Sri Laxmihrudayamu    Chapters   

"పద్మినీ మీం శరణ మహం ప్రపద్యే"

ఓం ఈం శ్రీమాత్రేనమః

సాధకపాఠకులకు

నావిరెండుమాటలు

గాయత్రి మొదలు సర్వమంత్రాత్మిక దేవతలకు హృదయాది (హృదయము, మూలము, కవచము, మాల, స్తుతి, నామావళి) షడంగములు సుప్రసిద్ధముగా ఋష్యుదితమలు, విధిగా నాచరింపఁబడుచున్నవి. అందు హృదయము మొదటిది. హృదయమనఁగా నుపాస్యదేవతపేరఁబఱగుసర్వకారణ భూత శ్రీ గురుని పారమ్య మహిమాది వర్ణనరూపత త్త్వముం బ్రకాశింపఁజేయు గ్రంథమే. దీనితోడి సమగ్రపరచయము లేని సాధకుఁడ ఉపాసక నామానర్హుఁడు. కావున నంగములలోఁబ్రధానాంగమైన హృదయమునె మననముఁ జేయనివాఁడు అఖండచైతన్యమయవస్తుత్త్వము నెఱుఁగఁజాలడు. ఆత్మ వస్తువునుగూర్చి పరులకుఁదెలుసఁజాలఁడు. తాదాత్మ్యముతో నుపాసింపఁజాలఁడు. ఉపాసనముకొఱకే యుపాసనముఁజేయుచు మిథ్యాసంతుష్టితోనే కనులు మూసికొనును. కనుకనే హృదయాంగమును దొలుతఁజెప్పిరి.

శ్రీమాత నాచేత వ్రాయించిన పుస్తకములతో నాంధ్రసాధక లోకమునకుఁగొంత పరిచయముండి యుండును. వానియెడఁ దద్విద్యాసంపన్నులైనవారిలోఁగొందఱు తమ తమ యబిప్రాయములను వెల్లడించిరి. పులువురు కనియందురు. ఈ మనశరీరయంత్రములు శ్రీమాత తనసంకల్పములను నెరవేర్చుకొనఁబన్నుకొన్నవె. జనికాల గ్రహస్థితి చారాదులను బట్టి యీయంత్రముల యాయుఃపిరమితి అనఁగా విశ్వాయూరూపమునను, సర్వాయూరూపమునను బ్రసిద్ధయైన శ్రీమాతయంత్రమందు నిల్వనెంచి కాలమే సమర్థదైవజ్ఞులచే నిర్ణయింపఁబడుచుండను. అయినను అమ్మ స్వతంత్ర. చేయను జేయకుండను, జేసినది మార్పనుంగలది. ఆత్మార్పణశీలుఁడైన సాధకపుత్త్రుని యెడఁదాన యీస్వాతంత్య్రశక్తిని వినియోగించి యాయువును బెంచి, కర్మఫలంబును గుదించి, జన్మముల సంఖ్య తగ్గించి, పూర్ణకరుణ కలిగినప్పుడు ఈతనువుతోనే సమాప్తముఁజేయును. "అమ్ముతో ముచ్చటలు" అను నాపుస్తకమునందు "కడమగు నాల్గుజన్మములు కర్మ ఫలమ్ములు నేఁడే కుడ్పి నాయొడి నిడుకొందు నిన్ను" అను పద్యమును జూచునది. దైవజ్ఞులెల్లరు నీ సాధకుని వయస్సు డెబ్బదిరెండుకంటె నదన మేనాఁడును గాదనియె చెప్పుచు వచ్చిరి. కాని యిపుడు ఎనుబదిరెండు సంవత్సరములు.

దృష్టి బొత్తిగా మందగించిపోయినది. సర్వమునకుఁబరాధీనమె. కాస శ్వాసాదు లతిధులు తఱుచుగా ననుగ్రహించుచునె యున్నారు. కాని తనసంకల్పము లింకెన్నియోనెరవేర్చుకొనఁ దలఁచిన యాయూరూపిణియమ్మయూయుర్వేదమును గూర్చిన (ఆత్మానుభవజ్ఞానమునుగూర్చిన) చిన్నచిన్న పుస్తకములను వెలువరింప నీయంత్రమును విడువక, చక్రములరిగిపోయినను, గీళ్ళు సడిలపోయినను, వాడుకొనుచునే యున్నది.

