Upanyasamulu    Chapters   

ప రో ప కా ర ము.

ప్రపంచములో పరోపకారమనునది లేనేలేదని నా యభిప్రాయము. చిన్నప్పుడు బడిలో చదువుకునేటప్పుడొక క్రైస్తవ ఉపాధ్యాయుఁడు చెప్పినాడు, 'వివేకానందస్వామి పాపము పుణ్యములేవని చెప్పఁగా దమ మిషనరీ యొకఁడు పోయి పాపము పుణ్యము కలవని స్వామికిచెప్పి యొప్పించె'నని. తర్వాత నేను దీనిఁగూర్చి యాలోచింపఁగా నామతికిని లేనట్లే తోచుచున్నది.

ఉదా:- ఒక దరిద్రుఁడున్నాడు. వానికెంత ధనసహాయము చేసినను తృప్తిపడడు.ఒక రోగియున్నాడు. వానికెన్నిపర్యాయములు వ్యాధినివృత్తి చేసినను మరలవ్యాధినొందుచున్నాడు. కాని ఒక భక్తునికే యీ సహాయములు చేసినుండిన తప్పక తృప్తిపడియుండును. కాని వీనిచిత్తమునకు శాంతిలేకుండుట చేనీయిరువురకును తృప్తికలగదు. వానికిచేయు నుపకారమెల్లయు వృధాయగుచున్నది. ఈ పరోపకారము ధర్మ వేదాంత శాస్త్రములకు గొలుసు. స్వరాజ్యములో నొకరికెంత సహాయముచేసినను తృప్తిలేక కొట్లాటలకు కారణమగును. కాని, ఇట్టి చింతనమేలేని యుక పిచ్చివాని జీవితము మిగుల కొనియాడఁదగినది. వానికీపాపపుణ్యములందు జోక్యముండదు. అందరము పిచ్చివారమైన బాగుండునేమో! (నవ్వు) ఇట్టి యుపకారముచేత వానికగుచున్న కష్టనివృత్తి సున్న. స్వరాజ్యమునకై సాధించి దానిని తెచ్చిన వారికిఁగల తృప్తి, సంతోషములు అనుభవించు ప్రజలకుండవు. మంచి, చెడ్డ, హింస, అహింసాదులు మనలో లేనేలేవు- వీనివలన వర్ణాశ్రమ ధర్మములు మనలోకములో నడుగంటును. కాని ఎవరికీ కొఱఁత? మఱియొక గ్రహములో నుండవచ్చును. ఏపనినైనను సాధించువానికి కొంత తృప్తి కలుగును కాని యనుభవించువారి కందఱకుండదు. శంకరులు చెప్పిన

"శ్లో|| నవర్ణా నవర్ణాశ్రమాచార ధర్మా

సమేధారణా ధ్యాన యోగాదయోసి

అనాత్మాశ్రయోహం మమాధ్యాసహానా

త్త దేకోవశిష్ట శ్శివః కేవలోహం."

శ్లోకమునుబట్టి, మన మనశ్శాంతికొఱకేగాని తీసుకొనువాని తృప్తికికాదు. తల్లికి బిడ్డయందలిప్రేమ. అది బిడ్డకొఱకుకాదు. ఆ ప్రేమయనునది లేకపోయిన ప్రపంచము పెఱుగుటకే వీలుండదు. పితరులకు పెట్టే శ్రాద్ధమెంతవరకు వారిని చేరునది అందఱఱుఁగరుకాని వారికి మనశ్శాంతిమాత్రము దానివలనకల్గుచున్నది. ఏది హెచ్చినను, ఏదితగ్గినను, ప్రపంచమునకేమియులోటులేదు. కాని చిత్తమునకు శాంతికావలయును. ఇది చిత్తముచచ్చిపోయినతర్వాతఁ గల్గునేమో, అది పూర్ణానందముయొక్క ఉపాథి. దాని నెఱిఁగిన ప్రపూర్ణానంద స్వరూపమును బ్రహ్మస్వరూపమును చూడఁగలము. అదే స్వరాజ్యము. యజ్ఞాదికర్మలన్నియు దాని కొఱకే. దీనికి నయనము (కన్ను) మార్గదర్శి. గ్రుడ్డివానికి %ీ త్రోవజూపు మార్గదర్శిలేడు. మనకుత్రోవఁజూపు మార్గదర్శి కన్నులు. దీనియొక్క ప్రయోజనము శరీరపోషణ మార్గమును జూపించుటే. అట్లే తక్కిన యింద్రియములెల్లయు శరీరపోషణకే యుపకరించుచున్నవి. ఈ శరీరపోషణమెందులకు? పరోపకారములకు. చెట్లలో నడువశక్తి ఁగల్లిన పగడపుచెట్టు సంచరించి తన పోషణకై యాహారమును సంపాదించుకొనుచున్నది. దీనిఁబట్టి మనముచేయు పనులన్నియు నీ శరీరపోషణకే. అన్ని శాస్త్రాదులుదీనినే బోధించుచున్నవి. అన్నియు ఈ 'నేను' ఈ పరబ్రహ్మ స్వరూపము, ఈ యానందస్వరూపము బ్రతికి యుండే కొఱకే.

