Kathakanchiki    Chapters    Last Page

 

''అలాటి చిరునవ్వును నేనెన్నడూ చూడలేదు''

హిందూమతంలో అధికారపదవిలో వున్న ఒక మతాచార్యుణ్ణి కలుసుకోవాలనే ఆరాటం నాకుంది. వారిని కలుసుకుని హిందువుల సనాతనదృష్టి యెలావుంటుందో తెలుసుకోవాలి. కాని హిందూమతంలో లెక్కలేనన్ని శాఖలున్నాయి. క్రైస్తవ మతంలో వున్నట్లు దానికొక గురుపీఠంమంటూ లేదు. కొంతవరకు క్రైస్తవుల గురుపీఠంలాంటి దని చెప్పదగినవి అయిదు శంకరాచార్య కేంద్రాలున్నాయని తెలిసింది. అవి ప్రముఖమైన ఒక హిందూమత శాఖకు సంబంధించినవి. దాని అధిపతులు జగద్గురు శంకరాచార్యస్వామి నుండి పరంపరగా వస్తున్నవారు.

శంకరాచార్యులు ఎనిమిదో శతాబ్దంలో పుట్టిన ఒక గొప్ప మత సంస్కర్త. వారు విగ్రహారాధనను ఖండించారు. సర్వదేవతల అభేదాన్ని చాటిచెప్పారు. సనాతనమైన హిందూశాఖలకు ఒక ఐక్యరూపాన్ని వ్వటం కోసం ప్రయత్నిచారు. వారి తర్వాత వచ్చిన ఆచార్యులందరూ తమవారసుల్ని తామే నియమించారు. ఈ తరంలో కంచికామకోటి పీఠాధిపతుల కున్నంతటి అధ్యాత్మికమైన అధికారం మరే పీఠాధిపతికీలేదు. వారురెండు హిందూశాఖలను-అంతవరకూ ఒకదానితో ఒకటి విభేదించిన వాటిని- ఏకం చేయగలిగారు ప్రస్తుతం దక్షిణభారతదేశంలో కనబడే ఆధ్యాత్మిక పునరుజ్జీవనం కేవలం వారి వల్లనే కలిగింది. వారెంతో పవిత్రులనీ జ్ఞానమార్గంలో చాలా దూరం పయనించారనీ విన్నాను. నేను దర్శించినప్పుడు వారు మద్రాసుకు సమీపంలోనే వున్నారు.

మా సమావేశాన్ని ఏర్పాటు చేసినవారు ప్రోఫెసర్‌ రాఘవన్‌. వారు మద్రాసు విశ్వవిద్యాలయంలో సంస్కృతశాఖాధ్యక్షులు. వారు రచించిన 'భారతీయవారసత్వం' అనే గ్రంధాన్ని భారతదేశాధ్యక్షుల పీఠికతో ఐక్యరాజ్యసమితికి చెందిన విద్యాసాంస్కృతిక శాఖవారు ప్రచురించారు. ఆ గ్రంధం సంస్కృతవాఙ్మయానికి సంబంధించి పరమప్రామాణికమైన ఆధార గ్రంధం. ఆగ్రంధంలోని వాక్యాలను తరువాతి అధ్యాయాల్లో చాలా పర్యాయాలు ప్రమాణాలు ఉగ్గడించాను.

రాఘవన్‌ను విశ్వవిద్యాలయంలోనే మొదటిసారి కలిశాను. అప్పుడు వారు పాశ్చాత్యవేషంలో వున్నారు. తీరికలేని ఓ పెద్దమనిషి అతిధికి మర్యాద చేయటం కోసం ఎంత ఇబ్బంది పడతారో అంతఇబ్బందీ నాకోసం పడ్డారు. రెండోసారి వారిని కలుసుకోవటం శంకరాచార్యులవారి దర్శనానికి వెళ్ళేటప్పుడు అప్పుడు వారు ధోవతిమాత్రం కట్టుకుని వున్నారు. చొక్కావేసుకోలేదు. మద్రాసు వీధుల్లో ఎందరెందరో యాత్రీకులూ, బిచ్చగాళ్లూ ధోవతి చుట్టుకునే కనబడతారు. కాని ఒక మధ్య వయస్కు డైన ప్రొఫెసర్‌ నడుందాకా దిగంబరంగా వుండి ఓ ఖరీదైన కార్లో మెత్తటి సౌకర్యాలమీద వాలి కూర్చున్న దృశ్యం నా కెందుకో అసాధారణమనిపించింది. ఇలాటి వారే మా యిద్దరికీ ఒక మిత్రులున్నారు. వాకిమీదా మీ మీదా శంకరాచార్యులవారి ప్రభావం ఏమైనా పడిందా? అని రాఘవన్‌ నడిగాను. ''మాలో ఎదైనా గుణమంటే అది స్వామివారివల్ల సంక్రమించిందే, దోషాలన్నీ మావి'' అన్నారువారు.

మద్రాసు పరిసరాల్లో ఓ వీధిమూల చీకట్లో కారాపి, చెప్పులు వదలి క్రిందకి దిగాము! దిగంగానే ఓ మధ్య వయస్కుడైన పెద్దమనిషి మమ్మల్ని పలకరించారు. వారు మద్రాసులో ఓ ప్రచురణకర్తట రాఘవన్‌ పరిచయం చేశారు. ఆ ప్రచురణకర్త ''ప్రతిసాయంకాలం ఆరు నుండి పదకొండు గంటలదాకా స్వామివారిని కను పెట్టుకుని వుంటున్నా''నని చెప్పారు.

ఆ వీధిలో దేవాలయం ప్రక్కన వున్న ఓ పాడుబడ్డ చిన్న యింట్లో అడుగుపెట్టగానే యేదురుగా మసక చీకట్లో ఓ యిరుకు వరండా కనిపించింది దాని కడ్డంగా పురాతనమైన ఓ పల్లకీ వుంది. పల్లకీకి తెల్లరంగువేశారు. ముందూ వెనకా బోయీలుమోసేగట్టి గుంజలకు మాత్రం నల్లరంగు, ఆ వరండా లోంచి ఓ చిన్నగదిలోకి ద్వార ముంది, అది జైలుగది లాంటిది అందులో అంతకు ముందే కొంద రొక చాపమీద కూర్చున్నారు. వారితోపాటు మేమూ కూర్చున్నాము.

గుసగుసలాడిన ట్లేదో మాట్లాడి, కొన్ని నిమిషాలయాక ఓ యువకుడు పల్లకీ దగ్గరకు వెళ్ళి వంగి ఎవరితోనో ఏదో మాట్లాడాడు. ఏ ఆకారమూలేని మోపుమీద కప్పినట్లున్న యిటుక రంగు కంబళి పైకీ క్రిందకీ కదలి పల్లకీలోంచి స్వామివారు మెల్లగా లేచారు. లేస్తూనే కంబళి తలమీద ఒంటి నిండా కప్పుకున్నారు.

&#వారు పొడగరే సన్నగా వున్నా చిక్కిపోయినట్లు లేరు. మత్తు వదలక తడబడుతూ పల్లకీ సందుగా లోపలికి వచ్చినా ముందు చాపమీద బాసికపట్టు వేసుకు కూర్చున్నారు. వెంటనే గదిలోవున్న వారందరూ బయటికి వెళ్ళారు. వెళ్ళినా ద్వారం పక్కనే నిలబడి అప్పుడప్పుడు తొంగి చూస్తూ చెవులప్పగించి వింటున్నారు. మద్రాసులోని వివేకానంద కళాశాలలో పనిచేస్తున్న ప్రోఫెస రొకరు మా మధ్య 'దుబాసి' గా వ్యవహరించారు.

