే వా జగ దంతరాత్మని,

న వస్తు భేదప్రతిపత్తి రస్తిమే

తథా7పి భక్తి స్తరుణందుశేఖరే.

జగతాం=జగనత్తులకు, అధీశ్వరే=ప్రభువైన, మహేశ్వలేవా=శివునందు-గాని, జగ దంతరాత్మని=జగత్తులకు అంతరాత్మ యగు, జనార్దనేవా=హరియందు-గాని, వస్తు భీదప్రతిపత్తిః=హరియను వస్తువు వేఱు, హరు-డను వస్తువు వేఱుఅను భేద జ్ఞానము; మే=నాకు, న=లేదు, తథా7పి=అటులయ్యు, తరుణ... శేఖరే=లే నెలవంక తలపూవుగా- గలవానియెడ, (మే=నాకు) భక్తిః=భక్తిః, అన-గా పరమేశ్వరునకు పలు రూపములలో జడలలో నెలవంకను తాల్చిన రూపమునందు నామనసు= లగ్నమయి యుండునని తాత్పర్యము.

పుట 81 యం యం వా7పి స్మర& భావం త్యజత్యన్తే కళేవరం,

తంత మే వైతి కౌంతేయ సదా తద్భావభావితః.

- గీతా - 86.

యం యం=ఏయే, భావం వా7పి=దేవతా విశేషము నేనియును, అంతే=మరణవేళలో, స్మర&=తల-చుచు, కళేవరం=శరీరమును, త్యజతి=విడుచునో, కౌంతీయ=ఓ కుంతీసూను-డా! సదా=ఎల్లప్పుడు, తద్భావ భావతః=తత్‌=ఆ దేవనీ విశేషమునందే, భావ=భావన, భావతః=ఎవనిచే తల-ప- బడుచున్నదిగా అలవరించికొన-బడెనో అట్టివాడు. (ఆహితాగ్న్యాదిగణ మాకృతిగణ మగుటచే భావిత తద్భావః అనుటకుబదులు తద్‌ భావ భావితఃఅవి ప్రయుక్తము), తం తం ఏవ=ఆయా దేవతా విశేషమునే, ఏతి=పొందును.

'శివు నారాధించినంతమాత్రాన శివు-డైపో-డు, విష్ణువును ఆరాధించినంతమాత్రాన విష్ణువైపో-డు, ఇంద్రుని యజించినంత మాత్రమున ఇంద్రు-డైపో-డు గదా! మఱి అత-డు స్వర్గమును పొందును, ఇటులే ఆయా దేవతలను కొలిచినవారు ఆయా దేవతల లోకమును పొందుదురు. ఇటులేశ్రవణమాత్రమునబ్రహ్మవిదు-డు బ్రహ్మమును ఒంద-డు...న బహునాశ్రు తేన'=బహు శ్రవణముచేనేని బ్రహ్మత్వము పడయ-డు అని కఠము. ఎవ-డు బ్రహ్మము నేనని ఎల్లపుడును అనుభవపుర్వకముగా ఎఱు-గునో అత-డే బ్రహ్మభావము నొందును- 'య మే వైష వృణుతే తేన లభ్యః'='ఎవనినే సాధకు-డు వరించుచున్నా-డో ఆ వరించుటచే అ-తడు లభ్యు-డు' అని కఠము 'భ్రమర కీటాదికమునందు నిత్య నిరంతర ధ్యానము ధ్యేయరూపమున నొదవించునటులు సాధకులు అంత కాలమునందును బ్రహ్మానుసంధానము చేయవలయు నని' శంకరానందీయము.

'భావము అన-గా సత్త్వ రజ స్తమ ఆత్మక మనియు సత్త్వాదిగుణ భావితుడు వర్తమానకాలమున ఏసాత్త్వికాదిక వస్తువు నభ్యాసముచే తలపోయునో ఆయా భావనాభ్యాస ప్రకరచే పొందిన సంస్కారముచే ఆయా వస్తువునే చరమవేళలో తలపోయును. దేని నేర తలపోయుచు మేను వదలునో అద్దానినే సమనంతని దేహాంతరమున పడయును. ఈ విషయమే - 'యదా సత్త్వే వివృద్ధేతు ప్రళయం యాతి దేహభృత్‌, తదోత్తమ విదాం లోకా నమలా& ప్రతి పద్యతే, రజసి ప్రళయం గత్వా కర్మసంగిషు జాయతే, యోనిషు జాయతే.' (గీతా అధ్యా)= 'సత్త్వము పెరిగి యున్నతఱి మేనుదొర-గిన యెడల దేవాది లోకములను బొందును. రజోవృద్ధిలో మేనుదొర-గిన యెడల మర్త్యలోకమునందును, తమోవృద్ధిలో మేను దొర-గిన యెడల తిక్యక్‌ స్థావరాదులయందును పుట్టును' అని సర్వనో భద్రము.

'చచ్చిపోవుచు నెవ-డును మోహము పొంద'డని స్కాందము - 'త్యజి& దేహం కశ్చిత్తు మోహమాప్నో త్యసంశయమ్‌'-మరణ సమయమున ఎవనికిని మోహముండదు. పూర్వవాసన చెడ్డదగునో చెట్ట ప్రాప్తించును. మేలిదగుచో మేలు ప్రాప్తించును. అందులకు నిత్యము నిరంతర స్మరణము ఉండవలయును. ఉండునేని నన్ను స్మరించుచు నన్ను పొందును.

భావమనగా అంతర్గత మగు మనసు=నియు భావితు-డనగాన అతివాసితు-డనియు నిఘంటువులు చెప్పుటచే అంతకాలమునందు మనసు= మిక్కిలివాసిత మగుటచే. నన్నే స్మరించుచు ఎవడు మేని విడుచునో అతడు నన్ను పొందును అని మాధ్వభాష్యము.

పుట 85 'శివాత్‌ పరతరం నాస్తి'

శివాత్‌=శివునికంటె, పరతరం=మఱియొక గొప్ప వస్తువు, న అస్తి=లేదు.

'అస్తి ద్రోణ మతః పరమ్‌'

ఆతః పరమ్‌=శివునికంటె పరమవస్తువు, ద్రోణం=తుమ్మిపూవు, అస్తి=కలదు.

'అర్కద్రోణ ప్రభృతి కుసుమై రర్చనంతే విధేయం'-

(చూ. 76-3)

పుట 86 'అయం మే హస్తో భగవాన్‌,

అయం మే హస్తో భగవత్తరః'

నమకమ్‌ -11 ఆను.

అయం=ఈ, మే=నాయొక్క, హస్తః=చేయి, భగవాన్‌=దేవుడు, అయం=ఈ, మే=నాయొక్క చేయి, భగవత్తరః=భగవంతుని మించినదియు.