మననము, చేయగలవాఁడు మానవుడు. ఆజీవుఁడుపుట్టే కొఱకేవాజము, ప్రసవము. మొదలైనవికల్గినవి. అన్నమే కామము. అన్నముచే శరీరధారణము కలుగుచున్నది. దానిచేతనే ఈ 'నేను' పరిపూర్ణత్వమునందుచున్నది. ఈ కామమువలననే, పైన నేను చెప్పిన తల్లికి బిడ్డను బెంచుటకు వలయు బాధ్యతాను రాగములు కలుగుచున్నవి. దానివల్లనే ప్రజలనందరు సృష్టింపఁబడుచున్నారు. దానివలననే అందరు వృద్ధిబొందుచున్నారు. దానిచేతనే నశింపఁబడుచున్నారనికూడ వచింపవచ్చును. అది యే ఆనందస్వరూపము- ఆ జీవుఁడు పరమాత్మ పరమేనని యెంచినపుడే తల్లికి మోక్షము. లేకపోయినపాపము. ఈ దేవాలయమున నాంజనేయస్వామివిగ్రహములేకున్న దీనికింత శోభ##యే లేదు. అది శూన్యము. అట్టిదే ఆత్మ సాక్షాత్కారములేని శవరూపతనువు. అది సాధనరూపముగా నొకరి యుపకారమునకును తన శాంతికిని యుపయోగింపఁబడినపుడే, పుణ్య ప్రదమగును. 'నకుర్యా న్నిష్ఫలం కర్మ' అనునట్లు యిపుడుండు ఈ ప్రభుత్వము వారు ఎవరెవరికులవృత్తులందు వారివారికి ఆధిక్యతయిచ్చి కులధర్మమునునిల్పిన కర్మకాండ ననుసరించినవారగుదురు. ఏ పనిని మనముచేసిననూ మన పరిపూర్ణత్వానికి మనలోపలి యా నందము నెఱుంగుట కేయనియు, యితరులపై సాధ్యమగునంత దనుకనాధారపడకుండుటకది సహాయమగునటు లాచరింపవలెను. లేకపోయిన వదలుటయేమేలు.

దీనినిబట్టి కొందఱు ధనికులుపరకారమే చేయరాదని యెంచెదరేమో అది మిక్కిలి తప్పు. తామిచ్చు మానవులకది తృప్తి కల్గించకపోయినను, తమ మనశ్శాంతికి, తమ ఆనందమునకు, తమ భవిష్యద్భాగ్యమునకు, కీర్తికి, తనకున్న సార్థకమునకైన ఆ దానముపయోగించును. కావున నేటి యీ సభ్యులెల్లరును శాంతులై, ఆ ఆత్మ స్వారాజ్యమును తెలిసికొని, సంపూర్ణానందస్వరూపమును గుర్తెఱిఁగి, పరోపకార బుద్ధితో, నైహికాముష్మికసుఖముల కాలవాలమగుదురుగాకయని మంగళముగ దీవింతును.

-----

Upanyasamulu    Chapters