ఓ అరనిమిషంసేపు స్వామివారేం మాట్లాడలేదు. ఆ అరనిమిషమూ స్వామివారి ముఖాన్ని పరిశీలనగా గమనించాను. కఠోరమైన ఆధ్యాత్మిక సాధనమూలంగా వారి ముఖకవళికలు చాలామట్టుకు పోయి అవసరమయినవే మిగిలాయి. ఉన్నవాటిలో ప్రముఖంగా కనబడేది తెల్లని కురచ వెంట్రుకల క్రింద వారి నున్నని ఎతైన అర్ధగోళంలా వున్న నుదురు. రెండోది వారి కళ్ళు. అవిలోతుగా మెత్తటి చీకటినీడలు పరుస్తూ కపాలం

క్రింద నుంచి గ్రుచ్చిచూస్తున్నట్లున్నాయి. వారి పెదవులు తీర్చినట్లుండి పెరిగిన గడ్డం మధ్య అచితూచి మాట్లాడే ప్రతి మాటాకూ దృఢంగా భావబంధురంగా కదలుతున్నాయి. వారు నిద్రావస్థలో నుండో సమాధిస్థితి నుండో మెల్లగా బయటకు వస్తున్నట్ల నిపించింది. వారి చూపులు ఎదటివారి మీద నిశ్చలంగా నిలిచివున్నాయి. వారు రోజుకు ఓ మూడుగంటలకన్నా ఎక్కువసేపు నిద్రపోరని విన్నాను. తన విధులకూ కర్మకాండకూ పోను అప్పుడప్పుడు మిగిలిన కొద్దిపాటి వేళల్లో పల్లకీలో ఓ మూల చుట్టచుట్టుకుని పడుకుంటారు. వారు నిద్రలో వున్నారో సమాధిలో వున్నారో తరచు భక్తులే చెప్పలేరు. మెల్లగావారు నేను భారతదేశం రావటాని కున్న కారణ మడిగారు.

''ఈ దేశాన్నీ ప్రజల్నీ ఊరికే చూచి పోదామనా లేక యిక్కడి ప్రజల నేదైనా మంచిదారిలో పెడదామనా?''

అంతకుముందు వచ్చిన పుస్తకాలమీద పత్రికలవారు చేసిన వ్యాఖ్యానాలు దృష్టిలో పెట్టుకుని స్వామివా రడిగిన ప్రశ్న అది. ''చూడటానికీ, తెలుసుకోవటానికీ మాత్రమే వచ్చాను. మరే ఉద్ధేశమూ లేదు'' అన్నాను.

స్వామి: స్థిరమైన ఆసక్తికి కూడా కొంత ప్రభావం వుంటుంది. ఏమీ ప్రత్యేకంగా చెయ్యక్కరలేదు. ఊరికే ఒక సమస్యపట్లగానీ, ఒక దేశంపట్లగానీ మనమేర్పరుచుకున్న దృక్పధానికికూడా ఒక శక్తీ, చైతన్యం వుండితీరుతుంది.

&#''అలా వుండటం నాకు బాధగావుంది. అయినా ఏనీడా పడకుండా మనిషి కదల్లేడుకదా'' అన్నాను.

అప్పుడు స్వామివారు ''సత్యమైన సానుభూతి ఒకవిధమైన తేజన్సును విరజిమ్ముతుంది'' అంటూ చిరునవ్వు నవ్వారు. ఆ చిరునవ్వు పసిబిడ్డ చిరునవ్వు. అలాటి నవ్వును నేనెన్నడూ చూడలేదు. ఆ చిరునవ్వులో అసమాన్యమైన మనోజ్ఞత వుంది. మాధుర్యముంది. వారితో మాట్లాడి తిరిగివస్తూ దారిలో అనుకున్నాను. పాశ్చాత్య చిత్రకారులు చిత్రించిన సాధుపురుషుల ముఖాలమీద- వారు పారవశ్యంలో వున్నప్పుడుగాని, వారికి ధన్యత సిద్ధించినప్పుడుగానీ, మతంకోసం వారు ప్రాణాలు త్యాగం చేసినప్పుడుగానీ- ఆ చిరునవ్వును మగ్ధమోహనమైన ఆచిరునవ్వును ఎందుకు చిత్రించలేదా అని! యోగులందరూ తమ అనుభవాలు మాటలకందవని చెప్పినట్లు బహూశా ఆ చిరునవ్వుకూడా ఉలికీ, కుంచెకూ అందలేదేమో!

'లాస్ట్‌సప్పర్‌ అనే చిత్రాన్ని ఎంతో మెచ్చుకుంటాను, నిజమే. సిలువవేసిన క్రీస్తు బొమ్మన్నా నాకభిమానం, నిజమే. కాని నజరత్‌లో అలనాటి క్రీస్తు రూపం అలా వుండివుంటుందని ఎందుకో నాకెప్పుడూ అనిపించదు. కాని గుప్తుల కాలంలో వచ్చిన కొన్ని శిల్పాల్లోను. వికారంగా వుండే కొన్ని ప్రాచీన భారతీయ శిల్పాల్లోనూమాత్రం ఆ వింత చిరునవ్వుకు సంబంధించిన భావం లీలగా కదలాడుతుంది.

''మారిన సామాజిక పరిస్థితుల్లో హిందూమత సంప్రదాయాలుగానీ, ఆచారకాండగానీ అవసరమనీ, ఆచరణ సాధ్యమనీ మీరనుకుంటున్నారా'' అని స్వామివారిని ముందు అడిగాను.

స్టెనోగ్రాఫర్‌ సిద్ధపరచిన ప్రతి ప్రకారం వారి సమాధానం ఇలా వుంది. (దాన్ని కొంచెం నేను సంగ్రహపరిచాను).

''సామాజిక విప్లవం ఈకాలంలోనే రాలేదు. అతి ప్రాచీనకాలం నుంచీ సమాజంలో మార్పులు వస్తూనేవున్నాయి. అయితే ఆకాలంలో జరిగిన మార్పులు ఇప్పటిలా దారుణంగా వుండేవికావు. ఎన్ని మార్పులు జరిగినా, కొన్ని ప్రాథమిక విషయాలు మారకుండా అలాగే పదిలంగా ఇప్పుటికీ వున్నాయి. సంఘంలో వచ్చే మార్పును ఓ గాలివాన తెచ్చే మార్పుతో పోల్చవచ్చు గాలివాన వచ్చాక కొన్ని మారిపోతాయి నిజమే, కాని కొన్ని మారకుండా అలాగే నిలిచివుంటాయి. కొన్ని మౌలికమైన విలువలు నిలబెట్టుకుని, వాటిని పదేపదే ఉగ్గడించటం అవసరం. ఈనాడు నైతికమైన విలువలూ, స్థాయీ పడిపోతున్న సంగతి అందరికీ తెలుసు. అలెగ్జాండరు భారతదేశానికి వచ్చినప్పుడు దేశంలో ఎక్కడా దొంగతనాల్లేవని గ్రీకు పరిశీలకులు వ్రాశారు. సమున్నతమైన ఆనాటి నైతికస్థాయి తరువాతికాలంలో కూడా అలాగే వుందని చెప్పలేము. అయితే, స్థాయి పడిపోయిందికాబట్టి యిప్పటివారు ఇలాగే వుండిపోవాలని చెప్పటcకూడా సబబుకాదు. అదేవిధంగా ఆధ్యాత్మికమైన క్రమశిక్షణకు సంబంధించినంతవరకూ ప్రమాణాలు దిగజార్చటానికి నేనొప్పుకోను.

ప్రశ్న: ఆధ్యాత్మికమైన విలువలకూ, మతపరమైన ఆచారలకూ బేధం లేదంటారా? ఏ ఫ్యాక్టరీలోనో, ఆఫీసులోనో పనిచేస్తున్నా వాడున్నాడనుకోండి. అతడు ఉదయం తొమ్మిదింటికి పనిలోకి పోవాలి. ఈలోగా అతడి ఆచార కాండంతా పూర్తికావాలంటే ఏ అయిదింటికో నిద్రలేవాలి. సనాతన హిందువుల నిత్యానుష్ఠాన విధానం కొన్ని గంటలు పడుతుంది, ఇలాంటి పరిస్థితుల్లో ఆతని అనుష్ఠాన విధానాన్ని కుదించటం అవసరంకాదంటారా?

స్వామి: ప్రతినిత్యం తాను చేయాలిసిన తీరులో పూజలూ, జపాలూ, అనుష్ఠానాలూ చేయలేనివారు అయ్యో చేయలేకపోయామే అని వ్యాకులుపడాలి, అనుతాపపడాలి. ప్రాయశ్చిత్తం చేసుకుని సెలవుదినాల్లోనో తీరికవేళల్లోనో యధావిధిగా ఆచారకాండంతా జరుపుకోవాలి. అనుష్ఠాన విషయంలో రాజీపడ్డామా, ఇక దానికి అంతం వుండదు. శాస్త్ర నియమాలు క్రమంగా సడలి ఒకొక్కటిగా అన్నీ అంతరించి పోయాయి.

ప్రశ్న: అధునిక సమాజంలో విధివిహితమైన ఆచారకాండను పాటించటం సగటుమనిషికి అసాధ్యమైనప్పుడు నిరంతరం తాను దోషిననుకుని క్రుంగిపోవటం పశ్చాత్తాపంతో తపించిపోవడం లాభ##మేముంది?