పుట 89 ఆయుధానా మహం వజ్రం ధేనూనా మస్మి కామధుక్‌,

ప్రజన శ్చాస్మి కందర్పః సర్పాణా మస్మి వాసుకిః.

- గీతా 1028.

ప్రజనః=సంతతిని కలిగించు, కందర్పః అస్మి=కాము-డను, కామములు పెక్కులు కలవు. వానిలో ఉత్పత్తి చేయు కామమను నేను, కేవలము తన సుఖము నుద్దేశించిన కామమను కానని తాత్పర్యము.

పుట 90 బహూనాం జన్మనామంతే జ్ఞానవా& మాం ప్రపద్యతే,

వాసుదేవ స=ర్వ మితి స మహాత్మా సుదుర్ల భః.

- గీతా ్‌్త-19

బహూనాం=పెక్కు, జన్మనాం అంతే=జన్మముల పిదప, జ్ఞానమాన్‌= జ్ఞానపరిపాకముకలవా-డై, సర్వం=ఈ ఎల్లయు, వాసుదేవః=వాసుదేవ స్వరూపము, ఇతి=అని యిటులు, మాం=నన్ను వాసుదేవ స్వరూపమగు ప్రత్యగాత్మనుగా, ప్రపద్యతే=తెలిసికొనునో, సః=అట్టి, మహాత్మా=గొప్ప అంతఃకరణము కలవా-డు, సుదర్లభః=మిగుల అరుదు.

పుట 92 ఉద్ధరే దాత్మనా77త్మానం నా77త్యాన మవసాదయేత్‌,

ఆత్మైవ హ్యాత్మనో బంధు రాత్మైవ రిపు రాత్మనః.

- గీతా 65.

ఆత్మానాం=తన్ను, తాను ప్రకరణమునుబట్టి సంసార సముద్రమున ముని-గియున్నవా- డని చెప్పవలెను. కా-గా సంసార నిమగ్ను-డగు తన్ను అని అర్థము. ఆత్మనా=తనచేతనే, ఉత్‌ హరేత్‌=పైకి లేవ-దీసి కొనవలయును. (వెనుకటి శ్లోకసంబంధము చూచునది). ఆత్మానం=ఆత్మను, న అవసాదయేత్‌=ముంపరాదు, హి=దేనివలన, ఆత్మైన=తానే ఆత్మనః=తనకు, బంధుః=చుట్టము, ఆత్మైవ=తానే, ఆత్మనః=తనకు, రిపుః=శత్రువు.

తానే తన్ను ఉద్ధరించుకొనుట ఎటులు? ఇది కర్మ కర్తృ దోషముకాదా? తానే కర్తయు తానే కర్మయు ఒక-డెటులగును? తన బుజముమీ-ద తానే యెక్కుటకాదా యిది? అను నెడల, కాదు. గుణభేదమనుబట్ట ఒకనికే కర్తృత్వ కర్మత్వములు సంభవింపవచ్చును. చీకటిలో నూత గూలినవా-డు తీ-గెనో రాతీనో పట్టుకొని తన్ను తానే ఉద్ధరించుకొన్నటులు సంసారకూపమున కూరుకొని పోయినవా-డు శమనమాది సాధనసామగ్రిచే శ్రవణమనన విది ధ్యాసనాదులచే గలిగిన ఎఱుకచే తన్ను దేహేంద్రియాది భిన్నునిగా- దెలిసి కర్తృత్వాది బంధమునుండి తొలగించుకొనుచు ఇటులు కర్తృత్వ కర్మత్వములు గుణభేదముచే ఒకనికే కలుగవచ్చు నని శంకరానందీయము. 'బంధురాత్మా త్మన స్తస్య' చూ, 66.

పుట 97 వసుధైక కుటుంబకమ్‌.

వసుధ=పుడమి, ఏకకుటుంబకమ్‌=ఒక కుటుంబము. ఈ ప్రపంచ మెల్లయు ఒకే ఒక కుటుంబము అని తెలిసికొని దానికనుగుణముగా అందఱతో అన్యోన్యముగా ఉండవలయు నని తాత్పర్యము.

పుట 110 సోమః ప్రథమో వివిదే గంధర్వో వివిద ఉత్తరః

తృతీయ అగ్నిష్టేపతిస్తురీయస్తే మనుష్యజాః.

సోమః=సోముడు ప్రథమః=(మొదట పతికాబోవువాడై) పుట్టిన యీ కన్యను, వివిదే=పొందెను. పతిగా ప్రథమ భావిత్వము సోమునకు కలదని తాత్పర్యము. గంధర్వః=గంధర్వుడు, ఉత్తరః=పదపట (పతి) కా-గలవాడై, వివిదే=పొందెను. తే=నీకు, అగ్నిః=అగ్ని, తృతీయఃపతిః=మనుష్యులలో ఒకడనైన నేను (బహువచనముఛాందసము తే=నీకు, తురీయః=నాల్గవవా-డ నగు పతిని.

గంధర్వో7 దద దగ్నయే రయిం చ,

పుత్రాగ్‌ంశ్చా7దదగ్ని ర్మహ్య మథో ఇమే ||

సోమః=సోముడు, గంధర్వాయ=గంధర్వునికొఱకు (మొదట), అదదత్‌=ఒసగెను, గంధర్వః=ఆగంధర్వుడు, అగ్నయే=అగ్నికొఱకు, అదదత్‌=ఇచ్చెను, అథో=పిదప, అగ్నిః=అగ్ని, ఇమాం=ఈమెను, రయిం=ధనమును, పుత్రాంశ్చ=సుతులను, మహ్యం=నాకొఱకు, అదాత్‌=ఇచ్చెను. (ఏకాగ్ని కాండీయ హకదత్తభాష్యము చూచునది.)

పుట 111 ఉదీర్యాతో విశ్వావసోనమ సేళామహే త్వా

ఆన్యామిచ్ఛ ప్రఫర్ఫ్యం సం జాయాం పత్యా సృజ||

అతః=ఈశయ్యనుండి (ఈ కన్యనుండి అనియు-విశ్వావసు అనుపేర ఉంచబడిన దండమునుండి అనియు అర్థభేదముకలదు. పెండిలి మూడు రాత్రులు భార్యా భర్తలు నేలమీద పడుకొనవలెను. బ్రహ్మచర్యము చేయవలెను. ఉప్పుకారములు తినరాదు. వారి యిరువుర పడుకల నడుమ గంధముపూసి వలువచేగాని సూత్రముచేగాని చుట్టబడిన దండముండును,)

- హరదత్త భాష్యము చూచునది.

