Sri Laxmihrudayamu    Chapters   

పీఠిక

శ్రీ పోతుకూచి సుబ్రహ్మణ్యశాస్త్రి

M.A.M. Litt., Ph.D.,

Head of the Dept. of English, Nagapur University,

NAGAPUR.

పరాశక్తి అనుభ##వైకగమ్య, భక్తిసులభ, నానాభిద. అనేకనామములతో విలసిల్లు మాతృస్వరూపిణిని యంత్రరూపమున మంత్రరూపమున పెద్దలు వివరించియున్నారు. అనాది కాలమునుండి సాధకులు ఆమెనుగూర్చి భక్తిమార్గమున, యోగమార్గమున అన్వేషణలు సలిపి కృతార్ధులైనారు. ఈసాధన అనబడు నిదిధ్యాసనకు శ్రవణ మననములు పూర్వాంగములు. ఈ రెంటిని మేళవించు యత్నమున బయల్వెడలినవి స్తోత్రములు. ఇట్టి స్తోత్రములలో ఉత్తమమైనవి సాధనాంగములైన హృదయములు. దేన తాహృదయమును చక్కగా అవగాహన చేసికొనినచో సాధకునకు సరియైన లక్ష్యము కుదరదు. హృదయమనగనే దేవతను అంతర్యామి రూపమున, అధ్యక్షరూపమున భావన చేయవలసియున్నది. ఇట్టి హృదయములలో విశిష్టమైనది "శ్రీ లక్ష్మీహృదయము."

లక్ష్మి అనగా శ్రీదేవి. శ్రీదేవిని ఉద్దేశించి వచ్చినది శ్రీ విద్య. ఈవిద్యకు ప్రతీక శ్రీచక్రము. మాతృకకు తత్ప్రతీకకు అభేదమును తెల్పు శ్రీ చక్రమున ప్రతష్ఠితమైన శ్రీదేవిని శ్రీచక్రరాజతనయగా కూడ భావించుట కలదు గనుకనే దేవతకు తత్సాధకునకు తాదాత్మ్యమును సాధించుట ఈ హృదయముల తాత్పర్యము. కావుననే దేవతను పరమశివమయి, సకలజనని, సనాతని, అంతర్యామి అని పులుచుటయే గాక-"తన్నాస్తి యత్‌ తద్వ్యతిరిక్తవస్తు"అనినారు. ఆమెకంటె భిన్నమైనదేమియు లేదు. దుర్గాస ప్తశతిలో చెప్పిన రూపముల నన్నిటినిలక్ష్మిరూపమున ఈ హృదయములో ప్రస్తుతించిరి.

ఈశ్రీలక్ష్మీహృదయమును హృదయంగమమైన అనువాద, వివరణములతో మనకొసగిన శ్రీ శ్రియానందనాథాపర నామధేయులగు బ్రహ్మ శ్రీ ఈశ్వర సత్యనారాయణశర్మగారు సాధన గ్రంథ మండలికి గాని, సాధకలోకమునకు గాని అపరిచితులు గారు. ఈశ్వరవారు ఈశ్వరానుభూతిని పలుగ్రంథములలో వివరించి యున్నారు. కాని ఈ గ్రంథము వారికృషిలో పర్వాతాగ్రమువంటిది. వారింతకుముందు రచించిన గ్రంథములలోని సారము నిచట ప్రస్తుతించుచు, వివరముల నాయారచనలలో చెప్పినట్లు వ్రాయుచు ఈవివరణమును తమ ప్రధాన సిద్ధాంత ప్రతిపాదకముగా నిచ్చియున్నారు. అందుచే నీ గ్రంథము సులభముగా అవగతము కాజాలదు. కాన ఈశ్వర వారి రచనలో ప్రత్యేకత ఉన్నది. చెప్పదలచినదానిని వారెంత సూత్రప్రాయముగా ఉచ్చరించినను, అది సర్వజనులకు తేలికగా బోధపడగలదు. వారిశైలి అట్టిది. అట్టిచో శ్రీ సత్యనారాయణశర్మగారు శ్రియానందసార్థకనామముతో లక్ష్మీహృదయమును సమగ్రముగా వివరించ సమర్థులు. ఆంధ్రులు ధన్యులు.

నారాయణస్య హృదయే భవతీ యథాస్తే|

నారాయణో7పితవ హృత్కమలే యథాస్తే||

అని ఒక శ్లోకముకూడా ఇందే ఉన్నదికదా!

తమ విశిష్టవైదుష్యము నాధారముగా చేసికొని లక్ష్మీ హృదయమును మనకు కరతలామలకమువలె ఇచ్చిన శ్రీ ఈశ్వరవారికి మన మీయగల్గినది కేవలము భక్త్యంజలియే. ఇట్టి మహత్తర గ్రంథములు నాంధ్రులకిచ్చి, ఆధ్యాత్మిక వికాసమునకు గట్టిపునాదులను ఇంకనువేసి, దానిపై తమ్యమైన ధర్మసౌధమును శ్రీ ఈశ్వరవారు నిర్మింపవలెననే ప్రార్థనయే సమంజసమని ఈ గ్రంథము చాటుచున్నది.

నాగపురుము} ఇట్లు

19-9-67 పోతుకూచి సుబ్రహ్మణ్యశాస్త్రి

Sri Laxmihrudayamu    Chapters