Page load depends on your network speed. Thank you for your patience. You may also report the error.
18. త్యాగరాజ ఘనరాగపంచరత్న కీర్తనలు
రచన:- శ్రీ కోట శీతారామశాస్త్రి
-------:0:------
(ఏప్రియల్ సంచిక తరువాయి)
సౌందర్యం రకరకాలు. నామసౌందర్యం, రూపసౌందర్యం. సుందరేశుడు శ్రీరాముడు. శ్రీరామనామ సౌందర్యం (నామం యొక్క మహిమ) తెల్సినవాడు శ్రీ శంకరులు (శివుడు) సౌందర్యానికి మోహపడి కాళ్ళు పట్టినవాడు హనుమ. అంతవరకూ ఎందుకు ''పుంసాం మోహనరూపాయ'' అన్నారు శ్రీరాముని. యింతేకాక శ్రీరామతత్త్వంవల్ల ఆకర్షింపబడ్డ నారద, శుక, శౌనకాది ఋషులను పేర్కొన్నారు. వెనువెంటనే సీతమ్మ ఓరచూపులచే గౌరవింపబడే శృంగారరామ విగ్రహాన్ని చెప్పారు.
తన అస్థిత్వం కంటే ఎక్కువది ఏదీ లేదు కదా ఎవరికైనా ! సర్వలోకాల్ని నాశనం చేసే హాలాహలాన్నికూడా లోకకల్యాణం కొరకు గళమున నిలుపుకున్నాడు. (శ్రీ శంకరులు) శ్రీ త్యాగరాజస్వామి తన పేరు సార్ధకం చేసికొంటూ అటువంటి శ్రీ త్యాగరాజస్వామిచేత పొగడబడేవాడా ? రామా ! నీ రూపు చూసిన కొద్దీ చూడాలని ఉంటుందయ్యా ! అని మనవి చేసుకుంటూ శ్రీరాముని, రామతత్త్వాన్ని వర్ణిస్తూ ఆభ్యాసాతిశయజ్ఞేయము రామతత్త్వం అని మనందరికీ చెప్పారు.
''విదేహమానస విహారాప్త'' అంటూ జీవన్ముక్తులైనటువంటి (జనకమహారాజు ------) వారిచే సతతము అనుసంధానము చేయబడే ప్రణవ (తారక) తత్త్వాన్ని ఒకటే అని కూడా చూపించారు.
రామ శబ్దమునకు ''మనోహర'' మని తాత్పర్యము, చిత్తవైకల్యమును హరించెడి నిత్య, నిర్వికార, నిరంజనంబగు అఖండపరిపూర్ణతత్త్వము. రమతీతి రామః జ్ఞానుల హృదయమున రమించుట వలన రాముడను పేరు. రాముడు (పరమాత్మ) సర్వజ్ఞుడు జీవుడు (ఆత్మ) మితజ్ఞుడు. రాముడు సమస్తకల్యాణ గుణ
(తరువాయి 81 పేజీలో)