విశ్వావశో=ఓ విశ్వావసువా! ఉదీర=తొల-గిపొమ్మా! (ఇత-డు కన్నియలకు అధిపతి. 'లభామి తేనకన్యామ్‌=అననిచే కన్యను పొందుచున్నాను' అని మంత్రము) త్వా=కన్యాధిపతి వగు నిన్ను, నమసా=నమస్కారముచే అనగా నమస్కరించి, ఇ(ఈ)డా(ళా) మహే=నుతించు చున్నాము, ప్పఫర్ఫ్యం=బ్రహన్ని తంబ లేక ప్రథమ వయస్కయగు, అన్యాం=వేఱుకన్నియను, ఇచ్ఛ=ఇచ్చగింపుమా! జాయాం=ఈనా భార్యను పత్యా=పతి నగు నాతో, సంసృజ=కూర్పుమా! (హర)

పుట 111 ఉదీర్వాతః పతివతి హ్యేషా విశ్వావనుం నమసా గీర్భి రీళే (రీట్టే)

అన్యా మిచ్ఛ పితృషదం వ్యక్తాం స తే భాగో జనుషా తస్య విద్ధి.

- 211.

ఉదీర్వ అతః=(వెనుకటి మంత్రమున. చూ,) హి=ఏలన, ఏషా=ఈమె, పతివతి=పతి కలదాయెను (తీకి బదులు తి ఛాందసము) నాచే ఈమె పతికలదాయెనని తా.విశ్వావసుం(త్వాం)విశ్వావసువను పేరుగల నిన్ను, నమసా=వందనముచే, గీర్భిః=పలుకులచే - స్తోత్రములచే, ఈళే=నుతింతును, (ఈట్టే-ఛాం) పితృషదం=పుట్టినింట నున్నట్టియు - తండ్రియింట నున్నట్టియు, వ్యక్తాం=అసమాప్త వివాహయు నగు, అన్యాం=వేఱొకతెను, ఇచ్ఛ=ఇచ్చగింపుమా!, సః=అది, జనుషా=పుట్టువుచే, తే=నీకు, భాగః=పాలు, తస్య, విద్ధి=ఆ పాలు పొందుము!

పుట 114 పతివ్రతా మహాభాగా ఛాయే వానుగతాసదా.

- రామాయణము-అయోధ్యా.

పతివ్రతా=ఈలువుకత్తేయు, మహాభాగా=గొప్పగుణములు కలదియునగు(ఈసీత) సదా=ఎల్లపుడును, (నీ వెను వెనుక) ఛాయేన=నీడవలె, అనుగతా=అనుసరించి యుండును.

పుట 115 భూమౌ స్ఖలితపాదానాం భూమిరే వావ లంబనమ్‌

త్వయి జాతాపరాధానాం త్వమే వాలంబనం గురోః.

భూమౌ=భూమిమీ-ద, స్ఖలిత పాదానాం=జాఱిన లేక తొట్రుపడిన అడుగులు కలవారికి. భూమి రేవ=భూమియే, అవలంబనమ్‌=ఆలంబనము, త్వయి=నీ యెడల, జాతాపరాధానాం=పొడమిన అన-గా చేసిన తప్పుకలవారికి, గురో!=ఓ గురువా! త్వ మేన=నీవే, ఆలంబనం=ఆధారము, (శిక్షించినను రక్షించినను గురువే గతి అని తాత్పర్యము.)

పుట 127 కర్ణం గతం శుష్యతి కర్ణ ఏవ

సంగీతకం సైకతవారి రీత్యా,

ఆనందయత్యంత రను ప్రవిశ్య

సూక్తిః కలౌ దేవ! సదా సుగంధాత.

- శివలీలార్ణవము.

సంగీతకం=గానము, కర్ణం=చెవిని, గతం=పొందినదై (చెవిలో, పడి) సైకతవారిరీత్యా=ఇసుక దిన్నెమీ-ద పడిన నీటివలె, కర్ణ ఏవ=చెవిలోనే, శుష్యతి=ఇనికిపోవు చున్నది, దేవ!=ఓ దేవరా! కలౌ=కలిలో, సూక్తిః=(నీపై- జెప్పిన) స్తోత్రము, అంతః=హృదయములో, అనుప్రవిశ్య=చొచ్చి, సదా=ఎప్పుడును, సుగంధా=మేలితావి కలదై, ఆనందయతి=సంతోష పెట్టుచున్నది.

పుట 128 అంగాని వేదా శ్చత్వారో మీమాంస న్యాయవిస్తరః

పురాణం ధర్మశాస్త్రం చ విద్యా హ్యేతా శ్చతుర్దశ.

- మను.

అంగాని=షడంగములు, వేదః=వేదములు చత్వారః=నాలుగు, మీమాంసా=మీమాంస, న్యాయవిస్తరః=(వివిధమైన) తర్కము, పురాణం=పురాణములు, ధర్మశాస్త్రం చ=ధర్మశాస్త్రమును, (కలిసి) ఏతాః=ఇవి, చతుర్దశ విద్యాః=పదునాలుగువిద్యలు.

పుట 128 పురాణ న్యాయ మీమాంసా ధర్మ శాస్త్రాంగ మిశ్రితాః,

వేదాః స్థానాని విద్యానాం ధర్మస్య చ చతుర్దశ.

- యాజ్ఞవల్క్యస్మృతి.

ధర్మశాస్త్రాంగ మిశ్రితాః=ధర్మశాస్త్రము, ఆఱు అంగములు దీనితో కలిసిన. పురాణ.......సాః=పురాణము, న్యాయము. (తర్కము) ఉభయ మీమాంసలు; వేదాః=వేదములు(ఇవి) చతుర్‌ దశ చ=పదునాలుగును, విద్యానాం=విద్యలకును, ధర్మస్య చ=ధర్మమునకును, స్థానాని=నెలవులు. (ఈ పదునాల్గిటికి విద్యా స్థానము లని పేరు.)

పుట 128 అధీతి బోధాచరణ ప్రచారణౖర్‌

దశా శ్చతస్రం ప్రణయ న్నుపాదిఖిః,

చతుర్‌ దశత్వం కృపవా& కుతః స్వయం

న వేద్మి విద్యాసు చతుర్‌ దశ స్వపి.

- నైషథీయ చరిత 14.