స్వామి: నిజంగానే అతడు పశ్చాత్తాపడితే దాని విలువ దానికుంటుంది.

స్వామివారు తమ అభిప్రాయం మార్చుకోరని తెలిసి విషయం మార్చాను.

ప్రశ్న: పాశ్చాత్యదేశాల్లో పైఢాగరిన్‌ సౌభ్రా వెల్లివిరిసిన రోజుల్లోగానీ, జాతీయ పునరుజ్జీవనపు తొలిదశలోగానీ పుట్టిన గొప్ప విజ్జానశాస్త్రవేత్తలందరూ గొప్ప యోగులు! విజ్ఞాన శాస్త్రాధ్యయనంకూడా ఒకవిధమైన పూజావిధానమని భావించేవారు; ఐన్‌స్టీన్‌ని చూడండి. ఆయన ఎంతటి మేధావో అంతటి దైవచింతనుడు. క్వాంటమ్‌ థియరీని ప్రతిపాదించిన 'మాక్స్‌ప్లాంక్‌' ఆధునిక ఖగోళ శాస్త్ర పిత 'కెప్లర్‌' మొదలైనవారందరూ విజ్జానశాస్త్రాన్ని దురవగాహమైన సత్యాన్ని అన్వేషించే మార్గంగానే భావించారు. ఈవిధమైన దృక్పథం భారతీయుల ఆలోచనా విధానంలో వుందా?

స్వామి: విజ్ఞానశాస్త్రం పెరిగేకొలదీ, తాత్విక విజ్ఞానానికి సంబంధించిన మౌలిక సత్యాలు రుజువౌతుంటాయి. భారతీయుల విజ్ఞానశాస్త్రం మతానికి విరుద్ధమైందికాదు. దానికి ఆధ్యాత్మికమైన మూలబలం వుంది. మతసంబంధమయిన మానసిక శిక్షణ వుంది. భారతదేశంలో ప్రతి విజ్ఞానశాఖనూ, ఒక శాస్త్రమనీ ఒక ఆలోచనా విధానమనీ పేర్కొన్నారు. ప్రతిశాస్త్రానికీ ఒక పారమార్థిక ప్రయోజనం వుంది. ఉదాహరణకు మన దేవాలయాల్లో విజ్ఞాన శాస్త్రాలనూ కళలనూ మత ప్రయోజనం కోసం ఉపయోగించుకుంటున్నాము. వాస్తువు, సంగీతం, నాట్యం, గణితం, ఖగోళం అన్నిటికీ పారమార్థికమైన మతప్రాముఖ్యం వుంది.

ఈసారి నే నడిగేవాటికీ, వారు చెప్పేవాటికీ సంబంధంలేదని ఇద్దరం వేరువేరు భాష మాట్లాడుతున్నామనీ అనిపించింది. విజ్ఞానశాస్త్రం దేవాలయాచారాల కుపయోగపడుతున్నదని స్వామి చెప్పటం, ఖగోళశాస్త్రం జ్యోతిషంగానూ, గణితశాస్త్రం అంకెల గారడీగానూ పతనమైపోవటాన్ని పరోక్షంగా సమర్ధించటమే! ఈ వైఖరివల్లే పదిహేను శతాబ్దాలుగా భారతీయశాస్త్రాలు ఎదుగూబొదుగూలేక స్తంభించిపోయాయి.

నేను మళ్ళీ విషయం మార్చి, హిందూ దేవాలయాల్లో వుండే రద్దీ, రచ్చా వారిదృష్టికి తెచ్చాను. ''ఇందువల్లేనా భారతీయలు ధ్యానం చేసుకోటానికి విజనంగావుండే పర్వతాలకుపోయి కొండగుహల్లో కూర్చుంటారు?'' అని ప్రశ్నించాను.

స్వామి: కానేకాదు ధ్యానం చేసుకోటానికి ఏకాంతంగా, ప్రశాంతంగా వుండే ప్రదేశాల్లో కూర్చోవాలని శాస్త్రాలాదేశించాయి. దేవాలయాల ప్రయోజనం వేరు. అవి ధ్యానానికీ, సామూహికార్చనకూ ఉద్దేశించినవి కావు.

మనం ఇల్లూ భోజనం, బట్టలూ, నగలూ, సంగీతం, నృత్యం వంటి వాటివల్ల కలిగే జీవితనుఖాలన్నీ అనుభవిస్తున్నాము. అలా అనుభవించినందుకు పన్నులు చెల్లించే రాజుగారికి- ఇప్పుడు ప్రభుత్వానికనుకోండి- కృతజ్ఞత చెప్పుకుంటున్నాము. మనవి సంరక్షించే ప్రభువుకు ఓ రాజు ప్రాసాదం వుంది- అనేక రాజలాంఛనాలున్నాయి మన జీవిత సుఖాలు కాపాడే రాజుకు కృతజ్ఞత చెల్లించినట్లే- అసలీ సుఖాలకు మూలకారణమైన దైవాన్ని ముందుగా ఉపచరించవలసివుంది. ఆ ఉపచారంలో భాగంగా మన సుఖాలను దేవాలయాల్లోని దేవునకు సమర్పించుకుంటాము. అది భగవంతునికి మనంచూపే కృతజ్ఞత. దైవానికి నైవేద్యంపెట్టి, బట్టలిచ్చి ఆభరణాలు తొడగి, సంగీతంపాడి, పూలు సమర్పించి, దీపం వెలిగించి, అగరు పొగవేసి, షోడశోపచారాలూచేసి వాటినే మళ్ళీ భగవత్ర్పసాదంగా గ్రహిస్తాము. దేవాలయం ఏగ్రామంలోవుంటే ఆగ్రామంలోని వారందరి సామూహికార్పణగా ఇవన్నీ భగవంతునికి నివేదించుకుంటాము. ప్రతివాడు దేవాలయానికి వెళ్ళకపోయినా ఈ సామూహికోపచారం జరిగితేచాలు. వాడూ వెళ్ళినట్లే. కాని అది సక్రమంగా జరగాలి. దేవాలయాల్లో నివేదన జరిగినట్లు గంట వినబడితేగాని భోజనంముందు కూర్చోనివారున్నారు.

ప్రశ్న: అయితే ఒకవ్యక్తి ప్రశాంతంగా ధ్యానం చేసుకుంటూ భగవంతుని ఏకాంత సాన్నిధ్యాన్ని అనుభవించాలంటే ఏంచేయాలి?

స్వామి: ప్రతి ఇంట్లోనూ, ప్రతి నదీతీరానా, నిత్యానుష్ఠానానికి అనువైన చోటొకటుంటుంది. ధ్యానానికి కావలసిన నిశ్శబ్దం, ఏకాంతం అక్కడ దొరుకుతాయి.

స్వామి వారు పేర్కొన్న అనుష్ఠాన ప్రదేశాలెలావున్నాయో హిందూ గృహాల్లోనూ, నదీతీరాల్లోనూ చాలా చూచానని చెప్పటం అమర్యాదగా వుంటుందని మానుకున్నాను. వారణాశిలోని గుళ్లూ, స్నానఘట్టాలూ చూడండి. వాటిని గురించి యెంతతక్కువ చేబుతే అంతమంచిది. ఇళ్లల్లో దేవుడి గదులు చూడండి. సామాన్లగదులకన్నా హీనంగా వుంటాయి, కొన్నిళ్లల్లో అవికూడా వుండవు.

పడకగదిలో ఒకమూల కృష్ణుడిబొమ్మో, దుర్గబొమ్మో వుంటుంది. బొమ్మముందు వాడిపోయిన పూలు! గోడలమీద రంగునూనెతో ఆంజనేయుడి బొమ్మ! నేను సగటుమనిషి యింటినిగురించి మాట్లాడుతున్నాను. ఎంతోమందివున్న యిరుకిళ్ళల్లో ప్రశాంతమైన ఏకాంతం ఏగదిలోనూ దొరకదు, ఎంత రద్దీగావున్నా, గోలగావున్నా, యోగి అయినవాడు ప్రశాంతంగా వుండగలడు, మరి సామాన్యుడు మాటేమిటి?

స్వామివారిని ''హిందూమత సిద్ధాంతాలను అక్షరసత్యాలుగా గ్రహించాలా, సంకేతార్ధలుగా వ్యాఖ్యానించుకోవాలా''? అని ప్రశ్నించాను.

