Geetha Koumudi-1    Chapters   

జగద్గురువులైన శ్రీ ఆదిశంకర భగవత్పూజ్యపాదులకు

అం కి త ము

'వ్యుప్తకేశాయచ' అని వేదములో వర్ణింపబడిన ప్రకారము ఆ పరమేశ్వరుని వ్యుప్తకేశరూపులు, కలియుగ జ్ఞానావతారులు నైనట్టియు,

ఊనషోడశవయఃకాలములో భాష్యప్రకరణస్తోత్రాది పార్ధశతాధిక అమూల్య గ్రంథరాశిని జగదుద్ధరణార్థమై అనుగ్రహించిన సర్వజ్ఞులై నట్టియు,

అపౌరుషేయము వైజ్ఞాన పేటికలనదగు ఉపనిషత్తుల లోని అద్వైతసిద్ధాంతమును ఉద్ధరించి ప్రచారముచేసి, సర్వదుర్మతములను ఖండించి, అద్వైతమునకు ఆధ్యాత్మిక సామ్రాజ్య పట్టాభిషేకమును గావించి భారతదేశములో చతుర్దశలందును పీఠచతుష్టయమును అమర్చి, షణ్మతములగూడ స్థాపించి 'జగద్గురువులు' అను సార్ధక బిరుదముతో విరాజితులై నట్టియు,

దయాసముద్రులై నట్టియు,

శ్రీ మ దా ది శం క ర భ గ వ త్పూ జ్య పా దు ల కు

వారి యనుగ్రహవి శేషముచే రచింపబడిన

గీ తా కౌ ము ది

అని ఈ గ్రంథమును బద్ధాంజలినై అంకితము చేయుచున్నాను.

శంకరమఠము విద్యాశంకరభారతీస్వామి,

బందరు శ్రీ గాయత్రీపీఠము.

-----0-----

Geetha Koumudi-1    Chapters