అయం=నలు-డు, స్వయమ్‌=(తనచే) తాను, చతుర్దశసు=పతునాలుగైన, విద్యాసు=విద్యయందు, అధీతి...ప్రచారణౖః=చదివికొనుట, తెలిసికొనుట, చదివి తెలిసిన దానిని ఆచరించుట, ఒరులకు చెప్పుటయను; ఉపాధిభిః=(ఈనాలుగు) ప్రకారములచే, చనస్రః=నాలుగైన, దశాః=దశలను, ప్రణయ&=పొంది-చుచు, చతుర్‌ దశత్వం=చతుర్దశత్వమును, కుతః=ఏల, కృతవా&=చేసెనో, నవేద్మి=ఎఱు-గను. చతుర్దశ విద్యలందు చతుర్దశత్వము ఉండనే ఉండ-గా (పదునాలుగు విద్యలందు పదునాలుగుచే లెక్కింప-దగు ధర్మము ఉండనే ఉండ-గా ఊకదంపు చందముగా చతుర్దశత్వము పొందింపనేల? అనియును, పదునాలుగింటి నాలుగుపెట్టి గుణించిన యెడల ఏ-బదియాఱు అగునుగాని చతుర్దశత్వము అన-గా పదునాలు గగుట యెటులో నే నెఱు-గననియు ఆక్షేపము. చతుర్దశత్వమన-గా పదునాల్గనికాని ఏ-బదియాఱనికాని అర్థము కాదనియు మఱి నాలుగవస్థలనియు కా-గా ఒకొక విద్యను చదివికొనుట ఎఱి-గికొనుట తాను చేసి ఒరులకు చెప్పుట అను నాలుగు అవస్థలు కలట్టుగా చేసెనని నే నెఱు-గనా? (కాకువు) అనిసమాధానము అని తాత్పర్యము.

పుట 129 ధర్మజ్ఞ సమయః ప్రమాణం వేదా శ్చ.

- ఆపస్తంబ సూత్రము.

ధర్మజ్ఞ సమయః=ధర్మము నెఱి-గినవారలనడవడియు, వేదా శ్చ=వేదములను, ప్రమాణమ్‌=ప్రమాణము.

పుట 129 అథ శీక్షాం వ్యాఖ్యాస్యామః

వర్ణః స్వరః మాత్రా బలం సామ సంతానః.

- తైత్తిరీయోపనిషత్తు.

అథ=పిదప, శీక్షాం=శిక్షను, వ్యాఖ్యాస్యామః=వివరింప- బోవుచున్నాము; వర్ణః=అకారా ద్యక్షరములనియు, స్వరః=ఉదాత్తానుదాత్త స్వరితము లనియు, మాత్రా=హ్రస్వదీర్ఘప్లుతము లనియు, బలం=ఆయా వర్ణములను పలుకునపుడు ఉపమోగించు బలమనియు, సామ=అక్షరములను కడు వడిగను కడు మెల్లగను పలుకుట యనియు, సంతానః=అక్కరములను ఆ-గి ఆ-గి పలుకకుండ వలయును (పాణినీయుల సంహిత) అను నీ యాఱును, శిక్ష యనిన అర్ధము. ఈ దిగువ గ్రంథము పోల్చిచూచునది-

'అవిలంబ మనాయస్త మద్రుతం ఘోర మూర్జితమ్‌,

ఆసంసక్తాక్ష రపదం న చ భావ సమన్వితమ్‌.

త్రిషష్టివర్ణం సంయుక్త మష్టస్థాన సమీరితమ్‌,

వాచ యే ద్వాచకః స్వస్థః స్వాధీనః సుసమాహితః'.

- హరివంశ భవిష్యపర్వణి-132అద్యాయ 21, 22.

పుట 130 మంత్రో హీనః స్వరతో వర్ణతో వా

మిథ్యాప్రయుక్తో న త మర్థ మాహ

న వాగ్వజ్రో యజమానం హినస్తి

యథేంద్ర శత్రుః సర్వతో7పరాధాత్‌.

- పాణినీయ శిక్షా.

సర్వతో వా=సర్వముచే-గాని, వర్ణతో వా=వర్ణముచే-గాని, హీనః=హీనమై, మిథ్యా ప్రయుక్తః=ఒకటికిబదులుమఱొకటిగా ప్రయోగింప-బడిన, మంత్రః=మంత్రము, తం=ఆ, అర్థం=అర్థమును. (కావలసినఅర్థమును, న ఆహ=చెప్పదు)సః=ఆ, వాగ్వజ్రః=పలుకు అను పిడుగు, స్వరతః అపరాధాత్‌=స్వరదోషముచే, ఇంద్ర శత్రుః యథా='ఇంద్ర శత్రువు' వలె, యజమానం=యజమానుని (యజ్ఞము చేయువానిని), హినస్తి=చంపును, సకృత్‌ అనుటకు బదులు శకృత్‌ అని పలుకునెడల అర్థము భేదించును. సకృత్‌=ఒక పర్యాయము, శకృత్‌=పురీషము, 'సకలమ్‌'కు బదులు 'శకలమ్‌' అనినను దంత్య తాలవ్య భేదములచే అర్థము మాఱును. ఇట్లే 'ఇంద్ర శత్రుః' అనునపుడు ఉదాత్తాది భేదముచే అర్థము మాఱును.

పుట 131 జయతిపరాశర సూనుః సత్యవతీ

హృదయనందునో వ్యాసః,

యస్యా7స్య కమల గళితం

వాజ్మయ మమృతం జగత్‌ పిబతి.

యస్య=ఎవనియొక్క, ఆస్యృగళితం=మోముదమ్మి నుండి జాఱిన, వాజ్మయం అమృతం=సారస్వతము అను అమృతమును, జగత్‌=జగత్తు, పిబతి=త్రావుచున్నదో అట్టి, పరాశర సూనుః=పరాశరునికుమారు-డును, సత్య-నందనః=సత్యవతి హృదయమునకు ఆహ్లాదమును కలిగించువా-డును అగు, వ్యాసః=వ్యాసు-డు జయతి=వెలు-గొందు చున్నా-డు.

పుట 131 'పేదో7భిలో ధర్మమూలమ్‌,

- మను 26.

అఖిలః వేదః=విధ్యర్థవాద మంత్రాత్మకమును, ఋగ్యజుసా=మాత్మ లక్షణము నగు వేద మెల్లయు, ధర్మమూలమ్‌=ధర్మమునెడల ప్రమాణము. విధి వాక్యైక్య వాక్యత చెంది అర్థవాదలు (గూడ) స్తావకముగా ధర్మమునకు ప్రమాపకములు. 'విధినా త్వేక వాక్యత్వా తు=త్యర్థేన విధీనాం స్యుః' అని జైమిని.

'' క్షీణాయుషఃక్షీణసత్త్వాన్‌ ధుర్మేధాన్‌ వీక్ష్యకాలతః

పరాశరాత్‌ సత్యవత్యా మంశాం శ కలయా విభుః

అవతీర్ణో మహాభాగో వేదం చక్రే చతుర్వధమ్‌.