అందుకు స్వామివారు ''ప్రతిభావాన్నీ అక్షరార్ధంలో గ్రహించాలిసిందే'' సంకేతార్ధం చెప్పుకోరాదు. హిందూ క్రైస్తవమతాలను తులనాత్మకంగా అధ్యయనం చేసినవారికి హిందూమతంలోని మౌలిక వేదాంత సత్యాలను క్రైస్తవమతం సరిగా అర్థంచేసుకోక వక్రీకరించినట్లు తెలిసిపోతుంది. ఉపనిషత్తుల్లోవున్న ఆత్మకు క్రైస్తవులు ఆదం అని పేరుపెట్టారు. జీవుణ్ణి 'ఈవ్‌' అన్నారు.

ఉపనిషత్తుల్లో రెండు పక్షులకథ ఒకటుంది. రెండుపక్షులొక చెట్టుమీద కూర్చున్నాయి. ఒకటి పండు తింటోంది. రెండోది ఊరికే చూస్తోంది. పండు తింటున్న పక్షి జీవుడు. అంటే ఈవ్‌. ఊరికేచూస్తున్న పక్షి పరమమైన ఆత్మ. అంటే ఆదం. అవి కూర్చున్నది రావిచెట్టుమీద అదే బైబిల్‌లోని ఆపిల్‌చెట్టు దాన్నే బోధివృక్షమనీ, జ్ఞానతరువనీ అంటారు. ఆవృక్షం క్రిందే గౌతముడు బుద్ధుడైంది! ఆదం-ఈవ్‌లు జ్ఞానతరు ఫలాన్ని తిన్నారు. ఈ ఉపనిషత్కథను క్రైస్తవులు వ్యాఖ్యానించటంలో ఉపనిషత్తు లుద్దేశించిన అర్థం పోయింది'' అన్నారు.

వారిమాటలు విన్నాక భిన్నమతాల తులనాత్మక కాధ్యయనం చేసిన వారిలో కొందరైనా స్వామివారితో ఏకీభవించగలరా అనేఅనుమానం కలిగింది. సరే కాలం గడిచిపోతోంది. వ్యవధిలేదు. ఆచర్చ అంతటితో ఆపివారే ప్రమాణం అనుకోదగిన విషయాన్ని గురించి ఒక ప్రశ్న ఆడిగాను.

ప్రశ్న: నేను బొంబాయిలో వున్నప్పుడు చాలామంది మానసిక వైద్యులతో మాట్లాడాను. మానసిక వ్యాధులు నయంచెయ్యటానికి ఆధ్యాత్మిక సాధన బాగా ఉపయోగపడుతుందని అందరూ చెప్పారు. కాని! ఏది నిజమైన జ్ఞాననిద్రో ఏది భ్రాంతివల్ల కలిగే మైకమో తెలుసుకోటానికి సాధన లేదన్నారు.

దీనికి వారు సూటిగా కచ్చితంగా సమాధానం చెప్పారు. ''భ్రాంతివల్ల కలిగే మైకం శాశ్వతంగా వుండదు. మనస్సును అదుపులో వుంచుకోగలిగినప్పుడుమాత్రమే సమాధ్యవస్థ సిద్థిస్తుంది. మనస్సు అదుపులో లేనప్పుడు మీరన్న భ్రాంతిమూలకమైన మైకం కమ్ముకుంటుంది. 'నేను' అనే భావంలోంచి పుట్టే కోరికలు భయాల పర్యవసానం అది. యోగి మనస్సు సూన్యంగా వుంటుంది. అతని అనుభూతికి ఆకారంగానీ లక్ష్యంగానీ వుండదు.

ప్రశ్న: మాదక ద్రవ్యాలవల్ల సమాధ్యవస్థ పొందటం సాధ్యమౌతుందా?

స్వామి: ఆల్టస్‌హక్ల్సీ చేసిన ప్రయోగాలు మనస్సులో వుంచుకుని ఈప్రశ్న అడుగుతున్నట్లున్నారు.

కోస్లర్‌: లేదు. భంగును దృష్టిలో పెట్టుకుని అడిగాను.

స్వామి: ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో కొందరు ఒక విలక్షణమైన మానసిక స్థితిని అనుభవించటం కోసం భంగు సేవిస్తారు. దక్షిణభారతదేశంలో ఎవరికీ ఈ అలవాటులేదు. అలా కృత్రిమంగా తెచ్చుకున్న మానసిక స్థితి అట్టేకాలం నిలవదు. యోగులుపొందే సమాధిస్థితి యింతకన్నా శాశ్వతమైంది.

&ప్రశ్న: చూచేవారికి ఈ రెంటికీవున్న భేదం ఎలా తెలుస్తుంది చెప్పండి.

సమాధానం: నిజమే. నకీలీయోగి యెవరో, నిజమైన యోగి ఎవరో కొందరు తెలుసుకోలేరు. కాని, సాధనద్వారా తన మనస్సును అదుపులో వుంచుకున్న యోగి ప్రవర్తన వేరుగావుంటుంది. అతడి ముఖంవంక చూస్తేచాలు, ఆముఖంలో ప్రసన్నత, ప్రశాంతత తెలిసిపోతాయి. అతణ్ణి గుర్తుపట్టడం అంతకష్టమేమీకాదు.

మాట్లాడినంతసేపూ తననుగురించిన స్పృహ లీలగానైవా వారిలో లేదు. వారుచేసిన వర్ణన అచ్చంగా వారికే అన్వయిస్తుందనే సంగతి వారికి స్ఫురించివుండదు.

&#నాకిచ్చిన సమయం అయిపోయిందనిపించింది. స్వామివారు ''అయివుండదేమో'' అన్నారు, కాని తాను అలసిపోయానని మాత్రం చాలాసౌమ్యంగా చెప్పారు.

సాధారణంగా ఇలాటి సంభాషణలు జరిగినప్పుడు అతిథే సెలవుతీసుకోవటం అనవాయితీ. అతిథే సంభాషణ ముగించవలసి రావటంమూలాన ఒకొక్కప్పుడు ఇరకాటం ఏర్పడటంకూడా కద్దు.

ఇద్దరం కొన్ని క్షణాలు మౌనంగావున్నాము. నేను ఒక ఉదంతం చెప్పటం మొదలుపెట్టాను. ఒక జెసూట్‌ అర్చకుడున్నారట. వారినెవరో అయ్యా భగవంతుని అపారమైన దయలో శాశ్వతమైన నరకానికికూడా చోటుంటుందా?'' అని అడిగారట. ''ఆ, ఉంటుంది. అయితే, అందులో యెవ్వరూ వుండరు.'' అని సమాధానం చెప్పారట!

ఈ కధ చెప్పటంలో నా ఉద్దేశం, వారి ముఖంమీద ఆ ఆమృత హాసరేఖను మళ్ళీ చూడాలనే! అది నిజంగానే మళ్ళీ వారిముఖంమీద కదలాడింది. ''హిందూమతంలో శాస్వత నరకమంటూ లేదు, ఏ కొద్దిపాటిధర్మాన్ని ఆచరించినాచాలు, పుణ్యలోకప్రాప్తి కలుగుతుంది.'' అని భగవద్గీతలోని శ్లోకం ఒకటి చదివారు.

ఆ శ్లోకంతో మా సంభాషణ ముగిసింది. ఎలాగో ధైర్యాన్ని కూడగట్టుకుని నేనే ముందులేచాను. స్వామివారు ఆదోలా నమస్కరించి నాలు

మా సమావేశాన్ని ఏర్పాటు చేసినవారు ఫ్రోఫెసర్‌ రాఘవన్‌. వారు మద్రాసు విశ్వవిద్యాలయంలో సంస్కృతశాఖాధ్యక్షులు. వారు రచించిన 'భారతీయవారసత్వం' అనే గ్రంధాన్ని భారతదేశాధ్యక్షుల పీఠికతో ఐక్యరాజ్యసమితికి చెందిన విద్యాసాంస్కృతిక శాఖవారు ప్రచురించారు. ఆ గ్రంధం సంస్కృతవాఙ్మయానికి సంబంధించి పరమప్రామాణికమైన ఆధార గ్రంధం. ఆగ్రంధంలోని వాక్యాలను తరువాతి అధ్యాయాల్లో చాలా పర్యాయాలు ప్రమాణాలుగా ఉగ్గడించాను.