ఈ లక్ష్మీ హృదయము వివరణము పేరి రచనము కేవలబాలకోపయోగి. మందాధికారి సాధకులనె తనియింపఁగలది. వారైనను జిన్ననాఁడు సంధ్యావందన కర్మమందలి యుపాస్యదేవతయైన సంధ్యానామకగాయత్రిని "ఆయాతు వరదా దేవీ అక్షరం బ్రహ్మసమ్మితమ్‌" యనుమాటతో దేవిని బిలిచి"బ్రహ్మణభ్యో7భ్యనుజ్ఞాతాగచ్ఛదేవి యథా సుఖమ్‌" యనుమాటతో నంతమగు నిర్దిష్టకర్మమును జక్కఁగా సాగింపనేర్చినవారైనపుడె రవ్వంత తనివి నొందఁగలరు. గాయత్రీనామక కుండలినీ పరాశక్తిని ఏకడనుండి ఏకడకుఁదెచ్చుటో యెఱిఁగికొని మఱల నక్కడనే యుత్సర్జనముఁజేయు నేర్పు లేనపుడును, అది చాలనప్పుడును, జపముకొఱకే జపమగును. "నభిన్నాం ప్రతిపద్యేత గాయత్రీం బ్రహ్మణాసహ, (సో7హం) సాహమస్మీత్యుపాసీత విధినా యేన కేనచిత్‌" "మధ్యే7ర్థమనుస్మరన్‌" మున్నగు శ్రీశంకరవసిష్ఠాద్యాచార్యుల యుపదేశముల కలవాటుపడి "శ్రిమమావాహయామి" యంచుగాయత్రీనామక శ్రీదేవిల నుపాసించు ధన్యత నొందినవారి కిందలి విషయము నిజముగా బాలకోపయోగియె.

ఇందలి శ్లోకరూపమంత్రములకు నోపినంతగా సామాన్యబాహ్యార్థముతోఁబాటు ¸°గికార్థము వివరింపఁబడినది. నా వలన మంత్రదీక్షఁగైకొన్న శిష్యులకెల్లరకు మంత్రార్థమును, ధ్యానశ్లోకపరమార్థమును సుషుమ్నాపథమందలి మూలా ధారాది శక్తికేంద్రములందు మంత్రన్యాసవిధిని దెలిసినంతగా శిక్షించుటయు నంతతో విడునక హృదయాది నామావళ్యంతమగు షడంగముల యర్థములను దెలియఁజెప్పుటయు నాకుఁ దప్పనిపని. శ్రీమంత్రగ్రాహకులకు హృదయంగమముగా నధర్వశిర్షోక్తమయిన యీ లక్ష్మీహృదయమునే యిచ్చుచుందును. కనుక దీని యాంధ్రవ్యాఖ్య, ¸°గికార్థముతోఁ గలిపి సంగ్రహముగా వివరించి ప్రకటించుట, నావారికేగాక, శ్రీదేవ్యుపాసకులైన తదితరులకును ఇంచుకంత రంజకము కాకపోదని సాహసించి యీ గ్రంథము నవతరింపఁజేసితిని.

ఉ|| వ్రాయుటనాదువంతు, అది భక్తవరుల్‌గనిమెచ్చనచ్చులో

వేయఁగఁజాలు పుణ్యు వెనువెంటనె నిల్పుట నీదువంతుగా

నేయలవాటుఁజేసితి వికేటికిఁ జింతలు? అమ్మ మేపు న

బ్బాయికిఁ జేయి యంటగునె భక్తసురద్రుమ! దేవి!భార్గవీ!

అను నాయనుభవము వ్యర్థముకాకుండఁ జేసినది శ్రీదేవి.

శ్రీకాకుళఁ జిల్లా ఇ. ఇ. పి. డిబ్ల్యు.డి; శ్రీయుత చి|| సత్తిరాజు విశ్వనాధం పంతులను, శ్రీమాత నన్నునిమిత్తముగాఁజేసి శ్రీవిద్యాదీక్షతో ననుగ్రించినది. శ్రీవారు ఈలక్ష్మీహృదయాంధ్రవ్యాఖ్న విని సందతసించి, దాని ముద్రణవ్యయాది భారము మాది యని నిల్చి మన్నించిరి. తనకుంబూర్వజమైన సోదరీవర్గములో ద్వితీయయైన శ్రీకాకాని సూర్యకాంతమ్మగారి (కీ|| శే|| గంగరాజుగారి భార్య) దీని ముద్రణవ్యయభారము తనపై వేసికొన్నట్లు తెలిపి యానందపెట్టిరి. కనుక వారల నాశిర్వదించుట రచయితనగు నాపని కదా! పండిత సాధకమహాశయులారా! నాదీవన సొరముతో సొరముఁగలిపి యమూల్యాశీర్వాద సుధాసేచనముతో వారీని దనుపుదురుగాతమని యర్థించుచున్నాను.

Sri Laxmihrudayamu    Chapters