కాలతః=కాలమునుబట్టి, క్షీణాయుషః=ఆయుష్యము తగ్గిపోయినట్టియు, క్షీణసత్త్వాన్‌=దుర్బలులై పోయినట్టియు, దుర్మేధాన్‌=మేధ తక్కువ అయిపోయిన వారిని, వీక్ష్య=చూచి, విభుః=నారాయణు-డు పరాశరాత్‌=పరాశరుని వలన, సత్యవత్యాం=సత్యవతి గర్భమున, అవతీర్ణః=అవతరించిన, మహాభాగః=మహాత్ము-డు, వేదం=వేదమును, చతుర్వధం=నాలుగు విధములుగా, చక్రే=చేసెను.

పుట 132 సత్యం వద, ధర్మం చర.

- తైత్తరీయోపనిషది-1 ప్రశ్న

సత్యం=నిక్కమును, వద=చెప్పునది, ధర్మం=ధర్మమును, చర=ఆచరించునది.

పుట 132 'ఇతిహాస, పురాణాభ్యాం

వేదం సముప బృంహయేత్‌'

ఇతిహాస పురాణాభ్యాం=ఇతిహాస పురాణములతో, వేదం=వేదమును, సముపబృంహయేత్‌=జోడించునది.

పుట 132 నమో7స్తుతే వ్యాస విశాలబుద్ధే

ఫుల్లార విందాయత పత్ర నేత్ర,

యేన త్వయా భారత తైలపూర్ణః

ప్రజ్వాలితో జ్ఞానమయప్రదీపః.

వ్యాస!=విశాలబుద్ధే! పుల్ల...నేత్ర!=మహామేధ కలవా-డా!, విచ్చినపొడవు తామర రేకుల కనులు కలవా-డా!, ఓ వ్యాసదేవు-డా!; యేన త్వయా=ఏ నీచేత, భారత తైల పూర్ణః=భారతమను చమురుచే నిండిన, జ్ఞానమయ ప్రదీపః=జ్ఞానమయ మగు దివ్వె, ప్రజ్వాలితః=వె-లిగింప- బడెనో, (తసై#్మ) తే=అట్టి నీ కొఱకు, నమః=జోత, అస్తు=అగు-గాక!

పుట 133 మన్మనా భవ మద్‌ భక్తో మద్యాజీ మాం నమస్కురు,

మామే వైష్యసి యుక్త్వైవ మాత్మానం మత్పరాయణః.

- గీత 934.

(కౌంతేయ=అర్జునా! త్వం=నీవు) మన్మనాః భవ=నాయందే మనసు= కలవా-డ మగుము, మద్‌ భక్తః భవ=నా భక్తు-డ వగుము, మద్‌ యాజీ(భవ)=నన్ను పూజించువా-డ వగుము, మాం=నన్ను అన-గా నాకు నమః కురు=జోత లిడుము, ఏవం=ఇటులు, ఆత్మానం=ఆత్మనగు నన్ను, యుక్త్వా=అనుసంధించి, మత్‌ పరాయణః=నేనే పరమ పదముగా కలవా-డనై మా మేవ=నన్నే, ఏష్యసి=పొందగలవు.

అథ చిత్తం సమాధాతు న శక్నోషిమయి స్థితమ్‌,

అభ్యాసయోగేన తతో మామిచ్ఛాప్తుంధనంజయ!.

- గీత 129.

ధనంజయ=అర్జునా! అథ=ఒకవేళ, మయి=నాయందు అనగా విశ్వరూపమునందు, చిత్తం=అంతః కరణమును, స్థిరం=నిశ్చలముగా, సమాధాతుం=నిలుపుటకు, నశక్నోషి=సమర్థు-డవుకాకపోయినచో, తతః=అపుడు, అభ్యాసయోగేన= అభ్యాసయోగముచే అంతఃకరణమును విషయాదులనుండి మరల్చి భగవత్ప్రతిమాదుల యందు స్థిరముగా నిలుచుట అభ్యాసము. అట్టినిరంతరాభ్యాసమువలన కలుగు చిత్తవృత్తి నిరోధము అభ్యాసయాగము. మాం=విశ్వరూపు-డగు నన్ను, ఆపుం=పొందుటకు ఇచ్ఛ=ప్రార్థింపుము.

పుట 134 కలేర్దోషనిధేరాజ& అస్త్యేవైకొమహాన్‌ గుణః.

- భాగవతము.

రాజ&=ఓ రాజా! దోషనిధేః=పాపపు పాతరయగు, కలేః=కలికి, ఏకః=ఒక, మహా&=దొడ్డ, గుణః=మేలు, అస్త్యేవ=కలద,

'' ఈశ్వరానుగ్రహాదేవపుంసా మద్వైత వాసనా.

పుంసాం=పురుషులకు(జనమునకు), అద్వైతవాసనా=అద్వైత సంస్కారము, ఈశ్వరానుగ్రహా దేవ=ఈశ్వరుని అనుగ్రహము వలననే (కలుగును),

'' బ్రహ్మసూత్ర కృతే తసై#్మ వేదవ్యాసాయ ధీవతే,

జ్ఞాన శక్త్యవతారాయ నమో భగవతే హరేః.

బ్రహ్మ...కృతే=బ్రహ్మసూత్రకర్తయు, ధీమతే=బుద్ధిమంతు-డును, హరేః=శ్రీమన్నారాయణునియొక్క అవతారమును, భగవతే=షడ్గుణౖశ్వర్య సంపన్ను-డును అగు, తసై#్మ వేదవ్యాసాయ=ప్రసిద్ధు- డగు వేదవ్యాసుల వారికి, నమః=నమస్కారము.

పుట 135 వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే,

నమోవై బ్రహ్మ నిధయే వాసిష్ఠాయ నమోనమః||

బ్రహ్మనిధయే=వేదనిధియు, వ్యాసాయ విష్ణురూపాయ=విష్ణురూపు-డైన వ్యాసు-డును, వ్యాసరూపాయ విష్ణవే=వ్యాస రూవు-డగు విష్ణువును ఐన, వాసిష్ఠాయ=పసిష్ఠ పౌత్రునకు, నమః=నమస్కారము.

పుట 136 స్థిత ప్రజ్ఞస్య కా భాషా సమాధిస్థస్య కేశవ!

స్థితధీః కిం ప్రభాషేత కి మాసీన వ్రజేత కిమ్‌?

- గీతా 254.

కేశవ=శ్రీకృష్ణా! సమాధిస్థస్య=సమాధి యందున్న, స్థిత ప్రజ్ఞశ్య=నిశ్చల మయిన బుద్ధి వృత్తి కలవానికి, కా భాషా=ఏమి మాట? 'నేను పరబ్రహ్మమను' అను బుద్ధి వృత్తి కలవా-డు ఇతరులచే ఏ మని చెప్ప-బడుచున్నా-డు? రాగద్వేషముల జయించి ఆత్మతుష్టు-డు స్థితప్రజ్ఞు-ని చెప్ప-బోవును, స్థితధీః=(నిర్వికల్పసమాధి దొర-గిన) స్థిత ప్రజ్ఞుడును, కిం ప్రభాషేత=ఎటులు పలుకును? కిమ్‌ ఆసీత=ఎటులు ఉంటును? కిం వ్రజేత=ఎటులు చరించును?