రాఘవన్‌ను విశ్వవిద్యాలయంలోనే మొదటిసారి కలిశాను. అప్పుడు వారు పాశ్చాత్యవేషంలో వున్నారు. తీరికలేని ఓ పెద్దమనిషి అతిధికి మర్యాదచేయటం కోసం ఎంత ఇబ్బంది పడతారో అంతఇబ్బందీ నాకోసం పడ్డారు. రెండోసారి వారిని కలుసుకోవటం శంకరాచార్యులవారి దర్శనానికి వెళ్ళేటప్పుడే, అప్పుడు వారు ధోవతిమాత్రం కట్టుకుని వున్నారు. చొక్కావేసుకోలేదు. మద్రాసు వీధుల్లో ఎందరెందరో యాత్రీకులూ, బిచ్చగాళ్లూ ధోవతి చుట్టుకునే కనబడుతారు, కాని ఒక మధ్య వయస్కు డైన ప్రోఫెసర్‌ నడుందాకా దిగంబరంగా వుండి ఓ ఖరీదైన కార్లో మెత్తటి సౌకర్యాలమీద వాలి కూర్చున్న దృశ్యం నా కెందుకో అసాధారణమనిపించింది. ఇలాటి వారే మా యిద్దరికీ ఒక మిత్రులున్నారు. వారిమీదా మీ మీదా శంకరాచార్యులవారి ప్రభావం ఏమైనా పడిందా? అని రాఘవన్‌ నడిగాను ''మాలో ఎదైనా గుణముంటే అది స్వామివారివల్ల సంక్రమించిందే, దోషాలన్నీ మావి'' అన్నారువారు.

మద్రాసు పరిసరాల్లో ఓ వీధిమూల చీకట్లో కారాపి, చెప్పులు వదిలి క్రిందికి దిగాము! దిగంగానే ఓ మధ్య వయస్కుడైన పెద్దమనిషి మమ్మల్ని పలకరించారు. వారు మద్రాసులో ఓ ప్రచురణకర్తట రాఘవన్‌ పరిచయం చేశారు. ఆ ప్రచురణకర్త ''ప్రతిసాయంకాలం ఆరునుండి పదకొండు గంటలదాకా స్వామివారిని కను పెట్టుకుని వుంటున్నా''నని చెప్పారు.

ఆ వీధిలో దేవాలయం ప్రక్కన వున్న ఓ పాడుబడ్డ చిన్న యింట్లో అడుగుపెట్టగానే యెదురుగా మసక చీకట్లో ఓ యిరుకు వరండా కనిపించింది దాని కడ్డంగా పురాతనమైన ఓ పల్లకీ వుంది. పల్లకీకి తెల్లరంగువేశారు. ముందూ వెనకా బోయీలుమోసేగట్టి గుంజలకు మాత్రం నల్లరంగు, ఆ వరండా లోంచి ఓ చిన్నగదిలోకి ద్వార ముంది, అది జైలుగది లాంటిది అందులో అంతకు ముందే కొంద రొక చాపమీద కూర్చున్నారు. వారితో పాటు మేమూ కూర్చున్నాము.

గుసగుసలాడిన ట్లేదో మాట్లాడి, కొన్ని నిమిషాలయాక ఓ యువకుడు పల్లకీ దగ్గరకు వెళ్ళి వంగి ఎవరితోనో ఏదో మాట్లాడాడు. ఏ ఆకారమూలేని మోపుమీద కప్పినట్లున్న యిటుక రంగు కంబళి పైకీ క్రిందకీ కదలి పల్లకీలోంచి స్వామివారు మెల్లగా లేచారు. లేస్తూనే కంబళి తలమీద ఒంటి నిండా కప్పుకున్నారు.

వారు పొడగరే సన్నగా వున్నా చిక్కిపోయినట్లు లేరు. మత్తువదలక తడబడుతూ పల్లకీ సందుగా లోపలికి వచ్చినా ముందు చాపమీద బాసికపట్టు వేసుకు కూర్చున్నారు. వెంటనే గదిలోవున్న వారందరూ బయటికి వెళ్ళారు. వెళ్ళినా ద్వారం పక్కనే నిలబడి అప్పుడప్పుడూ తొంగి చూస్తూ చెవులప్పగించి వింటున్నారు. మద్రాసులోని వివేకానంద కళాశాలలో పనిచేస్తున్న ప్రొఫెస రొకరు మామధ్య 'దుబాసి' గా వ్యవహరించారు.

ఓ అరనిమిషం సేపు స్వామి వారేం మాట్లాడలేదు. ఆ అరనిమిషమూ స్వామివారి ముఖాన్ని పరిశీలనగా గమనించాను. కఠోరమైన ఆధ్యాత్మిక సాధనమూలంగా వారి ముఖకవళికలు చాలామట్టుకు పోయి అవసర సంస్కృత భాషలో నకముర సంభాషణ ప్రారంభించారు. స్వామివారిని కలుసుకున్నందుకూ వారితో సంభాషిస్తున్నందుకూ తాము ధన్యులమన్నారు.

సుప్రసిద్ధులైన గౌడ పాదాచార్యులవారు చేసిన రచనలతోనూ మాండూక్యకారిక, వాక్యపదీయం వంటి గ్రంధాలతోనూ తనకున్న అభినివేశాన్ని గురించి నకముర చెప్పారు, అలాటి రచనలు చాలా వున్నాయని స్వామివారనగానే వారు బోధాయనుణ్ణి, ద్రవిడాచార్యుణ్ణి, మండనమిశ్రుణ్ణీ అలాటి మరికొందరు ప్రముఖులనూ పేర్కొన్నారు.

''శంకరులకు పూర్వమున్న వేదాంతాన్ని గురించి మీరేమి సేకరించారు?'' అని స్వామివారడిగారు.

''చైనీస్‌ భాషలోనూ, టిబెటన్‌ భాషలోనూ ప్రాచీన వేదాంతానికి సంబంధించిన వ్రాతప్రతుల భాగాలు కొన్ని దొరికాయి. దొరికినవన్నీ సేకరించి కాలక్రమంలో అమర్చితే నాలుగు గ్రంథాలయ్యాయి. అవి శంకరాత్పూర్వ వేదాంత సమగ్ర చరిత్రను చెప్పగలవని నా విశ్వాసం.'' ఆని నకముర చెప్పారు.

''జెపాన్‌లో సంస్కృతాన్ని ఆధ్యయనం చేస్తున్నవారు చాలామంది వున్నారు. ప్రత్యేకించి శంకరతత్వాన్ని అధ్యయనం చేస్తున్నవారుకూడా చాలామందే వున్నారు. బ్రహ్మసూత్రాలకు శంకరులవారు రచించిన భాష్యాన్ని పూర్తిగా అనువదించాను. అయితే ఇలాటి గ్రంధాలను ప్రచురించటం చాలాకష్టం. నాలాటి విదేశీయునికి ఖండనఖాద్యంలాటి అనంతర గ్రంధాలు అర్ధం చేసుకోవటమంటే మాటలుకాదు'' అనికూడా అన్నారు.

''నే నొకటిరెండు ప్రశ్నలు తమరిని అడగవచ్చునాండి?'' అని జపనీస్‌ ప్రోఫెసరు స్వామివారినడిగారు. సరే అనిపించుకుని ''ఉపాసనకు కచ్చితమైన అర్ధం ఏమిటో తెలుసుకోవాలని యెంతకాలంగానో ఆరాటం. ఈ పదం శంకర భగవత్పాదులవారి గ్రంథాల్లో చాలాచోట్ల కనబడుతుంది. ఉపాసన అంటే ఏదైనా ప్రత్యేకమైన సాధనా? అలాటి సాధన ప్రస్తుతం మీ మఠంలో జరుగుతోందా?'' అని ప్రశ్నించారు.

''ధ్యానమేవ ఉపాసనా. ఉపాసనమంటే మనస్సును ఏకాగ్రం చేయటమే. తపమ్‌, మనస్సును కేంద్రీకరించాలంటే ఒకమూర్తి అవసరం. ఉదాహరణకు నీ మనస్సును రెండుచేతుల దేవుడిమీదైనా, ఎనిమిదిచేతుల దేవునిమీదైనా కేంద్రీకరించవచ్చు. సత్యం ఒక్కటే. దానికి మార్పుండదు. భగవంతుడు పరమసత్యం కాబట్టి అవ్యయుడు. అంటే ఏమార్పూ లేనివాడు. కాని ఉపాసన అనేది ఒక ప్రయోజనం కోసం, ఒక లాభంకోసం జరిగేది. రెండుచేతుల దేవుడిమీద మనస్సు లగ్నంచేయటం వల్ల కలిగే ప్రయోజనం వేరు, ఎనిమిదిచేతుల దేవుడిమీద మనస్సు లగ్నం చేయటంవల్ల కలిగే ప్రయోజనంవేరు. ఏదేవుణ్ణి ఎలా ఉపాసిస్తే ఎలాటి ఫలితం కలుగుతుందో శాస్త్రాలుచెప్పాయి. ఉపాసన చెయ్యాలంటే శాస్త్రలననుసరించకతప్పదు. సత్యాన్ని గ్రహించటానికి- అంటే చరమ గమ్యం చేరుకోటానికి- రకరకాల ఉపాసనలన్నీ సోపానాలు, సాధనాలూ మనస్సును ఒక శిక్షణలోపెట్టి ఏకాగ్రం చెయ్యటంకోసం శాస్త్రాలు ఈ ఉపాసనామార్గాన్ని నిర్దేశించాయి'' అని స్వామివారు వివరించారు.

