Nadichedevudu   Chapters  

 

48. త్యాగానికి తక్షణ ఫలం

1929 ఫిబ్రవరిలో శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి దక్షిణార్కాటు జిల్లాలో పర్యటన చేశారు. ఆ పర్యటనలో ఒకరోజు స్వామి తండలం అనే గ్రామం గుండా ప్రయాణిస్తున్నారు.

ఆ సమీపంలో ఉన్న ఒక గొల్లకులస్తుడు తనకున్న కొద్దిపాటి భూమి మొత్తం అమ్మివేసి, శ్రీవారికి సమర్పించ దలచి, స్వామికి తన ఉద్దేశం తెలియజేశాడు. ఆ పని చెయ్యకుండా అతనిని వారించడానికి స్వామి ఎంతో ప్రయత్నించారు. అయినా, అతడు తన నిర్ణయం మార్చుకోలేదు. తన కున్న చారెడు భూమినీ ఒక ధనవంతునికి అమ్మివేసి, ఆ డబ్బు తెచ్చి స్వామికి మనః పూర్వకంగా సమర్పించుకున్నాడు.

అతడు నిరాధారుడు కావడం స్వామికి ఎంతమాత్రం ఇష్టంలేదు. అందు చేత, స్వామి వెంటనే ఆ తాలూకా తహశిల్‌దారును పిలిపించి, ఆ ప్రాంతంలో ఉన్న పోరంబోకు భూమిలో తగుమాత్రం భూమిని ఆ గొల్ల ఆసామి పేర పెట్టించారు!



మహాకవి ఎవరు?

ఎవరి గ్రంథాలు కాలగర్భంలో విస్మృతములు కాక, చిరంజీవములై ఉంటాయో, అతడు మహాకవి!

Nadichedevudu   Chapters