పుట 138 'వాసుదేవ స=ర్వ మితి'

(అర్ధము వెనుక చెప్ప-బడెను.)

పుట 140 రూపం తవ స్ఫురిత చంద్ర మరీచిగౌర

మాలోక్యతే శిశిర వాగధిదైవతం యైః,

నిసీ=మ సూక్తి రచనామృత నిర్ఘరిణ్య

స్తస్య ప్రకామ మధురాః ప్రసరంతి వాచః.

యైః=ఎవరిచే, స్ఫురిత...గౌరం=మెఱయు చంద్ర కిరణములవలె తెల్లనైనదియు, శిశిర...తమ్‌=చల్లని పలుకులకు అధిదైవత మయినదియు నగు, తవ=నీ యొక్క, రూపం=రూపు, ఆరోక్యతే=చూడ-బడుచున్నదో, తస్య=వారికి (తేషాం లేక తేభ్యః) లేక వారినుండి, ప్రకామ మధురాః=మిగుల నీయనివియు, ని సీ=మ...నిర్ఘరిణ్యః=అంతు లేని కవితా రచనలు అను అమృతపు సెలయేళ్ళు, ప్రసరంతి=ప్రవహించుచున్నవి.

పుట 141 కా త్వం శుభే కన్య పరిగ్రహో వా?

కిం వా మదభ్యాగమ కారణం తే?

ఆచక్ష్వ మత్వా వశినాం రఘూణాం

మనః పరస్త్రీ విముఖ ప్రవృత్తి.

- రఘు 168.

శుభే=ఓ సుమంగలీ! కా త్వమ్‌=నీ వెవతవు? కస్య=ఎవనియొక్క, పరిగ్రహో నా? =భార్యవు? తే=నీకు, మత్‌ అభ్యాగమ కారణంవాకిమ్‌=నాకడకు వచ్చుటకు- గల కారణమేమి? పశినాం=జితేంద్రియులగు, రఘూణాం=రఘువులయొక్క, మనః=మనసు, పరస్త్రీ...ప్రవృత్తి=పరస్త్రీలయెడ పరాజ్ముఖమయిన వృత్తి కలదని, మత్వా=ఎఱి-గి, ఆచక్ష్వ=చెప్పుము.

పుట 142 చిత్ర ద్విపాః పద్మవనావతీర్ణాః,

కరేణుభి క్దత్త మృణాఖ భంగాః|

నఖాంకుశాఘాత విభిన్నకుంభాః

సంరబ్ధసింహ ప్రహృతం వహన్తి||

- రఘు 1616.

పద్మ...అవతీర్ణాః=పద్మవనములలోనికి దిగినచందముగా వ్రాయ-బడినవియు, కరేణుభిః=పెంటియేనుగులచే, దత్త...భంగాః=అందీయ-బడిన తామరతూ-డులు కలవియు నగు, చిత్ర ద్విపాః=చిత్తరువులలో వ్రాయ-బడిన ఏను-గుల, నఖ.......కుంభాః=గోటి అంకుశముల పోటులచే చీల్చ-బడిన కుంభస్థలములు కలవై, సంరబ్ధ...ప్రహృతం=కుపితసింహ ప్రహారములను, వహన్తి=వహించుచున్నవి. 'అయోధ్య విజనమై పాడుపడ్డది. ఇపుడు ఏనుగులు లేవు. గోడలమీ-ద వ్రాయ-బడిన ఏను-గులే ఏను-గులు. అయోధ్య అడవి అయిపో-బట్టి నగళ్ళలోనికిగూడ సింహము వచ్చుచ్చున్నవి' అని తాత్పర్యము.

పుట 143 చేత శ్చంచలతాం విహాయ పురతః సంధాయ కోటిద్వయం

తత్రైకత్ర నిధేహి సర్వవిషయా నన్యత్ర చ శ్రీపతిమ్‌,

విశ్రాంతిర్హిత మప్యహో క్వను తమో ర్మధ్యే తదాలోచ్యతాం

యుక్త్యావా7నుభ##వేన యత్ర పరమా నందశ్చ తతే=వ్యతామ్‌||

- ప్రబోధ సుధాకరము.

చేతః=ఓ చిత్తమా! చంచలతాం=చాంచల్యమును, విహాయ=విడనాడి, పురతః=ఎదుట, కొటిద్వయమ్‌=రెండు తక్కెడలను, సంధాయ=సమకూర్చి, తత్ర=ఆరెంటిలో, ఏకత్ర=ఒకతక్కెడలో, సర్వవిషయా&=విషయ(సుఖ)ములనన్నింటిని, అన్యత్ర చ=మణియొక, తక్కెడలో, శ్రీపతిం చ=వాసుదేవుని, అన-గా భగవంతుని, నిధేహి=ఉంచుమా!తయోర్మధ్యే=ఆరెండు తక్కెడలలో, అస్య=ఈజీవునకు, విశ్రాంతిః=నిలుకడయు, హితమ్‌=హితమును, క్వను=ఎచటనో, తత్‌=దానిని, అలోచ్యతామ్‌=ఆలోచింప-బడు-గాక! యత్ర=ఎందు, యుక్త్యావా=యుక్తిచే-గాని, అనుభ##వేన=అనుభవములచేగాని, పరమానంద శ్చ=బ్రహ్మానందమో, తత్‌=అది, సేవ్యతామ్‌=సేవింప-బడు-గాక!

పుట 145 మృత్తికే! హన మే పాపం

యన్మయా దుష్కృతం కృతమ్‌.

- తై-అరణ్యక-1 అను 8 మంత్ర.

మృత్తికే=ఓ మృత్తికాభిమాన దేవతా! మయా=నాచే, యత్‌=ఏ, దుష్కృతమ్‌=చేయరాని, పాపం=పాపము. కృతం=చేయ-బడెనో, మే=నాయొక్క, (పాపం=ఆ పాపమును) హన=నాశము చేయుమా!

పుట 146 ఆపోహిష్ఠా మయోభువస్థాన ఊర్జే దధాతన.

ఆపః=ఓ ఉదకములారా! హి=ఎందువలన, మయోభువఃస్థ=సుఖము కలిగించు చుంటిరో (అందువలన) తాః=అట్టిమీరు, నః=మా(యొక్క), ఊర్జే=బలము కొఱకును, మహే=మహనీయమును, రణాల=రమణీలమును అగు, చక్షుసే=బ్రహ్మజ్ఞానము కొఱకును, దధాతన=ఉపకరింపుడు, మీవలన మాకు సుఖము కలుగుచున్నది. ఆ సుఖము బలజ్ఞానములను. ఐహిక ఆముష్మిక సుఖములను కలిగించుగాక అని తాత్పర్యము.