మఠంవారు ఉపాసనలేవైనా చేస్తున్నారోలేదో, ఒకవేళ చేస్తుంటే అవి ఏయే ఉపాసనలో తెలుసుకోవాలనుందని నకముర అన్నారు.

''శాస్త్రాలు అనేకవిధాలైన ఉపాసనలను గురించి చెప్పాయి. వాటినన్నింటినీ ఆచరించాలిసిన అవసరం లేదు. అన్నింటినీ ఆచరించటం సాధ్యం కాదుకూడా. సాధారణంగా ఒకటిరెండు ఉపాసనాపద్ధతులుమాత్రం అందరూ అనుసరిస్తారు. పూజాకలాపం నిర్దిష్టకాలంలోనే జరగాలి ఉపాసన కేవలం వైయక్తికం సామూహికం కానేకాదు. ఉపాసనాపద్ధతి అనేది కుటుంబసంప్రదాయంమీదో, వ్యక్తి అభిరుచిమీదో, గురువుచేసిన ఉపదేశంమీదో ఆధారపడి వుంటుంది'' అన్నారు స్వామివారు.

''అద్వైత వేదాంతాన్ని అర్ధం చేసుకోవాలంటే పాశ్చాత్యులైన జిజ్ఞాసువులేంచేయాలో సెలవివ్వండి'' అని నకమురఅడిగారు.

స్వామి: వివేకచూడామణి చదవవచ్చు.

వివేకచూడామణి సులభంగా బోధపడుతుందనీ, అది తన్ను చాలా కదిలించిందనీ నకముర అన్నారు.

వివేకచూడామణి అద్వైతానికి మంచి ప్రవేశిక. 'అపరోక్షానుభూతి' చదవటం తరువాతి మెట్టు. ఈ రెండూ అధ్యయనంచేస్తే అద్వైత వేదాంతాన్ని గురించి ఒక స్పష్టమైన అవగాహన ఏర్పడుతుంది.

మాధవాచార్య విధ్యారణ్యులవారి గ్రంధాలు పంచదశితోసహా తాను అధ్యయం చేశానని నకముర చెప్పారు.

ప్రోఫెసర్లను కలుసుకొని మాట్లాడినందుకు తనకు సంతోషంగా వుందనీ, జెపనీస్‌ పండితులను మరికొందరిని కలుసుకోవాలని కుతుహలంగా వుందనీ నకమురకు చెప్పండని స్వామివారు డాక్టర్‌ మహదేవన్‌ని కోరారు.

జగద్గురువులను కలిసి సంభాషించే భాగ్యం కలిగినందుకు మహానందంగా వుందని నకముర అన్నారు.

అద్వైతవేదాంతం అధ్యయం చెయ్యటానికి భారతదేశంలో దొరుకుతున్న పుస్తకాలమీదికి చర్చ మళ్ళింది.

'సురేశ్వరాచార్యులవారి వార్తికం మరీ విస్తృతంగా వుంది' అన్నారు నకముర. ''బృహదారణ్యకోపనిషత్తునూ దాని శాంకరభాష్యాన్నీ చదువుతూ అప్పుడప్పుడూ సందేహనివృత్తికోసమో. అర్థ వివరణకోసమో వార్తికం చూడటం అలవాటు. ఇంచుమించు రెండుశతాబ్ధాలక్రితం ధర్మరాజుల వారు వేదాంత పరిభాష వ్రాసేవరకూ సదానందులవారి 'వేదాంతసారమే' అద్వైత వేదాంతం చదవటానికి ఆధార గ్రంధంగా ఉపయోగపడేది. 'వేదాంత పరిభాష' వచ్చాక-వేదాంతసారాన్ని అధ్యయనం చేయటం మానేశారు. వివరణం అవసరమయినప్పుడు మాత్రమే దాన్ని చూస్తారు'' అన్నారు స్వామివారు.

అనంతరం శంకర భగవత్పాదులవారి స్తోత్ర గ్రంధాలను గురించి నకముర ప్రస్తావించారు . కొన్ని స్తోత్రాలు తాను చదివానని కూడా అన్నారు. స్వామివారు భజగోవింద చదివారా అని అడిగినప్పుడు వారు లేదన్నారు.

''శంకర భగవత్పాదుల స్తోత్రగ్రంధాల్లో భజగోవిందానికి ప్రచారమెక్కువ. శైవులూ, వైష్ణవులూ అందరూ దాన్ని చదువుతారు. ఇక్కడ భారతదేశంలో శంకరభగవత్పాదుల పేరువినగానే గుర్తుకు వచ్చేది భజగోవిందమే. ఆ రచనలో నీతి సూత్రాలూ, మతధర్మాలూ పెనవేసుకు పోయాయి'' అన్నారు స్వామివారు.

నకముర: బ్రహ్మసూత్రాలకూ, భగవద్గీతకూ శంకరులవారు రచించిన భాష్యం చదివాను. ఎక్కడా వారు శివునిపేరెత్తలేదు. అంతా విష్ణుమయం చేశారు. కాని శంకరులవారి అనుయాయులందరు శైవులే. అదే నాకర్థం కాదు.

స్వామి: శంకరులవారి అనుయాయులందరూ శైవులని మీకెలాతెలుసు?

నకముర: వారందరూ శివుణ్ణ ఆరాధిస్తారుగనక. భస్మధారణ చేస్తారుగనక. స్వామి! మంచిప్రశ్న, దీనికి తృప్తికరమైన సమాధానం చెప్పాలంటే చరిత్రలోకి వెళ్ళాలి. తప్పదు శంకర భగవత్పాదులవారి అవతరణకు ముందు భారతదేశంలో రెండేరెండు మతాలుండేవి. ఒకటి సనాతన ధర్మం. దాన్నే స్మార్తమంటారు. రెండోది బౌద్ధం, ఈ రెండు మతాలు ఒక్క భారతదేశంలోనే కాదు, బృహద్భారతం అంతటా. అంటే ఈశాన్య ఆసియాలోని నయాం, కాంబోడియా మొదలైన దేశాలన్నిటా వుండేవి. బౌద్ధం పుట్టక పూర్వం ఒక్క సనాతనధర్మమే వుండేది. జెపాన్‌లో దొరికిన ఇంద్రుడు, గణపతి, సరస్వతి విగ్రహాలుచూస్తే అక్కడకూడా బౌద్ధం రావటానికి ముందు సనాతన ధర్మమే వుండేదని ఊహించటానికి అవకాశంవుంది.

స్వామివారి మాటలకు అడ్డుతగిలి నకముర బౌద్ధం రావటానికిముందు జెపాన్‌లో షింటోయిజం వుండేదనీ అది 'బ్రాహ్మణమత'మనీ చెప్పారు.

స్వామి: భారతదేశంలో బౌద్ధమత స్థాపన జరిగాక అది బృహద్భారతానికీ వ్యాపించింది బృహద్భారతానికి అంటే చైనా, జెపాన్‌ దేశాలకుకూడా అని అర్థం. అప్పుడు కుమారిలభట్టు బౌద్ధమతానికి విరుద్ధంగా వేద ప్రామాణ్యాన్ని స్థాపిస్తూ వార్తికం రచించారు. నిరీశ్వరవాదాన్ని ప్రోత్సహించే బౌద్ధధర్మాన్ని పూర్వపక్షంచేస్తూ, భగవంతుని సత్యనిత్యత్వాలను నిరూపిస్తూ ఉదయనాచార్యులవారనే నైయాయికులు న్యాయకుసుమాంజలి వ్రాశారు.

అనంతరం శంకర భగవత్పాదులవారు వేద ప్రామాణ్యాన్ని ఈశ్వరపరిజ్ఞానాన్నీ క్రోడీకరిస్తూ ''సర్వం బ్రహ్మ- అన్నీ భగవంతునిలోనే వున్నాయి, అన్నింటిలోనూ భగవంతుడున్నాడు'' అనే ఆద్వైత వేదాంత తత్వాన్ని ప్రతిపాదించారు. జీవాత్మ పరమాత్మల అబేధాన్ని స్థాపించారు.