పుట 146 త్ర్యంబకం యజామహే సుంగధిం వుష్టి వర్ధనమ్‌|

ఉర్వారుకమివ బంధనాత్‌ మృత్యోర్ముక్షీయ మామృతాత్‌||

సుగంధిం=మేలుతావి కలిగినట్టియు, పుష్టివర్ధనం=లౌకికమగుపుష్టిని, వైదికమగు పుష్టిని పెంపొనరించునట్టియు; త్ర్యంబకం=మూడుకన్నుల దేవరను=శివుని; యజామహే=పూజించుచున్నాము (పూజింతము) (హే త్ర్యంబక=ఓ ముక్కంటీ) బంధనాత్‌=తొడిమ నుండి, ఉర్వారుకమివ=దోసపండువలె, మృత్యోః=మృత్యువునుండి, ముక్షీయ=విడివడుదముగాక! అమృతాత్‌=మోక్షమునుండి, మా=విడివడకుందముగాక!

పుట 146 త్రియాయుషం జమదగ్నేః కశ్యపస్య త్రియాయుషమ్‌

అగస్తస్య త్రియుయుషం యద్దేవానాం

త్రియాయుషమ్‌ తన్మే అస్తు త్రియాయుషం||

- తైత్తిరీయ సంహిత.

జమదగ్నేః త్రియాయుషం=(త్క్యాయుషంఅనిపాఠాంతరము) జమదగ్నియొక్క కౌమార ¸°వన వార్ధకముల అయుష్యమును. (అటులే) కశ్యవస్య త్రియాయుషం......దేవానాం త్రియాయుషం యత్‌=కశ్యపు-డు, అగస్త్యు-డు, దేవతలు, వీరి అందఱయు ఆయుష్యము ఏది కలదో, తత్‌=ఆ. త్రియాయుషమ్‌=కౌమార ¸°వన వార్ధకములు మూస-గూడిన ఆయష్యము, మే=నాకు, అస్తు=కలుగుగాక. (ఇది తైత్తిరీయసంహితలో కానరాలేదు, మాధ్యందినసంహితలో నున్నది. మఱియు 'అగస్తస్య త్రియాయుషం' అనుపాదము లేదు. ఆ పాదము ఎక్కుడుగాకూడ కనబడుచున్నది. (2్‌్త2) ఏకాగ్ని కాండకు తైత్తిరీయమునకిది అనుబంధముగా హరదత్త భాష్యములో కాన-బడును. హరదత్తుని భాష్యమున గూడ 'అగస్తస్య త్రియాయుషం' లేదు. మఱియునిచట 'క్షురకర్మణో7 నాయుష్కర్మత్వాత్‌ తతా=ధన భూతస్త్వేవ మభి మంత్రణమ్‌' అని యున్నది. దీని ప్రతీకగా సూత్రము-అప రేణాగ్నిం కట పరకాయాం వోపవిశ్య క్షురమభిమంత్ర్య (పరకాయాంవా=కనుపులేని తృణ విశేషము నందుగాని సెజ్జమీదగాని) అని కలదు. 'ఇరిణ్యాం' అని ఒకపాఠము సుదర్శన టీకలో గలదు. దీనికి జింకతోలు అని అర్థము చెప్పుచున్నారు కాన నిది క్షురకర్మలో నభిప్రేతము. ఇక బృహజ్జాబాలోపనిషత్తు నందును (5 బ్రాహ్మణము చూ.) వేదత్రయదృష్టి పూర్వక త్రిపుండ్రధారణ విధిగా, ఇటులు కలదు:-

మానస్తోకేతి మంత్రేణ మన్త్రితం భస్మ ధారయేత్‌

ఊర్‌ ధ్వపుండ్రం భ##వేత్‌ సామ మధ్యపుండ్రంత్రియాయుషమ్‌.

త్రియాయుషాణి కురుతే లలాటే చ భుజద్వయే

నాభౌ శిరసి హృత్‌ పార్శ్వే బ్రాహ్మణాః క్షత్రియా స్తథా.

'త్రియాజుష మనుటకు త్రియాయుషమ్‌ అని వర్ణ వ్యత్యయము' అని ఉపనిషద్‌ బ్రహ్మేంద్రులు. 'త్రియాయుషం జమదగ్నేః' అని కాలాగ్ని రుద్రోపనిషత్తు నందును కలదు. చూ. 3 వాక్యము.ొ

పుట 147 'అగ్ని రితి భస్మ వాయు రితి భస్మ జలమితి భస్మ స్ధల

మితి భస్మ వ్యోమేతి భస్మ్వసర్వగ్‌ం హవా ఇదం భస్మ

వాజ్మన ఇత్యేతాని చక్షూగ్‌ంషి కరణానిభస్మ...

- జాబాలో పనిషది 15 బ్రాహ్మణ.

'నిప్పు గాలి నీరు నేల నింగియు భస్మమే; ఇదెల్లభస్మమే. వాక్కు మనసు= అను నివియు కనులు కరణములు భస్మమే...'

పుట 149 'తమేతం వేదాను వచనేన బ్రాహ్మణా వివిదిషన్తి

యజ్ఞేన దానేన తపసా7నాశ##కేన'

- బృహ 4424.

ౌౌౌౌౌౌౌౌౌౌౌౌౌౌౌౌౌౌౌౌౌౌౌౌౌౌౌౌౌౌౌౌౌౌౌౌౌౌౌౌౌౌౌౌౌౌౌౌౌౌౌౌౌౌౌౌౌౌౌౌౌౌౌౌౌౌౌౌౌౌౌౌౌౌౌ

్వ 'దేవా భస్మ ఋషయో భస్మ సర్వం హ వా ఏత దిదం భస్మ పూతం పావనం నమామి' (భస్మ జాబాలోపనిషత్తు 1 అధ్యాయ 5.) అను సాఠభేదము కానిపించుచున్నది. కాలాగ్ని రుద్రోపనిషత్తు నందును ఇటులే యున్నది.



బ్రాహ్మణాః=బ్రాహ్మణులు, తం=ఆ, ఏతం=ఈ పరమాత్మను, వేదాను వచనేన=మంత్ర బ్రాహ్మణ రూపమగు వేదవాక్యముచే (కర్మ, బ్రహ్మోపపాదకమగు వేదవాక్యముచే), యజ్ఞేన=యజ్ఞముచేతను(కర్మచేతను,) దానేన=దానముచేతను, దవ=కృచ్ఛ్రము, చాంద్రాయణము మొదలగు తపసు= చేతను; అనాశ##కేన=కర్మ ఫలాపేక్ష లేకపోవుటచేతను, వివిదిషన్తి=తెలిసికొన-గోరుదురు.