అప్పటినుండి బౌద్ధమతం భారతదేశంలో క్షీణించటం మొదలు పెట్టింది. శంకరభగవత్పాదులే బౌద్ధమతాన్ని ఖండించి, దానికి భారతదేశంలో నామరూపాల్లేకుండా చేశారని అంటారు. కాని శంకరబాష్యాల్లో దేన్ని పరిశీలించినా బౌద్ధ ఖండనం చాలాతక్కువగా కనబడుతుంది. వారి ఖండనమంతా మీమాంసమీద; సాంఖ్యంమీద. వారికన్నా ఎక్కువగా తమ బుద్ధివిశేషంతో ఖండించటమే ఒక ఉద్యమంగా పెట్టుకున్నవారు, కుమారిలభట్టాచార్యులవారూ, ఉదయనాచార్యులవారూను. వారివల్లనే జ్ఞానప్రధానమైన అద్వైతం బాగా వ్యాప్తిపొందింది.

ఉపాసనకు సంబంధించినంతవరకూ కుటుంబ సంప్రదాయాన్నిబట్టి శివుణ్ణో, విష్ణువునో, శక్తినో ఆరాధిస్తారు. తన అనుయాయులకు శంకర భగవత్పాదులవారు వంశపారంపర్యంగా వచ్చే వైదిక ఆరాధనా విధానాన్నే అనుసరించండని చెప్పారు. వారి అద్వైత వేదాంతం ప్రకారం ఒకే ఒక పరమాత్మ వున్నాడు. శివుడూ, విష్ణువూ, శక్తీ వేరుకాదు. అందరూ ఆ పరమాత్మే.

కొందరు వైష్ణవులు శివుని గుడిలో అడుగుపెట్టరు. వారి వీరవైష్ణవులంటారు. చిత్రం, వారు శివద్వేషులైనా అద్వైత వేదాంతులే. వారు విభూతి ముట్టరు. నుదుటిమీద, శరీరంమీద నామాలు ధరిస్తారు. నామాలు వారి విష్ణుభక్తికి చిహ్నాలు. అలాగే అద్వైత వేదాంతులు కొందరు శరీరమంతా భస్మధారణ చేస్తారు. శివుణ్ణ కొలుస్తారు. ఈవిధంగా శంకరా ద్వైతవేదాంతుల్లోనే వైష్ణవులూవున్నారు, శైవులూవున్నారు. ఇప్పుడు వైష్ణవుల సంఖ్య బాగాతగ్గిపోయింది. అద్వైతులందరూ శైవులే అనే అభిప్రాయం కలగటానికి కారణంఇదే. శంకరభగవత్పాదులవారి తరువాత వచ్చినరామానుజాచార్యులవారూ, మధ్వాచార్యులవారూ, వల్లభాచార్యులవారూ, చైతన్యస్వామివారూ ఒకప్పుడు అద్వైతులే. ఆతరువాత ఏదోఒక వైష్ణవశాఖను అవలంబించినవారే. అందువల్ల శంకరుల అద్వైతవేదాంతాన్ని అనుసరించినవారందరూ యాదృచ్ఛికంగా శైవులేకావటం తటస్థించింది. ఇప్పటికీ వైష్ణవాద్వైతులు లేకపోలేదు. వారు నాదగ్గరకు వస్తారు. నన్ను అభిమానిస్తారు. కాని శివాలయంలోమాత్రం అడుగుపెట్టరు. అద్వైత వేదాంతాన్ని అనుసరించని కేవల వైష్ణవులకన్నా వారే ఎక్కువగా శైవద్వేషులు. దీనికి పర్యవసానంగా అద్వైతుల్లో పెక్కుమంది నేడు శివారాధకులయ్యారు.

ఇప్పుడు మామఠం సంగతేచూడండి. మఠంనుంచి ఏ శ్రీముఖంవెళ్లినా దానిచివర ''నారాయణ స్మృతిః'' అని వుంటుంది. అంటే ఇక్కడ ఎల్లప్పుడూ నారాయణస్మృతి జరుగుతున్నదన్నమాట. ఐనప్పటికీ నేను శివుణ్ణ నిత్యమూ అర్చిస్తున్నాను. భస్మధారణ చేస్తున్నాను. కాని ఎవరైనా వచ్చి నాకు నమస్కారంచేస్తే ''నారాయణ నారయణ'' అంటాను.

నకముర బోధాయనుణ్ణి పేర్కొనటంమూలాన స్వామివారు బోధాయనుని రచనలేవైనా మీరు చూచారా అని అడిగారు.

ఉపవర్షునివి అని చెప్పదగిన వార్తికాలూ కొన్ని తనదగ్గరున్నాయనీ, ఉపవర్షుడూ, బోధాయనుడూ ఒకరే అనే అభిప్రాయం ఒకటున్నదనీ నకముర అన్నారు.

తాను ఆత్రేయ బ్రహ్మానందులవారి రచనలూ, ద్రవిడాచార్యులవారి రచనలూ కొన్నిచూచానని, వైష్ణవగ్రంధాలలో ద్రమిడాచార్యులవారుగా పేర్కొనబడినవారు అద్వైతగ్రంధాలలో ద్రవిడాచార్యులవారుగా పేర్కొనబడ్డారనీ, ఈ బేధానికి కారణమేమిటనీ స్వామివారినడిగారు. ''మాదేశంలో 'ద్రవిడ, ద్రమిడ' అనేవి పర్యాయపదాలు. ఉత్తర భారతీయులు 'వ' కారం బదులు 'మ' కారం వాడ తారు అంతే'' అని స్వామివారన్నారు.

భారతదేశంలో మతసహనం ఇంతగా ప్రబలటానికి అద్వైత భావనమే కారణమని భావించవచ్చునా? అని ప్రోఫెసర్‌ నకముర అడిగిన ప్రశ్నకు స్వామివారు 'ఔ' నన్నారు. భారతదేశంలోని పండితులందరూ అద్వైత వేదాంతులే అనే నకముర అభిప్రాయంతోకూడా స్వామివా రేకీభవించారు.

''మీదేశంలో సంస్కృతాధ్యయనం ఎలా ఎప్పుడు ఎందుకు ఆరంభ##మైందో చెప్పం''డని స్వామివారడిగిన ప్రశ్నకు సమాధానంచెబుతూ నకముర ''బౌద్ధమతం జెపాన్‌కు వచ్చాకగాని సంస్కృతాధ్యయనానికున్న అవసరం బౌద్ధులైన జెపనీయులకు తెలియలేదు. ఆ అవసరం మూలాన సంస్కృతం జెపాన్‌ అడుగుపెట్టింది. ఇటీవలికాలంలో అంటే 70, 80 ఏళ్ళక్రితం ఆక్స్‌ఫర్డు విశ్వవిద్యాలయానికి వెళ్ళిన కొందరు విద్యార్థులు 'మేక్సుముల్లర్‌'వంటి ప్రాచ్య విషయవిద్వాంసులదగ్గర ఉత్సాహంతో సంస్కృతం నేర్చుకోవటం మొదలుపెట్టారు. చదువులు పూర్తిచేసుకుని తిరిగి జెపాన్‌ దేశానికివచ్చి అక్కడ సంస్కృత భాషావ్యాప్తికి ఎంతో దోహదం చేశారు. మరికొందరు జర్మనీలో సంస్కృతభాస్యం చేసినవారు మాలో వున్నారు. బౌద్ధమతంపేరిట జెపాన్‌లో నెలకొన్న విశ్వవిద్యాలయాల్లో చదివిన ప్రతివిద్యార్థికీ సంస్కృతభాషకు సంబంధించిన ప్రాథమిక పరిజ్ఞానం వుంటుంది.

స్వామివారు: సులభ##శైలిలో రచింపబడిన రామాయణంలాంటి కావ్యాన్ని మీదేశంలో ఎందరు చదివి అర్థంచేసుకోగలరు?

నకముర: ఇంచుమించు రెండువందలమంది! వారెక్కువగా టోక్యోలోనో, క్యోటోలోనో కనబడతారు.

మరొక ప్రశ్నకు సమాధానం చెబుతూ నకముర ''మాదేశంలో సుమారు రెండువందల విశ్వవిద్యాయాలున్నాయి. మేము ప్రతి కళాశాలనూ విశ్వవిద్యాలయమనే అంటాము. మాదేశంలోని ప్రతి కళాశాలకూ స్వయంప్రతిపత్తిగల విశ్వవిద్యాలయపు స్థాయివుంది. పాఠ్య ప్రణాళికను అదే నిర్ణయిస్తుంది. పరీక్షలను అదే నిర్వహిస్తుంది. డిగ్రీలనదే యిస్తుంది'' అని చెప్పారు.

స్వామివారు: జెపనీస్‌ భాషలోని వర్ణసమామ్నాయం సంస్కృత పద్ధతిని అనుసరించి వుంటుందా, చైనీస్‌ పద్ధతిని అనుసరించి వుంటుందా?

నకముర: మేము సంస్కృత పద్ధతినే అనుసరించాము. అచ్చుల ముందూ, హల్లులు తరువాతావుంటాయి. ప్రతిఅక్షరంలోనూ ఒక హల్లూ, ఒక అచ్చూ వుంటుంది. మీరు తమిళంలో సంస్కృత పదాలు వాడుతున్నట్లే మేమూ చైనీస్‌ అక్షరాల్ని చాలావాడుకుంటాము.

''వర్ణసమామ్నాయాలూ వాటి అనుబంధ విషయాలూ గమనిస్తే ఇండియా, జెపాన్‌, సయాం, కాంబోడియా లాంటి దేశాల్లో పూర్వం ఒకే మతం వుండేదనే అభిప్రాయానికి రావచ్చు''నని స్వామివారన్నారు.

స్వామివారు: వర్ణక్రమం విషయంలో మీరు చైనీస్‌భాషను విడిచి సంస్కృత భాషనే అనుసరించటానికి కారణమేమైనావుందా?

నకముర: చైనీయుల వర్ణసమామ్నాయంలోని అక్షరాలకు మేమెంతో ప్రాముఖ్యాన్నిచ్చాము. అయినా సంస్కృత వర్ణక్రమం మాకెంతో అనుకూలమనిపించింది. సంస్కృత భాషాజ్ఞానం బౌద్ధపరివ్రాజకులకూ మరి కొందరు మేధావులకూ మాత్రమే పరిమితమైవున్నప్పటికి సంస్కృత వర్ణక్రమాన్ని జెపనీయులందరూ ఆమోదించారు. కాని ఈనాటి వర్ణక్రమ పరిణామం మాత్రం కేవలం జెపనీయులసృష్టే.

స్వామివారు: జెపాన్‌ విశ్వవిద్యాలయాల్లో భారతీయ వేదాంత పీఠాలు ఎన్నుంటాయి?

నకముర: జాతీయ విశ్వవిద్యాలయాల్లో పదీ, బౌద్ధ విశ్వవిద్యాలయాల్లో మరొక పదీ వుంటాయి.

స్వామివారు: బౌద్థమత పీఠాలెన్ని వుంటాయి?

నకముర: అంతకన్నా ఎక్కువే.

స్వామివారు: బౌద్ధధర్మాలు బోధించటానికి మీరు ఏ భాష ఉపయోగిస్తారు?

నకముర: బౌద్ధసిద్ధాంతానికి సంబంధించిన కొన్ని గ్రంథాలు సంస్కృత భాషలో వుండటంమూలాన సంస్కృతభాషాధ్యయనం తప్పనిసరి. కాని బోధనమాత్రం జెపనీస్‌ భాషలో జరుగుతుంది.

స్వామివారు: జెపాన్‌లో ఎక్కడైనా శివలింగం ఉందా?

నకముర: లేదు. శివలింగమూలేదు, విష్ణు విగ్రహమూలేదు. గణపతి, సరస్వతి, ఇంద్రుడు, బ్రహ్మల విగ్రహాలు కనబడ్డాయి. చివరికి వరుణుని విగ్రహంకూడా వుంది. ఒకచోట ఒక మకర విగ్రహం కనబడింది. అది గంగానదికి వాహనంగదా! మేము గణపతిని అర్యదేవుడంటాము. ఇంద్రుణ్ణి శక్రదేవుడంటాము. సరస్వతిని వాగ్దేవత అంటాము. వరుణుణ్ణి జలదేవత అని పిలుస్తాము.

జ్ఞానాన్ని గురించీ, ఉపాసన గురించీ తిరిగి ప్రస్తావిస్తూ జగద్గురువులు ఆ రెండూ పూర్తిగా విభిన్నాలని చెప్పారు. ఉపాసన అనేది మానసికమైన కార్యం. జ్ఞానమనేది కూడా మానసికమే అయినా అందులో కార్యం లేదు. ఏదో ఒక విధికి కట్టుబడి కార్యంచేస్తాము. పరమసత్యాన్ని గురించిన జ్ఞానం కలిగాక మనస్సు ఆ పరమసత్యంలోనే మగ్నమై వుంటుంది గాని ఎలాంటి విధికీ స్పందించదు. ఆ విధి శాస్త్రవిధికావచ్చు. లేక ఇంద్రియ ఫ్రేరితమైన విధీకావచ్చు.

కార్యమంటే నే ననుకునే భావానికి ఒక ఉదాహరణ మిస్తాను. ఇక్కడొక పండ్ల గుత్తి వుందనుకొండి, అందులో పండ్లు పసుపుపచ్చగా వున్నాయనుకోండి అవి పసుపుపచ్చగా వున్నాయని నేనంటే మీరూరికే అంగీకరిస్తారుగాని ప్రతిస్పందించరు. ఎందుకంటే అవినిజంగా పచ్చగానేవున్నాయి గనక. నేనొకవేళ అవి ఎర్రగానో, నల్లగానో ఉన్నాయంటాననుకోండి మీరు వెంటనే ప్రతిస్పందించి ''కాదు, ఇవి పసుపుపచ్చ'' అంటారు. ఒకవేళ నేను ''ఈపళ్లన్నీ ఎర్రగావున్నాయని వూహించుకోండి'' అన్నాననుకోండి. అప్పుడు మీరలాగే వూహించుకుంటారుగాని కాదనరు. అందువల్ల కార్యం అనేది ఏదోఒకదానికి సంబంధించిన ప్రతిస్పందన.

ఉపాసన ఈతీరుకుచెందిన మానసికమైన కార్యం. అందువల్ల భగవంతుడు ఏ ఆకారం కలవాడో తెలియక ఏదోఒక మూర్తిని ఊహించుకుని ఆ మూర్తిమీదనే మనస్సు లగ్నంచేసి చివరికి జ్ఞానోదయమై భగవంతుని సత్యస్వరూపమేదో గుర్తిస్తాడు. దాన్నే దర్శిస్తాడు. ఇక శాస్త్రం విధించిన ఉపాసనా పద్ధతులేవీ అతడికి అక్కరలేదు.

స్వామివారు అప్పుడు ప్రోఫెసర్‌ మియమొటోను పరామర్శించారు. మియమొటోకు భారతీయ నాగరకతాధ్యయనంమీద ఎంతో ఆసక్తి వుంది. రోమోరోలండ్‌ అనే ఫ్రెంచి రచయిత శ్రీ రామకృష్ణ పరమహంసమీదనూ, స్వామి వివేకానందులమీదనూ, మహాత్మాగాంధీమీదనూ రచించిన గ్రంధాలను జెపనీస్‌భాషలోకి తర్జుమాచేశారు. రవీంద్రుని కృతులుకూడా అనువదించారు. ''జెపనీయుల్లో ఈతరం యువకుల్లో భారతీయ నాగరికతను అవగాహన చేసుకోవటం మీద ఎంతో ఆసక్తి అన్నారు.

స్వామివారు: ఇండియాలో మీరెంతకాలం వుంటారు?

నకముర: రేపు కలకత్తాకు బయలుదేరుతున్నాము, అక్కడి నుండి నేరుగా జెపాన్‌ వెళతాము, మరికొంతకాలం భారతదేశంలో గడపలేక పోతున్నందుకు విచారంగా వుంది. మీదర్శనం చేసుకోవటంవల్ల, మీతో ఇంతసేపు సంభాషించటంవల్ల మేమెంతో విషయపరిజ్ఞానం సంపాదించుకోగలిగాము. మేము స్వామివారికెంతో బుణపడివున్నాము. త్వరలోనే మరొకసారి స్వామివారిని దర్శించుకునే భాగ్యం కలుగుతుందని ఆశిస్తున్నాము.

స్వామివారు: మిమ్ము మళ్ళీ కలుసుకోవటం మాకూ ప్రియమే.

అంతటితో సంభాషణ ముగిసింది. అంతా 90 నిమిషాలు పట్టింది. ఇద్దరు ప్రోఫెసర్లూ స్వామివారికి ప్రణమిల్లి, వారు స్వహస్తాలతో అందించిన ప్రసాదం పుచ్చుకుని వెళ్ళిపోయారు.

Kathakanchiki    Chapters    Last Page