పుట 150 అశుద్ధ మితి చే న్న, శబ్దాత్‌.

- బ్రహ్మసూత్ర 3125.

అశుద్ధ మితి చేత్‌=యజ్ఞ మధర్మమందువా, కాదు. శబ్దాత్‌=వేదము యజ్ఞము హింసకాదని అనుటవలన వేదములందు ధర్మమని పెక్కు తెఱ-గుల- జెప్పబడిన యజ్ఞవు అధర్మ మెట్లగును? దాన హింస యుండు-గాక, అది వేదవిహితము. దేశ కాలముల-బట్టి అధర్మమయినది ధర్మము కావచ్చును. సత్యము ధర్మమని అనుటలో సందియము లేదుకద! ఒక-డు 'కల్లలాడను' అని ప్రతినపూని అడవిలో తపసు= చేసుకొనుచుండ-గా దొంగలచే తఱుమ-బడుచువచ్చు నొక బ్రాహ్మణు-డు అతని కుటీరమున- దూఱను. పిదప దొంగలు వచ్చి పాఱివచ్చిన బ్రాహ్మణుని వృత్తాంత మడిగిరి. అత-డు సత్యము చెప్పెను. దొంగలు కుటీరములో నున్న బాపని చంపి అతనికడ నున్న డబ్బుదొ-చుకొనిపొయిరి. ఆ దోషము ఆ సత్యవాది నాశ్రయించెను. ఈరీతిగా కేవలము తా ననుభవించుటకు చేసిన హింస హింస కానగును. యజ్ఞముకొఱకు జేసిన హింస ధర్మము కావచ్చును అని తాత్పర్యము.

పుట 151 'అహింసన్‌ సర్వభూతా న్యస్యత్ర తీర్థేభ్యః'

- చాందోగ్య - 8 అధ్యాయ 15.

తీర్థేష్యః అన్యత్ర=శ్రుతి స్మృతులు చెప్పిన అశ్రమోచిత కర్మలకంటె వేఱుపట్ల, సర్వభూతాని=ఆన్ని భూతములను అన-గా ఏ భూతమునేని, అహింస&=హింసింపక (బ్రతికినంతపట్టు ఇట్టులు వర్తించుచు నిర్వాసను-డై బ్రహ్మలోకమును పొంది బ్రహ్మముఖమున పరబ్రహ్మ విద్య బడసి పునరావృత్తి లేని కైవల్యము నందును.)

పుట 160 ఋతం పిబంతౌ సుకృతన్య లోకే

గుహాం ప్రవిఎ్టౌ పరమే పరార్ధే.

- కఠ.

ఛాయాతపౌ బ్రహ్మవిదో వదన్తి.

- తై - ఉప - బ్రహ్మానందవల్లీ.

పఞ్ఛాగ్న యో యే చ త్రిణాచికేతాః.

- కధా 3 వల్లి - 1.

యే=ఎవరు, త్రిణాచికేతాః=త్రేతాగ్నులో-ముమ్మఱు నాచి కేతాగ్ని చయనము చేసినవారో-మఱియు, పంచాగ్నయః=గార్హపత్యాగ్ని ఆహవనీయాగ్ని దక్షిణాగ్ని సభ్యాగ్ని ఆవసధ్యాగ్ని అను అయిదగ్నులు కలవారో (లేక ద్యు పర్జన్య పృథివే యోషిత్‌, పురుషులయెడ అగ్నిదృష్టి చేయువారో వీరిని పంచాగ్ను లని అందురు. నే-టివా రగ్నిత్రయమునే ఆరాధించు చున్నను ఈ రెండును శ్రుత్యుక్తములగుట రెండుగూడ ఇచట- జేప్ప-బడెను) తే=అట్టి. బ్రహ్మవిదః=బ్రహ్మవేత్తలు, సుకృతస్య=తాను చేసికొన్న, కర్మణః=కర్మయొక్క, ఋతుం=సత్యమునుఅని అర్థము. ఏలన-గాకర్మఫలమవశ్యంభావికదా! పిబంతౌ=అనుభవించువారును, లోకే= ఈశరీరమునందు, పఠమే పరార్థే=పరమస్థానమగు, గుహాం=బుద్ధిలో (సప్తమ్యర్థమున ద్వితీయా) ప్రవిష్టౌ=ప్రవేశించిన జీవాత్మ పరమాత్మలను, ఛాయాతపావివ=ఎండ నీడలనువలె, వదంతి=చెప్పుదురు. (పరమవ్యోమ యన-బడుహార్దాకాశమునందున్న) గుహాయాం=బుద్ధిలో, నిహితం=ఉన్న బ్రహ్మమును, యః=ఎవ-డు, వేద= తెలియుచున్నాడో (అత-డు నిరవశేషముగా కామ్యభోగములను అందురు.)

పుట 162 మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూనిణ,

అగ్రతఃశివరూపాయ చాశ్వత్థాయనమోనమః.

మూలతః=మొదటనుబట్టి, బ్రహ్మరూపాయ=బ్రహ్మరూపముగలట్టియు, మధ్యతః= నడుమనుబట్టి, విష్ణురూపిణ=విష్ణురూపము కలట్టియు, అగ్రతః= అగ్రభాగమునుబట్టి, శివరూపాయ=శివరూపముకల, అశ్వత్థాయ=రావిచెట్టుకు, నమోనమః=నమస్కారము, నమస్కారము. (ఆదరమందు ద్విరుక్తి).

పుట 162 'ఊర్‌ ధ్వమూల మధశ్శాఖ

మశ్వత్థం ప్రాహురవ్యయమ్‌'

- గీతా.

అశ్వత్థం = సంసారమను రావిచెట్టును, ఊర్‌ ధ్వమూలం=పైకి తన్నిన వేఱులు కలదానినిగను, అధశ్శాఖం=క్రిందికి సాగిన కొమ్మలుకలదానినిగను, అవ్యయం=తఱుగని దానినిగను, ఆహుః=చెప్పుదురు.

'' ఆదిత్య మంబికాం విష్ణుంగణనాథంమహేశ్వరమ్‌.

పంచాయతన పూజలో, సూర్యుడు, అంబిక, విష్ణువు, గణపతి, మహేశ్వరు-డు ఉన్నారు! ఈ ఐదుగురను పూజింపవలెను.

పుట 164 'విద్యా గౌడే శివ శ్చో ళే'

గౌడే=గౌడదేశమందు విద్యయు, చోళే=చోళ##దేశమందు శివు-డును ప్రసిద్ధులు.


Jagathguru Bhodalu Vol-3        Chapters        Last Page